"దేవుడు ఎవరి ప్రార్థన వింటారు/వినరు"? (whose prayer does God hear/not hear?)



మీ అందరికీ మన ప్రభువైనయేసుక్రీస్తు నామములో నా వందనములు.

మునుపు వ్రాసిన ప్రార్థన అనే అంశము మీ అందరి యొక్క ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడుతున్నదని క్రీస్తునందలి విశ్వాసిస్తున్నాము. ఆ అంశమును మరింత లోతుగా విశదపరుస్తూ ఈ అంశము వ్రాయడం జరిగినది.
 
NOTE : (మునుపు వ్రాసిన అంశమును మీలో ఎవరికైనా చదవాలని ఆశ ఉంటే ఈ క్రింద లింక్ క్లిక్ చేసి చూడగలరు).


“దేవుడు ఎవరి ప్రార్థన వినును”..?



1.  దైవభక్తుని ప్రార్థన వినును :

      ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.  - (యోహాను. 9:31).



2.  నీతిమంతుల ప్రార్థన వినును :

      భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. - (సామెతలు. 15:29)

      యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. - (కీర్తనలు. 34:15).



3.   యథార్థవంతుల ప్రార్థన వినును :

      భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయ ములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. - (సామెతలు. 15:8).



4.  దిక్కులేని దరిద్రుల ప్రార్థన వినును :

      ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు. - (కీర్తనలు. 102:17).

      యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు. తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి,చెవియొగ్గి ఆల కించితివి. (కీర్తనలు. 10:17-18).



     5.  ఆయనకి మాత్రమే కనపడునట్లు చేయదగిన ప్రార్థన           వినును 

      నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. - (మత్తయి. 6:6).

      ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి …” - (2 రాజులు. 32:33).

6.  ఆయన ఆజ్ఞలను గైకొనువాని ప్రార్థన వినును :
      మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును. (1 యోహాను. 3:22).

      నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. (యోహాను. 15:7).

7.  భయభక్తులు + బహు ధర్మము + ఎల్లప్పుడూ సంబంధము కలిగినవాని ప్రార్థన వినును :
      ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు. పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చికొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడిప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. (అపో.కార్య. 10:1-4).

8.  కన్నీటి  ప్రార్థన వినును :
      హన్నా  (1 సమూయేలు. 1:10-20).
      నెహయ్యా - (నెహయ్యా 1:3-11).
      యేసుక్రీస్తు - (హెబ్రీ. 5:7).


9.  పశ్చాత్త్తాపముతో చేయు ప్రార్థన  వినును :

      దావీదు. - (కీర్తనలు. 51:1-19)
      యోనా - (యోనా. 2:1-10).
      పౌలు - ( అపో. కార్య. 9:8-20; 1 తిమోతి. 1:13).



10.  దేవుని చిత్తానుసారమైన ప్రార్థన వినును :

      ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. ( 1 యోహాను. 5:13).



11.  కోపము, సంశయమును లేనివారై +  పవిత్రమైన చేతులు కలిగినవారి ప్రార్థన వినును.

      ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. (1 తిమోతి. 2:8).

      నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. (కీర్తనలు. 141:2).


పైన తెలిపిన వాటిలో  ఏదో  ఒకటి ఉన్నా పరవాలేదు అని అనుకోకు మిత్రమా. ప్రతి విషయమును లేఖనుసారముగా గ్రహించి, మన జీవితాన్ని పరిశుద్ధ పరుచుకొంటూ ఆయా సందర్భలలో మనకున్న పరిస్థితులు బట్టి  ప్రార్ధించాలి.



“దేవుడు ఎవరి ప్రార్థన వినరు”..?



       1.  హృదయములో పాపము నింపుకొనిన వారి ప్రార్థన వినరు :

      నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. (కీర్తనలు. 66:18)

      మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు (యెషయా. 59:2).



2.  స్వార్ధపరుల ప్రార్థన వినరు :

      మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. (యాకోబు. 4:3)



3.  ఎదుటి వారి పట్ల క్షమాపణ గుణం, దయ లేనివారి ప్రార్థన వినరు :

      మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. (మార్కు. 11:25).

      దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు. (సామెతలు. 21:13)



4.  అవిశ్వాసి యొక్క ప్రార్థనవినరు :

      అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. (మార్కు. 11:24).



5.    విగ్రహరాధికుల ప్రార్థన వినరు :

(విగ్రహారాధన అంటే విగ్రహాలను పూజించుట మాత్రమే కాదు గాని దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించిన అది విగ్రహారాధనే).

       నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృద యములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా? (యెహేజ్కేలు 14:3).

      విగ్రహారాధికుడై యున్నలోభియైనను - (ఎపెసి 5:5)



6.  అపవిత్రుల ప్రార్థన వినరు :

       మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.(యెషయా. 1:15).


 ప్రియ సహోదరులారా,  దేవుడు ఎవరి ప్రార్థన మాత్రమే వింటారో పైన వ్రాయబడిన మాటలను బాగుగా ఏరిగితే ఆయన ఎవరి యొక్క ప్రార్థన వినరో అనే విషయము కూడా లోతుగా అర్ధమవుతుంది.

కాబట్టి ప్రార్థన గూర్చి వ్రాయబడిన రెండు అంశములును జాగ్రత్తగా  పరిశీలన చేసి దేవుని దృష్టికి మహిమకరముగా జీవించాలని మాకు మేము హెచ్చరిక చేసుకొనుచు మీకు కూడా క్రీస్తునందు మనవి చేయుచున్నాము. 


🙇🏻 మానక ప్రార్థన చేయుము ( కీర్తన. 109:4) 🙇🏻‍♀

మీ ఆత్మీయులు,
మనోహర్ & నవీన.
+91-9705040236


: అంశము :

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16