క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు? ❌


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


1️⃣. పరిచయం

నేటి క్రైస్తవ లోకంలో అత్యంత గందరగోళానికి గురైన అంశం ఏదైనా ఉందంటే అది “ఆరాధన ఎవరికి చేయాలి?” అన్న ప్రశ్నే. చాలామంది ఇలా అంటున్నారు : కొందరు యేసుకి ఆరాధన చేయాలని, ఇంకొందరు తండ్రియైన దేవునికి(YHWH) మాత్రమే ఆరాధన చేయాలని,   మరికొందరు తండ్రి మరియు యేసు ఇద్దరు ఆరాధనకు పాత్రులే అని బోధిస్తున్నారు. ఈ రకమైన బోధలన్నీ మనలో చాలా మంది వినియున్నాం. అయితే ఇప్పుడు వేరొక బోధ తీసుకొచ్చారు. వారు చేస్తున్న బోధ వినడానికి బహు  విచిత్రముగా ఉంది. వీరు తండ్రికి + యేసుకు + పరిశుద్ధాత్మునికి అనగా ముగ్గురికి ఆరాధన చేయాలని, క్రైస్తవుల ఆరాధనకు ముగ్గురు పాత్రులే అని బోధిస్తున్నారు. 


నేడు క్రీస్తు సంఘాలు మతశాఖలుకు ధీటుగా నిలబడి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేయాలి. మరి ముఖ్యముగా  త్రియేక దేవుడు లేక ముగ్గురు సమానులే ఇలాంటి తప్పుడు  బోధలు కలిగిన మతశాఖలకు బుద్ధి చెప్పాల్సింది పోయి… కొన్ని క్రీస్తు సంఘాలు ముగ్గురిని ఆరాధించవచ్చు అని మాట్లాడుతున్నారు. ముగ్గురు వ్యక్తులు క్రైస్తవుల ఆరాధనకు పాత్రులు  అనేడి బోధలు, డిబేట్స్ రూపములో నేనంటే నేను,  నీవంటే నీవు అన్నట్టుగా ప్రస్తుతం ఇవి లోకములో తిరుగుతూ, విశ్వాసులను చెదరగొడుతూ, కలుపుకుంటూ ఉన్నారు.


పరిశుద్ధ గ్రంథము మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కనుక మనుష్యుడు సొంత నిర్ణయాలు తీసుకుంటే అవి దేవుని దృష్టిలో చెల్లుబాటు అవ్వవని మొదట గ్రహించుకోవాలి. సత్య బోధ అని చెప్పుకునే క్రీస్తు సంఘాలు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే మతశాఖలు వారికి నచ్చినట్టుగా కలిపి చెరువులు చేయడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రియ సోదరా మనము తీసుకునే ప్రతి నిర్ణయము పరిశుద్ధ లేఖనాల ఆధారముగానే ఉండాలనేది ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది. 


నిజానికి క్రైస్తవ విశ్వాసం

➡️ భావాలపై కాదు ❌

➡️ సంప్రదాయాలపై కాదు ❌

➡️ మనుషులు ఊహలు/బోధలపై కాదు ❌

➡️ రకరకాల సంఘాలు, వాటి సిద్ధాంతాలపై కాదు

➡️ మెజారిటీ విశ్వాసం/మెజారిటీ సభ్యత్యంపై అస్సలు కాదు ❌

➡️ కేవలం దేవుని బోధ/ క్రీస్తు బోధ/ఆదిమ అపోస్తలుల బోధ పైనే మాత్రమే ఆధారపడుతుంది. 🔎📖✔️

➡️ క్రైస్తవులకు క్రొత్త నిబంధనే ప్రామాణికం 📖✔️


గతములో “ఆరాధ్య దైవం ఒక్కడే - ఆయనే తండ్రిక్లిక్ చేయు అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. నేడైతే “క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చెయ్యరు?” అనే ఈ ప్రశ్నకు సమాధానం చివరిగా పరిశుద్ధ గ్రంథము మాట్లాడిన మేర ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.


2️⃣. మనకు దేవుడు ఒక్కడే – ఆయనే తండ్రి

"ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹" (1కోరింది. 8:6)

"మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక...." (ఎపేసి 1:3)

ప్రభువు ఒక్కడే (ఎపేసి 4:5)

"అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.౹" (ఎపేసి. 4:6)


ఇక్కడ అపోస్తలుడైన పౌలు  స్పష్టంగా వేరు చేస్తూనే మాట్లాడుతున్నాడు :

◾మనకు/అందరికి — క్రైస్తవులకు

◾దేవుడు — తండ్రి

◾ఒక్కడే — ఒక్కరే (మనకు మరొక వ్యక్తి లేరని అర్థమేగా...)

◾మనకు ప్రభువు ఒక్కడే — యేసుక్రీస్తు


👉 “మనకు/అందరికి దేవుడు ఒక్కడే” అనే పదం యేసుకు వర్తింపజేసే వచనాలు బైబిల్ యందు కనపడవు. 

👉 అలాగే “ మనకు దేవుళ్లు ముగ్గురు” అని ఎక్కడా చెప్పబడలేదు.


కాబట్టి నిజమైన క్రైస్తవుల దృష్టిలో వారికి దేవుడు ఒక్కడే ఆయనే తండ్రియైన దేవుడు(YHWH) మాత్రమే. ఈ మాట వినగానే క్రీస్తు మీద నీకున్న అభిమానం కట్ల తెంచుకొని మాపై విరుచుకు పడే అవకాశం ఉందని తెలుసు. కోపగించుకోకు, మేము మన ప్రభువైన యేసుక్రీస్తును తగ్గించడం లేదు. క్రీస్తు దేవుడా? కాదా? అనే ప్రశ్న నీవు లేవనెత్తుతావని తెలుసు ఇందుకోసమే నీకోసం ముందుగా 𝟭𝟮𝟲. యేసుక్రీస్తు యొక్క దైవత్వముక్లిక్ చేయు అనే అంశమును వ్రాయడం జరిగింది. అది చదివిన తర్వాత ఆలోచించు. 


దేవుడు ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని ముగ్గురిని కలపడం నీకు ఆత్మీయంగా కనపడవచ్చు ఏమో గాని అపోస్తలుల బోధ యొక్క వెలుగులో ఇది పూర్తిగా వక్రీకరణే అగును కదా. (ప్రకటన 22:18-19; గలతీ. 1:6-12) ఇందుకే 𝟭𝟱𝟬. దేవుడు ఒక్కడే అంటే ఎవరికి దేవుడు?క్లిక్ చేయు అనే అంశము వ్రాయడం జరిగింది చూడుము.


3️⃣. ఆరాధన కోరుకునేవాడు తండ్రి మాత్రమే

"అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹" (యోహాను. 4:23-24)


ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తున్నారు.

◾ఎవరిని ఆరాధించు కాలం — తండ్రిని

◾ఎవరు కోరుచున్నాడు/వెతుకుచున్నాడు? — తండ్రి

◾ఎవరిని ఆరాధన చేయాలి? — తండ్రిని


యేసు మాటలు శ్రద్ధగా విని జరిగించుట వలనే విశ్వాసం కలుగును(రోమా 10:17) యేసు మాటలు పైన తిరుగుబాటు చేయువాడు సర్వనాశనం అగును కదా(అపో.కార్య. 3:22-23) ఇందుకే యేసు మాటలు బట్టి… “క్రైస్తవులు యేసును ఆరాధించరు.” మరింత వివరణ కోసం 𝟭𝟰𝟭. ఆరాధన కోరిన దేవుడు?క్లిక్ చేయు అనే అంశమును చదువుము


4️⃣. యేసు శరీరదారిగా ఉన్న దినాలలో…

"తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా" (లూకా 4:16)

◾ యేసు సమాజమందిరానికి వెళ్లాడు

◾ విశ్రాంతి దినమున తండ్రిని ఆరాధించాడు

◾ ధర్మశాస్త్రానికి లోబడినవాడిగా జీవించాడు


👉 యేసు = ఆరాధన చేసేవాడు

👉 యేసు ≠ ఆరాధన పొందేవాడు

👉 యేసు తన జీవితకాలమంతా తన దేవుడిని

ఆరాధన చేసే వాడే గాని, ఆరాధన పొందేవాడు కాదు. 


మన ప్రభువైన యేసు శరీరదారిగా ఉన్న దినాలలో కూడా ఆరాధికుడే కానీ ఆరాధ్యుడు కాదు. (మరి కొన్ని వచనాలు యోహాను. 2:13,23; 6:4; 7:2,8-10; 10:22; 19:14; మత్తయి. 26:17-20; లూకా 22:1) మన కంటే ఆయనకే బాగా తెలుసు తన ఆరాధ్య దైవం యొక్క గొప్పతనం.


ఇది వినిన తరువాత నీ మదిలో మెదిలే వచనాలు తెలుసు. అదిగో పశువుల పాకలో, అదిగో రోడ్ మీద, అదిగో సముద్రం దగ్గర… అంతేగా వాటి విషయమై మరింత వివరణ కోసం 𝟭𝟰𝟮. యేసు ఆరాధింపబడ్డారా? లేక ఆరాధన చేశారా?క్లిక్ చేయు అనే అంశమును పూర్తిగా చదివి ఆలోచన చేయగలరు. 


5️⃣. క్రైస్తవులు యేసును ఎందుకు ఆరాధన చేయరు? — ప్రధాన కారణాలు

A]. యేసు ప్రధానయాజకుడు

పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన దేవుని సముఖానికి వెళ్లి బలులు అర్పించేవాడు కానీ ప్రజలు చేత అతడు ఆరాధన పొందేవాడు కాదు, ప్రజలను దేవునితో కలిపే మధ్యవర్తి మాత్రమే. (హెబ్రీ. 5:1-4; లేవీ 9:7; నిర్గమ 28:1-37) అలాగే క్రీస్తు కూడా తనంతట తానే మహిమపరచుకొనలేదు, దేవుని పిలుపు ద్వారా ప్రధాన యాజకుడయ్యాడు. (హెబ్రీ. 5:5). నీవు మెల్కిసెదెకుకు క్రమము చొప్పున నిత్య యాజకుడవు” అని దేవుడు ప్రమాణం చేసాడు.(కీర్తనలు. 110:4). తన ద్వారా దేవుని యద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు (హెబ్రీ. 7:25-26). యేసు తన స్వరక్తముతో, ఒక్కసారే పరలోక పరిశుద్ధస్థలములో ప్రవేశించి నిత్య విమోచన సంపాదించాడు.(హెబ్రీ. 9:11-12)


◾యేసు = నిత్య ప్రధాన యాజకుడు

◾ప్రధాన యాజకుడు = ఆరాధన పొందేవాడు కాదు

◾ఆయన పని = మన పక్షాన దేవుని సముఖంలో నిలిచి విజ్ఞాపన చేయుట


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు; యేసు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు. మరింత వివరణ కోసం 𝟯𝟵. ప్రధానయాజకుడు పనిక్లిక్ చేయు అనే అంశము చదవగలరు. 


B] *సంఘానికి శిరస్సు — క్రీస్తు

సంఘము అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు(1కోరింది. 1:2) సంఘము అనగా క్రీస్తు శరీరము (ఎపేసి 1:23) సంఘానికి శిరస్సు క్రీస్తు (కొలస్సి 1:18) శరీరము ఒక్కటే అనగా సంఘము ఒక్కటే (ఎపేసి 4:4). క్రీస్తు శరీరము అనగా క్రీస్తు సంఘము (church of Christ) — రోమా 16:16

◾సంఘము = శరీరం

◾యేసు = శిరస్సు


👤 శిరస్సు యొక్క పని:

శరీరాన్ని నడిపించుట ✔️

శరీరానికి దిశ చూపుట✔️

శరీరాన్ని కాపాడుట✔️

శరీరాన్ని సంరక్షించుట ✔️

శరీరాన్ని పోషించుట ✔️


👉 శిరస్సు ఆరాధన పొందే భాగం కాదు, ❌ 

👉 శిరస్సు శరీరాన్ని నడిపించే అధికారం కలిగినది.✔️


అంటే సంఘం ఏం చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో అన్నది యేసు అధికారానికి లోబడే జరుగుతుంది అంతేగా...


🙇 ఆరాధనతో సంబంధం

సంఘం తండ్రిని ఆరాధించేటప్పుడు శరీరం అయిన సంఘం శిరస్సు అయిన యేసుతో కలిసి తండ్రిని ఆరాధిస్తుంది అని తెలుసుకో…


శిరస్సు + శరీరము కలసి = తండ్రికి ఆరాధన చేస్తాయి. 


👤 క్రీస్తు :

సంఘానికి శిరస్సు

అధికారమిచ్చిన రాజు

మార్గదర్శి

కానీ

👉 సంఘానికి శిరస్సు అయినవాడు ఆరాధన పొందడు

👉 సంఘంతో కలిసి తండ్రిని ఆరాధిస్తాడు. 


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసుకు లోబడి జీవిస్తూ, ఆయన ద్వారా/ఆయనతో కలసి తండ్రిని ఆరాధిస్తారు.


🛑 ఇది వినిన తరువాత కూడా… యేసును ఆరాధన చేస్తాం అంటే సంఘముతో అనగా తన శరీరముతో కలసి తండ్రిని ఆరాధన చేసే యేసుక్రీస్తు తనని తాను ఏలాగున ఆరాధించుకుంటాడు? ఆలోచించుకో మిత్రమా.


మరింత వివరణ కోసం 𝟭𝟰𝟯. సంఘముతో కలసి యేసును ఆరాధించుకు యేసు వస్తారా?క్లిక్ చేయు అనే అంశము చదవగలరు.


C]. యేసు మన పాపములకు బలి పశువు

పాత నిబంధనలో పాప పరిహారానికి బలి పశువు నియమించబడింది. బలి పశువు ఉద్దేశ్యం ఆరాధన పొందుట కాదు; దేవునికి అర్పింపబడి, దాని ద్వారా దేవుని ఆరాధించుట. 

బలిపీఠము దేవుడు నియమించిన విధానములోనే ఉండాలి; మానవ కృతితో అపవిత్రం చేయరాదు. బలిపీఠము పరిశుద్ధమైనది; బలి దేవునికే అర్పించబడుతుంది. (నిర్గమకాండం 20:25) బలిపీఠము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది బలి పశువు బలిపీఠముపై అర్పింపబడుటకు మాత్రమే (నిర్గమకాండం 27:1–8) కానీ బలి పశువు ఆరాధింపబడుటకు కాదు సుమీ.


◾మేకలు, గొర్రెలు = పాప పరిహార బలులు మాత్రమే

◾ఎక్కడ అవి ఆరాధింపబడలేదు

👉 అటువంటి భౌతిక సంబంధమైన బలులు ద్వారానే యెహోవా ఆరాధింపబడ్డాడు. 


క్రొత్త నిబంధన విషయానికి వస్తే… యేసు ఇతర యాజకులవలె దినదినము బలులు అర్పించవలసినవాడు కాదు; తాను తానే ఒక్కసారిగా అర్పించుకున్నాడు. (హెబ్రీయులకు 7:27). యేసు మేకల రక్తముతో కాదు, తన స్వరక్తముతో పరిశుద్ధస్థలములో ప్రవేశించి నిత్య విమోచన సంపాదించాడు. (హెబ్రీయులకు 9:11–12) యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పింపబడిన బలియై, సదాకాలము నిలిచిన బలియై ఉంది. (హెబ్రీయులకు 10:10–12). మనకు ఒక బలిపీఠము ఉంది.(హెబ్రీయులకు 13:10) క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు వదింపబడెను కదా(1కోరింది. 5:7). మన ఆరాధనలో యేసుక్రీస్తు ద్వారా తండ్రియైన దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి అర్పింపబడాలి అనేది దేవుని ఆజ్ఞ (1 పేతురు. 2:5). 


🙇 ఆరాధనతో సంబంధం

❌ బలి పశువును ఎవ్వరూ ఆరాధించరు

✔️ బలి ద్వారా దేవునిని ఆరాధిస్తారు

✔️ యేసు = మన పస్కా గొర్రెపిల్ల

✔️ యేసు = మన పాపములకు నిత్య ప్రాయశ్చిత్త బలి

👉 కావున మన కొరకు బలి అయిన యేసును ఆరాధించరు.

👉 బలి పశువు ఆరాధనకు పాత్రుడు కాదు

👉 యేసు బలియైనందున, ఆయన ద్వారా తండ్రిని ఆరాధిస్తారు.


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు యొక్క బలి ద్వారా తండ్రిని ఆరాధిస్తారు.


D]. యేసు దేవుని మందిరాన్ని కట్టేవాడు

పాత నిబంధన నుండే దేవుడు ఒక సత్యాన్ని స్పష్టంగా తెలియజేశాడు అదేమనగా దేవుడు మనుషుల చేతులతో కట్టబడిన ఆలయాలలో నివసించడు. అలాగే క్రొత్త నిబంధనలో దేవుడు నివసించుటకు ఏర్పాటైన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేవాడు యేసుక్రీస్తే అని లేఖనం బోధిస్తుంది.


📖 పాత నిబంధన సాక్ష్యం

"నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.౹ నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.౹" (2 దినవృత్తాంతములు 2:4–6)


🗣️ చివరిగా సొలొమోను ఇలా ఒప్పుకున్నాడు ఆలయం దేవుడు నివసించుటకు కాదు. యెహోవా నామ ఘనత కొరకు మాత్రమే ఆకాశములే దేవునిని పట్టలేవు అని. అలాగే పౌలు గారు అపోస్తలుల కార్యములు 17:24 (పాత నిబంధన సత్యాన్ని ప్రకటిస్తూ) “హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసింపడు.” ఇలా అన్నాడు. 


👉 పాత నిబంధనలో ఆలయాలు దేవుని ఘనతకు గుర్తులే కానీ దేవుని నివాస స్థలం కాదు.


దేవుని యోచన: నిజమైన మందిరం

“చిగురు అను ఒకడు కలడు… అతడే యెహోవా ఆలయమును కట్టును.” (జకర్యా 6:12)

👉 ఈ “చిగురు” = మెస్సీయ = యేసుక్రీస్తు

👉 దేవుని నిజమైన మందిరాన్ని ఆయనే కట్టేవాడు. 


📖 క్రొత్త నిబంధన సాక్ష్యం

యేసు మాటల్లో... "మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను." (మత్తయి. 16:18)


◾ బండ మీద  – యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువనే విశ్వాసం మీద(16వ)

◾ నా(MY) — క్రీస్తు

◾సంఘము(CHURCH) అన్నారు కానీ సంఘములు(Churches) అనలేదు 

◾నా సంఘము = క్రీస్తు సంఘము 

◾కట్టుదును — ప్రారంభించనున్నాను. 


🔎 ఎఫెసీయులకు 2:19–22

◾పరిశుద్ధులు = దేవుని ఇంటివారు

◾అపోస్తలులు, ప్రవక్తలు = పునాది

◾యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి

◾సంఘం = ఆత్మ ద్వారా కట్టబడుచున్న దేవుని నివాసస్థలం. 


🔎 1 కొరింథీయులకు 3:11

"వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹"


🙇 ఆరాధనతో సంబంధం

✔️ యేసు = దేవుని మందిరాన్ని కట్టేవాడు, దేవుని నివాసాన్ని సిద్ధపరచేవాడు 

❌ కానీ ఆరాధన పొందేవాడు కాదు. 

సంఘం = దేవుని మందిరం

దేవుడు = ఆ మందిరంలో నివసించువాడు


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు కట్టిన సంఘములో అనగా క్రీస్తు సంఘములో(church of Christ), యేసు ద్వారానే, తండ్రిని ఆరాధిస్తారు. 


E]. *యేసు మన నిమిత్తము విజ్ఞాపన చేయువాడు

క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రస్తుతం చేస్తున్న ముఖ్యమైన కార్యాలలో ఒకటి మన నిమిత్తము తండ్రి సముఖంలో విజ్ఞాపన చేయుట. విజ్ఞాపన చేయువాడు ఆరాధన పొందేవాడు కాదు; ఇతను మరొకరి(దేవుని) ఎదుట మన పక్షాన నిలిచే మధ్యవర్తి.


"ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు." (హెబ్రీయులకు 7:25; రోమా 8:34)


👉 ఎవరి ఎదుట? — దేవుని ఎదుట (తండ్రి)

👉 ఎవరి పక్షాన? — క్రైస్తవుల పక్షాన


“నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది

తండ్రి యొద్ద మనకున్నాడు.” (1యోహాను. 2:1)


👉 యేసు = ఉత్తరవాది (న్యాయవాది)

👉 తండ్రి = న్యాయాధిపతి


పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన దేవుని ఎదుట నిలిచేవాడు. అతడు విజ్ఞాపన చేసేవాడు. తాను ఆరాధన పొందలేదు అదే విధంగా క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసు నిత్య ప్రధాన యాజకుడు మరియు మన పక్షాన దేవుని సముఖంలో నిలిచే వాడు. మన పాపముల నిమిత్తము వాదించువాడు. మన బలహీనతలను తండ్రికి తెలియజేసేవాడు. తన రక్తాన్ని ఆధారంగా చూపించేవాడు. 


❌ విజ్ఞాపన చేయువాడిని ఆరాధించరు

✔️ విజ్ఞాపన చేయించబడే దేవునినే ఆరాధిస్తారు.


యేసు = మన నిమిత్తము విజ్ఞాపన చేయువాడు

తండ్రి = ఆరాధనకు పాత్రుడు

యేసు ద్వారా — తండ్రిని చేరుతాం.


🛑 తుది నిర్ణయం : అందుకే క్రైస్తవులు యేసును ఆరాధించరు, యేసు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు. యేసు మనకు ఉత్తరవాదిగా తండ్రి యెదుట నిలిచి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప మహత్కార్యమో 😢 🙏🏿 


6️⃣. ముగింపు

✔️ ఆరాధన — తండ్రికి మాత్రమే

✔️ మార్గం — యేసుక్రీస్తు ద్వారా

✔️ శక్తి — పరిశుద్ధాత్మ వలన


"మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి." (కొలస్సయులకు 3:17)


👤 యేసుక్రీస్తు :

మనకు ప్రధాన యాజకుడు

మనకు శిరస్సు

మన పాపములకు బలి పశువు 

మన మధ్యవర్తి

మన రాజు


కానీ

👉 క్రైస్తవుల ఆరాధన పాత్రుడు కాదు ❌

👉 తండ్రే క్రైస్తవుల ఆరాధనకు అర్హుడు ✔️

నిజమైన క్రైస్తవులు యేసును ఆరాధించరు — పరిశుద్ధాత్మ వలన యేసు ద్వారా తండ్రియైన దేవుని ఆరాధిస్తారనేది అపోస్తలుల బోధ 🙏🏿

మీ ఆత్మీయులు 👪

WhatsApp Channel - 2k Join Now
Telegram Group - 600 Join Now
Instagram Page - 500 Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16