మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
ప్రస్తుత కాలంలో ఎక్కువశాతం ప్రజలు మరియు కుటుంబాలు , ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన, గోప్యమైన శత్రువు — అశ్లీలత (Pornography).
ఇది “ఒక చిన్న పాపం”, “ఒక ప్రైవేట్ హాబీ”, “ఒక బలహీనత” కాదు; ఇది ఆత్మను, మనస్సును, శరీరాన్ని, సంబంధాలను, కుటుంబాలను పూర్తిగా నాశనం చేసే మరియు ఆత్మీయ స్థితిని పతనం చేసి నీకును దేవునికి మధ్య దూరాన్ని పెంచే ఒక చర్య. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్ కి 28,000 మంది అలాగే ఒక రోజులో 2 బిలియన్ల ప్రజలు ఈ అశ్లీలతను చూస్తున్నారని జిప్డో సర్వే వెల్లడించింది. అంటే ఈ పరిస్ధితి ఎంత దారుణముగా ఉన్నదో మనం అర్ధం చేసుకొనవచ్చు. గతంలో ఇలాంటి చర్యల కోసం మనిషి దూరంగా ఉండాల్సి వచ్చేది అయితే ఇప్పుడు ఐతే మనిషికి తన జేబులో/చేతిలో ఉన్న(మొబైల్), బ్లూటూత్, సోషల్ మీడియా, బ్లాక్ మార్కెట్ ఇలా రకరకాల సైట్లు ద్వారా ఈ అశ్లీలత మనిషికి చేరువయ్యింది.
ఈ చర్య ఒక పాపం. ఈ పాపం గూర్చి మాట్లాడడానికి ఎక్కువమంది ముందుకురారు. నేడు సంఘాలలో, సమాజాలలో బోధించుటకు సిగ్గు పడతారు. కుటుంబాల మధ్య మాట్లాడడానికి భయపడతారు. తాము చూస్తున్నది తప్పు అని గుర్తించే స్థాయి నుండి మనిషి ఎప్పుడో పడిపోయాడు. తమ దినచర్యలో అశ్లీలత చూడటం ఒక భాగముగా చేసేసుకున్నారు కానీ వారు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నారనే సంగతి గ్రహించుకోలేకపోతున్నారు. ఈ పాపం భారిన పడితే అది తమను అనగా తమలోనున్న ఆత్మను, తమ మనస్సును, తమ శరీరమును, తమ కుటుంబమును చివరిగా తమ భవిష్యత్ పునాదిని(నిత్య జీవమును) నాశనం చేస్తోంది. ప్రస్తుతం అటు లోకములోని, ఇటు క్రైస్తవ్యంలోను మాకు వినబడిన కొన్ని సంగతులను పరిగణలోనికి తీసుకొని బైబిల్ దృక్కోణంలో పరిష్కారం చూపుటయే ఈ అంశము వ్రాయుటకు గల ముఖ్య ఉద్దేశ్యం.
ఓ స్నేహితుడా ఒకవేళ నీవు అతిపెద్ద తిమింగలం వంటి ఈ మహా భయంకరమైన పాపములో చిక్కుకుని వుంటే ఈ అంశము నీకొరకే,...
"... పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.౹" (హెబ్రీ. 12:14)
ఈ పాపము నీ హృదయాన్ని దుష్టత్వములోనికి లాక్కొని, దేవుని స్వరూపములో చేయబడిన నిన్ను ఒక వస్తువుగా మార్చి , నీ జీవనాన్ని నాశనం చేస్తుంది. ఇది కేవలం కనులతో/శరీరముతో జరిగేది కాదు; నీ హృదయంలో, నీ మనస్సులో మొదలయ్యే అపవాది చర్య (మత్తయి. 5:28). కావున ఈ అంశము అశ్లీలతపై అధ్యయనం చేయుటకు వ్రాయబడింది. అంటే ఇక్కడ కేవలం "పాపాన్ని వివరించడం మాత్రమే కాదు" గాని దానివలన నీకు వచ్చే మూల్యం, దానియొక్క విస్తృతి, నువ్వు పొందుకొనే తీర్పు, మరియు దానివలన క్రీస్తులో నీవు కోల్పోయే జీవితం లోతుగా వివరించడమైనది.
ఈ పాపాన్ని బైబిలు వెలుగులో అర్థం చేసుకొని, దేవుని పరిశుద్ధ మార్గంలో నిలబడడం అత్యవసరం.
🔴 *1️⃣. అశ్లీలత అంటే ఏమిటి?* 🔴
బైబిలులో "అశ్లీలత" (Pornography) అనే పదం ప్రత్యక్షంగా లేకపోయినా, దీనికి సమానమైన పదం Porneia (πορνεία) తరచుగా వాడబడింది. ఇది రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది. Pornography అనే ఆంగ్ల పదానికి మూలం ఈ Porneia అను గ్రీక్ పదమే.
◾ *Greek లో Porneia అంటే:*
– జారత్వం
– లైంగిక అపవిత్రత
– కామం రగిలించే దృశ్యం లేదా చర్య
– వివాహం వెలుపల లైంగిక భావోద్వేగాలు
– వ్యర్థ లైంగిక కోరికలు
– వివాహేతర లైంగిక ప్రవర్తన
– మనస్సులో చేసే లైంగిక ఫ్యాంటసీలు
◾ *Grapho అంటే:*
– వ్రాయుట,
– చిత్రం,
– దృశ్యం
◾ *Hebrew లో : זָנָה (Zanah)*
• అర్థం: వ్యభిచారం చేయుట, దురాచార కోరికలతో నడుచుట.
• ఇది పాత నిబంధనలో ప్రతి రకమైన లైంగిక అపవిత్రను సూచిస్తుంది.
◾ *Hebrew: זְנוּת (Zenuth)*
• అర్థం: అపరిశుద్ధమైన లైంగిక ప్రవర్తన, దురాచారం, వ్యభిచారం.
◾ ἐπιθυμία (epithumia)
• అర్థం: దాహించిన, మనస్సులో దురాశ, లైంగిక కోరిక.
ఈ పదాలు స్పష్టముగా చెప్తున్నాయి "అశ్లీలత" = బైబిలు చెప్పే "పోర్నియా" పాపానికి ప్రత్యక్ష ఆధునిక రూపం. లైంగిక పాపాన్ని చూపే, రగిలించే, ప్రేరేపించే ఏ దృశ్యం, చిత్రం, మాట, వీడియోలు అయినప్పటికి అది అశ్లీలతయే. అశ్లీలత యొక్క ఉద్దేశ్యం ఒకటే "మనస్సులో/హృదయములో లైంగిక అపవిత్రత కోరికలను పుట్టించడం, జారత్వము మరియు వ్యభిచారం వైపు నడిపించడము "(మత్తయి. 5:28cf).
ప్రపంచవ్యాప్తంగా ఏటా $20 బిలియన్ల డాలర్ల బిజినెస్ గా ఇది మారిపోయింది. గతములో థియేటర్ లో, మేగజైన్లు, బుల్లితెరలు, ఇంటర్నెట్ కేఫ్ లలో ఉండేవి... నేడు ఐతే పెద్ద సర్వర్స్, క్లౌడ్, లెక్కపెట్టుటకు వీలు లేని రూపములో అశ్లీలత అనేది డిజిటల్ రూపములో ఉంది. దీని అర్థం అశ్లీలం అందరికి అందుబాటులో ఉందని.
✅ *అశ్లీలత గూర్చి కొన్ని అర్థాలు*
• లాటిన్ లో... శీలాన్ని లేదా నాణ్యతను చెరపడం
• ఆక్సఫోర్డ్..., యదార్ధత పెడద్రోవ పట్టడం
• వెబ్ స్టర్..., తప్పు చేయుటకు ప్రేరణ
• ట్రాన్సఫరెన్సీ..., ప్రవర్తనకు సంబంధించినది
🔴 *2️⃣. అశ్లీలత ఎందుకు ప్రమాదం?* 🔴
(వైజ్ఞానిక దృక్కోణంలో, నైతిక దృక్కోణంలో మరియు ఆత్మీయ దృక్కోణంలో ఎంతటి ప్రమాదమో అనే సంగతులు గూర్చి ఆలోచన చేద్దాం…)
💥 *వైజ్ఞానిక దృక్కోణంలో*
అశ్లీలత మెదడును పునర్నిర్మించేసే శక్తి ఉన్నప్పటికీ, వైజ్ఞానికంగా నిరూపితమైన ఒక behavioral addiction. ఇది మనసు, మెదడు, బంధాలను, ప్రవర్తన, లైంగిక ఆరోగ్యం ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది.
⇛ A. *మెదడులో రసాయనాలను చెడగొడుతుంది*
వాస్తవానికి మెదడులో సెరోటోనిన్, నోరోపైన్ఫైన్, డోపమైన్ అనే హార్మోన్ లు అసహజంగా పెరుగుతాయి. ఈ హార్మొనుల ప్రభావం నిన్ను అశ్లీలత చూసేట్టుగా ప్రేరేపిస్తుంది. ఇది మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో సమానం. ఇంకా ఎక్కువ ఐతే మారకద్రవ్యాలు, మద్యం వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ డోపమైన్ ఘాటుగా పెరిగితే అశ్లీల ద్వారా కలిగే ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందాలని మెదడు కోరుకుంటుంది. చివరికి మెదడు tolerance పెంచుకుంటుంది. అదే స్థాయి ఉత్తేజాన్ని పొందడానికి ఎక్కువ సమయం చూడాలి అని ప్రేరేపిస్తుంది. చాలా ప్రమాద స్థాయికి తీసుకొని పోతుంది.
Science journals confirm : Functional MRI studies show porn activates the same brain regions as cocaine, heroin, nicotine.
⇛ B. *మంచి – చెడులను వివేచించే స్తితిని కోల్పోయేలా చేస్తుంది*
మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ PFC ఉంటుంది. దీనిని మెదడు యొక్క తీర్మాన కేంద్రం, స్వీయ నియంత్రణ అధికార కేంద్రం అని అంటారు . దీనియొక్క పని, ప్రాథమిక విధుల్లో ప్రణాళికలు వేయడం, నిర్ణయం తీసుకోవడం, వివేకం, మోరల్ జడ్జ్‌మెంట్, సమస్యకు పరిష్కారం వెతకడం మరియు భావోద్వేగ నియంత్రణవంటి కార్యనిర్వాహక విధులను చేయడం వంటివి . అలాగే ఒకరి స్వంత పనితీరును పర్యవేక్షించడం మరియు ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడంతో పాటు ఆలోచించడం గురించి నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తుంది. ఇది మెదడు యొక్క CEO లాంటిది. నీవు ఈ అశ్లీల దృశ్యాలు చూడటం వలన మెదడులో ఉండే ఈ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ (PFC) అనేది బలహీనమవుతుంది. దాని పర్యావసానం .,
✔ స్వీయ నియంత్రణ లేకపోవడం
✔ పవిత్రత కొనసాగించలేకపోవడం
✔ వివాహ నిబద్ధత మీరటం (లేదా) భార్యాభర్తలు మధ్య సమస్యలు తలెత్తడం
✔ దృష్టి, ఏకాగ్రత కోల్పోవడం
✔ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు నెలకొనడం
✔ కోపం త్వరగా రావడం
✔ నిర్లక్ష్యపు ప్రవర్తన
✔ ఆకస్మిక కోరికలు పెరుగుతాయి.
ఇలా ఎందుకు జరుగుతుందంటే అధికంగా డోపమైన్ విడుదలగుట చేత PFC నరాల మార్గాలు (neural circuits) సడలిపోతాయి.
⇛ C. *రివార్డ్ సిస్టమ్ హైజాక్ అవుతుంది*
మానవ మెదడు సహజంగానే కొన్ని ఆనందాలను ఇస్తుంది. అవి ప్రేమ, బంధాలు బాంధవ్యాలు , శ్రమయొక్క ఫలితం , వ్యాయామం, ప్రార్థన, ధ్యానము, వృత్తి, విజయం, సహజ కోరికలు.
కానీ అశ్లీలత ఒక సూపర్ స్టిములస్ (Supernormal Stimulus), అంటే సహజముగా ప్రేరేపించే లేదా ప్రోత్సహించే దాని కంటే చాలా ఎక్కువ ప్రేరేపించే శక్తిని ఇస్తుంది. దీని వల్ల సహజ ఆనందాలు “బోరింగ్” గా అనిపిస్తాయి, సంబంధాలు మీద ఆసక్తిని కోల్పోతారు, మన చుట్టూ ఉండే వ్యక్తులతో మాట్లాడాలనే ఆసక్తి తగ్గుతుంది. దీనినే సైంటిఫిక్ గా desensitization అంటారు.
⇛ D. *భార్యభర్తలు మధ్య సంబంధాలను దెబ్బతీస్తుంది*
• జీవిత భాగస్వామిపై ఆకర్షణ తగ్గుతుంది. దీనికి కారణం మెదడు ఫ్యాంటసీ స్టిములేషన్‌కు అలవాటు పడిపోతుంది.
• Sexual Satisfaction తగ్గిపోతుంది. Porn-induced erectile dysfunction (PIED) పెరుగుతోంది.
• unrealistic expectations పెరగడం వలన ఆత్మవిశ్వాసం తగ్గడం, తీవ్ర అసంతృప్తి...Etc
⇛ E. *డిప్రెషన్ & ఆందోళన ఎక్కువ అవుతాయి*
Porn → High dopamine → Crash → Low dopamine → Depression cycle. ఇది డోపమైన్ డెఫిసిట్ సిండ్రోమ్.
⇛ F. *వ్యసనంగా మారుతుంది*
WHO (world health organization) మరియు American Society of Addiction Medicine వారి అధ్యయనం : "అశ్లీలత అనేది వ్యసనంగా మారితే neurobiological changes చూపుతుంది, hence it is a behavioral addiction.” దీని వలన ఎక్కువ సమయం చూడడం, చూడకుండా ఉండలేకపోవడం, చదువు/పని/వివాహ నిబద్ధత లాంటివి ప్రభావితం కావడం...Etc
⇛ G. *యుక్త వయసు వారి మెదడుపై అత్యంత ప్రమాదం చూపుతుంది *
18 సంవత్సరాల లోపు PFC పూర్తిగా అభివృద్ధి చెందదు కావున వీరిలో అశ్లీలత చూడడం అలవాటుగా మారితే వారు తమ జీవితాంతం దీనికి బానిసగా ఉండవచ్చు, ఫలితం మానవ సంబంధాలలో సమస్యలు, చదువు/ఏకాగ్రత దెబ్బతినడం...Etc
ముఖ్యముగా యువతలో, లేత మనస్సులను కకావికలం చేసి వివాహానికి ముందు సెక్స్ కి, హత్యలకు, ఆత్మహత్యలకు, నేరప్రవుత్తికి తెరతీస్తోంది. ఎవరికి చెప్పుకోలేని మానసిక సంఘర్షణలకు గురిచేసి మద్యం, మాధకద్రవ్యాల వైపు పరుగు పెట్టిస్తోంది. అశ్లీలత కారణముగా యువకులు విద్యావిహీనులగుదురు. అశ్లీలత మూలముగా అత్యాచారాలు, హత్యలు, వ్యభిచారములు, హింసకు దారి తీసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి.
⇛ H. *విపరీత లైంగిక ఆలోచనలు తలెత్తుతాయి*
Porn rewires the brain to be sexually triggered by.... ఎవరిని చూసినా, సినిమాలు చూసినా/చిన్న దృశ్యాలు, కల్పన/ఊహలలో,..etc ఇవే ఆలోచనలు వస్తాయి. ఇది అసాధారణమైన sexual stimulation sensitivity.
అశ్లీలత ఒక వ్యసనము. నువ్వు ఎంతగా దానిని ప్రేమిస్తావో అంతగా నీ స్వంత నాశనమును కోరుచున్నావని అర్థం.
⇛ I. * కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు (పాపాలకు) దారి తీస్తుంది*
• రహస్య సంబంధాలు,
• వివాహానికి ముందు, తర్వాత లైంగిక సంబంధాలు
• హింస (కొట్టడం/ తిట్టడం, వేదన)
• నిరాశ
• మానభంగం
• కామంతో కూడిన మనస్తత్వం... Etc
కొన్ని పేరులు వ్రాయడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక దీని విషయమై ఇక్కడకి విడిచి పెడుతున్నాను.
అశ్లీలత అనేది మెదడును, శరీరమును దాని అనుసంధ వ్యవస్థ అంతటిని భారీగా ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదం.
— ఇది వైజ్ఞానిక సత్యం.
💥 *నైతిక దృక్కోణంలో*
మనిషి జీవితం నైతిక విలువలు, గౌరవం, మరియు పవిత్ర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ యుగంలో అశ్లీలత (Pornography) అనే అంతర్లీన ప్రమాదం మానవ గౌరవాన్ని క్షీణింపజేస్తూ, వ్యక్తిగత స్వభావాన్ని మార్చుతూ, దేవునిచే రూపొందించబడిన పవిత్ర సంబంధాలను పాడుచేస్తోంది. అశ్లీలత ఒక నీతిహీన చర్య, ఇది మనసులోని కోరికలను రెచ్చగొట్టి, ఇతరులను వస్తువులుగా చూసే దృక్కోణాన్ని పెంచి, సమాజపు నైతిక పునాదులను బలహీనపరుస్తుంది.
⇉ స్వభావం (Character) పాడవుతుంది. అశ్లీలత, నీ లోపల ఉన్న పాప కోరికలను పెంచుతుంది, నియంత్రణను దెబ్బతీస్తుంది.
ఇది హృదయములో అసత్యాన్ని, కాముకత్వం, వ్యభిచారం, దొంగతనం, అసహనం...Etc. ఇలాంటి చెడు స్వభావాలను ప్రేరేపిస్తుంది . (మత్తయి 15:18-19; మార్కు. 7:21-23)
⇉ నీ ప్రవర్తన ద్వారా ప్రత్యక్షంగా ఇతరులకు అనగా భార్యాభర్తలకు, పిల్లలకు, కుటుంబ బంధాలకు, స్నేహసంబంధాలకు హాని కలుగుతుంది. (1 కోరింది 6:18; గలతీ 5:17)
⇉ మనసును కలుషితం చేసి, పవిత్రత స్థానంలో కాముకత్వమును నింపి నిన్ను చంపుతుంది. (కొలస్సి 3:5-8). ఇది నైతికంగా తప్పు, ప్రమాదకరం, హానికరం.
అశ్లీలత నీకు తక్షణమే ఆనందం యిచ్చినా, దీర్ఘకాలంలో అది నీ మనస్సును, స్వభావాన్ని, మరియు నీ బాంధవ్యాలను నాశనం చేసే నైతిక విషం. అందుకే అశ్లీలతను చూడకుండా ఉండుట మాత్రమే నీ పని కాదు — నైతికంగా, సంబంధపరంగా, ఆధ్యాత్మికంగా దానిని ఎదుర్కోవడం నీకు అత్యవసరమైయుంది.
💥*ఆత్మీయ దృక్కోణంలో*
అశ్లీలత అనేది శరీరపరమైన లేదా మానసిక సమస్య మాత్రమే కాదు. బైబిల్ ప్రకారం ఇది ఆత్మీయ యుద్ధం (నీకు అపవాదికి మధ్య ). నీ హృదయాన్ని అపవిత్రం చేసే ఘోర పాపం, మరియు పరిశుద్ధతను చెరిపి వివాహ నిబద్ధతను నాశనం చేయడమే కాక దేవునితో నీకున్న సంబందాలన్నిటిని నాశనం చేసే ఆత్మీయ ఉచ్చు.
అశ్లీలతను చూడడం వల్ల వివాహ వ్యవస్థలో పాపము చొరబడుతుంది—
✔ భార్యాభర్తల నిబద్ధత తగ్గుతుంది (మత్తయి 19:6)
✔ ఏకశరీరం అనే మాటకున్న పవిత్రత పోతుంది (ఆది 2:24-25)
✔ నిజమైన ప్రేమను నాశనమవుతుంది.
✔ ఆత్మకు వ్యతిరేకంగా శరీర కోరికలను పెరుగుతాయి (గలతీ. 5:17)
✔ పరిశుద్ధతను దోచుకునే శత్రువు.
అశ్లీలత మనసులోని పరిశుద్ధతను నాశనం చేస్తుంది. నిజ దేవుడు కోరేది పవిత్రత (1 థెస్సలొనీకయులు 4:3–5).
✔ హృదయాన్ని కలుషితం చేస్తుంది.
ప్రభువైన యేసు చెప్పినట్లు, “స్త్రీని మోహపు చూపుతో చూచువాడు వ్యభిచారం చేసినవాడే... తన హృదయంలో పాపం చేసి వుండును కదా” (మత్తయి 5:28)
✔ దేవునితో నీకున్న బంధాన్ని బలహీనపరుస్తుంది . (యెషయా. 59:2; 1 పేతురు 1:16)
✔ పరిశుద్ధ వివాహానికి విరోధమైనది (హెబ్రీ. 13:4).
వివాహ బంధములో కలిగే సంతృప్తిని హరించివేస్తుంది. అపవిత్రమైన తాపాలకు దారి తీస్తుంది.
✔ అశ్లీలత పైన దృష్టి → ధ్యానం → కోరిక తీర్చుకోవడం → పాపం పరిపక్వమై → మరణం కంటది. (యాకోబు 1:14–15)
కావున అశ్లీలత పరిశుద్ధతకు విరోధం.
🔴 *3️⃣. అశ్లీలతపై బైబిలు ఏమి చెప్తుంది?* 🔴
ఒకప్పుడు అశ్లీలత (Pornography) దాచబడిన పాపంగా ఉన్నప్పటికి అది ఇప్పటి ప్రపంచంలో ఒక బలమైన వినాశక శక్తిగా మారింది. టెక్నాలజీ అభివృద్ధితో ఇది ప్రతి ఇంటికి, ప్రతి చేతికి చేరింది. చాలామంది దీనిని “సాధారణం”, “మనుష్యుల సహజ కోరికే కదా" అని భావించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథము దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
బైబిలు ప్రకారం అశ్లీలత సమస్య కేవలం లైంగిక కోరిక కాదు— హృదయానికి వచ్చిన వ్యాధి, పరిశుద్ధకు అపరిశుద్ధతకు మధ్య పోరాటం, ఆత్మీయ కుష్ఠురోగం. అతిపెద్ద పాపపు ఊబి.
దేవుని పోలిక, దేవుని స్వరూపముగా (ఆది.కాం. 1:27) సృజింపబడిన ఈ జీవితం పరిశుద్ధమైనదిగాను , శరీరము–మనస్సు– హృదయం - ఆత్మ ను దేవునికి తగినదిగాను ఉండాలనేది ఆయన కోరిక. కాని అశ్లీలత ఈ నాలుగింటికి burden, wounds, bondage ను తెస్తుంది.
బైబిలు దీనిపై స్పష్టంగా ఏమి చెప్తుందో ఆలోచన చేద్దాం.
📌 *1. అశ్లీలత చూడడమే వ్యభిచారం*
యేసు స్పష్టంగా చెప్తున్నాడు: ఒక స్త్రీని తప్పుగా చూసే ప్రతీ మనిషి తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినట్లే.”(మత్తయి 5:28). అశ్లీలత అంటే ఇతరుల శరీరాన్ని మోహముతో చూడటం.
బైబిల్ ప్రకారం ఇది హృదయ వ్యభిచారం. ఇది దేవుని దృష్టిలో చాలా ఘోరమైనది.
📌 *2. శరీరేచ్ఛ — అశ్లీలతే*
"మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచనచేసికొనకుడి." (రోమా 13:14)
📌 *3. అశ్లీలత దేవుని రాజ్యానికి అనర్హులు చేస్తుంది*
పౌలు - “porneia — sexual immorality” ను గూర్చి చెపుతూ మోసపోవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు.
"... మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను౹ .... దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.౹" (1 కోరింథీ 6:9-10).
📌 *4. అశ్లీలత వలన పానుపు పరిశుద్ధముగా ఉండదు*
"వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.౹" (హెబ్రీ 13:4)
📌 *5. అశ్లీలత వలన దేవుని ఉగ్రత పొంచి ఉంటుంది*
"కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి.౹ వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి వచ్చును.౹" (కొలస్సి 3:5-6)
📌*6. *అశ్లీలత ≈ పరిశుద్ధాత్మకు ఆలయమైయున్న నీ శరీరాన్ని చెడగొడుతుంది*
"జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.౹ మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹" (1కోరింది 6:18-19:)
అశ్లీలత మన శరీరాన్ని చెడగొట్టి, పరిశుద్ధాత్మకు ఆలయమైన ఈ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. అది మన మనస్సును, హృదయాన్ని, ఆత్మను కలుషితపరుస్తుంది.
📌 *7. అపరిశుద్ధమైన ఆలోచనలు = దేవుడు ద్వేషించేవి*
"శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹".. (గలతీ. 5:19)
జారత్వం (వ్యభిచారం), అపవిత్రత (పవిత్రతను కోల్పోవడం), మరియు కాముకత్వం (అపరిమితమైన లైంగిక కోరికలు) అనేవి శరీర కార్యాలు లేదా అపరిశుద్ధమైన ఆలోచనలుగా పరిగణించబడతాయి. ఇవి దేవుని నీతిని ద్వేషించేవి. ఇవి ఒకరి పవిత్రతను, గౌరవాన్ని కోల్పోయేలా చేస్తాయి.
వ్యభిచారం — వివాహేతర సంబంధము
అపవిత్రత — అపరిశుద్ధత
కాముకత్వం — అసహజమైన మరియు దేవుని నీతికి విరుద్ధమైన కోరికలు
📌 *8. అశ్లీలతకు లోబడితే దానికే దాసులు*
“మీరు యెవరికి లోబడితిరో వారికి దాసులైరి" (రోమా 6:16).
ఎవరికి లేదా దేనికి మీ జీవితాన్ని అప్పగించుకుంటారో, దానికే మీరు లోబడి ఉంటారని అనేది ఈ వచనం యొక్క ఉద్దేశ్యం. ఇది మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది. మన ఎంపికల ఫలితాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి అనేది గుర్తు పెట్టుకో...
అశ్లీలతకు లోబడే మనిషి చివరకు దానికి పాడైపోతాడు, పాపంలో పడతాడు, పరిశుద్ధాత్మను కోల్పోతాడు, వాక్యంపై ఆసక్తి కోల్పోతాడు, ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతాడు, దేవునికి దూరముగా ఉంటాడు, దేవుని నీతిని యెరుగలేడు.
📌 *9. అశ్లీలతకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము*
"మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.౹ మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.౹" (1 దెస్స. 4:3-4)
📌 *10. అశ్లీలత కుటుంబాన్ని చిదిమేస్తుంది*
భర్త-భార్యల మధ్య నమ్మకాన్ని చెడగొడుతుంది. హృదయాలను దూరం చేస్తుంది. పరస్త్రీ/పురుషుడు ఆకర్షణకు దారి తీస్తుంది. చివరకు వివాహాన్ని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. దేవుడు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అన్ని విషయాల్లో ఘనమైన వివాహ వ్యవస్థను చెడగొడుతుంది.
“భర్తలారా, మీ భార్యలను క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు ప్రేమించుడి.” — ఎఫెసీ 5:25)
అశ్లీలత మనస్సును కాలుష్యం చేసినపుడు, భర్త/భార్య క్రమంగా ఇతర వ్యక్తులపై ఆకర్షితులవుతారు. అంతేగాక వారి కల్పనలను ఆలోచనలుగాను, ఆలోచనలను కోరికలుగాను, కోరికలను క్రియలుగాను మార్చుకుంటారు.
అశ్లీలత ఒక తీవ్రమైన అనుమానం: “నేను సరిపోనట్టున్నానా?”, “అతను/ఆమె హృదయంలో నా స్థానం పోయిందా?”, “అతనికి/ఆమెకి నేను విలువ లేదేమో?” ఈ భావనలతో వారి మనసు విరిగిపోతుంది.
ఇది దృఢమైన దాంపత్య నమ్మకాన్ని విరగ్గొడుతుంది.
అశ్లీలత వలన పిల్లల దృష్టిలో తలితండ్రులు అధికారహీనముగాను, బాధ్యతలు లేనివారిగాను, ఆధ్యాత్మికంగా బలహీనులుగాను అగుపడతారు. ఇవి పిల్లల హృదయాలలో లోతైన గాయాలు సృష్టిస్తాయి. దుష్టుడు పూర్తిగా కుటుంబాన్ని పగలగొడతాడు. నేను చెడుకార్యాలు చేస్తున్నట్టుగా చూస్తున్నట్టుగా పిల్లలకు తెలీదు అని నీవు అనుకోవచ్చు కాని నీకు తెలియకుండానే పిల్లలపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ అశ్లీలత వలన నీ చుట్టూ జరిగే పరిస్థితులను గ్రహించుకునే స్థాయిని నీవు కోల్పోతావు.
📖 యాకోబు 1:14–15
కోరిక → పాపం → మరణం
ఇది అశ్లీలత యొక్క సహజ మార్గము.
📌 *11. కుటుంబములో దేవుని ఆశీర్వాదం ఉండదు*
అశ్లీలత పాపం గనుక, దేవుని పరిశుద్ధత దానితో కలిసి ఉండలేదు.
📖 కీర్తన 66:18
“నేను నా హృదయంలో పాపమును కనిపెట్టుకొంటే ప్రభువు వినడు.”
ఇంటిలో పాపం ఉన్నప్పుడు: ప్రార్థన బలహీనమవుతుంది, ఆశీర్వాదం ఆగిపోతుంది, శాంతి మాయమవుతుంది.
చివరికి ఇది కుటుంబాన్ని చిదిమే ప్రధాన కారణం.
🔴 *4️⃣. అశ్లీలతను ఎలా జయించాలి?* 🔴
📍 *1. మనస్సు మారి నూతనమగుటవలన*
"మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి." (రోమా 12:2).
పరిశుద్ధగ్రంథం చదవడం, వాక్యం పఠనం, వాక్య ధ్యానం, కీర్తనలు పాడటం, ప్రార్థన, సంఘ సహవాసం, అపోస్తలుల బోధ వినటం వలన మనస్సు మారి నూతనమగును.
📍*2. పాపాన్ని ఎదుర్కొనే “సమయాలను” గుర్తించి, వెంటనే తప్పించుకో (లేదా) పారిపో…
నీ వాకిట పాపము పొంచియున్నప్పుడు కయీను వాలే నడుచుకొనక దానిని తరిమికొట్టు
నీవు ఏ సందర్భాలలో అశ్లీలతకు ఆకర్షితుడవవుతున్నావో కనిపెట్టు. ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రివేళ, ఒత్తిడిలో ఉన్నప్పుడు, భావోద్వేగంగా బలహీనమైనప్పుడు, సోషల్ మీడియా స్క్రోలింగ్‌లో… Etc. ఆయా విషయాల్లో నీకు ప్రేరేపణకలిగినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయు. నీకు వివాహమయితే నీ భార్య/భర్త తో, పిల్లలతో మంచి విషయాలు సంభాషించు, వివాహం కాకపోతే నీ చుట్టూ ఉండే వారితో సరదాగా కబుర్లు చెప్పు, వాక్య పఠనం చేయు, సహోదరులతో దేవుని మాటలు సంభాషించు. కీర్తనలు పాడు, ఏదైనా పనిని కల్పించుకో,.. యోసేపును మాదిరిగా తీసుకో..
"కాబట్టి నా ప్రియులారా, వ్యభిచారమునకు దూరముగా పారిపొండి.౹" ( 1 కోరింథీయులకు 10:14) "వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.౹" (ఎపేసి. 5:5). "అప్పు డామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.౹" (ఆది.కాం. 39:12)
📍 *3. శరీర కోరికలను చంపిన యెడల*
"మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.౹" (రోమా. 8:13) " నేను చెప్పునదేమనగా ఆత్మా నుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.౹" (గలతీ. 5:16)
📍 *4. కన్నులతో ఒడంబడిక చేయు*
"నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?" (యోబు. 31:1)
యేసు చెప్పినట్లు: “చూడుట” → “కోరిక” → “పాపం” (మత్తయి 5:28)
పాపం వచ్చిన తర్వాత పోరాడుట కంటే…
పాపం రాకముందే కన్నులు మూసేయడం ఉత్తమం. “నిన్ను దేవుడు పరలోకము నుండి చూస్తున్నాడు జాగ్రత్త” (యోబు 31:4cf)
📍 *5. పైనున్న వాటినే వెదకుట వలన అశ్లీలతను చంపగలము*
"మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.౹ పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.౹ మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి.౹ వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి వచ్చును.౹" (కొలొస్సి 3:1-6)
పై వచనం అశ్లీలతను మట్టికరిపించుటకు ఆయుధం వంటిది.
📍 *6. మీ శరీరం దేవుని నివాసస్థలమని గుర్తించుట ద్వారా…*
"వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? –వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?౹ అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.౹ జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.౹ మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹ విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి." (1 కోరింది. 6:16-20)
దేవుని మందిరంలో చెత్తను నింపే ధైర్యము చేస్తున్నావు ఆయనంటే నీకు భయం లేదా ....!?
📍 *7. మంచి వ్యక్తులను/స్నేహితులను/ సహోదరులను ఎన్నుకోవడం వలన*
"నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును." (సామెతలు. 17:17) " తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.౹ నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.౹ (యోహాను. 15:13-14) "కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,౹ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.౹" (ఏపేసి. 4:1-3)
📍 *8. కొన్నింటిని నియంత్రించాలి*
⧭ కామెడీ షోస్, టీవీ సీరియల్, సినిమా పాటలు, అశ్లీల సంబంధమైన డాన్సులు, నేర ప్రవృత్తి క్రూరత్వంతో దృశ్యాలు నిషేధించుట ద్వారా అశ్లీలతను అదుపు చేసుకోవచ్చు.
⧭ మొబైల్ కి ఫిల్టర్, No private browsing, సోషల్ మీడియాకు హద్దులు పెట్టడం, రాత్రి ఒంటరిగా ఫోన్ వద్దు, Google SafeSearch వంటి బ్రౌజర్ ఫిల్టర్‌లను ఆన్ చేయడం,
⧭ లాప్టాప్/కంప్యూటర్ లో ఐతే Block Site అనే browser extension ను ఇన్స్టాల్ చేయడం, Phone లో ఐతే Chrome browser - settings - Privacy & Security ఆప్షన్ క్లిక్ చేసి Safe Browser ను ON చేసుకోవడం.
⧭ Youtube ఐతే Go to your profile picture > Settings > General > toggle on "Restricted Mode
⧭ Facebook ఐతే కష్టం కానీ వీడియోలు ప్లే కాకుండా ఆపగలము Settings & Privacy లో Settings కు వెళ్లండి . అవి ఆటోమేటిక్‌గా ప్రారంభం కాకుండా నిరోధించడానికి Media ఎంచుకోండి Auto Play లో Never ను సెలెక్ట్ చేసుకోవాలి.
⧭ Instagram ఐతే మీ ప్రొఫైల్‌కి వెళ్లి, మెనూని నొక్కి, Content Preferences > Sensitive > సున్నితమైన కంటెంట్‌కు(Less) నావిగేట్ చేయండి.. ఇక్కడ, మీరు "తక్కువ" ఎంపికను ఎంచుకోవచ్చు, తద్వారా మిమ్మల్ని బాధపెట్టే పోస్ట్‌లను తక్కువగా చూడవచ్చు.
📍 *9. నీ ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడునట్లు ఉంటే*
"మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపెట్టి౹" (2 కోరింది. 10:5)
అశ్లీల ఆలోచన ఉంటే → వెంటనే క్రీస్తునకు లోబడుబట్టుగా చెరపెట్టి మార్చాలి. లేదంటే అశ్లీలత మొదలయ్యేది చూపులో, ఊహలో, ఆలోచనలో, మనస్సులో, తపనలో..
కావున పాపాన్ని ఆలోచన స్థాయిలోనే బంధించు! ఇలా...
❌ ఆలోచన → కోరిక → పాపం → దోషభావం
✅ ఆలోచన → బంధించడం → క్రీస్తుకు సమర్పించడం → పాపంపై విజయం పొందు
📍 *10. యేసువైపు చూచుచు పరిగెత్తినప్పుడు*
అశ్లీలత నిన్ను సులువుగా చిక్కులు పెట్టే ఘోరమైన పాపం! ఇది నీ మనస్సును, చూపును, హృదయాన్ని పాపము వైపు నడిపించే, ప్రోత్సహించే ఉచ్చులాంటిది. దీనికి పరిశుద్ధాత్ముడు చెప్పే పరిష్కారం *యేసువైపు చూడటం, ఓపికతో సాగిపోవాలి* అనేది చాలా స్పష్టమైనది
"మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.౹" (హెబ్రీ. 12:2)
అశ్లీలత నుండి విముక్తి—నీ బలాన్ని చూడకు. నీ ప్రతీ పరిస్థితిలో యేసును చూడు, ఆయనలో ఉండు, ఆయనతో నడువు — ఇదే విజయం.
యేసువైపు చూచిన హృదయం పాపానికి దాసుడిగా ఉండదు.
✅ *ముగింపు* ✅
ఓ చదువరి… అశ్లీలత ఒక గోప్యమైన పాపం అయినప్పటికీ, దాని ప్రభావం ఆత్మీయంగా, భావోద్వేగంగా, శారీరకంగా, సంబంధాల పరంగా చాలా లోతుగా ఘోరముగా నాశనం చేస్తుంది. బైబిల్ దీనిని కేవలం నైతిక తప్పు అని కాకుండా — హృదయాన్ని కలుషితం చేసే వ్యభిచారం - జారత్వం - కాముకత్వం, పరిశుద్ధతను దెబ్బతీసే బానిసత్వం, దేవునితో ఉన్న సంబంధాన్ని బలహీనపరచే అడ్డుకట్ట, శత్రువు ఉపయోగించే మోసపూరిత ఉచ్చు గా పిలుస్తుంది.
ఈ బలమైన హెచ్చరికల వెనుక ఒక గొప్ప ఆశ కూడా ఉంది: యేసుక్రీస్తు అటు నీకు దేవునికి మధ్య నున్న పాపపు బంధనాన్ని తెంచడానికి వచ్చాడు. పాపం ఎంత గాఢమైనదైనా, దేవుని కృప దాన్ని మించినది. కాబట్టి మన హృదయం పశ్చాత్తాపంతో, మారుమనస్సుతో ఆయనవైపు తిరిగినప్పుడు, పరిశుద్ధాత్మ మన మనస్సును శుభ్రపరచి, హృదయ కాటిన్యతను తీసివేసి, కోరికలను నూతన పరచి, పరిశుద్ధతలో నూతన స్వభావం అనుగ్రహించి నడిపించగలడు.
ఇక మీదట అశ్లీలత మీ జీవితంపై అధికారం చెలాయించాల్సిన అవసరం లేదు.
వాక్యం చెప్తుంది — “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు.౹" (యోహాను 8:36). దేవునికి తప్పా ఎవరికి దాసులు కాలేరు. అది అశ్లీలతైనా మరేదైనా...
అందువల్ల ఈ అంశం యొక్క చివరి సారాంశం:
👉 పాపం నుండి పారిపోండి.
👉 దృష్టిని కాపాడుకోండి.
👉 హృదయాన్ని దేవునికి సమర్పించండి.
👉 పరిశుద్ధాత్మ సహాయంతో పవిత్రతలో నడవండి.
అశ్లీలత మీద జయం మన శక్తితో కాదు — దేవుని కృపతో, క్రీస్తు నందలి విశ్వాసముతో, వాక్య శక్తితో, పరిశుద్ధాత్మ బలంతోనే సాధ్యం.
దేవుడు మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ కళ్లను, మీ జీవితాన్ని తన పవిత్ర పరిశుద్ధతతో నింపి శుభ్రపరచుగాక. వందనాలు
మీ ఆత్మీయులు 👫
📲 9705040236


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com