"వాగ్ధానములు" - 2024 (Promises)

వాగ్ధానములు (Promise)

పరలోకానికి ఏకైక మార్గమైన యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాభివందనము.
గడిచిపోతే తిరిగిరాని అమూల్యమైన సమయమును ఇలా వాక్య ధ్యానము కొరకై
సద్వినియోగము చేసుకుంటున్న మీకు నా వందనాలు. 

దయచేసి ఈ క్రింది అంశమును చివరి వరకు చదివి ఆలోచనచేసి మంచి నిర్ణయం తీసుకొనవలసిందిగా ప్రభువు పేరట కోరుచున్నాను.


I). ప్రతి సంవత్సరమున డిసెంబర్ నెల 31వ దినాన ప్రతి క్రైస్తవులకు గుర్తు వచ్చేదే వాగ్ధానములు. సంవత్సరమంతా సంఘానికి రాకపోయినను డిసెంబర్ 31వ దినాన మాత్రము క్రైస్తవులనబడేవారు  ప్రతి ఒక్కరు తప్పక వస్తారు.  ఏందుకు.., డిసెంబర్ 31వ దినాన అంత ప్రత్యేకత అంటే మిగిలిన రోజులలో ఏ రోజున దొరకనిది ఆ రోజు దొరుకుతుంది. అదే వాగ్ధానములు”. 

    ఆ దినాన వారు తమ  సంఘ సహవాసములో కూడుకుని 12 a.m అవ్వగానే లేక ఆరాధన అవ్వగానే వాగ్ధానాలు ఇస్తారు. దేవుడు నాకు ఈ సంవత్సరమునకు  తగిన వాగ్ధానము ఇచ్చాడు అని నమ్ముతారు. బైబిల్లో వ్రాయబడిన మాటలను కార్డులు రూపములో  వాగ్ధానాలుగా పంచటం, వీటినే సంవత్సరమునకు  తగిన వాగ్ధానముగా విశ్వాసులు ఒక పద్దతిగా తీసుకోవటం నేటి క్రైస్తవ సమాజములో చూస్తున్నాము.


II). నేటి కాలములో జరుగుతున్న ఈ వాగ్దానాల పద్ధతి ఎంత వరకు నిజము అనేది మనము  బైబిల్ ప్రకారముగా ఆలోచించాలి. క్రైస్తవులైన ప్రతి వారు ఏది చేసిన బైబిల్లో ఉండి తీరాలి మరియు బైబిల్ మనకు ప్రామాణికమవ్వాలి.   బైబిల్లో  ఉన్నది ఉన్నట్టుగా చూసి, ఆలోచన చేసి, అట్ల ఏది చేసిన ఆ చేసిన దాన్ని బట్టి దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఐతే  బైబిల్లో లేనిదీ కలిపి చేయుట వలన అటూ మనకు మనమే హాని చేసుకుంటూ ఇటూ దేవునికి భాదను కలిగించేవారము అవుతాము.


III). మన పరిశుద్ధ గ్రంథములో  ఆదికాండములోని 1వ అధ్యాయము 1వ వచనము నుండి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథములోని చివరి అధ్యాయములో చివరి వచనము వరకు ఎక్కడ కూడా సంవత్సరమునకు  సరిపడే  వాగ్ధానమును నీకే ఇస్తున్నానని, నీకే చెందినదని దేవుడు చెప్పినట్టుగా ఒక్క ఆధారము కూడ లేదు.


IV). బైబిల్లో ఇశ్రాయేలియుల కొరకు చేసిన వాగ్ధానాలు మరియు క్రైస్తవుల కొరకు చేసిన వాగ్ధానాలు ఉన్నాయి అనగా క్రీస్తుకు పూర్వం  దేవుని పిల్లలుగా పిలువబడ్డ  ఇశ్రాయేలియుల జీవితాలలో దేవుడు చేసిన వాగ్ధానాలు మరియు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత అనగా క్రొత్త నిబంధన కాలములో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు దేవుడు చేసిన వాగ్ధానాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరు మొదటగా తెలుసుకోవాలి.


V). బైబిలును ఒక క్రమమైన పద్దతిలో ధ్యానించితే కాని ఈసంగతి అర్థం కాదు.

మనము ఏదైనా ఒక వచనము చదువుతున్నప్పుడు పాటించించవలసినది ఏమనగా..,
a) ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నారు..?
b) ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు..?
c) మనము చదువుతున్న ఆ వచనము పాత నిబంధనలోనిదా..? (లేక) క్రొత్త నిబంధన లోనిదా..?
d) అక్కడ ఏ సందర్భము గూర్చి మాట్లాడుతున్నారు?
f) ఇది ఇశ్రాయేలీయులకు చెప్పబడిందా..(లేక) క్రైస్తవులకు చెప్పబడిందా..? ....etc

మనము ఇలా బైబిలును ఎంతో పరిశీలనతో, పరిశోధనతో  ధ్యానించితే తప్ప అందులోని సారాన్ని గ్రహించాలేము.


VI). మొట్ట మొదట ఇశ్రాయేలీయులకు సంభందించిన వాగ్ధానాలు ఏంటి..?, క్రైస్తవులైన మనకు దేవుడు చేసిన వాగ్ధానాలు ఏంటి..? అనేది తెలుసుకోవాలి. డిసెంబర్ 31 దినాన తీసుకుంటున్న వాగ్ధానాలలో ఎక్కువ శాతం  పాత నిబంధన నుండి తీసుకున్నవే. మరి ఇవి ఎవరు వ్రాసారు?, ఎందు కొరకు వ్రాసారు?, అది వాక్యమా లేక వాగ్ధానమా? అనే తేడా తెలుసుకోవాలి. 

దేవుడు ఏదైనా ఇస్తాను అను చెప్పే మాటయే “వాగ్ధానము”.  దేవుడు చెప్పాలనుకున్నదే వాక్యము. అనగా దేవుడు మనకు తెలియజేయాలనుకున్నది వాక్యమైతే ఆ దేవుడు మనకు ఇస్తానని ముందుగా తెలియజేసినది వాగ్ధానాలు.


VII). మొదటి శతాబ్దములో రోమా పట్టణములోనున్న క్రైస్తవులను ఉద్దేశించి రాస్తున్న మాటను చూస్తే
(రోమా. 9:4). "వీరు  ఇశ్రాయేలియులు; దత్త పుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును ఆర్చనాచారాదులును వాగ్ధానములును వీరివి".

రోమా పట్టణములోనున్న క్రైస్తవులు పాత నిబంధన గ్రంధములో ఇశ్రాయేలియుల కొరకు ఇవ్వబడిన వాగ్ధానములను, ధర్మ శాస్త్రములను మావి అని తలచినప్పుడు కాదు కానీ అవి ఇశ్రాయేలియులవే అని చెప్పుచున్న సందర్భం ఇది. పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేసుకోవుట చేత తాను దేవుడని తన పిల్లలకు నమ్మకం కలుగుటకు కొన్ని వాగ్ధానాలు చేసాడు.


VIII). మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఏది వాక్యమో?, ఏది వాగ్ధానమో?, ఎవరు, ఎవరికీ వ్రాయబడిందో?, ఎవరు, ఎవరి కొరకు వ్రాయించబడ్డాయి? అని గ్రహించాలి.

బైబిల్ లోనున్న వాగ్ధానాలు రెండు రకాలు :
a) పాత నిబంధనలోనున్న వాగ్ధానాలు
b) క్రొత్త నిబంధనలోనున్న వాగ్ధానాలు


IX). పాత నిబంధనలోనున్న కొన్ని వాగ్ధానాలు ఒకే వ్యక్తికి ఇచ్చిన వాగ్ధానాలుగా చూస్తున్నాము. మనం ఆ సందర్భ వచనమును ఎప్పుడు చదివిన అది ఆ వ్యక్తిదే అని గ్రహించాలి.

ఉదా : 
» (ఆదికాండము. 18:10). అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిర్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. దేవుడు అబ్రహముతో శారాకు కలుగు వాగ్ధానము గూర్చి చెబుతున్నాడు.

 » (హెబ్రీ. 11:11). "విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.౹"

పరమదేవుడు  పై వాగ్ధానమును  అబ్రహాము అనే వ్యక్తికి మాత్రమే చేసాడు. ఈ వచనమును మనము  ఎన్ని సార్లు చదివిన అది అబ్రహమునకు వర్తించే వాగ్ధానమని గ్రహించాలి.


X). పాత నిబంధనలోనున్న కొన్ని వాగ్ధానాలు ఒకే వ్యక్తికి కాక ఒక జనంగాలకు ఇచ్చిన వాగ్ధానాలుగా చూడగలము.

» ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను. (ఆదికాండము  15:18-20).

» ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను  హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. (ఆదికాండము  13:15).

» నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. (ఆదికాండము  17:8)

» నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడినీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.  (ఆదికాండము  24:7 )

» ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్త రింపచేసి నీవు జనముల సమూహ మగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెన . (ఆదికాండము  48:4 )

» నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి  (ద్వితియోపదేశకాండము  32:49)


XI). పాత నిబంధన కాలములో ప్రజలకి ఇవ్వబడిన  ప్రతి వాగ్ధానముల విషయములో ఆజ్ఞలు కలవు. ఆయా  ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన వారి యొక్క జీవితములోనే  వాగ్ధానము నెరవేరబడే పరిస్థితి. 

ఉదాహరణకు:

 ఆజ్ఞ - నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల(ద్వితియోపదేశకాండము 28:1) నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును (ద్వితియోపదేశకాండము 28:2) నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. (ద్వితియోపదేశకాండము 28:15)

 వాగ్ధానములు - (ద్వితియోపదేశకాండము 28 అధ్యాయం అంతయు చదువుకో).

NOTE : ఆయన తెలిపిన ఆజ్ఞలు పై దృష్టి పెట్టక, నడుచుకొనక కేవలము ఆయన ఇచ్చు వాగ్ధానాలు పై మాత్రమే ద్రుష్టి పెడితే శాపగ్రస్తుడువే.


XII). పాత నిబంధనలోనున్న కొన్ని వాగ్ధానాలు ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చిన వాగ్ధానాలుగా చూస్తున్నాము. భవిష్యత్తులో యేసుక్రీస్తు వస్తాడని ప్రపంచ ప్రజలందరికీ తెలియజేసే వాగ్ధానము.

» "యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు వంశస్థులనుగూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచిమాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.౹ ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.౹ ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.౹" (యిర్మీయా. 33:14-16)

» చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.౹" (జెకర్యా.  3:8)

» "అతనితో ఇట్లనుముసైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాచిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.౹ అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.౹" (జెకర్యా.  6:12-13)

» "కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.౹" (యెషయా. 7:14).

» "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను." (యెషయా. 53:1-12).


XIII).  పై వాగ్దానాలలో ఒక సమయము నుండి మరొక సమయము వరకు మాత్రమే ఉండే వాగ్ధానాలు కూడ ఉన్నాయి. బైబిల్ ధ్యానించేటప్పుడు ఏ వాగ్ధానాలు ఎవరికీ?, ఏ సందర్భములో ఎవరికీ?, ఏందుకు ఇచ్చారు?, అస్సలు మనకు వర్తిస్తాయా? లేదా? అని గ్రహించుకోవాలి. ఆయా ప్రాంతాలలో, ఆయా తరాలలో, ఆయా వ్యక్తులకు ఇచ్చిన వాగ్దానాలను డిసెంబర్  31వ దినాన ఇస్తున్నారు. ఇది ఎంత ఆవివేకమో ఆలోచించండి.


XIV). పాత నిబంధనను రెండు భాగాలుగా విభజించి ఆలోచిస్తే పాలు, తేనెలు ప్రవహించే కనాను దేశానికీ రాకమునుపు చేసిన వాగ్దానాలన్ని కూడ పాలు, తేనెలు ప్రవహించే కనాను దేశానికీ  వచ్చిన తర్వాత నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో తండ్రి చేసిన వాగ్దానాలన్ని నెరవేర్చబడ్డాయి. ఇలా వాగ్దానాలన్ని పరిశీలిస్తే ఆయా వ్యక్తులతో ఇశ్రాయేలీయులతో మాత్రమే చేసాడు. వాగ్దానాలన్నిటిని వాగ్ధానాలుగా దేవుడు ఇచ్చి ఆ తర్వాత కాలములో నేరవేరినట్టుగా ఇంతవరకు గల పై వివరణలోతెలుసుకున్నాము. యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపిన  తర్వాత ఇశ్రాయేలియులకు మిగిలిపోయిన వాగ్ధానాలు అంటూ ఏమి లేవు. ఇంత వరకు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్ధానాలు ఏంటో తెలుసుకున్నాము.XV). క్రొత్త నిబంధనలోని/క్రైస్తవులకు దేవుడు  చేసిన వాగ్ధానము ఏమనగా,

 నిత్యజీవము వాగ్దానము చేయబడినది : 

» (తీతుకు. 1:1-4)  
"దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమునుదేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలుమన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గానియిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను. తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక."

» (1 యోహాను 2:25) - నిత్య జీవము అనుగ్రహింతుననునదియే అయన తానే మనకు(నిజ క్రైస్తవుడుకు) చేసిన వాగ్ధానము. 

  పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము చేయబడినది : 

» (అపోస్తుల కార్యములు 2:38-39)."పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ   నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడిఅప్పుడు మీరు పరిశుద్ధాత్మ   అను వరము పొందుదురు.౹ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా   ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.౹"

  » (ఎఫెసీ, 1:13-14) "మీరును సత్యవాక్యమునుఅనగా మీ రక్షణ సువార్తను వినిక్రీస్తునందు   విశ్వాసముంచివాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి.౹ దేవుని మహిమకు కీర్తి   కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన   స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు."

  రాజ్యము వాగ్దానము  చేయబడినది : 

 » (యాకోబు. 2:5) 
"నా ప్రియ సహోదరులారాఆలకించుడిఈ లోక విషయములో   దరిద్రులైనవారిని   విశ్వాసమందు భాగ్య వంతులుగానుతన్ను ప్రేమించువారికి తాను   వాగ్దానము  చేసిన   రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?౹"

  సువార్త వాగ్దానము చేయబడినది : 

  » (రోమా. 1:4)
దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ     సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను.

 
 దేవుడు మన మధ్య నివసించుట వాగ్దానము చేయబడినది

» (2 కోరింది. 6:18) 
దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును  

  దేవుడు మనకు దేవుడు గా ఉండుటకు వాగ్దానము  చేయబడినది : 

» (2 కోరింది. 6:18) 
నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.

 ● యుగయుగాలు నెమ్మది గల జీవితము వాగ్దానము చేయబడినది. 

» (హెబ్రీ. 4:1) "ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.౹"

 ● నిత్యమైన స్వాస్థ్యము వాగ్దానము చేయబడినది :

» (1 యోహాను 2:25) - నిత్య జీవము అనుగ్రహింతుననునదియే అయన తానే మనకు(నిజ క్రైస్తవుడుకు) చేసిన వాగ్ధానము. 

» (1 పేతురు1:3-5) 
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.౹ కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.౹"

 జీవ కిరీటము గూర్చిన వాగ్ధానము : 

» (యాకోబు. 1:12).  
"శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.౹"

 దేవుని చిత్తము జరిగించేవారు ఈ వాగ్ధానములను పొందెదరు :

» (హెబ్రీ. 10:38 cf)"నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు."

📖 Note: దేవుడు  నిజక్రైస్తవుడకు ఇవ్వబడిన వాగ్ధానములును మనము సంపాదించుకోవాలంటే  నీ జీవితములో ఆయన షరతులు అనుసరించాలి ఏమనగా... 📖 


» (1 కోరింది. 6:14-18).  "మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?౹ క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?౹ [16-18] దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు."

» ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.౹" (ఎఫెసీ. 1:3). 

» కావున.., మనము మన పాపముల విషయమై చనిపోయి క్రొత్త జన్మ ద్వారా నీతి విషయమై జీవించి (1 పేతురు. 2:24), తన కుమారుడైన క్రీస్తు యొక్క సంఘములో(Church of Christ) చేరి (అపొ. కార్య. 2:47), అపొస్తలుల బోధను ఉన్నది ఉన్నట్టుగా అనుసరిస్తున్న పరిశుద్ధులతో సహవాసము కలిగి (అపో.కార్య.2:41-42; కీర్తన. 133:1, 1 కొరింధి. 7:24, హెబ్రీ.  10:25, 1 యోహాను. 1:3), ఇహలోక మాలిన్యమునంటకుండా జాగ్రత్తపడి (యాకోబు. 1:27), నిష్కలంకముగా, నిర్దోషముగా, పరిశుద్ధముగా జీవించి (1 ధేస్సలోనిక. 2:11-12, తీతుకు. 2:12-13, హెబ్రీ. 10:22, 1 పేతురు. 1:14-16), క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు ధైర్యము కలిగి ఆయనను ఎదుర్కొని మనకు వాగ్ధానము చేయబడిన నిత్యజీవమును పొందుకొనుటయే (1 ధేస్సలోనిక. 4:14-18, 1 పేతురు. 1:4-5, 1 యోహాను. 2:24-25; 3:2).   

» మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారుగాను,
» నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారుగాను,
» విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారుగాను,
» యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరువారముగాను ఉండవలెను. (హెబ్రీ. 10:19-24 cf)


            దైవజనులారా మొదటగా పరిశుద్ధ గ్రంథము విభజన ఎలా చెయ్యాలో..? మనము ఏ నిబంధన క్రింద ఉన్నామో..? అనే విషయాలును నేర్చుకోండి. మీరు ఇట్ల చేయకే గ్రంథము విభజన తెలియని వారుకి మీకు నచ్చిన, తోచిన వాక్యములను బైబిల్లో ఏరుకొని మీ యొద్దకు వచ్చువారికి ఒక  కార్డు రూపములో ఇదే మీకు ఈ సంవత్సరపు వాగ్దానమని ఇస్తూ, ఆకర్షించుకొనుచు, వారిని మరింత  అవిశ్వాసపు స్థితి లోనికి దిగజారుస్తున్నారు. జాగ్రత్త  సుమా!!  ప్రతి నిజవిశ్వాసికి లేదా నిజక్రైస్తవుడకు పరిశుద్ధాత్మ మరియు పరలోకమను వాగ్ధానములు దేవుడు ఇది వరకే ఇచ్చాడని గ్రహించండి. దయచేసి మనుష్యులు పెట్టిన పారంపర్యాచారములపై అనగా ఇటువంటి ప్రామిస్ కార్డ్స్ (Promise Cards) పై మనస్సు పెట్టక సత్యమైన వాక్యానుసారమైన వాటిపై మనస్సు పెట్టమని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయులు,
మనోహర్ & నవీన.

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16