మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
పరిశుద్ధ గ్రంథము సూచించిన కాలములు అనగా "పితరుల కాలం" (ఆదికాండం 1వ అధ్యా. To నిర్గమకాండం 19వ అధ్యా.), "మోషే కాలం/ధర్మశాస్త్ర కాలం" (నిర్గమకాండం 20వ అధ్యా. To అపోస్తులుల కార్యములు 1వ అధ్యా), మరియు "క్రైస్తవుల/క్రీస్తు కాలం" (అపోస్తులుల కార్యములు 2వ అధ్యా. నుండి నేటి వరకు…) లో గల విశ్వాసులు ఒకే దైవమును ఆరాధించారు. ఆయనే – యెహోవా(YHWH).
ఇది గ్రహించక, ఆలోచించక, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రామాణికంగా తీసుకొనలేక కొందరు క్రైస్తవులు తమకు బహు(ఇద్దరు/ముగ్గురు) ఆరాధ్య దైవములు కలరని బోధిస్తూ, వాక్యమును వక్రీకరిస్తూ, మనకు తోచినట్టుగా ఆరాధించవచ్చు అనే భావనలో ఉండి, అపవాది యొక్క తంత్రములను ఎరుగక వాడి ఉద్దేశ్యమును నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇటువంటి స్వేచ్ఛారాధికుల భారిన పడకుండా సత్యాన్ని ఎల్లప్పుడూ అన్వేషించే శోత్రులకు అర్థమగుటకు లేఖనములను ఆధారముగా చూపిస్తూ "ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH) తండ్రి మాత్రమే" అని తెలుపుటయే ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది.
ఆరాధన యొక్క నిర్వచనం :
యెహోవా మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మహోన్నతుని ఆదేశాల ప్రకారము క్రమబద్ధమైన విధానములో జరిగించేది ఆరాధన అనబడుతుంది". (2 దినవృత్తా. 29:20-30 పోల్చి చూడుము).
1️⃣. పితరుల కాలం :
ఆరాధన అనే ఆలోచన మనిషి యొక్క ఆలోచనలు నుండి పుట్టలేదు. దేవుడైన యెహోవాయే దీనిని స్వయంగా స్థాపించాడు. ఆదాము నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు మనుష్యులు ఆరాధించిన దైవం ఒక్కడే ఆయనే యెహోవా.
👤ఆదాము : "చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని,... " (ఆది.కాం. 3:8). ఆదాము మరియు అతని భార్య యెహోవాతో సంప్రదింపులు/ అంత గొప్ప సహవాసం కలిగి ఉండేవారు. ఆరాధన అనే పదం అక్షరార్ధముగా లేకపోయినప్పటికి ఆదాము తన దేవుడికి లోబడే స్థితి, స్వభావం, సహవాసం మరియు క్రమశిక్షణను బట్టి నిర్ణయించుకోగలం. వారికి బాగుగా తెలుసు తమ సృష్టికర్త ఎవరో, తమ దేవుడు ఎవరో, తమ ఆరాధ్య దైవం ఎవరో అనే సంగతులు. మరి ముఖ్యముగా దేవుడే ఆదాముకు బలిపద్దతి నేర్పించాడు. ఆదాము తాను స్వయముగా దేవునికి బలి అర్పించినట్టుగా గ్రంథములో వ్రాయబడనప్పటికీ తన బిడ్డలైన హేబెలు & కయీను దేవునికి బలి అర్పించారు.
👤 హేబెలు & కయీను : హేబేలు కయీను లు తమ దేవుడైన యెహోవాకు తమ అర్పణలు అర్పించిన ఆరాధికులే. అయితే హృదయపూర్వకంగా అర్పించిన హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు అయితే యదార్థమైన హృదయముతో కాక తనకు నచ్చినట్టుగా అర్పించిన అర్పణ దేవుడు లక్ష్యపెట్టలేదు .... ఆదాము కుమారులైన హేబేలు కయీను దేవుని ఆరాధన చేశారు అని చెప్పుటకు వారు అర్పించిన అర్పణలే నిదర్శనం... (తండ్రి నేర్పించకుండా బిడ్డలకు ఏలాగున తెలియును!?).
"హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను;౹" (ఆది.కాం. 4:4).
"కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.౹" (ఆది.కాం. 4:3).
👤ఎనోషు : "...షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది." (ఆది.కాం. 4:26)
👤నోవాహు : తనను జల ప్రళయము నుండి కాపాడిన దేవునికి పవిత్రమైన వాటిని దహనబలిగా అర్పించుట ద్వారా నోవాహు దేవున్ని ఆరాధించెను. అతను అర్పించినది దేవునికి అంగీకారమైనది.
"అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.౹ అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి– ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹" (ఆది.కాం. 8:20-21)
ఇలా చూస్తుపోతే దేవున్ని ఆరాధించిన పితరుల జాబితాలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు యెహోవా పేరిట బలిపీఠములు కట్టారు. తమను నడిపించిన దేవునికి ప్రార్థన చేశారు. తమ దేవుడైన యెహోవానే ఆరాధించారు.
👤అబ్రహాము : "యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి— నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.౹ అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹" (ఆది.కాం. 12:7-8) "నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.౹" (ఆది.కాం. 24:4)
👤ఇస్సాకు : "అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై– నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.౹ అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.౹" (ఆది.కాం. 26:23-25)
👤యాకోబు : "దేవుడు యాకోబుతో– నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటనుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన యింటివారితోను తనయొద్దనున్న వారందరితోను– మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమదినమున నా కుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.౹ వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.౹ వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.౹ యాకోబును అతనితోనున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.౹ అతడు తన సహోదరుని యెదుటనుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరుపెట్టిరి.౹" (ఆది.కాం.35:1-7). "విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.౹" (హెబ్రీ. 11:21).
"మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా అని..."(నిర్గమ. 3:15) చెప్పినమాట మీరు చదువలేదా? పితరుల కాలం దేవుడు తన్ను తాను ఇలా కనపరుచుకొనెను కదా.
2️⃣. ధర్మశాస్త్రము/మోషే కాలం :
పితరుల కాలంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తాను సర్వశక్తిగల దేవుడనని పరిచయం చేసుకున్న దేవుడు మోషేతో తన నామమును "నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని" పరిచయం చేసుకొనెను. (నిర్గమ. 3:14) "నేను యెహోవాను…(YHWH)".
"నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.౹" (నిర్గమ. 6:3).
ఇశ్రాయేలీయులు తమది కానీ ఐగుప్తు దేశములో 4౦౦ సం. పైబడి బానిసలుగా నున్న(నిర్గమ. 12:40-41) పిమ్మట దేవుడు మోషేకు నాయకత్వ బాధ్యతను అప్పగించి వారిని ఫరో బానిసత్వం నుండి విడిపించి, ఎర్ర సముద్రం గుండా నడిపించి, సీనాయి పర్వతము యొద్దకు చేరిన తరువాత ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనలో ముఖ్యమైన ఆజ్ఞను వారికి జారీ ఏమనగా… "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.౹" (నిర్గమ. 20:3-4).
అప్పటినుండి వారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేస్తూ వచ్చారు.,,
✅ యూదులు/ఇశ్రాయేలీయుల యొక్క ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH).
🔖 "ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.౹ నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.౹" "నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.౹" (ద్వితీయో. 6:4-5; 10:20)
🔖 "యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.౹" (యెహోషువ. 24:15)
🔖యెహోవాను ఆరాధించు స్థలమొకటి….(2సమూ. 15:32)
🔖యెహోవాను ఆరాధించి స్తుతించిరి. (2దిన. 7:3)
🔖యెహోవాకు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి (2దినవృత్తాంతములు. 29:25-30)
🔖యెహోవా మందిరములో ఆరాధించుటకై (యిర్మియా. 26:1-2)
🔖యెహోవాకు ఆరాధన చేయవలెను (యెహెజ్కేలు. 46:3).
🔖"... యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు...." (యోహాను. 4:21)
✅ సమరయులు యొక్క ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH).
సమరయులు కూడా ధర్మశాస్త్ర కాలానికి చెందినవారే. యూదులు యెరూషలేము దేవాలయములో యెహోవా దేవున్ని ఆరాధిస్తే... సమరయులు ఏమో గెరిజిమ్ అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ యెహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. మోషే గారు వ్రాసిన పంచకాండాలు(5 పుస్తకాలు) మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఇందులో నిర్గమ.కాం. 20:17 వచనము తమకు అనుగుణముగా మార్చుకొని గెరిజిమ్ పర్వతం మీద యెహోవా దేవున్ని(తండ్రిని) ఆరాధించేవారు.
యేసుకు మరియు సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణలో సమరయులు కూడా యెహోవా దేవున్నే ఆరాధిస్తారనే విషయం స్పష్టమైనది .
"మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹" (యోహాను. 4:20-21).
ధర్మశాస్త్ర కాలములో ప్రజలచేత ఆరాధింపబడిన ఏకైక దేవుడు యెహోవా (𝐘𝐇𝐖𝐇) మాత్రమే.
3️⃣. క్రీస్తు లేదా క్రైస్తవుల కాలం :
ఆనాడు పితరుల కాలములో నూ, ధర్మశాస్త్ర కాలములోనూ భక్తులచేత/విస్వాసులచేత ఆరాధింపబడిన ఆ యెహోవా దేవుడే, నేడు క్రైస్తవులచేత కూడా ఆరాధింపబడుటకు పాత్రుడు అని యేసు బోధించాడు. యేసు శరీరధారిగా ఉన్న దినాలలో బోధించిన బోధ నీటి క్రస్తావులకు ప్రామాణికంగా ఉండాలి. యేసు, తాను తండ్రికి ప్రార్థన చేసాడు మనలను కూడా తండ్రికి ప్రార్థించమని చెప్పాడు. తాను తండ్రికి విధేయత చూపాడు మనలను కూడా తండ్రికి విధేయత చూపమని మనకు మాదిరిని ఉంచాడు. తాను తండ్రిని ఆరాధించాడు మనలను కూడా తండ్రికి ఆరాధన చేయమని, తండ్రికి ఆరాధన చేయువారినే తండ్రి వెదుకుతున్నాడని హెచ్చరించాడు.
"యేసు వానితో– సాతానా, పొమ్ము — ప్రభు వైన నీ దేవునికి(YHWH) మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను." (మత్తయి. 4:10). పరిశుద్ధుడవైన తండ్రీ,(యోహాను 17:11) నీతి స్వరూపుడవగు తండ్రీ, (యోహాను. 17:25) ఆయన పరిశుద్ధ నామముతోనే ప్రార్థన చేశారు.
"మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹" (యోహాను. 4:22) [ మేము] అనే మాటలో తాను (యేసు) కూడా ఉన్నాడనే సంగతి తెలియడం లేదా? ఇంకా అర్థము కానిచో యేసు తండ్రిని ఆరాధించాదనుటకు క్రింది లేఖనములే ఋజువులు…
🔖 8వ దినమున/సున్నతి పొందుటకు - లూకా. 2:27-28
🔖 12వ ఏటా - లూకా. 2:41-42
🔖 30వ ఏటా - యోహాను. 2:13,23
🔖 31వ ఏటా - యోహాను. 6:4; 7:2,8- 14; 10:22
🔖 32వ ఏటా - యోహాను. 11:55-56; 12:1-20;
🔖 33వ ఏటా - మత్తయి. 26:17-20; యోహాను. 19:14; లూకా. 22:1
"ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను, వారములపండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.౹" (ద్వితీయో. 16:16).
✅ సంఘము తో కలసి తండ్రిని ఆరాధించుటలో
తండ్రిచేత ప్రభువుగాను, క్రీస్తుగాను నియమింపబడిన యేసు నేడు తన సంఘముతో (శరీరముతో) కలిసి తండ్రిని ఆరాధిస్తాడు.
"పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక –నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు –నే నాయనను నమ్ముకొనియుందును అనియు –ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.౹" (హెబ్రీ. 2:11).
✅ క్రైస్తవుల ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే తండ్రి
ఎవరైతే యేసును తమ నోటితో ప్రభువుగా(రాజుగా) ఒప్పుకొని, దేవుడు(YHWH) మృతులలోనుండి యేసును లేపెనని తమ హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షింపబడుదురు. (రోమా. 10:9; ఫిలిప్పీ. 2:11). ఇలా నోటితో ఒప్పుకొని, బాప్తీస్మం పొంది, క్రీస్తు సంఘముగా చేర్చబడి, ప్రభువైన యేసుక్రీస్తు ఏలుబడి క్రింద ఉంటూ, యేసు బోధను అనుసరిస్తూ, యేసును దేవుని కుమారుడిగా, క్రీస్తుగా, ప్రభువుగా గౌరవించి, యేసు ద్వారా తండ్రిని ఆరాధించి , ప్రార్థన చేసి , భక్తి, విధేయత చూపి, అపోస్తులల బోధలో తమ జీవితాలను సరిచేసుకొంటూ, విశ్వాస యాత్రలో వెనుదిరుగక తమ జీవితాలను కొనసాగించేవారే క్రైస్తవులుగా పిలువబడుతారు .(అపో. కార్య. 2:36-42; 8:37; 9:20; 10:36; 47, 1కోరింది 1:2; 12:3; రోమా 16:16; 2 దేస్స. 2:15).
ఇట్టి వారందరికి అనగా క్రైస్తవులకు దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి (1 కోరింది. 8:6). ఆ ఒక్క దేవుడే అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. (ఎపేసి. 4:6). ఆ ఒక్క దేవుడికే క్రైస్తవులు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలనేది ప్రభువైన యేసు యొక్క అజ్ఞా. (యోహాను. 4:21-24) ఆ ఒక్క దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధన మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, పరిశుద్ధాత్మ వలన ఆరాధించాలనేది క్రొత్త నిబంధన స్పష్టత ఇస్తుంది. (కొలస్సి. 3:17; ఎపేసి. 2:18; ఫిలిప్పీ. 2:11; 3:3).
🔎 Note : మనకు/అందరికి దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే 👤 అని అర్ధం. ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని లేదా నలుగురిని 👥 పెట్టడం పూర్తిగా వాక్య వక్రీకరణ అగును కదా.. ఆలోచించుకో…
📌 ముగింపు
ఓ చదువరి… అన్ని కాలాల్లో ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనే యెహోవా(YHWH) తండ్రి మాత్రమే అనే సంగతి గట్టిగా గుర్తించుము. ఆ యెహోవాయే మన దేవుడు ఆయన ఒక్కడే అనగా అద్వితీయుడు. (ద్వితీయో. 6:4; మార్కు 12:29; యోహాను.17:3) క్రొత్త నిబంధన ప్రకారం ఆయనే అందరికి తండ్రియైన దేవుడు. (ఎపేసి. 4:6). యేసు మాటల్లో దేవుడొక్కడే(లూకా. 18:19) యెహోవాను(తండ్రిని) మాత్రమే ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుము(యోహాను. 4:24).
🔥 యేసుక్రీస్తుని కూడా ఆరాధన చేస్తాము/చేయచ్చు అని తలస్తున్నవారికి ఒక ప్రశ్న, సంఘముతో అనగా తన శరీరముతో కలిసి తండ్రిని ఆరాధన చేసే యేసుక్రీస్తు తనని తాను ఏలాగు ఆరాధించుకుంటాడు? అలా ఆరాధించాడు అనుటకు ఋజువులు ఏమిటి? ఆలోచన చేయండి 🙏
మీ ఆత్మీయులు 👪
▼ మరెన్ని అంశాలు కొరకు ▼
↪ ఆరాధన కోరిన దేవుడు ఎవరు?క్లిక్ చేయు
↪ దేవుడు ఒక్కడే అంటే ఎవరికి?క్లిక్ చేయు
↪ యేసు ఆరాధింపబడ్డారా?క్లిక్ చేయు
↪ యేసు తన్ను సేవించమనే కోరారు క్లిక్ చేయు
↪ యెహోవా దేవుడే యేసుగా వచ్చారా?క్లిక్ చేయు
↪ ఆరాధనలో యేసు యొక్క పని?క్లిక్ చేయు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com