మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏
నేటి క్రైస్తవ్యమనే సమాజములో అనేకమందికి యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనము అనేది అర్థంకాక, వారి బోధల చేత అపార్థం చేయబడి, వక్రీకరించబడి, అసత్యము సత్యముగా బోధించబడుతున్న తరుణములో సత్యము ఏంటో పరిచయం చేయుటకు, అట్టివారి బోధలను సత్యవాక్య ఆధారముతో ఖండించుటకు, సరిచేయుటకు ఈ అంశము యొక్క ముఖ్య ఉద్దేశమైయున్నది. శ్రోతులు కంగారు పడకుండా చివరివరకు అంశాన్ని చదివి, ఆలోచించి, వాక్య పరీక్ష చేసి, సత్యాన్ని స్వీకరించవలసిందిగా మనవి.
📖 వాక్యం :
"నేనును తండ్రియును ఏకమై యున్నామని(యేసు) వారితో చెప్పెను.౹" (యోహాను. 10:30).
💢 వక్రీకరించబడే విధానం :
క్రైస్తవులకు దేవుడు యేసు అని చూపుటకు ఎన్నుకొనే సరిక్రొత్త బోధన విధానమే ఈ త్రీయేక మరియు త్రిత్వము బోధలు. ఇట్టి బోధలు నుండి పుట్టుకు వచ్చిన బోధయే "తండ్రి మరియు యేసు ఒక్క వ్యక్తే అని, యెహోవాయే శరీరధారిగా యేసుగా వచ్చారని, ఇద్దరు కాదని, ఈయనే ఆయన.. ఆయనే ఈయన"... (యేసు మాటల్లో ఒక్క ఆధారం కనపడదు).
🔎వాక్య వివరణ :📖
"నేనును తండ్రియును ఏకమై యున్నామని(యేసు) వారితో చెప్పెను.౹" (యోహాను 10:30):
John 10:30: "I and my Father are one." [KJV]
John 10:30 I and the Father are one heart and mind [ MSG]
John 10:30: "ἐγὼ καὶ ὁ Πατὴρ ἕν ἐσμεν.”"
☑ గ్రీక్ : εἷς - heis - hice ≈ G1520
☑ ఇంగ్లీష్ : One, One heart and mind
☑ తెలుగు : ఏకమై యున్నామని
🔍కీలకమైన విషయాలు 📖
🍂 మన దేవుడైన యెహోవా ≈ అనాది (సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యెషయా. 40:28; కీర్తనలు. 90:1-2).
🍃 మన ప్రభువైన యేసుక్రీస్తు ≈ అనాది(సృష్టికి ముందే) నుండి ఉన్నారని. - (యోహాను. 17:5; 1 పేతురు. 1:18-20).
🍂 ఇరువురు సృష్టి నిర్మాణములో ఉన్నారని. - (ఆది.కాం. 1:1; యెషయా. 45:18; కొలస్సి. 1:15-17; హెబ్రీ. 1:2,10).
🍃 నరుని నిర్మాణములో ఇరువురు ఉన్నారని - (ఆది.కాం. 1:27; మార్కు. 10:6; 1 కోరింది. 8:6b).
🍂 ఇరువురు ఆది(సృష్టి అనంతరం) నుండి ఉన్నారని. - (యోహాను. 1:2-3).
అనాది కాలము నుండి ఇరువురు ఉన్నారు అనేది బైబిల్ ఇచ్చు సమాచారం. ఐనప్పటికి "ఏకమైయన్నారు" అంటే ఇద్దరూ ఒక్కడే/ఒక్క వ్యక్తే అని ఎలా అనుకోగలం? ఇంతకు ఏకమైయున్నారు అంటే ఏంటి? యేసు మాటలు బట్టి ఇరువురు ఏ విషయములో ఏకమైయున్నారు? అనే విషయాలు ఆలోచన చేయుటకు ప్రయత్నం చేద్దాం.
📖 ఏకమైయున్నాము అంటే ఒక్కటైయున్నాము అని అర్థమే కానీ ఒక్కడైయున్నాము అని కాదు. "యున్నాము" అనే మాటలో బహువచనం కనపడలేదా? ఇంతకు "ఏకమై/ఒక్కటైయున్నాము" అంటే దేవత్వపు ఏకత్వమే కానీ వ్యక్తిత్వపు ఏకత్వము కానేకాదు. యేసు ప్రభువు యోహాను 10:30లో దేవత్వపు ఏకత్వమనే భావనతో చెప్పెను గాని వ్యక్తిత్వపు ఏకత్వము భావనతో కాదు. తొందరపడకు అది ఎలాగునో చూద్దాం.
👤 వ్యక్తిత్వపు ఏకత్వము :
వ్యక్తిత్వపు ఏకత్వము అంటే తండ్రీ, నేను(యేసు) ఒక్కరే/ఒక్కడే అని అర్థం. (లేదా) నేనే తండ్రిని, ఆ తండ్రే నేను అని అర్థమిచ్చును కదా.
యేసుక్రీస్తు మనకు తండ్రి కాదు. మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.(1కోరింది. 8:6). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు(తండ్రి) మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.(రోమా 10:9).
మనకు తండ్రి ఎవరు? యేసు మాటల్లో ఎవరు యేసునకు తండ్రో ఆయనే మనకు తండ్రి. "... నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు..." (యోహాను. 20:17) యేసు ఈ లోకములో "నా తండ్రి" అని పలికే సందర్భాలు అనేక కలవు. "మేము ఇద్దరమూ" అనే విషయాన్ని స్పష్టముగా చూడగలం. (యోహాను. 8:14-17cf వాక్యం చదువుము) కావున ఒక్కడై ఏకమైయుండలేదు. వారు ఇరువురు దేవత్వం విషయములో ఒక్కటై ఇద్దరు వ్యక్తులైయున్నారు.
💢ఉదాహరణకు : ఒక క్రైస్తవుడు, నాలో క్రీస్తు ప్రభువు ఉన్నారు అని ఎలాగైతే వ్యక్తపరుస్తాడో అలాగే క్రీస్తు ప్రభువు కూడా తనలో తండ్రి ఉన్నారని (ఎఫెసి. 3:15; గలతీ. 2:20) తన మాటల్లో చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. (యోహాను. 8:16). "యేసు-ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము." (యోహాను. 14:23). కాబట్టి వ్యక్తులుగా వారు ఒక్క వ్యక్తిగా లేరు. వారు ఇద్దరే కానీ తత్వము విషయంలో ఒక్కటైయున్నారు. యోహాను. 10:30వ వ్యక్తిత్వపు ఏకత్వము గూర్చి చెప్పుట లేదని గుర్తించుకో..
👥 దేవత్వపు ఏకత్వము :
దేవత్వపు ఏకత్వము అంటే వారి తత్వము యొక్క ఏకత్వమని, వారి చిత్తము యొక్క ఏకత్వమని, వారి సంకల్పము యొక్క ఏకత్వమని, వారి విమోచన యొక్క ఏకత్వమని అర్థం. ఇదే విషయాన్ని యేసు(నేను) తండ్రియును ఏకమై యున్నామని చెప్పెను కదా.౹"
యోహాను. 10:30వ ఏకమైయున్నాము అనే భావన యేసు మరియు దేవుడు ఒకే ఒక దేవత్వము విషయములో ఏకమౌతారని(ఒక్కటై ఉంటారని) వివరిస్తుంది కానీ వ్యక్తిత్వపు ఏకత్వము గూర్చి కానేకాదు. మరింత వివరణ కోసం దేవత్వము మరియు యేసు దేవత్వము అనే రెండు అంశములను పూర్తిగా చదవగలరు.
💥 ఒక్క వ్యక్తే ≈ ఇద్దరు కాదు అనే భావన?
ఇంకను ఏకమైయన్నారు అంటే ఒక్క వ్యక్తే, ఇద్దరుగా లేరు/కాదు, ఒక్కడైయున్నారని కాదు అనే అపోహ నీవు కలిగి ఉంటే... ఇట్టివి బైబిల్ కు వ్యతిరేకమైన ఆలోచనలు, బోధలు కాబట్టి నీవు సరి చేసుకొనుటకు ఈ క్రింది విషయాలను ఆలోచన చేయుము.
1. ఆదిలో దేవుడే ఆదాము మరియు హవ్వకి వివాహం చేసి వారిరువురును (స్త్రీ, పురుషులను) ఏకశరీరము చేయు విషయములో దేవుడు పలికిన మాట.
(ఆది.కాం. 2:24): "కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు."
(ఎపేసి. 5:31): "ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.౹"
ఇది దేవుడు జత చేసిన ఏకత్వము. ఏకత్వమునకు ఏ మనుషుడు అర్ధం చెప్పనక్కరలేదు. ఒక స్త్రీ శరీరమును, ఒక పురుషుని శరీరమును వివాహం అను బంధము ద్వారా వారిద్దరును ఏక శరీరముగా చేయునది దేవుడే. ఇక్కడ ఏకము అంటే ఇద్దరిని ఒక్కడైయున్నారు/ఒక్కడే అని అనగలమా? దేవుని చేత ఏక శరీరము కాబడిన మా ఇద్దరిలో నన్ను త్రుణికరించువారు నా భార్యను కూడా త్రుణికరించువారు అగుదురు కదా!! ఆలోచించుకో.
2. గెత్సేమనే తోటలో యేసు చేసిన ప్రార్థనలో యేసు మరియు తండ్రి మధ్య ఉన్న ఏకత్వం (oneness) మరియు శిష్యులు మరియు తండ్రి మరియు యేసు మధ్య ఉన్న ఏకత్వం గురించి.
(యోహాను. 17:11,20-22(: "నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగునవారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.౹ … మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.౹ మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.౹" ఇది సంకల్పము యొక్క ఏకత్వము.
☑ నీవు(తండ్రి) నన్ను(యేసును) పంపితివని లోకము నమ్మునట్లు...
☑ తండ్రీ... మనము ఏకమై యున్నలాగున(20,22వ)
☑ ...వారును(అపోస్తలలు) మనమందు ఏకమైయుండవలెనని...(22వ)
☑ వారి(అపోస్తలలు) వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును(క్రైస్తవ సమాజం) ఏకమైయుండ వలెనని...(21వ)
ఏకమైయుండవలెనని అంటే ఒక్కడే/ ఒక్కరే అనే భావన ఇంకా ఉంటే వీటిని ఎలా వక్రీకరించుటకు పూనుకొంటావో నీ ఇష్టం.
📢 సారాంశం :
ఓ చదువరి... యోహాను 10:30 వచనం అనేది తండ్రి మరియు యేసు ఇరువురు ఉన్నారని, వారు దేవత్వములోని, చిత్తములోని, విమోచన విషయములోని ఒక్కటై యున్నారని..., ఒక్కడై లేరని విషయాన్ని గుర్తించుము. బైబిల్ త్రిత్వము, త్రియేక దేవుడు అనే బోధలను సమర్థించదు.
తండ్రిని మరియు(and) కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹" (యోహాను. 2:22)
మీ ఆత్మీయులు.. 👪
WhatsApp Join Us Telegram Join Us
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com