"పండుగలు" (Festivals) |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా హృదయపూర్వక వందనములు.
: పస్కా పండుగ :
1). పస్కా అనగా దాటి
పోవుట అని అర్ధము.
● "యెహోవా
ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారముచేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు
నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము
చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.౹" (నిర్గమ. 12:23; హెబ్రీ.
11:28).
2). ఎవరు చేయాలి..? -
(ఇశ్రాయేలీయులు)
●"కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల
నందరిని పిలిపించి వారితో ఇట్లనెను–మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను
తీసికొని పస్కా పశువును వధించుడి.౹" (నిర్గమ. 12:21).
» "ఇశ్రాయేలీయులు
పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.౹" (నిర్గమ. 12:21).
3). ఎందుకు చేయాలి..?
●"ఇశ్రాయేలీయులు
ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.౹ ఆ నాలుగు వందల
ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు
ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను.౹ ఆయన ఐగుప్తుదేశములోనుండి వారిని బయటికి
రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమతమ తరములలో
యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే." (నిర్గమ. 12:40-42).
●"యెహోవా తన
నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను
ఆచరించి, గొఱ్ఱె మేకలలోగాని గోవులలోగాని బలి అర్పింపవలెను.౹ పస్కా పండు గలో
పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు
ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు,
బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.౹" (ద్వితీయో.
16:2-3).
4). ఎప్పుడు చేయాలి..?
(మొదటి నెల - ఆబీబు).
● "ఆబీబు నెలను
ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో
రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను రప్పించెను.౹" (ద్వితీయో.
16:1).
●"మొదటి నెల
పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.౹" (లేవీ. కాం. 23:5).
5). ఎలా చేయాలి..?
●"మొదటి నెల
పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.౹ ఆ నెల పదునయిదవదినమున
యెహోవాకు పొంగనిరొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను
మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు
చేయకూడదు.౹ ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవదినమున
పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో
చెప్పుము." (లేవీ. కాం. 23:5-8)
: పెంతెకొస్తు పండుగ :
● "మరియు యెహోవా
మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న
దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని
యొద్దకు తేవలెను.౹ యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను
అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.౹
మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా
అర్పింపవలెను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది
యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.౹ మీరు మీ
దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని
వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన
దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు
ఉండవలెను.౹ ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు
క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.౹ మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి
పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని
గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.౹
మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను
రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి
పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.౹ అప్పుడు మీరు మేకలలో
ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా
అర్పింపవలెను.౹ యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని
అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.౹ ఆనాడే మీరు
పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు
చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంటచేను
కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను
ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన
యెహోవాను." (లేవీ. కాం. 23:9-22).
గమనిక: కనాను దేశములో
రెండు వేరువేరు పంటలు పండుతాయి.
» బార్లీ.
» గోధుమలు.
ఈ రెండు పంటలు నుండి
ప్రథమ ఫలము అర్పించిన తర్వాత, ఏడువారములు లెక్కించి (లేవి.కాం. 23:15) ఏడవ
విశ్రాంతిదినపు మరుసటి దినమున అనగా ఏబదియవ దినపు ఈ పెంతెకొస్తు పండుగను
ఇశ్రాయేలీయుల ఆచరిస్తారు. (లేవి.కాం. 23:16).
: పర్ణశాలల/గుడారాల పండుగ :
1). పర్ణశాలల పండుగనే
"గుడారాల పండుగ" అని కూడా అంటారు.
2). ఎవరు చేయాలి..?
● "మరియు యెహోవా
మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు చాటింపవలసిన యెహోవా
నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా
నియామకకాలములు ఇవి.౹" (లేవీ. కాం. 23:1-2).
● "యెహోవా మోషేకు
దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము
చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను" (నెహెమ్యా. 8:14).
3). ఎందుకు చేయాలి..?
●"నేను
ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప
చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను.
ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.౹" (లేవీ. కాం.
23:42).
4). ఎప్పుడు చేయాలి..?
(యేడవ నెల - ఏతనీ నెల)
● "మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు
దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.౹" (లేవీ. కాం. 23:33-౩4).
● "కాబట్టి
ఇశ్రాయేలీయులందరును ఏతనీ మను ఏడవ మాసమందు పండుగకాలమున..." (1 రాజులు. 8:2).
5). ఎలా చేయాలి..?
● "మరియు యెహోవా
మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ
దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.౹ వాటిలో
మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు
చేయకూడదు.౹ ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవదినమున మీరు
పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును.
అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతిదినములు
గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు
యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి
ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ
సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.౹ ఏ అర్పణదినమున ఆ
అర్పణమును తీసికొని రావలెను. అయితే ఏడవ నెల పదునయిదవదినమున మీరు భూమిపంటను
కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము,
ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.౹ మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి
చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన
యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.౹ అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు
పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని
ఆచరింపవలెను.౹ నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని
పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో
నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.౹"
(లేవీ. కాం. 23:33-42).
● "యెహోవా మోషేకు
దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము
చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోను
యెరూషలేములోను ప్రకటనచేసి తెలియ జేయవలసినదేమనగా–మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల
కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల
వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.౹ ఆప్రకారమే
జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు
ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు
కట్టుకొనిరి.౹ మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని
వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు
ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.౹
ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర
గ్రంథమును చదివి విని పించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన
తరువాత విధిచొప్పున ఎనిమిదవదినమునవారు పరిశుద్ధ సంఘముగా
కూడుకొనిరి."(నెహెమ్యా. 8:14-18).
NOTE :- సహోదరులారా… పైన మూడు
పండుగలు ఇశ్రాయేలీయుల ప్రజలకు ముఖ్యమైన పండుగలు. ఈ పండుగలను వారు ఆచరించాలని
దేవుడే స్వయంగా ఆజ్ఞాపించి, ఒక్కొక్క పండుగకు పేరును సూచించాడు మరియు ఏ నెల, ఏ
రోజు నుండి ఎన్ని రోజులు చేయవలెనో, ఆయా రోజుల్లో ఏమి చేయవలెనో, ఏమి చేయకూడదో ఈ
విషయాలన్నింటిని గూర్చి తన రాజ్యాంగ చట్టమైన ధర్మశాస్త్రములో లిఖితపూర్వకముగా వ్రాయించి
వారికి అనుగ్రహించాడు.
: క్రొత్తనిబంధనలో..,
యూదులవంటి నియామక కాలాలు లేవు :
★ ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. (గలతి. 4:8-11)
★ ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. (గలతి. 4:8-11)
★ కాబట్టి అన్నపానముల విషయములోనైనను,
పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ
నెవనికిని అవకాశమియ్యకుడి.ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో
ఉన్నది. (కొలస్స 2:17).
: “నిజ” క్రైస్తవులకు పండుగలున్నాయా..? :
అవును, నిజ క్రైస్తవులకు ఒకే ఒక్క పండుగ
కలదు. అదే “నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ”. ఇది మనం వారానికి
ఒకసారి అనగా ఆదివారం మాత్రమే ఆచరింప నాజ్ఞాపింపబడ్డాము. ఈ పండుగను ప్రతి వారం నీవు
ఆచరిస్తున్నవా?? నీ విశ్వాసము
వాక్యానుసారమైనది ఐతే ఈ రెండు “పస్కా పండుగ” మరియు “ప్రభురాత్రి భోజనము” అంశములను క్లిక్ చేసి చదివి, ఆలోచన చేసి,
సత్యమును గుర్తించుటకు వెనుకాడకు సుమా!
» "మీరు పులిపిండి లేనివారు
గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు
అను మన పస్కా పశువు వధింప బడెను౹ గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు
దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ,
నిష్కా పట్యమును సత్యమునను పులియని
రొట్టెతో పండుగ ఆచరింతము." (1 కోరింథి. 5:7-8).
» పులియని
రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు
వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు
కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు
విస్తరించి మాటలాడుచుండెను. (అపో.కార్య. 20:6-7)
కొన్ని శతాబ్దాలుగా
పేరుకి క్రైస్తవులు అనబడేవారు ఆచరించే
క్రిస్టమస్, నూతన సంవత్సరము, మట్టల ఆదివారం, భష్మా బుధవారం, మంచి శుక్రవారం, ఈస్టర్, సమాధుల పండుగ … etc అనేవాటిని పండుగగా
ఆచరించవలెనని పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి వాక్య ఆధారము లేవు. దైవ గ్రంథము నకు లోబడక మనుషులు కల్పించిన పద్దతులను , వాక్య వ్యతిరేకమైన
ఆధారములు చూపించుచు పారం పర్యాలకు చోటు
ఇస్తూ జరిగిస్తున్న వారి కోసము గ్రంథము యిలా వర్ణిస్తుంది . "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని
వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా — ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను
ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు
దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.(మత్తయి.
15:6-9).
పాత నిబంధన కాలములో.., పరమదేవుడు పండుగలను
కోరినప్పుడు, ఆయన తేటగాను, ప్రత్యేకముగాను చెప్పడం జరిగింది. మరి నేటి క్రైస్తవులనబడేవారి(నీవు చేయు) పండుగలకు పైన
చెప్పబడినవాటి ప్రకారముగా అనగా "ఏ నెల,
ఏ రోజు నుండి ఎన్ని రోజులు చేయవలెనో, ఆయా రోజుల్లో ఏమి
చేయవలెనో, ఏమి చేయకూడదో" ఈ విషయాలన్నింటిని నీవు/నీ కుటుంబం జరిగించు
పండుగలు గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఎందుకు లేకుండా పోయింది?? నీకు నీవే
ప్రశ్నించుకొని, ఆలోచించాలి!
పరిశుద్ధ గ్రంథములోని
వాస్తవాలు ఇంత తేటగా కనిపిస్తున్నప్పటికీ నా ధోరణి నాదేనని నీవు అనుకుంటే నీకు
నచ్చినట్టుగా బ్రతుకు అంతేకానీ,
పరిశుద్దాత్ముడు వ్రాయించిన లేఖనములకు
నీ సొంతమాటలు చేర్చకు.
» "మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు." (మత్తయి. 12:32).
» "మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు." (మత్తయి. 12:32).
మీ ఆత్మీయులు,
మనోహర్ & నవీన.
+91-9705040236.
+91-9705040236.
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com