🔥 (చరిత్ర ఆధారముగా + బైబిల్ ఆధారముగా + దేవుని దృష్టిలో సరైన నిర్ణయం + భావోద్వేగంతో కాక + పక్షపాతం లేకుండా ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం)
🔥 సాంప్రదాయం కాకుండా — లేఖనమే మన ఏకైక ప్రామాణికంగా భావించి ఆలోచన చేద్దాం.
| అన్య పండుగ | తేదీ | దేవుడు / ఆచారం |
|---|---|---|
| Sol Invictus | డిసెంబర్ 25 | “అజేయ సూర్య దేవుడు” జననం |
| Mithra | డిసెంబర్ 25 | యుద్ధ & సూర్యదేవుడు |
| Saturnalia | డిసెంబర్ 17-24 | పార్టీలు, బహుమతులు, విందులు |
| Yule | డిసెంబర్ 21 | చెట్లు, కొమ్మలు, జర్నాలు |
AD 274 రోమన్ చక్రవర్తి ఆయురెలియన్ “Sol Invictus” అనే సూర్య దేవుడి జన్మదినాన్ని డిసెంబర్ 25గా ప్రకటించాడు.
AD 313 క్రైస్తవం రోమన్ ప్రభుత్వానికి రాజకీయంగా మిళితం అయ్యింది.
AD 336 మొదటిసారిగా యేసు జన్మదినం డిసెంబర్ 25గా జరపబడింది.
AD 350–450 సాటర్నేలియా & యూల్ పండుగల ఆచారాలు క్రైస్తవంలో కలపబడ్డాయి
అంటే —
డిసెంబర్ 25 = యేసు జన్మ రోజు కాదు → అన్యుల సూర్య దేవుడి జన్మదినం.
“డిసెంబర్ 25కు యేసుతో సంబంధం లేదు. అది సూర్య దేవుడి పండుగ.” అని Encyclopedia Britannica, Catholic Encyclopedia, World Book Encyclopedia చారిత్రకంగా ఒప్పుకున్న పండితులు కూడా ఇదే చెబుతారు.
📌 ఆచారాల మూలం :
🎄 చెట్టు, 🎁 బహుమతులు, 🔔 యూల్, ⛄ కేప్, 🌟 నక్షత్రం — పాగన్ మూలం
🎄 క్రిస్మస్ చెట్టు జర్మన్ పాగన్ యూల్ పండుగ ప్రకృతి దేవత ఆరాధన
🎁 బహుమతులు సాటర్నేలియా ఆనందారతి, విందులు
🔥 యూల్ లాగ్ నార్స్ పాగన్ పూజ అగ్ని దేవుడి ఆరాధన
🍪 సాంటా నికోలస్ కాదు — నోర్స్ దేవుడు “ఓడిన్” మాంత్రిక శక్తులు
⭐ నక్షత్రం బాబిలోనియన్ జ్యోతిష్యం అదృష్టం, శకునం
❄ మంచు మనిషి నార్డిక్ పాగన్ సంకేతం శీతకాల ఆత్మ పూజ
ఇవన్నీ బైబిల్ ఆరాధనకు విరుద్ధమైనవి.
📌 దేవుని స్పష్టమైన ఆజ్ఞ :
🚫 “అన్యుల ఆచారములను(మార్గాలను) నేర్చుకొనకుడి(అభ్యసించకుడి)” — యిర్మీయా 10:2
🚫 “వారు తమ దేవతలను కొలిచినట్లు నీవు యెహోవా గురించి చేయవద్దు” — ద్వితీ 12:30-31
4️⃣. క్రిస్మస్ — మనుష్యులు కల్పించిన సంప్రదాయం
✖ దేవుడు స్థాపించలేదు
✖ క్రీస్తు స్థాపించలేదు
✖ అపొస్తలులు బోధించలేదు
✖ ప్రారంభ క్రీస్తు సంఘం జరుపలేదు
📌 యేసు హెచ్చరిక:
🚫 ".... మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు... " (మత్తయి. 15:7; మార్కు. 7:7)
🚫 మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? (మత్తయి. 15:3,6; మార్కు 7:13)
📌 ఆరాధనకు అవసరమైనది :
యేసు మాటల్లో… "దేవుడు(YHWH) ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹” (యోహాను 4:24)
5️⃣ ‘క్రిస్మస్’ ఆచరణ ఆత్మీయ ప్రమాదం ఎందుకు?
📖 దేవునికి ఆరాధన → ఆజ్ఞ ప్రకారం మాత్రమే
➡ “ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే చేయవలెను” — లేవీయ 10:1
➡ “లిఖించబడిన వాటికి మించినది ఆశించకండి” — 1 కొరింథీ 4:6
📖 అన్యుల ఆచారాలను అనుసరించవద్దు
➡ “అన్యుల ఆచారములను నేర్చుకొనకుడి” — (యిర్మీయా 10:2)
➡ “అన్యుల ఆచారాలను అనుసరించి వ్యర్థులైరి” — (2 రాజులు 17:15)
➡ "వారు తమ దేవతలను కొలిచినట్లు నీవు యెహోవా గురించి చేయవద్దు” (ద్వితీ. 12:30–31)
📖 మనుష్య సంప్రదాయాలు దేవుని వాక్యాన్ని నాశనం చేస్తాయి
➡ “మరియు ఆయన– మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. … మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.” — (మార్కు 7:9,13)
➡ “మనుష్య సంప్రదాయాలు మోసం చేయకుండ జాగ్రత్త” — కొలస్సీ 2:8
📖 లోకమర్యాదలకు లొంగకూడదు
➡ "ఈ లోకానికి అనుగుణంగా మారవద్దు” — రోమా 12:2
📖 దేవుని పేరట పరాయి ఆచారం కూడా పాపమే
➡ బంగారు దూడ = “యెహోవాకు పండుగ” అని పెట్టినా దేవుడు తిరస్కరించాడు — (నిర్గమకాండము 32)
📖 ఆత్మతోను & సత్యంతోను ఆరాధన కావాలి
➡ “ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి” — యోహాను 4:24
సంప్రదాయం కాదు — సత్యం కావాలి
6️⃣. క్రిస్మస్ లౌకిక పండుగగా మారిన ప్రామాణికాలు
| బైబిల్ క్రైస్తవులు | క్రిస్మస్ క్రైస్తవులు |
|---|---|
| సత్య ఆరాధన | సాంటా - కల్పిత కథలు |
| పరిశుద్ధత | పార్టీలు - నృత్యం - మద్యం |
| దైవభక్తి | షాపింగ్, బహుమతులు |
| వాక్య కేంద్రీకృతం | హార్డింగ్స్, హడావిడి |
| సంవత్సరమంతా సేవ | ఒకరోజు/ఒక్క నెల భావోద్వేగం |
➡ "అందుకాయన వారితో ఈలాగు చెప్పెను— ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది." (మార్కు 7:6)
7️⃣. మత్తయి & లూకా. 2వ అధ్యాయంలో ఏమి ఉంది?
మత్తయి. 2వ అధ్యా
➡ యేసు పుట్టిన రోజునే జ్ఞానులు యేసును కలవలేదు. (మత్తయి. 2:1,16cf) యేసు పుట్టిన తేదీ జ్ఞానులకే తెలియదనేది స్పష్టం.
➡ యేసును పూజించమని దేవుడు(YHWH) జ్ఞానులకు ఆజ్ఞాపించలేదు.
➡ ఎందుకు పూజించారు? జ్ఞానుల(magos G3097) పూజ = దైవ ఆజ్ఞ వలన కాదు, గుర్తింపు వలనే అనగా ఆ శిశువు యూదుల రాజు అని గుర్తించి స్వచ్ఛందం తలవంచారు. (మీకా. 5:2; మత్తయి 2:2,11)
➡ దేవుడు(YHWH) జ్ఞానులకు ఇచ్చిన ఆజ్ఞ పూజ కాదు. హేరోదు వద్దకు తిరిగి పోవద్దని మాత్రమే. (మత్తయి. 2:12).
లూకా. 2వ అధ్యా
➡ యేసు పుట్టిన రోజు రాత్రినే కాపరులు యేసును కలిశారు. (లూకా. 2:7-20) కానీ ఆ తేదీ డిసెంబర్ 25 అని బైబిల్ చెప్పలేదు.
➡ కాపరులకు దేవదూత స్పష్టం చేసిన సందేశం “నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11). [ “నేడు”] అనగా అదే రోజు/అదే రాత్రి అని అర్థం.
➡ యేసు పుట్టిన సమయం, తేదీ, నెలను దేవుడు తన గ్రంథము మందు లిఖితం చేయలేదు.
➡ డిసెంబర్ 25 అనేది మానవ ఆలోచనే తప్పా… దేవుని ఆలోచన కాదు.
➡ పశువుల తొట్టిలో పరుండబెట్టిన శిశువును(7వ) దూతలు కాపరులకు దర్శించమని, ఆరాధన చేయమని అజ్ఞాపించలేదు కానీ వారు "వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని"(15వ) వెళ్ళి చూశారే కానీ ఆరాధన చెయ్యలేదు.
➡ ఆ దినం క్రిస్మస్ అని నామకరణం చేయబడలేదు.
➡ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్ ఇవన్నియు బైబిల్ చెప్పని అన్య పద్ధతులే. క్రైస్తవులకు ప్రామాణికము కావు.
8️⃣. క్రైస్తవులుగా క్రిస్మస్ ఎందుకు చెయ్యరు? (ముఖ్యమైన కారణాలు…)
✔ దేవుడు ఆదేశించలేదు.
✔ యేసు ఆదేశించలేదు.
✔ పరిశుద్ధాత్ముడు ఆదేశించలేదు.
✔ అపొస్తలులు ఆదేశించలేదు మరియు ఆచరించలేదు.
✔ ప్రారంభ క్రీస్తుసంఘం ఆచరించలేదు/ఇతరులకు బోధించలేదు.
✔ కేవలం మనుషులు ఊహలు బట్టి కలిగిన ఆచారం.
✔ దాని మూలం అన్య మర్యాద & విగ్రహారాధనతో కూడినది.
✔ ఇట్టి సంప్రదాయం నిజమైన సత్యాన్ని నాశనం చేస్తుంది.
✔ దేవుడు(YHWH) ఆదేశం లేనిదే… ఆయన పేరట మరియు ఆయన కుమారుని పేరట జరిగే పండుగలు ఆయన ఏలాగు అంగీకరిస్తారు?. ఆలోచించుకోండి…
✔ “ఆదివారం ≈ సంఘముతో కలసి, క్రీస్తు మరణ జ్ఞాపకం” అనేది ఆజ్ఞ — ఏటేటా అన్య ఆచారాలైన పుట్టినరోజు వేడుకలు ఆజ్ఞ కాదు.
9️⃣. యేసును నిజంగా గౌరవించే మార్గం
❌ యేసు పుట్టినరోజును జరుపడం కాదు
✔ యేసు చెప్పినట్లు జీవించడమే ఆయన్ను ప్రేమించడం.
📖 “మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.౹” — (యోహాను 14:15)
❌ యేసును అభిమానించడం కాదు
✔ యేసుకు శిష్యరికం చేయడం
📖 "బహు జనసమూహములు ఆయనతోకూడ వెళ్లుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి-ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు." — (లూకా. 14:25)
📖 "... సమస్త జనులను శిష్యులనుగా చేయుడి;..." — (మత్తయి. 28:19)
❌ మనుష్య సంప్రదాయాన్ని కాదు.
✔ దేవుని ఆజ్ఞను మాత్రమే పాటించాలి.
❌ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనే అన్య పండుగ దినాల్లో మాత్రమే యేసును గౌరవించడం కాదు.
✔ యేసుని ప్రతిరోజూ గౌరవించాలి.
❌ యేసును ఆరాధించడం కాదు
✔ దేవుడును(YHWH)/మన తండ్రిని ఆరాధించు.
🔥 అందుకే మేము :
💠 క్రీస్తు బోధ/ఆదిమ అపోస్తలుల బోధకు మాత్రమే లోబడతాము. (అపో.కార్య. 2:41-42; 2దెస్స. 2:14; 2యోహాను. 9-11)
💠 ప్రభు భోజనంలో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాము (లూకా 22:19; 1కోరింది. 11:23-29) గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కాదు సుమీ!
💠 సంవత్సరం అంతా ఈ లోక మర్యాదను అనుసరింపక, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవునికి పరిశుద్ధంగా జీవిస్తాము.(రోమా. 12:1-2)
💠 ప్రపంచ యొక్క మూలపాఠముల విషయమై(భూతములు విషయమై) అన్య ఆచారాలకు, సంప్రదాయాలకు, మనుషులు ఆజ్ఞలకు లోబడుతూ లోకానుసారంగా బ్రతుకుచున్నవారికి లొంగము. (కొలొస్సి. 2:20-22) నేటి సంఘాలు సంప్రదాయాలను కూడా ప్రామాణికంగా తీసుకోము
💠 అన్య ఆచారాలైన పుట్టిన రోజు వేడుకలు చెయ్యము, ప్రోత్సహించము, శుభాకాంక్షలు తెలుపము. యేసు ఆజ్ఞాపించని ఏ రోజును ఆచరించము. ఆచారాల కన్నా సత్యాన్ని(దేవుని వాక్యమునే..) గౌరవిస్తాము.
💠 యేసు యొక్క ఆజ్ఞ మేర ఆ ఒక్క దేవుడును(YHWH) ఆత్మతో & సత్యంతో ఆరాధిస్తాము. (యోహాను 4:21-24). యేసు స్థాపించని ఆరాధనను చేయము
📖 "అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును" (యోహాను. 8:32)
🔥 ముగింపు :
ఓ చదువరి… కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్‌ను అనేకులు వారి వారి సొంత ఉద్దేశంతో, మనుషులు బోధలతో జరుపుతున్నప్పటికి — చరిత్ర ప్రకారం అది ఒక అన్య పండుగే. థియాలజీ ప్రకారం అది మనుష్య సంప్రదాయం/అన్య ఆచారమే. బైబిల్ ప్రకారం అది దైవఆజ్ఞ కాదు. అపవాది చర్య/బోధ. ఆత్మీయంగా అది సత్యానికి విరుద్ధమైన మిశ్రమ ఆరాధనే.
దేవుడు యధార్థమైన ఆరాధనను కోరుకుంటాడు. యధార్థమైన ఆరాధికులను వెతుకుతాడు(యోహాను. 4:22-23) కానీ అన్యుల సంప్రదాయం, లోక సంస్కృతి, వినోదం, చెట్లు అలంకరణ, పెద్ద పెద్ద స్టార్ లు, శాంత తాత బహుమానాలు, లైట్లు, నృత్యాలు,... Etc ఇలాంటి భావోద్వేగాలు కలిపిన ఆరాధనను కాదు. క్రైస్తవులు క్రిస్మస్ జరుపరు అంటే
యేసును ప్రేమించరని కాదు, యేసును మరింతగా ప్రేమిస్తారు. “నన్ను ప్రేమించినవాడు నా వాక్యమును గైకొనును.” (యోహాను 14:23)
ఈ అధ్యయనం క్రిస్మస్ చేసే వారి మీద విమర్శ కాదు, ఎవరి మీద ద్వేషం కాదు. ఇది సత్యమును ప్రేమించే వారికి — వాక్యాన్ని పరిశీలించే వారికి — దేవుని చిత్తాన్ని ఆసక్తిగా వెతికే వారికి రాయబడింది. మేము ప్రపంచాన్ని వ్యతిరేకించేవారు కాదు — సత్యాన్ని రక్షించేవాళ్లము.
"అన్య ఆచారాలు కాదు — దేవుని వాక్యమే సత్యం అదే మన ఏకైక ప్రమాణం!”
సత్యాన్ని ప్రేమించే ప్రతి విశ్వాసి —
సత్యాన్నే అనుసరిస్తాడు,
సత్యాన్నే ప్రచారం చేస్తాడు,
సత్యంతోనే జీవిస్తాడు. 🙏🏿
మీ ఆత్మీయులు 👥


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com