"రక్షణ" |
ప్రియ సహోదరులందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
నిజమైన రక్షణ ఎక్కడ దొరుకుతుందో, ఎవరి ద్వారా పొందుకోగలమో అనే గొప్ప సంగతి ఈ లోకస్తులకు తెలియకపోవచ్చు కానీ ఈనాడు క్రైస్తవులమని చెప్పుకొనుచున్నాఅనేక మందికి ఈ విషయము పై సరియైన అవగహన లేకపోవడము చాల బాధాకరము.

"సమస్త మానవ
జాతికి నిజమైన రక్షణ ఎక్కడ దొరకును"..?
ఈ లోకములో అనేకమంది నిజమైన రక్షణ తమ తల్లితండ్రుల యెద్ద, అన్నదమ్ములు యెద్ద మరియు బంధుమిత్రులు యెద్ద దొరుకుతుందని అనుకొని భౌతిక సంబంధమైన జీవితము కొరకు ప్రాకులాడుచున్నారు గానీ నిజమైన రక్షణ ఎవరి ద్వారా దొరుకుతుందో గమనిచలేని స్థితిలో ఉన్నారు అయితే నేను ఎవరి మనోభావములు తప్పుపట్టడము లేదు గానీ క్రైస్తవులమని చెప్పుకొనుచున్నా మనము రక్షణకు సంబంధిచిన ఈ లోకానుసారమైన పండుగలను ఆచరించుట తగునా..?
“నిజమైన రక్షణ - యేసుక్రీస్తు”
పరిశుద్ధ గ్రంథము
ఆధారముగా “ప్రభువైన యేసుక్రీస్తు" ద్వారానే సమస్త మనవజాతికి నిజమైన రక్షణ
దొరుకును.
• “యేసు
లోకరక్షకుడు”. (యెహోను 4:42).
• “తన ప్రజలను
వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (రక్షకుడు) అను పేరు
పెట్టుదువనెను.” (మత్తయి. 1:21).
• మన శత్రువులనుండియు మనలను ద్వేషించువారందరి చేతనుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. (లూకా. 1:71).
• మన ప్రభువు రక్షణ గలవాడు. (మత్తయి. 21:5).
• మన శత్రువులనుండియు మనలను ద్వేషించువారందరి చేతనుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. (లూకా. 1:71).
• మన ప్రభువు రక్షణ గలవాడు. (మత్తయి. 21:5).
• “సకల ప్రజల యెదుట
సిద్దపరిచిన రక్షణ (యేసు)”. (లూకా 2:31-32; లూకా 3:6).
• “తన ప్రజలుకి
రక్షణ జ్ఞానము”. (లూకా. 1:78).
• “సువార్త
మనకి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది”. (రోమా 1:16).
• “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు”. (యెహోను 3:17).
• “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; యేసుక్రీస్తు నామముననే మనకి రక్షణ”. (అపో.కార్య. 4:12).
• “ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను”. (అపో.కార్య. 4:12b)

• “ఆయన
మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారైయుండవలెనని
యిచ్ఛయించుచున్నాడు” (1 తిమోతి. 2:4).
• “క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని...” (2 తిమోతి 2:10).
• “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము ? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై..” (హెబ్రీ. 2:3).
• “రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును”. (ప్రకటన 19:1).

కాబట్టి,
నా ప్రియులారా.. నిజమైన రక్షణ ఎవరి ద్వారా లభించునో తెలుసుకొని కుడా ఈ లోకానుసారమైన
పండుగలును ప్రోత్సహించే వాడిగా ఒక క్రైస్తవుడవైన నీవు ఉన్న యెడల ఈ క్షణమే ఆలోచన
చేసి, మనస్సు మార్చుకొని, నీ ప్రభువైన యేసు వైపునకు నీ హృదయమును త్రిప్పుకొనుము.
ఎందుకనగా “తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;". (మత్తయి. 10:37).
* ఆయన - ''దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును “ఇహమందు చాల రెట్లును, పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను''అని వారితో అనెను. (లూకా. 18:29-30).
పరిశుద్ధలుగా
ఉండుటకు పిలువబడిన మనము ఈ పండుగలు ఆచరించకపోయిన, ఈ పండుగలును జరుపుకునే వారికి శుభాకాంక్షలను
తెలియజేసిన కూడా అసత్యమును ప్రోత్సాహించే వారము అవుతాము. కనుక ఇటువంటి కార్యక్రమములుకు
దూరముగా ఉండి “సిలువను గూర్చిన రక్షణ జ్ఞానమును” (1
తిమోతి. 2:4) తెలియనివారికి తెలియజేయాలని
నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మనవి చేయుచున్నాను.
» » దేవుని
వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడియున్నదని మీరు తెలిసికొందురు గాక," (అపో.కార్య. 28:28)
» » ఇదిగో ఇప్పుడే
మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము (2
కొరింధి. 6:2).
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.
3 comments
commentsGood explanation bro
Replyవందనములు బ్రదర్
Replyవందనములు మను
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com