మట్టల ఆదివారము! (Palm Sunday) |
ప్రియులారా, నేటి క్రైస్తవులు చేయుచున్న అనేక వ్యర్థమైన పండుగలను గూర్చి మునుపు వ్రాయబడిన లేఖనానుసారమైన అంశముల ద్వారా తెలుసుకున్నాము. అటువంటి పండుగలలో ఈ మట్టల ఆదివారము కూడా ఒకటి కనుక లేఖనానుసారముగా గ్రంధము ఆధారముగా ఈ పండుగను గూర్చి ఆలోచన చేద్దాము.
వాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “మట్టల ఆదివారము” అనే పదమును కూడా మనము చూడలేము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన పండుగలలో కూడా ఈ మట్టల ఆదివారమనే పండుగ అనేది లేదు.
పర్ణశాల పండుగ చేయునప్పుడు మొదటి దినమున ఈత మట్టలను, మొదలగు కొమ్మలను తెచ్చి యెహోవా సన్నిధిని ఉత్సాహించమని ఆజ్ఞాపించియున్నారు కాని ఆదివారమని లేక విశ్రాంతి దినము మరుసటి రోజని లేక మట్టల పండుగని చేయమని కాని ఆజ్ఞాపించలేదు.
మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).
NOTE: ధర్మశాస్త్రములో మనము ఎంత వెతికినా మనకు ఈ పండుగను గూర్చిన ఆనవాలు కనిపించదు.
పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి వీధులలో ఘనపరచబడినపుడు అక్కడ ప్రజలు కొందరు ఖర్జూరము మట్టలను, మరికొందరు తమ దగ్గరున్న బట్టలను నేల మీద పరిచి ఆయనను ఘనపరచినట్టుగా గ్రంధమందు చూడగలము కాని “మట్టల ఆదివారము” అని ఒక ప్రత్యేకముగా ఈ పండుగను చేసినట్టుగా చూడలేము.
[గమనిక : ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని తన శిష్యులకు ఆజ్ఞాపించని యెడల ఈ విషయముపై గల అవగాహన నిజముగా వారికి లేకుండకపోయెను. వారు ఆయనను ఊరేగించకుండా ఉండి ఉంటే అక్కడ ప్రజలకు కూడా పొలములోనికి వెళ్లి మట్టలు తెచ్చేంత అవసరత వారికి లేకపోవును].
వారు ఆ గాడిదెపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిమీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు నడుచుచుండువారును వెనుక వచ్చుచుండువారును - జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాకసర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలువేయుచుండిరి. – (మత్తయి. 21:7-10, మార్కు. 11:7-11, యోహాను. 12:12-15).
ప్రియులారా, పైన తెలుపబడిన లేఖనములలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు కాని "మట్టలను" గూర్చి ఆయన ఆజ్ఞాపించలేదు, తన శిష్యులకు కాని అక్కడ ప్రజలకు ప్రజలకు కాని ఆయన తెలియపరచలేదు.
యేసు గాడిదనే ఎందుకు ఎక్కెను ?
జెకర్యా ప్రవక్త ద్వారా ముదుగానే తెలియజేయబడిన ప్రవచనము నెరవేర్చుటకు.
» సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. – (జెకర్యా. 9:9).
ఎందుకనగా ధర్మశాస్త్రమును నేరవేర్చుటకై ఆయన ఈ లోకమునకు వచ్చెనను మాట సత్యము కనుక.
» ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ( వచనముల) నైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. – (మత్తయి. 5:17).
జెకర్యా ప్రవక్త తన ప్రవచనములో గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకొనెను?
యూదులు సామాన్యముగా విజేతలను గాడిదలపై లేదా కంచర గాడిదలపై స్వారీ చేయించుట వారి ఆచారము. అయితే రాజులు గుర్రములపై స్వారీ చేయుట మనకు తెలిసిన సంగతి కాని కొన్ని సందర్భాలలో యూదులు గాడిదలను ఎన్నుకొనుటకు గల కారణమేమిటంటే గాడిదను సమాధానమునకు సూచికగా వారు భావించుటయే ఇందుకు కారణము.
» తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. – (న్యాయాధి. 5:10).
» అంతట రాజుమీరు మీ యేలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి,.. – (1 రాజులు. 1:33).
[గమనిక: యేసుక్రీస్తు వారు సకల ప్రజలను తండ్రితో సమాధాన పరచుటకై యెరూషలేమునకు వెళ్లియున్నాడు కనుక ఆయన గాడిదనెక్కి పోవుట జరిగింది]
» యేసుక్రీస్తు వారు నిజముగానే సమాధానకర్తయగు అధిపతి. – (యెషయా. 9:6).
ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రవేశించాడో అప్పుడే జెకర్యా ప్రవచనము నెరవేరబడింది.
» అంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. (లూకా. 24:44).
అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారు?
యూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు ఒకటి. అంతేకాకుండా పర్ణశాలల పండుగను ఆచరించుటలో ఖర్జూరపు మట్టలకు ప్రాధాన్యతనివ్వమని దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టుగా ధర్మశాస్త్రమందు చూడగలము.
» మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).
» వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవచెట్ల కొమ్మలను, అడవి ఒలీవచెట్ల కొమ్మలను, గొంజిచెట్ల కొమ్మలను, ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. – (నెహేమ్యా. 8:15).
ప్రియులారా, చాలామంది *యోహాను సువార్త 12:12* వచనములో “పండుగ” అని సంభోధించారు కాబట్టి అది మట్టల ఆదివారమనే భావనలో ఉన్నారు కాని అక్కడ తెలుపబడింది యూదుల యొక్క “పస్కా పండుగ” అని గ్రహించాలి. – (యోహాను. 11:55, 12:1).
నేటి క్రైస్తవుల పని ఏమి?
ఎప్పుడో యేసుక్రీస్తు వారిచే నెరవేరబడిన ప్రవచనమును జ్ఞాపకమును చేసుకుని మట్టలు పట్టుకుని వీధులవెంట తిరిగి పండుగులా ఆచరించుట నేటి క్రైస్తవుల పని కాదు. ఈ మట్టల ఆదివారమనే పండుగ ద్వారా మేము క్రీస్తు సువార్తను లోకములో ప్రకటన చేయుచున్నామని చెప్పుచూ కొందరు తమను తాము సమర్థించుకుంటున్నారు కాని నీవు నిజముగా క్రీస్తును ప్రకటన చేయాలని ఆలోచన కలిగి ఉంటే పండుగ పేరుతో కాదు సమయమందును అసమయమందును సువార్తను చేయాలి.
అంతేకాదు మనకు నచ్చినట్టిగా గ్రంధమును చదివి, లేనివి కల్పించి, లేఖనమును అపార్థము చేసికొనుచూ, అసత్యమును ప్రకటన చేయుట వలన శాపగ్రస్తులమవుతాము కాని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేము.
» వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. – (2 తిమోతి. 4:2).
» వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. – (2 పేతురు. 3:16).
» మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. – (గలతీ. 1:8).
ప్రియ సహోదరుడా, సహోదరీ, గట్టిగా చెప్పాలంటే క్రైస్తవులమైన మనకు అసలు పండుగలే లేవు. మనకున్న ఏకైక పండుగ ప్రతి ఆదివారమును తూ.చ. తప్పకుండా ఆచరించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఆయన బలియాగమును జ్ఞాపకము చేసికొనుచూ, ఆయన సిలువను గూర్చిన సువార్తను లోకమునకు ప్రకటిస్తూ, ప్రభువు బల్లలో పాలు పంచుకొనుటయయే.
NOTE:- యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనమును మాత్రమే జ్ఞాపకము చేసుకోమని ఆజ్ఞాపించుట గ్రంధమందు చూడగలము.
★ వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – (మత్తయి. 26:26-27).
★ వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – (మార్కు. 14:22-23).
కాబట్టి పై వచనముల ఆధారముగా ఇతర పండుగలతో అనగా మనుష్యులు కల్పించిన పండుగలతో (శ్రమదినము, మట్టల ఆదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్టమస్,...) మనకు సంబంధము లేదని నిజమైన క్రైస్తవుడు ఖచ్చితముగా గ్రహించగలడు.
» మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. – (గలతీ. 4:10).
» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. – (కొలస్సి. 2:16).
కావున, ఆలోచన చేసి, నిన్ను నీవు స్వపరీక్ష చేసుకొని సత్య బోధను అనగా అపోస్తులుల బోధని అంగీకరించాలని మీకు మనవి చేయుచున్నాను.
★ ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. – (సామెతలు. 30:6).
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
4 comments
commentsThank you bro..
Replyవాక్యానుసారముగానే చెప్పినందుకు చాలా వందనములు��
నిజమైన క్రైస్తవులకు నేటి దినాల్లో వాక్యానుసారమైన బోధ చాలా అవసరం..!
vandhanamulu sister marymani
ReplyWonderful and blessed message thank you
ReplyPraise The Lord brother.
ReplyChala chakkaga selaviccharu brother
Mana Prabhuvaina Yesu kristu mimmalni adhikamuga deevinchunu gaka.Amen.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com