Showing posts sorted by date for query దేవత్వము. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query దేవత్వము. Sort by relevance Show all posts

దేవత్వమా? త్రిత్వమా? త్రియేకమా?


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


నేటి క్రైస్తవ విశ్వాసములో “దేవత్వమా? త్రిత్వమా? త్రియేకమా?” అనే ప్రశ్నలు క్రైస్తవ చరిత్రలో అత్యంత లోతైన, ఆలోచనాత్మకమైన అంశాలలో ఒకటి. ఈ పదములు ఒకే అర్థమా? లేక వేర్వేర్వేరు భావములను సూచిస్తున్నాయా? ముఖ్యంగా, వీటిలో దేని గురించి దేవుని వాక్యము బోధించుచున్నది? ఏది విశ్వాస సంబంధమైనది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనుట అత్యంత అవసరము. దేవుడు ఎవరు? ఆయన స్వరూపము ఎలా ఉంది? అటువంటి స్వరూపము గలవారు ఎందరు? ఆయన ఒక్కడా? లేక ముగ్గురా? లేక ఒక్క వ్యక్తే ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమయ్యాడా?(త్రిపాత్రాభినయం చేశారా?) లేక ఏకత్వములో త్రిత్వమా? లేక దేవత్వం గల ముగ్గురు వేరు వేరుగా ఉన్నారా? లేక దేవత్వములో ముగ్గురు అనగా త్రిత్వమా? అనే ప్రశ్నలు విశ్వాసుల మనస్సులను ఎన్నో శతాబ్దాలుగా పరిశీలనలో ఉంచుతున్నాయి. ఈ ప్రశ్న కేవలం సిద్ధాంతపరమైనది మాత్రమే కాదు; ఇది దేవుని స్వభావమును, ఆయన మనుష్యులతో కలిగిన సంబంధమును, మరియు దేవుని అనాది సంకల్పంలో ఆయన పాత్రను అర్థం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యమైనది. ఎందుకంటే మన విశ్వాసము మనుష్యుల అభిప్రాయముల మీద కాకుండా దేవుని వాక్యముపైనే నిలవాలని ఈ విధముగా అబద్ధ బోధనలను/బోధకులను త్రోసిపుచ్చి  అపోస్తులుల బోధను గుర్తించాలనేది ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 


1️⃣. దేవత్వమా?

A : దేవత్వము యొక్క అర్ధం.

దేవత్వము/దైవత్వం(Godhead/Deity) అనగా దేవుడు + తత్వము = దేవుని యొక్క గుణ లక్షణాల సముదాయం లేదా దేవుని యొక్క స్వభావం లేక దేవుని యొక్క అదృశ్య లక్షణం అని అర్థం. ఈ పదము ఒక వ్యక్తిని కాదు, ఒక లక్షణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు మానవులకు “మానవత్వము” అనే లక్షణం ఉన్నట్లు, క్రూరులకు “కూరత్వం” అనే లక్షణం ఉన్నట్లు, జారులకు “జారత్వం” అనే లక్షణం ఉన్నట్లు,... దేవునికి “దేవత్వము” అనే లక్షణము ఉంది. కాబట్టి దేవత్వము అనేది ఒక స్వభావము, ఒక గుణము, ఒక మహిమను సూచిస్తుంది కానీ వ్యక్తిని కాదు.


B : దేవత్వము అనే పదం గ్రంథములో ఉందా?

దేవత్వము/దైవత్వం అనే ఈ పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఐదు సారులు వాడబడ్డాయి. 

▪️*దేవత్వము లేని దయ్యములకు*

(ద్వితీయోపదేశకాండము 32:17): "వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమపితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి."


▪️*దేవత్వము లేని దేవతలకు*

(యిర్మియా 2:11): "దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.౹"


▪️*దేవత్వము లేని విగ్రహాలకు*

(అపొస్తలుల కార్యములు 17:29): "కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.౹"


▪️*దేవత్వము కలిగిన దేవునికి(YHWH)*

(రోమీయులకు 1:20): "ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.౹"


▪️ దేవత్వము కలిగిన యేసుక్రీస్తుకు

(కొలస్సయులకు 2:9): "ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;౹"


C : దేవత్వము గలవారు Vs దేవత్వములో

దేవత్వము అనేది ఒక అదృశ్య లక్షణమే కానీ వ్యక్తి కాదు.(రోమా. 1:20) కాబట్టి “దేవత్వము గలవారు/దైవ స్వభావం గలవారు” ఎందరున్నారో వారిని “దేవత్వములో ఉన్నవారు” అని అనకూడదు. బైబిల్లో ఎక్కడా “దేవత్వములో ముగ్గురు వ్యక్తులు” అని చెప్పలేదు కానీ దేవత్వము కలిగిన వ్యక్తులు ముగ్గురు అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ మూడు వ్యక్తులు వేర్వేరుగా పేర్కొనబడ్డారు:


✔️ దేవుడు ఒక్కడే

✔️ ప్రభువు ఒక్కడే

✔️ పరిశుద్ధాత్ముడు ఒక్కడే - (1 కొరింథీయులకు 12:4-6; ఎపేసియులకు. 4:4-6 చూడుము)


1. తండ్రి — దేవుడు(YHWH)

2. కుమారుడు — ప్రభువైన యేసుక్రీస్తు

3. పరిశుద్ధాత్ముడు — దేవుని ఆత్మ


🔴 ఉదాహరణ : “మనుష్యత్వము”

మనుష్యత్వము = ఒక స్వభావము. అది వ్యక్తి కాదు.


🕂పేతురు మనుష్యత్వము కలవాడు

🕂 యోహాను మనుష్యత్వము కలవాడు

🕂 పౌలు మనుష్యత్వము కలవాడు


మనము ఇలా అనము:

❌ “మనుష్యత్వములో ముగ్గురు వ్యక్తులు”

కాని ఇలా అంటాము:

✔️ “మనుష్యత్వము కలిగిన ముగ్గురు వ్యక్తులు”


అదేవిధంగా:

▪️దేవత్వము = స్వభావము/అదృశ్య లక్షణం 

▪️వ్యక్తులు = దేవత్వము కలవారు అనాలి ✔️ దేవత్వములో ఉన్నవారు ❌


D : దేవత్వము గలవారు ముగ్గురు?

▪️*మొదట - మన తండ్రియైన దేవుడు*

🕂మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి(1కొరింథీయులకు. 8:6a)

🕂వాక్యము దేవుని(తండ్రి) యొద్ద ఉండెను (యోహాను. 1:1)

🕂తండ్రి(YHWH) స్వర్వాధిపతియైన దేవుడు (1తీమోతి. 6:15-16)

🕂తండ్రి(YHWH) అద్వితీయ సత్యదేవుడు (యోహాను. 5:44; 17:3)

🕂పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు (కీర్తనలు. 90:2)

🕂తండ్రియైన దేవుడు దేవత్వము కలవాడు. (రోమా. 1:20)


▪️*రెండు - మన ప్రభువైన యేసుక్రీస్తు*

🕂మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు;(1 కొరింథీయులకు 8:6b)

🕂ఆయన(వాక్యము) ఆదియందు దేవునియొద్ద ఉండెను. - (యోహాను. 1:2)

🕂యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడు  (రోమా 9:5)

🕂యేసు అద్వితీయ కుమారుడు (లేదా) సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు (మత్తయి. 16:16; యోహాను. 1:14,18; 3:16; 1యోహాను. 4:19)

🕂తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము. (యోహాను. 17:5)

🕂యేసుక్రీస్తు దేవత్వము కలవాడు. (కొలస్సయులకు 2:9)


⚫ మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవత్వం లేదు అంటూ ఆయన మీద బురద జల్లేవారు ఆనాటి నుండి లేకపోలేదు అట్టివారికి సమాధానముగా *యేసుక్రీస్తు యొక్క దేవత్వం అనే అంశము పూర్తిగా చదవగలరు.


▪️*మూడు - మన ఆత్మయునైన పరిశుద్ధాత్ముడు*

🕂మనకు ఆత్మయు ఒక్కడే(1 కొరింథీయులకు 12:4,9,13,18; ఎపేసి. 2:18; 4:4)

నిత్యుడగు ఆత్మ (హెబ్రీ. 9:14)

🕂పరిశుద్ధాత్ముడు దేవత్వము కలవాడు. (అపొస్తలుల కార్యములు 5:3–4)


E : దేవత్వము గలవాడు దేవుడేనా?

అవును 💯 — తండ్రి + కుమారుడు + ఆత్మయు = ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుడు అనే పదముతోనే పిలువబడే సందర్భాలును పైన మనం చూశాం కదూ ఐతే… మనకు/అందరికి/క్రైస్తవులకు దేవుడు?


▪️*క్రైస్తవులకు దేవుడొక్కడే*

 ఈ ముగ్గురులో “మనకు/అందరికి/క్రైస్తవులకు దేవుడు ఒక్కడే” అనే విషయం కూడా బైబిల్ స్పష్టముగా తెలియజేస్తుంది. ఇదే అనాటి నుండి క్రైస్తవుల యొక్క విశ్వాస పునాది.


🕂(ఎపేసి 4:6): "అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.౹"

🕂(1 కోరింది 8:6) ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి

🕂(మలాకి 2:10) మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా?

🕂(1 తిమోతి 2:5): "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹"


⚫ “ఒక్కడే అంటే ఒక్కడే అని అర్ధం”. ఒక్కడే అనే స్థానములో ఇద్దరిని, ముగ్గురిని పెట్టడం పరిశుద్ధాత్ముని మీద తిరుగుబాటు చేసినట్టే అగును కదా!!


మరింత విశ్లేషణ కోసం దేవుడొక్కడే అంటే —ఎవరికి దేవుడు? అంశము పూర్తిగా చదవండి.


2️⃣. త్రిత్వమా?

“త్రిత్వము” అనే పదము క్రైస్తవ లోకములో విస్తృతంగా వినబడుతున్న ఒక సిద్ధాంత పదము. “త్రిత్వము” అనే పదము లాటిన్ భాషలోని “Trinitas” అనే పదము నుండి వచ్చింది. దీనిని ఇంగ్లీష్ లో Trinity అంటాం. దీని అర్థము “ముగ్గురిలో దేవత్వము/ఏకత్వము” లేదా “మూడు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు” అనే భావన.


త్రిత్వ వాదం” ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో నున్న ఒక్క దేవుడు మరియు ఒక్క స్వభావమే. తండ్రి పూర్తిగా దేవుడు, కుమారుడు పూర్తిగా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా పూర్తిగా దేవుడు. దేవుడు అనే పదములోనే ముగ్గురు మిళితం అయ్యి ఉన్నారు అంటూనే మనకు ఒక్క దేవుడు ఉన్నారు అనే రకమైన వాదులు ఉన్నారు. మరియు మనకు ఒక్కడే దేవుడు ఆయనే యేసు అనే త్రిత్వ వాదులు ఉన్నారు. ఇందులోనే తిరిగి యెహోవాయే యేసు, యేసే పరిశుద్ధాత్ముడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు కూడా ఉన్నారు. కాలక్రమేణా “త్రిత్వ వాదం” వారికి నచ్చిన రీతిలో మార్పు చెందుతూనే వచ్చింది. 


అయితే ఈ పదమును పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించవలెను — “త్రిత్వము”(Trinity) అనే పదము బైబిల్లో ఎక్కడా కనిపించదు. పాత నిబంధనలో గాని, క్రొత్త నిబంధనలో గాని, క్రీస్తు బోధలో గాని, అపొస్తులుల బోధలో గాని ఈ పదము ఉపయోగించబడలేదు.


A : త్రిత్వము - చరిత్ర

చరిత్ర ప్రకారం, “త్రిత్వము” అనే పదమును మొదటిగా క్రీస్తుశకం రెండవ శతాబ్దం చివరలో(AD 200) టెర్టులియన్ (Tertullian) అనే క్రైస్తవ రచయిత ఉపయోగించాడు. అతను “Trinitas” అనే లాటిన్ పదమును ఉపయోగించి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ప్రయత్నించాడు.


తరువాత క్రీస్తుశకం 325లో నైసియా కౌన్సిల్ (Council of Nicaea) అనే సంఘ సమావేశములో యేసుక్రీస్తు స్వభావము గురించి అనగా “యేసుక్రీస్తు సృష్టింపబడినవాడా? లేక నిత్యుడా?” అనే విషయమై చర్చ జరిగింది. అక్కడ “హోమూషియస్” (Homoousios) అనే గ్రీకు పదమును ఉపయోగించారు. ఈ పదము అర్థము “ఒకే స్వభావము” (same substance) అనే భావన. ఈ సమావేశము తరువాత “Nicene Creed” అనే ప్రకటన రూపొందించబడింది.


“Una substantia, tres personae”

అర్థము: “ఒక స్వభావము, మూడు వ్యక్తులు”


తరువాత క్రీస్తుశకం 381లో కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్‌లో పరిశుద్ధాత్ముని స్థానం కూడా అధికారికంగా చేర్చబడింది. ఈ విధంగా త్రిత్వ సిద్ధాంతము చరిత్రలో ఒక థియోలాజికల్ వివరణగా అభివృద్ధి చెందింది.


Source : New Catholic Encyclopaedia, 2nd Edition, Volume 14, “Trinity,” pp. 295–299.


“త్రిత్వము” అనే పదము బైబిల్ పదము కాదు; అలాగే “హోమూషియస్” “ఎసెన్స్” అనే పదములు బైబిల్లో కనిపించవు. అది ఒక థియోలాజికల్ పదములు. అపోస్తులులు పరిశుద్ధాత్ముడు ప్రేరణ ద్వారా ఎన్నడూ ఇట్టి “త్రిత్వ బోధను” ప్రకటన చేయలేదు, బైబిల్లో వ్రాయలేదు సుమీ!!


3️⃣. త్రియేకమా?

“త్రియేకము” అనే పదము రెండు పదముల కలయిక :

▪️త్రి (Tri) = మూడు

▪️ఏకము (Une / Eka) = ఒకటి

అంటే “మూడు అయిన ఒకటి” లేదా “మూడు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు” అనే భావనను సూచించుటకు ఈ పదమును ఉపయోగిస్తారు. ఆంగ్లంలో దీనిని “Triune God” అని పిలుస్తారు.

అయితే ఒక ముఖ్యమైన సత్యము ఏమిటంటే — “త్రియేకము” అనే పదము కూడా బైబిల్లో ఎక్కడా ఉపయోగించబడలేదు. ఇది పాత నిబంధనలో గాని, క్రొత్త నిబంధనలో గాని, అపొస్తలుల బోధలో గాని కనిపించదు.


Source : Encyclopaedia Britannica, 15th Edition, Volume 11, “Trinity,” pp. 928–930.


“త్రియేక వాదం” అనేది ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక్కడే. ఒక్క దేవుడు మూడు రూపాల్లో పాత్ర పోషించారని. ద్వి లేదా త్రి పాత్రాభినయం చేశాడని.. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారని, ముగ్గురిని కలిపితే సంపూర్ణ దేవుడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు కలరు. దీనికి వారు చూపించే వచనం… "నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹" (యోహాను 10:30) అదిగో ఏకమై(ONE) ఉన్నారంటే ఒక్కడే.. ముగ్గురు ఒక్క వ్యక్తే అనేవాదన చేయువారు ఇట్టివారిని నేడు “ఏకత్వవాదులు” అందురు.  అట్టివారికి మరింత విశ్లేషణ కోసం మా రచనల్లో నున్న “ఏకమైయున్నారు అంటే ఏంటి?” అనే ఈ అంశము పూర్తిగా చదవగలరు. 


A : త్రియేకము — చరిత్ర

త్రియేకము అనే పదము “త్రిత్వము” (Trinity) అనే సిద్ధాంతాన్ని వివరించుటకు తరువాత కాలములో ఉపయోగించబడిన ఒక వివరణాత్మక పదము. క్రీస్తుశకం రెండవ మరియు మూడవ శతాబ్దములలో క్రైస్తవులు దేవుని స్వరూపమును/స్వభావమును వివరించుటకు తత్త్వశాస్త్ర సంబంధమైన పదములను ఉపయోగించడం ప్రారంభించారు.


టెర్టులియన్ (Tertullian), ఒరిజెన్ (Origen), మరియు తరువాత కొందరు మత నాయకులు దేవుని గురించి వివరణ ఇవ్వుటకు “Trinitas” మరియు “Triune” వంటి పదములను ఉపయోగించారు.


క్రీస్తుశకం 325లో నైసియా కౌన్సిల్ మరియు క్రీస్తుశకం 381లో కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్ తరువాత ఈ భావనలు మరింత స్థిరపడ్డాయి.

అయితే ఈ పదములు బైబిల్ పదములు కాదు; అవి తరువాత కాలములో ఉపయోగించబడిన వివరణాత్మక పదములు మాత్రమే. అపోస్తలుల బోధకు వీరి బోధలకు ఎటువంటి సంబంధం లేదు.


🌿 ముగింపు 

దేవత్వము  - ✅

త్రిత్వము - ❎

త్రియేకము

పరిశుద్ధ వాక్యము ప్రకారం దేవత్వము ఒక లక్షణము. ఆ దేవత్వము తండ్రియందు ఉంది, కుమారునందు ఉంది, పరిశుద్ధాత్మునందు ఉంది. కాబట్టి దేవత్వము కలిగిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేది సత్యం. ఐతే దేవత్వములో ముగ్గురు వ్యక్తులు అని అనకూడదు కారణం ఇది త్రిత్వ/త్రియేక బోధకు దారి తీస్తుంది. 


అయితే “త్రిత్వము” మరియు “త్రియేకము” అనే పదములు కూడా బైబిల్లో లేవు; అవి తరువాత కాలములో ఉపయోగించబడిన చారిత్రక పదములే కానీ దైవ పూరితమైన సందేశం కావు. వీటిని తల దన్నే బోధలు అనగా జ్ఞానతత్వం వాదన, గతికవాదం లేకపోలేదు. తదుపరి రచనల్లో వాటి కోసం వ్రాయుటకు ప్రయత్నం చేస్తాం. ఏదిఏమైనా మన విశ్వాసము దేవుని వాక్యముపైనే ఉండాలి.  “సమస్తమును పరిశీలించి మేలైనదానిని చేపట్టుడి.” (1 థెస్సలొనీకయులకు 5:21)

మీ ఆత్మీయులు 👪

1. దేవత్వముక్లిక్ చేయు

2. యేసుక్రీస్తు యొక్క దేవత్వము క్లిక్ చేయు

3. యేసు ఎవరు?క్లిక్ చేయు

4. ఏకమైయున్నారు అంటే ఏంటి?క్లిక్ చేయు

5. దేవుడొక్కడే అంటే —ఎవరికి దేవుడు?క్లిక్ చేయు

దేవుడు ఒక్కడే అంటే — ఎవరికీ దేవుడు?



ప్రపంచమంతా అనేకమంది వివిధ రకాల దేవతలను పూజిస్తున్నా, వివిధ రకాల విశ్వాశాలు కలిగియున్న, వివిధ భక్తి జీవితాలు కలిగియున్నప్పటికి … మొదటగా సమస్త మానవజాతికి, సర్వసృష్టికి, సమస్త దేవతలకు, యూదులకు, అన్యులకు, క్రైస్తవులకు మరియు చివరిగా మన ప్రభువైన యేసునకు కూడా దేవుడు ఒక్కడేనని సత్యాన్ని స్పష్టంగా తెలియజేసిన ఏకైక పరిశుద్ధ గ్రంథమే బైబిల్ ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇందుకు ఈ క్రింది విషయాలు దీనిని నిర్ధారిస్తున్నాయి. 👇


Ⅰ.  సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే :

బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏమిటంటే — దేవుడు సర్వసృష్టికి దేవుడు. ఆయనను ఒక జాతికి, మతానికి, లేదా వర్గానికి అంటూ పరిమితం చేయలేము.(యెషయా 45:2)  ఆకాశం, భూమి, సముద్రం — అన్నింటిని సృష్టించిన దేవుడు ఒకడే. ఆయన ప్రతి మనిషికి జీవం, శ్వాస, జ్ఞానం ఇచ్చుచున్నాడు. (అపో.కార్యములు 17:24-25). “నేనే మొదటివాడను, నేనే చివరివాడను” అంటే — దేవుడు సమయానికి అతీతుడు, సృష్టికి పునాది, అంతిమ గమ్యం అన్నమాట. దేవుని ఏకత్వం మరియు సర్వాధికారాన్ని ప్రకటిస్తుంది. (యెషయా 41:6; 44:6) ప్రకృతి, విశ్వం, జీవం — ఇవన్నీ ఆయన ఉనికిని సూచిస్తున్నాయి. దేవుని సృష్టిని చూసిన తర్వాత కూడా ఆయనను అంగీకరించకపోవడం — అది అజ్ఞానం కాదు, నిర్లక్ష్యం. దేవుడు ఒక్కడే సృష్టికర్త. సర్వసృష్టికి ఆయన శక్తిని, దైవత్వాన్ని సాక్షిగా చూపుతుంది. (రోమా. 1:19-20)


Ⅱ.  సర్వ జీవులకు దేవుడు ఒక్కడే :

యెహోవా అందరిమీదా కరుణగలవాడు, ఆయన కృప ఆయన సృష్టులన్నిటిమీద ఉంది. (కీర్తనలు. 145:9) ఆయన దయ సృష్టిలోని ప్రతి జీవిపై ఉంది. హన్నా తన ప్రార్థనలో చెబుతుంది — జీవమూ, మరణమూ దేవుని చేతుల్లోనే ఉన్నాయని. (1 సమూయేలు. 2:6) సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి; తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.” (కీర్తనలు 145:15). 


Ⅲ.  సమస్త దేవతలకు దేవుడు ఒక్కడే

“నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును.” (దానియేలు 2:47) …వెండి బంగారములతోను, ఇత్తడి ఇనుము కలప రాతి విగ్రహములతోను —అవి చూడవు, వినవు, గ్రహింపవు — వాటిని స్తుతించితివి; అయితే నీ ప్రాణమును నీ చేతిలో ఉంచిన దేవునిని నీవు గౌరవింపలేదు. (దానియేలు 5:22-23) మానవులు చేసిన దేవతలకంటే సజీవుడైన యెహోవా మాత్రమే నిజమైన దేవుడు. "ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹" (1 కొరింథీయులు 8:4–7)


Ⅳ.  దయ్యములు కూడ దేవుడు ఒక్కడేనని తెలుసును

“దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు; దయ్యములును నమ్మి వణకుచున్నవి.” (యాకోబు 2:19–20)

దేవుడు ఒక్కడే అని నమ్మడం సరైనది — ఇది సత్యం. కానీ కేవలం నమ్మడం మాత్రమే సరిపోదు. ఎందుకంటే దయ్యములు కూడా దేవుని ఉనికిని నమ్ముతాయి, కాని ఆయన నిబంధనను అనుసరించవు. అసలు విశ్వాసం అంటే దేవుని ఉనికిని అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన చిత్తానికి లోబడి, ఆయన వాక్యానుసారం జీవించడం.


Ⅴ.  యూదులకు దేవుడు ఒక్కడే :

ఇశ్రాయేలూ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. (ద్వితీయోపదేశకాండము 6:4) మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను. (యెషయా 44:8) యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను–ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును (యిర్మియా 10:10-11) అందుకు యేసు — ప్రధానమైనది ఏదనగా — ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. (మార్కు 12:29)


Ⅵ.  అన్యులకు దేవుడు ఒక్కడే :

“దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? కాదు, అన్యజనులకును దేవుడే.”  (రోమా 3:29–30)


Ⅶ.  క్రైస్తవులకు దేవుడు ఒక్కడే :

“మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు — ఆయన తండ్రి; మరియు మనకు ప్రభువు ఒక్కడే — యేసుక్రీస్తు.” (1 కొరింథీయులు 8:6). అందరికి తండ్రియైన దేవుడు అందరిలోను, అందరిమీదను, అందరిమధ్యలోను ఉన్నాడు (ఎఫెసీయులు 4:6). 


Ⅷ.  క్రీస్తు ప్రభువుకి దేవుడు ఒక్కడే :

>  “నా దేవుడా, నా దేవుడా, నీవు నన్నేల విడనాడితివి?” (కీర్తనలు 22:1)

>  "ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము." (మత్తయి 27:46)

>  "నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు." (కీర్తనలు 45:7)

>  "మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. …" (ఎఫేసి. 1:3)

>  "మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. (1 పేతురు 1:3)

>  “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నాను.” (యోహాను 20:17)


💣యేసుక్రీస్తుకి దేవుడు — ఆయనే యెహోవా (తండ్రి) — ఒక్కడే దేవుడు — మన దేవుడే! 🙏


🔥 సారాంశం :

ప్రపంచమంతటా ఉన్న సృష్టులకు, జీవులకు, ప్రజలకు, దేవతలకు, దయ్యములకు అలాగే మన ప్రభువైన యేసునకు — అందరికీ ఒకే దేవుడు ఉన్నాడని గుర్తించు. ఆయనే యెహోవా దేవుడు, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనకు తండ్రిగా వ్యక్తమయ్యాడని అంగీకరించు.


✒ "ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను." (యోహాను 1:18)

✒ “అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.” (ఎఫెసీయులు 4:6)

మీ ఆత్మీయులు 👪👧

🌿  యేసు యొక్క దేవత్వము?క్లిక్ చేయు

🍂 యేసు యొక్క దేవుడు ఎవరు?క్లిక్ చేయు

🍃 దేవుడొక్కడే క్లిక్ చేయు

యెషయా 9:6 వివరణ (Isaiah 9:6)

యెషయా 9:6 వచనము



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿


📖 (యెషయా 9:6): "ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును."


🔘 మన ప్రభువైన యేసుక్రీస్తు నరమాత్రుడు కాదు అని చెప్పుటకే యెషయా 9:6 వచనములోనున్న విషయాలు ప్రవకైన యెషయా ద్వారా ముందుగా వ్రాయబడ్డాయి.


🔘 యేసునకు మాత్రమే పెట్టబడే పేరులు లేదా బిరుదులు ఇవి.


🔘 దైవత్వము గలవాడు కొద్ది కాలము నరుడుగా పుట్టి, దాసుని స్వరూపం ధరించి తన పని ముగిస్తాడని.


🔘 ఈ భూమి మీద తాను చేయనున్న పనిని అనగా శక్తిని గూర్చి, జ్ఞానం గూర్చి ముందుగా పలికిన సందర్భం. 


🔘 యేసు ఏలుబడి చేసే రాజు అవుతాడని, అటు తరువాత తాను చేయనున్న రాజరికాన్ని గూర్చి, పరిపాలన గూర్చి, ఆదరణ గూర్చి, ప్రజలను దేవునితో సమాధానం పరుచుట గూర్చి ముందుగా పలికిన సందర్భం. 



📝 మనకు శిశువు పుట్టెను :

"మనకు శిశువు పుట్టెను" అనగా ప్రభువైన యేసు యావత్తు భూమ్మీదనున్న వారికి నిరంతరం రాజై ఉండి, ఏలుబడి చేయుటకు, ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును అనేది దీని యొక్క ముఖ్య అర్థమే కానీ ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును అనేది దీని యొక్క అర్ధం కాదు.


దావీదుతో దేవుడు చేసిన నిబంధన "నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగా– నేను నీకు సంతానము కలుగజేయుదును.౹ నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.౹ అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;౹ నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతునుగాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.౹ నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.౹"(2 సమూయేలు. 7:11-16).


కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును(యెషయా. 16:5). యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును..." (యిర్మీయా. 23:5-6). ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. (యిర్మీయా. 33:17). వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును(యేసును) వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.౹ (యెహెజ్కేలు. 34:23-24) 


"ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను." (లూకా. 1:31-33). "అందుకు పిలాతు– నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు– నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను..." (యోహాను. 18:37)



📝 మనకు కుమారుడు అనుగ్రహింపబడెను :

మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనగా సిలువ మరణములో అని అర్థం. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹" (యోహాను. 3:16). "తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు..." (రోమా. 8:32)



📝 ఆయన భుజముమీద రాజ్యభారముండును :

ఆయన భుజముమీద రాజ్యభారముండును అనగా రాజ్యానికి సంబంధించిన భారం ఉంటుంది లేదా రాజ్యపాలన లేదా సంఘ పరిపాలన యొక్క బాధ్యత ఉంటుంది అని అర్థం. "మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.౹ ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది." (ఎపేసి. 1:22-23) "సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు;..." (కొలస్సి. 1:18) "ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.౹ మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.౹ ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.౹ ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.౹ అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.౹ ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.౹" (1 కోరింది. 25:20-25)



👤 ఆశ్చర్యకరుడు :

ఆశ్చర్యకరుడు అనగా ఈ పదం ఆయన అద్భుతమైన శక్తిని మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆయన చేసే పనులు అసాధారణమైనవి మరియు ఊహకు అందనివి అని సూచిస్తుంది.


నీటిని ద్రాక్షరసంగా మార్చడం (యోహాను. 2:1-11). ఐదు వేల మందికి ఆహారం పంచుట(మత్తయి. 14:15-21; మార్కు. 6:35-44) "అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి." (మత్తయి. 8:26-27)


"యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను."(మత్తయి. 7:28-29). "సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.౹ యూదులు అందుకు ఆశ్చర్యపడి– చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.౹ అందుకు యేసు– నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹" (యోహాను. 7:14-16).



👤 ఆలోచనకర్త :

 ఆలోచనకర్త అనగా ఒక వ్యక్తి తన సమస్యలకు లేదా నిర్ణయాలకు సలహా కోరే వ్యక్తిని ఆలోచనకర్త అని పిలుస్తారు. "సలహాదారు" లేదా "గురువు" లేదా "ఆలోచన తెలియజేయువాడు" అనవచ్చు. 


"అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు –బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతోకూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు– కైసరువనిరి. అందుకాయన– ఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి." (మత్తయి. 22:15-22). 



👤 బలవంతుడైన దేవుడు :

బలవంతుడైన దేవుడు అనగా దేవత్వము గల మన ప్రభువైన యేసు అపవాది కంటే బలవంతుడు అని అర్ధం. 


🍂  యేసుక్రీస్తు అందరికి దేవుడు ❌

🍃 యేసుక్రీస్తు అందరికి ప్రభువు  (అపో.కార్య. 10:36).


యేసునకు దేవుడు ఎవరో ఆయనే మనకు దేవుడు. యేసు మాటల్లో... "నా దేవుడు(my God), మీ దేవుడు(your God)" (యోహాను. 20:17). "ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా(my God), నా దేవా(my God) నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము." (మత్తయి. 27:46). "దేవుడొక్కడే" (లూకా. 18:19). 


"బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు." (లూకా. 11:21-23).



👤 నిత్యుడగు తండ్రి :

నిత్యుడగు తండ్రి అనగా నిత్యత్వము గలవాడని, తండ్రిలా ఆదరించువాడని, తన ప్రజల పట్ల తండ్రిలా ప్రేమ చూపించువాడని, లేదా పాపం చేసిన వారిని వెంటనే శిక్షించక మారుమనస్సు దయచేసి అవకాశం ఇచ్చువాడనియు, వారు మారుమనస్సు పొందిన యెడల రక్షించువాడని అర్థం. ఈ బిరుదు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన తన దేవునితో ఉన్న సంబంధాన్ని మరియు ఆయన శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. 


యేసుక్రీస్తు కాలక్రమంలో ఎప్పటికీ అంతం లేనివాడు, ఆయన దేవుని కుమారుడు మరియు ఆయన దేవునితో నిత్యత్వములో  ఎప్పటికీ ఉన్నవాడు. యేసు ప్రార్థనలో... "తండ్రీ, లోకము పుట్టకమునుపు [నీయొద్ద నాకు] ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹" (యోహాను. 17:5).


ఇదిగో నిత్యుడగు తండ్రి అని ఉంది కదా యెహోవాయే యేసు, యేసే యెహోవా అనే బోధ అపవాది ఆలోచనలు నుండి పుట్టినది. ఇది అబద్ధపు బోదె కానీ దేవుని బోధ కాదు. యేసే మనకు తండ్రి అనేడి వారు లేఖనములను అపార్థం చేసుకుంటున్నారనేది వాస్తవం. యేసు మాటల్లో..."నా తండ్రి(my Father) మీ తండ్రి(your Father)" (యోహాను. 20:17). "మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు." (మత్తయి. 23:9).



👤  సమాధానకర్తయగు అధిపతి :

అధిపతి అనగా రాజు, ప్రభువు, అధికారి అని అర్థం. సమాధానకర్తయగు అధిపతి అనగా యేసుక్రీస్తును వర్ణించడానికి ఉపయోగించే ఒక బిరుదు. దీని అర్థం, ఆయన శాంతిని స్థాపించేవాడు, రక్షకుడు అని లేదా మనుషులు మధ్య దేవునితో సమాధానమును మరియు వారి అంతరంగంలో శాంతిని నెలకొల్పువాడని అర్థం.


"ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(రక్షకుడు) అను పేరు పెట్టుదువనెను." (మత్తయి. 1:21). "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.౹" (యోహాను. 14:27). "ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.౹" (1యోహాను. 2:2). మనం యేసుక్రీస్తును నమ్మినప్పుడు, దేవునితో మన సంబంధం సరిదిద్దబడుతుంది మరియు మనం ఆయనతో సమాధానంగా ఉంటాము. ఇది కేవలం భావోద్వేగ శాంతి మాత్రమే కాదు, దేవునితో విరిగిపోయిన సంబంధం యొక్క మరమ్మత్తు. క్రీస్తు మరణం ద్వారానే మనం దేవునితో సమాధానపరచబడియున్నాము." (రోమా. 5:1; 10-11).



📖 (యెషయా 9:7): "ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును."


క్రీస్తు సంఘము(చర్చ్ ఆఫ్ క్రెస్ట్) యొక్క శాశ్వత స్వభావాన్ని ఇది హైలైట్ చేస్తుంది. తన సంఘము వారి యెడల ఆయన పరిపాలన మరియు సమాధానం ఎప్పటికీ అంతం కాదని, ఆయన న్యాయం మరియు నీతితోనే తాను యుగయుగములు దావీదు సింహాసనంపై శాశ్వతంగా పరిపాలిస్తాడని అనేది సందేశం.



🔎 ఓ చదువరి... యెషయా 9:6 వచనం యేసు కేవలం నరమాత్రుడు కాదని తెలియజేయుటకును మరియు ఆయన గూర్చి అద్భుతమైన పరిపాలకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని  పేర్లు పెట్టబడతాయని యెషయా ద్వారా ప్రవచించబడిన దానికి ముఖ్య ఉద్దేశ్యం యేసు యొక్క ప్రత్యేకమైన గుణాలను మరియు దైవత్వాన్ని, రాజరికానికి, ఆదరణకు, క్రీస్తు ఏలుబడికి, అలాగే మనుషులకు మరియు దేవునికి మధ్య సమాధానం నిలుపుటకు ముందుగా సూచించబడి, పెట్టబడే బిరుదులని గుర్తుంచుము.

మీ ఆత్మీయులు👪

🍃 యెహోవా దేవుడే యేసుగా వచ్చాడా!? Click Here  

🍃 యేసుక్రీస్తు యొక్క దేవత్వము Click Here

🍃 యేసు యొక్క దేవుడు ఎవరు? Click Here 

"యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడా!?" Is Jehovah came as like Jesus



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. 🙏🏿

పరలోకమందున్న దేవుడు ఆది నుండి జరుగు సంగతులను మరియు తన సంకల్పమును అంతటిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మనుషులు చేత వ్రాయించి(66 పుస్తకాలుగా వ్రాసి) మానవజాతికి ఇచ్చుటకు గల ముఖ్య ఉద్దేశ్యం నరుడు తాను బ్రతుకు దినములన్నియు పరిశుద్ధ గ్రంథమును చదువుటకును(ద్వితీయో. 17:21; 1 తిమోతి. 4:13; ప్రకటన), దానిలో విషయాలు చదివి/విని బాగుగా గ్రహించుకొనుటకును (నెహె. 8:8 అపో.కార్య. 8:30), పరిశోధన చేయుటకును (యెషయా. 34:16; అపో.కార్య. 17:11), ధ్యానించుటకను(యెహో. 1:8; కీర్తనలు. 1:2) తన బాల్యదినములందే సృష్టికర్తను యెరుగుటకును(ప్రసంగి. 12:2) దేవుని గూర్చిన జ్ఞానమును(2 కోరింది.10:5; 1 దేస్స.2:13), క్రీస్తును గూర్చిన జ్ఞానమును(ఎఫెసి.4:11), అలాగే పరిశుద్ధాత్ముడు గూర్చిన జ్ఞానమును(యోహాను.14:16; తీతుకు.3:5-6) స్పష్టముగా యెరిగి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్(క్రీస్తు సంఘముగా) చేర్చబడుటకును, అపోస్తలుల బోధలో తమ జీవితాలను దిద్దుబాటు చేసుకొనుటకును, క్రీస్తు స్వరూపం తనయందేర్పడుటకును, క్రీస్తు ప్రత్యక్షతలో మనం తండ్రి యొద్దకు చేరుకోవాలనే కదా!!(అపో.కార్య.2:38-42; గలతీ. 4:19; యోహాను. 14:6).

నిజమైన విశ్వాసికి బైబిలే ప్రామాణికం కాబడాలి లేనియెడల తమ ఊహలు/ఇష్టాలు గ్రంథానికి ఆపాదించబడే అవకాశాలున్నాయి. ఇలా మనుషులు సరిగ్గా ఆలోచించక, పరిశీలించక, చదవక, సరిగ్గా విభజించక పోవుట వలన పుట్టుక వచ్చే బోధలే త్రిత్వము, త్రియేక, ఏకతత్వవాదం, గతికవాదం, జ్ఞానతత్వవాదం ఇవి... 👇👇

త్రిత్వ వాదం అనగా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలోనున్న ఒక్క దేవుడు మరియు ఒక్క స్వభావమే. తండ్రి పూర్తిగా దేవుడు కుమారుడు పూర్తిగా దేవుడు పరిశుద్ధాత్మ కూడా పూర్తిగా దేవుడు అయిన మనకు ఒక్క దేవుడు ఆయనే యేసు అంటూనే తిరిగి యెహోవాయే యేసు, యేసే పరిశుద్ధాత్ముడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.

త్రియేక వాదం అనగా ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక్కడే. ఒక్క దేవుడు మూడు రూపాల్లో పాత్ర పోషించారని. ద్వి లేదా త్రీ పాత్రాభినయం చేశాడని.. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారని,  ఆ ముగ్గురిని కలిపితే సంపూర్ణ దేవుడు అనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.

ఏకతత్వవాదం  అనగా ఇద్దరూ ఏకమైయున్నారు అంటే  ఒక్కడైయున్నారని,  ఒక్క దేవుడే ద్విపాత్రాభినయం చేశాడనే బోధ యందు లక్ష్య పెట్టేవారు.

❌  గతికవాదం అనగా యేసును దేవుడు కలుగజేశాడని. యేసు రెండవ రాకడ అయిపోయిందని, నరకం లేదని, సంఘము శాశ్వతముగా భూమి మీద ఉంటుందని, పునరుత్థానం లేదని, పరలోకము లేదని,...Etc. (జ్ఞానతత్వవాదల నుండి పుట్టుకు వచ్చిన వారే ఈ గతికవాదులు).

జ్ఞానతత్వవాదం అనగా యేసు శరీరములో దేవత్వం లేదు, శరీరమునకు పునరుత్థానం లేదు, యేసు కేవలం నరుడు మాత్రమే, అనాదిలో తండ్రి ఆలోచనలో మాత్రమే ఉన్నాడు కానీ తండ్రి యొద్ద లేరు..Etc.

మనం ముఖ్యముగా త్రిత్వము మరియు త్రియేక వాదుల బోధలు విషయానికి వస్తే ఇవి పూర్తిగా బైబిల్ కి వ్యతిరేకం. యేసు ఎప్పుడూ "త్రిత్వం/త్రియేక(Trinity)" అనే పదాన్ని ఉపయోగించలేదు. మనకు ఆ పదం బైబిల్లో కనిపించదు. ఇవి మనుషులు తమ ఆలోచనలును  పరిశుద్ధ గ్రంథానికి ఆపాదించి మాట్లాడే విషయాలే. కావున ఇటువంటి అబద్ధాలు బారిన పడకూడదనే ఆలోచనతో "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడా!?" అనే అంశము మీ ముందు ఉంచుటకు ప్రయత్నం చేయుచున్నాము కావున చివరి వరకు చదివి ఆలోచించి, వాక్య పరిశీలన  చేయవలసిందిగా మనవి. 🙏


🔥 కీలకమైన విషయాలు :
 
👤 మన దేవుడైన యెహోవా ≈ అనాది (సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యెషయా. 40:28; కీర్తనలు. 90:1-2).

👤 మన ప్రభువైన యేసుక్రీస్తు ≈ అనాది(సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యోహాను. 17:5; 1 పేతురు. 1:18-20).


📖 పాత నిబంధన కాలములో దేవుడైన యెహోవా తన భక్తుల ద్వారా యేసుని గూర్చి ముందుగా తెలియపరచుట :


1). అబ్రహామునకు తెలియజేసిన మాటలు: (ఆది. 17:7; గలతీ. 3:16).
2). దావీదునకు తెలియజేసిన మాటలు: (2 సమూయేలు. 7:12-19).
3). యెషయాకు తెలియజేసిన మాటలు: (యెషయా. 7:14; 9:6-7).
4). యిర్మియాకు తెలియజేసిన మాటలు: (యిర్మియా. 31:31-33).
5). దానియేలుకు తెలియజేసిన మాటలు: (దానియేలు. 7:13-14).
6). మీకాకు తెలియజేసిన మాటలు: (మీకా. 5:2).
7). జెకర్యాకు తెలియజేసిన మాటలు: (జెకర్యా. 9:9).
8). మలాకీకు తెలియజేసిన మాటలు: (మలాకీ. 3:1).



🔥 "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వస్తే..."

మనం ఒక్క క్షణం "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు" అని భావిస్తే బైబిల్ ను  నీవు పూర్తిగా అపార్థం చేసుకొనట్టే అగును కదా... ఎలా అనేది  ఈ క్రింది విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేయుము. 

A). యేసుక్రీస్తు ఎవరిచేత పంపబడ్డాడు? ఆలోచించుకో... - (యోహాను 5:30; 8:42; 17:3; 20:21).

B).  యేసుక్రీస్తు ఎవరి యొద్ద నేర్చుకున్నాడు? ఆలోచించుకో... - (యెషయా. 50:4-7; యోహాను. 5:19; 8:28; 12:49-50; 14:24; 15:15). 

C).  యేసుక్రీస్తు ఎవరి మాట విన్నాడు? ఆలోచించుకో...  - (యోహాను 3:32; 12:49-50; 14:10). 

D). యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరికీ విధేయుడుగా ఉన్నాడు?  ఆలోచించుకో... - (యెషయా. 53:10-12; మత్తయి. 26:39; యోహాను. 10:18; 14:31; రోమా 5:19; ఫిలిప్పీ 2:8; హెబ్రీ 5:5-9).

E). యేసుక్రీస్తును సమాధి/మరణం నుండి ఆయనను లేపిందెవరు? ఆలోచించుకో...  - (అపో.కార్య. 2:24; 3:15; 4:10; 13:37; 17:31; 4:25; రోమా 6:4; 7:4; 8:11; 1 కొరింథీ 6:14; 15:4,12; ఎఫేసి 1:20,21).

F). యేసుక్రీస్తుకు ఎవరు అధికారం ఇచ్చారు?. ఆలోచించుకో... - (యోహాను. 5:26; మత్తయి 28:18,19; ప్రకటన 2;26; 3:12; 1పేతురు 3:22).

G). యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు?. ఆలోచించుకో... - (యెషయా 11:1-5; మత్తయి 12:18,28  లూకా. 4:18; యోహాను 3:34; అపో.కార్య. 10:38).

H). యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరికీ ప్రార్ధన చేశారు?. ఆలోచించుకో... -(కీర్తనలు 22:1-10; మత్తయి 11:25; 26:38-39; 27:46; మార్కు 1:35; లుకా 6:12; యోహాను 17:1-22; హెబ్రీ 5:7). Etc.

I). యెహోవా దేవుడే వస్తే... యేసుక్రీస్తు ఎవరిని నా దేవా నా దేవా, నా తండ్రి, నా దేవుడు అనెను? ఆలోచించుకో... (మత్తయి 27:46; యోహాను 20:17). Etc.

J). యెహోవా దేవుడే వస్తే... యేసుక్రీస్తు ఎవరి కుడి పార్శమున కూర్చున్నారు? - ఆలోచించుకో... (అపో.కార్య. 2:25,33,35; 7:55; రోమా. 8:34; ఎఫెసి. 1:20; కోలస్సీ 3:1; హెబ్రీ 1:3; 8:2; 10:12; 12:2; 1 పేతురు. 3:22).


👥 మరిన్ని ఆధారాలు  :

🍃 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను. -(యోహాను. 1:1-2)
☑ పై వచనమును బట్టి వాక్యము ఎవరు ? – యేసు (యోహాను. 1:14a).
☑ ఆ వాక్యము ఎవరియొద్ద ఉండెను ? – యెహోవా (యోహాను. 1:2; 14b).

🍂  నేను తండ్రియెద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను . –(యోహాను. 16:28).
☑ పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసి 1:19).
☑ తండ్రియొద్దకు వెళ్లుచున్నవారు  ఎవరు ? – యేసు (యోహాను. 17:5).

🍁ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవునికుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. (అపో.కార్య. 7:56).

☑ పై వచనమును బట్టి దేవుడు ఎవరు ? – యెహోవా (1 కోరింధి. 8:6).
☑ దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నది ఎవరు ? – యేసుక్రీస్తు (మార్కు. 16:19).

🍃  నేను తండ్రిని వేడుకొందును, మీయెద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించెను. (యోహాను. 14:16).

☑ పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసీ. 4:6).
☑ తండ్రిని వేడుకొందునని చెప్పినది ఎవరు ? – యేసు (యోహాను. 17:1-2).

🍂 తండ్రిని(Father)  కుమారుని(Son) ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. (1 యోహాను. 2:22).

☑ నా తండ్రి (మత్తయి. 10:32), మీ తండ్రి (మత్తయి. 23:9), మన తండ్రి (1 కోరింధి. 8:6).
☑ అద్వితీయ కుమారుడు. – (యోహాను. 3:16).


🔥 యెహోవా దేవుడు - యేసు కాదని అనుటకు సాక్ష్యము :

👤 యెహోవా సాక్ష్యము – (నిర్గమ. 33:20).
👤 యేసుక్రీస్తు సాక్ష్యము – (యోహాను. 1:18).
👤 పరిశుద్ధాత్ముని సాక్ష్యము – (1 తిమోతి. 6:16; 1 యోహాను. 4:12).

గమనిక : ఇద్దరి మనుష్యుల సాక్ష్యము సత్యమని గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. – (యోహాను. 8:17).


సారాంశము : ఓ చదువరి... నీకు ఇవ్వబడిన బైబిల్ జాగ్రత్తగా చదువుటకు, గ్రహించుకొనడానికి, పరిశీలన చేయడానికి, ధ్యానించడానికి, క్రీస్తు నందు రక్షింపబడి, క్రీస్తు పరిపాలన క్రింద చేర్చబడి, మరల ఆయన ప్రత్యక్షతలో తండ్రి యొద్దకు చేరుకొనుటకు, యుగయుగములు ఆయన సన్నిధిలో ఉండానికి ముందుగా ఇవ్వబడిన పరిశుద్ద గ్రంథమని గుర్తిస్తే... ఆయన గ్రంథములో లేనివాటిని తిరిగి గ్రంధానికి కలిపి, చెరిపి బోధించే అవకాశం ఇవ్వబడలేదనే విషయాన్ని మొదటగా గుర్తించు. ఇక విషయానికి వస్తే... "యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు" అనుటకు బైబిల్ ఏమాత్రం అంగీకరించదు. ఇది పూర్తిగా దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన బోదె. కాబట్టి పై వ్రాసిన విషయాలను వాక్యాలతో సహా చదివి, పరిశీలన చేయమని, అసత్యానికి/అబద్ధ బోధకు దూరంగా ఉండాలని మిమ్మలి  క్రీస్తు నందు ప్రేమతో కోరుతున్నాం. 🙏 

"యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అనేది ఒక కట్టుకథ"

WhatsApp Join Us   Telegram Join Us

మీ ఆత్మీయులు 👪


🔎 మరెన్ని అంశాలు పరిశీలన చేయుటకు :

3. గతికవాదంత్వరలో
4. యేసుని ఎవరు పంపెను?క్లిక్ చేయు

యెహోవాకు దేవుడు క్రీస్తా?(Jehovah's god is Christ?)

 యెహోవాకు దేవుడు క్రీస్తా?



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు🙏 


నేటి క్రైస్తవ సమాజములో మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకొంటూ... "యెహోవా దేవునికే దేవుడు ఉన్నారని ఆయనే యేసు" అనుచు  హెబ్రీయులకు. 1:7-8 వచనములు చూపించి తమకి అనుగుణముగా పరిశుద్ధ గ్రంథమును వక్రీకరించి, వాక్యమును అపార్థం చేసుకొనేవారు లేకపోలేదు. ఇలాంటి వారిని నేను ఎదుర్కొని తెలియపరిచినప్పటికి వారు విననందున దేవునికి విడిచిపెట్టి వదిలివేశాను. మరల కనపడే సరికి... కాస్త ఆలోచించి ఇలాంటి మిత్రుల బారిన ఎవరు పడకూడదని భావించి "యెహోవాకు దేవుడు క్రీస్తా?" అనే అంశమును వ్రాయుటకు సిద్ధపడి మీ యెదుట పెడుతున్నా కావున సత్య సంబంధులు చివరి వరకు చదివి, ఆలోచించి, సత్యాన్ని గుర్తించగలరని మనవి. 
మిత్రుడు నాతో మాటలాడిన సంభాషణ

📖 వాక్యము :
హెబ్రీయులకు. 1:7-9: "—తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే – దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను."
Heb 1:7-9: "And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire. But unto the Son he saith, Thy throne, O God, is forever and ever: a scepter of righteousness is the scepter of thy kingdom. Thou hast loved righteousness, and hated iniquity; therefore God, even thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."

కీర్తనలు. 45:6-7: "దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు [నీ] దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు."
Ps 45:6-7: "Thy throne, O God, is forever and ever: the scepter of thy kingdom is a right scepter. Thou lovest righteousness, and hatest wickedness: therefore God, thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."


💥 వాక్య వక్రీకరణ :
దేవా(O God) అనే మాటను పట్టుకొని యెహోవాకు దేవుడు ఉన్నారని. యెహోవా దేవుడే స్వయముగా నా దేవుడు యేసు అని అన్నారనే బోధ.
యేసు నా దేవుడు(MY GOD) నా తండ్రి అని ఎలా అన్నారో. (యోహాను. 20:17) అలాగే యెహోవా దేవుడు కూడా నా దేవుడు యేసు అన్నారనే బోధ (హెబ్రీ. 1:8).


🔎 వివరణ :
పరిశుద్ధ గ్రంథముతో కాస్త పరిచయం ఉన్నవారు ఎవరైనా ఇది  అబద్ధమే అని ఇట్టే నిర్ణయించగలరు. కానీ మన మిత్రులు ఎందుకు ఆలోచన చేయలేక, వాక్య వక్రీకరణకు పోతున్నారో వారే పరీక్షించుకొని, నిర్ధారణ చేసుకోవాలి. ఏది ఏమైనా సత్యం తెలియజేయడం మన బాధ్యత. ఇక విషయానికి వస్తే...

1. మనము పాపమునుండి విమోచింపబడి, నీతివిషయమై జీవించునట్లు, యేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:18; 1 పేతురు. 2:24; యెషయా 53:4-5; 12). మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచి(1 కొరింది. 15:3-4), అనాది దేవుని సంకల్పం నెరవేర్చి(1పేతురు. 1:18:19-20; అపో.కార్య. 2:23). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). తన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).

2. తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన కుమారున్ని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి, ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3-4; 9).

🔖Note : పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తరువాత యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనెను. (హెబ్రీ మొదటి అధ్యాయం అనాదిలో జరిగిన సంఘటన కాదు). 

3. అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి, ఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు యెహోవా దేవుడే తన కుమారుడును మనకు "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32; యోహాను. 3:36; అపో.కార్య. 2:32-36; 10:36). ఈ సంగతి ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని పరిశుద్ధాత్ముడే చెప్పెను కదా!! (అపో.కార్య. 2:36).



📝 తండ్రి(యెహోవా) ఇలా కుమారుడును(యేసును) అభిషేకించె పనిలో ముందుగా... "దేవా"(O God) అని తన కుమారుని గూర్చి ఇలా సంభోదించెను.(8వ)

☑ గ్రీకు : ho theos(ὁ θεός) 
☑ ఇంగ్లీష్ : O God
☑ తెలుగు : దేవా

🍂 దేవా(O God) అనేది ఆశ్చర్యం, ఉత్సాహం, బాధ లేదా సహాయం కోసం విజ్ఞప్తికు వివిధ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, గొప్ప చేయుటకు ఉపయోగించే ఒక సాధారణ ఆశ్చర్యార్థక పదబంధమే కానీ తనకు దేవుడని లేదా నా దేవుడు అని అర్థం కాదు. 

🍂 దేవా అని కుమారుని పిలుచుటకు గల కారణం "యేసు తన దేవుని మహిమయొక్క ప్రతిబింబమును మరియు స్వభావ సిద్ధముగా తన దేవుని గుణ లక్షణములు గలవాడనే కదా". (హెబ్రీ. 1:3).

🍂దేవా(O God) అనగా దేవుడు లేదా దేవత్వము గలవాడ అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవత్వము" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము. 
🍂 "దేవా" అనే పదం ఎక్కువగా పా.ని లో కీర్తనలు గ్రంథము నందు 144 సారులు వాడారు. ఉదా: (కీర్తనలు. 4:1; 5:10; 16:1; 61:5...చూడుము).



📝 చివరిగా మిత్రులకు "నా దేవా"(My God) అనే విషయమై వివరణ ఇవ్వాలని ఉద్దేశించి.. యేసు స్వయంగా సిలువలోని, సమాధిలో నుండి లేచిన తరువాత పలికిన మాటలను చూస్తే...

🍃..."నా దేవా(my God), నా దేవా(my God) నన్నెందుకు చెయ్యి విడిచితివని..." మత్తయి. 27:46

🍃..."...నా దేవుడును(my God) మీ దేవుడునైన(your God) వాని యొద్దకు..." యోహాను 20:17

🍃 నా దేవా(My God) అనేది దైవంతో వ్యక్తిగత, భక్తిపూర్వక మరియు తన దేవుడు అని ఆధారపడే సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. యేసు తన దైవం మీద ఆధారపడి బ్రతికి మనకు మాదిరి ఉంచిపోయేను కదా! 

🍃 నా దేవా(my God) అనగా నా దేవుడు లేదా నా దైవం అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవుడు ఎవరు?" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము.


🔎 "దేవా" మరియు "నా దేవా" అనే రెండు పదాలు వేరు వేరు అర్థాలు ఇచ్చు పదాలు అనుటకు ఆధారాలు :

కీర్తనలు 43:4: "... దేవా(O God) నా దేవా(My God), సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను"
కీర్తనలు 68:24: "దేవా(O God), నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని(my God) గమనమును వారు చూచియున్నారు.
కీర్తనలు 63:1: దేవా(O God), నా దేవుడవు(my God) నీవే, వేకువనే నిన్ను వెదకు దును"

🌱 యెహోవా & యేసు ఇద్దరు ఏకమైయున్నారు అంటే ఒక్కటే అని అంటావు ఏమో! ఇందుకోసం "ఏకమైయున్నాము!? Click Here " కొరకు ఇక్కడ క్లిక్ చేయుము.


💢 సారాంశము :
పరలోకమందున్న దేవుడు తన రాజ్యము పైన అనగా క్రీస్తు సంఘము(church of Christ) మీద యేసును ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించి, పట్టాభిషేకం చేయుటకు ముందు యేసును "దేవా" అనగా దేవత్వం గలవాడా అనే సంభోదించారు తప్పా... "నా దేవా/నా దేవుడు" అని అనలేదని మిత్రులు ఈ సత్యాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాము.

"మన తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.౹"

WhatsApp Join Us   Telegram Join Us

మీ ఆత్మీయులు👪

ఏకమైయున్నాము!? (యోహాను. 10:30)

 

ఏకమైయున్నాము!? (యోహాను. 10:30)


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏


నేటి క్రైస్తవ్యమనే సమాజములో అనేకమందికి యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనము అనేది అర్థంకాక, వారి బోధల చేత అపార్థం చేయబడి, వక్రీకరించబడి, అసత్యము సత్యముగా బోధించబడుతున్న తరుణములో  సత్యము ఏంటో పరిచయం చేయుటకు, అట్టివారి బోధలను సత్యవాక్య ఆధారముతో ఖండించుటకు, సరిచేయుటకు ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశమైయున్నది. శ్రోతులు కంగారు పడకుండా చివరివరకు అంశాన్ని చదివి, ఆలోచించి, వాక్య పరీక్ష చేసి, సత్యాన్ని స్వీకరించవలసిందిగా  మనవి.


 📖 వాక్యం : 

"నేనును తండ్రియును ఏకమై యున్నామని(యేసు) వారితో చెప్పెను.౹" (యోహాను. 10:30).


💢 వక్రీకరించబడే విధానం : 

క్రైస్తవులకు దేవుడు యేసు అని చూపుటకు ఎన్నుకొనే సరిక్రొత్త బోధన విధానమే ఈ త్రీయేక మరియు త్రిత్వము బోధలు. ఇట్టి బోధలు నుండి పుట్టుకు వచ్చిన బోధయే "తండ్రి మరియు యేసు ఒక్క వ్యక్తే అని, యెహోవాయే శరీరధారిగా యేసుగా వచ్చారని, ఇద్దరు కాదని, ఈయనే ఆయన.. ఆయనే ఈయన"... (యేసు మాటల్లో ఒక్క ఆధారం కనపడదు).


🔎వాక్య వివరణ :📖  

"నేనును తండ్రియును ఏకమై యున్నామని(యేసు) వారితో చెప్పెను.౹" (యోహాను 10:30): 


John 10:30: "I and my Father are one." [KJV]

John 10:30 I and the Father are one heart and mind [ MSG]


John 10:30: "ἐγὼ καὶ ὁ Πατὴρ ἕν ἐσμεν.”"


గ్రీక్ : εἷς - heis - hice ≈ G1520

 ఇంగ్లీష్ : One, One heart and mind

 తెలుగు :  ఏకమై యున్నామని


 🔍కీలకమైన విషయాలు 📖 


🍂 మన దేవుడైన యెహోవా ≈ అనాది (సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యెషయా. 40:28; కీర్తనలు. 90:1-2).

🍃 మన ప్రభువైన యేసుక్రీస్తు ≈ అనాది(సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యోహాను. 17:5; 1 పేతురు. 1:18-20).

🍂 ఇరువురు సృష్టి నిర్మాణములో ఉన్నారని. - (ఆది.కాం. 1:1; యెషయా. 45:18; కొలస్సి. 1:15-17; హెబ్రీ. 1:2,10).

🍃 నరుని నిర్మాణములో ఇరువురు ఉన్నారని - (ఆది.కాం. 1:27; మార్కు. 10:6; 1 కోరింది. 8:6b).

🍂 ఇరువురు ఆది(సృష్టి అనంతరం) నుండి ఉన్నారని. - (యోహాను. 1:2-3).


అనాది కాలము నుండి ఇరువురు ఉన్నారు అనేది బైబిల్ ఇచ్చు సమాచారం. ఐనప్పటికి "ఏకమైయన్నారు" అంటే ఇద్దరూ ఒక్కడే/ఒక్క వ్యక్తే అని ఎలా అనుకోగలం? ఇంతకు ఏకమైయున్నారు అంటే ఏంటి? యేసు మాటలు బట్టి ఇరువురు ఏ విషయములో ఏకమైయున్నారు? అనే విషయాలు ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.


📖 ఏకమైయున్నాము అంటే ఒక్కటైయున్నాము అని అర్థమే కానీ ఒక్కడైయున్నాము అని కాదు. "యున్నాము" అనే మాటలో బహువచనం కనపడలేదా? ఇంతకు "ఏకమై/ఒక్కటైయున్నాము" అంటే దేవత్వపు ఏకత్వమే కానీ వ్యక్తిత్వపు ఏకత్వము కానేకాదు. యేసు ప్రభువు యోహాను 10:30లో దేవత్వపు ఏకత్వమనే భావనతో చెప్పెను గాని వ్యక్తిత్వపు ఏకత్వము భావనతో కాదు. తొందరపడకు అది ఎలాగునో చూద్దాం. 


 👤 వ్యక్తిత్వపు ఏకత్వము :

వ్యక్తిత్వపు ఏకత్వము అంటే తండ్రీ, నేను(యేసు) ఒక్కరే/ఒక్కడే అని అర్థం. (లేదా) నేనే తండ్రిని, ఆ తండ్రే నేను అని అర్థమిచ్చును కదా. 


యేసుక్రీస్తు మనకు తండ్రి కాదు. మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.(1కోరింది. 8:6). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు(తండ్రి) మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.(రోమా 10:9). 


మనకు తండ్రి ఎవరు? యేసు మాటల్లో ఎవరు యేసునకు తండ్రో ఆయనే మనకు తండ్రి. "... నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు..." (యోహాను. 20:17) యేసు ఈ లోకములో "నా తండ్రి" అని పలికే సందర్భాలు అనేక కలవు. "మేము ఇద్దరమూ" అనే విషయాన్ని స్పష్టముగా చూడగలం. (యోహాను. 8:14-17cf వాక్యం చదువుము) కావున ఒక్కడై ఏకమైయుండలేదు. వారు ఇరువురు దేవత్వం  విషయములో ఒక్కటై ఇద్దరు వ్యక్తులైయున్నారు. 


💢ఉదాహరణకు : ఒక క్రైస్తవుడు, నాలో క్రీస్తు ప్రభువు ఉన్నారు అని ఎలాగైతే వ్యక్తపరుస్తాడో అలాగే క్రీస్తు ప్రభువు కూడా తనలో తండ్రి ఉన్నారని (ఎఫెసి. 3:15; గలతీ. 2:20) తన మాటల్లో చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. (యోహాను. 8:16). "యేసు-ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము." (యోహాను. 14:23). కాబట్టి వ్యక్తులుగా వారు ఒక్క వ్యక్తిగా లేరు. వారు ఇద్దరే కానీ తత్వము విషయంలో ఒక్కటైయున్నారు. యోహాను. 10:30వ వ్యక్తిత్వపు ఏకత్వము గూర్చి చెప్పుట లేదని గుర్తించుకో..


 👥 దేవత్వపు ఏకత్వము :

దేవత్వపు ఏకత్వము అంటే వారి తత్వము యొక్క ఏకత్వమని, వారి చిత్తము యొక్క ఏకత్వమని, వారి సంకల్పము యొక్క ఏకత్వమని, వారి విమోచన యొక్క ఏకత్వమని అర్థం. ఇదే విషయాన్ని యేసు(నేను) తండ్రియును ఏకమై యున్నామని చెప్పెను కదా.౹"


యోహాను. 10:30వ ఏకమైయున్నాము అనే భావన యేసు మరియు  దేవుడు ఒకే ఒక దేవత్వము విషయములో ఏకమౌతారని(ఒక్కటై ఉంటారని) వివరిస్తుంది కానీ వ్యక్తిత్వపు ఏకత్వము గూర్చి కానేకాదు. మరింత వివరణ కోసం దేవత్వము మరియు యేసు దేవత్వము అనే రెండు అంశములను పూర్తిగా చదవగలరు.


 💥 ఒక్క వ్యక్తే ≈ ఇద్దరు కాదు అనే భావన?


ఇంకను ఏకమైయన్నారు అంటే ఒక్క వ్యక్తే, ఇద్దరుగా లేరు/కాదు, ఒక్కడైయున్నారని కాదు అనే అపోహ నీవు కలిగి ఉంటే... ఇట్టివి బైబిల్ కు వ్యతిరేకమైన ఆలోచనలు, బోధలు కాబట్టి నీవు సరి చేసుకొనుటకు ఈ క్రింది విషయాలను ఆలోచన చేయుము. 


1. ఆదిలో దేవుడే ఆదాము మరియు హవ్వకి వివాహం చేసి వారిరువురును (స్త్రీ, పురుషులను) ఏకశరీరము చేయు విషయములో దేవుడు పలికిన మాట.

(ఆది.కాం. 2:24): "కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు."

(ఎపేసి. 5:31): "ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.౹"


ఇది దేవుడు జత చేసిన ఏకత్వము. ఏకత్వమునకు ఏ మనుషుడు అర్ధం చెప్పనక్కరలేదు. ఒక స్త్రీ శరీరమును, ఒక పురుషుని శరీరమును వివాహం అను బంధము ద్వారా వారిద్దరును ఏక శరీరముగా చేయునది దేవుడే. ఇక్కడ ఏకము అంటే ఇద్దరిని ఒక్కడైయున్నారు/ఒక్కడే అని అనగలమా? దేవుని చేత ఏక శరీరము కాబడిన మా ఇద్దరిలో నన్ను త్రుణికరించువారు నా భార్యను కూడా త్రుణికరించువారు అగుదురు కదా!! ఆలోచించుకో. 



2. గెత్సేమనే తోటలో యేసు చేసిన ప్రార్థనలో యేసు మరియు తండ్రి మధ్య ఉన్న ఏకత్వం (oneness) మరియు శిష్యులు మరియు తండ్రి మరియు యేసు మధ్య ఉన్న ఏకత్వం గురించి. 

(యోహాను. 17:11,20-22(: "నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగునవారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.౹ … మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.౹ మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.౹"  ఇది సంకల్పము యొక్క ఏకత్వము.


☑ నీవు(తండ్రి) నన్ను(యేసును) పంపితివని లోకము నమ్మునట్లు...

 తండ్రీ... మనము ఏకమై యున్నలాగున(20,22వ)

 ...వారును(అపోస్తలలు) మనమందు ఏకమైయుండవలెనని...(22వ)

 వారి(అపోస్తలలు) వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును(క్రైస్తవ సమాజం) ఏకమైయుండ వలెనని...(21వ)


ఏకమైయుండవలెనని అంటే ఒక్కడే/ ఒక్కరే అనే భావన ఇంకా ఉంటే వీటిని ఎలా వక్రీకరించుటకు పూనుకొంటావో నీ ఇష్టం.


📢 సారాంశం :

ఓ చదువరి... యోహాను 10:30 వచనం అనేది తండ్రి మరియు యేసు ఇరువురు ఉన్నారని, వారు దేవత్వములోని, చిత్తములోని, విమోచన విషయములోని ఒక్కటై యున్నారని..., ఒక్కడై లేరని  విషయాన్ని గుర్తించుము. బైబిల్ త్రిత్వము, త్రియేక దేవుడు అనే బోధలను సమర్థించదు.

తండ్రిని మరియు(and) కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹" (యోహాను. 2:22)

మీ ఆత్మీయులు.. 👪

WhatsApp Join Us   Telegram Join Us

The churches of Christ greet you - Roma 16:16