"మానవుని కొరకు దేవుని సంకల్పము" |
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు.
: “దేవుడు” :
1). మన దేవుడు శాశ్వతమైనవాడు - (1 తిమోతి. 1:17)
2). మన దేవుడు నిరంతరము ఉన్నవాడు - (యెషయా. 40:28).
3). మన దేవుడు ఆది లేనివాడు, అంతము లేనివాడు - (నిర్గమా. 3:14).
»» ఆది, అంతము లేని శాశ్వతమైన మన దేవుడు మానవులను కూడా శాశ్వతమైన వారిగా ఆయన స్వరూపములో, ఆయన పోలికలో నిర్మించాడు. (ఆది. కాం. 1:26:27).
: “మానవుడు” :
1). ఈ భూమి మీద మానవులను పుట్టించినవాడు దేవుడు - (నిర్గమా. 4:11; కీర్తనలు. 100:3; ప్రసంగి. 7:29).
2). మానవుడు దేవుని స్వరూపములో, దేవుని పోలికగా చెయ్యబడిన వాడు. - (ఆది. కాం. 1:26).
3). మానవుడు రెండు భాగాలు బాహ్య పురుషునిగా (దేహము); ఆంతర్య పురుషునిగా (ఆత్మ) నిర్మింపబడినవాడు. (2 కోరింథి. 4:16).
»» దేవుని స్వరూపము, దేవునిపోలికలో నిర్మించబడిన మానవుడు కూడా శాశ్వతమైనవాడు. చావు దేహానికి ఉంటుంది కాని, ఆత్మకు చావు లేదు. (ప్రసంగి. 3:20; 12:7; యోహాను.6:63). అందువలన శాశ్వతమైన మానవుని కొరకు దేవుడు సంకల్పము చేశాడు.
I). “సంకల్పము ఎవరు/ఎప్పుడు/ ఎవరి కోసం/ఎవరి నందు చేశారు”..?
» సంకల్పము అనగా పథకం (లేదా) ప్రణాళిక. «
A). "మానవుని కొరకు దేవుడు సంకల్పమును చేశాడు".?
సృష్టి లేనప్పుడే(అనాదిలో) దేవుడు సమస్త మానవాళి కొరకు సంకల్పము చేశాడు. - (ఎఫెసి. 1:6; 2 తిమోతి. 1:9; 1 పేతురు. 1:20. cf).
ఎవరైన గోపురము కట్టుటకు ముందే ఆలోచన చేస్తారు కదా! - (లూకా. 14:28. cf)
గోపురము కొరకే తగులుబడి ఆలోచన చేస్తే శాశ్వతమైన మానవుని కొరకు దేవుడు సృష్టి లేనప్పుడే ఆలోచన చేశాడు.
గోపురము కొరకే తగులుబడి ఆలోచన చేస్తే శాశ్వతమైన మానవుని కొరకు దేవుడు సృష్టి లేనప్పుడే ఆలోచన చేశాడు.
B). "మానవుని రక్షణ కొరకు దేవుడు ఎవరినందు సంకల్పము చేశాడు".?
“మన ప్రభువైన యేసుక్రీస్తు నందు” మనుష్యులందరిని రక్షించాలని దేవుడు సంకల్పము చేశాడు .- (ఎఫెసి. 3:8-11; 1 తిమోతి. 2:4. cf).
C). "మానవుని కొరకు దేవుడు చేసిన సంకల్పమును ఎవరైన నిరాకరించవచ్చా".?
“ఏ మానవుడు” నిరాకరించకూడదు. - (లూకా. 7:30).
⤃ సంకల్పము చేసినది :- మన తండ్రియైన పరమదేవుడు
⤃ సంకల్పము ఎప్పుడు చేశారు :- అనాదిలో(సృష్టికి ముందు).
⤃ సంకల్పము ఎవరి కోసం చేశారు :- సమస్త మానవాళి కొరకు
⤃ సంకల్పము ఎవరి నందు చేశారు :- మన ప్రభువైన యేసుక్రీస్తు నందు
II). దేవుని సంకల్పము ఏమిటి.?
A). "దేవుని భవిష్యద్ జ్ఞానమును బట్టి సమస్త మానవాళి అపరాధములకు పాపములకు క్షమాపణ కలుగుట కొరకు యేసు సిలువ మరణము అనుభవించాలని దేవుడు అనాదిలో నిర్ణయించాడు". - (అపో.కార్య. 2:23; ఎఫెసి. 1:7; 1 పేతురు. 1:18-21).
B). "సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట". - (1 కోరింథి. 1:21).
C). "ఏ బోధ వలన మనుష్యులు రక్షింపబడతారో, ఆ బోధను అనగా అపొస్తలుల బోధను దేవుడు అనాదిలో నిర్ణయించాడు". - (1 కోరింథి. 2:7; అపో.కార్య. 2:42; రోమా. 16:24-25.cf).
D). "అపొస్తలుల బోధ విని రక్షింపబడిన వారిని మాత్రమే కుమారులుగా స్వీకరించాలని దేవుడు అనాదిలో నిర్ణయించాడు". - (ఎఫెసి. 3:4-7).
E). "క్రీస్తు సంఘము" (Church of Christ) దేవుని ఆలోచనలో సృష్టికి ముందుగానే(అనాదిలో) ఉన్నది.- (ఎఫెసి. 3:8-11.cf).
III). దేవుని సంకల్పము ఎప్పటికీ మార్చబడదు.
"యేసు సిలువ మరణము గాని, అపోస్తలుల బోధ గాని, క్రీస్తు ద్వారా రక్షింపబడినవారు ఉండవలసిన క్రీస్తు సంఘమును(Church of Christ) గాని దేవుడు ఎవ్వరి కోసము ఎప్పటికీ మార్చడు".
దేవుని సంకల్పము మార్చబడనిది. - (హెబ్రీ. 6:17).
⥇ ఉదాహరణకు: యేసు శరీరధారియై మన మధ్యకు వచ్చి మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన సమస్త మానవజాతిని విడిపించుటకు ఆయన సిలువ మరణము పొందాలని (యోహాను. 1:1-2; 14; హెబ్రీ. 2:14-16) "దేవుడు అనాదిలో నిర్ణయించిన తర్వాత యేసుక్రీస్తు ప్రార్థన చేసిన తన సంకల్పమును మార్చలేదు".(మత్తయి.26:36-39; మార్కు. 14:32-36; లూకా.22:39-44.cf).
"కావున నేడు మనము అనాదిలో దేవుడు నిర్ణయించిన సంకల్పములో ఉన్నామో. ? లేదో. ? ఆలోచన చేద్దాము, లేఖనములు పరిశీలన చేద్దాము, దేవుడు అనుగ్రహించు ఆశీర్వదములు పొందుకొందాము".
2 comments
commentsVandanamulu for all
ReplyVandanamulu anna.1thimothi 6:16 gurchi vivarana isthara.
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com