"యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరు?" |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
మేము నేటి క్రైస్తవులంటు వారి సంఘాల్లో, తమ సేవకుల, తమ అభిమానుల మాటలకు చెవి యెగ్గి తమ స్వకీయ నాశనము వైపు నడుచుకొనే వారిలో అనేక భిన్నమైన బోధలు లేకపోలేదు. అటువంటి భిన్నమైన బోధలలో ప్రధానమైన బోధ "క్రైస్తవులకు(మనకు) యేసే దేవుడని". ఇట్టివారు పరిశుద్ధ గ్రంథము చెప్పనిదాని యందు విశ్వాసం కలిగి ఉన్నారనే గుర్తించాలి. దీనికి కారణం తమ జీవితములో యేసు మాటలకు (లేదా) ఆదిమా అపోస్తలుల బోధకు చెవి యెగ్గక పోవడమే.
నిజ క్రైస్తవుల విశ్వాసానికి, వారి ఆత్మీయ, విశ్వాస అభివృద్ధికి ప్రామాణికం యేసు మాటలే (లేదా) ఆదిమా అపోస్తలుల బోధ మాత్రమే. అటువంటి యేసు మాటలను విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడని పరమదేవుడు ముందుగానే సెలవు ఇచ్చియున్నారు.
➦ (రోమా 10:17) : "కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును.౹"
➦ (ఆపో. కార్య. 3:22-23) : "మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹"
మన ప్రభువైన యేసు స్వయంగా ఆరు సందర్భాల్లో పలికిన సంగతులను ఈ అంశము ద్వారా ఆలోచన చేయనున్నాం.
⇓⇓⇓ యేసుక్రీస్తు మాటల్లో ⇓⇓⇓
1) పండ్రెండేండ్లవాడై యున్నప్పుడు
2) బోధింప మొదలుపెట్టినప్పుడు (ముప్పది ఏండ్లప్పుడు)
3) దేవుడు అద్వితీయుడని.
4) సిలువలో పలికిన మాట
5) సమాధిలో నుండి మూడో దినం లేచిన తరువాత
6) పరలోకములో దేవుని కుడిపార్శ్వము నుండి
𒐕 పండ్రెండేండ్లవాడై యున్నప్పుడు :
➦ (లూకా. 2:42-50) : "ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పునవారు యెరూషలేమునకు వెళ్లిరి. ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తలి దండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయ నను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మూడుదినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకులమధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి– కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా ఆయన– మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను; అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు."
𒐖 బోధింప మొదలుపెట్టినప్పుడు (ముప్పది ఏండ్లప్పుడు) :
➦ "భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు." (మత్తయి. 23:9)
➠ తండ్రి/నా తండ్రి/నా తండ్రీ అనే సందర్భాలు - మత్తయి సువార్తలో - 11:25-27; 16:17; 18:35; 20:23; 25:34; 26:29, 42; 26:53; మార్కు. 14:36; లుకా. 2:49; 22:29; 24:49; యోహాను. 2:16; 5:17; 6:32; 8:38; 10:17,25,29,37; 12:26; 14:2,20; 15:1,8,10,15,23-24; 20:17;
➠ నా పరలోకపు తండ్రి అనే సందర్భం - మత్తయి. 18:35;
➠ పరలోకమందున్న నా తండ్రి అనే సందర్భం - మత్తయి. 7:21; 10:32-33; 12:49; 15:13; 18:10,19;
➠ నా తండ్రి - నా దేవుడు అనే సందర్భం - యోహాను. 20:17;
𒐗 దేవుడు అద్వితీయుడని :
దేవుడు అద్వితీయుడు అనగా ద్వితీయత లేనివాడు (or) రెండో వాడు లేనివాడు అని అర్థం.
➦ (మార్కు 12:29-32) : "అందుకు యేసు — ప్రధానమైనది ఏదనగా — ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి– బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే."
➦ (మార్కు 12:29) : "అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు."
➦ (యోహాను 5:44) : "అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;౹"
➦ (యోహాను 17:3) : "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹"
𒐘 సిలువలో పలికిన మాట :
➦ ప్రవచనం ≈ (కీర్తనలు. 22:1) : "ప్రధానగాయకునికి. అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?"
➦ నెరవేర్పు ≈ (మత్తయి. 27:46) : "ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము."
➦ (మార్కు. 15:34) : "మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము."
𒐚 సమాధిలో నుండి మూడో దినం లేచిన తరువాత :
➦ (యోహాను. 20:17) : "యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి– నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.౹"
𒐛 పరలోకములో దేవుని కుడిపార్శ్వము నుండి :
➦ (ప్రకటన 3:2,12) : "నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. ౹ … జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.౹"
➦ (ప్రకటన 2:26) : "నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;౹"
➦ (ప్రకటన 3:5) : "జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.౹"
➦ (ప్రకటన 3:21) : "నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.౹"
➦ (ప్రకటన 14:1) : "మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి.౹"
🔥NOTE ☈
కోపగించుకోమాకు.., మేము మన క్రీస్తు ప్రభువును తగ్గించడం లేదు. క్రీస్తు దేవుడా? కాదా? అనే ప్రశ్న నీమదిలో లేవనెత్తుతావని నాకు తెలుసు. మేము క్రీస్తు దేవత్వమునకు వ్యతిరేకులము కాము. క్రీస్తు 100% దేవుడు 100% నరుడు. యేసు లో “దేవుని యొక్క గుణలక్షణములు అనగా దేవుని తత్వము ” పరిపూర్ణముగా ఉన్నప్పటికీ తండ్రి ఆయనను మనకి(క్రైస్తవులకు) దేవుడుగా నియమించక “ప్రభువుగాను అనగా రాజు, ఏలిక” “క్రీస్తుగాను అనగా అభిశక్తుడుగా" నియమించెను.(అపో. కార్య. 2:36) మరింత వివరణ కోసం ఇక్కడ ↡ క్లిక్ చేయుము.
క్రైస్తవులకు యేసు ఏమైయున్నారు? Click Here
🔥ముగింపు :
సహోదరులారా... పైన పెరొన్న ఆరు సందర్భాలు క్రీస్తే స్వయముగా తాను మాటలాడిన విషయాలు. ఎవరు వీటిని కాదని అనలేరు. ఒకవేళ తప్పుపట్టుటకు మీరు ప్రయత్నిస్తే గ్రంధాన్ని కల్పి చెరిపే వారవుతారు కదా!! జాగ్రత్త..
↪ క్రైస్తవులకు(మనకు) యేసే దేవుడనేది పరిశుద్ధ గ్రంథమిచ్చే సమాచారం కాదు,
↪ యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడని,
↪ యేసుక్రీస్తుకు ఎవరు దేవుడో అయనే మనకు(క్రైస్తవులకు) దేవుడని,
↪ అయనే తండ్రియైన దేవుడని తెలుసుకోవలసిందిగా మా మనవి 🙏🏿
Next Topic : యేసుక్రీస్తు దేవత్వము Click Here
మీ ఆత్మీయులు...👪
4 comments
commentsSuper Topic Anna
Replyఅవును తమ్ముడు యేసుక్రీస్తు కు దేవుడు ఉన్నారు ఆయనే మన తండ్రి. చాలా చక్కగా వివరణ ఇచ్చినందుకు వందనములు. క్రీస్తు దెవత్వం కోసం వ్రాయు తమ్ముడు 🙏🏿
Replyహెబ్రి 1:6-9 వరకు తండ్రి కుమారుడిని దేవా అని సంబోధిస్తున్నాడు కదా మరీ?
Replyహెబ్రీ. 1:6-9 లో తండ్రి కుమారుడును దేవా అన్నారు కానీ "నా దేవా" అనలేదు. కుమారుడును తనకు దేవుడుగా కనపరుచుకోలేదు.
Replyదేవా అనగా దేవత్వం గలవాడా అని అర్ధమే కానీ అందరికీ దేవుడు అని తండ్రి స్థాపించబోవడం లేదు.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com