Showing posts with label పండుగ. Show all posts
Showing posts with label పండుగ. Show all posts

క్రిస్మస్ అయిపోయిందా!? (Is Christmas done!?)

క్రిస్మస్ అయిపోయిందా!?

నమస్తే మిత్రమా.., మిద్దె మీద స్టార్ పెట్టావా, ఇంట్లో చెట్టు పెట్టావా, ఇంటి చుట్టూ డెకరేషన్ చేసావా, పిండి వంటలు వండి అందరికీ పంచిపెట్టావా, కొత్త బట్టలతో అలంకరించుకుని చర్చిలో హంగామా చేసావా, అబ్బో ఇంకా బోలెడన్ని ఉంటాయి కదా ఒక్కటేమిటి పాటలు, డాన్సులు ఇలా చాలా చేసే ఉంటావు కదా! అయిపోయిందా..? ఈ సంవత్సరానికి నీ క్రిస్మస్ సందడి... 

మరి నాదో సందేహం మిత్రమా ఇవన్నీ చేసావు కదా వీటన్నిటి వలన నీకేమి ఒరిగింది? దేవునికి ఏమి ఒరిగింది? అసలు నువ్వు చేసిన పుట్టినరోజే క్రీస్తుది కదా మరి ఆయనకి ఏమి ఒరిగింది???

చాలామంది ఈ ప్రశ్నలకు ఏం చెప్తారో తెలుసా! మేము ఇవన్నీ చేయటం వలన దేవుని మహిమపరిచాము అని చెప్తారు. ఒక్కసారి  నీ మనస్సాక్షిని అడుగు మిత్రమా నువ్వు నిజంగా దేవుని మహిమపరిచావా?🤔 ఎప్పుడూ దేవుని సన్నిధికి రానివారు ఆరోజు వస్తారు, ఏనాడు నీకు వందనములు చెప్పనివాడు ఆరోజు నీకు విష్ చేస్తాడు, సంవత్సరమంతా లోకంలో భయంకరంగా బ్రతికినవాడు ఆరోజు మాత్రం స్టేజీలు ఎక్కి పాడుతాడు, డాన్స్ చేస్తాడు… ఇది ప్రతీ సంవత్సరం రిపీట్ అవుతూనే ఉంటుంది అయినా కూడా నువ్వు సమర్ధిస్తావు..

మరి ఇలాంటి వ్యక్తులను సమర్థించే నీవు దేవుని ఎలా మహిమ పరుస్తావు..? అబ్బే లేదు.. లేదు.. మేము ఇలా చేయడం వలన సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అని చెప్పాలనుకుంటున్నావా? అసలు సువార్త అంటే ఏంటో తెలుసా నీకు..  ఆనాడు క్రీస్తు ఇలాగే దేవుని రాజ్యసువార్త చేశాడా? అపోస్తులులు ఇలాగే ప్రకటించారా? ఆదిమ క్రైస్తవులు ఈ రకంగానే ఏటేటా క్రీస్తు పుట్టినరోజుని చేసి అన్యుల మధ్య నడుచుకున్నారా? లేదు కదా మరి నువ్వేంటి మిత్రమా నీకు తోచిన సమాధానం చెప్పి నిన్ను నీవు సమర్ధించుకుంటున్నావు….

నిజంగా దేవుడు ఇదే కోరుకుంటున్నాడా!!  క్రిస్మస్ పేరుతో అన్యాచారాలు చేస్తే ఆయన సంతోష పడతాడా? నీ సంతోషాల కోసం, పండగ పేరుతో నువ్వు ఎంజాయ్ చేయడం కోసం ఆయన పేరును ఎందుకు మధ్యలోకి లాగుతావు...  ఇలాంటి లోకానుసారమైన పద్ధతులు పాటించడం వలన ఆనాటికి నీకు సంతోషం కలగచ్చు కానీ దేవుని సముఖంలో నీకు  ఏమాత్రం మేలు కలగదు.. నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే సత్యం. 


క్రీస్తు మానవాళి పాపక్షమాపణ నిమిత్తం భూమి మీదకు వచ్చాడు. (మత్తయి. 1:21; లూకా 5:24; 24:47) కానీ భూమి మీద తాను ఎటువంటి ఆడంబరాలు చేసుకోవడానికి రాలేదు. అంతేకాదు మిత్రమా ఆయన శరీరాధారిగా ఈ భూమిమీద ఉన్నపుడు ఏ అడంభరము చేసుకోలేదు చేయమని ఎవ్వరినీ కోరలేదు ఇంకా వాస్తవమేమిటంటే తలదాల్చుకొనుటకైననూ ఆయనకు స్థలము లేదు. (మత్తయి. 8:20; లూకా. 9:58)  ఆ మహానుభావుడు సర్వోన్నతుడైన దేవునికి కుమారుడై ఉండి దరిద్రతను అనుభవించాడు కదా.  దేనికోసం...? (2 కోరింథీ. 8:9) ఈరోజు నువ్వు ఇవన్నీ చేసి ఆయన చేసిన త్యాగాన్ని నవ్వులపాలు చేయడానికా?!!!

నీవు ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు మిత్రమా,! నీవు ఆ త్యాగమూర్తి చేత అంగీకరింపబడాలంటే ఆయన చెప్పిన మార్గంలో నడచుకోవాలా లేక ఈ లోకం కొరకు అంటే కేవలం ఈ లోకం వరకు మాత్రమే అట్టహాసలతో బ్రతికితే సరిపోతాదా? (లూకా. 6:46-49)

ఈ లోకంలో తాము గొప్ప సేవకులమని చెప్పుకొనువారు, మా తాత ముత్తాతల నాటి నుండి మేము క్రైస్తవులమని గర్వంతో చెప్పుకునే తిరిగేవారు, ఇంకా క్రీస్తు గురించి, బైబిలు గురించి అసలు అవగాహన లేనివారు క్రిస్మస్ పేరుతో చేసే పనులు నీకు కానరావట్లేదా? నీ మనసును గద్ధించట్లేదా? కొందరేమో గొప్పలకోసం పెద్ద పెద్ద స్టేజీలు కట్టిస్తారు, కొందరేమో మనకేదో దేవుని పాటలు కొదువైనట్టు తెలిసి తెలియని జ్ఞానంతో పాటలు రాసి వాటిని సినిమా పాటల స్టైల్లో పాడుతున్నారు ఇంకొంతమంది ఏకంగా సినిమా పాటల ట్యూన్లే వాడేస్తున్నారు.. ఇది ఎంతవరకు సమంజసం? ఏనాడైనా ఆలోచించావా? నువ్వు నిజంగా క్రైస్తవుడవైతే నిజంగా నీ గమ్యం పరలోకం అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తావు. (రోమా. 12:17; 13:14; 1 యోహాను. 4:1-3)

ఈరోజు మనం క్రీస్తుని ఎరిగామంటే దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఈనాడు పేరు చెప్పుకునే సేవకుడని అనుకోకు, లేదా నీ తల్లి తండ్రి అని అనుకోకు లేదా ఇంకెవరో అని భ్రమ పడకు. దానికి కారణం ఆ అపోస్తులలు కన్నీటి ఫలితం. క్రీస్తు తమకు ఏదైతే చెప్పాడో అది మాత్రం ఈ లోకంలో ప్రకటన చేసి తాము కూడా  అలాగే జీవించి తమ ప్రభువు నిమిత్తం హతసాక్ష్యులగా మారి, క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమను కడవరకు చూపించి ఘోరంగా హింసింపబడిన వారి త్యాగఫలం. నిజంగా వారు పడిన పాట్లు, వారు పొందిన హింస, వారు అనుభవించిన శ్రమ నీవు ఎరిగి ఉంటే, క్రీస్తు నిమిత్తం శ్రమపడినప్పుడు, శోధింపబడినప్పుడు  వారు పొందిన ఆనందము, వారి అనుభవం జ్ఞానపూర్వకంగా నీవు ఎరిగి ఉంటే ఈ(లోక) రీతిగా జీవించవు మిత్రమా! 

నువ్విలా అన్యాచారలతో బ్రతకడానికా క్రీస్తు సిలువ మరణం నొందాడు, నువ్విలా అపవాదితో చేతులు కలపడానికా ఆనాటి భక్తులు హతులయ్యారు? నిజంగా ఇందుకేనా క్రీస్తు ఈలోకానికి వచ్చాడు ? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో మిత్రమా! 

క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు చేయడం, గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు మరణాన్ని ప్రచారం చేయడం ఇదేనా క్రైస్తవ్యం?! ఇవి చేస్తే చాలు మేము క్రైస్తవులమైపోతాం అని చెప్పుకున్నవారు లేకపోలేదు.. మరి  మనుష్యుల పద్ధతి చొప్పున చేసిన నువ్వు ఒక క్రైస్తవుడవని చెప్పుకుంటే  మరి హతులైన అపొస్తులులు ఎవరు, హింసింపబడిన ఆదిమ సంఘస్తులు ఎవరు? ఏ ఆడంబరాలు లేకుండా కేవలం క్రీస్తు నిమిత్తం బ్రతికిన వారికి నీకు ఒకటే పేరా? ఆలోచించు.. 

కేవలం నీ సంతోషం కొరకు నువ్వు ఇవన్నీ చేసావని, చేస్తున్నావని నీ మనస్సాక్షి ఇప్పటికే సెలవిచ్చి ఉండచ్చు అయినా కూడా నిన్ను నీవు సమర్ధించుకుంటే చివరిగా ఒక మాట! 


🔎 ఒక క్రైస్తవుడికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? 

1.  క్రీస్తు యొక్క త్యాగాన్ని ఆత్మానుసారుడై,  హృదయానుసారంగా గుర్తించినప్పుడు. - (ఫిలిప్పీ. 2:4-8; హెబ్రీ. 2:14-15)

2. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా, ఆత్మతోను, సత్యముతోను, హృదయముతో యథార్థముగా దేవుని (తండ్రిని) ఆరాధించినప్పుడు. - (యోహాను. 4:20-24)

3. ఆదివారము ప్రభువుబల్లలో పవిత్రమైన చేతులతో చేయి పెట్టినప్పుడు. - (అపో. కార్య. 20:7; 1 కోరింథీ. 11:17-34)

4.  క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు ఓపికతో, సహనంతో ఆ శ్రమను జయించినప్పుడు. - ( యాకోబు. 1:2; 1 పేతురు. 1:7)

5.  శోధన సహించినప్పుడు. - (యాకోబు. 1:12)

6. సహోదరులతో సహవాసం కలిగియున్నప్పుడు. - (అపో.కార్య. 2:42; 1 యోహాను. 1:3; 1 కోరింథీ. 7:24)

7. నీ ప్రవర్తనతో ఇతరులను క్రీస్తు నొద్దకు నడిపించినప్పుడు. - (1 తిమోతీ. 4:12; ఎఫెసీ. 4:22; 1 కోరింథీ. 15:34; యాకోబు. 3:13; 1 పేతురు. 1:14)

8. నీవు దేవునికి దగ్గరగా ఉన్నావని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యమిచ్చినప్పుడు. - (అపో. కార్య. 24:16; రోమా. 2:15; హెబ్రీ. 10:22; 1 పేతురు. 2:19; 3:21)

9. అపవాదిని ఓడించి క్రీస్తు పక్షాన విజయాన్ని పొందుకున్నప్పుడు. - (రోమా. 16:20; 2 కోరింథీ. 10:1-7). 


📖ఇవేమీ నీకు అనుభవం లేకపోతే నీవు క్రైస్తవుడవు కాదు మిత్రమా ఇది నేను చెప్పుటలేదు దేవుని గ్రంథమే సెలవిస్తుంది.


ఇప్పుడు చెప్పు మిత్రమా ఇంత ఖర్చుపెట్టి, అట్టహాసంగా క్రిస్మస్ అనే అన్య పండుగను చేసావు కదా నీకేమి ఒరిగింది? ఏం సాధించావు? నువ్విలా చేయడం వల్ల క్రీస్తుకు ఏమి ఒరగలేదు మిత్రమా ఎందుకంటే ఆయన కోరుకునేది ఆయన పక్షాన నిలబడేవారిని తప్ప ఈ లోకనుసారులను కాదు. క్రీస్తు పక్షాన నిలబడేవారెవరో నీకు ఇప్పటికే అర్ధమయ్యి ఉండాలి. 

దేవుడు ఇటువంటి పండుగలు కోరలేదు, అట్టహాసాలు కోరలేదు, సంబరాలు అంతకంటే కోరలేదు. ఆయనకు కావల్సింది యదార్థ హృదయం మరియు తన కుమారుని పక్షాన సైన్యంలో పోరాడే యోధులు.

సమయం లేదు నీ నిర్ణయం ఏమిటో ఆలోచించుకో క్రీస్తు సైన్యంలో సైనికుడిగా ఉంటావా అపవాది పక్షాన ఉంటావా!?

మీ ఆత్మీయులు👪

Topic Link
1. క్రిస్టమస్ పేరుతో అపవాది మోసం Visit
2. క్రైస్తవులకు ఆజ్ఞాపించని పండుగలు Visit
3. క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు? Visit
4. మత్తయి, లూకా 2వ అధ్యాయం? Visit

సమాధుల పండుగ (All Souls Day)

 

సమాధుల పండుగ (All Souls Day)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు


నేడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఈ సమాధుల పండుగను జరుపుకుంటున్నారు. దీనిని ఇంగ్లీష్ లో ALL SOULS DAY అని, తెలుగులో “ఆత్మల పండుగ” లేదా “సకల మృతుల పండగ” లేదా “పరిశుద్ధ ఆత్మల దినోత్సవము” అని తమకుతామే నామకరణం చేసుకొని, అనేక రకరకాలైన విధానాల్లో జరిగిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ పండుగను పరిశుద్ధ గ్రంధము ప్రస్తావించిందా? ఆదిమ క్రైస్తవులు గాని, అపోస్తులులు గాని ఈ పండుగను ఆచరించారా? వారెవరు చేసినట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో లేదు కదా మరి ఎవరు దీనిని ప్రవేశపెట్టారు? ఎవరు దీనిని గ్రంధముతో కలిపారు? 


💥రోమన్ క్యాథలిక్ సెయింట్ ఒడిలో ఆఫ్ క్లూనీ (962-1049) అనే వ్యక్తీ ఫ్రాన్స్ దేశస్తుడు 10వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన తన ఆశ్రమములో(బహుశ 1030 తర్వాత) మరణించిన ఆత్మల కోసం వారి సమాధి యొద్దకు వెళ్లి వారిని గుర్తుంచుకోవడానికి మరియు వారి ఆత్మల కోసం ప్రార్థించడానికి నవంబర్ 2న ఒక నిర్దిష్ట రోజుగా మొదటగా తానే సృష్టించాడు. అటు తరువాత నెమ్మదిగా ఫ్రాన్స్ చుట్టూ ఉన్న ఇతర ఆశ్రమములోనికి మరియు కేతోలిక్ మత పెద్దలకు ఈ పండుగ విస్తరించింది. రమారమి పదునాలుగో శతాబ్దంలో రోమ్‌ ను దత్తత తీసుకున్నప్పటి నుండి ఇది పాశ్చాత్య కాథలిక్ సంప్రదాయంలో సార్వత్రిక సెలవుదినంగా మారింది.


💥నేటికి ఈ పండుగను అనేక దేశాలలో నివసిస్తున్న కొందరు ప్రతి సంవత్సరం నవంబర్ 2న జరుపుకుంటున్నారు. అక్టోబర్ 31న Halloween Day, నవంబర్ 1న All Saints Day రోజు చనిపోయిన కేతోలిక్ సెయింట్స్ ను వారి సంఘాల్లో స్మరించుకొని, ఆ తరువాత రోజు నవంబర్ 2న చనిపోయిన వారి కుటుంబాలు, బంధువులు సమాధుల యొద్దకు వెళ్లి సమాధులను శుభ్రపరిచి, పూలు జల్లి, కొవ్వోతులు వెలిగించి, వాటి యెదుట నిలబడి “Dies Irae”(పూర్తీ పాటను క్రింది వ్రాస్తాను)  అనే లాటిన్ పాటను పాడుతూ చనిపోయిన వారిని స్మరించుకొంటు వారి ఆత్మలు క్షేమంగా ఉండాలని ప్రార్ధనలు చేసేవారు.


Dies iræ, dies illa

Solvet sæclum in favilla

Teste David cum Sibylla

Quantus tremor est futurus

Quando iudex est venturus

Cuncta stricte discussurus


ఈ విధానమే అనేక ప్రదేశాలకు విస్తరించి తెలిసి తెలియని జ్ఞానంతో, దేవుడు తెలియజేయనిదానిని పరిశుద్ధ గ్రంధానికి ఆపాదించి ఈస్టర్ అనే పేరుతో ఎవరికీ వారు తోచినట్టుగా చేస్తున్నారు. ఇందులో ఇంకో విచిత్రమేమిటంటే బ్రతికి ఉన్నప్పుడు తమవారిని సరిగ్గా చూసుకోలేనివారు కూడా ఈ సమాధుల పండుగను గొప్పగా చేసేస్తుంటారు లేని ప్రేమను చనిపోయిన వ్యక్తుల మీద తెగ కనుపరుస్తుంటారు.


ఈ పండుగను ఆచరించే కొన్ని దేశాలవారి పద్ధతులు


✅ అమెరికాలోని  గ్వాటెమాలా అనే ప్రదేశంలో ప్రజలు 65 అడుగుల మేర గాలిపటాలు తయారుచేసి వాటిపై తమ యొక్క సందేశాన్ని వ్రాసి వాటిని గాలిలో ఎగురవేస్తారు. అలా చేయడం వలన స్వర్గంలో ఉన్న తమ పూర్వీకులు తాము పంపిన సందేశాన్ని చదువుతారని వారి నమ్మకం.

✅మెక్సికో దేశస్తులు చనిపోయిన తమ పూర్వీకుల కొరకు బలిపీటాలు నిర్మించి వాటిని చిత్రాలతో, పూలతో, కొవ్వొత్తులతో అలంకరించి ఆ బలిపీటాల మధ్య ఈ పండుగను ఆచరిస్తారు.

✅ఫిలిప్ఫీన్స్ మరియు పోలాండ్ దేశ ప్రజలు మరణించిన వారికిష్టమైన వంటకాలు వండి, వాటిని సమాధుల యొద్దకు తీసుకువెల్లి అక్కడే రాత్రంతా గడుపుతారు.

✅హంగేరి ప్రజలు చనిపోయిన వారి కోసం భోజనము సిద్ధపరచి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడనుండి వెళ్ళిపోతారు.

✅పెరు దేశస్తులు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా బొమ్మల ఆకారంలో ఉన్న టంటా వావా అనే రొట్టెను ఒకరినొకరు పంచుకుని భుజిస్తారు.

✅ ఇండియాలో ప్రజలు  అయితే వేకువనే లేచి సమాధుల యొద్దకు వెళ్లి సమాధులను శుభ్రపరచి, పూలు, కొవ్వొత్తులతో అలంకరించి, ప్రార్థనలు చేస్తారు. కొంతమంది అయితే ఇంకొంచెం ఎక్కువ ఆలోచించి కాకులు కు ఆహారం పెట్టి, ఆ కాకులు ఆ ఆహార పదార్దాలు తింటే తమ వారే వచ్చి వాటిని  తిన్నట్టుగా భావిస్తారు.


👆ప్రియా సహోదరుడా, సహోదరీ , పైవన్నీ చదివా కదా… నీకేమనిపిస్తుంది?


మానవుడు తెలిసీ తెలియని జ్ఞానంతో మేము చేస్తున్నది సరియనదే అనే భ్రమలో బ్రతికేస్తున్నాడు కదా? ఎంతటి అజ్ఞానము! నిజముగా సమాధులలో చనిపోయిన వారు ఉంటారా? నీవు పంపిన సందేశాన్ని వారు చదువుతారా? నీవు వండిన ఆహారాన్ని తింటారా? కాకులు తింటే నీవారు తిన్నట్టేనా? నీ ఆలోచనకే విదిచిపెడుతున్నాము….


👤దేవుడు తన పోలికలో తన స్వరూపములో నిర్మించుకున్న మనుష్యులను నుండి ఇవే కోరుతున్నాడా? - లేదు 

దేవుడు ఇటువంటివి కోరుటలేదు. అంతెందుకు నీకంటే ముందుగా తమ దేహాన్ని విడిచిన నీవారు సైతము ఇటువంటివి కోరుకోరు… మీరెలా చెప్తున్నారు అనే ప్రశ్న నీ మదిలో మెదిలితే ఒకసారి లాజరు, ధనవంతుని జీవితాలు జ్ఞాపకము చేసుకో…

వారివురు సమాధి చేయబడ్డారు కానీ వారు సమాధులలో లేరు, ఇద్దరు వేరు వేరు ప్రదేశాలలో ఉన్నారు. తన దేహంలో కష్టము అనుభవించిన లాజరు నెమ్మది పొందే స్థలంలో విశ్రాంతి పొందుతున్నాడు తన జీవితకాలంలో తనకి నచ్చినట్టుగా బ్రతికిన ధనవంతుడు యాతన పడుచున్నాడు. అంటే దీని అర్థం సమాధి చేయబడిన వారి దేహం మట్టిలో కలిసిపోతుందే కాని సమాధులలో ఎవరు శాశ్వతంగా ఉండరు. ఒక్కసారి లేఖనాలు చదువుము.


👇👇లూకా సువార్త 16:19-31👇👇

"ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి –తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను– నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము — కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడు– తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. అందుకు అబ్రాహాము– వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు– తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు– మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను." 


💥అయితే ఇవన్ని తెలియజేస్తుంటే చాలామంది పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఒక విషయాన్ని ప్రస్తావించి మేము చేయుటకు ఇదే ఆధారం అని చూపుతున్నారు👇👇


  1. Mat 28:1: "విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి"
  2. John 20:1: "ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ద లేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.౹"
  3. Luk 24:1-6: "ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్ర్తీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు– సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు"
  4. Mat 16:21: "అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా"
  5. Mat 17:22-23: "వారు గలిలయలో సంచరించుచుండగా యేసు– మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి."
  6. Mat 20:17-19: "యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. –ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవదినమున ఆయన మరల లేచును."


యేసుక్రీస్తు చనిపోయిన పిమ్మట మూడవదినాన కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళారు కదా అందుకే మేము వెళ్తున్నాం అంటున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు తాను మూడవ దినాన లేస్తానని వారికి ముందే తెలియజేసినప్పటికీ వారు దానిని పూర్తిస్థాయిలో నమ్మక అవిస్వాసంతో సమాధి యొద్దకు వెళ్ళారు యేసు అక్కడ లేరు తాను చెప్పినట్టుగానే లేచాడనే నిజాన్ని తెలుసుకున్నారు, ఖాళీ సమాధిని చూసి వెనుదిరిగారు. 


💥 మరి ఇంకేన్నడూ గాని ఏటేటా గాని ఆ సమాధి యొద్దకు పోలేదు. వారే కాదు పరిశుద్ధ గ్రంథములో మరెవ్వరు అలా చేయలేదు. మరి నీవు జరిగిస్తున్న ఈ పండుగకు ఎవరు ప్రామాణికం? దేవుడా లేక మనుష్యుల ఊహలా? పరిశుద్ధ గ్రంథమా లేక నీ సొంత తెలివా?


💥పరిశుద్ధ గ్రంథము ఇంతగా వివరించిన కూడా ఇంకా నువ్వు చేస్తున్నావంటే నీవారు నెమ్మది పొందే స్థలంలో లేరని నీవు నమ్ముతున్నట్టే గదా వారు నెమ్మది పొందే స్థలంలో లేరంటే ఇంకెక్కడో ఉన్నట్టే గదా…. మరి దేనికి నీ ప్రయాసా ఎందుకు ఇంత అజ్ఞాన ప్రవర్తన…? 

నవీన మనోహర్
9705040236 

WhatsApp Join Us   Telegram Join Us

The churches of Christ greet you - Roma 16:16