ప్రపంచమంతా అనేకమంది వివిధ రకాల దేవతలను పూజిస్తున్నా, వివిధ రకాల విశ్వాశాలు కలిగియున్న, వివిధ భక్తి జీవితాలు కలిగియున్నప్పటికి … మొదటగా సమస్త మానవజాతికి, సర్వసృష్టికి, సమస్త దేవతలకు, యూదులకు, అన్యులకు, క్రైస్తవులకు మరియు చివరిగా మన ప్రభువైన యేసునకు కూడా దేవుడు ఒక్కడేనని సత్యాన్ని స్పష్టంగా తెలియజేసిన ఏకైక పరిశుద్ధ గ్రంథమే బైబిల్ ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇందుకు ఈ క్రింది విషయాలు దీనిని నిర్ధారిస్తున్నాయి. 👇
Ⅰ. సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే :
బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏమిటంటే — దేవుడు సర్వసృష్టికి దేవుడు. ఆయనను ఒక జాతికి, మతానికి, లేదా వర్గానికి అంటూ పరిమితం చేయలేము.(యెషయా 45:2) ఆకాశం, భూమి, సముద్రం — అన్నింటిని సృష్టించిన దేవుడు ఒకడే. ఆయన ప్రతి మనిషికి జీవం, శ్వాస, జ్ఞానం ఇచ్చుచున్నాడు. (అపో.కార్యములు 17:24-25). “నేనే మొదటివాడను, నేనే చివరివాడను” అంటే — దేవుడు సమయానికి అతీతుడు, సృష్టికి పునాది, అంతిమ గమ్యం అన్నమాట. దేవుని ఏకత్వం మరియు సర్వాధికారాన్ని ప్రకటిస్తుంది. (యెషయా 41:6; 44:6) ప్రకృతి, విశ్వం, జీవం — ఇవన్నీ ఆయన ఉనికిని సూచిస్తున్నాయి. దేవుని సృష్టిని చూసిన తర్వాత కూడా ఆయనను అంగీకరించకపోవడం — అది అజ్ఞానం కాదు, నిర్లక్ష్యం. దేవుడు ఒక్కడే సృష్టికర్త. సర్వసృష్టికి ఆయన శక్తిని, దైవత్వాన్ని సాక్షిగా చూపుతుంది. (రోమా. 1:19-20)
Ⅱ. సర్వ జీవులకు దేవుడు ఒక్కడే :
యెహోవా అందరిమీదా కరుణగలవాడు, ఆయన కృప ఆయన సృష్టులన్నిటిమీద ఉంది. (కీర్తనలు. 145:9) ఆయన దయ సృష్టిలోని ప్రతి జీవిపై ఉంది. హన్నా తన ప్రార్థనలో చెబుతుంది — జీవమూ, మరణమూ దేవుని చేతుల్లోనే ఉన్నాయని. (1 సమూయేలు. 2:6) సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి; తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.” (కీర్తనలు 145:15).
Ⅲ. సమస్త దేవతలకు దేవుడు ఒక్కడే
“నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును.” (దానియేలు 2:47) …వెండి బంగారములతోను, ఇత్తడి ఇనుము కలప రాతి విగ్రహములతోను —అవి చూడవు, వినవు, గ్రహింపవు — వాటిని స్తుతించితివి; అయితే నీ ప్రాణమును నీ చేతిలో ఉంచిన దేవునిని నీవు గౌరవింపలేదు. (దానియేలు 5:22-23) మానవులు చేసిన దేవతలకంటే సజీవుడైన యెహోవా మాత్రమే నిజమైన దేవుడు. "ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹" (1 కొరింథీయులు 8:4–7)
Ⅳ. దయ్యములు కూడ దేవుడు ఒక్కడేనని తెలుసును
“దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు; దయ్యములును నమ్మి వణకుచున్నవి.” (యాకోబు 2:19–20)
దేవుడు ఒక్కడే అని నమ్మడం సరైనది — ఇది సత్యం. కానీ కేవలం నమ్మడం మాత్రమే సరిపోదు. ఎందుకంటే దయ్యములు కూడా దేవుని ఉనికిని నమ్ముతాయి, కాని ఆయన నిబంధనను అనుసరించవు. అసలు విశ్వాసం అంటే దేవుని ఉనికిని అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన చిత్తానికి లోబడి, ఆయన వాక్యానుసారం జీవించడం.
Ⅴ. యూదులకు దేవుడు ఒక్కడే :
ఇశ్రాయేలూ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. (ద్వితీయోపదేశకాండము 6:4) మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను. (యెషయా 44:8) యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను–ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును (యిర్మియా 10:10-11) అందుకు యేసు — ప్రధానమైనది ఏదనగా — ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. (మార్కు 12:29)
Ⅵ. అన్యులకు దేవుడు ఒక్కడే :
“దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? కాదు, అన్యజనులకును దేవుడే.” (రోమా 3:29–30)
Ⅶ. క్రైస్తవులకు దేవుడు ఒక్కడే :
“మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు — ఆయన తండ్రి; మరియు మనకు ప్రభువు ఒక్కడే — యేసుక్రీస్తు.” (1 కొరింథీయులు 8:6). అందరికి తండ్రియైన దేవుడు అందరిలోను, అందరిమీదను, అందరిమధ్యలోను ఉన్నాడు (ఎఫెసీయులు 4:6).
Ⅷ. క్రీస్తు ప్రభువుకి దేవుడు ఒక్కడే :
> “నా దేవుడా, నా దేవుడా, నీవు నన్నేల విడనాడితివి?” (కీర్తనలు 22:1)
> "ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము." (మత్తయి 27:46)
> "నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు." (కీర్తనలు 45:7)
> "మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. …" (ఎఫేసి. 1:3)
> "మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. (1 పేతురు 1:3)
> “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నాను.” (యోహాను 20:17)
💣యేసుక్రీస్తుకి దేవుడు — ఆయనే యెహోవా (తండ్రి) — ఒక్కడే దేవుడు — మన దేవుడే! 🙏
🔥 సారాంశం :
ప్రపంచమంతటా ఉన్న సృష్టులకు, జీవులకు, ప్రజలకు, దేవతలకు, దయ్యములకు అలాగే మన ప్రభువైన యేసునకు — అందరికీ ఒకే దేవుడు ఉన్నాడని గుర్తించు. ఆయనే యెహోవా దేవుడు, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనకు తండ్రిగా వ్యక్తమయ్యాడని అంగీకరించు.
✒ "ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను." (యోహాను 1:18)
✒ “అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.” (ఎఫెసీయులు 4:6)
మీ ఆత్మీయులు 👪👧
🌿 యేసు యొక్క దేవత్వము?క్లిక్ చేయు
🍂 యేసు యొక్క దేవుడు ఎవరు?క్లిక్ చేయు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com