దేవుని వాక్యము |
ప్రియ సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
నేటి క్రైస్తవ్యములో అనేకమంది సహోదరులు దేవుని వాక్యమును సరిగా పరిశీలన చేయక లేఖనములను వారికి అనుగుణముగా మార్చుకుంటూ పరిశుద్ధమైన దేవుని మాటలను ఇహలోక సంబంధమైన కోరికలను తీర్చుకొనుటకు ఉపయోగిస్తూ మనుష్యుల వలన వచ్చు మెప్పుని పొందుటకు ఎంతగానో తాపత్రయపడుతూ దేవుని వాక్యమును లోతుగా సరియైన విధానములో అర్థము చేసుకొనక పై పై మాటలు బోధిస్తూ దేవునికి విరోధముగా నడుచుకొనుచున్నారు. అయితే ప్రియులారా మనము నిజముగా దేవుని వాక్యమును ప్రేమించి అనుదినము లేఖనములను గ్రహించగలిగితే మొదట మన లోపములను మనము సరిచేసుకొని, ఎదుటివారికి బోధించగలము. ఈనాడు అనేకమంది క్రైస్తవ సోదరులు వారి లోపాలను సరి చేసుకోని వారిగా ఉన్నారంటే గ్రంధమును పూర్తిస్థాయిలో గ్రహించలేదనే చెప్పాలి.
నీవు నిజముగా దేవుని వాక్యమును ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమించగలవు (1 యోహాను. 2:5), నెమ్మది (కీర్తన. 119:165), సమాధానము కలిగియుంటావు (కొలస్సి. 3:15), ప్రేమ పూర్వకమైన హెచ్చరికలు చేయగలవు (యెహెజ్కేలు. 3:18-20, ఎఫెసీ. 4:15), సత్యమును ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలవు (ఎఫెసీ. 4:21). పరిశుద్ధ గ్రంథము కూడా ఈ విధముగా సమాధానమిస్తుంది....
A). "దేవుని వాక్యము మన హృదయములోని ప్రతి తలంపును శోధించును".
» ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. – (హెబ్రీ. 4:12).
B). "దేవుని వాక్యము మనకు ఆదరణిచ్చును".
» ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. – (రోమా. 15:4).
C). "దేవుని వాక్యము క్రీస్తులో సహవాసము కలుగజేయును".
» అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. – (లూకా. 8:21).
D). "దేవుని వాక్యము వివేకము కలుగజేయును".
» యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. – (కీర్తన. 111:10).
E). "దేవుని వాక్యము మనలను ధన్యులుగా చేయును".
» దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. – (లూకా. 11:28).
F). "దేవుని వాక్యము మనలను జ్ఞానవంతులుగా చేయును".
» కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. – (మత్తయి. 7:24).
G). "దేవుని వాక్యము పాపము నుండి మనలను రక్షించును".
» నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. – (కీర్తన. 119:11).
H). "దేవుని వాక్యము శాంతిని కలుగజేయును".
» నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును. – (సామెతలు. 3:1-2).
I). "దేవుని వాక్యము మనము రక్షణలో ఎదుగుటకు సహాయపడును".
» సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – (1 పేతురు. 2:2-3).
J). "దేవుని వాక్యము సమస్త కల్మషము నుండి విడుదల కలుగజేయును".
» సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. – (యాకోబు. 1:21).
K). "దేవుని వాక్యము తెలివికి మూలము".
» నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును. – (కీర్తన. 119:130).
L). "దేవుని వాక్యము వెలుగై యున్నది".
» నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. – (కీర్తన. 119:105).
M). "దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేయును".
» ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. – (1 దేస్సాలోనిక. 2:13).
N). "దేవుని వాక్యము బాధలలో నెమ్మది కలిగించును".
» నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. – (కీర్తన. 119:50).
O). "దేవుని వాక్యము దుష్టిని మార్గములనుండి తప్పించును".
» నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. – (కీర్తన. 119:101).
P). "దేవుని వాక్యము ప్రతి శోధన నుండి నిన్ను తప్పించును".
» నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. – (ప్రకటన. 3:10).
ఏదో అందరు చెప్తున్నారు కదా అని నీ లోపములు సరిచేసుకొనకుండా వాక్యమును బోధించడానికి కాని, గ్రంథము చేత పట్టుకొనడానికి కాని సాహసించినట్లయితే, అటువంటి వారికి దేవుడిచ్చు హెచ్చరిక ఏమనగా,...
★ భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. – (కీర్తన. 50:16-17).
★ ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?. – (రోమా. 2:21).
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com