మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
మన ప్రభువైన యేసు మాటలు ప్రకారముగా... 1. ఆరాధన కోరిన దేవుడు తండ్రియైన దేవుడు(యెహోవా) అని, 2. ఈ భూనివాస కాలములో తాను ఎన్నడూ ఆరాధింపబడలేదని, ఆరాధనను కోరలేదని, తానే శరీరధారియైయున్న దినములలో యూదులలో ఒకడుగా తన దేవున్ని ఏటేటా మరియు ఉత్సవ కాలము నందు ఆరాధించారని, అనేక విషయాల్లో మనకు మాదిరి చూపారని వ్రాయబడిన ఇట్టి సత్యాన్ని మీరు స్పష్టముగా చదివి అంగీకరించారని సంతోషిస్తూ ఇలా క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను బట్టి, మీ విషయమై మన తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 🙇♂️🙇♀️
అవును.., ✅ ప్రభువైన యేసు శరీరధారియైయున్న దినములలో ధర్మశాస్త్రం ప్రకారముగా యెహోవా దేవున్ని ఆరాధన చేశారనేది వాస్తవమే... కానీ ఇప్పుడు కాదని, అది అప్పుడని, యూదుడుగా పుట్టాడు కాబట్టే చేశారని, క్రైస్తవులకు మాదిరి చూపుటకై చేశాడని, తనకు తానే చేసుకున్నాడని, ద్విపాత్రాభినయం చేశారని, మరికొంత మంది సత్యాన్ని జీర్ణించుకోలేక యెహోవా దేవుడే శరీరధారియై యేసుగా వచ్చాడని అనగా త్రిత్వము, త్రియేక బోధలు వంటివి...Etc. ఇలాంటి కల్పనాకథలను బోధించే, వినేవారు కూడా నేటి కాలములో లేకపోలేదు. ఇలాంటి వారి బోధలు ఎదుర్కొన్నాము కాబట్టి ఇలా వ్రాసి మీ యెదుట పెడుతున్నాము.
మరల నేడు మనం ఆలోచించిబోయే ముందుగా ప్రభువైన యేసు భూనివాస కాలములో ధర్మశాస్త్రము ప్రకారముగా కాక నేడు కూడా అనగా క్రీస్తు కాలములో/క్రొత్త నిబంధన ప్రకారంగా "మనతో(సంఘముతో/సంఘము మధ్య) కలసి తండ్రిని ఆరాధించుటకు యేసు వస్తారా?" అనే విషయాన్ని గూర్చి ఆలోచన చేయుటకు ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అవును.., క్రొత్త నిబంధన ప్రకారం మనతో(సంఘముతో) కలసి తండ్రియైన దేవున్ని ఆరాధించుటకు యేసు వస్తారనేది బైబిల్ స్పష్టముగా బోధిస్తుంది. కోపగించుకోకు సుమీ!! నీవు అనుకున్నట్టు యేసును నేనేమి తక్కువ చేయుట లేదు. నీవు ఊహించుకొనే విధముగా కూడా ఎక్కువేమీ చేయుట లేదు. ఆదిమ అపోస్తలలు బోధ ఆధారముగానే మాటలాడుచున్నాము అదే మనకు ప్రామాణికం కాబడాలి ఈ విషయమై మేము యేసుకు దేవత్వం లేదనే దుర్బోధకు చెందిన వ్యక్తులము కాము అనే విషయాన్ని గుర్తించుము.
మన ప్రభువైన యేసు తన భూసంబంధమైన పరిచర్యను అంటే మానవాళి కోసం చేసిన త్యాగాన్ని లేదా దేవుని సంకల్పమును లేదా తనకు తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేసి ఆయన్ను మహిమ పరిచినట్టుగా చూడగలం(యోహాను. 17:4). మానవ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను కదా (హెబ్రీయులకు. 1:3). అటు తరువాత దేవుడే సమస్తమును క్రీస్తు పాదములక్రింద ఉంచి, ఆయనను సంఘమునకు శిరస్సుగా దేవుడే నియమించెను కదా. సంఘము అనగా క్రీస్తు శరీరమే(సంఘము)గానే గుర్తించబడిందని తెలుసుకో... "ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.౹ మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.౹ ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది." (ఎఫేసి. 1:20-23). ఇంత గొప్ప స్థాయిలో దేవుని చేత హెచ్చింబడిన క్రీస్తు కూడా తన(క్రీస్తు) శరీరమైన అనగా క్రీస్తు సంఘంతో ఏకమై దేవుని ఆరాధించుటలో పాల్గొంటాడంటే మీరు ఆశ్చర్యపడనక్కరలేదు సుమీ!!
"నా" సంఘమును కట్టుదునునని చెప్పినప్పుడు నా అనే పదం క్రీస్తూనే సూచిస్తుంది కదా(మత్తయి. 16:18). ఆ సంఘము ఆయన శరీరమే(ఎఫేసి. 1:23) క్రీస్తు విభజింపబడలేదుగా? (1 కోరింది. 1:13) శరీరము యొక్కటే(ఎఫేసి. 4:4). విశ్వాసులు క్రీస్తు శరీరములో అవయవములు (1 కోరింది. 12:12-19) సంఘమునకు(శరీరమునకు) శిరస్సు క్రీస్తే కదా(కొలస్సి 1:18). క్రీస్తు సంఘము(రోమా. 16:16). ప్రభువు శరీరమందు లేక సంఘమందు ఆయనతో కలిసికొన్నవారు ఏకాత్మయై యున్నారు (1కొరింథీ. 6:17; 12:13). ఐతే సంఘము యధార్థముగా తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే విషయములో వారితో(సంఘముతో) కలసి యేసు 3 పనులు చేయుటకు వస్తారంట!!
👥 మొదటి పని :
పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే(లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య (లేక, సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును అనెను. (హెబ్రీయులకు 2:11-12)
🍂 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును అనగా సంఘమునకు దేవుని వాక్యం/ అపోస్తలుల బోధను ఉపదేశించుటలో గొప్ప పని కలిగియున్నారు.
🍂 సమాజము మధ్య (లేక, సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును. సంఘము మధ్య నీ(తండ్రి) కీర్తిని అనగా దేవుని యొక్క గొప్పతనం, మహిమ మరియు ఔన్నత్యాన్ని సంఘము మధ్య చాటడమే. ఎలాంటే స్తుతులు, పాటలు లేదా స్తుతియాగం ద్వారా ఆయన గొప్ప పని కలిగియున్నారు.
👥 రెండవ పని :
"ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.౹ ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు." (హెబ్రీ. 7:24-25)
🍂 యేసు యొక్క యాజకత్వము యొక్క ప్రత్యేకతను మరియు ఆయన ద్వారా లభించే రక్షణ యొక్క సంపూర్ణతను గూర్చి ఈ వచనం మాట్లాడుతుంది. ఈ యాజకత్వం శాశ్వతమైనది, ఎందుకంటే ఆయన మరణించలేదు మరియు ఎప్పటికీ జీవిస్తున్నాడు. ఇతర యాజకులు మరణించిన తర్వాత వారి స్థానంలో వేరేవారు వచ్చేవారు, కానీ యేసు యొక్క యాజకత్వం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మన ప్రధాన యాజకుడు దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షాన నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఆయన వారి తరపున దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, వారిని కాపాడుతూ, వారిని ఆశీర్వదించమని వేడుకుంటాడు.
🍃క్రైస్తవులు దేవునికి మరియు క్రీస్తుకు యాజకులని బైబిల్ సెలవు ఇస్తుంది.(ప్రకటన. 20:6) క్రీస్తే తన స్వరక్తమిచ్చి మనలను దేవునికొరకు కొని యాజకులుగాను చేశారు(ప్రకటన. 1:6; 5:10) యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండాలని(1 పేతురు. 2:5) రాజులైన యాజకసమూహముగా (1 పేతురు. 2:9)
🍂మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. "ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము." (హెబ్రీయులకు. 4:14) "దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు" (హెబ్రీయులకు. 10:21) "పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(హెబ్రీయులకు 7:26). "యేసు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.౹" (హెబ్రీయులకు. 7:24) "మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేప్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణములేకుండ యాజకులగుదురు గాని యీయన –నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపపడడు అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. (హెబ్రీయులకు 7:20)
🍃 పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు ఆరాధనకు అర్హుడు కాదు. అతన్ని మనం ఆరాధించకూడదు. ప్రధాన యాజకుడుతో కలసి యాజకులు యెహోవా దేవున్ని ఆరాధించేవారు. అటు దేవునికి మరియు ప్రజలకు మధ్య మధ్యవర్తిగా పనిచేశాడు, దైవ పరమైన విషయాలలో వారి ప్రతినిధిగా వ్యవహరించాడు. ప్రధాన యాజకుడి ద్వారా, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సంప్రదించి, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మరియు దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి బలులు మరియు కానుకలు అర్పించేవారు. (నిర్గమ. 25 నుండి 40 అధ్యాయములు).
అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా,౹ మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.౹ ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,౹ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును.౹ … పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేప్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను.౹ అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింప లేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.౹ అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.౹ అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను. (హెబ్రీయులకు 9:11-14,23-26)
🍃మనం మన ప్రధాన యాజకుడును ఆరాధన చెయ్యకూడదు. యేసు తనను ఆరాధించమని ఎప్పుడూ ఎన్నడూ మనలను కోరలేదు. మన ప్రధాన యాజకుడు మనతో(రాజైన యాజక సమూహము/ సంఘము) కలిసే తండ్రియైన దేవునికి ఆరాధన చేయు పని కలిగియున్నారనే సంగతి గుర్తించుకోవాలి.
👥 మూడోవ పని :
"మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? —మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?౹ మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.౹ శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?౹ ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?౹ లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.౹ మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.౹ ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?"(1 కోరింది. 10:16-22)
☑ బల్ల ≈ ప్రభువుది
☑ రొట్టె ≈ ప్రభువుది
☑ పాత్ర ≈ ప్రభువుది
☑ రాజ్యము(రాజ్య పౌరులు/క్రీస్తు సంఘము) ≈ ప్రభువునకు చెందిన వారు
🍃మన తండ్రియైన దేవున్ని యథార్థముగా ఆరాధన చేయి క్రమంలో మన ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఆయన బల్ల యెదుట నిలువుట సాధ్యమేనా? మన ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఆయన రొట్టె విరుచుట మరియు ఆయన పాత్రలోనిది త్రాగుట రాజ్యపౌరులకు సాధ్యమేనా? ప్రభువు భోజన బల్ల యొద్ద మనతో సహవాసం కొరకు, మనం ఆయనతో పాలివారమౌగుటకై తండ్రిని ఆరాధించుటకు వస్తాడు. ఇలా క్రీస్తుకు మనకు గల రక్తసంబంధం. (అపో.కార్య. 20:28; ప్రకటన 5:9) క్రీస్తు బలి, విశ్వాసులకు దేవునితో ఐక్యతను కలిగించే ఒక మార్గం. విశ్వాసులు క్రీస్తులో పాలివారై, ఆయనతో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇట్టి కార్యక్రమాన్ని క్రీస్తు శరీరములో సాటియైన అవయవాలమై ఉండుటకు చేస్తున్నాం కదా. రాజ్య సంబంధమైన భోజనం చేయువారు ప్రభువునకు అతిథులు. యేసు తనవారితో సహవాసం చేసి దేవున్ని ఆరాధించుటకు గొప్ప పని కలిగి ఉన్నారు.
🔎 సారాంశము :
ఓ చదువరి... మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారియైయున్న దినములలో(ధర్మశాస్త్రం కాలం) మాత్రమే కాదు నేడు కూడా అనగా క్రీస్తు కాలంలో కూడా తన తండ్రిని ఆరాధన చేయుటకు సంఘము మధ్యకు వస్తారనేది బైబిల్ యొక్క సందేశమని గుర్తించుము. తండ్రి కీర్తిని గానం చేయుటకు, అపోస్తలుల బోధను ఉపదేశించుటకు, ఒక ప్రధాన యాజకుడుగా తండ్రిని ఆరాధిస్తూ, యధార్థముగా ఆరాధించుటకు వచ్చిన వారియెడల విజ్ఞాపన చేయుటకు, భోజన బల్ల యొద్ద మనతో సహవాసం కొరకు వస్తారని తెలుసుకొనగలరు.
👤 తండ్రిని ఆరాధించాలనేది. తండ్రి యొక్క కోరిక - (యోహాను. 4:23-24)
👤 యేసును సేవించాలనేది. యేసు యొక్క కోరిక. (యోహాను. 12:26)
🔎మనతో కలిసి తండ్రిని ఆరాధించడానికి యేసు వస్తాడనే సత్యాన్ని నీకు నమ్మే మనస్సు ఉంటే అంగీకరించుము. 🙏🏿
♨️ హెచ్చరిక :
ఇంత చెప్పిన మరల క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసే అనే అపోహ ఇంకా ఉంటే.... క్రీస్తు శరీరం అనగా క్రీస్తు సంఘం తనను తాను ఆరాధించుకోదు తనకి(క్రీస్తు) శిరస్సు అయిన దేవుని(తండ్రి) మాత్రమే ఆరాధిస్తుంది (ఎఫేసి. 1:23; కొలస్సి 1:18; 1 కోరింది. 11:3; 12:13; హెబ్రీ. 2:11; రోమా. 16:16; యోహాను. 4:21-24).
మీ ఆత్మీయులు 👸👫👸
1. యేసు ఆరాధింపబడ్డారా? లేక ఆరాధన చేశారా? Click Here
2. ప్రభురాత్రి భోజనము Click Here
3. ఆరాధన కోరిన దేవుడు? Click Here
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com