![]() |
తాము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఈ లోకంలో క్రైస్తవులుగా చలామణి అవుతూ ఈ లోక ఆచారాలను పాటిస్తూ దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్న వారి కొరకు రాయబడుతున్న ఈ అంశము వారి జీవితాల్లో మార్పు తీసుకు వస్తాదని తలంచుతూ అంశాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక నమస్కారములు.
ఈ రోజున చాలామంది మేము క్రైస్తవులము కనుక రక్షాబంధన్ చేసుకోవచ్చా? లేదా మేము రాఖీ పండక్కి రాఖీలు కట్టుకోవచ్చా? అని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఒక నిజ క్రైస్తవుడికి ఈ ప్రశ్న రావడం సమంజసమేన, ఇలాంటి ప్రశ్నలు అడగడంలో అర్థం ఉందా...? ఈనాడు క్రైస్తవులను చెప్పుకునేవారు గ్రంధానుసారమైన ప్రశ్నలు తలెత్తడం మానేసి లోకానుసారమైన ఆచారాలు మేము పాటించవచ్చా అని ప్రశ్నించడం ఎంతో బాధాకరం... అయితే వాక్య పరిజ్ఞానం లేని కొందరు సహోదరుల కొరకు ఈ అంశము రాయబడుతుంది.
రక్షాబంధన్ అంటే ఏమిటి? లేక ఈ రక్షాబంధన్ ఎందుకు చేస్తారు? చేస్తే ఉపయోగాలు ఏంటి? ఇలాంటి విషయాలు గురించి ప్రస్తావించడం లేదు. అలాగే ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక వాటి గురించి ప్రత్యేకంగా వ్రాయుటకు పూనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఒక అన్య పండుగని. ఇది ఒక అన్యాచారం అని అందరికి తెలుసు. అయినప్పటికీ ఈ అన్యాచారాన్ని చేయొచ్చా? అని అడుగుతున్నారు కదా దానికి మాత్రం సమాధానం రాయదలుచుకున్నాము.
"నాకు నీవే రక్ష ≈ నీవే నన్ను రక్షించువాడవు" అనే కాన్సెప్ట్ తో క్రైస్తవ వేతరులు ఈ పండుగను జరుపుకుంటారు. అది వారి విశ్వాసం. ప్రపంచంలో యేసుక్రీస్తుని విశ్వసించని వారు అనేకమంది ఉన్నారు. నిజ దేవున్ని అంగీకరించనివారు ఎంతోమంది ఉన్నారు. వారికి చాలా ఆచారాలున్నాయి చాలా నమ్మకాలు ఉన్నాయి. అంతేందుకు పాతనిబంధనలో ఐగుప్తు దేశంలో ఐగుప్తులకి ఉండే ఆచారాలు చాలా విచిత్రంగా ఉండేది. వారు సూర్యుని, కప్పల్ని, నైలు నదిని..etc వంటివి పూజించడం ఇవి వారి నమ్మకాలు. ఇవన్నియు పరమదేవుని ఇష్టానికి భిన్నంగా ఉండేవే. "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.౹" (నిర్గమా. 20:3-4) మరి ఈనాడు మన దేశంలో ఉండే అన్యాచారాలు కూడా దేవునికి భిన్నమైనవే కదా! పరమ దేవునికి వ్యతిరేకమైనవే కదా! అయినప్పటికీ ఈ పండగ మేము చేయొచ్చా? అనే ప్రశ్న నీలో తలెత్తుతుంది అంటే నువ్వు ఇంకా క్రీస్తుని అంగీకరించలేనట్టే... నీవు ఇంకా నిజదేవున్ని ఎరగనట్టే...
అదేంటి మీరు అలా అంటున్నారు... ఒక చిన్న రాఖి కట్టడంలో తప్పేముంది? అదేమైనా పెద్ద పాపమా? అని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఇలా తన మనసులో అనుకునేవారు క్రీస్తుని తమ రక్షకుడుగా అంగీకరించని వారే కదా.
1. వాస్తవానికి నిన్ను రక్షించేవాడు ఎవరు? - క్రీస్తే కదా.
🍂 "ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను." (మత్తయి. 1:21)
🍂 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. (అపో.కార్య. 4:12)
🍂"నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను." (లూకా. 19:10)
🍂 "ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.౹" (యోహాను. 12:47)
🍂"పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధాను డను.౹" (1 తిమోతి. 1:15),
2. నిన్ను నరకం నుండి తప్పించి నిత్యజీవము అనుగ్రహించు వాడు ఎవరు? - క్రీస్తే కదా.
🍃"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹
🍃 "యేసు —నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹"(యోహాను. 3:16; 4:16)
🍃"కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును." (యోహాను. 3:36)
🍃"కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును." (యోహాను. 6:40)
🍃 "ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము." (రోమా. 6:23)
🍃"దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతు లను మీకు వ్రాయుచున్నాను.౹" (1 యోహాను. 5:13)
3. ఎవరు నిన్ను సమస్త పాపముల నుండి దోషముల నుండి కడిగేవాడు ఎవరు? - క్రీస్తే కదా.
🍁మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి–ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹ (యోహాను. 1:29)
🍁 "అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా,౹ మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.౹ ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,౹ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును.౹" (హేబ్రీ. 9:11-14)
🍁 "ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును." (హేబ్రీ. 9:23)
🍁 "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?" (యెషయా. 53:1-8)
🍁"పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.౹" (1 యోహాను. 3:5)
4. సమస్త విధములైన ఆపదల నుండి ఆటంకముల నుండి నిన్ను బయటకు లాగేది ఎవరు? - క్రీస్తే కదా.
🌿"వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యా యములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.౹ యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;౹ ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.౹ అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని.౹ ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.౹" (2 కోరింధి. 11:23-27)
🌿"మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.౹ మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి.౹ మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపెట్టి౹ మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవి ధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.౹" (2 కోరింధి. 10:3-6)
👊ఆ క్రీస్తు నీ రక్షకుడుగా ఉన్నప్పుడు నీవు వేరొకరిని నీకు రక్షకుడిగా పెట్టుకుంటున్నావంటే నువ్వు ఇంకా నీ హృదయంలో క్రీస్తుకి చోటు ఇవ్వలేదని అర్థం ఆలోచించుకో... 🙎 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹" (రోమా. 10:9)
నీవు ఈ భూమి మీదకు రాకముందే... తల్లి గర్భంలో నిర్మింపకముందే... నీ తల్లే ఎవరో? నీ తండ్రి ఎవరు? నీకు తెలియక ముందే నీ కోసము సిలువులో బలి అయ్యి... నీకు రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాలను సిలువులో త్యాగం చేసిన యేసుక్రీస్తుని నీకు రక్షకుడిగా స్వీకరించకుండా వేరొకరిని ఆశ్రయించడం అపవాది కార్యక్రమమే కదా!! అది అపవాది ఆలోచనే కదా. ఆలోచించుకో... 🙎
📖 బైబిల్ దృక్కోణం 📖
అన్య ఆచారాలను వారి పద్ధతులను వారి ఆవిశ్వాసాలు, అవినీతి సంబంధమైనవి కావున వాటిని బైబిల్ ఎప్పుడూ వ్యతిరేకంగానే పరిగణిస్తుంది.
B. అన్యుల ఆచారాలు అభ్యశించవద్దు :
"యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా– అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.౹ జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని. (యిర్మీయా 10:2-5).
C అన్యులు నడుచునట్లు నడవవద్దు :
"కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹ వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.౹ వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి (ఎఫెసీ 4:17-19).
D. అన్యుల ఇష్టాన్ని జరిగించవద్దు :
"మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును (1 పేతురు. 4:3)
E. అన్యుల వలె ప్రార్ధన చేయవద్దు :
మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు (మత్తయి. 6:7)
👤ఓ చదువరి... నీకు రాఖీ కట్టే వారిని ఆటంకపరిచి వారికి నిజమైన రక్షకుడు ఎవరు తెలియజేయాల్సిన బాధ్యత నీకు లేదా... అన్యాచారాలు దైవ విరుద్ధమని అవి లేఖనాలసారమైనవి కావని తెలుసుకోవాలి కదా. చిన్నదే కదా ఈ మాత్రం దానికే మేము పాపం చేసినట్టా చిన్న చిన్న వాటికి దేవుడు శిక్షిస్తాడా ఈ మాత్రం దానికి మేము క్రైస్తవులను కాకుండా పోతామా అని నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు మిత్రమా.. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులని కనాను మార్గం గుండా నడిపించి ఎంతో శ్రమల నుండి వారి చేత శోధింపబడి వారి చేత నిందింపబడి దేవునికి కిస్టుడిగా బ్రతికిన మోషే ఏం చేశాడని కనాను దేశంలో అడుగు పెట్టలేదు? (ద్వితీయో. 32:48-52 చూడుము) దేవుడు చెప్పింది కాకుండా వేరేది చేశాడనే కదా (సంఖ్యాకాండము 20:1-12) మోషే కనాను దేశంలో అడుగుపెట్టకుండానే మృతి చెందాడు. (ద్వితీయో. 34:4-12 చూడుము).
ఆజ్ఞ అతిక్రమమే పాపము(1 యోహాను. 3:4) అని దేవుడు చెప్పాడు. దేవుని దృష్టిలో పాపము చిన్నదా పెద్దదా అని ఉండదు పాపము పాపమే. పాపానికి చిన్న పెద్ద తేడాలు ఉండవు. దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించువాడు పాపము చేసినవాడే, ఆజ్ఞను అతిక్రమించువాడు జీతానికి అర్హుడు. (రోమా. 6:23) నీకు చెయ్యొద్దు అన్న వాటిని నీవు చేయడానికి ఇష్టగోరుతున్నావు అంటే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టినట్టే కదా!!
నీ కొరకు ప్రాణము పెట్టి, నిన్ను రక్షించిన క్రీస్తు కొరకు ఆలోచన చేయు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకో. ఆయన నీకోసం పడిన శ్రమను తలంచుకో. క్రీస్తే మన రక్షకుడు. (ఎఫెసీ. 5:23) క్రీస్తే మన విమోచకుడు (కొలస్సీ. 1:14). క్రీస్తే మనకు మార్గదర్శి. (యోహాను. 14:6).
కాబట్టి నీవు క్రైస్తవుడుగా ఉండి ఒకరికి రాఖీ కట్టిన తప్పే ఒకరి చేత రాఖీ కట్టించుకున్న అది తప్పే.
మీ ఆత్మీయులు 👪
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com