Showing posts with label గుడ్ ఫ్రైడే. Show all posts
Showing posts with label గుడ్ ఫ్రైడే. Show all posts

భస్మ బుధవారం - శ్రమ దినాలు (Ash Wednesday - Lent Days)

భస్మ బుధవారం - శ్రమ దినాలు 

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


💥 భస్మ బుధవారం : శ్రమ దినాలు(లెంట్) యొక్క ప్రారంభ దినమును (లేదా) ఏటేటా వివిధ తేదీల్లో వచ్చే ఈస్టర్ పండుగకు సరిగ్గా 40 దినాలకు ముందు వచ్చే బుధవారమును భస్మ బుధవారం అంటారు. 

▪️ దీని అధికారిక నామం - The Day of Ashes అనగా నొసటిపై బూడిద వ్రాసుకొనే రోజని అర్థం. 

▪️ ఆరోజు ప్రతి ఒక్కరు నుదుట పైన బూడిదతో శిలువ గుర్తును ధరిస్తారు.

▪️ విభూతి బుధవారం, బూడిద బుధవారం అని అందురు.


💥 శ్రమ దినాలు/ శ్రమ కాలం : ఈస్టర్‌కు ముందు 40 రోజుల కాలమును శ్రమ కాలం అని పిలువబడేది. దీని అధికారిక నామం - Lent అనగా బుధవారం నుండి అనగా భస్మ బుధవారం ఈస్టర్ వరకు 40 వారపు రోజులలో పాటించే ఉపవాసం మరియు ఒకరి పాపాలకు పశ్చాత్తాపం చెందే కాలం.


🔴 భస్మ బుధవారమనేది శ్రమ దినాలలో ప్రారంభ దినం.


✅  ఎవరు చేస్తారు?

నేటి సమాజంలో క్రైస్తవులమని పిలువబడుతున్న లూథరన్లు, సి.ఎస్.ఐ, మెథడిస్టులు, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, రోమన్ కాథలిక్కులు, వీరి నుండి వివిధ శాఖలుగా వ్యాప్తి చెందినవారు, ఆంగ్లికన్ తెగలకు చెందిన ఆంగ్లికన్ క్రైస్తవులు, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు వీరు "గ్రేట్ లెంట్" అని పిలువబడే లెంట్‌ను పాటించేవారు. నేటికి ఇతర ప్రొటెస్టెంట్ సంఘాలవాళ్ళు కూడ వీటిని ఆచరించుట మనం చూస్తున్నాము.


✅ ఏ రోజు చేస్తారు?

ఈస్టర్ యొక్క ఆదివారానికి ముందు 40 రోజులు లెక్కించి(6 ఆదివారాలు మినహాయించి అనగా లెక్కించకుండా) చేస్తారు. ఇవి ఏటేటా ఫిబ్రవరి 4 నుండి మార్చి 11 మధ్య అనగా ఈస్టర్ యొక్క తేదీని బట్టే నిర్ధారణ చేసుకొని చేస్తారు. ఈస్టర్ కోసం తెలుసుకోవాలంటే మేము ముందుగా వ్రాసిన ఈస్టర్ క్లిక్ చేయు
అను అంశమును ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు.


✅ ఎప్పుడు ప్రారంభం అయ్యింది?

మన పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి ప్రస్తావన లేనప్పటికీ సంఘము ప్రారంభమైన 300సం. తరువాత అనగా 4వ శతాబ్దంలో ప్రారంభమైనదని నమ్మేవారు సంఖ్యా ఎక్కువగా కలదు. మరికొందరేమో 11వ శతాబ్దంలో ప్రారంభం అయ్యిందనీ చెప్తారు. ఇంకొందరు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రారంభించిన 5వ శతాబ్దపు పోప్ గ్రెగొరీ ది గ్రేట్ అనే వ్యక్తి ప్రవేశపెట్టారని చెప్పుకొనేవారు కూడా లేకపోలేదు.


▪️  శ్రమ దినాలు యొక్క మూలాలు మరియు ప్రారంభ చరిత్ర క్రీ.శ. 325లో నైసియా కౌన్సిల్ తర్వాతనే... 

▪️ క్రీ.శ. 333 ≈ 6 రోజులుగా చేసుకొనేవారు.

▪️ క్రీ.శ. 334 ≈ 46 రోజులుగా ప్రారంభం. 

▪️ క్రీ.శ. 390 ≈  శ్రమ దినాలు కొనసాగించుట కొరకు ముందుగా భస్మం బుధవారంగా జరుపడం ప్రారంభించారు.

▪️ ఆనాటి నుండే బూడిదెకు ఓలీవనూనె కలిపి నుదిటిపై శిలువ గుర్తు ఆకారం వేసుకొనే ఆచారం మొదలైంది. 


✅ ఎందుకు భస్మ బుధవారం అన్నారు?

ఈస్టర్ తేది నుండి వెనుకకు 40 రోజులు లెక్కిస్తే(ఆదివారాలు మినహా...) వచ్చే వారం బుధవారం కాబట్టి ఈ రోజును భస్మ బుధవారం అన్నారు. అదే మంగళవారం వస్తే భస్మ మంగళవారం అనుండేవారేమో! 


✅ ఎందుకు శ్రమ దినాలు అన్నారు?

భస్మ బుధవారం నుండి  ఈస్టర్ వరకు వచ్చే 40 వారపు రోజులలో వారు పాటించే ఉపవాసం మరియు ఒకరి పాపాలకు పశ్చాత్తాపం చెందే, దాన ధర్మాలు చేసే ఈ కాలాన్ని శ్రమ దినాలు అన్నారు. మునుపు బాప్టిస్ట్ సంఘ సభ్యులు తమ బాప్తిస్మం రోజుకు ముందు 40 రోజులు ఉపవాసం ఉండాలని అనుకొని జరిగించే ఈ ఆచారం కాస్త ఇప్పుడు ఈస్టర్ కి ముందు 40 రోజులు ఉపవాసం ఉండటం ఆచారంగా మారిపోయింది. 


✅ ఎందుకు చేసేవారు? 

 పైన తెలిపిన ఆయా సంఘాలు వారు నుదుటికి సిలువ గుర్తు బూడిదను పూసుకొని, 40 దినాలు ఉపవాస, ప్రార్థనలో, దాన ధర్మాలు వలన ఇలా తమ ఆత్మలను శుద్ధి చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరవుతారని, మన్నైన నీవు మరలా మంటికే చేరతావు గనుక నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది రక్షించబడమని ఒకరినొకరు హెచ్చరిక చేసుకొనుటకు చేస్తున్నారనే నానుడి కలదు. మరికొందరు ఏమో పాత నిబంధనలో కొంత మంది బూడిదలో కూర్చొని విలపించినట్లు, దుఃఖించినట్లు, గోనెపట్ట కట్టుకొని ఉన్నట్లు ఉండే ఆయా సందర్భాలను ఆధారం చేసుకుని చేస్తున్నామని చెప్పుకొనేవారు కూడా లేకపోలేదు.


✅ ఎలా చేసేవారు?

మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు "ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి —జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి."(యోహాను. 12:13). ఇలా ఆనాడు ఆయనను యెరూషలేములోకి స్వాగతం పలికిన సందర్భాన్ని ఆధారం చేసుకొనే ఈ మట్టల ఆదివారాన్ని ఆచరిస్తారు. ఇది ఈస్టర్ కి ముందుగాను వచ్చే ఆదివారం నాడు మరియు భస్మ బుధవారం తరువాత జరిగే పండుగ. దీని కోసం ఇక్కడ చర్చించ బోవడం లేదు కానీ ముందుగా వ్రాసిన "మట్టల ఆదివారం" క్లిక్ చేయు
అనే అంశాన్ని క్లిక్ చేసి పూర్తిగా చదవగలరు.


ప్రస్తుతం మన ప్రాంతాల్లో కూడా ఆరోజున ఖర్జూరపుమట్టలు దొరకనందున వాటి స్థానములో ఈత మట్టలను లేదా తాటి ఆకులను పట్టుకొని వాటికి పూలు గుచ్చి, హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ పాటలు పాడుతూ, బోలో యేసు మహారాజుకు జయము అంటూ వీధుల్లో తిరుగుతారు. ఇలా పట్టుకొని తిరిగిన వాటిని తిరిగి వారి సంఘాల్లో, ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా ఉండటం వారికి శుభప్రదమని భావిస్తారు. 


ఇలా ఎండిపోయిన మట్టలన్నీ కాల్చి, బూడిద చేస్తారు.  ఇలా కాల్చి బూడిద చేయడం అనేది కొందరు ఈస్టర్ ఆదివారానికి మరుసటి రోజే చేస్తే, మరికొందరు ఈస్టర్ నుండీ 50వ రోజున జరిగే పెంతెకోస్తు పండుగ దినాన చేస్తారు. ఇలా కాల్చి బూడిద చేసి దానిని సేకరించి, నిలువ చేస్తారు. అలా నిల్వ చేసిన బూడిదను మరుసటి సంవత్సరమున భస్మ బుధవారం రోజున ఉపయోగించేవారు. 


🧍🏿‍♂️ ఎలా చేసేవారంటే?     గత సంవత్సరమున సేకరించిన  బూడిదనే ఈ భస్మ బుధవారం నాడు ఆయా సంఘాపు పాస్టర్ లేదా బిషప్ వ్యక్తులు సిలువ ఆకారంలో విశ్వాసుల నుదుటిపై పూసి, వారి తలపై చల్లుతూ "మన్నైన నీవు మరలా మంటికే చేరతావు గనుక నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది రక్షించబడమని" చెప్పుతారు. ఈ పని బిషప్పులూ, పాస్టర్లే చేస్తారు. మరికొన్ని సంఘాల్లో ఐతే అక్కడ  విశ్వాసులే బూడిదను హోలీ వాటర్ అని చెప్పబడే నీళ్ళని లేదా ఒలీవ నూనె ని కలిపి నుదుట తమ నుదుటిపై సిలువ ఆకారపు గుర్తుగా పూసుకొంటారు. ఇలా చేస్తూ ఈ బూడిద పశ్చాత్తాపానికీ, మారుమనస్సుకీ గుర్తు అనీ, అందుకే దీనిని ఆచరిస్తున్నాము అనీ చెప్తారు.


✅ బైబిల్ ఏమి సెలవిస్తుంది?

                   ప్రియమైన సహోదరులారా... ఈ భస్మ బుధవారం & శ్రమ దినాలనేవి మాత్రమే కాక మనం ఏమి చెయ్యాలనుకున్నా, ఏమి చేసిన సరి ఈ క్రింది మూడు విషయాలను మన మదిలో పెట్టుకొని చేయాలి. అదేమనగా...,

1) యేసుక్రీస్తు బోధలలో చెప్పబడిందా?

2) ఆదిమ అపోస్తులుల బోధలో చెప్పబడిందా?

3) ఆదిమ క్రీస్తు సంఘము అనుసరించిదా?

                  మన పరిశుద్ధ గ్రంథములో వీటిని గూర్చి రవ్వంతైన సమాచారం లేదు. యేసు గానీ, అపోస్తులలు గానీ చేసినట్టు గానీ, ఆజ్ఞాపించినట్టుగా గానీ ఒక్క ఆధారం లేదు, కేవలం క్యాథలిక్ సంఘపు బోధలే కానీ దైవ బోధ కాదు. మరి నేడు కొన్ని సంఘాల్లో ఎలా ఇంతలా వ్యాప్తి చెందాయంటే కేవలం దైవ గ్రంథాన్ని సరిగ్గా విభజన చేసి ఆలోచన చేయకపోవటం/ నేర్చుకోకపోవడమే/ నేర్పించకపోవడమే దీని ప్రధాన సమస్య.


🔵 భస్మ బుధవారాన్ని ఆచరించే వారు నుదుట బూడిద పూసుకునేవారు బూడిద అనేది పశ్చాత్తాపానికీ, మారుమనస్సుకీ గుర్తు అనీ భావించి అందుకే మేము దీనిని ఆచరిస్తున్నాము అనీ చెప్తారు. నిజానికి పశ్చాత్తాపం చెందడం కోసం, మారుమనస్సు పొందడం కోసం ఒక రోజు కేటాయించాల్సిన అవసరం ఏం ఉంది? అలా చెయ్యమని వాక్యంలో ఎక్కడ చెప్పబడింది?  క్రొత్త నిబంధన ప్రకారం ఏ మనుష్యుడైన పాపం విషయంలో పరిశుద్ధాత్మ చేతనే మొదటగా ఒప్పించబడతాడు. "అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.౹ ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.౹ లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.౹" (యోహాను. 16:7-11). ఇలా ఆయన చేత ఒప్పించబడి, పశ్చాత్తాపంలోకి నడిపించబడి, మారుమనస్సు పొందుకునేలా ఆయనే నీ హ్రుదయములో పొడువబడే సందేశాన్ని వినిపిస్తారు. ఒక చక్కటి ఉదాహరణకు "వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని(పొడువబడి) —సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా౹ పేతురు– మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹" (ఆపో.కార్య. 2:37-38). ప్రతీ క్రైస్తవుడు మారుమనస్సు పొందటమనేది నిత్య దినచర్యగా ఉండాలి. అంతేకాని దాని ఒక రోజు కేటాయించి, ఆ రోజు మట్టుకు లేక ఆ నలభై దినాల మట్టుకూ ఆచార సంబంధమైనవేవో చేసేస్తే సరిపోతుంది అని చెప్పడమనేది పూర్తిగా బైబిల్ కి విరుద్ధమైన బోధ అగును కదా!


"యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది." (లూకా. 24:47) "ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.౹" (ఆపో.కార్య. 17:30) "...దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?౹" (రోమా. 2:4) "నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.౹" (ప్రకటన. 2:5) "మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని..." (ప్రకటన. 2:21). 


నేటి విశ్వాసుకులను వారి సంఘాల్లో భస్మ బుధవారం చేయుమని శోధించేవారు గ్రంధములో ఎన్నుకొనే కొన్ని వచనాలు ఏమనగా.., యోబు. 42:6; దానియేలు. 9:3; యోనా. 3:5-6; ఎస్తేరు. 4:1-3 వాటిని గూర్చి బోధిస్తూ వారికి వలె మేము నేడు చేస్తున్నామని తమ్మును తాము సమర్ధించుకొనే వారు లేకపోలేదు. అటువంటి వారికి సమాధానమేమనగా.., వారు కారణాలు బట్టి, పరిస్థితులు బట్టి, వారు దుఃఖిస్తూ, దేవున్ని వేడుకొంటూ, తమకు తామే బూడిదలో కూర్చొని మారుమనస్సు పొందే కార్యక్రమం చూడగలం. అంతేకాని సంవత్సరాంతం చేసే పనులకు మారుమనస్సు పొందుదాం అంటూ ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొని, అందరూ కూడుకొని, పశ్చాత్తాపపడట్లేదు. ఇలా చేయుటలో దైవ దృష్టికి శూన్యమే కదా!. మారుమనస్సు పొందాలి అనుకునే వ్యక్తి తనకు తాను వ్యక్తిగతంగా చేసే పని అది. అంతేకాని నేటి వలె "ఈ రోజు భస్మ బుధవారం కాబట్టే మనమంతా సంఘముగా కూడుకొని, అందరూ కలిసి పశ్చాత్తాపడదాం, ఈరోజే మారుమనస్సు పొందుదామని" ఇలా చేసినట్లుగా పైన పాత నిబంధనలో వచనములు చెప్పలేదని గమనించాలని కోరుచున్నాను. 


ఓ చదువరి... ఇన్ని మాటలడుకున్నప్పటికి కూడా ఇంకా పాత నిబంధన భక్తులకు వలె మేము చేస్తున్నాము, మా పాస్టర్ చెప్పేది చేస్తున్నాను, పాత నిబంధనలో ఉంది కదా ఇక తప్పేంటి అని నీకు నీవు సమర్ధించుకోవడానికి ప్రయత్నం చేస్తే... "మరి వారి వలె మీరెందుకు  గోనెపట్ట కట్టుకొని, బూడిదలో కూర్చుకోవడం లేదు? నుదుటికి సిలువ గుర్తు ఆకారములో బూడిద పూసుకొని అలా అందరూ తల మీద జల్లుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది? గత సంవత్సరం మట్టల ఆదివారం లో ఉపయోగించే మట్టల యొక్క బూడిదనే భస్మ బుధవారం నాడు పూసుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది?" వారికి వలె మేము చేస్తున్నామని అపోహ పడుతున్న మీ ఆలోచనలకి నా ప్రశ్నలను లేవనెత్తి ఆలోచింపజేశాను తప్పా మిమ్మల్ని అలా చేయమని కోరుట లేదని గమనించగలరు.


🔵 శ్రమ దినాలు(లెంట్ డేస్) ఆచరించే వారుకి దాని అర్థం గానీ, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి... అనే విషయాలు గూర్చి బైబిల్ లో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. మరి క్రీస్తుయేసు నందు ఉన్నవారు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో అనే విషయాలను దేవుడే ఎంతో స్పష్టంగా గ్రంథము రూపములో వ్రాసి అనుగ్రహించినప్పుడు, అందులో ఉన్నవి తెలుసుకొని అలా చేస్తే సరిపోతుంది కానీ బైబిల్ లేనివాటిని తిరిగి బైబిల్ కి కలిపి, చెరిపి చేసే అధికారం ఎవరికి ఇవ్వబడలేదు. కాబట్టి బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించనది ఏదైనా సరి అది కేవలం మనుషులు కల్పించిన ఆచారాలే అగును కదా. "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా — ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి" (మత్తయి. 15:6-7). మనుషులు కల్పించిన ఆచారమే ఈ శ్రమ దినాలు. ఇలా వీటిని చేయమని బోధించే వారు, వీటి ద్వారా ఆరాధన చేసేవారు వ్యర్థమైన ఆరాధికులై యుందురు.


 యేసు బాప్తీస్మం పొందిన పిమ్మట(మత్తయి. 3:14-17) పరిచర్య ప్రారంభించే ముందు ఆయన 40 దినాలు చేసిన ఉపవాసాన్ని(మత్తయి. 4:1-2) ప్రామాణికం చేసుకొని మేము నేడు శ్రమ దినాలను(లెంట్ డేస్) ఆచరిస్తున్నాం అని చెప్పుకొనే వారు లేకపోలేదు. "బాప్తీస్మం ముందు అనగా 30 సం. వ్యవధిలో గానీ మరియు బాప్తీస్మం అనంతరం అనగా 33 1/2  సం. కాల వ్యవధిలో ఏటేటా ఆయన 40 దినాలును(లెంట్ డేస్) పాటించినట్టుగా ఒక్క వాక్య రుజువు ఉందా? లేదు కదా" కాబట్టి యేసు చేశారు కాబట్టి మేము చేస్తున్నమని ఎలా సమర్ధించుకోగలరు? దయచేసి ఆలోచించమని మనవి. 


ప్రియ చదువరి... అనేకమంది బోధకులు గ్రంథాన్ని సరిగ్గా విభజన చేతకాకే(2 తిమోతి. 2:15) తమకు నచ్చిన రీతిలో వాక్య వక్రీకరించి, వారి పద్ధతులను, ఆచారాలను, ఆలోచనలను బైబిల్ కి కలపడం వలనే ఈ భస్మ బుధవారం, శ్రమ దినాలు, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, సమాధుల పండుగ, క్రిస్మస్...Etc. వంటివి పుట్టుకు వచ్చాయి. యేసుక్రీస్తు బోధ కంటే, ఆదిమ అపోస్తులుల బోధ కంటే, ఆదిమ క్రీస్తు సంఘము అనుసరించే బోధ కంటే ఇంకా గొప్పగా దేవునికి భక్తి చెయ్యాలనే వారి ఆలోచనలు వలనే ఇలాంటి పండుగలు పుట్టుకు వచ్చాయని గుర్తించుకో. మీలో ఏ ఒక్కరూ కూడా పరమతండ్రిని వ్యర్థంగా ఆరాధించేవారయ్యుండకూడదనే ఈ సంగతులను మీకు వ్రాసి ఇచ్చుచున్నాము. 

▪️ 2 తిమోతి 3:14: "... నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.౹"

▪️ 2 థెస్స 2:15 - "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి."

మీ ఆత్మీయులు

WhatsApp Join Us   Telegram Join Us

"ఈస్టర్" (Easter)

ఈస్టర్ 

నా ప్రియ సహోదరీ సహోదరులారా మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు

💥 EASTER (ఈస్టర్) ఈ ఇంగ్లిష్ పదము అనేది ఇస్తార్ (ISHTAR) అనే గ్రీక్ పదము నుండి కలిగింది.

👉 క్రీస్తు పూర్వముననే ISHTAR అని బబులోను "దేశపు ఆకాశరాణినీ"  పూజలు చేసేవారు. 

👉 (యిర్మియా 7:18) - నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.

👉 (యిర్మియా 44:7-19) - "కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు– ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటిబిడ్డలును యూదా మధ్యనుండకుండ నిర్మూలముచేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు? మీకు మీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్క రింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు? వారు యూదాదేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీపితరులు చేసిన చెడుతనమును యూదారాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా? నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీపితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.౹ కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీకు కీడుచేయునట్లు, అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించు కొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందినవారుగాను ఉందురు.౹ యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.౹ కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహా సమాజముగా కూడినవారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి– యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,౹ మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.౹ మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.౹ మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా"

ISHTAR నీ హిబ్రులో ASTAROTH (అస్తారోత్ దేవత) అని
 
 👉 సొలొమోను అప్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. (1రాజులు 11:5)
  
👉 అతని ఆయుధములను అప్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేతాను పట్టణపు గోడకు తగిలించిరి. (1సమూయేలు 31:10)

ఫోనిషియన్ల చంద్ర దేవత, ప్రకృతిలో నిష్క్రియ సూత్రాన్ని సూచిస్తుంది, వారి ప్రధాన  దైవం సూర్య దేవుడు మరియు పురుష దేవతతో ( న్యాయా 10:6; 1 సముయే. 7:4; 12:10 ) తరచుగా సంబంధం కలిగి ఉంటారు. ఈ పేర్లు తరచుగా బహువచనంలో అష్టరోత్, & బాలిమ్. బహుశా వివిధ విగ్రహాలు లేదా దేవతల యొక్క విభిన్న మార్పులను సూచిస్తాయి. ఈ దేవతను జిడోనియన్ల అష్టోరెత్ అని పిలుస్తారు. ఆమెను అకాడియన్ల ఇష్తార్ అని మరియు గ్రీకులు & అస్టార్టే ( 1 రాజులు 11:5; 11:33; 2 రాజులు 23:13; యిర్మియా 44:17). సౌలు కాలంలో ఫిలిష్తీయుల మధ్య ఈ దేవత ఆలయం ఉంది (1 సముయే 31:10). ఇష్తార్ పేరుతో, ఆమె అస్సిరియన్ల గొప్ప దేవతలలో ఒకరు. ఫోనిషియన్లు ఆమెను అస్టార్టే అని పిలిచేవారు. రాజైన సోలోమోను మొదటగా ఈ విగ్రహ ఆరాధనను పరిచయం చేశాడు ( 1 రాజులు 11:33) యెజెబెల్ యొక్క 400 మంది యాజకులు బహుశా దాని సేవలో నియమించబడ్డారు (1 రాజులు 18:19). దీనిని "ఆకాశరాణి" అని పిలిచేవారు (యిర్మియా 44:25)

🐰 ఈ దేవత చిహ్నము EGGS BUNNY eggs Bunny


EASTER (ఈస్టర్) అనే పదము బైబిల్లో ఉందా?


నేటి క్రైస్తవ్యములో ఈస్టర్ అనే పదమునకు అనేక అర్ధాలు ఉండవచ్చు కానీ వాటి అన్నింటిని పరిశుద్ద గ్రంథము కొట్టివేస్తుంది అదేమనగా…

💭 ఈస్టర్ అనే పదము బైబిల్ అంతటిలో "అపో.కార్య. 12:3-4" వచనము లోనే మాత్రమే చూడగలము. అక్కడ పస్కా పండుగ (Passover) అనే పదమునకు ఈస్టర్ (Easter) అని ఇంగ్లిష్ లో చూడగలము.

Acts 12:3-4 King James Version (KJV)

And because he saw it pleased the Jews, he proceeded further to take Peter also. (Then were the days of unleavened bread.) And when he had apprehended him, he put him in prison, and delivered him to four quaternions of soldiers to keep him; intending after Easter to bring him forth to the people.


💭 ఈస్టర్ అనే పదము క్రీ.శ 1604-1611 మధ్య కాలములో మొదటి సారిగా ఇంగ్లిష్ బైబిల్ (KJV లో) తప్పుగా ముద్రించబడింది.


Acts 12:3-4 New King James Version (NKJV)

And because he saw that it pleased the Jews, he proceeded further to seize Peter also. Now it was during the Days of Unleavened Bread. So when he had arrested him, he put him in prison, and delivered him to four squads of soldiers to keep him, intending to bring him before the people after Passover.


💭 మరల ఆ పదమును క్రీ,శ 1979-1982 మధ్య కాలములో "అపో.కార్య. 12:3-4" వచనములను 'Easter' అనే పదమునకు బదులుగా (Passover) అని NKJV లో మార్చివేయడం జరిగింది.

పస్కా పండుగ అంటే ఈస్టర్ అని అర్ధమా?


పస్కా(PASSOVER) అనే పదము హీబ్రూ పదమైన ( חַג הַפֶּסַח -  Ḥag haPesaḥ) నుండి తర్జుమా చేయబడింది. దీనిని గ్రీక్ లో "Pascha" (πάσχα) అని, ఇంగ్లీష్ లో "Passover" అని, తెలుగు లో "పస్కా పండుగ" లేదా "పులియని రొట్టెలు పండుగ" అని అంటారు

పస్కా (Passover) అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. (లుకా 22:1).

👉 పస్కా అంటే ఈస్టర్ అని అర్ధము ఇస్తే పాత నిబంధనలో PASSOVER అనే ఉన్నచోట EASTER అనే ఉండాలి కానీ అలా పరిశుద్ధ గ్రంథములో లేదు. (ద్వితి 16:1-6; నిర్గమ 12:11,21,27,43,48; లేవి. 23:5) బైబిల్ తెరిచి చూడుము

NOTE :: పైన తెలిపిన వాటిని బట్టి పస్కా అంటే ఈస్టర్ కాదని తెలుసుకొనగలరు. ఈ పస్కాపండుగ గూర్చిమరింత సమాచారం కోసం ఈ లింక్ చేసి చూడుము. Click Here


క్రైస్తవులు ఈస్టర్ చేయచ్చా?


మన ప్రభువైన యేసుక్రీస్తును తమకు సొంత రక్షకుడుగా అంగీకరించి, తమ నోటితో ప్రభువని/దేవుని కుమారుడని ఒప్పుకొని, మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము అయన నామములో బాప్తీస్మం పొంది, అయన స్థాపించిన క్రీస్తు సంఘము(Church of Christ) లో చేర్చబడి, అపోస్తలుల బోధలో తమ జీవితాలను దిద్దుబాటు చేసుకొని, నడిపించుకొనే వారు వాక్యానుసారమైన క్రైస్తవులు. పరమతండ్రి వీరికి యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ క్రొత్త నిబంధనను గౌరవించి దానిలో ఒకటి కలపడం, దానిలో నుండి తీసివేయడం వంటివి చేయక తూ.చ. తప్పక పాటించెడివారై ఉంటారు. 

పైన తెలిపిన వారికి కాస్త ఎక్కువ భిన్నముగానే నేటి క్రైస్తవులు/సేవకులు అనబడేవారు ఉన్నారని చెప్పుకోవాలి. ఏలయనగా.., వీళ్ళు ఆచరించే లెంట్ డేస్, భస్త్మ బుధవారం, మౌఉండి గురువారం, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, సమాధుల పండుగ, క్రిస్మస్, నూతన సంవత్సరం మరి ముఖ్యముగా ఈస్టర్ అనేవి పరిశుద్ద గ్రంథములో లేవని తెలిసినప్పటికి, ఎవరైన గట్టిగా ప్రశ్నిస్తే వాటిని గ్రంధములో చూపలేమని తెలిసినప్పటికి, వారికి ఇవి చేయమని చెప్పిన సంఘ సేవకుల పరువు పోకూడదని, ఇతరుల యెద్ద చులకన అవుతావేమోనని, సువార్త పేరుతో, సంవత్సరానికి ఒక్కసారి కూడా క్రీస్తు జ్ఞాపకం చేసుకోకూడదా అనుకుంటూనే వీటిని వారి సంఘాల్లో వేడుకగా ఆచరిస్తూ దేవుడు చెప్పని, పరిశుద్ద గ్రంథములో లేని ఎన్నో సంగతులను క్రొత్త నిబంధనకు కలిపి, చెరిపి బోధిస్తున్నారు.

💥 ఉదాహరణకు : "ఈస్టర్ అనే పండుగ మనుషులు ఆలోచనలు మేర కలిగాయి అనుటకు రుజువులు"👇👇

ఈస్టర్ 2021 - "ఏప్రిల్ 04"
ఈస్టర్ 2022 - "ఏప్రిల్ 17"
ఈస్టర్ 2023 - "ఏప్రిల్ 09"
ఈస్టర్ 2024 - "మార్చి 31"
ఈస్టర్ 2025 - "ఏప్రిల్ 20"
ఈస్టర్ 2026 - "ఏప్రిల్ 05"
ఈస్టర్ 2027 - "మార్చి 28"
ఈస్టర్ 2028 - "ఏప్రిల్ 15"
ఈస్టర్ 2029 - "ఏప్రిల్ 16"
ఈస్టర్ 2030 - "ఏప్రిల్ 01"

💬 పరమందున్న దేవుడు అజ్ఞాపించే ఏ పండుగ విషయమైన గ్రంథము లోనుండి ఆలోచిస్తే ఈ క్రింది విషయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. 👇👇
  1. పండుగ పేరు?,
  2. దాని అర్ధం?,
  3. ఎవరు చేయాలి?,
  4. ఎలా చేయాలి?,
  5. ఎందుకు చేయాలి?,
  6. ఎప్పుడు చేయాలి?, (నెలలు - తేదిలు ) 
  7. ఎన్ని రోజులు చేయాలి?,
  8. ఎలా చేయకూడదు?.
  9. పండుగ చేయకపోతే ఎటువంటి శిక్ష? మరింత సమాచారం కోసం ఈ "పండుగలు" అంశమును క్లిక్ చేసి చదువగలరు - Click Here

సహోదరులారా... పరమతండ్రి ఈ ఈస్టర్ పండుగను మనం ఆచరించాలని తన పరిశుద్ద గ్రంథములో ఒక్క సూచనా వ్రాయించలేదు. ఆయన కోరనూలేదు. క్రైస్తవులనబడేవారు చేసే ఎటువంటి అన్య పండుగలలో ఏదియు దేవునికి అంగీకారం కాదన్నట్టు, పరమదేవుడు వాటి విషయంలో నిశ్శబ్దంగా వున్నాడు. కానీ కొందరు ఐతే క్రీస్తు యొక్క పునరుత్థానము(Resurrection) అంటే పాత నిబంధనలో చెప్పబడిన అప్తారోతు (EASTER) అని ఆపాదించి దేవునికి కోపం తెప్పించే ఈ ఆచారం చేస్తున్నారు. జాగ్రత్త సుమా!

  1. ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. (సామెతలు 30:6) 
  2. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు. (ద్వితియోపదేశకాండము  4:22) 
  3. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; (ప్రకటన గ్రంథము 22:18) 

💫 క్రొత్త నిబంధన లో లేని ఇటువంటి పండుగలను చేయమని ప్రోత్సహించే వారి మాటలుకు లోబడక, దేవుని గ్రంధాన్ని మాత్రమే ప్రామాణికముగా తీసుకొని, సమయం ఉండగానే సత్యమును స్వీకరించి, దేవుని ఉగ్రతను కొనితెచ్చుకొనే ఇటువంటి ఆచారాలకు నీవు నీ ఇంటివారు దూరముగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాము. వందనములు 🙏
నవీన మనోహర్

"గుడ్ ఫ్రైడే" (Good Friday)

"గుడ్ ఫ్రైడే"

నా ప్రియులారా, మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

❣ "Good Friday" అనగా "మంచి శుక్రవారము".
❣ ఇది Good Friday గా పిలువబడక మునుపు "హోలీ ఫ్రైడే", "బ్లాక్ ఫ్రైడే" లేదా "గ్రేట్ ఫ్రైడే" గా పిలువబడేది.
❣ "యేసు మరణము అనంతరము" అనగా ఇంచుమించు 400 సవoత్సరములు తరువాత 'GOD FRIDAY" (గాడ్ ఫ్రైడే) గా రోమన్ కాథలిక్ బోధలు నుండి ఈ పండుగ ప్రారంభము అయింది.
❣ రోమన్ కాథలిక్ స్థాపన క్రీ.శ. 394.
❣ క్రీ.శ. 692 లో ఈ GOD FRIDAY ని కాస్తా GOOD FRIDAY గా మార్చి జెరూషలేములో ఈ పండుగను ఆచరించారు అని చరిత్ర చెపుతుంది.

★ "గుడ్ ఫ్రైడే"(Good Friday) అనే పదము పరిశుద్ధ గ్రంధము అంతటిలో ఎక్కడ కనిపించదు 

» రోమా చక్రవర్తియైన కాంస్టాంటినే (272 -337 A.D.) కాలములోనే God Friday (గాడ్ ఫ్రైడే)గా వచ్చింది అని చరిత్ర చెపుతుంది.
» "ఇరీనయూస్", "తెత్తులియాన్" ఇరుగురు రోమా వ్యక్తులు కాంస్టాంటినే  ప్రారంభము చేయక మునుపే వీరు God Friday (గాడ్ ఫ్రైడే) ని చేసి ఉండవచ్చు అని మరి కొందరు యొక్క భావన.
» మనము దీనిని ఖచ్చితముగా నిర్ణయిoచలేము. కారణమేమంటే, ఈ God Friday "or" Good Friday గూర్చి "మొదటి శతాబ్దపు అపొస్తలులు పరిశుద్ధ గ్రంథములో లిఖితము చేయలేదు".
» క్రొత్త నిబంధన క్రీ.శ. 42-98 మధ్య కాలములో రాయడము జరిగింది. ఇక్కడే మనకి బాగుగా అర్ధము కావాలి. ఈ గుడ్ ఫ్రైడే (Good Friday) అనేది పరిశుద్ధ గ్రంథములో లేనిది మనుషుల ఆలోచన మేర కలిగింది అని గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది.


● ఈ కాంస్టాంటినే రోమా చక్రవర్తి Ishtar (ఇస్తార్) అను  పదమును కాస్త Easter (ఈస్టర్) గా మార్చి, Easter అనే పదమునకు యేసు పునరుత్థానము (Jesus Resurrection) అని కలిపి క్రీ.శ. 325 లో ప్రవేశ పెట్టాడు.
● ఈ "ఈస్టర్" ని ఆధారము చేసుకొని 'గుడ్ ఫ్రైడే" ని నిర్ణయించారు.

● ఈస్టర్, గుడ్ ఫ్రైడే కూడా మనుషులు ఆలోచన వలెనే కలిగింది.


★ మీకు ఈస్టర్ గూర్చి మీకు పూర్తి వివరణ కావాలి అని అనుకుంటే ఈ  "EASTER' అనే పదమును 'క్లిక్' చేయగలరు.


★ "ఈస్టర్ పండుగకు ముందు వచ్చే శుక్రవారమును మాత్రమే మంచి శుక్రవారముగా(Good Friday)  భావిస్తారు".

క్రైస్తవుడు, "దినములను, కాలములను, సవoత్సరములను, పండుగలను..." ఆచరించకూడదు - (గలతి 4:10; కొలొస్స 2:16)

★ "గుడ్ ఫ్రైడే" మరియు "ఈస్టర్" తేదీ సవoత్సరమునకు ఒకొక్కలా వస్తున్నాయి.

(Gregorian & Saka క్యాలెండర్ - GOOD FRIDAY).


2025 లో - ఏప్రిల్ 18;
2026 లో - ఏప్రిల్ 03;
2027 లో - మార్చి 26;
2028 లో - ఏప్రిల్ 14;
2029 లో - మార్చి 30;
2030 లో - ఏప్రిల్ 19.

(Gregorian & Saka క్యాలెండర్- EASTER).


2025 లో - ఏప్రిల్ 20;
2026 లో - ఏప్రిల్ 05;
2027 లో - మార్చి 28;
2028 లో - ఏప్రిల్ 16;
2029 లో - ఏప్రిల్ 01;
2030 లో - ఏప్రిల్ 21;


 (యూదులు క్యాలెండరు ప్రకారముగా).

❣ నెలలో మొదటి నెల "నీసాన్" - (నిర్గమ 12:2; ఎస్తేర్ 3:7).
❣ మొదటి నెల పదునాలుగవ దినము పస్కా పండుగ చేసేవారు - (లేవి.కాండము 23:5).
❣ మొదటి నెల పదునయిదవ దినము నుండి ఏడు దినములు పులియని రొట్టెలు పండుగను చేసేవారు - (లేవి.కాండము 23:6-8).


●  యేసుక్రీస్తు యూదులకు పస్కా దినము నాడే  అప్పగింపబడినారు. - (మత్తయి 26:19-50; మార్క 14:12-46; లుకా 22:7-54).

★  కొందరు "నీసాన్" నెల అంటే "మార్చ్ - ఏప్రిల్ " నెల అని అంటారు.  భారతీయులు వాడుతున్నది "శాఖ ఏరా క్యాలెండరు"
కారణము ఉగాది ఆ నెలలోనే వస్తాది కాబట్టి అదే క్రొత్త సవoత్సరము అని, మరికొందరు మొదటి నెల అంటే జనవరి అని అంటారు. ఎలా ఏ విధముగా ఆలోచన చేసిన కానీ చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

★ ప్రపంచమంతట ఇంచుమించు *నలబై క్యాలెండర్లు* వాడుకలో ఉన్నాయి.

ఇక అంశములోనికి వస్తే... "పస్కా పండుగ మొదటి నెల(నీసాన్) పదునాలుగవ దినము అయితే మార్చి 14 తేదీనైనా  అయి ఉండాలి లేదా జనవరి 14 తేదీనైనా అయి ఉండాలి. కాని పైన రాసిన తేదీలు విషయములో ఒక్కొక సవoత్సరము ఒక్కోలా వచ్చేది కాదు.

● "Good Friday", "Easter" అనే మనుషులు ద్వారా ప్రవేశపెట్టబడిన పండుగలు కాబట్టి వారము విషయములో మార్పు లేదు కానీ తేదీలు బట్టి వారికి అనుగుణముగా మారుస్తూ ఆయా  శుక్రవారమునకు Good Friday(గుడ్ ఫ్రైడే) అని , ఆదివారమునకు Easter(ఈస్టర్) అని అంటగడుతున్నారు.

గమనిక :   

 గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు సమాధి చేయబడిన దినము, ఈస్టర్ అంటే క్రీస్తు సమాధి నుండి లేచిన దినము అని అపోహ కలిగి పండుగగా అనుసరిస్తున్న వారి యొక్క తేదీలు, ఆలోచనలు, బోధలు తప్పు అని ఖండిస్తూ చెప్పుటకు మాత్రమే ఈ పోస్ట్ రాయడము జరిగింది.

హెచ్చరిక :

 నా సహోదరులారా, ఇకనైనా ఆలస్యము చేయక ఈ పండుగల పేర్లతో బోధలు చేస్తూ, సువార్త చేస్తూ, ఈ పండుగల విషయములో "మనుష్యులు కల్పించిన ప్రతి పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ తండ్రిని వ్యర్ధముగా ఆరాధన చేస్తున్న (మత్తయి 15:9; 1తిమోతి 4:2; 2తిమోతి 4:3-4; 2 పేతురు 2:1) వారినుండి  మీరు బహు జాగ్రత్త కలిగి ఉండాలని యేసుక్రీస్తు నందు మిమ్మలి కోరుతున్నాను.... 


గమనిక :- పైన వ్రాయబడిన ప్రతి లేఖనమును పరిశుద్ధ గ్రంధమును తెరిచి క్షుణ్ణముగా పరిశిలన చేసి, వ్రాయబడినవి గ్రంధానుసారముగా ఉన్నవో లేవో గ్రమనించి పరిశోధన చేయుము. 

మీ ఆత్మీయ సహోదరుడు
మనోహర్_నవీన
వందనములు.
The churches of Christ greet you - Roma 16:16