ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించని పండుగలు ❌



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


1️⃣. పరిచయం :
పాత నిబంధన కాలములో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను తన ప్రత్యేక ప్రజలుగా ఎన్నుకొని, తన్ను ఎలా ఆరాధించాలి, ఏ పండుగలు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అన్న విషయాలను తన గ్రంథములో లేవీయకాండం 23 అధ్యాయం నందు  స్పష్టంగా ఆజ్ఞాపించారనియు మరియు ఇశ్రాయేలీయుల ఆరాధన జీవితం మనుషుల ఆలోచనలపై కాదు, సంప్రదాయాలపై కాదు, పూర్తిగా దేవుని ఆజ్ఞలపైనే ఆధారపడాలి అని యెహోవా కోరారని  (ద్వితీయోపదేశకాండం 12:32). ఈ సంగతులను గత అంశము ద్వారా మనం ఆలోచన చేశాము కదూ. 

ఐనప్పటికి కాలక్రమేణ ఇశ్రాయేలీయులు అనేక సందర్భాలలో దేవుడు(YHWH) ఆజ్ఞాపించని పండుగలను తమకు ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకొని, వాటికి "యెహోవా పండుగ"  అని పేరును జోడించి ఆరాధన చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి చర్యలు దైవ దృష్టికి పూర్తి వ్యతిరేకం. దేవుని దృష్టిలో ఇది భక్తే కాదు, అవిధేయత. ఎందుకంటే దేవుడైన యెహోవా ముందే  స్పష్టంగా ఇలా చెప్పాడు: “నేను ఆజ్ఞాపించనిది చేయవద్దు; దానిలో ఏదియు కలుపకూడదు, తీసివేయకూడదు” (ద్వితీ. 4:2; 12:32).

ఈ అంశంలో మనము బైబిల్ వాక్యాల ఆధారంగా మాత్రమే ఈ విషయాలను పరిశీలించబోతున్నాము:
1. యెహోవా ఆజ్ఞాపించని పండుగలు ఏంటి?
2. ఆ పండుగలలో ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?
3. దానికి దేవుడు ఇచ్చిన ఫలితం(తీర్పు) ఏమిటి?
దేవునికి(YHWH) ఆరాధన అనేది మన ఇష్టప్రకారం చేయదగినది కాదు — ఆయన వాక్య ప్రకారమే చేయవలసినది అనే సంగతిని గుర్తించుటకు ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 


2️⃣. సీనాయి పర్వతం యొద్ద దేవుని మాటలకు పూర్తి మద్దతు పలికారు
📖 (నిర్గమా. 19:1-8): "ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.౹ వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.౹ మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి– నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా –నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.౹ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.౹ సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.౹ అందుకు ప్రజలందరు– యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.౹"

సీనాయి అరణ్యములో దేవుడైన యెహోవా మోషే ద్వారా తన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు తెలియజేసినప్పుడు, ఆ ప్రజల ప్రతిస్పందన చాలా స్పష్టమైనదిగా మరియు ఏకముగా కనిపిస్తుంది. వారు దేవుడు చెప్పిన మాటలను విని, వాటిని అంగీకరించి, “యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము” అని వాగ్దానం చేశారు (నిర్గమ 19:8) ఈ ఒక్క సందర్భంలోనే కాక కొన్ని సందర్భాలలోను వారు మద్దతు పలికినట్టుగా చూడగలం. (నిర్గమ. 24:3-7; ద్వితీయో. 5:27-29). ఈ మద్దతు ఇశ్రాయేలు ప్రజల ఆరాధనకు, భౌతిక సంబంధమైన పండుగలకు, వారి జీవన విధానానికి పునాదిగా నిలిచింది. దేవుని ఆజ్ఞలకు లోబడుటే వారి బాధ్యత అని వారు స్పష్టంగా ఒప్పుకునప్పటికి కాలక్రమేణ వారు ఆ నిబంధన యందు నిలువలేక దేవుడు ఆజ్ఞాపించని వాటికి ఆరాధనలు, పండుగలు చేశారు. 


3️⃣. ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించని పండుగలు❌

A).  బంగారు దూడకు పండుగ
➡️ ఏమి చేశారు? : విగ్రహం ముందు బలులు, తినుట, త్రాగుట, ఆడుట (వినోదం + విగ్రహారాధన) పండుగ చేశారు. 
➡️ ఫలితము : 3,000 మంది మరణం (నిర్గమ 32:28) = యెహోవా కోపం, తీర్పు
➡️ నిషేధం : విగ్రహారాధన (నిర్గమ 20:3–5)
➡️ వాక్య ఆధారం : నిర్గమకాండం 32:4–6
↪ యెహోవా ఆజ్ఞా? ❌
↪ మనుషులు ఆజ్ఞా? ✅

B). యరొబాము ఏర్పాటు చేసిన పండుగ
➡️ ఏమి చేశారు? : ఇశ్రాయేలీయులకు పండుగ నిర్ణయించే అధికారం దేవుడైన యెహోవాదే. కానీ ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజైన యరొబాము(1రాజులు 12:20) యెహోవా నిర్ణయించని నెలలో(8వ నెల), యెహోవా నిర్ణయించని పండుగను, తన మనస్సు ప్రకారం ఒక పండుగను ఏర్పాటు చేసి ఇశ్రాయేలను నడిపించెను.(1రాజులు 12:32-33). దానికి ముందే రెండు బంగారు దూడలు చేసి బేతేలునందు, దానునందు ఉంచెను(1 రాజులు 12:29-30).
➡️ ఫలితము : “యెరోబాము పాపములలో ఇశ్రాయేలు నడిచినందున…యెహోవా వారిని తన సముఖమునుండి తొలగించెను.” (2 రాజులు 17:21–23) ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం నాశనం. ( రాజ్య పతనం + అష్షూరు చెర)
➡️ నిషేధం : యెరోబాము చేసినది కలిపిన ఆరాధన/మరొక పండుగ ఏర్పాటు (నిర్గమ 20:3–5; ద్వితీయో. 12:32)
➡️ వాక్య ఆధారం : 1 రాజులు. 12:32-33; 13:1-5; 14:16; 2రాజులు. 17:21-23
↪ యెహోవా ఆజ్ఞా? ❌
↪ మనుషులు ఆజ్ఞా? ✅

C). బయలు పురుష దేవతకు పండుగ
➡️ ఏమి చేశారు? : బయలును(baal) పూజించిరి, బయలు నామము పిలుచుచు… బలిపీఠము చుట్టూ నృత్యము చేయుచు, తమ ఆచారము ప్రకారం కత్తులతోను ఈటెలతోను తమను తాము కోసుకొనిరి. పండుగలలో జరిగే విగ్రహ ఆరాధనా విధానం. 
➡️ ఫలితము : దేవుని కోపం → కరువు → మరణం → చెర → నాశనంకి దారి తీసింది.
➡️ నిషేధం : ద్వితీయోపదేశకాండం 12:2–4
➡️ వాక్య ఆధారం : న్యాయాధిపతులు 2:13-14; 1 రాజులు 18:26-28; హోషేయ 2:13; 
↪ యెహోవా ఆజ్ఞా? ❌
↪ మనుషులు ఆజ్ఞా? ✅

D). అషేరా స్త్రీ దేవతకు పండుగ
➡️ ఏమి చేశారు? : అషేరా అనేది కనానీయులలో విస్తృతంగా పూజించబడిన స్త్రీ దేవత. ఆమెను సంతాన దేవతగా సంతానోత్పత్తి (fertility) దేవతగా పండుగలు, ఉత్సవాల ద్వారా ఆరాధించేవారు. ఈ పండుగ చెట్ల దగ్గర అరణ్యస్తంభాల చుట్టూ జరిగేవి. బయలు(పురుష దేవత) అషేరా(స్త్రీ దేవత) కలిపి ఉత్సవాలు చేసేవారు. 
➡️ ఫలితము : దేవుని కోపం → శత్రువుల చేతికి → దేశ అపవిత్రత → చెర
➡️ నిషేధం : ద్వితీయోపదేశకాండం 16:21; నిర్గమ 34:13.

గిద్యోను – అషేరా స్తంభం నరికి వేయించాడు (న్యాయా 6:25–27)
ఆసా రాజు – అషేరా విగ్రహాన్ని తొలగించాడు (1 రాజు 15:13)
హిజ్కియా – ఉన్నత స్థలాలు తొలగించాడు (2 రాజు 18:4)
యోషీయా – అషేరా స్తంభాలు నాశనం (2 రాజు 23:4–7)

➡️ వాక్య ఆధారం : న్యాయాధిపతులు 2:13; 3:7; 6:25-26; 2 రాజులు. 17:16-18.
↪ యెహోవా ఆజ్ఞా? ❌
↪ మనుషులు ఆజ్ఞా? ✅

E). పెయోరు దేవతకు పండుగ
➡️ ఏమి చేశారు? : మోయాబు ప్రధాన దేవత కెమోష్ (Chemosh). వారి జాతీయ దేవుడు.సొలొమోను రాజు కెమోషుకు ఒక ఆలయాన్ని నిర్మించినట్టుగా చూడగలం(1 రాజులు 11:7). వీరు బయల్పెయోరు/పెయోరు (Baal-Peor) వంటి ఇతర దేవతలను కూడా ఆరాధించేవారు. ప్రత్యేకించి ఇశ్రాయేలీయులు షిత్తీము వద్ద వీరితో కలసి పండుగను ఆచరించినప్పుడు చూడగలం. (సంఖ్యా. 25:1). వారి దేవతకు బలులు, వ్యభిచారం చేయటం, పండుగ లో అనైతికత, చచ్చినవారికి అర్పించిన బలిమాంసం తినుట వలనే...
➡️ ఫలితము : దేవుని కోపం → తెగులు → 24,000 మంది మరణం
➡️ నిషేధం : ద్వితీయోపదేశకాండం 7:1-5; నిర్గమ 34:15
➡️ వాక్య ఆధారం : సంఖ్యా. 25:1-9; 31:16; కీర్తనలు 106:28; ద్వితీ. 4:3-4;
↪ యెహోవా ఆజ్ఞా? ❌
↪ మనుషులు ఆజ్ఞా? ✅

F).  మొలెకు/మిల్కోము దేవతకు పండుగ
➡️ ఏమి చేశారు? : అమ్మోనీయుల ప్రధాన దేవత మొలెకు. అగ్ని ద్వారా ఆరాధించబడే స్త్రీ. సొలొమోను రాజు మొలెకు(molech) ఒక ఆలయాన్ని నిర్మించినట్టుగా చూడగలం(1 రాజులు 11:5,7,33). మొలెకు (Molech)తో దగ్గరగా సంబంధించిన దేవత ఈ మిల్కోము(milcom). శిశుబలితో సంబంధమున్న ఘోరమైన పండుగ. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు అర్పించుకొనేడి వారు - దేవతకు శిశు బలి. (లేవీయకాండం 18:21; 2 రాజులు 23:10; యిర్మియా 7:31; 32:35)
➡️ ఫలితము : కోపం → రాజ్యం చీలిక → దేశ అపవిత్రత → చెర → నాశనం (లేవీయకాండం 18:26–28; 20:2-5; యిర్మియా 19:4–6)
➡️ నిషేధం : లేవీయకాండం 20:2–5
➡️ వాక్య ఆధారం : 1 రాజులు 11:5,33; లేవీయకాండం 18:21; 2 రాజులు 23:10; యిర్మియా 7:31; 32:35

యోషీయా రాజు – మొలెకు పూజను అపవిత్రం చేశాడు. (2 రాజులు 23:10)
↪ యెహోవా ఆజ్ఞా? ❌
↪ మనుషులు ఆజ్ఞా? ✅

G). అన్య దేవతల పండుగలను/ఆచారాలను  యెహోవా ఆరాధనలో కలిపివేయడం
➡️ ఏమి చేశారు? : అన్య ఆచారాలను/పండుగలను యెహోవా పేరుతో యెహోవాకే చేయడం. [ బయలు పండుగలు + యెహోవా ఆరాధన. ] దేవుని దృష్టిలో ఘోరమైన అపవిత్రత. ఆయా విధానాలతో ఆరాధన చేయాలనే మనస్సులో ఆరాధించాలనుకోవడం
➡️ ఫలితము : ఆరాధన తిరస్కరణ → కోపం → చెర → నాశనం. పండుగలను ద్వేషించుట, ప్రార్థనలు వినలేదు. (ఆమోసు 5:21–23 యెషయా 1:13–15; 2 రాజులు 17:16–18)
➡️ నిషేధం : నిర్గమకాండం 23:24; ద్వితీయోపదేశకాండం 12:30–31
➡️ వాక్య ఆధారం : హోషేయ 2:13; నిర్గమకాండం 32:4–6; ద్వితీయోపదేశకాండం 12:30–31
↪ యెహోవా ఆజ్ఞా? ❌
↪ మనుషులు ఆజ్ఞా? ✅


4️⃣. ముగింపు
ఓ చదువరి… పాత నిబంధన అంతటా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఒక విషయాన్ని అత్యంత స్పష్టంగా తెలియజేశాడు: ఆయన ఆజ్ఞాపించిన పండుగలే చెల్లుబాటు; అన్య దేవతలకు చెందిన పండుగలు గానీ, అన్య ఆచారాలతో కలిపిన ఆరాధన గానీ ఆయనకు అసహ్యమైనవి. ఇశ్రాయేలీయులు బంగారు దూడ, మనుషులు ఏర్పాటు చేసిన పండుగైన, బయలు, అషేరా, మొలెకు, మిల్కోము వంటి అన్య దేవతల పండుగలను అనుసరించిన ప్రతీసారి, వారు యెహోవాను విడిచిపెట్టి విగ్రహారాధనలోకి వెళ్లారనేది స్పష్టం. (న్యాయాధి 2:11–13).

ఈ అన్య పండుగలలో ఉండేది దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆచారం, అపవిత్రత, అవిధేయత మాత్రమే. అందుకే యెహోవా వాటిని తిరస్కరించి, తన ప్రజలపై కోపం, కరువు, మహమ్మారి, శత్రువులను చెరకు, చివరకు దేశ నాశనం వంటి తీర్పులను అనుమతించినట్లుగా మనం చూడగలం (సంఖ్యా 25:9; న్యాయాధి 2:14; 2 రాజులు 17:16–18).

దేవుడైన యెహోవా ఇచ్చిన తుది హెచ్చరిక చాలా స్పష్టం: “నేను ఆజ్ఞాపించుచున్న మాటనే చేయుడి; దానిలో ఏదియు కలుపకూడదు, తీసివేయకూడదు” (ద్వితీ. 12:32). అందువల్ల పాత నిబంధనను నేడు క్రైస్తవులమైన మనం చదివినప్పుడు మనకు బోధించేది ఇదే — అన్య పండుగలు ఆరాధన కాదు;  అన్య ఆచారాలు దేవుని పండుగలు కాదు; అవి దేవునితో సంబంధాన్ని తెంచే మార్గాలు. దేవుడు కోరేది తన మాటకు తన ప్రజలు విధేయత చూపాలనేదే. 

📖 1సమూయేలు 15:22: "అందుకు సమూయేలు– తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.౹"

మీ ఆత్మీయులు 👪

1. క్రైస్తవులకు ఆజ్ఞాపించే పండుగలు ✅ - త్వరలో 
2. క్రైస్తవులకు ఆజ్ఞాపించని పండుగలు ❌- త్వరలో 
3. 
ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించే పండుగలు ✅ -  క్లిక్ చేయు 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Page Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16