దేవత్వము |
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
• తత్వము అనగా ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క స్వభావము, స్వరూపము లేక లక్షణము.
• భూమి మీద మనము చూస్తున్న ప్రతి వస్తువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వము కలదు. రాయి తత్వము వేరు నీరు తత్వము వేరు అగ్ని తత్వము వేరు మనిషి తత్వము వేరు అలాగే దేవుని తత్వము వేరు.
» దేవత్వము = దేవుడు + తత్వము «
• దేవుని యొక్క గుణ లక్షణముల సముదాయాన్ని దేవత్వము అంటారు.
• దేవత్వము అనే మాట అపో.కార్య. 17:29; రోమా. 1:20; కొలస్సి. 2:9 లో చూడగలము.
సృష్టికి ముందు దేవత్వము
మొదటి వ్యక్తి : (దేవుడు/యెహోవా/తండ్రి)
» ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. (కీర్తన. 90:1,2).
రెండవ వ్యక్తి : (దేవుని కుమారుడు/యేసుక్రీస్తు/ప్రభువు)
» తండ్రీ, లోకముపుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము. (యోహాను. 17:5).
మూడో వ్యక్తి : (ఆదరణకర్త/పరిశుద్ధాత్ముడు/ఆత్మ)
» నిత్యుడగు ఆత్మ (హెబ్రీ. 9:14),
> నిత్యుడు అనగా నిరంతరము ఉన్నవాడు.
సృష్టి ప్రారంభములో దేవత్వము
మొదటి వ్యక్తి : (దేవుడు/యెహోవా/తండ్రి)
» సృష్టిని ప్రారంభించు విషయములో నిత్యత్వములో మన తండ్రియైన దేవునికి ఒక ఆలోచన కలదు.
● “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” (ఆది. 1:1).
● "ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తము కలిగెను; మనము ఆయన ద్వారా కలిగినవారము” (1 కోరింధి. 8:6a).
రెండవ వ్యక్తి : (దేవుని కుమారుడు/యేసుక్రీస్తు/ప్రభువు)
» నిత్యత్వములో దేవునికి కలిగిన ఆలోచనలకు ఆకారమిచ్చిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు.
● “ఆయన (క్రీస్తు) అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు” (కొలస్సి. 1:15-17).
● “మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము” (1 కోరింధి. 8:6b).
మూడో వ్యక్తి : (ఆదరణకర్త/పరిశుద్ధాత్ముడు/ఆత్మ)
» నిత్యత్వములో దేవుని యొక్క ఆలోచనలకు ఆకారమిచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క పనికి కొలమానమిచ్చినది మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు.
● “దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను” (ఆది. 1:2).
● “తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?” (యెషయా. 40:12).
దేవత్వములో ముగ్గురు వ్యక్తుల యొక్క పని
1) కాలములు, సమయములు తన స్వాధీనములో ఉంచుకొని ఎప్పుడు ఏం చేయవలెనో నిర్ణయం తీసుకునేవాడు మన దేవుడు. (ఎఫెసీ. 1:8; అపో.కార్య. 1:7).
2) సమస్త జనముల యొక్క విమోచన కొరకు జగత్తు పునాది వేయబడకమునుపే తన ఆలోచనలో నిత్యత్వములో యేసుని నిర్ణయించుట. (1 పేతురు. 1:18-19).
3) యేసు మరణ విషయములో ముందుగానే నిత్యత్వములో నిర్ణయం తీసుకోగలుగుట. (అపో.కార్య. 2:22-24).
4) తండ్రి అధికారమిచ్చువాడు మరియు తీసుకొనువాడు. (మత్తయి. 28:18; 1 కోరింధి. 15:28).
5) ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు. (దానియేలు. 2:21).
6) తండ్రి మనకు అద్వితీయ సత్యదేవుడు. (యోహాను. 17:3).
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పని :
1) పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. (మీకా. 5:2).
2) ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ (క్రీస్తు). (1 కోరింధి. 10:1-4).
3) జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. (హెబ్రీ. 2:14-15).
4) నశించిన వారిని తండ్రి యెద్దకు చేర్చుటకు మార్గమును, సత్యమును, జీవమునై యున్నాడు. (యోహాను. 14:6).
5) పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన (క్రీస్తు) క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై ఉండి, తన రాజ్యముపై ప్రభువుగాను, క్రీస్తుగాను ఉండుటకు దేవుని చేత నియమిoపబడెను. (హెబ్రీ. 9:15; అపో.కార్య. 2:36).
6) యేసు మనకు దేవుడుగా నియమిoపబడలేదు.
ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు యొక్క పని :
1) యేసు ప్రభువని, దేవుని కుమారుడని తమ నోటితో ఒప్పుకొని బాప్తీస్మము పొందిన వారిలో వరముగా నివసిస్తున్నాడు. (అపో.కార్య. 2:38; 1 కోరింధి. 3:16; ఎఫేసి. 2:22).
2) మనలను సర్వసత్యములోనికి నడిపించును. (యోహాను. 16:13).
3) సమస్తమును మనకు బోధించి యేసు చెప్పిన సంగాతులన్నిటిని మనకు జ్ఞాపకము చేయువాడు. (యోహాను. 14:26).
4) పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. (యోహాను. 16:8).
5) మన హృదయములో సంచకరువుగా ఉన్నాడు. (2 కోరింధి. 1:22; ఎఫెసీ. 1:14).
6) పరిశుద్ధాత్ముడు దేవుడని గ్రంథము సెలవియ్యలేదు.
దేవత్వములో ముగ్గురు వ్యక్తుల మధ్యగల సంబంధము
1) పురుషునికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు తండ్రి. (1 కోరింధి. 11:3).
2) తండ్రికి యేసు అద్వితీయ కుమారుడు. (యోహాను. 3:16).
3) తండ్రి యిష్టమును నెరవేర్చుటకు పరలోకములో తండ్రియెద్ద నుండి పంపబడినవారు. (యోహాను. 6:38; 16:27-28).
4) యేసు మన తండ్రియొక్క లక్షణములు కలిగినవాడు. (యోహాను. 10:30; 17:11,22).
5) తండ్రిచేత సమస్తముపైన అధికారము పొందినవాడు. (మత్తయి. 28:18; యోహాను. 13:3; 1 కోరింధి. 15:24-28).
యేసుకు తండ్రికి మధ్యగల సంబంధము :
1) మన తండ్రియైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా దేవుడే. (యోహాను. 20:17).
2) తండ్రి యిచ్చిన పనిని యేసుక్రీస్తు సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమిమీద తండ్రిని మహిమపరచెను. (యోహాను. 17:4).
3) తండ్రిచేత పట్టాభిషేకము పొంది ఆయన కుడిపార్శవమున కూర్చునియున్నాడు. (హెబ్రీ. 1:4-9; అపో.కార్య. 2:33-35).
4) తండ్రి యొక్క లక్షణములు కలిగియున్నాడు. (కొలస్సి. 2:9).
5) మనకును తండ్రికి మధ్యవర్తియై ఉన్నాడు. (1 తిమోతి. 2:5).
పరిశుద్ధాత్మకు, తండ్రికి, కుమారునికి మధ్యగల సంబంధము :
1) నిత్యత్వములోను, సృష్టి ప్రారంభములోను తండ్రి మరియు కుమారునితో కలిసి యున్నారు. (ఆది. 1:1-3; యోబు. 26:13; హెబ్రీ. 9:14).
2) కుమారుని ద్వారా తండ్రి చేత ఆదరణ కర్తగా లోకమునకు పంపబడెను. (యోహాను. 14:26; 15:26).
3) తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మనకు తెలియజేయును. (యోహాను. 16:13).
దేవత్వములో ముగ్గురు వేరు వేరు వ్యక్తులు
● తండ్రి కుమారుడు కాదు: (1 పేతురు. 1:3; ఎఫెసీ. 1:3; 2 యోహాను 3).
● తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు : (యోహాను. 14:26; 15:26).
◆ కుమారుడు తండ్రి కాదు: (యోహాను. 1:14,18; 3:16-18).
◆ కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు : (యోహాను. 14:26; 16:7-13).
● పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు: (యోహాను. 14:16-17; 16:13).
● పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు : (యోహాను. 14:26; 16:7-13; 15:26).
దేవత్వములో ముగ్గురు దేవుళ్ళా?
కాదు
» దేవుడొక్కడే. ఆయన మన తండ్రి.(1 కోరింధి. 8:6; 1 తిమోతి. 2:5; ఎఫెసీ. 4:4-6).
» ప్రభువు ఒక్కడే. ఆయన మన యేసుక్రీస్తు.
(1 కోరింధి. 8:6; 12:5; ఎఫెసీ. 4:4-6).
» ఆత్మయు ఒక్కడే. ఆయన మన పరిశుద్ధాత్ముడు. (ఎఫెసీ. 4:4-6).
పరిశుద్ధ గ్రంధములో ముగ్గురు వ్యక్తులు ఒకేచోట కనిపించుట
1) దేవుడు "మన" స్వరూపమందు "మన" పోలికె చొప్పున నరులను చేయుదము. (ఆది. 1:26).
2) ఆదాము "మనలో" ఒకనివంటివాడాయెను. (ఆది. 3:22).
3) ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు "యెహోవాయు" ఆయన "ఆత్మయు" "నన్ను" (యేసు) పంపెను. (యెషయా. 48:16).
4) "యేసు" బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, "దేవుని ఆత్మ" పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. (మత్తయి. 3:16).
5) కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చుచు. (మత్తయి. 28:19).
6) నేను "తండ్రిని" వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక "ఆదరణకర్తను", అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. (యోహాను. 28:19).
7) ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. (2 కోరింధి. 13:14).
గమనిక: పైన తెలియపరచిన వాటిని బట్టి యోహావాయే మూడు రకాలుగా రాలేదని మనం గ్రహించాలి. యెహోవాయే యేసు అని, యేసు పరిశుద్ధాత్ముడని చెప్పే బోధని కట్టు కధ అని తెలుసుకోవాలి.
పాత నిబంధనలో ప్రజలు యెహోవాని దేవుడు, ప్రభువు, తండ్రి అని సంభోధించారు (యెషయా. 48:16; యెహే. 24:6). క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ఆయనని ఎరిగినవారికి తండ్రియైన దేవుడై ఉన్నారు (ఎఫెసీ. 4:6). ఈయన యేసుక్రీస్తు వారికీ కూడా దేవుడై యున్నారనే (ఎఫెసీ. 1:3,19) విషయం పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు కనుక మనము నమ్మితీరాలి.
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు ©
22 comments
commentsGood post KM
Replyవందనములు బ్రదర్ చాల చక్కగా వివరణ ఇచ్చారు
Replyదేవునికే మహిమ కీర్తి కలుగునుగాక ఆమెన్
మీ fb అకౌంట్ ఇవ్వండి
ReplyHebrews(హెబ్రీయులకు) 1:8
Reply8.గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
యేసుక్రీస్తు , పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని ఎక్కడ వుంది
పై వాక్యం ప్రకారం తండ్రి కుమారుడిని దేవా అంటున్నాడు
యేసుక్రీస్తు , పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని వుంటే అప్పుడు మీరు చెప్పాలి కానీ తండ్రి దేవుడు కాబట్టి యేసుక్రీస్తు , పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని మీరు ఎట్లా నిర్ణయిస్తారు..
Somehow I am not to happy with the division of persons of Godhead, their portfolios and their duties. Being finite we can not understand the infinite divinity. Spiritual realm is ambiguous that physical beings always miss the track. I am afraid, no explanation is complete and can not be accurate. I am sorry ... though I appreciate your great explanation, I am not able to accept the division in the unity of Godhead.
Replythanku brother sunder paul.. i think you are not ready to accept the apostolic doctrine and what bible says.. thanku greetings in the name of Jesus Christ.
Replyvandanamulu brother sreenu
Replyvandanamulu sister gowri
Replyఈ పేజీ చివరిలో FB icon ఉంటాది అది క్లిక్ చేస్తే నా FB ఎకౌంటు ఓపెన్ అవుతాది. బ్రదర్
Replyదేవుడు, దేవుడు ఒక్కడే, యెహోవా వారు యేసులా వచ్చారా..?, ...etc అనే అంశములు ఈ సైట్ లో పొందుపరిచాను .కాస్త చుస్తే మీకు అర్ధము అయ్యే అవకాశము ఉంది.
Replyమన తండ్రియైన దేవుడు మన ప్రభువైన యేససుక్రీస్తు కూడా దేవుడే అని యోహాను 20:17 అని వివరించి ఒక ప్రక్క యేసుక్రీస్తు దేవుడు కాదంటూ మరొకలా యేసుక్రీస్తు కూడా దేవుడే అంటున్నారు. అయితే...-నా తండ్రియు మీ తండ్రియు,నా దేవుడును మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము అని ఉంది. యేసు క్రీస్తు మననుష్యకుమారునిగా ఉన్నప్పుడు తండ్రీతో వేరుగానే ఉన్నారు.తండ్రిదగ్గరకు తిరిగి వెళ్ళీన తరువాత తండ్రిలో మమేకమై ఒక్కటిగా దేవత్వములో నివశిస్తున్నాడు.తండ్రి కుమారుడు ఒకటి కాకపోతే ఆయనకు తండ్రి కడిపార్శ్వమున కూర్చునే యోగ్యత ఉంటుందా, ఈ భూమి మీద తన దేవత్వమును విడిచి రిక్తునిగా కుమారునిగా సర్వలోక పాపములను భరించాడు.ఆయన దేవునిగా దేవుని స్థానములోనికి వెళ్ళిపోయాడు. పరిశుధ్ధాత్మ దేవుడు లేక క్రీస్తు ఒక్కటి కాకపోతే యోహాను 1:1 మరియు 1వ యోహాను 1:2,ఆది.కాం.1;1 వాక్యాలకు అర్ధం లేదు.అయితే ఒక పశ్న పరలోకంలో యేసు క్రీస్తు పేరు ఏమిటి, తండ్రి పేరు యెహోవా, పరిశుధ్ధాత్ముని పేరు ఏమిటి? పరలోకంలో ముగ్గురు నామములు ఒక్కటే అనేది కట్టుకద అయితే ద్వితీయో.కాం.6:4 మరియు యోహాను సువార్తలో కూడా అద్వితీయుడు అనే మాటను ఉపయోగించారు,ఆ పదానికి మీరు చెప్పే నిర్వచనం మూలగ్రంధ వాక్యమైన హిబ్రు పదాని ఒక్కసారి చదివి చెప్పండి.
Replyమీరు అడిగే వాటికీ మించి మరి నేను పైన అంశము వ్రాసాను. పైన వెళ్లి చూడండి. ఇంకా అర్ధము కానీ యెడల
Reply● దేవుడు ఒక్కడే
● ప్రభువు ఒక్కడే
● ఆత్మ ఒక్కడే
● యేసుక్రీస్తు దేవుడు కాదా?
● తండ్రి + కుమారుడు = ఇద్దరు వ్యక్తులు
అనే అంశములు కూడా వ్రాసి మరి ఈ సైట్ లో పొందుపరిచాను..వాటిని అన్నిటిని చూసి, చదివి అప్పుడు కామెంట్ చేయండి. :D
తండ్రి + కుమారుడు + ఆత్మ = ముగ్గురు
Replyవీళ్ళు సృష్టి ముందు, సృష్టి ప్రారంభము లో , వాళ్ళ పని, వాళ్ళ కి మధ్య ఉండే సంబంధము, వాళ్ళు ముగ్గురు లేక ఒక్కరేనా? అనే విషయాలను కూడా వాక్య ఆధారము చేసుకొని వ్రాసి ఇస్తే... మీరు మరల ప్రశ్న వేయడము పైన వాటిని సరిగ్గా చూడకపోవడము అని అర్ధము అగుచుంది.
పైన అంశమును బైబిల్ దగ్గర పెట్టుకొని జగర్తగా పరిశీలన చేసి అప్పుడు కామెంట్ చేయండి. వందనములు!! సోదరా
👉దైవత్వం దేవుని అదృశ్యలక్షణం
ReplyRomans(రోమీయులకు) 1:20
ఆయన అదృశ్య లక్షణములు,
అనగా ఆయన నిత్యశక్తియు
""దేవత్వమును"", జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.
👉ఆ దేవత్వం సంఘముగా క్రీస్తునందు నివసించుచునది,
Colossians(కొలొస్సయులకు) 2:9
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;
అందుకే మనం దైవ స్వభావములో పాలివరము కావలెనని దేవుడు కోరుకోనుచుచున్నాడు
2 Peter(రెండవ పేతురు) 1:4
ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ""దేవస్వభావమునందు"" పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను
John(యోహాను సువార్త) 10:34,35
34.అందుకు యేసు మీరు ""దైవములని"" నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
35.లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
అంటే కానీ దేవత్వములో మొదటి వెక్తి రెండవ వెక్తి మూడవ వెక్తి అని మనం అంటునము కానీ బైబిల్ 3గురు దేవత్వం గలవారు అని చెప్పలేదు...
దేవత్వం అనేది ఒక గుణం
మానవత్వం ఎలాగో అలాగే దేవత్వం.
Dear brother, greetings to you. I am a member of COC at rajahmundry. In this lesson you said that holy spirit is not god. But in Acts 5:3-" పరిశుద్ధాత్మను మోసపుచ్చటకు " and Acts5:4-"దేవునితోనే అబద్ధమాడితివని " .ఈ 2 వచనములలో - పరిశుద్ధాత్మను దేవుడు అని వాడబడింది గదా !!
Replyడియర్ బ్రదర్ , దేవుడు అనే మాట బైబిల్ లో సందర్భాన్ని బట్టి - తండ్రి కి , క్రీస్తు కు , పరిశుద్దాత్మ కు వాడబడింది . కొన్నిసార్లు ముగ్గురినీ సూచిస్తూ కూడా వాడబడింది . దేవుడు అనే సింగులర్ కాదు. ప్లురల్ . గమనించాలని ఆశిస్తున్నాను. వందనములు.
పరిసుద్దాత్ముడు అనే అంశము చూడగలరు వందనములు బ్రదర్...
Replyదేవత్వము కలిగినవారు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో అదే చెప్పాను.. వందనములు
ReplyDear brother.,పరిశుద్ధాత్ముడు పాఠం కూడా చూశాను . దేవుడు అంటే మీ ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు . దేవుడు అంటే దేవత్వము వున్నవారు కదా ! మీ ఉద్దేశము ఏమిటో తెలియచేయగలరు . వందనములు .
Replyదేవుడు అనే అంశము చూడండి బ్రదర్ వందనములు.
ReplyVandanamulu broeher yesu kristu yehovanu deva annadu naa devedu annadu yekkada bhomi mida paralokamuna
ReplyHi
Replyమీ పోస్ట్ లు కాపీ చేసుకుని షేర్ చేయ్యాలని అశిస్తున్నాను
Replyమీరు అనుమతి ఇవ్వగలరు
దేవుని పని లో నాకు సహాయం చేయ్యండి
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com