సమాధుల పండుగ (All Souls Day)

 

సమాధుల పండుగ (All Souls Day)

మన ప్రభువైన యేసుక్రీస్తునామములో నా వందనములు

నేడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సమాధుల పండుగను జరుపుకుంటున్నారు. దీనిని ఇంగ్లీష్ లో ALL SOULS DAY అని, తెలుగులో ఆత్మల పండుగ లేదా సకల మృతుల పండగ లేదా పరిశుద్ధ ఆత్మల దినోత్సవము అని తమకుతామే నామకరణం చేసుకొని, అనేక రకరకాలైన విధానాల్లో జరిగిస్తున్నారు. అయితే వాస్తవానికి పండుగను పరిశుద్ధ గ్రంధము ప్రస్తావించిందా? ఆదిమ క్రైస్తవులు గాని, అపోస్తులులు గాని పండుగను ఆచరించారా? వారెవరు చేసినట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో లేదు కదా మరి ఎవరు దీనిని ప్రవేశపెట్టారు? ఎవరు దీనిని గ్రంధముతో కలిపారు? 

💥రోమన్ క్యాథలిక్ సెయింట్ ఒడిలో ఆఫ్ క్లూనీ (962-1049) అనే వ్యక్తీ ఫ్రాన్స్ దేశస్తుడు 10 శతాబ్దానికి చెందినవాడు. ఈయన తన ఆశ్రమములో(బహుశ 1030 తర్వాత) మరణించిన ఆత్మల కోసం వారి సమాధి యొద్దకు వెళ్లి వారిని గుర్తుంచుకోవడానికి మరియు వారి ఆత్మల కోసం ప్రార్థించడానికి నవంబర్ 2 ఒక నిర్దిష్ట రోజుగా మొదటగా తానే సృష్టించాడు. అటు తరువాత నెమ్మదిగా ఫ్రాన్స్ చుట్టూ ఉన్న ఇతర ఆశ్రమములోనికి మరియు కేతోలిక్ మత పెద్దలకు పండుగ విస్తరించింది. రమారమి పదునాలుగో శతాబ్దంలో రోమ్‌ ను దత్తత తీసుకున్నప్పటి నుండి ఇది పాశ్చాత్య కాథలిక్ సంప్రదాయంలో సార్వత్రిక సెలవుదినంగా మారింది.

💥నేటికి పండుగను అనేక దేశాలలో నివసిస్తున్న కొందరు ప్రతి సంవత్సరం నవంబర్ 2 జరుపుకుంటున్నారు. అక్టోబర్ 31 Halloween Day, నవంబర్ 1 All Saints Day రోజు చనిపోయిన కేతోలిక్ సెయింట్స్ ను వారి సంఘాల్లో స్మరించుకొని, తరువాత రోజు నవంబర్ 2 చనిపోయిన వారి కుటుంబాలు, బంధువులు సమాధుల యొద్దకు వెళ్లి సమాధులను శుభ్రపరిచి, పూలు జల్లి, కొవ్వోతులు వెలిగించి, వాటి యెదుట నిలబడి “Dies Irae”(పూర్తీ పాటను క్రింది వ్రాస్తాను)  అనే లాటిన్ పాటను పాడుతూ చనిపోయిన వారిని స్మరించుకొంటు వారి ఆత్మలు క్షేమంగా ఉండాలని ప్రార్ధనలు చేసేవారు.

Dies iræ, dies illa

Solvet sæclum in favilla

Teste David cum Sibylla

Quantus tremor est futurus

Quando iudex est venturus

Cuncta stricte discussurus

విధానమే అనేక ప్రదేశాలకు విస్తరించి తెలిసి తెలియని జ్ఞానంతో, దేవుడు తెలియజేయనిదానిని పరిశుద్ధ గ్రంధానికి ఆపాదించి ఈస్టర్ అనే పేరుతో ఎవరికీ వారు తోచినట్టుగా చేస్తున్నారు. ఇందులో ఇంకో విచిత్రమేమిటంటే బ్రతికి ఉన్నప్పుడు తమవారిని సరిగ్గా చూసుకోలేనివారు కూడా సమాధుల పండుగను గొప్పగా చేసేస్తుంటారు లేని ప్రేమను చనిపోయిన వ్యక్తుల మీద తెగ కనుపరుస్తుంటారు.

పండుగను ఆచరించే కొన్ని దేశాలవారి పద్ధతులు

అమెరికాలోని  గ్వాటెమాలా అనే ప్రదేశంలో ప్రజలు 65 అడుగుల మేర గాలిపటాలు తయారుచేసి వాటిపై తమ యొక్క సందేశాన్ని వ్రాసి వాటిని గాలిలో ఎగురవేస్తారు. అలా చేయడం వలన స్వర్గంలో ఉన్న తమ పూర్వీకులు తాము పంపిన సందేశాన్ని చదువుతారని వారి నమ్మకం.

మెక్సికో దేశస్తులు చనిపోయిన తమ పూర్వీకుల కొరకు బలిపీటాలు నిర్మించి వాటిని చిత్రాలతో, పూలతో, కొవ్వొత్తులతో అలంకరించి బలిపీటాల మధ్య పండుగను ఆచరిస్తారు.

ఫిలిప్ఫీన్స్ మరియు పోలాండ్ దేశ ప్రజలు మరణించిన వారికిష్టమైన వంటకాలు వండి, వాటిని సమాధుల యొద్దకు తీసుకువెల్లి అక్కడే రాత్రంతా గడుపుతారు.

హంగేరి ప్రజలు చనిపోయిన వారి కోసం భోజనము సిద్ధపరచి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడనుండి వెళ్ళిపోతారు.

పెరు దేశస్తులు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా బొమ్మల ఆకారంలో ఉన్న టంటా వావా అనే రొట్టెను ఒకరినొకరు పంచుకుని భుజిస్తారు.

ఇండియాలో ప్రజలు  అయితే వేకువనే లేచి సమాధుల యొద్దకు వెళ్లి సమాధులను శుభ్రపరచి, పూలు, కొవ్వొత్తులతో అలంకరించి, ప్రార్థనలు చేస్తారు. కొంతమంది అయితే ఇంకొంచెం ఎక్కువ ఆలోచించి కాకులు కు ఆహారం పెట్టి, కాకులు ఆహార పదార్దాలు తింటే తమ వారే వచ్చి వాటిని  తిన్నట్టుగా భావిస్తారు.

👆ప్రియా సహోదరుడా, సహోదరీ , పైవన్నీ చదివా కదానీకేమనిపిస్తుంది?

మానవుడు తెలిసీ తెలియని జ్ఞానంతో మేము చేస్తున్నది సరియనదే అనే భ్రమలో బ్రతికేస్తున్నాడు కదా? ఎంతటి అజ్ఞానము! నిజముగా సమాధులలో చనిపోయిన వారు ఉంటారా? నీవు పంపిన సందేశాన్ని వారు చదువుతారా? నీవు వండిన ఆహారాన్ని తింటారా? కాకులు తింటే నీవారు తిన్నట్టేనా? నీ ఆలోచనకే విదిచిపెడుతున్నాము….

దేవుడు తన పోలికలో తన స్వరూపములో నిర్మించుకున్న మనుష్యులను నుండి ఇవే కోరుతున్నాడా? లేదు దేవుడు ఇటువంటివి కోరుటలేదు. అంతెందుకు నీకంటే ముందుగా తమ దేహాన్ని విడిచిన నీవారు సైతము ఇటువంటివి కోరుకోరు… మీరెలా చెప్తున్నారు అనే ప్రశ్న నీ మదిలో మెదిలితే ఒకసారి లాజరు, ధనవంతుని జీవితాలు జ్ఞాపకము చేసుకో…..వారివురు సమాధి చేయబడ్డారు కానీ వారు సమాధులలో లేరు, ఇద్దరు వేరు వేరు ప్రదేశాలలో ఉన్నారు. తన దేహంలో కష్టము అనుభవించిన లాజరు నెమ్మది పొందే స్థలంలో విశ్రాంతి పొందుతున్నాడు తన జీవితకాలంలో తనకి నచ్చినట్టుగా బ్రతికిన ధనవంతుడు యాతన పడుచున్నాడు. అంటే దీని అర్థం సమాధి చేయబడిన వారి దేహం మట్టిలో కలిసిపోతుందే కాని సమాధులలో ఎవరు శాశ్వతంగా ఉండరు. ఒక్కసారి లేఖనాలు చదువుము.

👇👇లూకా సువార్త 16:19-31👇👇

"ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచితండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొననునీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాముకుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడుతండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. అందుకు అబ్రాహామువారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడుతండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడుమోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను." 

💥అయితే ఇవన్ని తెలియజేస్తుంటే చాలామంది పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఒక విషయాన్ని ప్రస్తావించి మేము చేయుటకు ఇదే ఆధారం అని చూపుతున్నారు👇👇

  1. Mat 28:1: "విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి"
  2. John 20:1: "ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ద లేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను."
  3. Luk 24:1-6: "ఆదివారమున తెల్లవారుచుండగా ( స్ర్తీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదుఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు"
  4. Mat 16:21: "అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా"
  5. Mat 17:22-23: "వారు గలిలయలో సంచరించుచుండగా యేసుమనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి."
  6. Mat 20:17-19: "యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. –ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవదినమున ఆయన మరల లేచును."

యేసుక్రీస్తు చనిపోయిన పిమ్మట మూడవదినాన కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళారు కదా అందుకే మేము వెళ్తున్నాం అంటున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు తాను మూడవ దినాన లేస్తానని వారికి ముందే తెలియజేసినప్పటికీ వారు దానిని పూర్తిస్థాయిలో నమ్మక అవిస్వాసంతో సమాధి యొద్దకు వెళ్ళారు యేసు అక్కడ లేరు తాను చెప్పినట్టుగానే లేచాడనే నిజాన్ని తెలుసుకున్నారు, ఖాళీ సమాధిని చూసి వెనుదిరిగారు

💥 మరి ఇంకేన్నడూ గాని ఏటేటా గాని సమాధి యొద్దకు పోలేదు. వారే కాదు పరిశుద్ధ గ్రంథములో మరెవ్వరు అలా చేయలేదు. మరి నీవు జరిగిస్తున్న పండుగకు ఎవరు ప్రామాణికం? దేవుడా లేక మనుష్యుల ఊహలా? పరిశుద్ధ గ్రంథమా లేక నీ సొంత తెలివా?

💥పరిశుద్ధ గ్రంథము ఇంతగా వివరించిన కూడా ఇంకా నువ్వు చేస్తున్నావంటే నీవారు నెమ్మది పొందే స్థలంలో లేరని నీవు నమ్ముతున్నట్టే గదా వారు నెమ్మది పొందే స్థలంలో లేరంటే ఇంకెక్కడో ఉన్నట్టే గదా…. మరి దేనికి నీ ప్రయాసా ఎందుకు ఇంత అజ్ఞాన ప్రవర్తన…? 

నవీన మనోహర్

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16