"క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా".. ? |
పాత నిబంధనలో ప్రధానయాజకుడి పని
1) యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు, రాజుల సంగతుల విషయములలో పై వాడుగా ఉన్నాడు. – (2 దిన. 19:11).2) పాపములకొరకు అర్పణములను, బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమి౦పబడెను. – (హెబ్రీ. 5:1; హెబ్రీ. 8:3).
3) అతడు ఏమియు తెలియనివారి యెడలను, త్రోవతప్పిన వారి యెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. – (హెబ్రీ. 5:2).
4) ఈ ప్రధానయాజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (హెబ్రీ. 5:3; 9:25).
5) అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత పొందువాడు. – (నిర్గమ. 28:1; హెబ్రీ. 5:4).
6) ఇట్టి ప్రధానయాజకుడు దేవుని ఆరాధన చేయువాడు. – (హెబ్రీ. 9:7-9).
NOTE: ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు మరియు శరీరాచారములు గనుక దిద్దుబాటు చేయుటకొరకు అట్టి ఆరాధన కొట్టివేయబడినది. (హెబ్రీ. 9:10; 10:1; 8:7,13)
క్రొత్త నిబంధనలో ప్రధానయాజకుడి పని
ఆకాశమండలముగుండ వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. (హెబ్రీ. 4:14)
1) యేసు ఆ జనములకొరకును , ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును , చావనైయున్నాడు. – (మత్తయి. 1:21; యోహాను. 11:52; 1 పేతురు. 2:24)
2) పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. – (హెబ్రీ. 7:26)
3) మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (హెబ్రీ. 7:28; 9:11,12,26-28)
4) క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిoచుచు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధిచేసి, మన అపరాధములనుండి విమోచన కలుగుటకై మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్ధానము పొందుటకు, క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు – (హెబ్రీ. 7:2; 9:14,15)
5) క్రీస్తు సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసేదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. – (హెబ్రీ. 5:9,10; 6:20 7:16,17,20).
6) పరిశుద్ధ గ్రంధములో ఉన్న ప్రధానయాజకులందరు దేవుని ఆరాధించిన వారుగానే ఉన్నారు కానీ ఆరాధనకు పాత్రులుగా లేరు అలాగే మనకు దేవుని చేత యేర్పరచబడిన ప్రధానయాజకుడైన క్రీస్తు తన జీవితములో మన తండ్రిని ఆరాధించారు మరియు సత్య ఆరాధన లేదా యదార్ధమైన ఆరాధనయందు వారికి ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలని , అట్టి ఆరాధికులను తండ్రి వెదుకుచున్నాడని మన ప్రభువైన యేసు తెలియజేసెను. – (యోహాను. 4:21-24; లూకా. 2:41-42)
NOTE: ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని (తండ్రిని) సత్య ఆరాధన చేయుటకు సంపూర్ణసిద్ధి కలుగజేసినది.
(హెబ్రీయులకు 8:1-2)
మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా,మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయనపరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడుకాక ప్రభువేస్థాపించిన నిజమైన గుడారమునకుపరిచారకుడైయుండి, పరలోకమందుమహామహునిసింహాసనమునకు కుడిపార్శ్వమునఆసీనుడాయెను.
12 comments
commentsGood post KM
ReplyBadha karamyna vishyam enti ante e madhya church of Christ ani piluvabdina varilo kuda kondharu Christ ni worship cheyali ani.. ayana kuda worship ki patrude ani badhalu chestunnaru.
Atuvanti thappudu bodhalunu khandistu baga e post rasaru. Thanks Bro.
Good Post KM
Replyమనోహర్ అన్నా పోస్ట్ సూపర్ గా రాసారు. అవును యెహోవా దేవుడే మన ఆరాధనకు పాత్రుడు.
Replyయేసు వారు ఎక్కడ కూడా తనని ఆరాధన చెయ్యమని, తాను ఆరాధనకు పాత్రుడు అని చెప్పలేదు.
యేసు వారు దేవుడును ఆరాధన చేయమని, దేవుడు కోరుచున్నరూ అనిసమరయ స్త్రీతో చెప్పడము మనము చూడగలం యోహానం 4:23-24
ఆమెన్
Replyచాల బాగుంది తమ్ముడు (y) మీ అమ్మ గారుకి ఎలా ఉంది..?
వందనములు బ్రదర్
Replyవందనములు సిస్టర్
Replyవందనములు బ్రదర్ (y)
ReplyGood post anna ��
Replyవందనములు బ్రదర్, దేవుని మహా క్రుపను బట్టి మా అమ్మగారు బాగున్నారు
ReplyHi sir I am RAVIKUMAR
Replyవందనాలు బ్రదర్.. ఆరాధన అనగా ఏమిటి..?
Replyబ్రదర్. A. Suresh kuma గారు వందనములు "ఆరాధన" అనే అంశమును చూడగలరు.
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com