మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
పరిశుద్ధ గ్రంథము అంతటిలో ఒక స్పష్టమైన సత్యము ఏమనగా — ఆరాధనకు, పండుగలకు, విధానాలకు అధికారం మనుషులకు కాదు; దేవుడికే(YHWH) ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయములో ఈ సత్యము మరింత స్పష్టంగా ప్రకటించబడింది.
— ఏ పండుగ చేయాలి?,
— ఎప్పుడు చేయాలి?,
— ఎలా చేయాలి?,
— ఎవరు చేయాలి?,
— ఎందుకు చేయాలి?,
— ఎన్ని రోజులు చేయాలి?,
— ఎక్కడ చేయాలి?,
అన్న ప్రతీ అంశాన్ని దేవుడైన యెహోవాయే స్వయంగా అజ్ఞాపించుట మనం చూడగలం. ఇవి మానవ సంప్రదాయాలు కాదు, సామాజిక ఆచారాలు కాదు, తరతరాలుగా సొంతగా మనుషులు ఏర్పరచుకున్న విధానాలు కూడా కావు.
లేవీయకాండము 23వ అధ్యాయం మొదలుకొని నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండముల వరకు దేవుడు తన ప్రజలైనా ఇశ్రాయేలీయులతో స్పష్టంగా మాట్లాడి, పండుగల యొక్క ఉద్దేశ్యాన్ని, కాలాన్ని, క్రమాన్ని నిర్ధారించాడు. దేవుని పండుగలు ఆయన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే ఆత్మీయ నియమాలు గాను, ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకజనులుగా వేరు చేయు గుర్తులుగా గాను ఇవ్వబడ్డాయి. అందుకే దేవుడు వాటిలో ఏదియు చేర్చకూడదని, ఏదియు తీసివేయకూడదని కఠినంగా హెచ్చరించాడు. (ద్వితీయో. 4:2; 12:32 చదువుము)
ఈ విషయాన్ని సరిగా గ్రహించకపోతే, మనుషుల ఆలోచనలు దేవుని ఆజ్ఞల స్థానంలోకి వచ్చి ఆరాధనను, పండుగలను వ్యర్థంగా మార్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఈ అంశంలో మనము ఇశ్రాయేలు ప్రజలకు పండుగల విషయములో దేవుడు ఏమేమి పండుగలు అజ్ఞాపించాడు? ఎందుకు అజ్ఞాపించాడు? ఎలా అజ్ఞాపించాడు? అన్నదాన్ని వాక్య ఆధారముగా పరిశీలించబోతున్నాము. ఇది దేవుని అధికారాన్ని గౌరవించుటకు, లేఖన పరిమితులలో నిలుచుటకు మనకు సహాయపడుతుంది.
📖 (లేవీయకాండము 23:1-2,4): "మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము– మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.౹ … ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.౹"
☑ యెహోవా నియామకకాలములు అనగా the feasts of the LORD = "యెహోవా పండుగలు"
☑ ఇశ్రాయేలీయుల పండుగలు మనుషులు ఆలోచన మేర కలిగినవి కావు
☑ దేవుడైన యెహోవాయే స్వయంగా స్థాపించునవి.
✅పాత నిబంధనలో యెహోవా ఆజ్ఞాపించిన పండుగలు✅
1️⃣. పస్కా పండుగ :
🍃 ఎవరు చేయాలి? ⇆ ఇశ్రాయేలీయులు
🍃 ఎందుకు చేయాలి? ⇆ ఐగుప్తు విమోచన/బానిసత్వం నుండి
🍃 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేము/నివాస స్థలములలో
🍃 ఎప్పుడు చేయాలి? ⇆ 1వ నెల మొదటి నెల (అబీబ్ / నిసాన్) 14వ దినం
🍃 ఎలా చేయాలి? ⇆ మచ్చలేని, ఒక సంవత్సరపు మగ గొర్రె బలి, అగ్నితో కాల్చిన మాంసమును తినవలెను
🍃 ఎన్ని రోజులు? ⇆ 1 రోజు
🍃 వాక్య ఆధారం ⇆ నిర్గమ 12:1–14,23; లేవీ 23:5
2️⃣. పులియని రొట్టెల పండుగ :
🍂 ఎవరు చేయాలి? ⇆ ఇశ్రాయేలీయులు సంతానం
🍂 ఎందుకు చేయాలి? ⇆ విమోచన జ్ఞాపకార్థం, తరతరాలకు బోధనగా
🍂 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేము/నివాస స్థలములలో
🍂 ఎప్పుడు చేయాలి? ⇆ 1వ నెల మొదటి నెల (అబీబ్ / నిసాన్) 14వ దినం
🍂 ఎలా చేయాలి? ⇆ పులియని రొట్టెలు, చేదు కూరలతో, పొంగని వాటిని, హోమార్పణము, ఏ పని చేయకూడదు
🍂 ఎన్ని రోజులు? ⇆ 7 రోజులు
🍂 వాక్య ఆధారం ⇆ నిర్గమ 12:15-19;13:1–10,23; లేవీ 23:6-8
3️⃣. మొదటి ఫలముల పండుగ :
🌾 ఎవరు చేయాలి? ⇆ ఇశ్రాయేలీయులు సంతానం
🌾 ఎందుకు చేయాలి? ⇆ దేవుడే జీవనాధారుడు అని గుర్తించుటకు, భూమి ఫలములకు దేవునికి కృతజ్ఞత తెలియజేయుటకు, పంట దేవునిదని ఒప్పుకోలు, కృతజ్ఞత, ఆశీర్వాదం, విధేయత
🌾 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో
🌾 ఎప్పుడు చేయాలి? ⇆ పస్కా తరువాత వచ్చే వారంలో — విశ్రాంతిదినము తరువాతి దినమున
🌾 ఎలా చేయాలి? ⇆ మొదటి పంట పనను యాజకుని యొద్దకు తీసికొని రావాలి, యాజకుడు యెహోవా ఎదుట దానిని ఊపవలెను, బలులు అర్పించాలి, ఆ రోజు వరకు ఆ కొత్త పంట తినకూడదు.
🌾 ఎన్ని రోజులు? ⇆ 1 రోజు
🌾 వాక్య ఆధారం ⇆ నిర్గమ 23:19; లేవీ 23:9–14; ద్వితీయోపదేశకాండం 26:2,10
4️⃣. పెంతెకొస్తు పండుగ :
🍁 ఎవరు చేయాలి? ⇆ ఇశ్రాయేలీయులు సంతానం
🍁 ఎందుకు చేయాలి? ⇆ కోతకు కృతజ్ఞత, ఆనందం, విధేయత
🍁ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో
🍁 ఎప్పుడు చేయాలి? ⇆ మొదటి ఫలముల దినము తరువాత 50వ రోజు
🍁 ఎలా చేయాలి? ⇆ యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము, పులియుతో చేసిన రెండు రొట్టెలను అర్పించాలి, జంతుబలులు అర్పించాలి, పరిశుద్ధ సంఘముగా కూడవలెను, ఏ పని చేయకూడదు.
🍁 ఎన్ని రోజులు? ⇆ 1 రోజు
🍁 వాక్య ఆధారం ⇆ లేవీ 23:15–21; ద్వితీ 16:9–12
5️⃣. బూరల పండుగ :
🌿 ఎవరు చేయాలి? ⇆ ఇశ్రాయేలీయులు సంతానం
🌿 ఎందుకు చేయాలి? ⇆ ప్రాయశ్చిత్త దినానికి సిద్ధపడుటకు
🌿 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో
🌿 ఎప్పుడు చేయాలి? ⇆ 7వ నెల 1వ రోజు
🌿ఎలా చేయాలి? ⇆ బూరలు మ్రోగించాలి, బలులు అర్పించాలి,
🌿 ఎన్ని రోజులు? ⇆ 1 రోజు (దీనికి వెంటనే ప్రాయశ్చిత్త దినము, గుడారాల పండుగ వస్తాయి)
🌿 వాక్య ఆధారం ⇆ లేవీ 23:23–25.
6️⃣. ప్రాయశ్చిత్త దినము పండుగ :
🍀 ఎవరు చేయాలి? ⇆ ఇశ్రాయేలీయులు సంతానం
🍀 ఎందుకు చేయాలి? ⇆ ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం,
🍀 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో
🍀 ఎప్పుడు చేయాలి? ⇆ 7వ నెల 10వ దినం
🍀 ఎలా చేయాలి? ⇆ సంపూర్ణ ఉపవాసము & దుఃఖము, ఆహారం, పని, ఆనందం – అన్నీ నిలిపివేయాలి. ఏ పనియైనను చేయకూడదు, ఏ పనియైనను చేయువానిని నాశనమే.
🍀 ఎన్ని రోజులు? ⇆ 1 రోజు
🍀 వాక్య ఆధారం ⇆ లేవీ 16; లేవీ 23:26–32
7️⃣. గుడారాల / పర్ణశాలల పండుగ :
🌴 ఎవరు చేయాలి? ⇆ ఇశ్రాయేలీయులు సంతానం
🌴 ఎందుకు చేయాలి? ⇆ అరణ్యయాత్ర జ్ఞాపకార్థం, కృతజ్ఞత, ఆనందం
🌴 ఎక్కడ చేయాలి? ⇆ యెరూషలేములోని మందిరంలో
🌴 ఎప్పుడు చేయాలి? ⇆ 7వ నెల 15వ దినం నుండి
🌴ఎలా చేయాలి? ⇆ గుడారాలు (పర్ణశాలలు) కట్టుకొని నివసించాలి. ఆకులు, కొమ్మలతో ఆనందించాలి, బలులు అర్పించాలి
🌴 ఎన్ని రోజులు? ⇆ 7 రోజులు పండుగ + 1 రోజు మహాసభ.
🌴 వాక్య ఆధారం ⇆ లేవీ 23:33–43;
8️⃣. ముగింపు:
పాత నిబంధన కాలములో దేవుడు భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించిన పండుగలు అన్నియు యాదృచ్ఛిక ఆచారాలు కావు. దేవుడే స్వయముగా "ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎన్ని రోజులు చేయాలి" అనే సంగతులను వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు. తన్ను పండుగ సమయాల్లో ఆరాధించుటలో ఏ మనుషుడు స్వేచ్ఛకి/ఆలోచనకు తాను అవకాశం ఇవ్వలేదనే అర్థమేగా…
తాను నిర్దేశించిన కాలములు, విధానములు, ఉద్దేశ్యములు అన్నియు పవిత్ర ఆజ్ఞలే. అయితే బైబిల్ స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే — ఈ పండుగలన్నీ మోషే ధర్మశాస్త్రానికి చెందినవి, మరియు అవి క్రీస్తు రాకతో నెరవేరినవి అని అవి కేవలం నీడలు మాత్రమే అని గుర్తించగలం (కొలస్సయులు 2:16–17; హెబ్రీయులు 10:1). ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించిన పండుగలను, కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులపై బలవంతంగా విధించడం లేఖనాలను అతిక్రమించుటకు సమానం అవుతుంది
దేవుడు తాను ఆజ్ఞాపించిన పండుగలు కాక ఇశ్రాయేలు ప్రజలు తమకు తాము ఊహించుకొని, ఏర్పాటు చేసిన ఎట్టి పండుగలైన దేవుడు ఏ మాత్రం అంగీకరించక, వారి పైన ఉగ్రతను చూపారనే సంగతిని ఈ క్రింది అంశము క్లిక్ చేసి చదివి గుర్తించు…
ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించని పండుగలుక్లిక్ చేయు
హెచ్చరిక :
బైబిల్‌లో ఆజ్ఞ లేకుండా, దేవుడు నిర్దేశించని పండుగలను లేదా ఆరాధన విధానాలను “దేవునికి ఆరాధన” అని చెప్పి అనుసరించడమూ పాపం. కాబట్టి, పండుగ అయినా, ఆచారం అయినా, సంప్రదాయం అయినా —
👉 లేఖనంలో స్పష్టమైన ఆజ్ఞ ఉందా?
👉 ఎవరి కోసం ఆజ్ఞాపించబడింది?
👉 ఏ కాలానికి సంబంధించినది?
అనే ప్రశ్నలను పరిశీలించకుండా ఏదైనా ఆచరించడం ఆత్మీయంగా ప్రమాదకరం.
ఈ హెచ్చరికను లెక్కచేయకుండా, దేవుడు చెప్పని ఆరాధనలను అనుసరించితే, అది భక్తిగా కనిపించినా దేవునికి అనుకూలమైన ఆరాధన కాదు. అందుకే ప్రతి విశ్వాసి సాంప్రదాయాన్ని కాదు — లేఖనాన్ని, భావోద్వేగాన్ని కాదు — సత్యాన్ని ఎంచుకోవాలి.
మీ ఆత్మీయులు 👪


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com