యెషయా 9:6 వివరణ (Isaiah 9:6)

యెషయా 9:6 వచనము



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


📖 (యెషయా 9:6): "ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును."


🔘 మన ప్రభువైన యేసుక్రీస్తు నరమాత్రుడు కాదు అని చెప్పుటకే యెషయా 9:6 వచనములోనున్న విషయాలు ప్రవకైన యెషయా ద్వారా ముందుగా వ్రాయబడ్డాయి.


🔘 యేసునకు మాత్రమే పెట్టబడే పేరులు లేదా బిరుదులు ఇవి.


🔘 దైవత్వము గలవాడు కొద్ది కాలము నరుడుగా పుట్టి, దాసుని స్వరూపం ధరించి తన పని ముగిస్తాడని.


🔘 ఈ భూమి మీద తాను చేయనున్న పనిని అనగా శక్తిని గూర్చి, జ్ఞానం గూర్చి ముందుగా పలికిన సందర్భం. 


🔘 యేసు ఏలుబడి చేసే రాజు అవుతాడని, అటు తరువాత తాను చేయనున్న రాజరికాన్ని గూర్చి, పరిపాలన గూర్చి, ఆదరణ గూర్చి, ప్రజలను దేవునితో సమాధానం పరుచుట గూర్చి ముందుగా పలికిన సందర్భం. 



📝 మనకు శిశువు పుట్టెను :

"మనకు శిశువు పుట్టెను" అనగా ప్రభువైన యేసు యావత్తు భూమ్మీదనున్న వారికి నిరంతరం రాజై ఉండి, ఏలుబడి చేయుటకు, ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును అనేది దీని యొక్క ముఖ్య అర్థమే కానీ ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును అనేది దీని యొక్క అర్ధం కాదు.


దావీదుతో దేవుడు చేసిన నిబంధన "నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగా– నేను నీకు సంతానము కలుగజేయుదును.౹ నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.౹ అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;౹ నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతునుగాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.౹ నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.౹"(2 సమూయేలు. 7:11-16).


కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును(యెషయా. 16:5). యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును..." (యిర్మీయా. 23:5-6). ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. (యిర్మీయా. 33:17). వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును(యేసును) వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.౹ (యెహెజ్కేలు. 34:23-24) 


"ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను." (లూకా. 1:31-33). "అందుకు పిలాతు– నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు– నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను..." (యోహాను. 18:37)



📝 మనకు కుమారుడు అనుగ్రహింపబడెను :

మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనగా సిలువ మరణములో అని అర్థం. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹" (యోహాను. 3:16). "తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు..." (రోమా. 8:32)



📝 ఆయన భుజముమీద రాజ్యభారముండును :

ఆయన భుజముమీద రాజ్యభారముండును అనగా రాజ్యానికి సంబంధించిన భారం ఉంటుంది లేదా రాజ్యపాలన లేదా సంఘ పరిపాలన యొక్క బాధ్యత ఉంటుంది అని అర్థం. "మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.౹ ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది." (ఎపేసి. 1:22-23) "సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు;..." (కొలస్సి. 1:18) "ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.౹ మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.౹ ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.౹ ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.౹ అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.౹ ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.౹" (1 కోరింది. 25:20-25)



👤 ఆశ్చర్యకరుడు :

ఆశ్చర్యకరుడు అనగా ఈ పదం ఆయన అద్భుతమైన శక్తిని మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆయన చేసే పనులు అసాధారణమైనవి మరియు ఊహకు అందనివి అని సూచిస్తుంది.


నీటిని ద్రాక్షరసంగా మార్చడం (యోహాను. 2:1-11). ఐదు వేల మందికి ఆహారం పంచుట(మత్తయి. 14:15-21; మార్కు. 6:35-44) "అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి." (మత్తయి. 8:26-27)


"యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను."(మత్తయి. 7:28-29). "సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.౹ యూదులు అందుకు ఆశ్చర్యపడి– చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.౹ అందుకు యేసు– నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹" (యోహాను. 7:14-16).



👤 ఆలోచనకర్త :

 ఆలోచనకర్త అనగా ఒక వ్యక్తి తన సమస్యలకు లేదా నిర్ణయాలకు సలహా కోరే వ్యక్తిని ఆలోచనకర్త అని పిలుస్తారు. "సలహాదారు" లేదా "గురువు" లేదా "ఆలోచన తెలియజేయువాడు" అనవచ్చు. 


"అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు –బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతోకూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు– కైసరువనిరి. అందుకాయన– ఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి." (మత్తయి. 22:15-22). 



👤 బలవంతుడైన దేవుడు :

బలవంతుడైన దేవుడు అనగా దేవత్వము గల మన ప్రభువైన యేసు అపవాది కంటే బలవంతుడు అని అర్ధం. 


🍂  యేసుక్రీస్తు అందరికి దేవుడు ❌

🍃 యేసుక్రీస్తు అందరికి ప్రభువు  (అపో.కార్య. 10:36).


యేసునకు దేవుడు ఎవరో ఆయనే మనకు దేవుడు. యేసు మాటల్లో... "నా దేవుడు(my God), మీ దేవుడు(your God)" (యోహాను. 20:17). "ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా(my God), నా దేవా(my God) నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము." (మత్తయి. 27:46). "దేవుడొక్కడే" (లూకా. 18:19). 


"బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు." (లూకా. 11:21-23).



👤 నిత్యుడగు తండ్రి :

నిత్యుడగు తండ్రి అనగా నిత్యత్వము గలవాడని, తండ్రిలా ఆదరించువాడని, తన ప్రజల పట్ల తండ్రిలా ప్రేమ చూపించువాడని, లేదా పాపం చేసిన వారిని వెంటనే శిక్షించక మారుమనస్సు దయచేసి అవకాశం ఇచ్చువాడనియు, వారు మారుమనస్సు పొందిన యెడల రక్షించువాడని అర్థం. ఈ బిరుదు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన తన దేవునితో ఉన్న సంబంధాన్ని మరియు ఆయన శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. 


యేసుక్రీస్తు కాలక్రమంలో ఎప్పటికీ అంతం లేనివాడు, ఆయన దేవుని కుమారుడు మరియు ఆయన దేవునితో నిత్యత్వములో  ఎప్పటికీ ఉన్నవాడు. యేసు ప్రార్థనలో... "తండ్రీ, లోకము పుట్టకమునుపు [నీయొద్ద నాకు] ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను. 17:5).


ఇదిగో నిత్యుడగు తండ్రి అని ఉంది కదా యెహోవాయే యేసు, యేసే యెహోవా అనే బోధ అపవాది ఆలోచనలు నుండి పుట్టినది. ఇది అబద్ధపు బోదె కానీ దేవుని బోధ కాదు. యేసే మనకు తండ్రి అనేడి వారు లేఖనములను అపార్థం చేసుకుంటున్నారనేది వాస్తవం. యేసు మాటల్లో..."నా తండ్రి(my Father) మీ తండ్రి(your Father)" (యోహాను. 20:17). "మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు." (మత్తయి. 23:9).



👤  సమాధానకర్తయగు అధిపతి :

అధిపతి అనగా రాజు, ప్రభువు, అధికారి అని అర్థం. సమాధానకర్తయగు అధిపతి అనగా యేసుక్రీస్తును వర్ణించడానికి ఉపయోగించే ఒక బిరుదు. దీని అర్థం, ఆయన శాంతిని స్థాపించేవాడు, రక్షకుడు అని లేదా మనుషులు మధ్య దేవునితో సమాధానమును మరియు వారి అంతరంగంలో శాంతిని నెలకొల్పువాడని అర్థం.


"ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(రక్షకుడు) అను పేరు పెట్టుదువనెను." (మత్తయి. 1:21). "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.౹" (యోహాను. 14:27). "ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.౹" (1యోహాను. 2:2). మనం యేసుక్రీస్తును నమ్మినప్పుడు, దేవునితో మన సంబంధం సరిదిద్దబడుతుంది మరియు మనం ఆయనతో సమాధానంగా ఉంటాము. ఇది కేవలం భావోద్వేగ శాంతి మాత్రమే కాదు, దేవునితో విరిగిపోయిన సంబంధం యొక్క మరమ్మత్తు. క్రీస్తు మరణం ద్వారానే మనం దేవునితో సమాధానపరచబడియున్నాము." (రోమా. 5:1; 10-11).



📖 (యెషయా 9:7): "ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును."


క్రీస్తు సంఘము(చర్చ్ ఆఫ్ క్రెస్ట్) యొక్క శాశ్వత స్వభావాన్ని ఇది హైలైట్ చేస్తుంది. తన సంఘము వారి యెడల ఆయన పరిపాలన మరియు సమాధానం ఎప్పటికీ అంతం కాదని, ఆయన న్యాయం మరియు నీతితోనే తాను యుగయుగములు దావీదు సింహాసనంపై శాశ్వతంగా పరిపాలిస్తాడని అనేది సందేశం.



🔎 ఓ చదువరి... యెషయా 9:6 వచనం యేసు కేవలం నరమాత్రుడు కాదని తెలియజేయుటకును మరియు ఆయన గూర్చి అద్భుతమైన పరిపాలకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని  పేర్లు పెట్టబడతాయని యెషయా ద్వారా ప్రవచించబడిన దానికి ముఖ్య ఉద్దేశ్యం యేసు యొక్క ప్రత్యేకమైన గుణాలను మరియు దైవత్వాన్ని, రాజరికానికి, ఆదరణకు, క్రీస్తు ఏలుబడికి, అలాగే మనుషులకు మరియు దేవునికి మధ్య సమాధానం నిలుపుటకు ముందుగా సూచించబడి, పెట్టబడే బిరుదులని గుర్తుంచుము.

మీ ఆత్మీయులు👪

🍃 యెహోవా దేవుడే యేసుగా వచ్చాడా!? Click Here  

🍃 యేసుక్రీస్తు యొక్క దేవత్వము Click Here

🍃 యేసు యొక్క దేవుడు ఎవరు? Click Here 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16