"పస్కా పండుగ" (The Passover)

పస్కా పండుగ

క్రైస్తవులని పిలువబడుతున్న వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి కాలములో అనేకమంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంధములో లేని అనేక పండుగలను ఆచరిస్తున్నారు. వారు ఆచరిస్తున్న పండుగలలో పస్కా పండుగ ఒకటి. ఈ పస్కా పండుగను చాలా మంది “ క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుటకై చేస్తున్నామని “ చెప్తున్నారు. చాలామందికి లేఖనాలపై సరియైన అవగాహన లేక ఈ పండుగను చేస్తున్నారు, మరి కొంతమంది అందరు చేస్తున్నారు కనుక మేము చేయాలి అనే భావనతో చేస్తున్నారు, ఇంకొంతమంది క్రీస్తు మరణమును తలంచుకోవటానికి చేస్తున్నారు.

వాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “ఈ పండుగను ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? ఎందుకు చేసారు? ఈ పండుగ ఉద్దేశ్యము ఏమిటి? ఈ పండుగను చేయమని ఆనాడు వారికి దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? నేటి క్రైస్తవులమైన మనము చేయవచ్చా? పస్కాను చేయమని నేటి క్రైస్తవులమైన మనకు దేవుడు ఆజ్ఞాపించాడా?”. ఇలాంటి కొన్ని విశేషమైన సంగతులను లేఖనానుసారముగా ఆలోచన చేద్దాము. తప్పును సరిదిద్దుకుందాము.

ఎవరు చేసారు?


ఈ పండుగను ఇశ్రాయేలీయులు (లేదా) యోకోబు సంతానమైన పన్నెండు గోత్రముల వారు మాత్రమే చేసినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మోషే ఇశ్రాయేలీయుల ”  పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెనుమీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి. (నిర్గమ. 12:21).

 » “ ఇశ్రాయేలీయులు ” పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:2).

 » “ ఇశ్రాయేలీయులు ” గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి. (యెహోషువా. 5:10).

ఎప్పుడు చేసారు?


 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను.(ద్వితియో. 16:1).

 » మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ ముతోఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. (నిర్గమా. 12:1-3).

 » దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.(సంఖ్యా.కాం. 9:3, యెహోషువా. 5:10).

 » మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. (లేవీ.కాం. 23:5).

ఎందుకు చేసారు?


 » యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను. మరియు మీకుమారులుమీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కా రముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. (నిర్గమ. 12:25-28).

 » ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱ మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను. – (ద్వితియో. 16:1-2).


పస్కా పండుగ ఉద్దేశ్యము ఏమిటి? మరియు దేవుడు వారిని ఎందుకు పస్కాను చేయమన్నాడు?


దేవుడైన యెహోవా, ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను ఫరో అధికారము నుండి తప్పించి, అన్యుల ఎదుట అనేక ఆశ్చర్య కార్యములను జరిగించి, వారిని కనాను దేశమునకు రప్పించే మార్గములో ఎన్నో అద్భుత కార్యములను చేసి, వారిని సంరక్షించిన విధానమును ఇశ్రాయేలీయులు తెలుసుకొని, ఆ మహా గొప్ప అద్భుత కార్యములను జ్ఞాపకము చేసుకొని, దేవుడైన యెహోవాను ఘనపరచాలని ఉద్దేశ్యంతో ఈ పస్కా పండుగను ఆచరించమని వారికి ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధ గ్రంధములో చూడగలము.

 » మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు. మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. – (నిర్గమ. 12:26-27).

 » నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగు ప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. (ద్వితియో. 16:10-12).

 » మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసినదేదియు తినవద్దు. ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయు లకు నివాస స్థానమైయుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. (నిర్గమ. 13:3-5).

ప్రియ సహోదరీ, సహోదరుడా, పైన తెలుపబడిన లేఖనములను పరిశీలన చేస్తే పస్కా పండుగ ముఖ్య ఉద్దేశ్యము, ఎవరు చేసారు, ఎందుకు చేసారు, ఎప్పుడు చేసారు, అనే ప్రశ్నలకు చాలా తేటగా సమాధానము తెలిసినది.
దేవుడైన యెహోవా చెప్పిన రీతిగానే ఇశ్రాయేలీయులు పస్కా పండుగను జరుపుకున్నారు, యెహోవా చెప్పిన రీతిగానే చాలా పరిశుద్ధంగా ఆచరించారు.

నేటి క్రైస్తవులు పస్కా పండుగను ఆచరించవచ్చా ?  


వాస్తవానికి ఈ పండుగను చేయడానికి నేటి క్రైస్తవులకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికీ లేఖనాలపై పూర్తి స్థాయి అవగాహన లేక ఈ పండుగను చేయాలనే భావనలో ఉన్నారు. కాని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది..,

 » మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. – (గలతీ. 4:10-12).

 » అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. (కొలస్సి. 2:16).

ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన సిలువ మరణానికి ముందు శిష్యులతో కలిసి పస్కాను భుజిస్తూ, ప్రభువు బల్లను కూడా పరిచయము చేయుట  మత్తయి 26, మార్కు 14, లూకా 22 వ అధ్యాయాలలో చూడగలము. ఆ విషయమును అపోస్తలుడైన పౌలు గారు కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘపు వారిని హెచ్చరిస్తూ (1 కొరింధి 11 వ అధ్యాయము) మన ప్రభువైన యేసు  తిరుగు వచ్చు పర్యంతరము దీనిని (ప్రభువుబల్ల) చేయుడని చెప్పెను. కాని ఎప్పుడు ? సంవత్సరమునకు ఒక్కసారా?

★ “ఆదివారమున” మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. (అపొ.కార్య. 20:7).

ఆదివారము సంవత్సరానికి ఒక్కసారి వస్తుందా? ఆలోచన చేయండి. సంవత్సరమునకు ఒక్కసారే చేయుడి అని ధర్మశాస్త్ర కాలములో వారికి ఆజ్ఞ ఇవ్వబడింది అది కూడా విశ్రాంతి దినము మరుసటి రోజు. మరి నేటి క్రైస్తవులలో శుక్రవారము చేయడము ఆశ్చర్యంగా ఉంది.

1 కొరింధి 5వ అధ్యాయము 7, 8 వచనములు :


★ మీరు పులిపిండి లేనివారు గనుక కొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియనిరొట్టెతో పండుగ ఆచరింతము. – (1 కొరింధి 5:7-8).

ఈ వచనమును ఆధారముగా తీసుకుని చాలామంది పస్కా చేయవచ్చు అని అనుకుంటున్నారు.
అపోస్తలుడైన పౌలు గారు కొరింధ లో ఉన్న సంఘము యొక్క పరిస్థితిని చూసి, మీలో అనేకమంది జారత్వములు కలిగి ఉన్నారు (1 కొరింధి. 5:1), దేవుని విరోధముగా నడుచుకుంటున్నారు, అని వారిని హెచ్చరిస్తూ జారత్వములు చేసేవారిని పాపములు చేసేవారిని పులిసిన పిండితో పోలుస్తూ , క్రైస్తవులమైన మనకు ఇది తగదు. మనము ఈ లోకము నుండి వేరు చేయబడియున్నాము, మన పాపముల నిమిత్తము క్రీస్తు వధింపబడ్డాడు కనుక  మనము పులిపిండి లేని వారముగా ఉండి, నిష్కాపట్యముతోను, సత్యముతోను” పులియని రొట్టెతో పండుగ ఆచరింతము  అని చెప్పి అక్కడి సహోదరులను బలపరచడం జరిగింది.

ప్రియులారా నేటి క్రైస్తవులమైన మనకు భౌతిక సంబంధమైన పండుగలు ఆచరణలో లేవు.  క్రీస్తు లోనికి బాప్తీస్మము పొందిన మనము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని, ఆ ప్రభువు బల్లలో పాలు పొందుట అనేది మనకివ్వబడిన ఆజ్ఞ. అది నెలకొకసారి, సంవత్సరానికొకసారి చేసేది కాదు ప్రతి ఆదివారము చేసేది కనుక క్రైస్తవులమైన మనకు ప్రతి ఆదివారము ఒక పండుగ దినమే కాని అది “భౌతిక సంబంధమైన పండుగ కాదు ఆత్మ సంబంధమైన పండుగ”.  

ధర్మశాస్త్ర కాలములో మన పితరులు చేసినది భౌతిక సంబంధమైనది కాని ఆత్మ సంబంధమైనది కాదు. ఆనాడు మన పితరులు ఆచరించిన ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక (హెబ్రీ. 7:18) వారు పండుగలను, ఆచరించినను, పస్కాను భుజించినను అరణ్యములో కూలిపోయిరి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆ ఆజ్ఞలను పూర్తి స్థాయిలో పాటించక వారందరును నశించిరి.

మరి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ధర్మశాస్త్రములో గల పండుగలను చేయమనా?
ఆయన కుమారుడైన క్రీస్తు మరణమును లోకములో ప్రచురము చేసి నీ ప్రవర్తన ద్వారా అనేకులను సంఘమునకు నడిపించి, ప్రతి ఆదివారము సంఘముగా కూడి పవిత్రంగా, పరిశుద్ధంగా తండ్రిని ఆరాధించి, ప్రతి ఆదివారము ఆయన కుమారుడైన క్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుచూ అనగా ప్రభువు బల్లలో పాలు పొందుచూ, అపోస్తులుల బోధలో నిలకడగా ఉండి,  మరణము వరకు నమ్మకముగా ఉండడమే కదా తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ. ఆలోచన చేయు. ప్రవర్తన సరిదిద్దుకో. క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె ఈ యుగ సంబంధమైన దేవతతో పోరాడు.....

● ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా, ధర్మశాస్త్రగ్రంధమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే.(గలతీ. 3:10-11).

● ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవునియెదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్నవాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. (రోమా. 3:19-20).


మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

4 comments

comments
March 27, 2018 at 1:17 PM delete

Praise the lord anna
Balla kevalam Sunday Mataram Annaru anna
Mari apostalula karyamulu 2 chapter lo Dina dinamu koodukonevaru ani undhi kadha anna....

Reply
avatar
March 27, 2018 at 10:58 PM delete

వందనములు బ్రదర్ ఒక్కసారి "ప్రభువు రాత్రి భోజనం" అంశము చుడండి.

ఇక్కడ వారు చేసిన భోజనము అత్మానుసారమైనది కాదు శరీరమునకు కావలసిన ఆహారమని గ్రహించాలి.



» ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్థితించుచు. – (అపొ.కార్య. 2:46).

Reply
avatar
August 31, 2022 at 10:44 AM delete

దేవునికి స్తోత్రం

Reply
avatar
January 14, 2024 at 12:25 PM delete

Thank u brother nijam telipinanduku

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16