ఆరాధన (worship)

ఆరాధన


నా సహోదరులారా, మీ అందరుకి మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు నామములో నా వందనములు.

ఆరాధన అనగా నేమి..? 

◆ "ఆరాధన యొక్క నిర్వచనము": "యెహోవా మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మహోన్నతుని ఆదేశాల ప్రకారము క్రమబద్ధమైన విధానములో జరిగించేది ఆరాధన అనబడుతుంది". (c.f. 2 దినవృత్తా. 29:20-30)

◆ "యధార్ధమైన ఆరాధికుడు యొక్క నిర్వచనము": "యధార్ధవంతులైన ఆరాధికులు అంటే దిద్దుబాటును ప్రేమించేవారు. యధార్ధవంతులంటే ఆయన తన మార్గముల విషయమై బోధించునప్పుడు, లోపాలను, దోషాలను, గుర్తించి దిద్దుకొనేవారు! తమ లోపాలను సమర్ధించుకునేవారు యధార్ధవంతులుకారు". (c.f. కీర్తనలు. 50:17-22; యెషయా. 2:2-6; రోమా. 2:15; 1 తిమోతి. 4:3; తీతుకు. 1:15)

❣ "గ్రీక్" లో ఆరాధన అనే పదమును "proskuneó" (ప్రోస్కునేమో) అని,
❣ "హీబ్రూ" లో ఆరాధన అనే పదమును "לַעֲבוֹד" (లాహ్-ఆహ్- వొహెడ్) అని,
❣ "ఇంగ్లీష్" లో ఆరాధన అనే పదమునకు "worship" (వర్షిప్) అని అంటాము.

◆ "ఆరాధన" అనే "తెలుగు పదము" గ్రీక్ పదముమైన "ప్రోస్కునేమో"  అనే పదము నుండి తర్జుమా చేయబడింది. గ్రీక్ పరిశుద్ధ గ్రంధములో  "ప్రోస్కునేమో" అనే పదము ఉన్న అన్ని చోట్ల ఆరాధన అనే పదము కనిపించదు.

● మ్రొక్కి - worship - (అది.కాండము 22:5; 1 సమూయేలు 15:25; మతాయి 4:10).
● సాగిలపడుట - worship - (నిర్గమ 24:1; కీర్తన 132:7;  1 కోరింది 14:25).
● నమస్కారము - worship - (నిర్గమ 34:14; కీర్తన 5:7; దానియేలు 3:28; మతాయి 4:9).
● సేవించుట - worship - (మత్తయి 4:10; అపో.కార్య 24:14-15).
● పూజించుట - worship - (ద్వితియో 4:19; మత్తయి 2:2).
● ఆరాధన - worship - (యోహాను 4:21-24; అపో.కార్య 8:27; పిలిప్పీ 3:3).

** గమనిక: (ఇంకా అనేక వచనములు కలవు) **

• కొందఱు పైన తెలిపిన ఆ పదాలు పట్టుకొని నిజమైన ఆరాధన యొక్క నిర్వచనము అని అంటున్నారు కారణమూ ఆయా పదాలు తెలుగు పరిశుద్ధ గ్రంధములో రాయబడిన అన్ని చోట్ల ప్రోస్కునేమో అనే గ్రీక్ పదము ఉండుటయే.

:NOTE: నిజానికి మనకి తెలియవలసింది పరిశుద్ధ గ్రంధములో "ప్రోస్కునేమో" అనే పదము ఉన్న చోట్ల యధార్ధమైన ఆరాధన కాదు.


"బైబిల్ అంతటిలో ఐదు రకాల ఆరాధనలు" వేమనగా;

 విగ్రహాలుకి ఆరాధన - (అపో.కార్య 17:23);
❣ వ్యర్ధమైన ఆరాధన - (మతాయి 15:9);
❣ దేవదూత ఆరాధన - (కొలసి 2:18);
❣ స్వేచ్ఛ ఆరాధన - (కొలసి 2:23);
❣ సత్య ఆరాధన లేదా యధార్ధ ఆరాధన (యోహాను 4:24).


● మన తండ్రినైన దేవుడు వెదుకుచున్నది "యదార్ధమైన ఆరాధికులును" అని యేసు వారు తెలియపరిచారు - (యోహాను 4:23).

● క్రొత్త నిబంధన ప్రకారముగా "యదార్ధముగా ఆరాధించే" కార్యక్రమము పెంతుకోస్తూ దినము యెరూషలేములో బాప్తిస్మము పొందిన ఆ మూడు వేల మంది చేతనే ప్రారంభము అయింది (అపో.కార్య 2:36-42).


"క్రొత్త నిబంధన ఆరాధన" యొక్క నిజ రూపము


◆ అపొస్తలుల బోధయందును, -- (యోహాను 17:14, 17-21; అపో.కార్య 2:42; 2 దెస్స 2:15).
◆ సహవాసమందును, -- (హెబ్రీ 10:23-24; 1 కోరింది 7:24; 1 యోహాను 1:3).
 రొట్టె విరుచుటయందును, -- (అపో.కార్య. 20:7; 1 కోరింది 11:23-29).
◆ ప్రార్థన చేయుటయందును, -- (యోహాను 16:23; 1తిమోతి 2:1,8).
◆ పాటలు (ఎపేసి 5:19; కొలసి 3:16; హెబ్రీ 13:15).
◆ కానుకులు -- (1 కోరింది 16:1-2; 2 కోరింది 9:7).


గమనిక: నా ప్రియులారా... వీటిలో ఏ ఒక్క అంశమునైనా మన సత్య ఆరాధనలో లేనియెడల మరియు నీవు  పరిశుద్ధతను, నీ రక్షణను కొనసాగించక  ఎదో మొక్కుబడిగా జరిపిస్తే అది యదార్ధమైన ఆరాధన కాదు అనే విశేషమైన సంగతి మనకి బాగుగ తెలియాలి.

                                             
                         ఆరాధనకు పాత్రుడు ఎవరు..?

• సమాధానము: యోహాను 4:21-24 వచనములు

Note:- (యేసు వారు మాత్రమే యధార్ధ ఆరాధానను గూర్చి మనకి పరిచయము చేసారు).

❣ ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను ఎవరిని ఆరాధన చేసేవారు..?  "తండ్రిని"
❣ యధార్ధముగా ఎవరును ఆరాధించాలి..? "తండ్రిని"
❣ యధార్ధముగా ఆరాధన చేయువారు కావాలి అని ఎవరు వెదుకుచున్నారు..? "తండ్రి"
❣ ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి..? "తండ్రి"

∆ యేసు వారు కూడా తన  12  ఏటా నుంచి తండ్రిని ఆరాధన చేశారని, తండ్రిని ఆరాధన చేయువారిలో అయన ఒక ఆరాధికుడు అని గ్రంధము తెలియపరుస్తుంది. - (లుకా 2:41-42; యోహాను 4:22).


సంఘముతో పాటు యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధన చేయుచున్నారా..? 

అవును


పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన(యేసుక్రీస్తు) సిగ్గుపడక నీ(తండ్రి) నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య (సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును అనెను.

:: Manohar Naveena ::

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16