Showing posts with label యెహోవా. Show all posts
Showing posts with label యెహోవా. Show all posts

మధ్యవర్తి – ఆరాధ్యుడా!?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


1️⃣. మధ్యవర్తి యొక్క నిర్వచనం

మధ్యవర్తి (Mediator) అనగా దేవునికి మరియు మనుష్యులకు మధ్య నిలిచి, దేవుని చిత్తాన్ని మనుష్యులకు తెలియజేసి, మనుష్యుల పరిస్థితిని దేవుని ఎదుట ప్రాతినిధ్యం వహిస్తూ, నిబంధనను స్థాపించుటకు లేదా అమలు చేయుటకు దేవుడు నియమించిన వ్యక్తి/సేవకుడు.


(ద్వితీయోపదేశకాండము 5:5): "గనుక యెహోవామాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను."


(1 తిమోతి 2:5): "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹"


(గలతీ 3:19): "ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు?..... అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.౹"


(హెబ్రీయులకు 8:6): "ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు.౹"


👉 మధ్యవర్తి పాత్ర = సేవ & దేవునికి ప్రతినిధిత్వం ✔️

👉 మధ్యవర్తి పాత్ర ≠ ఆరాధన స్వీకరణ ❌

👉 రెండు పక్షాల మధ్య నిలిచేవాడు ✔️


2️⃣. “పాత నిబంధనలో మధ్యవర్తి – మోషే”

పాత నిబంధనలో మధ్యవర్తి పాత్రను స్పష్టంగా, సమగ్రంగా ప్రతిబింబించిన వ్యక్తి మోషే. ఈయన దేవునికి ↔ ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నిలిచి, దేవుని వాక్యాన్ని(ధర్మశాస్త్రమును) ప్రజలకు తెలియజేసి, ప్రజల తరపున దేవుని ఎదుట నిలిచిన దేవుని సేవకుడు.


A. దేవునికి మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య నిలిచినవాడు — (ద్వితీయోపదేశకాండము 5:5)

B. ప్రజల భయము వల్ల ఏర్పడిన మధ్యవర్తిత్వం — (నిర్గమకాండము 20:18–19; ద్వితీయోపదేశకాండము 18:16)

C. నిబంధనను తెలియజేసినవాడు — (నిర్గమకాండము 19:3–8; 24:7-8)

D. ఉగ్రత సమయములో ప్రజల తరపున దేవుని ఎదుట నిలిచినవాడు — (నిర్గమకాండము 32:11–14; కీర్తనలు 106:23)

E. ఆరాధన కోరనివాడు – ఆరాధనను కాపాడినవాడు — (నిర్గమకాండము 20:3–5; 32:19-20; ద్వితీయోపదేశకాండము 6:13)

F. దేవుని సేవకుడు — (మలాకీ. 4:4)


మోషే = మధ్యవర్తి✔️

మోషే ≠ ఇశ్రాయేలు ప్రజల ఆరాధ్యుడు❌

ఆరాధన = యెహోవాకే(𝗬𝗛𝗪𝗛)✔️


3️⃣. “కొత్త నిబంధనలో మధ్యవర్తి – యేసుక్రీస్తు”

కొత్త నిబంధనలో మధ్యవర్తి అనే పాత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్పష్టంగా నిర్వహించబడింది. ఆయన దేవుడికి మరియు సమస్త మనుష్యులకు మధ్యగా నిలిచినవాడు, తన రక్తముతో నిబంధనను స్థాపించి మనుష్యులను దేవుని యొద్దకు  చేర్చుటకు నియమించబడిన దేవుని సేవకుడు.


A. దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి(YHWH) మరియు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తుయేసను నరుడు. (1 కోరింది. 8:6a; 1 తిమోతి. 2:5). ఈయన దేవునికి మరియు క్రైస్తవులకు మధ్య నిలిచినవాడు. 

B. క్రీస్తునందు ఉన్నవారితో అనగా క్రైస్తవులతో నిబంధన చేసింది దేవుడు, ఆ నిబంధనను స్థాపించి అమలు చేసినది యేసుక్రీస్తు. (హెబ్రీయులకు. 8:6-13; 9:14-16)

C. తన్ను దేవునిచే పంపబడినవాడిగా, దేవుని చిత్తానికి లోబడినవాడిగా ప్రకటించుకున్నాడు, దేవుని గౌరవ ప్రథముగా  సూచించాడు, ఆయనను తండ్రి అని, (YHWH) “నా దేవుడు” అని పిలిచాడు. (యోహాను. 17:3; 5:44,30; 7:8; 12:49; లూకా 22:42; యోహాను 20:17; మత్తయి 27:46)

D. యేసు తాను చేసిన బోధ తనది కాదని చెప్పిన సందర్భాలు. (యోహాను 7:16; 8:28)

E. యేసు ఆరాధన కోరలేదు – దేవునికే ఆరాధన అని బోధించాడు (మత్తయి. 4:10; యోహాను. 4:23-24)

F. యేసు కోరింది – సేవ (Serve), ఆరాధన కాదు. (యోహాను 12:26)

G. యేసు(మధ్యవర్తి) ద్వారానే దేవునికి కృతజ్ఞతలు, ప్రార్థన, ఆరాధన, ఆత్మ సంబంధమైన బలులు మరియు తండ్రి యొద్దకు ప్రవేశం. (రోమీయులకు 1:8; 5:1-3; ఎఫెసీయులకు 2:18; 3:14;  కొలస్సయులకు 1:3; 3:17; 1 పేతురు 2:3; హెబ్రీ. 13:15; 1పేతురు 3:18)

F. యేసు తన రక్తముతో నూతన(క్రొత్త) నిబంధనను స్థాపించాడు. (లూకా 22:20, మత్తయి 26:28; హెబ్రీ. 9:15; 8:9-10)

G. యేసు తన త్యాగముచేత న్యాయాన్ని సంతృప్తి పరచి కృపను కలిగించాడు. (రోమా 8:34; హెబ్రీ. 7:25; 1యోహాను 2:1)

H. దేవుని సేవకుడు (మత్తయి. 12:18;అపొ. కార్యములు 3:13, 26) యేసు విధేయతలో పరిపూర్ణుడైన దేవుని సేవకుడు. 

I. యేసు దేవుని యొక్క అపోస్తులుడు. 


యేసుక్రీస్తు = మధ్యవర్తి✔️

యేసుక్రీస్తు ≠ క్రైస్తవుల ఆరాధ్యుడు❌

ఆరాధన = తండ్రియైన దేవునికే(𝗬𝗛𝗪𝗛)✔️


4️⃣. ముగింపు

నేను మధ్యవర్తి పాత్రను అర్థం చేసుకున్నానా?

నిబంధనలో ప్రవేశించానా?

ఆరాధన నిబంధన ప్రకారముగా దేవునికే చేస్తున్నానా?

మధ్యవర్తిని ఆరాధించాలా? — కాదు.

మధ్యవర్తి పాత్ర గౌరవమైనది. మధ్యవర్తి ద్వారా నిబంధన, నిబంధన దేవునికే ఆరాధన. మధ్యవర్తి పాత్రను ఆరాధనగా మార్చడం అపోస్తలుల బోధకు వ్యతిరేకమైనది.


➡️ ఆరాధ్యుడు = తండ్రి(YHWH)

➡️ మధ్యవర్తి = క్రీస్తు

మీ ఆత్మీయులు 👪

క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు?

క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు? ❌


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


1️⃣. పరిచయం

నేటి క్రైస్తవ లోకంలో అత్యంత గందరగోళానికి గురైన అంశం ఏదైనా ఉందంటే అది “ఆరాధన ఎవరికి చేయాలి?” అన్న ప్రశ్నే. చాలామంది ఇలా అంటున్నారు : కొందరు యేసుకి ఆరాధన చేయాలని, ఇంకొందరు తండ్రియైన దేవునికి(YHWH) మాత్రమే ఆరాధన చేయాలని,   మరికొందరు తండ్రి మరియు యేసు ఇద్దరు ఆరాధనకు పాత్రులే అని బోధిస్తున్నారు. ఈ రకమైన బోధలన్నీ మనలో చాలా మంది వినియున్నాం. అయితే ఇప్పుడు వేరొక బోధ తీసుకొచ్చారు. వారు చేస్తున్న బోధ వినడానికి బహు  విచిత్రముగా ఉంది. వీరు తండ్రికి + యేసుకు + పరిశుద్ధాత్మునికి అనగా ముగ్గురికి ఆరాధన చేయాలని, క్రైస్తవుల ఆరాధనకు ముగ్గురు పాత్రులే అని బోధిస్తున్నారు. 


నేడు క్రీస్తు సంఘాలు మతశాఖలుకు ధీటుగా నిలబడి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేయాలి. మరి ముఖ్యముగా  త్రియేక దేవుడు లేక ముగ్గురు సమానులే ఇలాంటి తప్పుడు  బోధలు కలిగిన మతశాఖలకు బుద్ధి చెప్పాల్సింది పోయి… కొన్ని క్రీస్తు సంఘాలు ముగ్గురిని ఆరాధించవచ్చు అని మాట్లాడుతున్నారు. ముగ్గురు వ్యక్తులు క్రైస్తవుల ఆరాధనకు పాత్రులు  అనేడి బోధలు, డిబేట్స్ రూపములో నేనంటే నేను,  నీవంటే నీవు అన్నట్టుగా ప్రస్తుతం ఇవి లోకములో తిరుగుతూ, విశ్వాసులను చెదరగొడుతూ, కలుపుకుంటూ ఉన్నారు.


పరిశుద్ధ గ్రంథము మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కనుక మనుష్యుడు సొంత నిర్ణయాలు తీసుకుంటే అవి దేవుని దృష్టిలో చెల్లుబాటు అవ్వవని మొదట గ్రహించుకోవాలి. సత్య బోధ అని చెప్పుకునే క్రీస్తు సంఘాలు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే మతశాఖలు వారికి నచ్చినట్టుగా కలిపి చెరువులు చేయడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రియ సోదరా మనము తీసుకునే ప్రతి నిర్ణయము పరిశుద్ధ లేఖనాల ఆధారముగానే ఉండాలనేది ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది. 


నిజానికి క్రైస్తవ విశ్వాసం

➡️ భావాలపై కాదు ❌

➡️ సంప్రదాయాలపై కాదు ❌

➡️ మనుషులు ఊహలు/బోధలపై కాదు ❌

➡️ రకరకాల సంఘాలు, వాటి సిద్ధాంతాలపై కాదు

➡️ మెజారిటీ విశ్వాసం/మెజారిటీ సభ్యత్యంపై అస్సలు కాదు ❌

➡️ కేవలం దేవుని బోధ/ క్రీస్తు బోధ/ఆదిమ అపోస్తలుల బోధ పైనే మాత్రమే ఆధారపడుతుంది. 🔎📖✔️

➡️ క్రైస్తవులకు క్రొత్త నిబంధనే ప్రామాణికం 📖✔️


గతములో “ఆరాధ్య దైవం ఒక్కడే - ఆయనే తండ్రిక్లిక్ చేయు అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. నేడైతే “క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు?” అనే ఈ ప్రశ్నకు సమాధానం చివరిగా పరిశుద్ధ గ్రంథము మాట్లాడిన మేర ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.


2️⃣. మనకు దేవుడు ఒక్కడే – ఆయనే తండ్రి

"ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹" (1కోరింది. 8:6)

"మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక...." (ఎపేసి 1:3)

ప్రభువు ఒక్కడే (ఎపేసి 4:5)

"అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.౹" (ఎపేసి. 4:6)


ఇక్కడ అపోస్తలుడైన పౌలు  స్పష్టంగా వేరు చేస్తూనే మాట్లాడుతున్నాడు :

◾మనకు/అందరికి — క్రైస్తవులకు

◾దేవుడు — తండ్రి

◾ఒక్కడే — ఒక్కరే (మనకు మరొక వ్యక్తి లేరని అర్థమేగా...)

◾మనకు ప్రభువు ఒక్కడే — యేసుక్రీస్తు


👉 “మనకు/అందరికి దేవుడు ఒక్కడే” అనే పదం యేసుకు వర్తింపజేసే వచనాలు బైబిల్ యందు కనపడవు. 

👉 అలాగే “ మనకు దేవుళ్లు ముగ్గురు” అని ఎక్కడా చెప్పబడలేదు.


కాబట్టి నిజమైన క్రైస్తవుల దృష్టిలో వారికి దేవుడు ఒక్కడే ఆయనే తండ్రియైన దేవుడు(YHWH) మాత్రమే. ఈ మాట వినగానే క్రీస్తు మీద నీకున్న అభిమానం కట్ల తెంచుకొని మాపై విరుచుకు పడే అవకాశం ఉందని తెలుసు. కోపగించుకోకు, మేము మన ప్రభువైన యేసుక్రీస్తును తగ్గించడం లేదు. క్రీస్తు దేవుడా? కాదా? అనే ప్రశ్న నీవు లేవనెత్తుతావని తెలుసు ఇందుకోసమే నీకోసం ముందుగా 𝟭𝟮𝟲. యేసుక్రీస్తు యొక్క దైవత్వముక్లిక్ చేయు అనే అంశమును వ్రాయడం జరిగింది. అది చదివిన తర్వాత ఆలోచించు. 


దేవుడు ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని ముగ్గురిని కలపడం నీకు ఆత్మీయంగా కనపడవచ్చు ఏమో గాని అపోస్తలుల బోధ యొక్క వెలుగులో ఇది పూర్తిగా వక్రీకరణే అగును కదా. (ప్రకటన 22:18-19; గలతీ. 1:6-12) ఇందుకే 𝟭𝟱𝟬. దేవుడు ఒక్కడే అంటే ఎవరికి దేవుడు?క్లిక్ చేయు అనే అంశము వ్రాయడం జరిగింది చూడుము.


3️⃣. ఆరాధన కోరుకునేవాడు తండ్రి మాత్రమే

"అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹" (యోహాను. 4:23-24)


ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తున్నారు.

◾ఎవరిని ఆరాధించు కాలం — తండ్రిని

◾ఎవరు కోరుచున్నాడు/వెతుకుచున్నాడు? — తండ్రి

◾ఎవరిని ఆరాధన చేయాలి? — తండ్రిని


యేసు మాటలు శ్రద్ధగా విని జరిగించుట వలనే విశ్వాసం కలుగును(రోమా 10:17) యేసు మాటలు పైన తిరుగుబాటు చేయువాడు సర్వనాశనం అగును కదా(అపో.కార్య. 3:22-23) ఇందుకే యేసు మాటలు బట్టి… “క్రైస్తవులు యేసును ఆరాధించరు.” మరింత వివరణ కోసం 𝟭𝟰𝟭. ఆరాధన కోరిన దేవుడు?క్లిక్ చేయు అనే అంశమును చదువుము


4️⃣. యేసు శరీరదారిగా ఉన్న దినాలలో…

"తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా" (లూకా 4:16)

◾ యేసు సమాజమందిరానికి వెళ్లాడు

◾ విశ్రాంతి దినమున తండ్రిని ఆరాధించాడు

◾ ధర్మశాస్త్రానికి లోబడినవాడిగా జీవించాడు


👉 యేసు = ఆరాధన చేసేవాడు

👉 యేసు ≠ ఆరాధన పొందేవాడు

👉 యేసు తన జీవితకాలమంతా తన దేవుడిని

ఆరాధన చేసే వాడే గాని, ఆరాధన పొందేవాడు కాదు. 


మన ప్రభువైన యేసు శరీరదారిగా ఉన్న దినాలలో కూడా ఆరాధికుడే కానీ ఆరాధ్యుడు కాదు. (మరి కొన్ని వచనాలు యోహాను. 2:13,23; 6:4; 7:2,8-10; 10:22; 19:14; మత్తయి. 26:17-20; లూకా 22:1) మన కంటే ఆయనకే బాగా తెలుసు తన ఆరాధ్య దైవం యొక్క గొప్పతనం.


ఇది వినిన తరువాత నీ మదిలో మెదిలే వచనాలు తెలుసు. అదిగో పశువుల పాకలో, అదిగో రోడ్ మీద, అదిగో సముద్రం దగ్గర… అంతేగా వాటి విషయమై మరింత వివరణ కోసం 𝟭𝟰𝟮. యేసు ఆరాధింపబడ్డారా? లేక ఆరాధన చేశారా?క్లిక్ చేయు అనే అంశమును పూర్తిగా చదివి ఆలోచన చేయగలరు. 


5️⃣. క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చేయరు? — ప్రధాన కారణాలు

A]. యేసు ప్రధానయాజకుడు

పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన దేవుని సముఖానికి వెళ్లి బలులు అర్పించేవాడు కానీ ప్రజలు చేత అతడు ఆరాధన పొందేవాడు కాదు, ప్రజలను దేవునితో కలిపే మధ్యవర్తి మాత్రమే. (హెబ్రీ. 5:1-4; లేవీ 9:7; నిర్గమ 28:1-37) అలాగే క్రీస్తు కూడా తనంతట తానే మహిమపరచుకొనలేదు, దేవుని పిలుపు ద్వారా ప్రధాన యాజకుడయ్యాడు. (హెబ్రీ. 5:5). నీవు మెల్కిసెదెకుకు క్రమము చొప్పున నిత్య యాజకుడవు” అని దేవుడు ప్రమాణం చేసాడు.(కీర్తనలు. 110:4). తన ద్వారా దేవుని యద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు (హెబ్రీ. 7:25-26). యేసు తన స్వరక్తముతో, ఒక్కసారే పరలోక పరిశుద్ధస్థలములో ప్రవేశించి నిత్య విమోచన సంపాదించాడు.(హెబ్రీ. 9:11-12)


◾యేసు = నిత్య ప్రధాన యాజకుడు

◾ప్రధాన యాజకుడు = ఆరాధన పొందేవాడు కాదు

◾ఆయన పని = మన పక్షాన దేవుని సముఖంలో నిలిచి విజ్ఞాపన చేయుట


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు; యేసు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు. మరింత వివరణ కోసం 𝟯𝟵. ప్రధానయాజకుడు పనిక్లిక్ చేయు అనే అంశము చదవగలరు. 


B] *సంఘానికి శిరస్సు — క్రీస్తు

సంఘము అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు(1కోరింది. 1:2) సంఘము అనగా క్రీస్తు శరీరము (ఎపేసి 1:23) సంఘానికి శిరస్సు క్రీస్తు (కొలస్సి 1:18) శరీరము ఒక్కటే అనగా సంఘము ఒక్కటే (ఎపేసి 4:4). క్రీస్తు శరీరము అనగా క్రీస్తు సంఘము (church of Christ) — రోమా 16:16

◾సంఘము = శరీరం

◾యేసు = శిరస్సు


👤 శిరస్సు యొక్క పని:

శరీరాన్ని నడిపించుట ✔️

శరీరానికి దిశ చూపుట✔️

శరీరాన్ని కాపాడుట✔️

శరీరాన్ని సంరక్షించుట ✔️

శరీరాన్ని పోషించుట ✔️


👉 శిరస్సు ఆరాధన పొందే భాగం కాదు, ❌ 

👉 శిరస్సు శరీరాన్ని నడిపించే అధికారం కలిగినది.✔️


అంటే సంఘం ఏం చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో అన్నది యేసు అధికారానికి లోబడే జరుగుతుంది అంతేగా...


🙇 ఆరాధనతో సంబంధం

సంఘం తండ్రిని ఆరాధించేటప్పుడు శరీరం అయిన సంఘం శిరస్సు అయిన యేసుతో కలిసి తండ్రిని ఆరాధిస్తుంది అని తెలుసుకో…


శిరస్సు + శరీరము కలసి = తండ్రికి ఆరాధన చేస్తాయి. 


👤 క్రీస్తు :

సంఘానికి శిరస్సు

అధికారమిచ్చిన రాజు

మార్గదర్శి

కానీ

👉 సంఘానికి శిరస్సు అయినవాడు ఆరాధన పొందడు

👉 సంఘంతో కలిసి తండ్రిని ఆరాధిస్తాడు. 


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసుకు లోబడి జీవిస్తూ, ఆయన ద్వారా/ఆయనతో కలసి తండ్రిని ఆరాధిస్తారు.


🛑 ఇది వినిన తరువాత కూడా… యేసును ఆరాధన చేస్తాం అంటే సంఘముతో అనగా తన శరీరముతో కలసి తండ్రిని ఆరాధన చేసే యేసుక్రీస్తు తనని తాను ఏలాగున ఆరాధించుకుంటాడు? ఆలోచించుకో మిత్రమా.


మరింత వివరణ కోసం 𝟭𝟰𝟯. సంఘముతో కలసి యేసును ఆరాధించుకు యేసు వస్తారా?క్లిక్ చేయు అనే అంశము చదవగలరు.


C]. యేసు మన పాపములకు బలి పశువు

పాత నిబంధనలో పాప పరిహారానికి బలి పశువు నియమించబడింది. బలి పశువు ఉద్దేశ్యం ఆరాధన పొందుట కాదు; దేవునికి అర్పింపబడి, దాని ద్వారా దేవుని ఆరాధించుట. 

బలిపీఠము దేవుడు నియమించిన విధానములోనే ఉండాలి; మానవ కృతితో అపవిత్రం చేయరాదు. బలిపీఠము పరిశుద్ధమైనది; బలి దేవునికే అర్పించబడుతుంది. (నిర్గమకాండం 20:25) బలిపీఠము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది బలి పశువు బలిపీఠముపై అర్పింపబడుటకు మాత్రమే (నిర్గమకాండం 27:1–8) కానీ బలి పశువు ఆరాధింపబడుటకు కాదు సుమీ.


◾మేకలు, గొర్రెలు = పాప పరిహార బలులు మాత్రమే

◾ఎక్కడ అవి ఆరాధింపబడలేదు

👉 అటువంటి భౌతిక సంబంధమైన బలులు ద్వారానే యెహోవా ఆరాధింపబడ్డాడు. 


క్రొత్త నిబంధన విషయానికి వస్తే… యేసు ఇతర యాజకులవలె దినదినము బలులు అర్పించవలసినవాడు కాదు; తాను తానే ఒక్కసారిగా అర్పించుకున్నాడు. (హెబ్రీయులకు 7:27). యేసు మేకల రక్తముతో కాదు, తన స్వరక్తముతో పరిశుద్ధస్థలములో ప్రవేశించి నిత్య విమోచన సంపాదించాడు. (హెబ్రీయులకు 9:11–12) యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పింపబడిన బలియై, సదాకాలము నిలిచిన బలియై ఉంది. (హెబ్రీయులకు 10:10–12). మనకు ఒక బలిపీఠము ఉంది.(హెబ్రీయులకు 13:10) క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు వదింపబడెను కదా(1కోరింది. 5:7). మన ఆరాధనలో యేసుక్రీస్తు ద్వారా తండ్రియైన దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి అర్పింపబడాలి అనేది దేవుని ఆజ్ఞ (1 పేతురు. 2:5). 


🙇 ఆరాధనతో సంబంధం

❌ బలి పశువును ఎవ్వరూ ఆరాధించరు

✔️ బలి ద్వారా దేవునిని ఆరాధిస్తారు

✔️ యేసు = మన పస్కా గొర్రెపిల్ల

✔️ యేసు = మన పాపములకు నిత్య ప్రాయశ్చిత్త బలి

👉 కావున మన కొరకు బలి అయిన యేసును ఆరాధించరు.

👉 బలి పశువు ఆరాధనకు పాత్రుడు కాదు

👉 యేసు బలియైనందున, ఆయన ద్వారా తండ్రిని ఆరాధిస్తారు.


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు యొక్క బలి ద్వారా తండ్రిని ఆరాధిస్తారు.


D]. యేసు దేవుని మందిరాన్ని కట్టేవాడు

పాత నిబంధన నుండే దేవుడు ఒక సత్యాన్ని స్పష్టంగా తెలియజేశాడు అదేమనగా దేవుడు మనుషుల చేతులతో కట్టబడిన ఆలయాలలో నివసించడు. అలాగే క్రొత్త నిబంధనలో దేవుడు నివసించుటకు ఏర్పాటైన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేవాడు యేసుక్రీస్తే అని లేఖనం బోధిస్తుంది.


📖 పాత నిబంధన సాక్ష్యం

"నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.౹ నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.౹" (2 దినవృత్తాంతములు 2:4–6)


🗣️ చివరిగా సొలొమోను ఇలా ఒప్పుకున్నాడు ఆలయం దేవుడు నివసించుటకు కాదు. యెహోవా నామ ఘనత కొరకు మాత్రమే ఆకాశములే దేవునిని పట్టలేవు అని. అలాగే పౌలు గారు అపోస్తలుల కార్యములు 17:24 (పాత నిబంధన సత్యాన్ని ప్రకటిస్తూ) “హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసింపడు.” ఇలా అన్నాడు. 


👉 పాత నిబంధనలో ఆలయాలు దేవుని ఘనతకు గుర్తులే కానీ దేవుని నివాస స్థలం కాదు.


దేవుని యోచన: నిజమైన మందిరం

“చిగురు అను ఒకడు కలడు… అతడే యెహోవా ఆలయమును కట్టును.” (జకర్యా 6:12)

👉 ఈ “చిగురు” = మెస్సీయ = యేసుక్రీస్తు

👉 దేవుని నిజమైన మందిరాన్ని ఆయనే కట్టేవాడు. 


📖 క్రొత్త నిబంధన సాక్ష్యం

యేసు మాటల్లో... "మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను." (మత్తయి. 16:18)


◾ బండ మీద  – యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువనే విశ్వాసం మీద(16వ)

◾ నా(MY) — క్రీస్తు

◾సంఘము(CHURCH) అన్నారు కానీ సంఘములు(Churches) అనలేదు 

◾నా సంఘము = క్రీస్తు సంఘము 

◾కట్టుదును — ప్రారంభించనున్నాను. 


🔎 ఎఫెసీయులకు 2:19–22

◾పరిశుద్ధులు = దేవుని ఇంటివారు

◾అపోస్తలులు, ప్రవక్తలు = పునాది

◾యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి

◾సంఘం = ఆత్మ ద్వారా కట్టబడుచున్న దేవుని నివాసస్థలం. 


🔎 1 కొరింథీయులకు 3:11

"వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹"


🙇 ఆరాధనతో సంబంధం

✔️ యేసు = దేవుని మందిరాన్ని కట్టేవాడు, దేవుని నివాసాన్ని సిద్ధపరచేవాడు 

❌ కానీ ఆరాధన పొందేవాడు కాదు. 

సంఘం = దేవుని మందిరం

దేవుడు = ఆ మందిరంలో నివసించువాడు


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు కట్టిన సంఘములో అనగా క్రీస్తు సంఘములో(church of Christ), యేసు ద్వారానే, తండ్రిని ఆరాధిస్తారు. 


E]. *యేసు మన నిమిత్తము విజ్ఞాపన చేయువాడు

క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రస్తుతం చేస్తున్న ముఖ్యమైన కార్యాలలో ఒకటి మన నిమిత్తము తండ్రి సముఖంలో విజ్ఞాపన చేయుట. విజ్ఞాపన చేయువాడు ఆరాధన పొందేవాడు కాదు; ఇతను మరొకరి(దేవుని) ఎదుట మన పక్షాన నిలిచే మధ్యవర్తి.


"ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు." (హెబ్రీయులకు 7:25; రోమా 8:34)


👉 ఎవరి ఎదుట? — దేవుని ఎదుట (తండ్రి)

👉 ఎవరి పక్షాన? — క్రైస్తవుల పక్షాన


“నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది

తండ్రి యొద్ద మనకున్నాడు.” (1యోహాను. 2:1)


👉 యేసు = ఉత్తరవాది (న్యాయవాది)

👉 తండ్రి = న్యాయాధిపతి


పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన దేవుని ఎదుట నిలిచేవాడు. అతడు విజ్ఞాపన చేసేవాడు. తాను ఆరాధన పొందలేదు అదే విధంగా క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసు నిత్య ప్రధాన యాజకుడు మరియు మన పక్షాన దేవుని సముఖంలో నిలిచే వాడు. మన పాపముల నిమిత్తము వాదించువాడు. మన బలహీనతలను తండ్రికి తెలియజేసేవాడు. తన రక్తాన్ని ఆధారంగా చూపించేవాడు. 


❌ విజ్ఞాపన చేయువాడిని ఆరాధించరు

✔️ విజ్ఞాపన చేయించబడే దేవునినే ఆరాధిస్తారు.


యేసు = మన నిమిత్తము విజ్ఞాపన చేయువాడు

తండ్రి = ఆరాధనకు పాత్రుడు

యేసు ద్వారా — తండ్రిని చేరుతాం.


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు. యేసు మనకు ఉత్తరవాదిగా తండ్రి యెదుట నిలిచి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప మహత్కార్యమో 😢 🙏🏿 


6️⃣. ముగింపు

✔️ ఆరాధన — తండ్రికి మాత్రమే

✔️ మార్గం — యేసుక్రీస్తు ద్వారా

✔️ శక్తి — పరిశుద్ధాత్మ వలన


"మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి." (కొలస్సయులకు 3:17)


👤 యేసుక్రీస్తు :

మనకు ప్రధాన యాజకుడు

మనకు శిరస్సు

మన పాపములకు బలి పశువు 

మన మధ్యవర్తి

మన రాజు


కానీ

👉 క్రైస్తవుల ఆరాధన పాత్రుడు కాదు ❌

👉 తండ్రే క్రైస్తవుల ఆరాధనకు అర్హుడు ✔️

నిజమైన క్రైస్తవులు యేసును ఆరాధించరు — పరిశుద్ధాత్మ వలన యేసు ద్వారా తండ్రియైన దేవుని ఆరాధిస్తారనేది అపోస్తలుల బోధ 🙏🏿

మీ ఆత్మీయులు 👪

యేసు దేవునితో సమానుడు!?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


1️⃣. పరిచయం

"యేసు తన దేవునితో సమానుడా?" అనే ప్రశ్న క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైనది మరియు అలాగే అందరిలో ఎక్కువగా అపార్థం చేయబడుతున్న అంశమని కూడా చెప్పవచ్చును. ముఖ్యంగా ఫిలిప్పీయులకు 2:6 వంటి వచనాలను ఆధారంగా చేసుకొని, యేసు దేవునితో అన్ని విషయాలలో సమానుడే, నూటికి నూరుపాళ్లు సమానుడే అనే భావనను కొందరు బోధిస్తున్నారు. ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని వారి బోధలు నిజమే అని నిర్ణయించడానికి ముందు… మనమైతే అపోస్తలుల బోధ వెలుగులో — బైబిల్ అంతటిని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మొదటగా గుర్తించుకోవాలి. 


“లేఖనాన్ని లేఖనంతో పోల్చాలి” (1 కొరింథీ 2:13). అందువల్ల “సమానుడు” అనే పదం ఏ విషయంలో, ఏ పరిమితిలో, ఏ సందర్భంలో ఉపయోగించబడిందో స్పష్టంగా తెలుసుకోవాలి. 


ఈ అంశంలో... యేసు ఏ విషయాలలో తన దేవునితో సమానుడు?, ఏ విషయాలలో సమానుడు కాదు? అనే విషయాలను భావోద్వేగాలు, మనుషుల సాంప్రదాయాలు, సిద్ధాంతాల ఆధారంగా కాకుండా, కేవలం అపోస్తలుల బోధ వెలుగులో మాత్రమే పరిశీలించబోతున్నాము.


💥 Note : ఈ అంశము ద్వారా మీరు ఊహించినట్టుగా యేసును తక్కువ చేయడం లేదు. మన తండ్రియైన దేవుని మహిమను నిలబెట్టుతూ, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము అపోస్తలుల బోధ ప్రకారం అర్థం చేసుకొనుటకు ప్రయత్నించుటయే ఈ అంశం యొక్క ఉద్దేశం. 🙏🏿 


2️⃣. సమానత్వం 

సమానత్వం (Equality) అనగా — రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు, వస్తువులు, స్వభావాలు లేదా స్థితులు

👉 ఒకే ప్రమాణం ప్రకారం పోల్చినప్పుడు

👉 ఒకే స్థాయిలో, ఒకే విలువలో, ఒకే స్వరూపంలో ఉండుట.

అంటే, పోలిక చేసే అంశంలో తేడా లేకపోవడమే సమానత్వం.


ఉదాహరణ:

✨  రెండు తూకాలు ఒకే బరువు చూపితే — అవి సమానం.

సమానత్వం అనేది “అన్ని విషయాలలో ఒకేలా ఉండటం” కాదు, పోల్చబడే అంశంలో మాత్రమే ఒకేలా ఉండటం.

ఉదాహరణ:

👥 తండ్రి – కుమారుడు ≈ స్వరూపంలో సమానం, అధికారంలో కాదు, జ్ఞానంలో కాదు.

💸   రెండు నాణేలు ≈ వాటి యొక్క విలువలో సమానం

🧑‍🎓👩‍🎓  ఇద్దరు విద్యార్థులు ≈ మానవత్వంలో సమానం, జ్ఞానంలో కాదు.



3️⃣. యేసు ఏ విషయాల్లో సమానుడు?


🔎 దేవుని స్వరూపము/దైవత్వములో సమానుడు

▪️ "ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి,..." (ఫిలిప్పీ. 2:6- 7)

▪️ "ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;౹" (కొలొస్సి. 2:9)

▪️"ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹" (కొలొస్సి 1:15)

▪️ "ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, …." (హెబ్రీ. 1:3)


💥 μορφή - morphē - మోర్-ఫే

💥 రూపం, ఆకారం


➡️ నిర్ణయం : స్వరూపము/దైవత్వములో  సమానత్వం ఉంది.


మరింత వివరణ కోసం *𝟭𝟮𝟲. యేసుక్రీస్తు యొక్క దైవత్వము" అనే అంశమును చదవగలరు. 


🔎 స్వభావములో/పరిశుద్ధతలో సమానుడు

▪️బైబిల్ ప్రకారం యేసు పరిశుద్ధతలో, పాపరహితత్వంలో దేవునితో సమానుడు. (హెబ్రీ. 4:15; 1పేతురు. 2:22).

▪️ఆయన దేవునికి విధేయుడైన కుమారుడు (యోహాను 5:19; 8:28).

▪️పేతురు మాటల్లో " నీవు దేవుని పరిశుద్ధుడవు.” (యోహాను 6:69)

▪️గబ్రియేలను దూత మాటల్లో “పుట్టబోయే శిశువు పరిశుద్ధుడని పిలువబడును.” (లూకా 1:35)

▪️అపవిత్రాత్మపట్టిన మనుష్యుడు మాటల్లో "..... నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను." (మార్కు. 1:24)


➡️ నిర్ణయం : స్వభావ సమానత్వాన్ని విధేయత, ఆధీనత పరిధిలోనే అర్థం చేసుకోవాలి.


🔎 దేవుని మహిమలో సమానుడు

▪️ "తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను 17:5)

▪️ “ఆయన దేవుని మహిమకు ప్రతిబింబమై…" (హెబ్రీ. 1:3)

▪️ యేసును చూచినవాడు దేవుని మహిమను చూచినట్టే (యోహాను 14:9 భావం).


✅ యేసు దేవుని మహిమను కలిగినవాడు, ప్రకటించినవాడు, ప్రతిఫలించినవాడు — అందువల్ల దేవుని మహిమలో సమానుడు.


🔎 ఘనతలో సమానుడు

▪️ "తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.౹" (యోహాను. 5:23)

▪️ "అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును —సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.౹" (ప్రకటన. 5:13)

▪️ “అందుకే దేవుడు ఆయనను అత్యున్నతముగా హెచ్చించి… ప్రతి మోకాలి వంగునట్లు.” (ఫిలిప్పీయులకు 2:9–11)

▪️ “ఆయనను ఘనతయు మహిమయు తో కిరీటము పెట్టెను.” (హెబ్రీయులు 2:9)


✅ ఘనత అనగా timaō (honour) ఘననము/ గొప్ప చేయునది, విలువ గలది, గౌరవించదగినది. ఆరాధన(worship) కాదు సుమీ!

✅ దేవునికి ఘనత చెందాలి.

✅ యేసు కూడా ఘనతకు పాత్రుడిగా లేఖనములో ప్రకటించబడ్డాడు.

✅ తండ్రిని ఘనపరచునట్లే కుమారునిని ఘనపరచమని యేసే చెప్పాడు.


🔎 నీతి - న్యాయంలో సమానుడు

▪️ "యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును … అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును." (యెషయా 11:1,5)

▪️ “దావీదు సింహాసనముమీద ఆయన నీతి న్యాయములతో దానిని స్థిరపరచును.” (యెషయా. 9:7)

▪️“నేను తీర్పు తీర్చునప్పుడు నా తీర్పు న్యాయమైనదే.” (యోహాను. 5:30)

▪️ "వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను." (యోహాను. 7:24)


✅ దేవుడు నీతి, న్యాయం గలవాడు

✅ యేసు కూడా నీతి, న్యాయం గలవాడిగా ప్రకటించబడ్డాడు


🔎 కృపలో సమానుడు

▪️“యెహోవా కరుణగలవాడును కృపగలవాడును” (కీర్తనలు 103:8)

▪️“ఆ వాక్యము శరీరధారియై… కృపతోను సత్యముతోను నిండియుండెను.” (యోహాను. 1:14)

▪️“ఆయన నోటినుండి బయలుదేరిన కృపాకరమైన మాటలకు అందరు ఆశ్చర్యపడిరి.” (లూకా 4:22)

▪️“మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు…” (2 కొరింథీయులు 8:9)


✅ దేవుడు కృపగలవాడు

✅ యేసు కృపతో నిండినవాడు, కృపను మనకు ప్రకటించినవాడు


🔎 నీతిని జరిగించుటలో వచ్చు రోషము విషయములో సమానుడు

▪️ "న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు." (కీర్తనలు. 7:11)

▪️“ఆయన కొరడాను చేసి… దేవాలయమునుండి వారిని బయటకు వెళ్లగొట్టెను.” (యోహాను. 2:15-16)

▪️“…సింహాసనముమీద కూర్చున్నవాని ముఖమునుండియు, గొఱ్ఱెపిల్ల రోషమునుండియు మమ్మును దాచుకొనుడి.” (ప్రకటన. 6:16-17)

▪️"సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?" (మత్తయి. 23:33)


✅ దేవుని రోషము = నీతి, న్యాయానికి ఆధారమైన కోపము

✅ యేసు రోషము = అదే నీతి–న్యాయానికి వ్యతిరేకమైన పాపంపై వచ్చిన కోపము


🔎 పాపిని ప్రేమించుటలో సమానుడు

▪️ “దుష్టుడు తన మార్గము విడిచి బ్రదికివుండుటనే నేను కోరుచున్నాను.” (యెహెజ్కేలు 33:11)

▪️“దేవుడు లోకమును ఎంతో  ప్రేమించెను” (యోహాను. 3:16)

▪️“నేనును నిన్ను శిక్షింపను; పోయి ఇక పాపము చేయకుము.” (యోహాను 8:10–11)

▪️“నశించినదానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చెను.” (లూకా. 19:10)


✅ దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు.

✅ యేసు కూడా అదే ప్రేమను, అదే కరుణను పాపుల పట్ల చూపించాడు.


🔎 సృష్టి/నరుని నిర్మాణములో సమానుడు

▪️“సమస్తమును ఆయన ద్వారా కలిగెను; ఆయన లేకుండా కలిగినది ఏదియు లేదు.” (యోహాను. 1:3)

▪️“ఆయన ద్వారా సమస్తమును సృష్టింపబడెను… సమస్తమును ఆయన ద్వారాను ఆయనకొరకును సృష్టింపబడెను.” (కొలస్సయులు 1:16)

▪️ “ఒక్కడే దేవుడు — తండ్రి… సమస్తము ఆయన నుండి; ఒక్కడే ప్రభువు — యేసుక్రీస్తు — సమస్తము ఆయన ద్వారా." (1 కొరింథీయులు 8:6)

▪️ “క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి" (2 కొరింథీయులు 5:17)


✅ సృష్టికి మూలకర్త — దేవుడు (తండ్రి).

✅ సృష్టి ద్వారా/లో కార్యరూపం దాల్చినవాడు — యేసు.

✅ ఉద్దేశం, సంకల్పం ఒకటే; కార్యం ఒకటే.


సృష్టి నిర్మాణములో దేవుని సంకల్పానికి అనుగుణంగా, ఆయన ద్వారా సృష్టి జరిగినందున యేసు దేవునితో సమాన పాత్రలో (కార్యపరంగా) ఉన్నాడు



4️⃣. యేసు ఏ ఏ విషయాల్లో సమానుడు కాదు?

A.  కాల నిర్వహణలో సమానుడు కాదు — (అపో. 1:7; దాని. 2:20–21). కాలాలు/సమయాలు: తండ్రి స్వాధీనం. 

B.   ఆ దినము మరియు గడియ విషయములో సమానుడు కాదు — మత్తయి 24:36

C.  జన్మ సమయం నిర్ణయంలో సమానుడు కాదు — (గలతి 4:4)

D.  మరణ సమయం నిర్ణయంలో సమానుడు కాదు — (అపో. 2:23)

E. పునరుత్థాన అధికారంలో సమానుడు కాదు (దేవుడే లేపాడు) — (అపో. 13:26–30; కీర్త. 2:7)

F. సర్వాధికారంలో సమానుడు కాదు (ఇయ్యబడిన అధికారం) — (మత్తయి 28:18; యోహాను 3:27)

G.  న్యాయాధికార మూలంలో సమానుడు కాదు — (యోహాను 19:10–11; 3:27)

H.  అద్వితీయ సర్వాధిపత్యంలో సమానుడు కాదు — (1 తిమోతి 6:15) యేసు సర్వాధికారి మాత్రమే(మత్తయి. 28:18-19) అట్టి సర్వాధికారము ఇచ్చినది తన తండ్రియైన దేవుడే.

I.  స్వతంత్ర కార్యాచరణలో సమానుడు కాదు — (యోహాను 5:19)

J.  చిత్త స్వాతంత్ర్యంలో సమానుడు కాదు (తండ్రికి లోబడి) — (లూకా 22:42)

K. అంతకాలంలో స్థితిలో సమానుడు కాదు (తండ్రికి లోబడుట) — (1 కొరి. 15:27–28)

L. ఆరాధింపబడుటలో సమానుడు కాదు. (యోహాను. 4:21-24) యేసు కోరినది సేవించమని కానీ ఆరాధించమని కాదు.(యోహాను. 12:26).

M.  తండ్రికే ప్రార్థించేవాడు — సమానుడు కాదు. (మత్తయి 26:39; లూకా 11:2)

N.  దేవుని చేత బలపరచబడినవాడు — సమానుడు కాదు (లూకా 22:43)

O.  జ్ఞానం పొందినవాడు — సమానుడు కాదు. యేసు జ్ఞానములో ఎదిగాడు — (లూకా 2:52)

P.  దేవుని చేత బోధింపబడినవాడు — సమానుడు కాదు. (యోహాను 8:28; 12:49)

Q.  దేవుని చేత పంపబడినవాడు — సమానుడు కాదు — (యోహాను 5:23–24; 17:3)

R.  దేవుని చేత అభిషేకింపబడినవాడు — సమానుడు కాదు — (అపో. 10:38)

S.  దేవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు — సమానుడు కాదు — (1 తిమోతి 2:5)

T.  దేవుని కుడిచేతి వద్ద కూర్చోబెట్టబడినవాడు — సమానుడు కాదు (కూర్చోబెట్టినవాడు ≠ కూర్చోబెట్టిన అధికారి) (కీర్తన 110:1; అపో. 2:33)

U.  తండ్రిని ఊపిరిని తన స్వాధీనంలో ఉంచుకొని, జీవమును యేసునకు అప్పగించాడు. (అపో 17:25; యోహాను 14:6)


5️⃣. ముగింపు


✅  యేసు సమానుడు  స్వరూపంలో, దైవత్వములో, పరిశుద్ధతలో, దేవుని మహిమను ప్రతిఫలించుటలో, నీతిని జరిగించుటలో రోషములో, పాపిని ప్రేమించుటలో, దేవుని కృపలో, నీతి న్యాయంలో, ఘనతలో,..


యేసు సమానుడు కాదు  కాలంలో, అధికారంలో, అద్వితీయ సర్వాధిపత్యంలో, స్వతంత్ర చిత్తంలో, లోబడుటలో, ఆరాధింపబడుటలో, … 


👉 లేఖనాన్ని లేఖనంతో పోల్చినప్పుడు వచ్చే సమతుల్యమైన, స్పష్టమైన అపోస్తలుల బోధ ఇదే. 🙏🏿 






మీ ఆత్మీయులు 👪 


ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన పండుగలు ✔️


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


పరిశుద్ధ గ్రంథము అంతటిలో ఒక స్పష్టమైన సత్యము ఏమనగా — ఆరాధనకు, పండుగలకు, విధానాలకు అధికారం మనుషులకు కాదు; దేవుడికే(YHWH) ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయములో ఈ సత్యము మరింత స్పష్టంగా ప్రకటించబడింది.

— ఏ పండుగ చేయాలి?,

— ఎప్పుడు చేయాలి?, 

— ఎలా చేయాలి?, 

— ఎవరు చేయాలి?, 

— ఎందుకు చేయాలి?,

— ఎన్ని రోజులు చేయాలి?,

— ఎక్కడ చేయాలి?,

అన్న ప్రతీ అంశాన్ని దేవుడైన యెహోవాయే  స్వయంగా అజ్ఞాపించుట మనం చూడగలం. ఇవి మానవ సంప్రదాయాలు కాదు, సామాజిక ఆచారాలు కాదు, తరతరాలుగా సొంతగా మనుషులు ఏర్పరచుకున్న విధానాలు కూడా కావు.


లేవీయకాండము 23వ అధ్యాయం మొదలుకొని నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండముల వరకు దేవుడు తన ప్రజలైనా ఇశ్రాయేలీయులతో  స్పష్టంగా మాట్లాడి, పండుగల యొక్క ఉద్దేశ్యాన్ని, కాలాన్ని, క్రమాన్ని నిర్ధారించాడు. దేవుని పండుగలు ఆయన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే ఆత్మీయ నియమాలు గాను, ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకజనులుగా వేరు చేయు గుర్తులుగా గాను ఇవ్వబడ్డాయి. అందుకే దేవుడు వాటిలో ఏదియు చేర్చకూడదని, ఏదియు తీసివేయకూడదని కఠినంగా హెచ్చరించాడు. (ద్వితీయో. 4:2; 12:32 చదువుము)


ఈ విషయాన్ని సరిగా గ్రహించకపోతే, మనుషుల ఆలోచనలు దేవుని ఆజ్ఞల స్థానంలోకి వచ్చి ఆరాధనను, పండుగలను వ్యర్థంగా మార్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఈ అంశంలో మనము ఇశ్రాయేలు ప్రజలకు పండుగల విషయములో దేవుడు ఏమేమి పండుగలు అజ్ఞాపించాడు? ఎందుకు అజ్ఞాపించాడు? ఎలా అజ్ఞాపించాడు? అన్నదాన్ని వాక్య ఆధారముగా పరిశీలించబోతున్నాము. ఇది దేవుని అధికారాన్ని గౌరవించుటకు, లేఖన పరిమితులలో నిలుచుటకు మనకు సహాయపడుతుంది.


📖 (లేవీయకాండము 23:1-2,4): "మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము– మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.౹ … ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.౹"


☑ యెహోవా నియామకకాలములు అనగా the feasts of the LORD = "యెహోవా పండుగలు"

☑ ఇశ్రాయేలీయుల పండుగలు మనుషులు ఆలోచన మేర కలిగినవి కావు

☑ దేవుడైన యెహోవాయే స్వయంగా స్థాపించునవి.



పాత నిబంధనలో యెహోవా ఆజ్ఞాపించిన పండుగలు✅


1️⃣పస్కా పండుగ :

🍃 ఎవరు చేయాలి? ⇆  ఇశ్రాయేలీయులు

🍃 ఎందుకు చేయాలి? ⇆ ఐగుప్తు విమోచన/బానిసత్వం నుండి

🍃 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేము/నివాస స్థలములలో

🍃 ఎప్పుడు చేయాలి? ⇆ 1వ నెల మొదటి నెల (అబీబ్ / నిసాన్) 14వ దినం

🍃 ఎలా చేయాలి? ⇆ మచ్చలేని, ఒక సంవత్సరపు మగ గొర్రె బలి, అగ్నితో కాల్చిన మాంసమును తినవలెను

🍃 ఎన్ని రోజులు? ⇆ 1 రోజు

🍃 వాక్య ఆధారం ⇆ నిర్గమ 12:1–14,23; లేవీ 23:5


2️⃣. పులియని రొట్టెల పండుగ :

🍂 ఎవరు చేయాలి? ⇆  ఇశ్రాయేలీయులు సంతానం

🍂 ఎందుకు చేయాలి? ⇆ విమోచన జ్ఞాపకార్థం, తరతరాలకు బోధనగా

🍂 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేము/నివాస స్థలములలో

🍂 ఎప్పుడు చేయాలి? ⇆ 1వ నెల మొదటి నెల (అబీబ్ / నిసాన్) 14వ దినం

🍂 ఎలా చేయాలి? ⇆ పులియని రొట్టెలు, చేదు కూరలతో, పొంగని వాటిని, హోమార్పణము, ఏ పని చేయకూడదు

🍂 ఎన్ని రోజులు? ⇆  7  రోజులు

🍂 వాక్య ఆధారం ⇆ నిర్గమ 12:15-19;13:1–10,23; లేవీ 23:6-8


3️⃣. మొదటి ఫలముల పండుగ :

🌾 ఎవరు చేయాలి? ⇆  ఇశ్రాయేలీయులు సంతానం

🌾 ఎందుకు చేయాలి? ⇆ దేవుడే జీవనాధారుడు అని గుర్తించుటకు, భూమి ఫలములకు దేవునికి కృతజ్ఞత తెలియజేయుటకు, పంట దేవునిదని ఒప్పుకోలు, కృతజ్ఞత, ఆశీర్వాదం, విధేయత

🌾 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో

🌾 ఎప్పుడు చేయాలి? ⇆ పస్కా తరువాత వచ్చే వారంలో — విశ్రాంతిదినము తరువాతి దినమున

🌾 ఎలా చేయాలి? ⇆ మొదటి పంట పనను యాజకుని యొద్దకు  తీసికొని రావాలి, యాజకుడు  యెహోవా ఎదుట దానిని ఊపవలెను, బలులు అర్పించాలి, ఆ రోజు వరకు ఆ కొత్త పంట తినకూడదు. 

🌾 ఎన్ని రోజులు? ⇆  1  రోజు

🌾 వాక్య ఆధారం ⇆ నిర్గమ 23:19; లేవీ 23:9–14; ద్వితీయోపదేశకాండం 26:2,10 


4️⃣. పెంతెకొస్తు పండుగ :

🍁 ఎవరు చేయాలి? ⇆  ఇశ్రాయేలీయులు సంతానం

🍁 ఎందుకు చేయాలి? ⇆ కోతకు కృతజ్ఞత, ఆనందం, విధేయత

🍁ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో

🍁 ఎప్పుడు చేయాలి? ⇆ మొదటి ఫలముల దినము తరువాత 50వ రోజు

🍁 ఎలా చేయాలి? ⇆  యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము, పులియుతో చేసిన రెండు రొట్టెలను అర్పించాలి, జంతుబలులు అర్పించాలి, పరిశుద్ధ సంఘముగా కూడవలెను, ఏ పని చేయకూడదు.

🍁 ఎన్ని రోజులు? ⇆  1  రోజు

🍁 వాక్య ఆధారం ⇆ లేవీ 23:15–21; ద్వితీ 16:9–12


5️⃣.  బూరల పండుగ :

🌿 ఎవరు చేయాలి? ⇆  ఇశ్రాయేలీయులు సంతానం

🌿 ఎందుకు చేయాలి? ⇆ ప్రాయశ్చిత్త దినానికి సిద్ధపడుటకు

🌿 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో

🌿 ఎప్పుడు చేయాలి? ⇆ 7వ నెల 1వ రోజు

🌿ఎలా చేయాలి? ⇆  బూరలు మ్రోగించాలి, బలులు అర్పించాలి,

🌿 ఎన్ని రోజులు? ⇆  1  రోజు (దీనికి వెంటనే ప్రాయశ్చిత్త దినము, గుడారాల పండుగ వస్తాయి)

🌿 వాక్య ఆధారం ⇆ లేవీ 23:23–25. 


6️⃣ ప్రాయశ్చిత్త దినము పండుగ :

🍀 ఎవరు చేయాలి? ⇆  ఇశ్రాయేలీయులు సంతానం

🍀 ఎందుకు చేయాలి? ⇆ ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం, 

🍀 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో

🍀 ఎప్పుడు చేయాలి? ⇆ 7వ నెల 10వ దినం

🍀 ఎలా చేయాలి? ⇆  సంపూర్ణ ఉపవాసము & దుఃఖము, ఆహారం, పని, ఆనందం – అన్నీ నిలిపివేయాలి. ఏ పనియైనను చేయకూడదు, ఏ పనియైనను చేయువానిని నాశనమే. 

🍀 ఎన్ని రోజులు? ⇆  1  రోజు

🍀  వాక్య ఆధారం ⇆ లేవీ 16; లేవీ 23:26–32


7️⃣ గుడారాల / పర్ణశాలల పండుగ :

🌴 ఎవరు చేయాలి? ⇆  ఇశ్రాయేలీయులు సంతానం

🌴 ఎందుకు చేయాలి? ⇆ అరణ్యయాత్ర జ్ఞాపకార్థం, కృతజ్ఞత, ఆనందం

🌴 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో

🌴  ఎప్పుడు చేయాలి? ⇆ 7వ నెల 15వ దినం నుండి

🌴ఎలా చేయాలి? ⇆  గుడారాలు (పర్ణశాలలు) కట్టుకొని నివసించాలి. ఆకులు, కొమ్మలతో ఆనందించాలి, బలులు అర్పించాలి

🌴 ఎన్ని రోజులు? ⇆  7 రోజులు పండుగ + 1 రోజు మహాసభ.

🌴  వాక్య ఆధారం ⇆ లేవీ 23:33–43;


8️⃣. ముగింపు:

పాత నిబంధన కాలములో దేవుడు భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించిన పండుగలు అన్నియు యాదృచ్ఛిక ఆచారాలు కావు. దేవుడే స్వయముగా "ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎన్ని రోజులు చేయాలి" అనే సంగతులను వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు. తన్ను పండుగ సమయాల్లో ఆరాధించుటలో ఏ మనుషుడు స్వేచ్ఛకి/ఆలోచనకు తాను అవకాశం ఇవ్వలేదనే అర్థమేగా… 

తాను నిర్దేశించిన కాలములు, విధానములు, ఉద్దేశ్యములు అన్నియు పవిత్ర ఆజ్ఞలే. అయితే బైబిల్ స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే — ఈ పండుగలన్నీ మోషే ధర్మశాస్త్రానికి చెందినవి, మరియు అవి క్రీస్తు రాకతో నెరవేరినవి అని అవి కేవలం  నీడలు మాత్రమే అని గుర్తించగలం (కొలస్సయులు 2:16–17; హెబ్రీయులు 10:1). ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించిన పండుగలను, కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులపై బలవంతంగా విధించడం లేఖనాలను అతిక్రమించుటకు సమానం అవుతుంది

దేవుడు తాను ఆజ్ఞాపించిన పండుగలు కాక ఇశ్రాయేలు ప్రజలు తమకు తాము ఊహించుకొని, ఏర్పాటు చేసిన ఎట్టి పండుగలైన  దేవుడు ఏ మాత్రం అంగీకరించక, వారి పైన ఉగ్రతను చూపారనే సంగతిని ఈ క్రింది అంశము క్లిక్ చేసి చదివి గుర్తించు…

ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించని పండుగలుక్లిక్ చేయు


హెచ్చరిక :

బైబిల్‌లో ఆజ్ఞ లేకుండా, దేవుడు నిర్దేశించని పండుగలను లేదా ఆరాధన విధానాలను “దేవునికి  ఆరాధన” అని చెప్పి అనుసరించడమూ పాపం.  కాబట్టి, పండుగ అయినా, ఆచారం అయినా, సంప్రదాయం అయినా —

👉 లేఖనంలో స్పష్టమైన ఆజ్ఞ ఉందా?

👉 ఎవరి కోసం ఆజ్ఞాపించబడింది?
👉 ఏ కాలానికి సంబంధించినది?
అనే ప్రశ్నలను పరిశీలించకుండా ఏదైనా ఆచరించడం ఆత్మీయంగా ప్రమాదకరం. 

ఈ హెచ్చరికను లెక్కచేయకుండా, దేవుడు చెప్పని ఆరాధనలను అనుసరించితే, అది భక్తిగా కనిపించినా దేవునికి అనుకూలమైన ఆరాధన కాదు. అందుకే ప్రతి విశ్వాసి సాంప్రదాయాన్ని కాదు — లేఖనాన్ని, భావోద్వేగాన్ని కాదు — సత్యాన్ని ఎంచుకోవాలి.

మీ ఆత్మీయులు 👪

The churches of Christ greet you - Roma 16:16