Showing posts with label ఆరాధన. Show all posts
Showing posts with label ఆరాధన. Show all posts

మధ్యవర్తి – ఆరాధ్యుడా!?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


1️⃣. మధ్యవర్తి యొక్క నిర్వచనం

మధ్యవర్తి (Mediator) అనగా దేవునికి మరియు మనుష్యులకు మధ్య నిలిచి, దేవుని చిత్తాన్ని మనుష్యులకు తెలియజేసి, మనుష్యుల పరిస్థితిని దేవుని ఎదుట ప్రాతినిధ్యం వహిస్తూ, నిబంధనను స్థాపించుటకు లేదా అమలు చేయుటకు దేవుడు నియమించిన వ్యక్తి/సేవకుడు.


(ద్వితీయోపదేశకాండము 5:5): "గనుక యెహోవామాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను."


(1 తిమోతి 2:5): "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹"


(గలతీ 3:19): "ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు?..... అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.౹"


(హెబ్రీయులకు 8:6): "ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు.౹"


👉 మధ్యవర్తి పాత్ర = సేవ & దేవునికి ప్రతినిధిత్వం ✔️

👉 మధ్యవర్తి పాత్ర ≠ ఆరాధన స్వీకరణ ❌

👉 రెండు పక్షాల మధ్య నిలిచేవాడు ✔️


2️⃣. “పాత నిబంధనలో మధ్యవర్తి – మోషే”

పాత నిబంధనలో మధ్యవర్తి పాత్రను స్పష్టంగా, సమగ్రంగా ప్రతిబింబించిన వ్యక్తి మోషే. ఈయన దేవునికి ↔ ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నిలిచి, దేవుని వాక్యాన్ని(ధర్మశాస్త్రమును) ప్రజలకు తెలియజేసి, ప్రజల తరపున దేవుని ఎదుట నిలిచిన దేవుని సేవకుడు.


A. దేవునికి మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య నిలిచినవాడు — (ద్వితీయోపదేశకాండము 5:5)

B. ప్రజల భయము వల్ల ఏర్పడిన మధ్యవర్తిత్వం — (నిర్గమకాండము 20:18–19; ద్వితీయోపదేశకాండము 18:16)

C. నిబంధనను తెలియజేసినవాడు — (నిర్గమకాండము 19:3–8; 24:7-8)

D. ఉగ్రత సమయములో ప్రజల తరపున దేవుని ఎదుట నిలిచినవాడు — (నిర్గమకాండము 32:11–14; కీర్తనలు 106:23)

E. ఆరాధన కోరనివాడు – ఆరాధనను కాపాడినవాడు — (నిర్గమకాండము 20:3–5; 32:19-20; ద్వితీయోపదేశకాండము 6:13)

F. దేవుని సేవకుడు — (మలాకీ. 4:4)


మోషే = మధ్యవర్తి✔️

మోషే ≠ ఇశ్రాయేలు ప్రజల ఆరాధ్యుడు❌

ఆరాధన = యెహోవాకే(𝗬𝗛𝗪𝗛)✔️


3️⃣. “కొత్త నిబంధనలో మధ్యవర్తి – యేసుక్రీస్తు”

కొత్త నిబంధనలో మధ్యవర్తి అనే పాత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్పష్టంగా నిర్వహించబడింది. ఆయన దేవుడికి మరియు సమస్త మనుష్యులకు మధ్యగా నిలిచినవాడు, తన రక్తముతో నిబంధనను స్థాపించి మనుష్యులను దేవుని యొద్దకు  చేర్చుటకు నియమించబడిన దేవుని సేవకుడు.


A. దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి(YHWH) మరియు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తుయేసను నరుడు. (1 కోరింది. 8:6a; 1 తిమోతి. 2:5). ఈయన దేవునికి మరియు క్రైస్తవులకు మధ్య నిలిచినవాడు. 

B. క్రీస్తునందు ఉన్నవారితో అనగా క్రైస్తవులతో నిబంధన చేసింది దేవుడు, ఆ నిబంధనను స్థాపించి అమలు చేసినది యేసుక్రీస్తు. (హెబ్రీయులకు. 8:6-13; 9:14-16)

C. తన్ను దేవునిచే పంపబడినవాడిగా, దేవుని చిత్తానికి లోబడినవాడిగా ప్రకటించుకున్నాడు, దేవుని గౌరవ ప్రథముగా  సూచించాడు, ఆయనను తండ్రి అని, (YHWH) “నా దేవుడు” అని పిలిచాడు. (యోహాను. 17:3; 5:44,30; 7:8; 12:49; లూకా 22:42; యోహాను 20:17; మత్తయి 27:46)

D. యేసు తాను చేసిన బోధ తనది కాదని చెప్పిన సందర్భాలు. (యోహాను 7:16; 8:28)

E. యేసు ఆరాధన కోరలేదు – దేవునికే ఆరాధన అని బోధించాడు (మత్తయి. 4:10; యోహాను. 4:23-24)

F. యేసు కోరింది – సేవ (Serve), ఆరాధన కాదు. (యోహాను 12:26)

G. యేసు(మధ్యవర్తి) ద్వారానే దేవునికి కృతజ్ఞతలు, ప్రార్థన, ఆరాధన, ఆత్మ సంబంధమైన బలులు మరియు తండ్రి యొద్దకు ప్రవేశం. (రోమీయులకు 1:8; 5:1-3; ఎఫెసీయులకు 2:18; 3:14;  కొలస్సయులకు 1:3; 3:17; 1 పేతురు 2:3; హెబ్రీ. 13:15; 1పేతురు 3:18)

F. యేసు తన రక్తముతో నూతన(క్రొత్త) నిబంధనను స్థాపించాడు. (లూకా 22:20, మత్తయి 26:28; హెబ్రీ. 9:15; 8:9-10)

G. యేసు తన త్యాగముచేత న్యాయాన్ని సంతృప్తి పరచి కృపను కలిగించాడు. (రోమా 8:34; హెబ్రీ. 7:25; 1యోహాను 2:1)

H. దేవుని సేవకుడు (మత్తయి. 12:18;అపొ. కార్యములు 3:13, 26) యేసు విధేయతలో పరిపూర్ణుడైన దేవుని సేవకుడు. 

I. యేసు దేవుని యొక్క అపోస్తులుడు. 


యేసుక్రీస్తు = మధ్యవర్తి✔️

యేసుక్రీస్తు ≠ క్రైస్తవుల ఆరాధ్యుడు❌

ఆరాధన = తండ్రియైన దేవునికే(𝗬𝗛𝗪𝗛)✔️


4️⃣. ముగింపు

నేను మధ్యవర్తి పాత్రను అర్థం చేసుకున్నానా?

నిబంధనలో ప్రవేశించానా?

ఆరాధన నిబంధన ప్రకారముగా దేవునికే చేస్తున్నానా?

మధ్యవర్తిని ఆరాధించాలా? — కాదు.

మధ్యవర్తి పాత్ర గౌరవమైనది. మధ్యవర్తి ద్వారా నిబంధన, నిబంధన దేవునికే ఆరాధన. మధ్యవర్తి పాత్రను ఆరాధనగా మార్చడం అపోస్తలుల బోధకు వ్యతిరేకమైనది.


➡️ ఆరాధ్యుడు = తండ్రి(YHWH)

➡️ మధ్యవర్తి = క్రీస్తు

మీ ఆత్మీయులు 👪

క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు?

క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు? ❌


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


1️⃣. పరిచయం

నేటి క్రైస్తవ లోకంలో అత్యంత గందరగోళానికి గురైన అంశం ఏదైనా ఉందంటే అది “ఆరాధన ఎవరికి చేయాలి?” అన్న ప్రశ్నే. చాలామంది ఇలా అంటున్నారు : కొందరు యేసుకి ఆరాధన చేయాలని, ఇంకొందరు తండ్రియైన దేవునికి(YHWH) మాత్రమే ఆరాధన చేయాలని,   మరికొందరు తండ్రి మరియు యేసు ఇద్దరు ఆరాధనకు పాత్రులే అని బోధిస్తున్నారు. ఈ రకమైన బోధలన్నీ మనలో చాలా మంది వినియున్నాం. అయితే ఇప్పుడు వేరొక బోధ తీసుకొచ్చారు. వారు చేస్తున్న బోధ వినడానికి బహు  విచిత్రముగా ఉంది. వీరు తండ్రికి + యేసుకు + పరిశుద్ధాత్మునికి అనగా ముగ్గురికి ఆరాధన చేయాలని, క్రైస్తవుల ఆరాధనకు ముగ్గురు పాత్రులే అని బోధిస్తున్నారు. 


నేడు క్రీస్తు సంఘాలు మతశాఖలుకు ధీటుగా నిలబడి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేయాలి. మరి ముఖ్యముగా  త్రియేక దేవుడు లేక ముగ్గురు సమానులే ఇలాంటి తప్పుడు  బోధలు కలిగిన మతశాఖలకు బుద్ధి చెప్పాల్సింది పోయి… కొన్ని క్రీస్తు సంఘాలు ముగ్గురిని ఆరాధించవచ్చు అని మాట్లాడుతున్నారు. ముగ్గురు వ్యక్తులు క్రైస్తవుల ఆరాధనకు పాత్రులు  అనేడి బోధలు, డిబేట్స్ రూపములో నేనంటే నేను,  నీవంటే నీవు అన్నట్టుగా ప్రస్తుతం ఇవి లోకములో తిరుగుతూ, విశ్వాసులను చెదరగొడుతూ, కలుపుకుంటూ ఉన్నారు.


పరిశుద్ధ గ్రంథము మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కనుక మనుష్యుడు సొంత నిర్ణయాలు తీసుకుంటే అవి దేవుని దృష్టిలో చెల్లుబాటు అవ్వవని మొదట గ్రహించుకోవాలి. సత్య బోధ అని చెప్పుకునే క్రీస్తు సంఘాలు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే మతశాఖలు వారికి నచ్చినట్టుగా కలిపి చెరువులు చేయడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రియ సోదరా మనము తీసుకునే ప్రతి నిర్ణయము పరిశుద్ధ లేఖనాల ఆధారముగానే ఉండాలనేది ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది. 


నిజానికి క్రైస్తవ విశ్వాసం

➡️ భావాలపై కాదు ❌

➡️ సంప్రదాయాలపై కాదు ❌

➡️ మనుషులు ఊహలు/బోధలపై కాదు ❌

➡️ రకరకాల సంఘాలు, వాటి సిద్ధాంతాలపై కాదు

➡️ మెజారిటీ విశ్వాసం/మెజారిటీ సభ్యత్యంపై అస్సలు కాదు ❌

➡️ కేవలం దేవుని బోధ/ క్రీస్తు బోధ/ఆదిమ అపోస్తలుల బోధ పైనే మాత్రమే ఆధారపడుతుంది. 🔎📖✔️

➡️ క్రైస్తవులకు క్రొత్త నిబంధనే ప్రామాణికం 📖✔️


గతములో “ఆరాధ్య దైవం ఒక్కడే - ఆయనే తండ్రిక్లిక్ చేయు అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. నేడైతే “క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు?” అనే ఈ ప్రశ్నకు సమాధానం చివరిగా పరిశుద్ధ గ్రంథము మాట్లాడిన మేర ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.


2️⃣. మనకు దేవుడు ఒక్కడే – ఆయనే తండ్రి

"ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹" (1కోరింది. 8:6)

"మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక...." (ఎపేసి 1:3)

ప్రభువు ఒక్కడే (ఎపేసి 4:5)

"అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.౹" (ఎపేసి. 4:6)


ఇక్కడ అపోస్తలుడైన పౌలు  స్పష్టంగా వేరు చేస్తూనే మాట్లాడుతున్నాడు :

◾మనకు/అందరికి — క్రైస్తవులకు

◾దేవుడు — తండ్రి

◾ఒక్కడే — ఒక్కరే (మనకు మరొక వ్యక్తి లేరని అర్థమేగా...)

◾మనకు ప్రభువు ఒక్కడే — యేసుక్రీస్తు


👉 “మనకు/అందరికి దేవుడు ఒక్కడే” అనే పదం యేసుకు వర్తింపజేసే వచనాలు బైబిల్ యందు కనపడవు. 

👉 అలాగే “ మనకు దేవుళ్లు ముగ్గురు” అని ఎక్కడా చెప్పబడలేదు.


కాబట్టి నిజమైన క్రైస్తవుల దృష్టిలో వారికి దేవుడు ఒక్కడే ఆయనే తండ్రియైన దేవుడు(YHWH) మాత్రమే. ఈ మాట వినగానే క్రీస్తు మీద నీకున్న అభిమానం కట్ల తెంచుకొని మాపై విరుచుకు పడే అవకాశం ఉందని తెలుసు. కోపగించుకోకు, మేము మన ప్రభువైన యేసుక్రీస్తును తగ్గించడం లేదు. క్రీస్తు దేవుడా? కాదా? అనే ప్రశ్న నీవు లేవనెత్తుతావని తెలుసు ఇందుకోసమే నీకోసం ముందుగా 𝟭𝟮𝟲. యేసుక్రీస్తు యొక్క దైవత్వముక్లిక్ చేయు అనే అంశమును వ్రాయడం జరిగింది. అది చదివిన తర్వాత ఆలోచించు. 


దేవుడు ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని ముగ్గురిని కలపడం నీకు ఆత్మీయంగా కనపడవచ్చు ఏమో గాని అపోస్తలుల బోధ యొక్క వెలుగులో ఇది పూర్తిగా వక్రీకరణే అగును కదా. (ప్రకటన 22:18-19; గలతీ. 1:6-12) ఇందుకే 𝟭𝟱𝟬. దేవుడు ఒక్కడే అంటే ఎవరికి దేవుడు?క్లిక్ చేయు అనే అంశము వ్రాయడం జరిగింది చూడుము.


3️⃣. ఆరాధన కోరుకునేవాడు తండ్రి మాత్రమే

"అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹" (యోహాను. 4:23-24)


ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తున్నారు.

◾ఎవరిని ఆరాధించు కాలం — తండ్రిని

◾ఎవరు కోరుచున్నాడు/వెతుకుచున్నాడు? — తండ్రి

◾ఎవరిని ఆరాధన చేయాలి? — తండ్రిని


యేసు మాటలు శ్రద్ధగా విని జరిగించుట వలనే విశ్వాసం కలుగును(రోమా 10:17) యేసు మాటలు పైన తిరుగుబాటు చేయువాడు సర్వనాశనం అగును కదా(అపో.కార్య. 3:22-23) ఇందుకే యేసు మాటలు బట్టి… “క్రైస్తవులు యేసును ఆరాధించరు.” మరింత వివరణ కోసం 𝟭𝟰𝟭. ఆరాధన కోరిన దేవుడు?క్లిక్ చేయు అనే అంశమును చదువుము


4️⃣. యేసు శరీరదారిగా ఉన్న దినాలలో…

"తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా" (లూకా 4:16)

◾ యేసు సమాజమందిరానికి వెళ్లాడు

◾ విశ్రాంతి దినమున తండ్రిని ఆరాధించాడు

◾ ధర్మశాస్త్రానికి లోబడినవాడిగా జీవించాడు


👉 యేసు = ఆరాధన చేసేవాడు

👉 యేసు ≠ ఆరాధన పొందేవాడు

👉 యేసు తన జీవితకాలమంతా తన దేవుడిని

ఆరాధన చేసే వాడే గాని, ఆరాధన పొందేవాడు కాదు. 


మన ప్రభువైన యేసు శరీరదారిగా ఉన్న దినాలలో కూడా ఆరాధికుడే కానీ ఆరాధ్యుడు కాదు. (మరి కొన్ని వచనాలు యోహాను. 2:13,23; 6:4; 7:2,8-10; 10:22; 19:14; మత్తయి. 26:17-20; లూకా 22:1) మన కంటే ఆయనకే బాగా తెలుసు తన ఆరాధ్య దైవం యొక్క గొప్పతనం.


ఇది వినిన తరువాత నీ మదిలో మెదిలే వచనాలు తెలుసు. అదిగో పశువుల పాకలో, అదిగో రోడ్ మీద, అదిగో సముద్రం దగ్గర… అంతేగా వాటి విషయమై మరింత వివరణ కోసం 𝟭𝟰𝟮. యేసు ఆరాధింపబడ్డారా? లేక ఆరాధన చేశారా?క్లిక్ చేయు అనే అంశమును పూర్తిగా చదివి ఆలోచన చేయగలరు. 


5️⃣. క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చేయరు? — ప్రధాన కారణాలు

A]. యేసు ప్రధానయాజకుడు

పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన దేవుని సముఖానికి వెళ్లి బలులు అర్పించేవాడు కానీ ప్రజలు చేత అతడు ఆరాధన పొందేవాడు కాదు, ప్రజలను దేవునితో కలిపే మధ్యవర్తి మాత్రమే. (హెబ్రీ. 5:1-4; లేవీ 9:7; నిర్గమ 28:1-37) అలాగే క్రీస్తు కూడా తనంతట తానే మహిమపరచుకొనలేదు, దేవుని పిలుపు ద్వారా ప్రధాన యాజకుడయ్యాడు. (హెబ్రీ. 5:5). నీవు మెల్కిసెదెకుకు క్రమము చొప్పున నిత్య యాజకుడవు” అని దేవుడు ప్రమాణం చేసాడు.(కీర్తనలు. 110:4). తన ద్వారా దేవుని యద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు (హెబ్రీ. 7:25-26). యేసు తన స్వరక్తముతో, ఒక్కసారే పరలోక పరిశుద్ధస్థలములో ప్రవేశించి నిత్య విమోచన సంపాదించాడు.(హెబ్రీ. 9:11-12)


◾యేసు = నిత్య ప్రధాన యాజకుడు

◾ప్రధాన యాజకుడు = ఆరాధన పొందేవాడు కాదు

◾ఆయన పని = మన పక్షాన దేవుని సముఖంలో నిలిచి విజ్ఞాపన చేయుట


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు; యేసు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు. మరింత వివరణ కోసం 𝟯𝟵. ప్రధానయాజకుడు పనిక్లిక్ చేయు అనే అంశము చదవగలరు. 


B] *సంఘానికి శిరస్సు — క్రీస్తు

సంఘము అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు(1కోరింది. 1:2) సంఘము అనగా క్రీస్తు శరీరము (ఎపేసి 1:23) సంఘానికి శిరస్సు క్రీస్తు (కొలస్సి 1:18) శరీరము ఒక్కటే అనగా సంఘము ఒక్కటే (ఎపేసి 4:4). క్రీస్తు శరీరము అనగా క్రీస్తు సంఘము (church of Christ) — రోమా 16:16

◾సంఘము = శరీరం

◾యేసు = శిరస్సు


👤 శిరస్సు యొక్క పని:

శరీరాన్ని నడిపించుట ✔️

శరీరానికి దిశ చూపుట✔️

శరీరాన్ని కాపాడుట✔️

శరీరాన్ని సంరక్షించుట ✔️

శరీరాన్ని పోషించుట ✔️


👉 శిరస్సు ఆరాధన పొందే భాగం కాదు, ❌ 

👉 శిరస్సు శరీరాన్ని నడిపించే అధికారం కలిగినది.✔️


అంటే సంఘం ఏం చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో అన్నది యేసు అధికారానికి లోబడే జరుగుతుంది అంతేగా...


🙇 ఆరాధనతో సంబంధం

సంఘం తండ్రిని ఆరాధించేటప్పుడు శరీరం అయిన సంఘం శిరస్సు అయిన యేసుతో కలిసి తండ్రిని ఆరాధిస్తుంది అని తెలుసుకో…


శిరస్సు + శరీరము కలసి = తండ్రికి ఆరాధన చేస్తాయి. 


👤 క్రీస్తు :

సంఘానికి శిరస్సు

అధికారమిచ్చిన రాజు

మార్గదర్శి

కానీ

👉 సంఘానికి శిరస్సు అయినవాడు ఆరాధన పొందడు

👉 సంఘంతో కలిసి తండ్రిని ఆరాధిస్తాడు. 


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసుకు లోబడి జీవిస్తూ, ఆయన ద్వారా/ఆయనతో కలసి తండ్రిని ఆరాధిస్తారు.


🛑 ఇది వినిన తరువాత కూడా… యేసును ఆరాధన చేస్తాం అంటే సంఘముతో అనగా తన శరీరముతో కలసి తండ్రిని ఆరాధన చేసే యేసుక్రీస్తు తనని తాను ఏలాగున ఆరాధించుకుంటాడు? ఆలోచించుకో మిత్రమా.


మరింత వివరణ కోసం 𝟭𝟰𝟯. సంఘముతో కలసి యేసును ఆరాధించుకు యేసు వస్తారా?క్లిక్ చేయు అనే అంశము చదవగలరు.


C]. యేసు మన పాపములకు బలి పశువు

పాత నిబంధనలో పాప పరిహారానికి బలి పశువు నియమించబడింది. బలి పశువు ఉద్దేశ్యం ఆరాధన పొందుట కాదు; దేవునికి అర్పింపబడి, దాని ద్వారా దేవుని ఆరాధించుట. 

బలిపీఠము దేవుడు నియమించిన విధానములోనే ఉండాలి; మానవ కృతితో అపవిత్రం చేయరాదు. బలిపీఠము పరిశుద్ధమైనది; బలి దేవునికే అర్పించబడుతుంది. (నిర్గమకాండం 20:25) బలిపీఠము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది బలి పశువు బలిపీఠముపై అర్పింపబడుటకు మాత్రమే (నిర్గమకాండం 27:1–8) కానీ బలి పశువు ఆరాధింపబడుటకు కాదు సుమీ.


◾మేకలు, గొర్రెలు = పాప పరిహార బలులు మాత్రమే

◾ఎక్కడ అవి ఆరాధింపబడలేదు

👉 అటువంటి భౌతిక సంబంధమైన బలులు ద్వారానే యెహోవా ఆరాధింపబడ్డాడు. 


క్రొత్త నిబంధన విషయానికి వస్తే… యేసు ఇతర యాజకులవలె దినదినము బలులు అర్పించవలసినవాడు కాదు; తాను తానే ఒక్కసారిగా అర్పించుకున్నాడు. (హెబ్రీయులకు 7:27). యేసు మేకల రక్తముతో కాదు, తన స్వరక్తముతో పరిశుద్ధస్థలములో ప్రవేశించి నిత్య విమోచన సంపాదించాడు. (హెబ్రీయులకు 9:11–12) యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పింపబడిన బలియై, సదాకాలము నిలిచిన బలియై ఉంది. (హెబ్రీయులకు 10:10–12). మనకు ఒక బలిపీఠము ఉంది.(హెబ్రీయులకు 13:10) క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు వదింపబడెను కదా(1కోరింది. 5:7). మన ఆరాధనలో యేసుక్రీస్తు ద్వారా తండ్రియైన దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి అర్పింపబడాలి అనేది దేవుని ఆజ్ఞ (1 పేతురు. 2:5). 


🙇 ఆరాధనతో సంబంధం

❌ బలి పశువును ఎవ్వరూ ఆరాధించరు

✔️ బలి ద్వారా దేవునిని ఆరాధిస్తారు

✔️ యేసు = మన పస్కా గొర్రెపిల్ల

✔️ యేసు = మన పాపములకు నిత్య ప్రాయశ్చిత్త బలి

👉 కావున మన కొరకు బలి అయిన యేసును ఆరాధించరు.

👉 బలి పశువు ఆరాధనకు పాత్రుడు కాదు

👉 యేసు బలియైనందున, ఆయన ద్వారా తండ్రిని ఆరాధిస్తారు.


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు యొక్క బలి ద్వారా తండ్రిని ఆరాధిస్తారు.


D]. యేసు దేవుని మందిరాన్ని కట్టేవాడు

పాత నిబంధన నుండే దేవుడు ఒక సత్యాన్ని స్పష్టంగా తెలియజేశాడు అదేమనగా దేవుడు మనుషుల చేతులతో కట్టబడిన ఆలయాలలో నివసించడు. అలాగే క్రొత్త నిబంధనలో దేవుడు నివసించుటకు ఏర్పాటైన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేవాడు యేసుక్రీస్తే అని లేఖనం బోధిస్తుంది.


📖 పాత నిబంధన సాక్ష్యం

"నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.౹ నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.౹" (2 దినవృత్తాంతములు 2:4–6)


🗣️ చివరిగా సొలొమోను ఇలా ఒప్పుకున్నాడు ఆలయం దేవుడు నివసించుటకు కాదు. యెహోవా నామ ఘనత కొరకు మాత్రమే ఆకాశములే దేవునిని పట్టలేవు అని. అలాగే పౌలు గారు అపోస్తలుల కార్యములు 17:24 (పాత నిబంధన సత్యాన్ని ప్రకటిస్తూ) “హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసింపడు.” ఇలా అన్నాడు. 


👉 పాత నిబంధనలో ఆలయాలు దేవుని ఘనతకు గుర్తులే కానీ దేవుని నివాస స్థలం కాదు.


◾దేవుని యోచన: నిజమైన మందిరం

“చిగురు అను ఒకడు కలడు… అతడే యెహోవా ఆలయమును కట్టును.” (జకర్యా 6:12)

👉 ఈ “చిగురు” = మెస్సీయ = యేసుక్రీస్తు

👉 దేవుని నిజమైన మందిరాన్ని ఆయనే కట్టేవాడు. 


📖 క్రొత్త నిబంధన సాక్ష్యం

యేసు మాటల్లో... "మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను." (మత్తయి. 16:18)


◾ బండ మీద  – యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువనే విశ్వాసం మీద(16వ)

◾ నా(MY) — క్రీస్తు

◾సంఘము(CHURCH) అన్నారు కానీ సంఘములు(Churches) అనలేదు 

◾నా సంఘము = క్రీస్తు సంఘము 

◾కట్టుదును — ప్రారంభించనున్నాను. 


🔎 ఎఫెసీయులకు 2:19–22

◾పరిశుద్ధులు = దేవుని ఇంటివారు

◾అపోస్తలులు, ప్రవక్తలు = పునాది

◾యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి

◾సంఘం = ఆత్మ ద్వారా కట్టబడుచున్న దేవుని నివాసస్థలం. 


🔎 1 కొరింథీయులకు 3:11

"వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹"


🙇 ఆరాధనతో సంబంధం

✔️ యేసు = దేవుని మందిరాన్ని కట్టేవాడు, దేవుని నివాసాన్ని సిద్ధపరచేవాడు 

❌ కానీ ఆరాధన పొందేవాడు కాదు. 

సంఘం = దేవుని మందిరం

దేవుడు = ఆ మందిరంలో నివసించువాడు


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు కట్టిన సంఘములో అనగా క్రీస్తు సంఘములో(church of Christ), యేసు ద్వారానే, తండ్రిని ఆరాధిస్తారు. 


E]. *యేసు మన నిమిత్తము విజ్ఞాపన చేయువాడు

క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రస్తుతం చేస్తున్న ముఖ్యమైన కార్యాలలో ఒకటి మన నిమిత్తము తండ్రి సముఖంలో విజ్ఞాపన చేయుట. విజ్ఞాపన చేయువాడు ఆరాధన పొందేవాడు కాదు; ఇతను మరొకరి(దేవుని) ఎదుట మన పక్షాన నిలిచే మధ్యవర్తి.


"ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు." (హెబ్రీయులకు 7:25; రోమా 8:34)


👉 ఎవరి ఎదుట? — దేవుని ఎదుట (తండ్రి)

👉 ఎవరి పక్షాన? — క్రైస్తవుల పక్షాన


“నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది

తండ్రి యొద్ద మనకున్నాడు.” (1యోహాను. 2:1)


👉 యేసు = ఉత్తరవాది (న్యాయవాది)

👉 తండ్రి = న్యాయాధిపతి


పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన దేవుని ఎదుట నిలిచేవాడు. అతడు విజ్ఞాపన చేసేవాడు. తాను ఆరాధన పొందలేదు అదే విధంగా క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసు నిత్య ప్రధాన యాజకుడు మరియు మన పక్షాన దేవుని సముఖంలో నిలిచే వాడు. మన పాపముల నిమిత్తము వాదించువాడు. మన బలహీనతలను తండ్రికి తెలియజేసేవాడు. తన రక్తాన్ని ఆధారంగా చూపించేవాడు. 


❌ విజ్ఞాపన చేయువాడిని ఆరాధించరు

✔️ విజ్ఞాపన చేయించబడే దేవునినే ఆరాధిస్తారు.


యేసు = మన నిమిత్తము విజ్ఞాపన చేయువాడు

తండ్రి = ఆరాధనకు పాత్రుడు

యేసు ద్వారా — తండ్రిని చేరుతాం.


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు. యేసు మనకు ఉత్తరవాదిగా తండ్రి యెదుట నిలిచి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప మహత్కార్యమో 😢 🙏🏿 


6️⃣. ముగింపు

✔️ ఆరాధన — తండ్రికి మాత్రమే

✔️ మార్గం — యేసుక్రీస్తు ద్వారా

✔️ శక్తి — పరిశుద్ధాత్మ వలన


"మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి." (కొలస్సయులకు 3:17)


👤 యేసుక్రీస్తు :

మనకు ప్రధాన యాజకుడు

మనకు శిరస్సు

మన పాపములకు బలి పశువు 

మన మధ్యవర్తి

మన రాజు


కానీ

👉 క్రైస్తవుల ఆరాధన పాత్రుడు కాదు ❌

👉 తండ్రే క్రైస్తవుల ఆరాధనకు అర్హుడు ✔️

నిజమైన క్రైస్తవులు యేసును ఆరాధించరు — పరిశుద్ధాత్మ వలన యేసు ద్వారా తండ్రియైన దేవుని ఆరాధిస్తారనేది అపోస్తలుల బోధ 🙏🏿

మీ ఆత్మీయులు 👪

ఆరాధ్య దైవం ఒక్కడే 👤



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


పరిశుద్ధ గ్రంథము సూచించిన కాలములు అనగా "పితరుల కాలం" (ఆదికాండం 1వ అధ్యా. To నిర్గమకాండం 19వ అధ్యా.), "మోషే కాలం/ధర్మశాస్త్ర కాలం"  (నిర్గమకాండం 20వ అధ్యా. To అపోస్తులుల కార్యములు 1వ అధ్యా), మరియు "క్రైస్తవుల/క్రీస్తు కాలం" (అపోస్తులుల కార్యములు 2వ అధ్యా. నుండి నేటి వరకు…) లో గల విశ్వాసులు ఒకే దైవమును ఆరాధించారు. ఆయనే – యెహోవా(YHWH).


ఇది గ్రహించక, ఆలోచించక, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రామాణికంగా తీసుకొనలేక  కొందరు క్రైస్తవులు తమకు బహు(ఇద్దరు/ముగ్గురు) ఆరాధ్య దైవములు కలరని బోధిస్తూ, వాక్యమును వక్రీకరిస్తూ, మనకు తోచినట్టుగా ఆరాధించవచ్చు అనే భావనలో ఉండి, అపవాది యొక్క తంత్రములను ఎరుగక వాడి ఉద్దేశ్యమును నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇటువంటి స్వేచ్ఛారాధికుల భారిన పడకుండా సత్యాన్ని ఎల్లప్పుడూ అన్వేషించే శోత్రులకు అర్థమగుటకు లేఖనములను ఆధారముగా చూపిస్తూ "ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH) తండ్రి మాత్రమే" అని తెలుపుటయే ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది. 


ఆరాధన యొక్క నిర్వచనం :

యెహోవా మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మహోన్నతుని ఆదేశాల ప్రకారము క్రమబద్ధమైన విధానములో జరిగించేది ఆరాధన అనబడుతుంది". (2 దినవృత్తా. 29:20-30 పోల్చి చూడుము).


1️⃣.  పితరుల కాలం :

ఆరాధన అనే ఆలోచన మనిషి యొక్క ఆలోచనలు నుండి పుట్టలేదు. దేవుడైన యెహోవాయే దీనిని స్వయంగా స్థాపించాడు. ఆదాము నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు మనుష్యులు ఆరాధించిన దైవం ఒక్కడే ఆయనే యెహోవా.


👤ఆదాము :  "చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని,... " (ఆది.కాం. 3:8). ఆదాము మరియు అతని భార్య యెహోవాతో సంప్రదింపులు/ అంత గొప్ప సహవాసం కలిగి ఉండేవారు. ఆరాధన అనే పదం అక్షరార్ధముగా లేకపోయినప్పటికి ఆదాము తన దేవుడికి లోబడే స్థితి, స్వభావం, సహవాసం మరియు  క్రమశిక్షణను  బట్టి నిర్ణయించుకోగలం. వారికి బాగుగా తెలుసు తమ సృష్టికర్త ఎవరో, తమ దేవుడు ఎవరో, తమ ఆరాధ్య దైవం ఎవరో అనే సంగతులు. మరి ముఖ్యముగా దేవుడే ఆదాముకు బలిపద్దతి నేర్పించాడు. ఆదాము తాను స్వయముగా దేవునికి బలి అర్పించినట్టుగా గ్రంథములో వ్రాయబడనప్పటికీ తన బిడ్డలైన హేబెలు & కయీను దేవునికి బలి అర్పించారు.


👤 హేబెలు & కయీను : హేబేలు కయీను లు తమ దేవుడైన యెహోవాకు తమ అర్పణలు అర్పించిన ఆరాధికులే. అయితే హృదయపూర్వకంగా అర్పించిన హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు అయితే యదార్థమైన హృదయముతో కాక తనకు నచ్చినట్టుగా అర్పించిన అర్పణ దేవుడు లక్ష్యపెట్టలేదు .... ఆదాము కుమారులైన హేబేలు కయీను  దేవుని ఆరాధన చేశారు అని చెప్పుటకు వారు అర్పించిన అర్పణలే నిదర్శనం... (తండ్రి నేర్పించకుండా బిడ్డలకు ఏలాగున తెలియును!?). 

 "హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను;౹" (ఆది.కాం. 4:4). 

"కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.౹" (ఆది.కాం. 4:3). 


👤ఎనోషు : "...షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది." (ఆది.కాం. 4:26)


👤నోవాహు : తనను జల ప్రళయము నుండి కాపాడిన దేవునికి  పవిత్రమైన వాటిని దహనబలిగా అర్పించుట ద్వారా నోవాహు  దేవున్ని ఆరాధించెను. అతను అర్పించినది దేవునికి అంగీకారమైనది. 

"అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.౹ అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి– ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹" (ఆది.కాం. 8:20-21)


ఇలా చూస్తుపోతే దేవున్ని ఆరాధించిన పితరుల జాబితాలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు  కూడా ఉన్నారు. ఈ ముగ్గురు యెహోవా పేరిట బలిపీఠములు కట్టారు. తమను నడిపించిన దేవునికి ప్రార్థన చేశారు. తమ దేవుడైన యెహోవానే  ఆరాధించారు.


👤అబ్రహాము : "యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి— నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.౹ అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹" (ఆది.కాం. 12:7-8) "నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.౹" (ఆది.కాం. 24:4)


👤ఇస్సాకు : "అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై– నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.౹ అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.౹" (ఆది.కాం. 26:23-25)


👤యాకోబు : "దేవుడు యాకోబుతో– నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటనుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన యింటివారితోను తనయొద్దనున్న వారందరితోను– మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమదినమున నా కుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.౹ వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.౹ వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.౹ యాకోబును అతనితోనున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.౹ అతడు తన సహోదరుని యెదుటనుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరుపెట్టిరి.౹" (ఆది.కాం.35:1-7). "విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.౹" (హెబ్రీ. 11:21). 


"మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా అని..."(నిర్గమ. 3:15) చెప్పినమాట మీరు చదువలేదా? పితరుల కాలం దేవుడు తన్ను తాను ఇలా కనపరుచుకొనెను కదా.



2️⃣. ధర్మశాస్త్రము/మోషే కాలం :

పితరుల కాలంలో  అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తాను సర్వశక్తిగల దేవుడనని పరిచయం చేసుకున్న దేవుడు  మోషేతో తన నామమును "నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని" పరిచయం చేసుకొనెను. (నిర్గమ. 3:14) "నేను యెహోవాను…(YHWH)". 

"నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.౹" (నిర్గమ. 6:3).


ఇశ్రాయేలీయులు తమది కానీ  ఐగుప్తు దేశములో 4౦౦ సం. పైబడి  బానిసలుగా నున్న(నిర్గమ. 12:40-41) పిమ్మట దేవుడు  మోషేకు నాయకత్వ బాధ్యతను అప్పగించి  వారిని  ఫరో బానిసత్వం నుండి విడిపించి, ఎర్ర సముద్రం గుండా నడిపించి, సీనాయి పర్వతము యొద్దకు చేరిన  తరువాత ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనలో ముఖ్యమైన ఆజ్ఞను వారికి జారీ  ఏమనగా… "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.౹" (నిర్గమ. 20:3-4).

అప్పటినుండి వారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేస్తూ వచ్చారు.,,


✅ యూదులు/ఇశ్రాయేలీయుల  యొక్క ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH).

🔖 "ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.౹ నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.౹" "నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.౹" (ద్వితీయో. 6:4-5; 10:20)


🔖 "యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.౹" (యెహోషువ. 24:15)


🔖యెహోవాను ఆరాధించు స్థలమొకటి….(2సమూ. 15:32)

🔖యెహోవాను ఆరాధించి స్తుతించిరి. (2దిన. 7:3)

🔖యెహోవాకు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి (2దినవృత్తాంతములు. 29:25-30)

🔖యెహోవా మందిరములో ఆరాధించుటకై (యిర్మియా. 26:1-2)

🔖యెహోవాకు ఆరాధన చేయవలెను (యెహెజ్కేలు. 46:3). 

🔖"...  యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు...." (యోహాను. 4:21)


✅ సమరయులు యొక్క ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH).

సమరయులు కూడా ధర్మశాస్త్ర కాలానికి చెందినవారే. యూదులు యెరూషలేము దేవాలయములో యెహోవా దేవున్ని ఆరాధిస్తే... సమరయులు ఏమో గెరిజిమ్ అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ యెహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. మోషే గారు వ్రాసిన పంచకాండాలు(5 పుస్తకాలు) మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఇందులో నిర్గమ.కాం. 20:17 వచనము తమకు అనుగుణముగా మార్చుకొని గెరిజిమ్ పర్వతం మీద యెహోవా దేవున్ని(తండ్రిని) ఆరాధించేవారు. 


యేసుకు మరియు సమరయ స్త్రీకి మధ్య జరిగిన  సంభాషణలో సమరయులు కూడా యెహోవా దేవున్నే ఆరాధిస్తారనే విషయం  స్పష్టమైనది .  

"మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹" (యోహాను. 4:20-21).


ధర్మశాస్త్ర కాలములో ప్రజలచేత ఆరాధింపబడిన ఏకైక  దేవుడు యెహోవా (𝐘𝐇𝐖𝐇) మాత్రమే. 



3️⃣.  క్రీస్తు లేదా క్రైస్తవుల కాలం :

ఆనాడు పితరుల  కాలములో నూ, ధర్మశాస్త్ర కాలములోనూ భక్తులచేత/విస్వాసులచేత ఆరాధింపబడిన ఆ యెహోవా దేవుడే, నేడు క్రైస్తవులచేత కూడా  ఆరాధింపబడుటకు పాత్రుడు అని యేసు బోధించాడు. యేసు శరీరధారిగా ఉన్న దినాలలో బోధించిన బోధ నీటి క్రస్తావులకు ప్రామాణికంగా ఉండాలి. యేసు, తాను తండ్రికి ప్రార్థన  చేసాడు మనలను కూడా తండ్రికి ప్రార్థించమని చెప్పాడు. తాను తండ్రికి విధేయత చూపాడు మనలను కూడా తండ్రికి విధేయత చూపమని మనకు మాదిరిని ఉంచాడు. తాను తండ్రిని ఆరాధించాడు మనలను కూడా తండ్రికి ఆరాధన చేయమని, తండ్రికి ఆరాధన చేయువారినే తండ్రి వెదుకుతున్నాడని హెచ్చరించాడు. 


"యేసు వానితో– సాతానా, పొమ్ము — ప్రభు వైన నీ దేవునికి(YHWH) మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను." (మత్తయి. 4:10). పరిశుద్ధుడవైన తండ్రీ,(యోహాను 17:11) నీతి స్వరూపుడవగు తండ్రీ, (యోహాను. 17:25) ఆయన పరిశుద్ధ నామముతోనే ప్రార్థన చేశారు.


"మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹" (యోహాను. 4:22) [ మేము] అనే మాటలో తాను (యేసు) కూడా ఉన్నాడనే సంగతి తెలియడం లేదా? ఇంకా అర్థము కానిచో  యేసు తండ్రిని ఆరాధించాదనుటకు క్రింది లేఖనములే ఋజువులు…


🔖 8వ దినమున/సున్నతి పొందుటకు - లూకా. 2:27-28

🔖 12వ ఏటా - లూకా. 2:41-42

🔖 30వ ఏటా - యోహాను. 2:13,23

🔖 31వ ఏటా - యోహాను. 6:4; 7:2,8- 14; 10:22

🔖 32వ ఏటా - యోహాను. 11:55-56; 12:1-20; 

🔖 33వ ఏటా - మత్తయి. 26:17-20; యోహాను. 19:14; లూకా. 22:1


"ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను, వారములపండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.౹" (ద్వితీయో. 16:16).


✅  సంఘము తో కలసి తండ్రిని ఆరాధించుటలో

తండ్రిచేత ప్రభువుగాను, క్రీస్తుగాను నియమింపబడిన యేసు నేడు తన సంఘముతో (శరీరముతో) కలిసి తండ్రిని ఆరాధిస్తాడు.  

"పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక –నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు –నే నాయనను నమ్ముకొనియుందును అనియు –ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.౹" (హెబ్రీ. 2:11).


✅ క్రైస్తవుల ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే తండ్రి 

ఎవరైతే   యేసును తమ  నోటితో ప్రభువుగా(రాజుగా) ఒప్పుకొని, దేవుడు(YHWH) మృతులలోనుండి యేసును లేపెనని తమ  హృదయమందు విశ్వసిస్తారో వారు  రక్షింపబడుదురు. (రోమా. 10:9; ఫిలిప్పీ. 2:11). ఇలా నోటితో ఒప్పుకొని, బాప్తీస్మం పొంది, క్రీస్తు సంఘముగా చేర్చబడి, ప్రభువైన యేసుక్రీస్తు ఏలుబడి క్రింద ఉంటూ, యేసు బోధను అనుసరిస్తూ, యేసును దేవుని కుమారుడిగా, క్రీస్తుగా, ప్రభువుగా గౌరవించి, యేసు ద్వారా తండ్రిని ఆరాధించి , ప్రార్థన చేసి , భక్తి, విధేయత చూపి, అపోస్తులల బోధలో తమ జీవితాలను సరిచేసుకొంటూ, విశ్వాస యాత్రలో వెనుదిరుగక తమ జీవితాలను  కొనసాగించేవారే క్రైస్తవులుగా పిలువబడుతారు .(అపో. కార్య. 2:36-42; 8:37; 9:20; 10:36; 47, 1కోరింది 1:2; 12:3; రోమా 16:16; 2 దేస్స. 2:15). 


ఇట్టి వారందరికి అనగా క్రైస్తవులకు దేవుడు  ఒక్కడే ఆయనే తండ్రి (1 కోరింది. 8:6). ఆ ఒక్క దేవుడే అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. (ఎపేసి. 4:6). ఆ ఒక్క దేవుడికే క్రైస్తవులు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలనేది ప్రభువైన యేసు యొక్క అజ్ఞా. (యోహాను. 4:21-24) ఆ ఒక్క దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధన మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, పరిశుద్ధాత్మ వలన ఆరాధించాలనేది క్రొత్త నిబంధన స్పష్టత ఇస్తుంది. (కొలస్సి. 3:17; ఎపేసి. 2:18; ఫిలిప్పీ. 2:11; 3:3). 


🔎 Note : మనకు/అందరికి దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే 👤 అని అర్ధం. ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని లేదా నలుగురిని 👥 పెట్టడం పూర్తిగా వాక్య వక్రీకరణ అగును కదా.. ఆలోచించుకో… 


📌 ముగింపు

ఓ చదువరి… అన్ని కాలాల్లో ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH) తండ్రి మాత్రమే అనే సంగతి గట్టిగా గుర్తించుము. ఆ యెహోవాయే మన దేవుడు ఆయన ఒక్కడే అనగా అద్వితీయుడు. (ద్వితీయో. 6:4; మార్కు 12:29; యోహాను.17:3) క్రొత్త నిబంధన ప్రకారం ఆయనే అందరికి తండ్రియైన దేవుడు. (ఎపేసి. 4:6). యేసు మాటల్లో దేవుడొక్కడే(లూకా. 18:19) యెహోవాను(తండ్రిని) మాత్రమే ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుము(యోహాను. 4:24). 


🔥 యేసుక్రీస్తుని  కూడా ఆరాధన చేస్తాము/చేయచ్చు   అని  తలస్తున్నవారికి ఒక ప్రశ్న, సంఘముతో అనగా  తన శరీరముతో కలిసి తండ్రిని ఆరాధన చేసే యేసుక్రీస్తు తనని తాను ఏలాగు ఆరాధించుకుంటాడు? అలా ఆరాధించాడు అనుటకు ఋజువులు ఏమిటి? ఆలోచన చేయండి 🙏 

మీ ఆత్మీయులు 👪


▼ మరెన్ని అంశాలు కొరకు ▼

↪  ఆరాధన కోరిన దేవుడు ఎవరు?క్లిక్ చేయు

↪ దేవుడు ఒక్కడే అంటే ఎవరికి?క్లిక్ చేయు

↪ యేసు ఆరాధింపబడ్డారా?క్లిక్ చేయు

↪ యేసు తన్ను సేవించమనే కోరారు క్లిక్ చేయు

↪ యెహోవా దేవుడే యేసుగా వచ్చారా?క్లిక్ చేయు

↪ ఆరాధనలో యేసు యొక్క పని?క్లిక్ చేయు

అయోగ్యముగా అంటేనేమో!? (Unworthily)

                          


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻 


మానవుడి భూ జీవితకాలం ఒక యాత్ర జీవితమే. "మేము ఇక్కడ పరదేశులము, యాత్రికులమే” (హెబ్రీయులు 11:13). నీ దృష్టిలో మన జీవము నీడవంటి యాత్ర.  (కీర్తనలు 39:12). ఈయాత్ర యొక్క తుది గమ్యములోపు దేవుని సన్నిధి, అంటే నిత్యజీవమై ఉండాలి.  (యోహాను 17:3). కానీ ప్రతి యాత్రికుడు ఆ గమ్యానికి చేరతాడా? లేదా? ప్రతి విశ్వాసి పరలోకమునకు యోగ్యుడా? కాదా? చనిపోయిన తర్వాత నా పరిస్థితి? నా యాత్ర జీవితం సరిగ్గా ముగించనున్నాన, లేదా? మరియు నా భక్తి, ప్రేమ, ఆరాధన, సమాధానం, ఐక్యత, విధేయత, మాటతీరు, ప్రవర్తన, విశ్వాసం, బోధ, కానుక, మాదిరికరమైన జీవితం..etc. ఇట్టి ప్రశ్నలను మనం ఈ యాత్ర కాలములోనే ఎవరికి వారు పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది కదా!


“యెహోవా పర్వతమునకు ఎవడు ఎక్కును? ఆయన పరిశుద్ధస్థలమున నిలుచునది ఎవడు?” (కీర్తనలు 24:3)


ఈ ప్రశ్న మన ఆత్మకు సవాల్ చేస్తుంది. దేవుని సన్నిధిలో నిలబడటానికి శరీరపరమైన శక్తి కాదు, ఆత్మపరమైన శుద్ధత, విధేయత, నీతి, ప్రేమ, మాదిరి మరియు విశ్వాసం అవసరం.


శుద్ధహస్తులును పరిశుద్ధహృదయులును, మోసములో తలపెట్టనివారే యెహోవా పర్వతమునకు ఎక్కుదురు. (కీర్తనలు 24:4)


పరమదేవుడు మనలో పరిశుద్ధతను కోరుతున్నాడు. అయితే, మన ఆత్మలో ఉన్న “లోపాలు” — ప్రేమలో, విశ్వాసంలో, ప్రార్థనలో, నడవడిలో, బోధలో… ఇవి మనలను ఖచ్చితంగా దేవుని సన్నిధి నుండి దూరం చేస్తాయి అనుటకు ఎటువంటి సందేహం లేదు.  ఈ లోపాలే మన ఆత్మీయ అయోగ్యతకు కారణం. దేవుడు మనలను త్రోసివేయడం ఆయన సంకల్పం కాదు. ఇందుకే నీకు ఇవ్వబడిన సంవత్సరాలు, నెలలు, దినాలు, సమయం, అనేది మనలోని లోపాలను సరిచేసుకోవడానికి ఇవ్వబడుతున్నాయి కానీ వాటిని నీకు నచ్చిన విధముగా ఉపయోగించుకొని ఆయన కృపను త్రోసి పుచ్చడానికి అయితే కాదు. అలా చేస్తే శాశ్వతముగా ఆయన కృపను కోల్పోతాము.


“నేడు అనబడుచున్నప్పుడు మీ హృదయములను కఠినపరచకుడి.” (హెబ్రీయులు 3:15)


దేవుడు “నేడు” అనే అవకాశాన్ని మనకు ఇచ్చాడు అనేది గుర్తిస్తే మనలోని ప్రతి లోపాన్ని సరిచేసుకొని, ఆయన వాక్య ప్రకారం పరిపూర్ణత వైపుగా నడవమని పిలుస్తున్నాడు అనే సంగతి కూడా గమనించు.  కావున ఈ అంశము ద్వారా మనం మనలోని ఆత్మీయ లోపాలను పరిశీలించి, తెలుసుకొని, వాటిని దేవుని కృపతో ఎలా సరిచేసుకోవాలో అనునదే ఈ అంశము యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ పరిశీలన మన జీవితాన్ని క్రీస్తు ప్రత్యక్షత కొరకు సిద్ధం చేయటానికి సహాయపడుతుంది. ఎందుకంటే పరలోకం పరిశుద్ధులకు సిద్ధమై ఉంది, లోపము లేనివారికే అక్కడ స్థానం కలదు అని ఎన్నటికి మరవకు సుమీ!


✅ మనలో ఉండే ఆత్మీయ లోపాలు ✅


1 ప్రేమలో లోపము :

"దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.౹" - (1 యోహాను 4:8)


ప్రేమ దేవుని యొక్క స్వరూపం. ప్రేమలేని విశ్వాసి ఆత్మికంగా ఎదగలేడు. దేవుడు మనలను ఆయన ప్రేమతో నింపి, ఆ ప్రేమను ఇతరులకు చూపమని కోరుతున్నాడు. ప్రేమ లేకపోతే మనం నిరర్థకం (1 కొరింథీయులు 13:2).


2విశ్వాసములో లోపము :

"విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము (హెబ్రీయులు 11:6)


విశ్వాసం అనేది దేవుని వాక్యముపై సంపూర్ణ నమ్మకం. సందేహం పాపానికి ద్వారం. విశ్వాసం అంటే అంధంగా నడవడం కాదు, దేవుని స్వభావాన్ని బట్టి నడవడం. ఆయన విశ్వాసయోగ్యుడు అని తెలిసి, మనము నిశ్చయముగా ఆయనపై ఆధారపడటం.  క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలనే విశ్వాసం (రోమా. 10:17)


3 బోధలో లోపము :

“నీకు అప్పగించబడిన సత్యవాక్యమును నమ్మకముగా బోధించుము.” — (2 తిమోతికి 2:2)


అపోస్తలుల బోధ లేకపోతే సంఘం బలహీనమవుతుంది. సంఘము అట్టి ఆదిమ బోధలోనే నిలవాలి కానీ మనుషులు ఊహలు, అభిప్రాయాలు, వాక్య వ్యతిరేకమైన పద్ధతులలో కాదు. కావున వినే వాక్యం పరీక్ష చేయు (అపో.కార్య. 17:11) బోధకుడును పరీక్ష చేయు (1 యోహాను 4:1) లేనిచో నష్టపోయేది నీవే… సత్యము మాత్రమే మనలను విమోచిస్తుంది అని గ్రహించు.. (యోహాను 8:32).


4 ఆతిథ్యంలో లోపము :

"పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.౹" (రోమా 12:13)


దేవుడు మనల్ని పరలోక ఆతిథ్యానికి సిద్ధం చేస్తున్నాడు. మనం ఇతరులకు ప్రేమతో ఆతిథ్యము చూపునప్పుడు, దేవుని స్వభావాన్ని ప్రతిబించగలం. "సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.౹" (హెబ్రీయులు 13:2).


5 ప్రవర్తనలో లోపము :

మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి - (ఫిలిప్పీయులు 1:27)


మీ ప్రవర్తన పరలోక పౌరులవలె ఉండవలెను. ప్రవర్తనలో అసత్యం లేదా అసభ్యత ఉన్నచోట క్రీస్తుతో సహవాసం ఉండదు. మన నడవడి మన విశ్వాసానికి అద్దం. మన ప్రవర్తన ద్వారానే దేవుని మహిమను చూపాలి. "మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి." (మత్తయి 5:16).


6 ఆలోచనలలో లోపము :

మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి." (రోమా 12:2)


లోపభూయిష్టమైన ఆలోచనలు పాపానికి పునాది. దేవుని వాక్యముతో మన మనస్సు శుద్ధి చెయ్యబడాలి. పరిశుద్ధ ఆలోచనలే పరిశుద్ధ జీవితానికి మూలం.


7 తలంపులలో లోపము :

“ప్రతి ఆలోచనను క్రీస్తుకు విధేయమైనదిగా బంధించు.” (2 కొరింథీయులు 10:5)


మన తలంపులు దేవునికి విధేయమై ఉండాలి. స్వార్థం, అసూయ, కోపం, గర్వం వంటి తలంపులు మన ఆత్మీయతను నాశనం చేస్తాయి. కావున మనలోని తలంపులను మనం మార్చాలి.


8 ప్రార్థనలో లోపము :

“నిరంతరము ప్రార్థన చేయుడి.” — (1 థెస్సలొనీకయులు 5:17)


ప్రార్థన లేకపోతే విశ్వాసి బలహీనుడవుతాడు. ప్రార్థన అనేది దేవునితో నిత్యసంబంధం. మానవ శ్వాసలాగే అది ఆత్మిక జీవనానికి అవసరం. ప్రార్థన లేని జీవితం ఆత్మీయ మరణమే.


9 నమ్మటంలో లోపము :

“మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూడెదరని నేను చెప్పలేదా?” (యోహాను 11:40)


దేవుని వాక్యమును నమ్మకపోవడం ఆయనను అవమానించడమే. నమ్మకము కలిగిన హృదయం అద్భుతాలను చూస్తుంది; అవిశ్వాసం మాత్రం మనలను వెనక్కి లాగుతుంది. భయం మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, కానీ నమ్మకం మనలను నిలబెడుతుంది. భయపడకుము, నేను నీతో ఉన్నాను.” (యెషయా 41:10)


10 వినుటలో లోపము :

"నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.” — (యాకోబు 1:19)


దేవుని స్వరము మృదువుగా ఉంటుంది. మనం వినలేకపోతే ఆయన గూర్చిన సత్యం తెలిసేది కాదు. “జ్ఞానవంతుడు విని మరింత జ్ఞానమును పొందును.” (సామెతలు. 1:5) వినుట అంటే కేవలం వినిపించడం కాదు — వాక్యమును ఆచరించడమే (యాకోబు 1:22). 


⃝ వినడం = జ్ఞానం పొందుట

⃝ మాటలను నియంత్రించడం = పరిణతి గుర్తు

⃝ కోపాన్ని అదుపులో ఉంచడం = ఆత్మపరిపూర్ణత


ఈ మూడు లక్షణాలు కలిసినపుడు, మనం యేసు స్వభావాన్ని ప్రతిబింబిస్తాము.


11.  సిద్ధపడుటలో లోపము :

“మీరు సిద్ధముగా ఉండుడి; మానవ కుమారుడు మీరు ఊహించని సమయమున వచ్చును.” — (మత్తయి 24:44)


క్రీస్తు రాకడ ఆకస్మికం. విశ్వాసి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి — పాపమును విడిచి, పవిత్రతలో నిలిచి, సేవలో నిమగ్నమై ఉండాలి. సిద్ధబాటు అంటే భౌతిక సిద్ధబాటు కాదు; ఆత్మ, మనస్సు, విశ్వాసంలో సంపూర్ణ సమర్పణ. ఆత్మీయ జీవితములో “తరువాత చూద్దాం/ ఆ తరువాత” అనే ఆలోచన చాలా ప్రమాదకరం. ప్రభువు రాకడకు ప్రతీ క్షణం సిద్ధముగా ఉండటం విశ్వాసి యొక్క ముఖ్య లక్షణం.


12 మాటలలో లోపము :

అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై..  — (యాకోబు 3:2)


మాటలు మన హృదయ స్థితిని బయల్పరుస్తాయి. కఠినమైన, వ్యంగ్యమైన, లేదా గుసగుసల మాటలు ఆత్మీయతను దెబ్బతీస్తాయి. విశ్వాసి మాటలు ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించేలా, కృపతో నిండుకొని, సత్యంతో కూడిన, ఆదరణ కలిగించేలా, సమాధాన పరిచేలా, తప్పు కనపడిన చోట సమర్థించేలా కాకుండా ఖండించేలా/హెచ్చరించేలా ఉండాలి. మన్నాలుగును కాపాడుట భక్తి యొక్క సూచన. (యాకోబు 1:26)


13 గౌరవించటంలో లోపము :

"అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి." (1 పేతురు 2:17)


గౌరవం కేవలం పెద్దలకు మాత్రమే కాదు — ప్రతి మనిషికి అనగా దేవుని స్వరూపంలో సృష్టించబడినవారందరికి… ప్రేమ ఉన్నచోట గౌరవం ఉంటుంది. మనం ఇతరులను గౌరవించకపోవడం దేవుని యొక్క స్వరూపమును నిర్లక్ష్యం చేసినట్టే అగును కదా. కులం, స్థితి, జాతి, మతం వంటివి చూపక సహోదరుల యెడల మనం గౌరవం చూపాలి. "సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.౹" (రోమా 12:10) గౌరవం అనేది వినయానికి ప్రతిబింబం.


14 సన్మానించటంలో లోపము :

ఎవనియెడల సన్మాన ముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి..  (రోమా 13:7)


"నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది." (ఎఫేసి. 6:2)


సత్ప్రవర్తన కలవారిని గుర్తించి సన్మానించడం ఆత్మీయ పరిపక్వతకు సూచన. తల్లిదండ్రులను సన్మానించడం అంటే దేవుని నియమాన్ని గౌరవించడం. సన్మానించుట అంటే కేవలం మాటలతో కాదు; కృతజ్ఞత, సేవ, మరియు విధేయతతో చూపుట. అంతేకాని పూల దండలు వేయటం కాదు, కాలు మొక్కడం కాదు. దేవుడు కూడా తన సేవకులను సన్మానిస్తాడు (1 సమూయేలు 2:30).  ఇలా చేయుట వలన మన జీవితం దేవునికి మహిమనిస్తుంది, సమాజానికి సాక్ష్యమవుతుంది.


15 విధేయత చూపటంలో లోపము :

“విధేయత బలులకంటె శ్రేష్ఠము.” — (1 సమూయేలు 15:22)


విధేయత అనేది దేవుని యొక్క స్వభావం. విధేయత లేని హృదయం దేవునికి దూరమవుతుంది. క్రమశిక్షణ కోల్పోయే వారం అవుతాం. విశ్వాసి తన చిత్తాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని చేయాలి. ఇది యేసు చూపిన విధానం "తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్త మైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను." (లూకా 22:42).


16 నీతిని అనుసరించటంలో లోపము :

“ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి.” — (మత్తయి 6:33)


మన ఆత్మీయ ప్రాధాన్యతలు తప్పినప్పుడు నీతి దూరమవుతుంది. దేవుని నీతి అంటే పవిత్రత, సత్యత, న్యాయం, మరియు విశ్వాసం. మనకు కావలసింది మన స్వంత నీతి కాదు, క్రీస్తు ద్వారా లభించే నీతి (ఫిలిప్పీయులకు 3:9). నీతిని వెదకడం అంటే — దేవుని వాక్యమును ఆచరించి జీవించడం. దేవుని వాక్యము ప్రకారం జీవించడం, దైవ చిత్తము యెరిగి సత్యం మరియు సమర్థతలో నడవడం — అదే నీతి. 


17  న్యాయముగా జీవించటములో లోపము :

“న్యాయముగా ప్రవర్తించు, దయను ప్రేమించు, వినయముగా దేవునితో నడుచుకొనుము.” — (మీకా 6:8)


న్యాయము అనగా దేవుని ధర్మసూత్రాల ప్రకారం జీవించడం. మనము ఇతరులను తప్పుడు రీతిలో తీర్పు చేయడం, లాభం కోసం న్యాయం వక్రీకరించడం పాపం. సత్యానికి కట్టుబడి ఉండటం, ఇతరులతో సమానత్వం, నిజాయితీ, మరియు న్యాయం చూపడం. “న్యాయం చేయుడి...” (యెషయా. 1:17) నిజమైన క్రైస్తవుడు పక్షపాతం లేకుండా, నిజాయితీతో నడుస్తాడు.


18 కానుకలలో లోపము :

 “ప్రతి మనిషి తన హృదయంలో నిర్ణయించిన ప్రకారమే ఇవ్వవలెను.” — (2 కొరింథీయులు 9:7)


దేవుడు బలిని కాదు — హృదయాన్ని పరిశీలన చేస్తారు. కృతజ్ఞత లేకుండా, నిస్సారంగా ఇచ్చే కానుక దేవునికి ప్రీతికరము కాదు. మన కానుక మన భక్తిని ప్రతిబింబించాలి. దేవునికి ఇచ్చే మన మనసు మన భక్తిని తెలియజేస్తుంది కృపతో, సంతోషంతో, తమ ప్రేమను కానుక రూపంలో కనపరచడమే కనపరచడమే నిజమైన ప్రేమ మరియు కృతజ్ఞత యొక్క రూపము.


19.  నీ భక్తిలో లోపము :

"భక్తి లాభముగా ఉన్నది.” (1 తిమోతికి 4:8)


భక్తి అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలు కాదు — దేవుని భయముతో జీవించడం. దేవునితో లోతైన సంబంధం. ఇది మనకు శాంతి, జ్ఞానం, మరియు దేవునితో సంబంధాన్ని ఇస్తుంది.  భక్తి లేని జీవితం శాపం. 


20. నీ ఆరాధనలో లోపము

 “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను.” — (యోహాను 4:24)


ఆరాధన బాహ్యరు రూప క్రియా కాకుండా హృదయానికి సంబంధించినదై ఉండాలి. ఆత్మతో అనగా శరీరాన్ని ఆస్పదం చేసుకొనకుండా పరిశుద్ధాత్మతో అని, సత్యముతో అనగా అపోస్తుల బోధతో ఆరాధించుటయే. 

ఆరాధన అంటే కేవలం గీతాలు కాదు; అది హృదయ సమర్పణ. వచన ఆధారములేని లేదా కేవలం ఆచారపరమైన ఆరాధన దేవునికి ఎన్నటికి ప్రీతిపాత్రం కాదు. నీ ఆరాధ్య దైవం ఎవరో నీకు తెలియాలి? ఎక్కడ ఆరాధించాలో? ఎలా ఆరాధించాలో? తెలియని ఆ ఆరాధన సత్యారాధన అనబడదు. 


21.  క్షమించుటలో లోపము :

"మీరు క్షమించనియెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు.” — (మత్తయి 6:15)


క్షమించని హృదయం దేవుని కృపకు అవరోధం. యేసు సిలువమీద కూడా క్షమించాడు. క్షమించడం క్రీస్తు యొక్క స్వభావ లక్షణం క్షమించు వాడు దేవుని స్వాతంత్రాన్ని పొందుతాడు.


22. ప్రేమించుటలో లోపము :

 “దేవుడు ప్రేమాస్వరూపి.” — (1 యోహాను 4:8)


ప్రేమ లేకుండా విశ్వాసం మృతమైపోతుంది. మనం దేవుని ప్రేమను అనుభవించేవారిగా, ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. ప్రేమ లేనివాడు వ్యర్ధుడు, సహోదరిని ప్రేమించలేని వారు కనబడని దేవుని ఎలాగు ప్రేమించును?  


23 సమాధానపడటంలో లోపము :

"సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారు లనబడుదురు." (మత్తయి 5:9)

"శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.౹" (రోమా 12:18) 


వివాదం, విభేదం, అసహనం — ఇవి దేవుని రాజ్య లక్షణాలు కావు. నిజమైన క్రైస్తవుడు శాంతిని/సమాధానమును నిర్మించేవాడు. సమాధానం మనం ఇష్టపడిన వారితో మాత్రమే కాకుండా, ప్రతి మనిషితో కలిగి ఉండాలి. క్రైస్తవుని స్వభావం — అసహనముకాదు, సమాధానమే ఉండాలి. 


24 ఐక్యత కలిగి ఉండటంలో లోపము :

ఒక మనస్సుతోను, ఒక ఆత్మతోను నిలిచి ఉండుడి.” — (ఫిలిప్పీయులు 1:27)


సంఘ ఐక్యతలో దేవుని శక్తి ఉంటుంది. విభజన సాతానుని ఆయుధం; ఐక్యత పవిత్రాత్మ యొక్క కార్యం.(ఎఫేసి. 4:1). విభేదాలు వర్గాలు సంఘాన్ని బలహీన పరుస్తాయి సత్యములో ఐక్యతను కాపాడటం మన పరిశుద్ధతకు సూచన. 


25 మాదిరిగా ఉండటంలో లోపము :

"నాకు మాదిరిగా మీరు ఉండుడి, నేను క్రీస్తుకు మాదిరిగా ఉన్నాను.” (1 కొరింథీయులు 11:1)


ప్రతి విశ్వాసి ఇతరులకు మాదిరిగా ఉండాలి.  మన జీవితం వాక్యమును ప్రతిబింబించాలి మాదిరిగా ఉండటం అంటే కేవలం బోధతో కాదు జీవనశైలితో మనం చూపించాలి. ఇలా చేయుట వలన లోపం లేనివారై మన జీవితం, మాటలు, ప్రవర్తన ద్వారా ఇతరులను క్రీస్తువైపునకు నడిపించేవారం అవుతాము.


✅ ముగింపు :

లోపం అనేది పాపం కన్నా ముందే ఉండే ఒక అంతర్గత దౌర్బల్యం. ఉదాహరణకు : ప్రార్థనలో లోపం అనేది విశ్వాసంలో బలహీనతకు దారి తీస్తుంది. ప్రేమలో లోపం అనేది ద్వేషానికి మారుతుంది. విధేయతలో లోపం అనేది తిరుగుబాటుగా మారుతుంది. ఇట్టి ఈ చిన్న లోపాలు గుర్తించకపోతే, అవి పెద్ద పాపాలకు, చివరికి ఆత్మీయ మరణానికి దారి తీస్తాయి సుమా!! మన లోపాలను మనమే సరిచేయలేము. పరిశుద్ధాత్మ మనలో పని చేయకపోతే, మార్పు సాధ్యం కాదు. అందుకే దేవుని కృప మన ఆత్మీయ పునరుద్ధరణకు మూలాధారం. దేవుడు మన హృదయాన్ని పునరుద్ధరించి, అయోగ్యతను యోగ్యతగా, బలహీనతను బలంగా మార్చగలవాడు. “అతడు మిమ్ములను లోపరహితులుగా నిలుపుటకు శక్తిమంతుడు.” — (యూదా 1:24)


పరలోకం అనేది లోపము లేనివారికి సిద్ధమై ఉంది. …"మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని…" (ఎపేసి. 1:4) కాబట్టి, నేడు మనం మన ఆత్మీయ స్థితి పరిశీలించాలి.


మనలో ఉన్న ప్రేమలో, విశ్వాసంలో, ప్రార్థనలో, విధేయతలో, ఆరాధనలో… — ఏమైనా లోపముందా? ఉంటే, నేడే అది సరిచేసుకొనే సమయం అని గుర్తించుము. 

మీ ఆత్మీయులు👪

The churches of Christ greet you - Roma 16:16