Showing posts with label దేవత్వము. Show all posts
Showing posts with label దేవత్వము. Show all posts

యేసుని ఎవరు పంపెను?(Who sent Jesus?)

యేసుని ఎవరు పంపెను?(Who sent Jesus?)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.🙌

నేడు అనేక అబద్ధ బోధకులు బయలుదేరి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన తమ సొంత జ్ఞానంతో సంఘాలను మోసపుచ్చుతున్నారు. వారి అబద్ధ బోధలలో  ఒకటి  "యెహోవాయే శరీరదారియై మన మధ్యకు యేసులా వచ్చారనేది" ఇది దైవ గ్రంథానికి పూర్తి విరుద్ధమైన బోధ.👆

ఇంతకుమించి ఎక్కువగా మాట్లాడి నాశనాన్ని కొనితెచ్చుకునే ధైర్యం మాకు లేదు కనుక తండ్రి యొక్క సాక్ష్యం, యేసు యొక్క సాక్ష్యం, మరియు పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం వారి ముగ్గురు మాటల్లోనే  "యేసుని ఎవరు పంపెను?" అనే విషయాన్ని ఈ అంశము ద్వారా నేరుగా లేఖనాలను మీ ముందుంచుతున్నాము. 

కావున, సత్యాన్వేషకులు ఈ క్రింది👇అంశమును పూర్తిగా చదివి, వాక్య పరిశోధన చేసి, సత్యాన్ని స్వీకరించగలరని మనవి. 📖🙏🏻


👤 తండ్రి సాక్ష్యం :


● ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. (మత్తయి. 3:17).

● ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.  (మత్తయి. 12:18).

● అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను." (మత్తయి. 17:5)

● ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను." (మార్కు. 9:7)

● ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. (లూకా. 9:35).


👤 యేసుక్రీస్తు సాక్ష్యం :


● మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. (మత్తయి. 10:40).

● ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చు కొనునని వారితో చెప్పెను. (మార్కు. 9:37; లూకా. 9:48)

● ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. (లూకా. 4:19).

● మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను." (లూకా. 10:16).

● లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. (యోహాను. 3:17).

● "ఆయన సాక్ష్యము అంగీక రించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.౹" (యోహాను. 3:33).

● యేసు వారిని చూచి-నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది (యోహాను. 4:34).

●  కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. (యోహాను. 5:23).

● నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు;( యోహాను. 5:24).

● యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ( యోహాను. 5:36).

నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు (యోహాను. 5:37)

● యేసు-ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. ( యోహాను. 6:29). 

● నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. (యోహాను. 6:38).

● నన్ను పంపినవాని చిత్తమైయున్నది. (యోహాను. 6:39).

నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు. (యోహాను. 6:44).

● జీవముగల తండ్రి నన్ను పంపెను. (యోహాను. 6:57).

● అందుకు యేసు-నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹" (యోహాను. 7:16).

● నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. ( యోహాను. 7:28)

● నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను. (యోహాను. 7:29)

● యేసు-ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును (యోహాను. 7:33)

● నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. (యోహాను. 8:16).

● నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను. (యోహాను. 8:18).

● మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. (యోహాను. 8:26)

● నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. (యోహాను. 8:29)

● నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. (యోహాను. 8:42)

● పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనముచేయుచుండవలెను; (యోహాను. 9:4).

● తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?౹" (యోహాను. 10:36).

● నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. (యోహాను. 11:42).

● నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. (యోహాను. 12:44)

● నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. (యోహాను. 12:45)

● ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. (యోహాను. 12:49)

● నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను." (యోహాను. 13:20)

● నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. (యోహాను. 14:24)

● వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. (యోహాను. 15:21)

● ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను. (యోహాను. 16:5).

● "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. (యోహాను. 17:3).

● నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక (యోహాను. 17:7).

● నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. (యోహాను. 17:18).

నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. (యోహాను. 17:20).

● వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలనవారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. (యోహాను. 17:23)

● నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. (యోహాను. 17:25).

● అప్పుడు యేసు-మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. (యోహాను. 20:21)


👤 పరిశుద్ధాత్ముని సాక్ష్యం :


దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. (రోమా. 8:3).

● కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. (గలతీ. 4:4).

● దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. (1 యోహాను. 4:9).

● మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. (1 యోహాను. 4:10).

తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము. (1 యోహాను. 4:14).

మీ ఆత్మీయులు...👪

దేవత్వము (Godhead)

దేవత్వము
ప్రియ సహోదరులందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

తత్వము అనగా ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క స్వభావము, స్వరూపము లేక లక్షణము.

భూమి మీద మనము చూస్తున్న ప్రతి వస్తువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వము కలదు. రాయి తత్వము వేరు నీరు తత్వము వేరు అగ్ని తత్వము వేరు మనిషి తత్వము వేరు అలాగే దేవుని తత్వము వేరు.

» దేవత్వము = దేవుడు + తత్వము «

దేవుని యొక్క గుణ లక్షణముల సముదాయాన్ని దేవత్వము అంటారు.
దేవత్వము అనే మాట అపో.కార్య. 17:29; రోమా. 1:20; కొలస్సి. 2:9 లో చూడగలము.


సృష్టికి ముందు దేవత్వము

సృష్టికి ముందు నిత్యత్వము అనగా నిత్యత్వములో ముగ్గురు వ్యక్తులు కలరు వీరు దేవత్వపు లక్షణములు కలిగియున్నారు.

మొదటి వ్యక్తి :    (దేవుడు/యెహోవా/తండ్రి)

» ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. (కీర్తన. 90:1,2).

రెండవ వ్యక్తి :   (దేవుని కుమారుడు/యేసుక్రీస్తు/ప్రభువు)

» తండ్రీ, లోకముపుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము. (యోహాను. 17:5).

మూడో వ్యక్తి :   (ఆదరణకర్త/పరిశుద్ధాత్ముడు/ఆత్మ)

» నిత్యుడగు ఆత్మ (హెబ్రీ. 9:14),
> నిత్యుడు అనగా నిరంతరము ఉన్నవాడు.


సృష్టి ప్రారంభములో దేవత్వము

సృష్టి కార్యక్రమములో ముగ్గురు వ్యక్తుల యొక్క పని.

మొదటి వ్యక్తి :   (దేవుడు/యెహోవా/తండ్రి)


» సృష్టిని ప్రారంభించు విషయములో నిత్యత్వములో మన తండ్రియైన దేవునికి ఒక ఆలోచన కలదు.

● “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” (ఆది. 1:1).
● "ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తము కలిగెను; మనము ఆయన ద్వారా కలిగినవారము” (1 కోరింధి. 8:6a).

రెండవ వ్యక్తి :   (దేవుని కుమారుడు/యేసుక్రీస్తు/ప్రభువు)

» నిత్యత్వములో దేవునికి కలిగిన ఆలోచనలకు ఆకారమిచ్చిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు.

● “ఆయన (క్రీస్తు) అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు” (కొలస్సి. 1:15-17).
● “మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము” (1 కోరింధి. 8:6b).

మూడో వ్యక్తి :   (ఆదరణకర్త/పరిశుద్ధాత్ముడు/ఆత్మ)

» నిత్యత్వములో దేవుని యొక్క ఆలోచనలకు ఆకారమిచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క పనికి కొలమానమిచ్చినది మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు.

● “దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను” (ఆది. 1:2).
● “తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?” (యెషయా. 40:12).


దేవత్వములో ముగ్గురు వ్యక్తుల యొక్క పని

తండ్రియైన దేవుని యొక్క పని :

1) కాలములు, సమయములు తన స్వాధీనములో ఉంచుకొని ఎప్పుడు ఏం చేయవలెనో నిర్ణయం తీసుకునేవాడు మన దేవుడు. (ఎఫెసీ. 1:8; అపో.కార్య. 1:7).
2) సమస్త జనముల యొక్క విమోచన కొరకు జగత్తు పునాది వేయబడకమునుపే తన ఆలోచనలో నిత్యత్వములో యేసుని నిర్ణయించుట. (1 పేతురు. 1:18-19).
3) యేసు మరణ విషయములో ముందుగానే నిత్యత్వములో నిర్ణయం తీసుకోగలుగుట. (అపో.కార్య. 2:22-24).
4) తండ్రి అధికారమిచ్చువాడు మరియు తీసుకొనువాడు. (మత్తయి. 28:18; 1 కోరింధి. 15:28).
5) ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు. (దానియేలు. 2:21).
6) తండ్రి మనకు అద్వితీయ సత్యదేవుడు. (యోహాను. 17:3).

ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పని :


1) పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. (మీకా. 5:2).
2) ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ (క్రీస్తు). (1 కోరింధి. 10:1-4).
3) జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. (హెబ్రీ. 2:14-15).
4) నశించిన వారిని తండ్రి యెద్దకు చేర్చుటకు మార్గమును, సత్యమును, జీవమునై యున్నాడు. (యోహాను. 14:6).
5) పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన (క్రీస్తు) క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై ఉండి, తన రాజ్యముపై ప్రభువుగాను, క్రీస్తుగాను ఉండుటకు దేవుని చేత నియమిoపబడెను. (హెబ్రీ. 9:15; అపో.కార్య. 2:36).
6) యేసు మనకు దేవుడుగా నియమిoపబడలేదు.

ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు యొక్క పని :


1) యేసు ప్రభువని, దేవుని కుమారుడని తమ నోటితో ఒప్పుకొని బాప్తీస్మము పొందిన వారిలో వరముగా నివసిస్తున్నాడు. (అపో.కార్య. 2:38; 1 కోరింధి. 3:16; ఎఫేసి. 2:22).
2) మనలను సర్వసత్యములోనికి నడిపించును. (యోహాను. 16:13).
3) సమస్తమును మనకు బోధించి యేసు చెప్పిన సంగాతులన్నిటిని మనకు జ్ఞాపకము చేయువాడు. (యోహాను. 14:26).
4) పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. (యోహాను. 16:8).  
5) మన హృదయములో సంచకరువుగా ఉన్నాడు. (2 కోరింధి. 1:22; ఎఫెసీ. 1:14).
6) పరిశుద్ధాత్ముడు దేవుడని గ్రంథము సెలవియ్యలేదు.


దేవత్వములో ముగ్గురు వ్యక్తుల మధ్యగల సంబంధము


తండ్రికి యేసుకి మధ్యగల సంబంధము :

1) పురుషునికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు తండ్రి. (1 కోరింధి. 11:3).
2) తండ్రికి యేసు అద్వితీయ కుమారుడు. (యోహాను. 3:16).
3) తండ్రి యిష్టమును నెరవేర్చుటకు పరలోకములో తండ్రియెద్ద నుండి పంపబడినవారు. (యోహాను. 6:38; 16:27-28).
4) యేసు మన తండ్రియొక్క లక్షణములు కలిగినవాడు. (యోహాను. 10:30; 17:11,22).
5) తండ్రిచేత సమస్తముపైన అధికారము పొందినవాడు. (మత్తయి. 28:18; యోహాను. 13:3; 1 కోరింధి. 15:24-28).


యేసుకు  తండ్రికి మధ్యగల సంబంధము :


1) మన తండ్రియైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా దేవుడే. (యోహాను. 20:17).
2) తండ్రి యిచ్చిన పనిని యేసుక్రీస్తు సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమిమీద తండ్రిని మహిమపరచెను. (యోహాను. 17:4).
3) తండ్రిచేత పట్టాభిషేకము పొంది ఆయన కుడిపార్శవమున కూర్చునియున్నాడు. (హెబ్రీ. 1:4-9; అపో.కార్య. 2:33-35).
4) తండ్రి యొక్క లక్షణములు కలిగియున్నాడు. (కొలస్సి. 2:9).
5) మనకును తండ్రికి మధ్యవర్తియై ఉన్నాడు. (1 తిమోతి. 2:5).


పరిశుద్ధాత్మకు, తండ్రికి, కుమారునికి మధ్యగల సంబంధము :


1) నిత్యత్వములోను, సృష్టి ప్రారంభములోను తండ్రి మరియు కుమారునితో కలిసి యున్నారు. (ఆది. 1:1-3; యోబు. 26:13; హెబ్రీ. 9:14).
2) కుమారుని ద్వారా తండ్రి చేత ఆదరణ కర్తగా లోకమునకు పంపబడెను. (యోహాను. 14:26; 15:26).
3) తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మనకు తెలియజేయును. (యోహాను. 16:13).


దేవత్వములో ముగ్గురు వేరు వేరు వ్యక్తులు


● తండ్రి కుమారుడు కాదు: (1 పేతురు. 1:3; ఎఫెసీ. 1:3; 2 యోహాను 3).

● తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు : (యోహాను. 14:26; 15:26).

కుమారుడు తండ్రి కాదు: (యోహాను. 1:14,18; 3:16-18).

◆ కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు : (యోహాను. 14:26; 16:7-13).

పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు: (యోహాను. 14:16-17; 16:13).

● పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు : (యోహాను. 14:26; 16:7-13; 15:26).


దేవత్వములో ముగ్గురు దేవుళ్ళా?

కాదు
» దేవుడొక్కడే. ఆయన మన తండ్రి.
(1 కోరింధి. 8:6; 1 తిమోతి. 2:5; ఎఫెసీ. 4:4-6).
» ప్రభువు ఒక్కడే. ఆయన మన యేసుక్రీస్తు.
 (1 కోరింధి. 8:6; 12:5; ఎఫెసీ. 4:4-6).
» ఆత్మయు ఒక్కడే. ఆయన మన పరిశుద్ధాత్ముడు. (ఎఫెసీ. 4:4-6).


పరిశుద్ధ గ్రంధములో  ముగ్గురు వ్యక్తులు ఒకేచోట కనిపించుట


1) దేవుడు "మన" స్వరూపమందు "మన" పోలికె చొప్పున నరులను చేయుదము. (ఆది. 1:26).

2) ఆదాము "మనలో" ఒకనివంటివాడాయెను. (ఆది. 3:22).
3) ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు "యెహోవాయు" ఆయన "ఆత్మయు" "నన్ను" (యేసు) పంపెను. (యెషయా. 48:16).
4) "యేసు" బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, "దేవుని ఆత్మ" పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. (మత్తయి. 3:16).
5) కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చుచు. (మత్తయి. 28:19).
6) నేను "తండ్రిని" వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక "ఆదరణకర్తను", అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. (యోహాను. 28:19).
7) ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. (2 కోరింధి. 13:14).

గమనిక: పైన తెలియపరచిన వాటిని బట్టి యోహావాయే మూడు రకాలుగా రాలేదని మనం గ్రహించాలి. యెహోవాయే యేసు అని, యేసు పరిశుద్ధాత్ముడని చెప్పే బోధని కట్టు కధ అని తెలుసుకోవాలి.


పాత నిబంధనలో ప్రజలు యెహోవాని దేవుడు, ప్రభువు, తండ్రి అని సంభోధించారు (యెషయా. 48:16; యెహే. 24:6). క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ఆయనని ఎరిగినవారికి తండ్రియైన దేవుడై ఉన్నారు (ఎఫెసీ. 4:6). ఈయన యేసుక్రీస్తు వారికీ కూడా దేవుడై యున్నారనే (ఎఫెసీ. 1:3,19) విషయం పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు కనుక మనము నమ్మితీరాలి.



మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు ©

దేవుడు (God)

అంశము: దేవుడు

మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక

ప్రపంచములో ఎక్కువమంది దేవుడున్నాడని నమ్ముచున్నారు. అయితే "దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు"(1 కొరింథీ. 15:34) అని బైబిలు బోధిస్తుంది. ప్రజలను గమనిస్తుంటే యిది నిజమని రూఢి అవుతుంది. సృష్టికర్తకు బదులు సృష్టమును పూజిస్తూ, వీధికొక దేవుడు, గ్రామమునకొక దేవుడు. రాష్టానికొక దేవుడు, కోట్ల సంఖ్యలో ప్రజలు దేవుళ్ళను, దేవతలను పూజిస్తూ, కొలుస్తూ సృష్టికర్తను మరచిపోయారు. బైబిలు పట్టుకొన్న వారిలో కూడ దేవుని గూర్చిన సరైన జ్ఞానం లేదనడం వాస్తవ విరుద్ధం కాదు.

దేవుడుఅనే మాటకు అర్ధము – “స్వయంభవుడుఅనగా తనకు తానుగా ఉన్నవాడు. 

అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. – (నిర్గామకాండము 3:14)


"దేవుడు ఉన్నాడా"..?

పరలోకమందున్న మన దేవుడు “అక్షయుడు + అదృశ్యుడు + అద్వితీయడు” (1 తిమోతి 1:17).
» అక్షయుడు అనగా క్షయము కానివాడు.
» అదృశ్యుడు అనగా కనబడనివాఁడు.
» అద్వితీయుడు అనగా తనకు సాటియైన/సమానమైన వాడు ఎవరు లేరు.

అదృశ్యుడుఅనగా కంటికి అగోచరుడు. (నిర్గమ. 33:20). అయన స్వరూపము బట్టి అయన అదృశ్యుడైన వాడు. “జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన” (రోమా. 1:20) దేవుడు ఉన్నాడని అవి సెలవు ఇస్తున్నాయి. ఇలాంటి  అదృశ్యుడైన దేవుడును తెలుసుకోవలసిన అవసరత ఎంతో ఉంది. 

  “ఆదియందు దేవుడు...” - (ఆది. 1:1). దేవుడు ఉన్నాడనే మాటతోనే పరిశుద్ధ గ్రంథము ప్రారంభమైనది.
  దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు. - (కీర్తన. 14:1; 53:1).
   దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. (కీర్తన. 10:4).
  ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. - (రోమా. 1:20)
  మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించునుసముద్రములోని చేపలును నీకు దాని వివరించును. వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు? - (యోబు. 12:7-9).
  ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగల కత్తి పిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు. (యిర్మియా. 8:7).
  కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. - (యిర్మియా. 8:21-22).
 ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును. - (యిర్మియా. 10:13). 
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. (కీర్తనలు. 19:1; 8:1).


"దేవుడెవరు"..?

దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను. - (1 కొరింథీ. 15:34).
 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు. - (యిర్మియా. 10:10).
 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. - (కీర్తనలు. 100:3).
 యెహోవాయే మన దేవుడు. - (యెహోషువ. 24:17; కీర్తనలు 118:27; యెషయా. 45:18).
 పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము.- (ద్వితియో. 4:39; 1 కోరింథీ. 8:4).
 దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. - (యెహోషువ. 22:22).
 ఆయనే స్వయంభవుడు; ఆయనే యెహోవా. - (యెషయా. 43:10-11; ద్వితియో. 4:35).


"దేవుడు అద్రుశ్యుడా"..?
అదృశ్యుడు అనగా కంటికి అగోచరుడు
ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను. - (నిర్గమ. 33:20).
మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. - (1 తిమోతి. 6:16).
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు - (యోహాను. 1:18).
* ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు. - (1 యోహాను. 4:12).


"దేవుడు ఒక్కడా లేక ముగ్గురా"..?
  దేవుడొక్కడే - (1 తిమోతి. 2:5).
మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. - (ద్వితియో. 6:4).
  మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. - (1 కోరింథీ. 8:6).
  లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. - (1 కోరింథీ. 8:4)
  ఒక్కడే మీ తండ్రి. - (మత్తయి. 23:9).
   అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. - (1 కోరింథీ. 12:6).
   అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. - (ఎఫెసీ. 4:6).
  అద్వితీయ సత్యదేవుడు ఒక్కడే. - (యోహాను. 17:3).


"ఆ ఒక్క సత్య దేవుడును గుర్తించడము ఎట్లా"..?

ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు + ఆయన దేవత్వము - (రోమా. 1:20).
ఈ ప్రత్యేక లక్షణములు బట్టి నిజమైన దేవుడు ఎవరో గ్రహించుకోగలము. 
నిత్యశక్తియు”( eternal power) అనగా “శాశ్వతమైన శక్తి”.
దేవత్వము” (Godhead) అనగా “దేవుని యొక్క గుణ లక్షణములు”.

:: నిత్యశక్తియు ::

> దేవుడు సృష్టికర్త. - (ఆది. 1:1; రోమా. 1:25; 4:17).
> దేవుడు అద్వితీయుడు. - (యోహాను. 17:3).
> దేవుడు ఆత్మస్వరూపి అనగా ప్రకృతి సంబందికాడు. -  (యోహాను. 4:24).
> దేవుడు సర్వశక్తిమంతుడు అనగా సమస్తము చేయగల సమర్ధుడు. - (ఆది. 17:1).
> దేవుడు సర్వజ్ఞానం గలవాడు అనగా సమస్తము తెలిసినవాడు. - (కీర్తన. 139:1-6).
> దేవుడు సర్వాంతర్యామి అనగా అంతట ఉన్నవాడు. - (కీర్తన. 139:7-12; యిర్మియా. 23:23).
> దేవుడు నిత్యుడు అనగా ఎల్లప్పుడు ఉన్నవాడు. - (నిర్గమ. 3:14; యెషయా. 57:15).
> దేవుడు ఉగ్రుడు. - (రోమా. 1:18; 2:8-9).
> దేవుడు రోషము గలవాడు - (నిర్గమ. 34:14).
> దేవుడు అదృశ్యుడు అనగా కంటికి అగోచరుడు. - (నిర్గమ. 33:20).

:: దేవత్వము ::

> దేవుడు పరిశుద్ధుడు అనగా పాపము లేనివాడు. -  (యెషయా. 6:3; 1 పేతురు. 1:14).
> దేవుడు ప్రేమమాయుడు. - (యోహాను. 3:16; 1యోహాను. 4:8).
> దేవుడు సమాధానకర్త. - (1 కొరింథీ. 4:33; 2 కొరింథీ. 13:11; యెషయా. 45:7).
> దేవుడు దీర్ఘశాంతుడు. - (కీర్తన. 145:8; 2 పేతురు 3:9).
> దేవుడు దయగలవాడు - (నిర్గమ. 34:6; విలాప. 3:25).
> దేవుడు మంచివాడు. - (నిర్గమ 33:19; లూకా. 18:19).
> దేవుడు సత్యవంతుడు - (రోమా. 3:4; 15:8-9; యోహాను. 3:33).
> దేవుడు నాయ్యవంతుడు - (కీర్తన - 89:14; 129:4; లూకా. 7:29).
> దేవుడు శాంతమూర్తి మరియు పరిపూర్ణడు. -  (యోవేలు. 2:13; మత్తయి. 5:48).
> దేవుడు అబద్ధమాడనేరడు -  (సంఖ్యా. 23:19; తీతుకు 1:3).

గమనిక: ఇంకా అనేకమైనవి కలవు. వాక్య జ్ఞానముతో ఆలోచన చేయకపోవడము వలనే మనుష్యుడు చేతులతో చేయబడిన వాటిని పూజిస్తున్నాడు. (అపొ..కార్య. 17: 25:26).

 హెచ్చరిక : అద్వితీయ సత్య దేవుడెవరో సరైన అవగాహన లేకుండా మీ నోటికి వచ్చింది మాట్లాడినా లేక మీ ఆలోచనలు గ్రంథము మీద రుద్ది దేవుని క్రమాన్ని పాడుచేసినా నిత్యజీవం కోల్పోతారు జాగ్రత్త!!!

ఇట్లు,
మీ ఆత్మీయ సహోదరుడు. మనోహర్ నవీన


The churches of Christ greet you - Roma 16:16