"ఈస్టర్" (Easter)

"ఈస్టర్"

నా ప్రియులారా, మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
                  
"ఈస్టర్ అనగా నేమి"..?

» Easter (ఈస్టర్) ఈ ఇంగ్లీష్ పదము అనేది ఇష్టార్(ishtar) అనే గ్రీక్ పదము నుండి కలిగింది.
» క్రీస్తు పూర్వమునకే Ishtar అని బబులోను "దేశపు దేవలోకపు రాణిని" (Queen of Heaven) పూజలు చేసేవారు. - (యిర్మీయా 7:18)
» ishtar ని హీబ్రూ లో Astaroth(అష్తారోతు దేవత) అని అర్ధము. - (1 రాజులు 11:5; 1 సమూయేలు 31:10).
» ఆ దేవత చిహ్నము Eggs, Bunny.

"ఈస్టర్" అనే పదమునకు నేటి క్రైస్తవములో అనేక అర్ధాలు ఉండవచ్చు కానీ వాటి అన్నిటిని పరిశుద్ధ గ్రంధము కొట్టివేస్తుంది. అదేమనగా,

"ఈస్టర్" అనే పదము బైబిల్ అంతటిలో "అపో.కార్య 12:3-4" వచనములోనే మాత్రమే చూడగలము.
అక్కడ పస్కా పండుగ(Passover) అనే పదమునకు ఈస్టర్(Easter) అని ఇంగ్లీష్ లో చూడగలము.
ఈస్టర్ అనే పదము క్రీ.శ. 1604 -1611 మధ్య కాలములో మొదటగా ఇంగ్లీష్ బైబిల్ (KJV) రాయడము జరిగింది.
మరల ఆ పదమును క్రీ.శ. 1979-1982 మధ్య కాలములో "అపో.కార్య 12:3-4" వచనమును "Easter" అనే పదమును బదులుగా "Passover" అని NKJV లో మార్చడము జరిగింది.

హీబ్రూ లో hap·pā·sa ( הַפָּֽסַח) - హప్పసః
గ్రీక్ లో "Pascha" (πάσχα) - పస్కా
ఇంగ్లీష్ లో "Passover".
తెలుగు లో "పస్కా పండుగ" లేదా "పులియని రొట్టెలు పండుగ".

 » పస్కా (passover) అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. (లుకా 22:1).

 గమనిక: పస్కా అంటే Easter అని అర్ధము ఇస్తే పాత నిబంధనలో పస్కా అనే ఉన్నచోట Easter అనే ఉండాలి కానీ అలా పరిశుద్ధ గ్రంథములో లేదు. (ద్వితి 16:5; నిర్గమ 12:21).

"క్రైస్తవుడు, ఈస్టర్ పండుగను జ్ఞాపకము చేసుకోవచ్చా..?".

 సమాధానము: చేసుకోకూడదు

కాంస్టాంటినే (రోమా రాజు) యొక్క పరిపాలనలో నికేయా సంఘము వారు క్రీ.శ. 325 CE ఈస్టర్ అనే అన్య పండుగకు యేసుక్రీస్తు వారి పునరుత్థానమునకు జత చేసారు.

» పరిశుద్ధ గ్రంధము  అంతటిలో Easter అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము (Resurrection) అని ఒక్క వచనము కూడా లేదు.
» పరిశుద్ధ గ్రంథము అంతటిలో నేటి క్రైస్తవుల వలె సవoత్సరమునకు ఒక్కసారి ఈస్టర్ అనే పండుగను ఆచరించినట్టుగా ఒక్క వచనము కూడా లేదు.
» నేటి ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఈస్టర్ పండుగ అని జరుపుకొనుటకు సిద్ధపడకూడదు.
» మనలో అనేకమంది వాక్యమును సరిగ్గా పరిశీలన చేయక పోవటముతో మనుషుల యొక్క ఆలోచనలకు అవకాశము ఇస్తున్నారు.
» ఆదిమ సంఘపు క్రైస్తవులు ఆలాగున చేయలేదు కావునే మనలో అనేకమంది ఈస్టర్ అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము అని మరియు క్రైస్తవులు పండుగ అనే అనుకొనుచున్నారు కాని గ్రంథము నుండి ఏటువంటి ఆధారము చూపలేని స్థితిలో ఉన్నారు.

● ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. (సామెతలు 30:6) 

● మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు. (ద్వితియోపదేశకాండము  4:22) 

● ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; (ప్రకటన గ్రంథము 22:18) 

మునుపు నేను కూడా ఈస్టర్ పండుగను గుడ్డిగా చేశాను కానీ ఎప్పుడు అయితే వాక్యమును పరిశీలన చేసానో అప్పటి నుండి సత్యమునకు లోబడి,  మనస్సు మార్చుకొని ఆ వాస్తవాన్ని మీకు ప్రేమతో యేసుక్రీస్తు నందు తెలియపరుస్తున్నా.

హెచ్చరిక:

★ కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. (కొలస్సయులకు 2:16)

★ మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. (గలతీయులకు 4:10)

గమనిక :- పైన వ్రాయబడిన ప్రతి లేఖనమును పరిశుద్ధ గ్రంధమును తెరిచి క్షుణ్ణముగా పరిశిలన చేసి, వ్రాయబడినవి గ్రంధానుసారముగా ఉన్నవో లేవో గమనించి పరిశోధన చేయుము.

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16