![]() |
యెహోవాకు దేవుడు క్రీస్తా? |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు🙏
నేటి క్రైస్తవ సమాజములో మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకొంటూ... "యెహోవా దేవునికే దేవుడు ఉన్నారని ఆయనే యేసు" అనుచు హెబ్రీయులకు. 1:7-8 వచనములు చూపించి తమకి అనుగుణముగా పరిశుద్ధ గ్రంథమును వక్రీకరించి, వాక్యమును అపార్థం చేసుకొనేవారు లేకపోలేదు. ఇలాంటి వారిని నేను ఎదుర్కొని తెలియపరిచినప్పటికి వారు విననందున దేవునికి విడిచిపెట్టి వదిలివేశాను. మరల కనపడే సరికి... కాస్త ఆలోచించి ఇలాంటి మిత్రుల బారిన ఎవరు పడకూడదని భావించి "యెహోవాకు దేవుడు క్రీస్తా?" అనే అంశమును వ్రాయుటకు సిద్ధపడి మీ యెదుట పెడుతున్నా కావున సత్య సంబంధులు చివరి వరకు చదివి, ఆలోచించి, సత్యాన్ని గుర్తించగలరని మనవి.
![]() |
మిత్రుడు నాతో మాటలాడిన సంభాషణ |
📖 వాక్యము :
హెబ్రీయులకు. 1:7-9: "—తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే – దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను."
Heb 1:7-9: "And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire. But unto the Son he saith, Thy throne, O God, is forever and ever: a scepter of righteousness is the scepter of thy kingdom. Thou hast loved righteousness, and hated iniquity; therefore God, even thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."
కీర్తనలు. 45:6-7: "దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు [నీ] దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు."
Ps 45:6-7: "Thy throne, O God, is forever and ever: the scepter of thy kingdom is a right scepter. Thou lovest righteousness, and hatest wickedness: therefore God, thy God, hath anointed thee with the oil of gladness above thy fellows."
💥 వాక్య వక్రీకరణ :
దేవా(O God) అనే మాటను పట్టుకొని యెహోవాకు దేవుడు ఉన్నారని. యెహోవా దేవుడే స్వయముగా నా దేవుడు యేసు అని అన్నారనే బోధ.
యేసు నా దేవుడు(MY GOD) నా తండ్రి అని ఎలా అన్నారో. (యోహాను. 20:17) అలాగే యెహోవా దేవుడు కూడా నా దేవుడు యేసు అన్నారనే బోధ (హెబ్రీ. 1:8).
🔎 వివరణ :
పరిశుద్ధ గ్రంథముతో కాస్త పరిచయం ఉన్నవారు ఎవరైనా ఇది అబద్ధమే అని ఇట్టే నిర్ణయించగలరు. కానీ మన మిత్రులు ఎందుకు ఆలోచన చేయలేక, వాక్య వక్రీకరణకు పోతున్నారో వారే పరీక్షించుకొని, నిర్ధారణ చేసుకోవాలి. ఏది ఏమైనా సత్యం తెలియజేయడం మన బాధ్యత. ఇక విషయానికి వస్తే...
1. మనము పాపమునుండి విమోచింపబడి, నీతివిషయమై జీవించునట్లు, యేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:18; 1 పేతురు. 2:24; యెషయా 53:4-5; 12). మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచి(1 కొరింది. 15:3-4), అనాది దేవుని సంకల్పం నెరవేర్చి(1పేతురు. 1:18:19-20; అపో.కార్య. 2:23). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). తన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).
2. తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన కుమారున్ని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి, ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3-4; 9).
🔖Note : పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తరువాత యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనెను. (హెబ్రీ మొదటి అధ్యాయం అనాదిలో జరిగిన సంఘటన కాదు).
3. అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి, ఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు యెహోవా దేవుడే తన కుమారుడును మనకు "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32; యోహాను. 3:36; అపో.కార్య. 2:32-36; 10:36). ఈ సంగతి ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని పరిశుద్ధాత్ముడే చెప్పెను కదా!! (అపో.కార్య. 2:36).
📝 తండ్రి(యెహోవా) ఇలా కుమారుడును(యేసును) అభిషేకించె పనిలో ముందుగా... "దేవా"(O God) అని తన కుమారుని గూర్చి ఇలా సంభోదించెను.(8వ)
☑ గ్రీకు : ho theos(ὁ θεός)
☑ ఇంగ్లీష్ : O God
☑ తెలుగు : దేవా
🍂 దేవా(O God) అనేది ఆశ్చర్యం, ఉత్సాహం, బాధ లేదా సహాయం కోసం విజ్ఞప్తికు వివిధ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, గొప్ప చేయుటకు ఉపయోగించే ఒక సాధారణ ఆశ్చర్యార్థక పదబంధమే కానీ తనకు దేవుడని లేదా నా దేవుడు అని అర్థం కాదు.
🍂 దేవా అని కుమారుని పిలుచుటకు గల కారణం "యేసు తన దేవుని మహిమయొక్క ప్రతిబింబమును మరియు స్వభావ సిద్ధముగా తన దేవుని గుణ లక్షణములు గలవాడనే కదా". (హెబ్రీ. 1:3).
🍂దేవా(O God) అనగా దేవుడు లేదా దేవత్వము గలవాడ అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవత్వము" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము.
🍂 "దేవా" అనే పదం ఎక్కువగా పా.ని లో కీర్తనలు గ్రంథము నందు 144 సారులు వాడారు. ఉదా: (కీర్తనలు. 4:1; 5:10; 16:1; 61:5...చూడుము).
📝 చివరిగా మిత్రులకు "నా దేవా"(My God) అనే విషయమై వివరణ ఇవ్వాలని ఉద్దేశించి.. యేసు స్వయంగా సిలువలోని, సమాధిలో నుండి లేచిన తరువాత పలికిన మాటలను చూస్తే...
🍃..."నా దేవా(my God), నా దేవా(my God) నన్నెందుకు చెయ్యి విడిచితివని..." మత్తయి. 27:46
🍃..."...నా దేవుడును(my God) మీ దేవుడునైన(your God) వాని యొద్దకు..." యోహాను 20:17
🍃 నా దేవా(My God) అనేది దైవంతో వ్యక్తిగత, భక్తిపూర్వక మరియు తన దేవుడు అని ఆధారపడే సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. యేసు తన దైవం మీద ఆధారపడి బ్రతికి మనకు మాదిరి ఉంచిపోయేను కదా!
🍃 నా దేవా(my God) అనగా నా దేవుడు లేదా నా దైవం అని అర్థమే కానీ మరొక్కటి కాదు. "యేసు యొక్క దేవుడు ఎవరు?" కొరకు Click Here ఇక్కడ క్లిక్ చేయుము.
🔎 "దేవా" మరియు "నా దేవా" అనే రెండు పదాలు వేరు వేరు అర్థాలు ఇచ్చు పదాలు అనుటకు ఆధారాలు :
కీర్తనలు 43:4: "... దేవా(O God) నా దేవా(My God), సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను"
కీర్తనలు 68:24: "దేవా(O God), నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని(my God) గమనమును వారు చూచియున్నారు.
కీర్తనలు 63:1: దేవా(O God), నా దేవుడవు(my God) నీవే, వేకువనే నిన్ను వెదకు దును"
🌱 యెహోవా & యేసు ఇద్దరు ఏకమైయున్నారు అంటే ఒక్కటే అని అంటావు ఏమో! ఇందుకోసం "ఏకమైయున్నాము!? Click Here " కొరకు ఇక్కడ క్లిక్ చేయుము.
🌱 యెహోవా & యేసు ఇద్దరు ఏకమైయున్నారు అంటే ఒక్కటే అని అంటావు ఏమో! ఇందుకోసం "ఏకమైయున్నాము!? Click Here " కొరకు ఇక్కడ క్లిక్ చేయుము.
💢 సారాంశము :
పరలోకమందున్న దేవుడు తన రాజ్యము పైన అనగా క్రీస్తు సంఘము(church of Christ) మీద యేసును ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించి, పట్టాభిషేకం చేయుటకు ముందు యేసును "దేవా" అనగా దేవత్వం గలవాడా అనే సంభోదించారు తప్పా... "నా దేవా/నా దేవుడు" అని అనలేదని మిత్రులు ఈ సత్యాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాము.
"మన తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.౹"
WhatsApp Join Us Telegram Join Us
మీ ఆత్మీయులు👪
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com