పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో మా వందనములు.
📖 విశ్వాసము యొక్క నిర్వచనం :
"విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది" (హెబ్రీయులకు. 11:1). దీని అర్థం మనం ఆశించే విషయాలపై మనకు ఉన్న నమ్మకమే విశ్వాసం. ఇది మనం చూడలేని లేదా ప్రస్తుతానికి అనుభవించలేని విషయాల గురించి విశ్వాసం కలిగి ఉండటం. విశ్వాసం అనేది ఒక భావన కాదు, అది చర్య. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానాలపై నమ్మకం ఉంచి, ఆ వాగ్దానాల ప్రకారం జీవించడం. మనం చూడలేని వాటిని కచ్చితంగా పొందుకుంటామని ధైర్యంగా ఉండటం. ఇది ఊహ కాదు. ఆయన వాగ్దానాలపై ఆధారపడి, జీవితాన్ని ఆచరణలో పెట్టడమే విశ్వాసం.
📖 విశ్వాసం ఎలా కలుగును?
"కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును.౹" (రోమా 10:17) "...దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను."(లుకా 11:28). వినడం ద్వారా విశ్వాసము వస్తుంది. ఏమి వినాలి? క్రీస్తును గూర్చిన మాటలు అనగా యేసు చేసిన దేవుని రాజ్య సువార్తను, పలు బోధనలు, మరియు ఆయన మరణం, పునరుత్థానం గురించి వినడం.. అపోస్తలుల బోధ/సువార్త ద్వారా... (మత్తయి. 4:23; మార్కు. 6:2; 1 దేస్స. 2:13; 2 దేస్స. 2:12-14). యేసు బోధే అపోస్తలుల బోధ (యోహాను. 17:6,14; ఆపో. ) వాక్యం చెప్పుట వలన విశ్వాసం రాదు. వాక్యం వినుట వలన మాత్రమే అది క్రీస్తు/అపోస్తలుల బోధ వినుట వలన మాత్రమే సాధ్యం.
క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. "విశ్వాసము లేకుండా దేవునికిస్టులై ఉండుట అసాధ్యము" (హెబ్రీ. 11:6) అని గ్రంథమే సెలవిస్తుంది కదా! అయితే విశ్వాసము ఒక్కటే అని గ్రంథం సెలవిస్తుంది (ఎపేసి. 4:5 చూడుము) అయినప్పటికి రెండు రకాల విశ్వాసాలు కలిగిన క్రైస్తవులు నేటికి లేకపోలేదు. చాలామంది మీరు ఏంటి ఇలా చేస్తున్నారు, మీరు చేస్తున్నది గ్రంధానుసారం కాదు కదా అని అడిగితే "మీ విశ్వాసము వేరు - మా విశ్వాసం వేరు" అని అంటారు. అసలు విశ్వాసము ఒక్కటే అయినప్పుడు మీది వేరు, మాది వేరు అనడానికి సరికాదు కదా!? పరిశుద్ధ గ్రంధం సెలవిస్తున్న ఆ ఒక్కటై ఉన్న విశ్వాసము ఎట్టిదో ఈ అంశంలో తెలుసుకుందాం.
✒ సహజంగానే పలు సమూహాలలోనున్న మనుషులు రెండు తెగలుగా ఉంటారు. ఏ తెగకు చెందినవాడు ఆ తెగకు సంబంధించిన జీవన శైలిని కలిగి ఉంటాడు.
✒ అలాగే క్రైస్తవుల విశ్వాస విధానంలో కూడా రెండు తెగలు ఉన్నాయి. ఒకటి భౌతికసంబంధమైనది రెండు ఆత్మసంబంధమైనది.
🔎 భౌతికమైనది :
మొదట భౌతిక సంబంధమైన విశ్వాసముతో జీవించే వారి జీవన శైలి ఎలా ఉంటుందో ఆలోచన చేద్దాం.
కేవలము ఈ లోకములో తమ జీవితాన్ని సంతోషంగా జీవించడం కొరకు మాత్రమే కొంతమంది క్రీస్తును విశ్వసిస్తారు వాళ్ళు ఈ భూమి మీద ఉన్నదంతా శాశ్వతము అని భావిస్తారు (కీర్తన 49:10-20) లోకంలో ఘనంగా బతకాలని అందరి చేత గుర్తింపబడాలని ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలని, ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో తమకి ఉన్న కోరికలన్నీ తీర్చుకోవడానికి క్రీస్తు నందు విశ్వాసం కలిగి ఉంటారు. ఇటువంటి విశ్వాసము భౌతిక సంబంధమైనది కేవలం ఈ జీవితకాలం మట్టుకే బ్రతికితే చాలు అనుకుంటారు. వీరికి నిరీక్షణ ఉండదు నిరీక్షించాలన్న ఆలోచన కూడా రాదు ఎందుకంటే వారు తమ క్రైస్తవ జీవితము ఈ లోకం మట్టుకు మాత్రమే అని తలంచుతారు. (1 కోరింది 15:19)
ఈ లోకం మట్టుకు మాత్రమే జీవిస్తే దానిలో నిరీక్షణ ఎక్కడ ఉంది? నిరీక్షణ లేకపోతే పునరుద్ధానం ఎక్కడుంది? పునరుత్థానం లేకపోతే పరలోకం ఎక్కడిది? కనుక నిరీక్షణ లేకుండా కేవలం భౌతిక సంబంధమైన జీవితం కొరకు బ్రతికే వారి విశ్వాసము వ్యర్థమే. అట్టి విశ్వాసము పునరుద్దానంలో పాలు లేకుండా చేస్తుంది. నేడు క్రైస్తవులని చెప్పుకునేవారు అనేకులు ఇలాగే జీవిస్తున్నారు. ఇది పరిశుద్ధ గ్రంధం సెలవిస్తున్న ఆ ఒక్కటై ఉన్న విశ్వాసము కాదు.
🔎 ఆత్మసంబంధమైనది
రెండవదిగా ఆత్మసంబంధమైన విశ్వాసం కలిగిన వారి జీవితము లేక వారి జీవనశైలి ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఆలోచన చేద్దాం.
వీరు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని(2 పేతురు 3:9-14), మేము పరదేశులమని, సమస్తమును విడిచి ఒకానొక దినాన తిరిగి వెళ్లాలని రూడీగా నమ్ముతారు.(1 పేతురు. 2:11; హెబ్రీ. 11:13) ఈ లోకం మట్టుకు మాత్రమే క్రీస్తు వద్దకు రారు వీరి విశ్వాసంలో నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ కలిగిన వారు ప్రత్యేకమైన జీవనశైలిని కలిగి ఉంటారు. పునరుత్థానము ఉందని(యోహాను 5:29, 1 దెస్స. 4:13-18) అలాగే పునరుత్థానంలో పొందబోయే బహుమానము గూర్చి బాగుగా ఎరిగి తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. (ఫిలిప్పి 3:10-14) సత్క్రియలతో తమ జీవితాన్ని నింపుకుంటారు. ఉపకారం చేసే విషయంలో వెనుకడుగు వేయరు. ఉపకారము చేసి తిరిగి మరల ప్రత్యుపకారము కొరకు ఎదురు చూడరు. దేవుని దృష్టికి అనుకూలమైనదే చేస్తారు. (1 తిమోతి. 2:1-3) తాము చేసే సత్క్రియలకు ప్రత్యుపకారము పరలోకము నుండి వస్తాదని గట్టిగా నమ్ముతారు. (లూకా 14:14; 1 తిమోతి 5:4; 2 కోరింది 5:10). ఇట్టి విశ్వాసముతో జీవించే వారికి పునరుత్తానంలో పాలు ఉంటుంది. పరలోకానికి ప్రవేశం ఉంటుంది.
📖 ఆ ఒక్కటై ఉన్న విశ్వాసము గలవారి జీవనశైలి :-
☑ భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తింస్తారు. (1 దెస్స. 2:10)
☑ కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయరు. (1 పేతురు 3:9)
☑ మాటలు, నడవడిక, ప్రేమ, విశ్వాసం, మరియు పవిత్రతలో విశ్వాసులకు ఒక ఉదాహరణగా ఉండటం (1 తిమో. 4:12)
☑ తాము చేసే ఉపకారము మనుషులకు కాదు గానీ ప్రభువుకు చేస్తున్నామని తలంచే మనస్సాక్షి కలిగిన వారు (మత్తయి 25:35)
☑ తమ సత్క్రియలు తమ వెంట వస్తాయని భావించి నిరీక్షించేవారు ( ప్రకటన 14:13)
☑ వారేమి చేసినను మనుషుల నిమిత్తము చేయక ప్రభువు నిమిత్తం అని మనస్పూర్తిగా చేసేవారు ( కొలస్సి 3:22)
☑ మేలు చేయుటయందు విసుగక అలయకుండా మేలు చేయువారు ( గలతి 6:9)
☑ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటారు ( తీతుకు 2:11- 12)
☑ వాగ్దానము పొందుతామని నిరీక్షిస్తారు (అపో కార్య 26:7)
☑ దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును కలిగి ఉంటారు. (ఎఫెసీ. 4:24)
☑ ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనముచేయుచు దేవుని సువార్త ప్రకటించువారు. ఇతరుల/దొరల సొమ్ము పై ఆధారపడేవారు కాదు. (1 దెస్స. 2:10; 2 దెస్స. 3:8)
☑ తమ శరీరములను దేవునికి సమర్పించుకొనేవారు (రోమా. 12:1)
☑ తమ మాటలు, ప్రవర్తన మరియు ఆలోచనలలో పరిశుద్ధంగా ఉండేవారు. (కొలస్సీ. 3:8)
☑ మన హృదయాలు, ఆలోచనలు, ఆశలు మరియు ప్రాధాన్యతలు భూమికి సంబంధించిన విషయాల కంటే దేవునిపై మరియు పరలోక సంబంధమైన విషయాలపై దృష్టి కలిగి ఉంటారు. (కొలస్సీ. 3:1-2)
☑ తోటి సహోధరులు కష్టాల్లో ఉన్నప్పుడు, వారి భారాలను పంచుకోవడం, వారిని ఓదార్చడం, వారికి సహాయం చేయడం (గలతి. 6:2)...Etc.
💥నిరీక్షణ లేని వారు బాధ్యతారహితంగా ఉంటారు. వీరు తమకు ఉపకారం చేసిన వారికి మాత్రమే తిరిగి మరల చేస్తారు. తమతో సమానమైన వారికి మాత్రమే వారి విందుల్లో భాగమిస్తారు. నీకు ఉపకారం చేసే స్థితి ఉండి నిరీక్షణ లేకపోతే నువ్వు చేసిన ఉపకారానికి ప్రయోజనం ఏమీ ఉండదు. ఉపకారం చేసిన వారికే ఉపకారం చేస్తే దేవుని దృష్టికి ఎన్నిక లేని వాడవు. (లూకా 14:12-14). ఉపకారానికి ఉపకారం చేసేది భక్తి కాదు ఇటువంటి విశ్వాసము భౌతికమైనది.
🔘 కావున ప్రియ సహోదరుడా, ఆలోచించు నిరీక్షణ లేని విశ్వాసము వ్యర్థము. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానికి ఒక అర్థం ఉండాలి. అర్థరహితంగా ఏమి చేసినా దాని ఫలితం శూన్యమే. క్రియలు లేని విశ్వాసం మృతము కదా(యాకోబు. 2:26) లేఖానానుసారమైన ఆ ఒక్క విశ్వాసము లేకుండా నేను క్రైస్తవుడని చెప్పుకుంటే నీ విశ్వాసము వ్యర్థమే. మృతి పొందినప్పుడు ఎవరైతే తమ క్రియలు తమ వెంట తీసుకువెళ్తారో అటువంటి వారికే ప్రభువైన యేసు తన తండ్రి రాజ్యం ఇస్తాడు(మత్తయి. 25:34-40) అలయక మేలు చేయువాడు తగిన సమయంలో ఫలం పొందుతాడు. నీవు చేసే ప్రతి క్రియకి దేవుని సముఖంలో బహుమానము పొందుకుంటావు. (ప్రకటన. 22:12)
2. పరలోకమునకు ఎవరు వెళ్తారు?క్లిక్ చేయు
3. క్రైస్తవ వాగ్ధానములుక్లిక్ చేయు
మీ ఆత్మీయులు 👪
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com