వెతుకుట (searching)

వెతుకుట (searching)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన వారందరికీ నా వందనములు.

మత్తయి 7:7-8: "అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును."

ఏమి వెతుకుతున్నావు?  - ఏమి వెతకాలి? 

నీవు ఏమి పోగొట్టుకొన్నావో దాని విలువ తెలుస్తేనే వెతుకుతావు. దాని విలువ తెలియనివాడు వెతకుడు. 

ఉదాహరణకు : 

"రూపాయి కాయిన్ పడిపోయింది, డైమండ్ రింగ్ జారిపోయింది."

రెండింటిలో దేనిని వెతుకుతావు? డైమండ్ రింగ్ కథ. కావున నీవు వెతికేటప్పుడు నీ మనస్సు ఆ వస్తువు యొక్క విలువను బట్టి ఆధారపడి ఉంటుంది కథ. 

మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శ్రోతలకు ఇలా వాగ్దానం చేశారు "వెదకుడి మీకు దొరకును" ఐతే ఏమి వెతకాలి? నీకు ఏమి వెతకాలో తెలియకపోవచ్చు కానీ నీవు ఏమి పొగ్గొట్టుకొన్నావో అది వెతకాలి. నీ యొద్ద క్షేమముగా ఉన్నవాటిని వెతకనవసరం లేదు. విలువైన దానిని, పొగ్గొట్టుకొన్న దానిని, అవసరమైన దానిని వెతకాలి.


నీవు క్రైస్తవుడువైతే నీవు ఏమి వెతకాలో పరిశుద్ధ గ్రంథం ఇలాగున సెలవు ఇస్తుంది


1) దేవున్ని వెతకాలి - కీర్తన. 14:2 :

"వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను".

● దేవున్ని ఎలా వెతకాలి? 

A). వివేకము కలిగి వెతకాలి : (కీర్తన. 14:2)

B). విశ్వాసముతో వెతకాలి : (హెబ్రే. 11:6a)

C). శ్రద్ధగా వెతకాలి : (హెబ్రే. 11:6b)

 "విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.౹"  (హెబ్రే. 11:6). 

⟼  తన్ను శ్రద్ధగా వెదుకువారికి (diligently seek him) అనే పదం బైబిల్ లో మిస్ అయ్యింది. 

Heb 11:6: "But without faith it is impossible to please him: for he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him."


ఎప్పుడు వెతకాలి?

మీకు దొరికే కాలమునందు వెతకాలి 

➾ "యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి." (యెషయా. 55:6)  


ఆయన దొరుకు కాలము నందు నీవు ఎలా వెతకాలి? 

➾ "భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును." (యెషయా. 55:7)  

➾ హెబ్రే 8:12: "నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు."


2). సమాధానమును వెతకాలి - 1 పేతురు 3:10-12:

 "–జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది."

యేసుతో సమాధానం : 

↛ (యోహాను 14:27:) "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.౹"

దేవునితో సమాధానం : 

↛  (రోమా 5:10-11:) "ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹ అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము."

మానవ జాతితో సమాధానం : 

↛  (ఎఫేసి. 2:13-14:) "అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹ ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹"

క్రీస్తు శరీరం(సంఘము) ద్వేషం లేని, కక్షలు లేని, విరోధభావం లేని, బేధాలు లేని సమాజం. 


3). దేవుని రాజ్యము, నీతిని వెతకాలి

➦ (మత్తయి. 6:33:) "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును."

క్రీస్తు ప్రభువు యొక్క పరిపాలన నీ జీవిత అనుభవం లోనికి రావాలి. ఆయానేమి చెప్పిన నీవు లోబడాలి అనే వారు వెతికేవారైయుంటారు. 

దేవుని రాజ్యం వెతుకుట అంటే  "దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.౹" (రోమా 14:17)


హెచ్చరిక :   "ఆ..... తరువాత వెతకడం" అనే ఆలోచన ఉంటె...

⟹ (హెబ్రే. 12:15-17:) "మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అప విత్రులై పోవుదురేమో అనియు,౹ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.౹ ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు."

ప్రాముఖ్యత, గొప్పతనం, విలువ తెలియక ఆ తరువాత శ్రద్ధతో వెతుకుతే విసర్జింపబడెదువు.

⟹ (లూకా. 13:25-27:) "ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి– అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు ఆయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన— మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును."

⟹ (మత్తయి. 25:10-11) :  "వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి– అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా" "అతడు– మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను."


ప్రియులారా, దేవుడు దొరికే కాలమునందు అలక్ష్యం చేసి, సమీపంముగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం పెట్టేసి, దేవుడు తానే సమాధానపడుటకు ఎదురొచ్చినప్పుడు దానిని కాలదన్ని, ఆయన రాజ్యం ఉన్నప్పుడు పట్టించుకోకుండా జీవితం కొనసాగించి ఆ తరువాత కావాలని కోరుకొంటే నీవు ఏడ్చిన లాభం లేదు తలుపు తట్టిన లాభం లేదు అయ్యా అయ్యా అనిన లాభం లేదు. కావున ఆయన దొరుకు కాలము లొనే వెతకాలి.                        

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16