"గుడారాల పండగ" (The Feast Of Tabernacles)

గుడారాల పండగ  (The Feast Of Tabernacles)

నా తోటి సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. 

గుడారాల పండుగనే "పర్ణశాలల పండుగ" అని కూడా అంటారు. నేటి క్రైస్తవ్యంలో అనేకమంది ఏటేటా గుడారాల పండగను ఆచరించుట మనము చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంధములో పాత నిబంధనలో ఈ పండగను గూర్చి  చాలా చక్కటి వివరణతో “ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎవరు చేయాలి?” అనే విషయాలను తెలియజేయుడం జరిగింది. వాటిని గూర్చి క్లుప్తంగా ఆలోచన చేద్దాము.

ఎందుకు చేయాలి..? 


ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను బానిసత్వము నుండి విడిపించి, కనాను దేశమునకు పోవు మార్గమంతటిలో  వారిని రక్షించి, వారు పగలు రాత్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా  నివాసము చేయుటకు దేవుడు ఏర్పరచిన మార్గము ఈ పర్ణశాలలు. ఆ ప్రజలు దేవుడు చేసిన ఈ గొప్ప మేలును ఎన్నటికీ గుర్తుచేసుకోవాలని దేవుడు ఆశించి ఈ పండుగను చేయాలని  వారికి ఆజ్ఞాపించెను. 

» నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీ యులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను. – (లేవీ.కాం. 23:42).

ఎప్పుడు చేయాలి..? 


» నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. – (లేవి.కాం. 23:34).
యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను. – (నెహేమ్యా. 8:14).  

» కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీమను (రోమా నెలల ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్) ఏడవ మాసమందు పండుగకాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. – (1 రాజులు. 8:2).

» యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు. - (జెకర్యా, 14:16).

» ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. – (సంఖ్యా.కాం. 29:12).

» నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను. – (ద్వితియో. 16:13).


ఎలా చేయాలి..? 


» మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మ లను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – (లేవీ.కాం. 23:40).

» వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవచెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. – (నెహేమ్య. 8:15).

» గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి. – (ఎజ్రా. 3:4).

(గమనిక: సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వచనము నుండి 40వ వచనము వరకు చదువవలెను)


ఎవరు చేయాలి..? 


ఈ గుడారాల పండగ ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిందని ఖచ్చితమైన ఆధారములు చాలా ఉన్నవి.

» యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను - నీవు “ఇశ్రాయేలీయులతో” ఇట్లనుము,... – (లేవీ.కాం. 23:1-2).

» యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు “ఇశ్రాయేలీయులు” పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను. – (నెహేమ్యా. 8:14).  

ప్రియులారా, దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంధములో  గుడారాల పండగ మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ. దేవుడు మోషే న్యాయకత్వములో ఇశ్రాయేలీయులకు చేసిన మేలులు, అద్భుతములును కనులారా చూడని  వారి తర్వాత తరముల వారు తెలుసికొనుటకై, మరియు యెహోవాయే తప్ప వేరొక దేవుడు లేడని ఆయనే సమస్తమునకు జీవాధారుడని అన్యజనులకు తెలియజేయుటకై ఈ పండగను ఆచరింపమని వారికి ఆజ్ఞాపించెను.


నేటి క్రైస్తవులు ఈ పండగను ఆచరించవచ్చా..? 


నేటి క్రైస్తవులమైన మనము ఈ పండగను ఆచరించవచ్చా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానమే దేవుడు తెలియజేసారు. కాని నేటి క్రైస్తవులు ఆ విషయమును పూర్తిస్థాయిలో అంగీకరించలేకపోతున్నారు. నేటి క్రైస్తవులమైన మనకు జీవాధారుడు యేసుక్రీస్తు. 
తండ్రియైన దేవుడు ఏ బోధనైతే బోధించమని చెప్పాడో అదే బోధను యేసుక్రీస్తు వారు ఈ లోకములో ప్రకటన చేసారు (యోహాను. 8:26,38) కాని సొంత బోధను చేయలేదు. యేసుక్రీస్తు ఏ బోధనైతే బోధించమని అపోస్తులలకి చెప్పారో అదే బోధను అపోస్తులులు ఈ లోకములో ప్రకటన చేసారు (యోహాను. 17:6,14,17,20) కాని సొంత బోధను చేయలేదు. అలాగే అపోస్తులులు ఏ బోధనైతే బోధించారో మనము అదే బోధను ప్రకటన చేయాలి (1 కొరింధి. 2:7, 2 దేస్సలోనిక. 2:15) కాని సొంత బోధను కాదు. 

  నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. – (మత్తయి. 28:28).

పాత నిబంధనలో అనగా ధర్మశాస్త్రములో గల పండగలను గూర్చి అపోస్తులులకు క్రీస్తు ఎలాంటి సంగతులను ఆజ్ఞాపించలేదు. ఆజ్ఞాపించినచో వారు ఖచ్చితముగా చేసి ఉండేవారు, ఆనాటి ఆదిమ క్రైస్తవులకు తెలియజెప్పేవారు. కాబట్టి మనము ఈ పండగల విషయములో సొంత నిర్ణయాలు తీసుకుని అపోస్తులుల బోధకు వ్యతిరేకముగా నడుచుకోకూడదు. ఎందుకనగా,..

 ★ మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. – (గలతీ. 1:8).


 క్రైస్తవులు పండగ పేరు చెప్పి దినములను ఆచరించేవారిగా ఉండకూడదు.

 » మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. – (గలతీ. 4:10-11)

» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. – (కొలస్సి. 2:16).

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16