నిజమైన స్నేహితుడు ఎవరు.? (who is your True Friend)

"నిజమైన స్నేహితుడు ఎవరు".? 


సహోదరులందరికిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

ఈ లోకములో వేరు వేరు అభిప్రాయాలు కలిగిన వివిధ రకాల స్నేహితులను మనము చూస్తున్నాము.

» మొదటి ఉదాహరణ : “కొంత మంది స్నేహితులు నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ మన యొక్క పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే మన వెంట ఉంటారు”.
» రెండో ఉదాహరణ : “మరి కొంత మంది స్నేహితులు మన నుండి ఏదైనా ఆశించి, వారు ఆశించిన దానిని పొందుకోవడానికి మాత్రమే మనతో స్నేహముగా ఉంటారు”.
» మూడో ఉదాహరణ : “మరి కొంత మంది స్నేహితులు పరిస్థితులను బట్టి నటించే వారుగా ఉంటారు”.


1). నిజమైన స్నేహితుడు ప్రతీ సమయములోను మన యెడల ప్రేమ చూపించి, మన ఆనందములోను మరియు కష్టనష్టములోను, మన వెంటే ఉండి మనలను ఆదరించే వారుగా ఉంటాడు. 

» ఉదా : "అపో. పౌల్ మరియు లూకా".  (2 తిమోతి. 4:11). 

  “అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే”. (సామెతలు. 19:6).
  “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును”. (సామెతులు. 17:17).

2). నిజమైన స్నేహితుడు మన యెడల నమ్మకమైన వాడుగా ఉంటాడు.


» ఉదా : "దావీదు మరియు యోనాతాను". (1 సమూయేలు. 18:1-4; 23:16-18).

 సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. (సామెతలు. 18:24).

3). నిజమైన స్నేహితుడు ఎప్పుడూ అబద్ధమాడడు మరియు మన వెనుక మన గూర్చి హీనముగా మాటలాడడు.

» ఉదా : "అబ్రాహాము" (యెషయా. 41:8; యాకోబు. 2:23).  

 ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. (సామెతలు. 27:17).

4). నిజమైన స్నేహితుడు మనలను ప్రేమించడమే కాకుండా, మన యొక్క తప్పులును గద్దించే వాడుగా ఉంటాడు.


» ఉదా : "యెహోవా మరియు ఆయన ప్రజలు" 
(సామెతలు. 3:12).

 లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు. (సామెతలు. 27:5).


★ “మన యెడల ప్రేమ చూపించి, మన కొరకు ప్రాణము పెట్టిన నిజమైన స్నేహితుడు ఒక్కరు కలరు” - ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

A). “మన యెడల ప్రేమ చూపించి, మనము నిత్య జీవము పొందుకొనుటకు, తండ్రి చేత అనుగ్రహింపబడ్డాడు”. (యోహాను. 3:16).

B). “మన కొరకు తనను తాను తగ్గించుకొని మరణము పొందెను”. (హెబ్రీ. 2:9).

C). “ఈ లోకములో ఏ స్నేహితుడు చేయని త్యాగమునకు తను మాత్రమే సిద్దపడి, మన పాపములు నిమిత్తమే సిలువలో బలియాయేను”. (1 పేతురు. 2:24).

D). “మన కొరకు మరణించడమే కాకుండా, తండ్రి తనకిచ్చిన స్వాస్థ్యములో మనలను కూడా తనతో సమాన వారసులుగా చేసెను”. (రోమా. 8:16-17).

ఈ ప్రపంచంలో యేసులాంటి నిజమైన మంచి స్నేహితుడు వేరొకరు లేరు గనుక మనము ఎవరితో స్నేహము చెయ్యాలో పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేయుచున్నది. ఇటువంటి నిజమైన మంచి స్నేహితుడు మనలను ప్రేమించి, మన కొరకు ప్రాణము పెట్టి, మనతో స్నేహము చెయ్యాలని ఆశపడుచుండగా మనము ఆ యొక్క నిజ స్నేహమును కోరుకుటున్నామో లేదా అని ఆలోచన చేయవలసిన అవసరత మనకి ఎంతో ఉంది.

● యేసుకి మనము స్నేహితులుగా ఉండాలంటే ఆయన అజ్ఞాపించిన వాటిని చేయాలి. (యోహాను. 15:14).

కావునా నా ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైన మనము యేసు ఏమి ఆజ్ఞాపించారో తెలుసుకొని, ఆయన తండ్రి చిత్తమును ఏ విధముగా నేరవేర్చియున్నాడో... అట్టి రీతిగానే మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసులాంటి ప్రేమను మన స్నేహితులు యెడల చూపించి వారు కొరకు ప్రాణము పెట్టి  (యోహాను. 15:13). యేసు వలె నిజమైన మంచి స్నేహితులుగా ఉండాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచు మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు,
 నవీన_మనోహర్

Share this

Related Posts

Previous
Next Post »

3 comments

comments

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16