(ప్రార్థన) |
★
ప్రార్థన అనగా శోధనలో అస్థిరత (లూకా. 22:40; మత్తయి. 6:13).,
శ్రమలో నిరాశ (కీర్తన. 16:4; 40:17). మొదలగు మానవుని దౌర్భల్యములయందు
మాత్రమేగాక సంతోష సమృద్దులయందును (పిలిప్పీ. 1:3) మన హృదయాలోచనలు దేవునికి తెలుపుకొనుటకు ఒక ప్రత్యేకమైన
విధానమును ఆయన ఏర్పరచెను. ఇట్ల దేవునితో మానవుడు తన విన్నపములను తెలియజేసికొను విధానమునే
"ప్రార్థన" అందురు. (G. Devadanam’s The New Testament Worship, Vol I, Page 58)
★
యాచన అనగా శోధన, శ్రమ, అపాయము
మొదలగు విపత్కర పరిస్థితులలో నున్నప్పుడు సహాయము కొరకే దేవునికి విన్నవించుకొను మనవిని
“యాచన” అందరు. (1 తిమోతి. 2:2; హెబ్రీ. 5:7 cf..).
★
కృతఙ్ఞతాస్తుతులు
అనగా మన
జీవితములో దేవుని కృపాకార్యములను గుర్తించి, సమస్తమైన దీవెనలు ఆయన వలననే పొందితిమని
హృదయపూర్వక స్తుతులను ఆయనకు చెల్లించుటనే “కృతఙ్ఞతాస్తుతులు” అందురు. (1 దేస్స. 5:16; 2 దేస్స. 2:3; 1 తిమోతి. 2:2 cf..)
★
విజ్ఞాపన అనగా “ఇతరులపట్ల అనగా
నీ పొరుగువాడిని మరియు నీ సహోదరులు గూర్చియు
దేవునికి చేయు మనవిని విజ్ఞాపన అందురు.
(1 తిమోతి. 2:2; హెబ్రీ. 7:25; ఫిలేమోను. 1:4; 1 దేస్స. 1:2. cf..)
(G. Devadanam’s The New Testament
Worship, Vol I,
Page 59)
"ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైనది"..?
➢ ప్రార్థన అతి ప్రాచీనమైనది.
➢ కేవలము క్రైస్తవ
కాలములో మాత్రమే ప్రారంభమైనది కాదు.
➢
మొదటి మానవుడైన ఆదామునకు షేతు ద్వారా మనుమడు
కలిగెను. “అప్పుడు యెహోవా నామమున ప్రార్థన
చేయుట ఆరంభమైనది." - (ఆది.
4:26).
➢ పితరుల కాలములో ప్రార్థన
కొంతవరకు బలులతో సంబంధము కలిగియున్నట్ల మనము చూడగలము.
➢
"యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి—
నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును
కట్టెను.౹ అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును
తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ
యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹" -
(ఆది. 12:7-8).
➢ "అక్కడ అతడొక
బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి.. (ఆది. 26:25).
"పాత నిబంధనలో ప్రార్థన ఎవరికి చేయబడినది"..?
పాత నిబంధన కాలములో
విశ్వాసులు యెహోవాకు ప్రార్థన చేసినట్టుగా
చూడగలము.
● నోవాహు. - (ఆది. 8:20).
● అబ్రాహాము. - (ఆది. 18:22-24).
● ఎలియాజరు. - (ఆది.
24:11-14).
● ఇస్సాకు. - (ఆది.
25:21).
● యాకోబు. - (ఆది.
28:16-22).
● మోషే. - (నిర్గమ.
17:1-10; సంఖ్యా. 12:13; 20:1-8).
● యెహోషువ.- (యెహో.
10-12).
● మానోహ. - (న్యాయా.
13:8-9).
● హన్నా. - (1 సమూ.
1:10).
● సమూయేలు. - (1 సమూ
.8:6).
● దావీదు. - (1 దిన.
29:10-15).
● సొలోమను - (2 దిన.
1:8-10; 6:13-42).
● ఆసా. - (2 దిన.
14:11).
● యెహోషాపాతు.- (2
దిన. 20:4-14).
● ఏలియా. - ( 1 రాజులు.
18:36-39).
● ఎలీషా. - (2 రాజులు.
6:17-18).
● హిజ్కియా . - (2 రాజులు. 19:15).
● యోషీయా. - (2 దిన.
34:3).
● ఎజ్రా. - (ఎజ్రా.
10:1).
● నెహెమ్యా. - (నెహ.
1:5).
● యూదులు. - (ఎస్తేరు.
3:3-4; 3:13; 4:3-4; 14-15).
● యిర్మీయా. - (యిర్మీయా.
7:16).
● దానియేలు - (దాని.2:25;
6:1-8, 26-28; 9:1-27).
● యోనా. - (యోనా.2:1-10).
"నేటి క్రైస్తవులమైన మనము ఎవరికి ప్రార్థన
చేయాలి"..?
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రియైన దేవునికి ప్రార్ధన
చేయవలెను (మత్తయి. 18:19; యోహను. 15:16, 14:13; అపో.కార్య.12:5; కొలస్స. 3:17; 1 యోహాను. 3:22) మరియమ్మకు గానీ,
విగ్రహములకు గానీ ప్రార్థించకూడదు.
1. “మీలో ఇద్దరు తాము
వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి
దొరకునని మీతో చెప్పుచున్నాను." - (మత్తయి. 18:19).
2. "మీరు నా నామమున
దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును.౹" - (యోహాను.
14:13).
3. "మీరు నన్ను
ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు
వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.౹" - (యోహాను. 15:16).
4. "పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు
అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.౹" (అపో.కార్య. 12:5).
5. "మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి
చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును
ఆయన పేరట చేయుడి." - (కొలస్స. 3:17).
6. "మరియు మనమాయన
ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన
మనకు దొరుకును.౹" - (1 యోహాను. 3:22).
క్రొత్త నిబంధన చట్టము అమలులోనికి రాకమునుపు
అనగా ధర్మశాస్త్ర అంత్యదినములలో మన ప్రభువైన యేసుక్రీస్తు కొండమీద ప్రసంగములో ప్రార్థనగూర్చియు
(మత్తయి. 6:5-13). మరియు శిష్యుడు ఒకరు ప్రార్థనగూర్చి కోరగా (లూకా. 11:1-4) తెలియజేసెను. ఈ సందర్భములో ఆయన మాటల్లో ప్రార్థన పరలోకమందున్న మన తండ్రికి చేయాలని తెలియజేసిన విషయము
చూడగలము.
1. (మత్తయి.
6:5-13). "మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు
వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి
ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి
ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు
ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన
తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే
మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును; [9-10] కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి,
— పరకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము
పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి
తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము."
2. (లూకా. 11:1-4).
"ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రాౖర్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో
ఒకడు— ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన
నడిగెను. అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న
ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము
అని పలుకుడని వారితో చెప్పెను."
NOTE : పై వచనము అనగా (మత్తయి.
6:5-13; లూకా.11:1-4) ప్రార్థన ఎవరికి చెయ్యాలో అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి మాత్రమే
కాని ప్రస్తుతమున్న క్రైస్తవులు యేసు తెలియజేసిన ఆ ప్రార్థన అంతటిని ఆలాగునే చేయుట
అంగీకరమైనది కాదు. ఎందుకనగా, యేసు సిలువ మరణము ద్వారా
“ దేవుని రాజ్యము (క్రీస్తు సంఘము) వచ్చియున్నది
మరియు దేవుని చిత్తము పరలోకమందును భూమి మీదను నెరవేర్చబడినది”. కాబట్టి యేసు చెప్పిన
ప్రార్థన మాదిరి కొరకు మాత్రమే కనుక ఆ ప్రార్థనలో కొన్ని పదాలను ఉచ్చరించి నేడు ప్రార్ధించుట
సరియైన విధము కాదు.
మరి క్రైస్తవుడు.., "యేసుకు ప్రార్థన చేయవచ్చా"..?
అవును… మనము యేసునకు ప్రార్థన చేయవచ్చు.
ఇది చదవుతున్న నీవు తొందరపడి, క్రింద చెప్పబడిన దానిని ఆలోచన చేయకకుండా విపరీత వాదనకు రాకు సుమీ.
➔ నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
( యోహాను. 14:14).
➔ ప్రభువును గూర్చి మొరపెట్టుచుయేసు ప్రభువా,
నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని
ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను.
సౌలు అతని చావునకు సమ్మతించెను. ( అపో.కార్య. 7:59-60).
➔
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా
హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు
నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. అది నాయొద్దనుండి తొలగిపోవలెనని
దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.
( 2 కోరింథి. 12:7-8).
NOTE :- సహోదరులారా… మన శోధనలు, బాధలు, సమస్యలును యేసుక్రీస్తునకు ప్రార్థన
రూపములో చెప్పుకొనవచ్చు. కారణము ఈ విషయములలో మన ప్రభువైన యేసుక్రీస్తునకు అనుభవ జ్ఞానము
కలదు అనగా ఆయన శరీరముగా మన మధ్య నివసించాడు, బలహీనతలు మరియు శోధనలు అనుభవించాడు. దీనినిబట్టి
యేసునకు అనుభవ జ్ఞానము ఉందని మనము తెలుసుకొనగలము. ఇది గుర్తించిన పౌలు, స్తెఫను మన
అందరికి ప్రభువైన యేసుక్రీస్తునకు ప్రార్థన చేశారు.
● మన ప్రధానయాజకుడు
మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను,
ఆయన పాపము లేనివాడుగా ఉండెను. - (హెబ్రీ. 4:15).
● తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. (హెబ్రీ. 2:18).
“ప్రార్థన చేయువాడికి ఉండవలసిన మూడు ముఖ్యమైన
అర్హతలు” :-
(1 తిమోతి. 2:8).
1. కోపము లేనివాడు.
2. సంశయము లేనివాడు
అనగా అనుమానం లేనివాడు.
3. పవిత్రమైన చేతులు
గలవాడు అనగా పవిత్రమైన శీలము గలవాడు.
కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును
లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
“మనము ప్రార్థన ఎలా చేయాలి”..?
● విశ్వాసముతో, పట్టుదలతో - (యాకోబు. 1:5,6).
● విరిగి నలిగిన శుద్ధ
హృదయముతో - (కీర్తన 51:17; యెషయా. 57:15).
● అత్యాసక్తితో - (అపో.
కార్య. 12:5).
● సంతోషముతో - (పిలిప్పీ.
1:3).
● పరిశుద్ధాత్మలో ప్రార్థించండి - (యూదా 21).
● మానక - (కీర్తనలు.
109:4).
● మెలకువగా - (మత్తయి.
26:41).
● ఆత్మతోను/సత్యముతోను - (1 కోరింథి. 14:14-16).
● యెడతెగక - (1 దేస్స.
5:15).
● పట్టుదలతో. - (రోమా.
12:12).
● నిలువబడి. - (లూకా.
18:11; మార్కు.11:25; 1 రాజులు.8:22).
● ఉపవాసము చేత. - (మత్తయి.6:16-18;
అపో.కార్య.13:3; 14:23).
● నీ తోటివాడు నీ మధ్య
ప్రార్థన చేయునప్పుడు నీవు శ్రద్దగా చివరి వరకు విని “ఆమెన్” అనవలెను. - (1 కోరింథి.
14:14-17).
● వంగుట/తలవంచుట. - (ఆది.24:26; నిర్గ. 4:31).
● సాగిలపడి. - (మత్తయి.
26:39).
● మోకాళ్ళు. - (ఎపెసి.
3:14; లూకా.22:41; 1 రాజులు. 8:54; దానియేలు. 6:10).
“మనము ఏందుకు ప్రార్థన చెయ్యాలి”..?
➔ మన అపరాధములు క్షమించబడుటకు
- (మత్తయి. 6:14-15; కొలస్స. 3:13).
➔ అనుదిన ఆహారము కొరకు
- (మత్తయి. 6:11; సామెతలు. 30:8).
➔ ఋణములు కొరకు -
(మత్తయి. 6:12).
➔ శోధనలో & దుష్టుడు
తప్పించుకొనుటకు - (మత్తయి. 6:13; లూకా. 11:4).
➔ జ్ఞానము కొరకు -
(యాకోబు. 1:5)
➔ సమయోచితమైన సహాయము
కొరకు - (హెబ్రీ. 4:16).
“మనము ఏ సమయంలో ప్రార్థన చేయాలి”.. ?
❖ వేకువ జామున - (మార్కు 1:35).
❖ మద్యాహ్నము - (అపొ.కార్య.3:1; 10:9).
❖ సాయంత్రము - (కీర్తన.
55:17)
❖ రాత్రివేళ - (లూకా 6:12).
❖ భోజనము చేయునపుడు
- (కీర్తన. 53:4; యోహాను. 6:11).
❖ శ్రమలకాలములో- (యాకోబు
5:13).
❖ ఆపత్కాలములో - (కీర్తనలు 50:15).
❖ అనారోగ్యములో - (యాకోబు 5:14).
❖ బహుదుఃఖాక్రాంతులై
- (1 సమూయేలు. 1:10).
❖ నిత్యము ప్రార్థన
చేయవలెను - (లూకా 18:1; 21:36).
“ఎన్నిసారులు ప్రార్థన చెయ్యాలి”..?
● మనము యెడతెగక చేయవలెను.
- (1 దేస్స. 5:15).
● దానియేలు అనుదినము
ముమ్మారు చేసెను. - (దానియేలు. 6:10).
● దావీదు దినమునకు
ఏడూ మారులు చేసెను. - (కీర్తన. 119:164).
● కొర్నెలి ఎల్లప్పుడూ
ప్రార్థనచేయువాడు.- (అపో.కార్య. 10:2).
● యేసుక్రీస్తు దినమునకు
ఎన్నో మారులు చేసే సందర్భములు కలవు. - (మత్తయి. 14:23; యోహాను.11:41-42; మార్కు.8:6;
లూకా.5:16; 6:12....Etc).
“మనము ఎటువంటి ప్రార్థన చేయకూడదు”.. ?
❖ అవిశ్వాసముతో. - (యాకోబు. 1:6)
❖ హృదయములో పాపముతో.
- (కీర్తన. 66:18).
❖ విస్తరించిన మాటలతో.
- ( మత్తయి. 6:7).
❖ ఆయాసపడి. - (యెషయా.
16:12).
❖ శయ్యలపై పరుండి.
- (హొషేయ. 7:14).
❖ ధర్మశాస్త్రము వినకుండ
- (సామెతలు. 28:9).
❖ దీర్ఘ ప్రార్థనలు - (మార్కు
12:38-40).
❖ సమస్యలకు భయపడి దేవుని
నిర్ణయమునకు విరోధముగా ప్రార్థించకూడదు (నిర్గమ 3:4-11, 4:1-14)
❖ పరిసయ్యుడిలా -
(లూకా 18:11,11).
“ఎవరి కోసము ప్రార్థన చెయ్యాలి”..?
➢ మనుష్యులందరి కొరకు
- (1 తిమోతి. 2:1)
➢ రాజులు కొరకు - (1 తిమోతి. 2:2)
➢ అధికారులు కొరకు
- (1 తిమోతి. 2:2)
➢ సహోదరులు కొరకు
- (యాకోబు. 5:16; 2 తిమోతి. 1:3).
➢ మిమ్మును హింసించు
వారికొరకు. - (మత్తయి. 5:44; రోమా. 12:14).
➢ బాధించు వారి కొరకు - (లూకా. 6:28).
➢ సంఘము (మా) కొరకు
- (1 దేస్స. 5:25; హెబ్రీ. 13:18).
“బైబిలులోని క్లుప్త ప్రార్థనలు”
● సుంకరి ౼ ప్రభువా, నన్ను కరుణించుము - (లూకా 18:13)
● పేతురు ౼ ప్రభువా, నన్నురక్షించుము - (మత్తయి 14:30)
● దావీదు
- ప్రభువా నన్ను పరిశోధించుము - (కీర్తన
139: 23)
● కుష్ఠురోగి - ప్రభువా, నన్ను శుద్ధునిగా చేయుము – (మత్తయి
8:2)
● దావీదు - ప్రభువా, నన్ను కడుగుము – (కీర్తన51:2)
● సమూయేలు - ప్రభువా, ఆజ్ఞయిమ్ము – (1 సమూయేలు 3:10)
● మానోహ - ప్రభువా, మాకు నేర్పించుము – (న్యాయాధి13:8)
● శిష్యులు - ప్రభువా, ప్రార్థన నేర్పుము – (లూకా 11:1)
● కనాను స్త్రీ - ప్రభువా, నాకు సహాయము చేయుము – (మత్తయి15:25)
● సమ్సోను - ప్రభువా, నన్ను బలపరచుము – (న్యాయాధి.
16:16:28)
● సిలువపై దొంగ - యేసూ, నన్ను జ్ఞాపకము చేసుకొనుము – (లూకా
23:42)
● మోషే - ప్రభువా, నీ మహిమనునాకు చూపుము – (నిర్గమ
33:18)
● పౌలు - ప్రభువా, నేనేమిచేయవలెను – (అపొ.కార్య.
22:10)
● యెషయా - ప్రభువా, నన్ను పంపుము – (యెషయా 6:8)
కాబట్టి సహోదరులారా...మీ ప్రార్ధనలో లోపాలుంటే
వాక్యానుసారముగా మార్చుకొనుము. లోపాలు లేనిచో మరి ఎక్కువగా ప్రార్థన చేసి దేవునికి
దగ్గరకండి. ఈ అంశము వ్రాసిన మాకు భయము కలిగింది. మీకు ఎలా ఉందొ నిజముగా మాకు తెలియదు.
ఇంకా చాలా విషయాలు కలవు వాటన్నిటిని ఒక్కొక్కటిగా వ్రాసి మీకు అందుబాటులో ఉంచుటకు ప్రయత్నము
చేస్తాము. మీ అనుదిన ప్రార్థనలో మమ్మలి జ్ఞాపకము ఉంచుకొనుము.
🙇🏻 మానక ప్రార్థన చేయుము ( కీర్తన. 109:4) 🙇🏻♀
మీ ఆత్మీయులు,
మనోహర్ & నవీన.
+91-9705040236
: అంశము :
3 comments
commentsVandanamulu brother's
ReplyThanks god
Good Topic Sir
ReplyGood message
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com