"నిజమైన బాప్తీస్మము vs తప్పుడు బాప్తీస్మము" True Baptism vs False Baptism

"నిజమైన బాప్తీస్మము"
vs 
"తప్పుడు బాప్తీస్మము"


సహోదరులకందరికిని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.


నిజమైన బాప్తీస్మము


● "బాప్తీస్మమిచ్చు వ్యక్తి విశ్వసించిన వ్యక్తిని నీటిలో పూర్తిగా సమాధి చేయాలి". - (మత్తయి. 3:16; అపో.కార్య. 8:38-39).

● "నమ్మి + బాప్తీస్మము = రక్షణ" - (మార్కు. 16:16).

● క్రీస్తు సువార్త ద్వారానే మనము పిలువబడి నమ్మి బాప్తీస్మము పొందవలెను. - (మార్కు. 16:16; అపో.కార్య. 18:12-13; 2 థెస్స. 2: 14).

● "బాప్తీస్మము యిచ్చువారు" "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి" బాప్తీస్మము యివ్వవలెను. - (మత్తయి. 28:18-20).

* (ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని నమ్మవలెను). - (మత్తయి. 3:16-17; యోహాను. 15:26).

● "బాప్తీస్మము పొందువారు" యేసుక్రీస్తు నామమున అనగా ఆయన అధికారమున మరియు ఆయన ఆజ్ఞ చొప్పున  పొందుచున్నాని గ్రహించవలెను. - (అపో.కార్య. 2:38).

* (తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్మవలెను) *

●  "ఒక్కటే శరీరమైన క్రీస్తు సంఘము లోకి క్రీస్తు చేత చేర్చబడెదరు" - (ఎఫెసీ. 1:23; 4:4-6; కొలస్స. 1:18; 1 కొరింథీ. 12:13; అపొ.కార్య. 2:47; రోమా. 16:16). 



తప్పుడు బాప్తీస్మము


● చిలకరింపు, కుమ్మరింపు, జెండా, విశ్వసించిన వాడు తనకి తానుగా నీటిలో దిగి రావడము....etc ఇవి వాక్యానుసారమైన బాప్తీస్మము కాదు.

● "నమ్మి + రక్షణ = బాప్తీస్మము" - వాక్యము లేదు.

● దేవుడు కనబడి స్వరము, దర్శనములోని చెపితేనే బాప్తీస్మము తీసుకునే కార్యక్రమము తప్పుడు బాప్తీస్మము.

● నేటి మత శాఖలలో "బాప్తీస్మము యిచ్చువారు" "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి"(మత్తయి. 28:18-20).
ఈ యేసుక్రీస్తు ఆజ్ఞను కొట్టివేసి, క్రీస్తు బోధ యందు లక్ష్యము ఉంచక, ముగ్గురు వేరు వేరు అని నమ్మటము లేదు.

● ఇక్కడ మత శాఖలతో "బాప్తీస్మము పొందువారు" వారి కల్పనా బోధలకు చెవి యొగ్గి, యేసుక్రీస్తు నామమునే పొందాలి (అపో.కార్య. 2:38) అని నమ్మి పొందినది తప్పుడు బాప్తీస్మము. 

(తండ్రి లేడు, కుమారుడు లేడు, ఆత్మ లేడు. అంతా యేసుక్రీస్తు నామమే అనేవారి బోధ సరియైనదికాదు).

●  క్రీస్తు బోధను, ఆయన శరీరమును విభజన చేసి వారు ఏర్పాటు చేసుకొనిన శాఖలలోనికి  వారి చేత చేర్చబడెదరు.


హెచ్చరిక ★ 


నా ఆత్మీయ సహోదరులారా, ఈ దినమే మీరు ఏ బోధ చేత, ఏ విధముగా బాప్తీస్మము పొందియున్నారో మీకు మీరు  వ్యక్తిగతముగా పరీక్ష చేసుకోమని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో మిమ్మలి కోరుతున్నా.. 

మీ ఆత్మీయ సహోదరుడు, 
మనోహర్ (KM).

"బాప్తీస్మము ఏ నామములో పొందాలి"..? In which name we should baptized

బాప్తీస్మము ఏ నామములో పొందాలి"..?.


నా తోటి పరిశుద్ధులకు, మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నేటి క్రైస్తవ్యములో ఈ ప్రశ్న అనగా "బాప్తీస్మము ఏ నామములో పొందాలి?" అనేది చాల మంది ఆలోచనలను చిందరవందర చేయుచున్నది.


మత్తయి 28: 18-20👇
అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.


★ "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తీస్మము" (మత్తయి. 28:17-20). ఈ అధికారము ఎవరికి ఇవ్వబడినదో ఆలోచన చేద్దాము ★

● యేసు మరణమును జయించి తిరిగిలేచిన తరువాత ఆరోహణము కాక ముందు "మత్తయి. 28:17-20" ఈ ఆజ్ఞను శిష్యులుకి చెప్పారు.


● "ఇది బాప్తిస్మము యిచ్చేవారికి యేసు ఇచ్చే ఆజ్ఞ అని అంగీకరించాలి".


● "లోకాంతము వరకు క్రీస్తు సువార్తకి లోబడి, క్రైస్తవులు కాగోరువారు, క్రీస్తు బోధకు లోబడి ఆయన సంఘ సభ్యులు కాగోరువారు లోబడవలసిన ప్రాముఖ్యమైన ప్రాథమికమైన  ఆజ్ఞ ఇది".


● "సమస్త జనులు" అనగా "ప్రతి జాతి వంశములోని వారిని శిష్యులుగా చేయాలి" - (గలతి. 3:28).


● శిష్యులుగా చేయబడిన వారికి "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మమియ్యాలి".


● బాప్తిస్మము యిచ్చేవారు మరియు తీసుకునే వారు "యుగసమాప్తి" వరకు ఆ ఆజ్ఞకు లోబడాలి.


● దీన్ని కాదనే అధికారము ఎవరికి లేదు.


● "యేసు బోధ అంతయు తండ్రి యొద్ద నుండే ఇవ్వబడినది అని నీవు గుర్తించవలసిన అవసరము ఎంతో ఉంది". - (యోహాను. 12:49-50; 16:13-15; హెబ్రీ. 1:1-2).


యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము  


◆ "యేసుక్రీస్తు నామము" అనగా "యేసుక్రీస్తు అధికారము లేదా యేసుక్రీస్తు ఆజ్ఞ" అని అర్ధం.

◆  నామము  గ్రీక్ లో ὄνομα - Onoma(ఓనోమా)  

◆ ఓనోమా అనగా a name, authority, cause 


» యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. - (అపో.కార్య. 2:38; 10:48; 22:16).

» యేసుక్రీస్తు నామమున  ప్రార్ధన. - (యోహాను. 16:23; అపో.కార్య. 9:14; 22:16).

» యేసుక్రీస్తు నామమున ద్వారా సూచక క్రియలు. - (అపో.కార్య. 4:30).

» యేసుక్రీస్తు నామమున నిత్య జీవము. - (1 యోహాను. 5:13).

» యేసుక్రీస్తు నామమున స్వస్థత. - (అపో.కార్య. 4:10).

» యేసుక్రీస్తు నామమున తీర్పు. - (యోహాను. 3:16-18; 12:48).

» యేసుక్రీస్తు నామమున సువార్త ప్రకటన. - (అపో.కార్య. 8:12).

» యేసుక్రీస్తు నామమున మాట్లాడుట మరియు బోధించుట. - (అపో.కార్య. 4:17-18; 9:27-29; 5:28,40).

» యేసుక్రీస్తు నామమున దయ్యముల నాజ్ఞాపించుట. (అపో.కార్య. 16:18).

» యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ. - (అపో.కార్య. 10:43).


👉 క్రొత్త నిబంధన సువార్త ప్రకటింపబడుచుండగా యేసుక్రీస్తు నామమున అనేక కార్యములు జరిగినవి.


🔖యేసు నామమున అనగా "యేసు అధికారము" చొప్పున జరిగాయి అనగా పైన విషయములో ఏది పరిశీలన చేసినా అన్నీ "యేసు అధికారముననే" జరిగినవి.


పాత నిబంధన గ్రంథములో కొన్ని ఉదాహరణలు.

◆ ​రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు - (ఎస్తేర్. 8:10).

◆ అహాబు పేరట తాకీదు - (1 రాజులు. 21:8).

రాజు పేరట అనగా రాజు యొక్క అధికారమును తెలియజేస్తుంది.

◆ దయ్యముల పేరట బలి. - (లేవి.కాండ. 17:7) అనగా దయ్యముల అధికారము.


యేసు మాటల్లో కొన్ని ఉదాహరణలు.

◆ "నేను(యేసు) తండ్రి నామమున వచ్చియున్నాను".  - (యోహాను.5:43).

◆ "తండ్రి నా(యేసు) నామమున పంపబోవు పరిశుద్ధాత్మ". - ( యోహాను. 14:26).

మరల మన అంశము లోనికి వస్తే, యేసుక్రీస్తు నామమున అనగా యేసుక్రీస్తు అధికారము లేదా యేసుక్రీస్తు ఆజ్ఞ  అని అర్థము.


🔎తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి అను యేసుక్రీస్తు ఆజ్ఞను "ప్రభువైన యేసుక్రీస్తు నామమున" అధికారమును సమన్వయ పరిచి చూడవలెను.

❎ "యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి" (అపో.కార్య. 2:38; 4:7లో) అనేది బాప్తీస్మము యిచ్చేవారికి ఇవ్వబడిన ఆజ్ఞ కాదు.

✅"తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తీస్మము" (మత్తయి. 28:18-20) అనేది బాప్తీస్మము యిచ్చేవారికి ఇవ్వబడిన ఆజ్ఞ.


గమనిక ★ 


యేసుక్రీస్తు అధికారమున "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తీస్మము" పొంది క్రీస్తు సంఘములో(Church of Christ) ప్రభువు చేత చేర్చబడుము. దీన్ని అంగీకరిస్తే నీ ఆత్మ రక్షింపబడుతుంది లేదా నాశనములో నీవు యిoతకు ముందే ఉన్నావు.


హెచ్చరిక ★ 

"మత్తయి. 28:18-20" ప్రకారముగా బాప్తిస్మము పొందేవారు "అపొ.కార్య. 2:38; 8:16; 19:5" ప్రకారముగా పొందినవారై యుంటారు.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్.

"బాప్తీస్మము ఎలా తీసుకోవాలి"..? How can we baptized


💌 అంశము : "బాప్తీస్మము ఎలా తీసుకోవాలి"..?

ప్రియమైన నా సహోదరీ,సహోదరులారా!!
మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు తెలియజేయుచున్నాను.

రక్షణ పొందుటకు నమూనా


❣ ముందుగా - క్రీస్తును గూర్చిన మాటలు (వాక్యము) "వినాలి". - (యోహాను. 5:24; అపో.కార్య. 8:5-6; రోమా 10:17; ప్రకటన. 1:3).
❣ వినిన వాక్యమునందు(మాట) "విశ్వాసముంచాలి". - (యోహాను. 8:24; అపో.కార్య. 16:31;  రోమా. 10:17; హెబ్రీ. 11:6).
❣ పాపక్షమాపణ నిమిత్తమై "మారుమనస్సు" పొందాలి. - (లూకా. 13:3; అపొ.కా. 2:38; 17:30).
❣ యేసుక్రీస్తు దేవునికుమారుడని, ప్రభువని "ఒప్పుకోవాలి" - (మత్తయి. 10:32-33; యోహాను. 20:31; రోమా. 10:10).
❣ రక్షింపబడుటకు "బాప్తీస్మము" పొందాలి. - (మార్కు. 16:16; అపో.కార్య. 2:38; 22:16; 1 పేతురు. 3:21).
❣ ప్రభువు చేత "క్రీస్తు సంఘముగా చేర్చబడాలి". - (అపో.కార్య. 2:47).



A). క్రీస్తులోనికి బాప్తీస్మము వాక్యానుసారముగా తీసుకోవాలనుకొనేవారు - యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకోవాలి.

రోమీయులకు 10:9
అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 

1పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ "హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి"; 


B). క్రీస్తులోనికి బాప్తీస్మము వాక్యానుసారము తీసుకోవాలనుకొనేవారు- యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి.

యోహాను సువార్త 20:31
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

అపొస్తలుల కార్యములు 8:37 
ఫిలిప్పు-నీవు పూర్ణహృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను.అతడు-"యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను".


C). ఒకనిని నీటితో(నీటిలో) పాతిపెట్టుటకు అవసరమైన నీళ్ళు ఉండాలి.

యోహాను సువార్త 1:28
యోహాను బాప్తిస్మమిచ్చుచున్న "యొర్దానునదికి" ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. 

యోహాను సువార్త 3:23
సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున "నీళ్లు విస్తారముగా" ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. 

నీరు సమృద్ధిగా ఉన్నచోట యోహాను బాప్తీస్మమమిచ్చినట్లుగా చూస్తున్నాము.



D). బాప్తీస్మము తీసుకునేవారు అలాగే ఇచ్చేవారు కూడా ఇద్దరు *నీటిలోనికి* దిగాలి.

మత్తయి సువార్త 3:16
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 

అపొస్తలుల కార్యములు 8:37,38
ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. 


E). తండ్రి(యెహోవా),కుమారుని (యేసుక్రీస్తు), పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీస్మము ఇవ్వాలి.

మత్తయి సువార్త 28:19
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు


F). ఈ లోకంలో ఒక మనిషిని ఏవిధంగానైతే మట్టిలో పాతిపెడతారో అదే విధంగా బాప్తీస్మము పొందాలనుకునే వారిని నీటిలో(నీటితో) పాతిపెట్టబడి తిరిగి లేపబడాలి.

రోమీయులకు 6:4
కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము "బాప్తిస్మము వలన" మరణములో పాలు పొందుటకై "ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి".
కొలొస్సయులకు 2:12
మీరు "బాప్తిస్మమందు" ఆయనతో కూడ "పాతిపెట్టబడినవారై" ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా "ఆయనతో కూడ లేచితిరి".


G). బాప్తిస్మము పొందుగోరువారు మునుపు క్రీస్తు మరణము "లోనికి" పాలు పొంది, క్రీస్తు సంఘముగా చేర్చబడిన వారు చేతనే నీటిలో సమాధి చేయబడాలి. 

అపో.కార్యములు 2: 41
కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

అపో.కార్యములు 18: 8
ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.

అపో.కార్యములు 19: 4-5
అందుకు పౌలుయోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాస ముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.

◆ గమనిక ◆ 


1) చనిపోయిన వారిని నిలువబెట్టి పాతిపెట్టరు.

2) చనిపోయినవారిని కూర్చోబెట్టి పాతిబెట్టరు.

3) చనిపోయినవారిని బోర్ల పడుకోబెట్టి పాతిపెట్టరు.

4) చనిపోయిన వారిని పొడినేలమీద ఉంచి గుప్పెడు మట్టి చల్లి దీనిని పాతిపెట్టేసినట్టే అని అనరు.

★ "చనిపోయినవారిని వెనుకాతలా పడుకోబెట్టి దేహము కనబడకుండా మట్టితో పాతిపెడతారు".

అలాగే పాపముల నిమిత్తం ఈ లోకంలో చనిపోయి ఆత్మసంబంధముగా జీవించాలని నీటి ద్వారా బాప్తీస్మము పొందాలనుకునేవారు కూడా నీటిలో వెనకాతలా పడుకోబెట్టి దేహము కనబడకుండా నీటితో(నీటిలో)పాతిపెట్టబడి తిరిగి లేపబడాలి.

* బాప్తీస్మము ఒక్కటే అని (ఎఫెసీ 4:5) లో గ్రంథము తెలిజేస్తుంది *

వాక్యానుసారము తీసుకుంటే అది మన జీవితానికి ఒక్కసారే.

వాక్యము చెప్పినట్టు కాకుండా మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తీసుకున్నా అది మీ దృష్టిలో బాప్తీస్మము అవుతుందేమో కాని దేవుని దృష్టిలో అది బాప్తీస్మము కాదని గమనించాలి.

◆ హెచ్చరిక ◆


» మీరు పొందిన బాప్తీస్మము వాక్యానుసారముగా తెలియజేసినట్టు పాతిపెట్టబడ్డారా..??

ఇది ఆత్మసంబంధమైనది గనుక బాప్తీస్మము తీసుకునే విషయములో అజాగ్రత్తగా ఉండకండి.

"బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?" (Why should we baptized)


అంశము: "బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?"

నా తోటి సహోదరీ,సహోదరులారా!!
సంఘములో ఏ పనియైనా చేయుటకు ముందుకువచ్చే అనేకమంది అతి ప్రామఖ్యమైన ఆత్మసంబంధమైన ఈ విషయానికి (బాప్తీస్మము) వచ్చేసరికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..?

సంఘములో చాలా మంది యవ్వనప్రాయం దాటినవారున్నా అందులో బాప్తీస్మము తీసుకున్నవారు ఒకవంతు కూడా లేకపోవడానికి కారణం బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలో తెలియకపోవడమే;


● “బాప్తిస్మము” అనగా పాతిపెట్టుట, క్రొత్తజన్మ, ముంచుట అని అర్ధము. (రోమా 6:3; యోహాను 3:3; 1 పేతురు 3:21).

● ఇది “బాప్టిజో” అనే గ్రీక్ పదము తర్జుమా చేయబడినది.

∆ "పాతిపెట్టుట" అనగా “పూడ్చు, పాఁతివేయు, దిగవేయు” అని అర్ధము.
∆ "క్రొత్త జన్మ" అనగా “నూతనముగా పుట్టుట” అని అర్ధము.
∆ "ముంచుట" అనగా “మునుగజేయు” అని అర్ధము.
∆ "కప్పెట్టడం" అనగా “పూడ్చడం” అని అర్ధము.


 "అసలు బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?" 


1) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని రాజ్యము(సంఘము)లో ప్రవేశించగలరనేది యేసుక్రీస్తు వారు తెలియజేసిన విశేషమైన సమాచారం.

యోహాను సువార్త 3:3
అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

2) బాప్తీస్మము ద్వారానే మనం ఇంతకుముందు చేసిన పాపములు క్షమింపబడతాయనేది పేతురు గారు తెలియజేసిన విశేషమైన సమాచారం.

అపొస్తలుల కార్యములు 2:38
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి;

3) బాప్తీస్మము పొందినవారు మాత్రమే  పరిశుద్థాత్ముని పొందుకోగలరు.

అపొస్తలుల కార్యములు 2:38
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

4) బాప్తీస్మము పొందినవారు మాత్రమే  దేవుని ఉగ్రతనుండి తప్పించబడగలరు.

రోమీయులకు 5:9
కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

5) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడగలరు.

రోమీయులకు 3:24
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

6) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పవిత్రులుగా తీర్చబడగలరు.

1 యోహాను 1:7
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

7) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పరసంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును పొందుకోగలరు.

ఎఫెసీయులకు 1:3
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

8) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తులో జీవించగలరు..

1యోహాను 4:9
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

9) బాప్తీస్మము పొందినవారు మాత్రమే  దేవుని పిల్లలుగా పిలవబడతారు.

యోహాను సువార్త 1:12
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

10) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తు మరణ, సమాధి,పునరుద్థానము (సువార్త)ను గూర్చి ఇతరులకు ప్రకటించగలరు.

1 కొరింథీయులకు 11:26
మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

11) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సమయమందును అసమయమందును వాక్యమును ఇతరులకు ప్రకటించగలరు.

2 తిమోతికి 4:2
వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.

12) బాప్తీస్మము పొందినవారు మాత్రమే అపవాది నోటనుండి తప్పించబడతారు.

1పేతురు 5:8
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

13) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సంఘముగా పిలువబడతారు.

1 కొరింథీయులకు 1:2
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

14) బాప్తీస్మము పొందినవారు మాత్రమే తన కుమారుని (క్రీస్తు) సహవాసములో చేర్చబడతారు.

1 కొరింథీయులకు 1:9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

15) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తు జ్ఞానమును తెలుసుకోగలరు.

1 కొరింథీయులకు 2:7
దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

16) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తును ధరించుకోగలరు.

గలతీయులకు 3:27
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

17) బాప్తీస్మము పొందినవారు మాత్రమే యేసుక్రీస్తును ప్రభువుగా వారి హృదయాలలో ప్రతిష్టించుకుంటారు.

1 పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

18) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ఈ లోకసంబంధులపైన జయము పొందినవారు.

 1 యోహాను 4:4
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.

19) బాప్తీస్మము పొందినవారు మాత్రమే తండ్రి ఎవరో,కుమారుడు ఎవరో తెలుకోగలరు.

యోహాను సువార్త 17:3
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

20) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ప్రభుబల్లలో పాలుపొందుతారు.

1 కొరింథీయులకు 11:23
"నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని".

21) బాప్తీస్మము పొందినవారు చేసే  ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు.

యోహాను సువార్త 4:24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

22) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ఇతరులకు బాప్తీస్మము ఇవ్వగలరు.

మత్తయి సువార్త 28:19
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు

23) బాప్తీస్మము (పునర్జన్మ) పొందినవారు మాత్రమే నూతనస్వభావమును పొందుకోగలరు.

తీతుకు 3:5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన(పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

24) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సాతాను అధికారమునుండి దేవునివైపు తిరిగినవారు.

అపొస్తలుల కార్యములు 26:18
"వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి,"..
నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

25) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సాతానుయొక్క మరణభయమనే దాస్యత్వమునుండి విడిపింపబడినవారు.

హెబ్రీయులకు 2:14,15
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

26) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ధనాపేక్షను విసర్జించగలరు.

మొదటి తిమోతికి 6:10
ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

 27) బాప్తీస్మము పొందినవారు మాత్రమే శరీరక్రియలను విసర్జించగలరు.

గలతీయులకు 5:19-21: ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

28) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేబబడినవారు.

కొలొస్సయులకు 2:12
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.

29) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సంఘములో పెద్దలుగాను పరిచారకులుగాను ఉండుటకు అర్హులు.

1తిమోతికి 3:1-8:
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.

30) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పరలోక పౌరసత్వం కలవారు.

ఫిలిప్పీయులకు 3:20
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

బాప్తీస్మము పొందినవారు మాత్రమే రక్షించబడతారు.

మార్కు సువార్త 16:16
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.



★ గమనిక ★

 ◆ బాప్తీస్మము గూర్చి నీ కుటుంబ సభ్యుల అనుమతి గాని, నీ స్నేహితుల అనుమతి గాని, నీ రక్త సంబంధుల అనుమతి గాని అవసరము అని భావిస్తున్నావ..?

 మత్తయి సువార్త 19:29
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.

మత్తయి సువార్త 10:37
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.

గలతీయులకు 1:15-16
తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో (మూలభాషలో-రక్తమాంసములతో) నేను సంప్రతింపలేదు.

"సాతాను" (satan)

💌 అంశము: సాతాను (satan).

మీ అందరి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

» హీబ్రూ లో -  "שָׂטָ֔ן" - (śā·ṭān).
» గ్రీక్ లో - "Σατανς" - (satanas).
» ఇంగ్లీష్ లో - "SATAN".
» తెలుగు లో - "సాతాను".

★ "సాతాను" అనగా అర్ధము - "విరోధి" -(1 పేతురు. 5:8).



★ సాతాను యొక్క పేర్లు మరియు స్వభావము ★


A). "అబద్ధికుడు" - (యోహాను. 8:44).

› ఆది నుండి వాడు అబద్ధికుడు మరియు అబద్ధమునకు తండ్రి.
◆ అబద్ధమాడు ప్రతి ఒక్కరికి తండ్రి.  (ప్రకటన. 3:9).

B). "నరహంతకుడు" - (యోహాను. 8:44).

› ఆదిలోనే ఆదాముకు, హవ్వకు ఆత్మీయముగా మరణము కలుగ చేశాడు - (ఆది. 3:10-11).
> కయీను చేత హేబెలును శారీరకముగా చంపించెను. - (ఆది. 4:8; 1 యోహాను. 3:12).
◆ నరుని హత్య చేయు ప్రతి ఒక్కరూ సాతాను పిల్లలు. - (1 యోహాను. 3:10).

C). "యుగ సంబంధమైన దేవత" - (1 కోరింధీ. 4:4).

> ఈ లోక దేవత సాతాను - (నాయ్య. 10:6; 1 సమూయేలు. 31:10; యెషయా. 37:38; అపొ.కార్య. 19:24-28).
> ప్రతి విగ్రహము వెనుక సాతాను ఉన్నాడు.
◆ విగ్రహారాధనతో కూడిన ఏ కార్యక్రమమునకైనా వారు సాతాను పూజ చేస్తున్నారు.

D). "అపవాది" - (ప్రకటన. 2:10).

> అపవాది అనగా నిందించువాఁడు.
> నిందలు వేసేవాడు - (ప్రకటన 12:10; ఆది. 3:5; యోబు. 1:3).
◆ తోటి వారి మీద నిందలు వేసే కార్యక్రమము అపవాది పనే.

E). "శోధకుడు" - ( మత్తయి. 4:3).

> పాపము చేయుటకు ప్రేరేపించువాడు.
> దేవుని యెడల నుండే విశ్వాసపు విషయములో పాపము చేయుటకు శోధన చేస్తాడు - (యోబు. 1:13-19; 2:7-10; 1 దెస్స. 3:5).
> భార్య ద్వారా శోధిస్తాడు - (ఆది. 3:6; అపొ.కా. 5:1-4)
★ తల్లితండ్రులు ద్వారా పిల్లలుకు కోపము రేపి, అసత్యములో నడవమని చెప్పి, ఇష్టము కాని వాటిని చేయమంటూ శోధిస్తాడు.
> లోక స్నేహితులు ద్వారా శోధిస్తాడు - (1 కొరింది. 15:33).
> అవిధేయుడైన భర్త చేత శోధిస్తాడు.

దురాశ + శోధన = పాపము = మరణము (యాకోబు. 1:12-15).

F). "తంత్రగొండి" - ( 2 కొరింది. 2:11; ఎపేసి. 6:11).
> భేదములు, మోసము, కుయుక్తి కలుగజేయువాడు.

G). "వాయు మండల సంబంధమైన అధిపతి". - (ఎఫెసి 2:2; 6:11).

◆ సాతాను స్థానము వాయుమండలము.

H). "చీకటి రాజ్యానికి రాజు" - ( మత్తయి 12:26).

> అంధకార సంబంధమైన రాజ్యము - (కొలస్సి. 1:13).
◆ యేసు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్మి, విశ్వసించని ప్రతి వారూ చీకటి రాజ్యములో ఉన్నవారే.

I). "లోక అధికారి" - (యోహాను. 14: 30).

> వాస్తవానికి మన సృష్టికర్త తండ్రియైన యెహోవా దేవుడే. అయన చేసిన ఈ అద్భుతమైన లోకమును సాతాను లోబరుచుకొన్నాడు.
> లోకమును అందలి సమస్తమును ప్రేమించువాడు దేవునికి దూరస్తుడు - (1 యోహాను. 2:16).
◆ క్రైస్తవులైన మనము లోకములో ఉన్నవారుని "చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపునకు" త్రిప్పాలి. - (అపో.కార్య 26:16-18).

J). "దుష్టుడు". - (మత్తయి. 13:18-19).

> దుష్టుడు అనగా "దురాత్ముడు, దుష్టశీలుడు మరియు చెడ్డవాడు".
> వాక్యము విని మరి గ్రహిచలేని వారు యొక్క హృదయము లోనుండి విత్తబడిన వాక్యమును ఎత్తుకుపోయేవాడు.
◆ దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు - (1 యోహాను. 5:17).


★ "సాతానును ఎదిరించుట ఎట్లు?" ★

● దేవునికి లోబడాలి.
● అపవాదిని(సాతాను) ఎదిరించాలి.
● అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. - (యాకోబు. 4:7).


◆ ( ఎఫెసీయులకు. 6: 10-18) ◆

∆  శిరస్సు - శిరస్త్రాణము - రక్షణ.
∆  చాతికి - మైమరుపు - నీతి.
∆ కుడి చేతికి - ఆత్మఖడ్గము - వాక్యము.
∆ ఎడమ చేతికి - డాలు - విశ్వాసము.
∆ నడుమునకు - దట్టి - సత్యము.
∆ పాదములకు - జోడు - సిద్ధ మనస్సు.


★ "సాతాను కడపటి స్థితి" ★

» మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. - (ప్రకటన. 20:10).
» యెడమవైపున ఉండువారిని చూచిశపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని(అనగా-సాతనుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని లోనికి పోవుడి. - (మత్తయి. 25:41).
» గురుగులు  అగ్నిలో కాల్చివేయబడును - (మత్తయి. 13:24-30; 36-43).


"క్రైస్తవ జీవితములో సాతాను స్థానము పాదములు క్రింద". - (రోమా. 16:20).


గమనిక:

సాతాను జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకములో ఒక దేవదూత అనే అపోహ కలిగి ఉంటే ఈ క్రింది అంశమును క్లిక్ చేసి చూడుము.

సాతాను పరలోకములో ఉండే ఒక దేవదూత..? ) CLICK

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన

దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)

💌 అంశము: స్త్రీ పాత్ర (Role of women).

నా తోటి సహోదరీ, సహోదరులారా!
మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు  నామములో నా వందనములు.

నా ప్రియులారా!!
ఆది యందు మన తండ్రియైన దేవుడు స్త్రీ లేనప్పుడే అనగా ఆదాము ఒంటరిగా ఉన్న దినములలో(ఆది. కాండము. 2:18) అయన తన ఆలోచనలను, ఆజ్ఞలను ఆదాముకి జారీచేశారు.

● (ఆది. కాండము. 2:17).
"నీవు"(ఆదాము) మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు.

● (ఆది. కాండము. 3: 17).
"నేను(దేవుడు) నీకు(ఆదామునకు)  ఆజ్ఞాపించిన....."

∆ ఆదాముకి మాత్రమే ఇవ్వబడిన ఈ ఆజ్ఞను కాస్తా స్త్రీ నిర్మాణము (ఆది.2:21-23) పిమ్మట...
అపవాది(ఘట సర్పము) ఇలా కలిపేశాడు. అదేమనగా, "మీరు తినకూడదా అని". (ఆది. కాండము. 3:1) మరియు "మీరు చావనే చావరు" అని (ఆది. కాండము. 3:4).

∆ అప్పుడే దేవుని ఆలోచనలకు, ఆజ్ఞకి కల్పితము జరిగింది అంటే వాస్తవానికి ఆదాము హవ్వ కి చెప్పి ఉండవచ్చు కారణము "మేము తినవచ్చు"(ఆది.కాండము. 3:2); " మీరు చావకుండునట్లు".(ఆది. కాండము.3:3).

∆ దేవుడైన యెహోవా ఈ ఆజ్ఞను "స్త్రీ"(హవ్వ) కి ఇచ్చినట్టుగా చూడలేము.

∆ "హవ్వకి దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము చెప్పాడు".  దీనిని బట్టి మన తండ్రియైన దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలలో స్త్రీ నడిపింపు మీద లేదా స్త్రీ మీద నాయకత్వ కార్యక్రమము  పురుషుడులో పెట్టాడు.

∆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను హవ్వ(స్త్రీ) మాత్రమే తిని ఉంటే ఇంత సమస్య ఉండేది కాదేమో. హవ్వ తిన్నాక కూడా ఏమి జరగలేదు.
" ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు ఆదామునకు ఇచ్చెను, అతడుకూడ తినెను" (ఆది. కాండము 3:6)

 ∆ ఆదామునకు మాత్రమే ఇవ్వబడిన ఆ ఆజ్ఞను మీరి దేవునికి లోబడక, స్త్రీకి లోబడుట చేతనే "వారిద్దరి కన్నులు తెరవబడి, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు" (ఆది. కాండము. 3:7).

★ ఫలాలను తినకూడదు అనే విషయములో స్త్రీ(హవ్వ) ఎక్కడ తనని  తిరస్కరిస్తాదేమోనని ఆలోచన చేసిన పురుషుడు(ఆదాము) తన నాయకత్వమును స్త్రీకి అప్పగించేసాడు.
★ పురుషుడు మీద నాయకత్వమును చేసే కార్యక్రమము స్త్రీకి దేవుడు ఇవ్వలేదు.
★ ఆదాము తన దోషములును దాచిపెట్టాడు - (యోబు. 31:33).
★ "ఆదాము నిబంధన మీరినాడు". - (హోషేయా. 6: 7).
★ ఆదాము, హవ్వ ఇరువురు అవిధేయ స్థితిలోనికి వెళ్లిపోయారు.

భర్త అవిధేయుడు అయినచో భార్య అతని మీద నాయకత్వము చేయకూడదు.
"ఆమె పవిత్ర ప్రవర్తన బట్టియు, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన అతనిని రాబట్టబడవచ్చును. - (1 పేతురు 3:2).
■ ఆదిలో స్త్రీ(హవ్వ) తన భర్తను(ఆదాము) నడిపించే అధికారమును తీసుకొంది.
పురుషుడును మాటలతో ఆకర్షించడానికి, మాటలతో అధికారము చేయుటకు, మాటలతో నడిపించుటకు స్త్రీని అలా ఉద్దేశించి దేవుడు రూపకల్పన చేయలేదు.

★ "స్త్రీ పురుషునికి  ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు సెలవు లేదు" - (1 తిమోతి 2:12). ఆదిలో స్త్రీ చేత ఆదాముకి ఉపదేశము, అధికారము ఏదెను తోటలో జరిగింది.
★ ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. (1 తిమోతి. 2:14).

* ఏదెను తోటలో సర్పము(అపవాది) ఆదామును మోసపరచలేకపోయాడు.

∆  ఇందుచేతనే స్త్రీ ఉపదేశము చేయుటకు, అధికారము చేయుటకు ఆమెకు సెలవు లేదు అని దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరిచారు.



■ "స్త్రీ నాయకత్వములో శాపము" ■


లోకమునకు శాపమును కొని తెచ్చినది స్త్రీ నాయకత్వమే.


​*"మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు", నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా "దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును". - (మలాకీ. 2:2).

A). హవ్వ యొక్క కుటుంబమునకు శాపము కొని తెచ్చింది. - (ఆది. 3:15)
B). ఆదామునకు శాపము కొని తెచ్చింది - (ఆది. 3:19)
C). తనకు శాపము కొని తెచ్చుకుంది - (ఆది. 3:16).
D). భూమికి శాపము కొని తెచ్చింది - (ఆది. 3:17-18).


* పురుషుడు మీద స్త్రీ నాయకత్వము చేస్తే ఆ కుటుంబమునకు శాపము వస్తుంది కాని దీవెన రాదు. పురుషుడు నాయకత్వములో మాత్రమే దేవుని యొక్క దీవెన కలదు *


∆ యెహోవా దేవుడు ఏదెను తోటలో స్త్రీని ఒక విధముగా రూపకల్పన చేస్తే ఆమె పురుషుడుకు ఉపదేశము, అధికారము చేయుట వలనే ఆమె ద్వారా అందరికి శాపము వచ్చింది.



■ భార్య - భర్తల మధ్య పాత్ర ■



A). అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి - (1పేతురు. 3:1).

B). సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. - (ఎఫెసీ. 5: 24).

C). పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. - (ఎఫెసీ. 5: 25).

D). పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు - (ఎఫెసీ. 5:28)

E). యెక్కువ "బలహీనమైన ఘటమని" భార్యను సన్మానించి - (1 పేతురు 3:7)

F). జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. - (1 పేతురు 3:7).

G). భార్యను లేదా భర్తను దూరముగా పెట్టె కార్యక్రమమును దేవుడు అంగీకరించడు. - (1 కోరింది 7:5).

∆ ఇక్కడ కూడా భర్తకి లోబడమని వాక్యము సెలవు ఇస్తుంది. కాని అధికారము లేదా నాయకత్వము చేయమని సెలవు ఇవ్వడము లేదు.


★ ఒక వేళ భర్త అవిశ్వాసి అయినచో వాక్యము చూడు "(1 కోరింది 7:13-14)" వచనములు.
★ ఒక వేళ భర్త అవిధేయుడు అయినచో వాక్యము చూడు "(1 పేతురు. 3:2)" చూడుము.



■ కుటుంబములో స్త్రీ పాత్ర ■


A). స్త్రీ ఇంట ఉండి పనిచేసికొనువారుగా ఉండాలి. (తీతుకు. 2:4).

* (జాబ్ చేయాలా, వద్దా అనేది గ్రంథము సెలవు ఇవ్వలేదు) *

B). భర్తకి లోబడాలి, నాయకత్వము చేయకూడదు. - (1 పేతురు 3:1).

C). పిల్లలును మాత్రమే దేవునిలో "నడిపించే" కార్యక్రమమును తీసుకోవాలి. - (ద్వితీయో. 6:7-9; సామెతలు. 22:6; తీతుకు. 2:4-5).

D). సత్యము కొరకు పోరాటము చేస్తున్న తన భర్తకు స్త్రీ మంచి సహకారై (ప్రిస్కిల్ల వలె) ఉండాలి. - (అపొ.కార్య 18:26; రోమా 16:4).

E). "పురుషుడు వచ్చి భార్యను హత్తుకొనిన యెడల వారిరువురు ఏక శరీరమైయుందురు కావున వారి ఆలోచనలు, పనులు, నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి" - (ఆది. 2:24; మత్తయి. 19:5; మార్కు. 10:7; ఎపేసి. 5:31).

∆ ఏదెను తోటలో ఆదాము కుటుంబము "ఒక్క ఆలోచన యందు, ఒక్క పని యందు, ఒక్క నిర్ణయము యందు" స్థిరముగా లేకపోవటం వలెనే వారు ఏదెను తోట నుండి బహిష్కరించబడ్డారు.



■ "సంఘము 'లో' స్త్రీ పాత్ర" ■ 


సంఘము - దేవుని మందిరము - (1 తిమోతి. 3:15)
ఉపదేశము అనగా బోధ చేయుట.
అధికారము అనగా బాధ్యత, దొరతనము చేయుట, ఆధిపత్యము కోరుట.

★  "ఏదెను తోటలో అనగా పండ్లు తినక ముందు స్త్రీకి పురుషునికి సృష్టి మీద సమాన అధికారాలిచ్చాడు". - (ఆది కాండము 1:28) కాని ఒకరి మీద ఒకరికి అధికారం ఇవ్వలేదు.

★ ఎప్పుడైతే హవ్వ(స్త్రీ) పురుషుని(ఆదాము) మీద అధికారం చేసి దేవుని ఆజ్ఞను తృణీకరించిందో ఆనాడే దేవుడు స్త్రీ మీద అధికారం పురుషునికి ఇచ్చాడు. పురుషుని యెడల స్త్రీకి వాంఛ కలుగజేసాడు. - (ఆది. కాండము. 3:16).

A). సంఘము 'లో' స్త్రీలు ఏమి అలంకరించుకోకూడదో, ఏమి అలంకరించుకోవాలో దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరుస్తున్నారు - (1 తిమోతి. 2:9-10; 1 పేతురు. 3:3-4).

B). సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. - (1 తిమోతి. 2:11; 1 కోరింది. 14:35).

C). సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండాలి, ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు ఆమెకి సెలవు లేదు - (1 కోరింది. 14:34; 1 తిమోతి. 2:12).


★ స్త్రీకి సంఘము 'లో' ఉపదేశము, అధికారము చేయుటకు సెలవు లేదని ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది. - (1 కొరింది. 14:34).

* ఉదా: లేవి గోత్రములో ఉండే మూడు వంశస్థులు మాత్రమే దేవుని మందిరము పై అధికారము కలదు.

1) గెర్షోను - (సంఖ్యా. 3:17-18,21; 3:25-26)
2) కహాతు - (సంఖ్యా. 3:17,19; 3:29-32)
3) మెరారి - (సంఖ్యా. 3:17,20; 3:36-38)
మన తండ్రియైన దేవుడు "ఆ ముగ్గురుకి ఆయా వంశస్థుల వారికి" మూడు రకాల పనులు ఇచ్చారు.

నా సహోదరులారా!! ధర్మశాస్త్రములో ఏ స్త్రీ కూడా దేవుని పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము లోనికి వెళ్లి సేవ చేసినట్టుగా గ్రంథములో రుజువులు లేవు కారణము అవి లేవి యాజకులకు(పురుషులు) మాత్రమే అప్పగింపబడింది.

పాత నిబంధనలో భక్తిపరులైన స్త్రీలు, ప్రవక్తిలు ఉండవచ్చు కానీ వారు పురుషులు మీద నాయకత్వము వహించినట్టుగా రుజువులు లేవు. ప్రవక్తిరాండ్రుకి దేవుడు ఎలా చెపుతే అలాగునే చేసారు తప్ప పురుషులు మీద అధికారము చేయలేదు.

D) భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు స్త్రీ జాగ్రత్త వహించాలి - (తీతుకు. 2:3).

E). సంఘములో యవ్వన స్త్రీలు, తమ పిల్లలకి ఉపదేశము చేయవచ్చు - (తీతుకు. 2:4-5).

F) క్రీస్తులోనికి బాప్తిస్మము పొందు కార్యక్రమములో స్త్రీ, పురుషుడు అని బేధము లేదు - ( గలతి. 3:27-28).

F). స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడు మాత్రమే అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి.



★ "స్త్రీ ఎందుకు మౌనము వహిస్తూ, సంఘములో ఉపదేశమును, అధికారము చేయకూడదు.."?.

1) మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? - (1 తిమోతి 2:13).
2) ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. - (1 తిమోతి 2:14).
3) "స్త్రీకి శిరస్సు పురుషుడు" - ఇది దేవుని క్రమము (శిరస్సు అనగా అధికారమునకు సూచన) - (1 కొరింది. 11:3)


★ మొదటి సృష్టిలో జరిగిన పరిస్థితి అనగా " స్త్రీ నాయకత్వములో శాపము కలిగింది". మరల క్రీస్తు నందు నూతన సృష్టిలో (2 కొరింది. 5:17) అలా జరుగకూడదు అనే దృష్టితో దేవుడు ఆమెకి సెలవు ఇవ్వలేదు.




■ "సువార్త 'లో' స్త్రీ పాత్ర" ■


Note:- స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడుకు మాత్రమే అనే విశేషమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి.

A) ప్రిస్కిల్ల తన భర్తయైన అకులతో పౌలుకొరకు సువార్త విషయములో ప్రాణం యివ్వడానికైనా తెగించింది - (రోమా 16:4).
ప్రిస్కిల్ల అకులయు ఒక సువార్తకునికి బోధ చేస్తున్నారు. ఇది సంఘము యొక్క పరిస్థితి కాదు. ప్రిస్కిల ఇంటి వాతావరణములో జరిగిన కార్యక్రమము. - (అపో.కార్య. 18:24-26).
B) యూనీయ - (రోమా 16:7)
C) త్రుపైనాకు, త్రుఫోసాకు, పెర్సిసు - (రోమా 16:12)
D) యూలియా - (రోమా 16:15)
E) నేరియకు సహోదరి - (రోమా 16:15)
F) ప్రభువైన యేసును సేవించడంలో తనతో ప్రయాసపడిన యువొదియ, సుంటుకే సహాయము చేయుడని పౌలు కోరాడు - (ఫిలిప్పీ 4:2, 3)
G) నుంఫాకు తన యింటిని సంఘ కూడిక స్థలంగా యిచ్చింది - (కొలొస్స 4:15).


★ అన్యులైన పురుషులుకి స్త్రీలకు ఆమె సువార్త ప్రకటన చేయచ్చు (మత్తయి 28:19). కానీ దేవుని మందిరములో బోధ చేయుటకు ఆమెకి సెలవు లేదు

ప్రభువును సేవించడంలో అతడు వారితో కలిసి పని చేశాడు అందుకు వాత్సల్యముతో పౌల్ గారు వారికి వందన వచనాలను పంపారు.

ఆనాడు స్త్రీలు యేసుతో మరియు అపొస్తలతో కలసి సమానముగా సంఘములో ఉపదేశము(బోధ) చేసినట్టుగాని, పురుషులపై వారు అధికారం చేశారనిగాని, సంఘపు ఆరాధనలో నడిపించారనిగాని, పురుషులుతో కూడా సమానముగా నాయకత్వము వహించారు అని గాని నేటి క్రైస్తవ్యం తీర్మానించకూడదు.
 - (లూకా. 6:6; లూకా. 4:21; మత్తయి. 13:53; యోహాను. 6:59; మత్తయి. 21:23 యోహాను. 7:14; యోహాను. 8:2; అపో.కార్య. 5:21; 13:15; 16:31; 1 తిమోతి 2:8).


【 గమనిక 】


◆ పురుషులుకి అసాధ్యమైనది స్త్రీలకు మాత్రమే సాధ్యమైనది దేవుడు ఇచ్చిన వరమే గర్భఫలము. - (కీర్తన 127:3)
◆ పరిశుద్ధ గ్రంథములో స్త్రీ యొక్క పరిచారము  అమోఘమైనది.
◆ కుటుంబము పాత్రలో, తోటి పరిశుద్ధలకు(సంఘము) పరిచారము చేయుటలో, పిల్లలను పెంచే విషయములో, సువార్త పాత్రలో స్త్రీలకి సాటియైన వారు ఎవరు లేరు.

★ స్త్రీ పాత్ర లేకుండా పురుషుడు నాయకుడు కాలేడు.
★ పిల్లలు భక్తిపరులుగా తీర్చిదిద్దబడాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.
★ ఆమె గృహము ఆశీర్వాదించబడాలి అంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.
★ భర్త నుండి ప్రేమను పొందుకోవాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఉంది.

【 హెచ్చరిక 】

 దేవుడు ఒకేఒక్క విషయములోనే అనగా పురుషుడు మీద అధికారము, ఉపదేశము చేయుటకు ఆమెకి నాయకత్వము ఇవ్వలేదు.

● నా ప్రియమైన సహోదరి, దయచేసి దేవుడు ప్రభువుసంఘములో  ఇవ్వని నాయకత్వమును నీవు తీసుకొని, నీవు మరియు నీ కుటుంబము శాపమునకు గురి కావద్దు.

"దేవుని క్రమములో పురుషుడు పాత్ర" Click HERE 

మీ ఆత్మీయ సహోదరుడు,
💌 మనోహర్ బాబు గుడివాడ

"మెల్కీసెదెకు" (Melchisedec)

"మెల్కీసెదెకు" మరియు "యేసుక్రీస్తు"



నా తోటి సహోదరీ,సహోదరులారా!
మీకు మన రాజులుకి రాజునైన, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు  నామములో నా వందనములు.


మెల్కీసెదెకు


●  "మెల్కీసెదెకు మహోన్నతుడగు దేవుని యాజకుడు" - (హెబ్రీ. 7:1).
● అతడు మొదట "నీతికి రాజనియు" - (హెబ్రీ. 7:2).
● "సమాధానపు రాజు లేదా షాలేము రాజు" అని అతని పేరుకి అర్ధము. - (హెబ్రీ. 7:2).
● "రాజు మరియు యాజకుడు" - (హెబ్రీ. 7:1-2).
● "బైబిల్ లో అతని వంశావళి లేనివాడును" - (హెబ్రీ. 7:3).
● "ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడు" - (హెబ్రీ. 7:3).
● "దేవుని కుమారుని పోలియున్నాడు". - (హెబ్రీ. 7:3).
● "అహరోను (లేవి గోత్రము) సంబంధించిన వంశావళి లేనివాడై". - (హెబ్రీ. 7:6).
● "లేవి యాజకులు కన్నా ఎక్కువ గలవాడు" - (హెబ్రీ. 7:6-9).
● "నిరంతరము యాజకుడుగా ఉన్నాడు" - (హెబ్రీ. 7:3).


యేసుక్రీస్తు 


● "క్రీస్తు మహోన్నతుడగు దేవుని ప్రధానయాజకుడు" - (హెబ్రీ. 6:20; 8:1-2).
● "నీతి నియమాలను ప్రేమించువాడు". - (హెబ్రీ. 1:8).
● "సమాధానకర్తయగు అధిపతి" - (యెషయా. 9:6).
● "రాజు మరియు యాజకుడు" - (జెకర్యా. 6:12-13).
● దైవ సంబంధముగా... శరీరసంబంధమైన ఆరంభం లేని వాడు (జగత్తుపునాది వేయబడక మునుపునుండే ఉన్నవాడు) - (యోహాను. 1:1-3;14; ఎఫెసి 1:2-6; 1 పేతురు. 1:20; హెబ్రీ. 1:2-9).
● "అనాదిగా ఉన్నవాడు" లేదా "ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడు" - (యోహాను. 8:58; ప్రకటన. 1:8).
● క్రీస్తు - "సజీవుడగు దేవుని కుమారుడు". - (మత్తయి 16:16; మత్తయి. 17:5; మార్కు. 9:7; లూకా. 9:35; 2 పేతురు. 1:17; హెబ్రీ. 1:5).
● "యూదా గోత్రమునందు పుట్టిన వాడు". - (మీకా. 5:2-4; మత్తయి. 2:5; హెబ్రీ. 7:14).
● "అహరోను మరియు మెల్కీసెదెకు  కన్నా హెచ్చయినవాడు". - (హెబ్రీ. 7:26-28).
● " నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడు" - (హెబ్రీ. 7:17; 24-25).


◆ మన తండ్రియైన దేవుడు మెల్కీసెదెకు అనే అద్భుతమైన పాత్రను అబ్రాహాము కాలములోనే ప్రత్యక్షము చేసారు.
◆ దేవుడు క్రీస్తు లోనికి జరుగబోయే కార్యక్రమమును సూచనగా ఇది చేసారు.
◆ లోతు సొదొమ ప్రాంతములో కాపురమున్న దినములలో (ఆది. 14:12) నలుగురు రాజులు వచ్చి సొదొమపై దండెత్తి అక్కడున్న వారితో పాటు లోతు కుటుంబమును మరియు ఆ పట్టణపు ఆస్తిని, భోజన పదార్దములను పట్టుకొనిపోయిరి. (ఆది.14:10-11).
◆ ఈ విషయము హెబ్రీయుడైన అబ్రాహామునకు తెలిసిన పిమ్మట ఆయన, తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెండుగురిని వెంటబెట్టుకొని ఆ రాజులను సంహరించి, వారి ఆస్తిని వారికి ఇప్పించెను. (ఆది. 14:13-17).
◆ సొదొమ రాజు అబ్రాహామును కలుసుకొనుటకు "షావే లోయ" కి వచ్చినప్పుడు, అబ్రాహామును ముందుగా షాలేము రాజైన మెల్కీసెదెకు కలుసుకొనుటకు "రొట్టె, ద్రాక్ష రసము" తీసుకొనివచ్చెను. (ఆది. 14:17-18).


◆ మెల్కీసెదెకు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. - (ఆది. 14:18).
◆ మెల్కీసెదెకు హెబ్రీయుడైన అబ్రాహాము కన్నా ఘనుడు కాబట్టి  దేవుని యాజకుడైన మెల్కీసెదెకు తక్కువవాడైన అబ్రాహామును ఆశీర్వదించాడు" అటు పిమ్మట లేవీయులైన యాజకులకు మాత్రమే చెల్లించవలసిన దశమ భాగమును మెల్కీసెదెకునకు అబ్రాహాము ఇచ్చాడు. - (ఆది.14:19-21).

అబ్రాహామును కలసిన పిమ్మట మరి చరిత్రలో ఎక్కడ కూడా మెల్కీసెదెకు (రాజు+యాజకుడు) కనబడ లేదు.

మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు "లేవి తన పితరుని గర్భములో ఉండెను". - (హెబ్రీ. 7:10).

 *గమనిక:- వాస్తవానికి యాజకత్వము అనేది అహరోను సంతతి నుండే అనగా లేవి గోత్రము నుండే ప్రారంభము అయింది. (నిర్గమ 28:1-3). లేవియులు యాజకులైయున్నప్పుడే ప్రజలకు ధర్మ శాస్త్రము ఇవ్వబడింది - (హెబ్రీ. 7:11).

A) రాజుగాను, యాజకత్వముగాను చేసే విశేషమైన ఏర్పాటు దేవుడు "క్రీస్తునకు" కట్టబెట్టుటకు ముందుగానే మెల్కీసెదెకులో ఏర్పాటు చేశారు.
B) దీనిని బట్టే మెల్కీసెదెకు అనే క్రమమును దేవుడు కలుగ చేసాడు. ఈ క్రమములో ఉండే విశేషమైన సంగతి "యాజకత్వము చేసేవాడు రాజై ఉంటాడు" మరియు "యాజకుడు రాజ్య పాలనా చేస్తూ ఉంటాడు". ఇది భూరాజులుకి సబంధిచినది కాదు.
C) భూరాజులు దేవుని మందిరములో యాజకత్వము కోరుకుంటే శాపగ్రస్తులు అవుతారు.
*ఉదా. "ఉజ్జియా "యూదులకు రాజు - (2 దిన. 26:16-21).

★ యూదా గోత్రము నుండి వచ్చిన - (మికా. 5:2-4; మత్తయి. 2:5).
క్రీస్తు రాజై, యాజకత్వము చేసే అనుమతి పొందుటకే "మెల్కీసెదెకు క్రమమును" దేవుడు ఏర్పాటు చేశారు.
ఈ క్రమము చొప్పుననే "క్రీస్తు" 'రాజు మరియు యాజకుడై యున్నాడు". - (హెబ్రీ. 5:6)

★ మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు. (కీర్తనలు. 110:4)

★ క్రీస్తు పరలోకము నుండి రాజై, యాజకత్వము చేసే ప్రభువు కాబట్టి ఇప్పుడు క్రీస్తును విశ్వసించిన వారిని దేవుని కృపను బట్టి రాజులైన యాజకసమూహముగా చేశాడు. (1 పేతురు 2:9; ప్రకటన 5:10).


గమనిక:-

∆ పాత నిబంధనలో అబ్రాహామునకు కనబడిన మెల్కీసెదెకు (రాజు + యాజకుడు).ఆయన క్రీస్తు వారు కాదు.
∆ క్రీస్తు వారు "మెల్కీసెదెకు క్రమము చొప్పున" రాజు + యాజకుడు అయ్యారు కానీ మెల్కీసెదెకే క్రీస్తు కాదు.
∆ క్రీస్తు వారు మెల్కీసెదెకు అనుటకు గ్రంథములో ఎటువంటి వాక్యాధారములు లేవు. క్రీస్తు వారు శరీరము ధరించి మెల్కీసెదెకులా వచ్చారు అని అనుకుంటే మరల ఆయన తన ప్రజలు పాపముల కొరకు రెండో మారు వచ్చారని అనుకోవాలా..?
∆ పాత నిబంధనలో ప్రవక్తలద్వారా, భక్తుల ద్వారా యేసును గూర్చిన ప్రవచనములు ఆయన రెండవసారి శరీరధారియై వస్తాడనుటకు సూచనగా ఉన్నాయనుకోవాలా...?

ఈ అంశమును చదువుతున్న మీరే ఆలోచన చేయండి. నేటి క్రైస్తవ్యములో దుర్బోధను ఖండిచండి.

ఇట్లు,
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన

"నిజమైన ఆ ఒక్క సంఘమును గుర్తించడం ఎలా.? (How can I identified ONE true CHURCH)


“నిజమైన ఆ ఒక్క సంఘమును  గుర్తించడం ఎలా..?”



★   నీకు తేలుసిన "ఆ ఒక్కసంఘము" ఏమిటి?

●    “సంఘము” అనే పదం గ్రీక్ (ఎక్క్లీసియా) బాష నుoచి కలిగిది.


» దీని అర్థము “పరిశుద్ధులుగాఉండుటకు పిలువబడినవారము”. - (I కొరింథీ 1:2).

●  సంఘము క్రీస్తు యొక్క“శరీరము” - (కొలొస్స 1:18).
●  సంఘము క్రీస్తు యొక్క “వధువు” – (ఎఫెసీ 5:22-27).
●  సంఘము దేవుని యొక్క“కుటుంబము” – (I తిమోతికి ౩:15).
●  సంఘము “సత్యమునకు స్తoభము” మరియు “ఆధారము” – (I తిమోతికి ౩:15).



★    నీకు తెలిసిన ఆ "ఒక్కసంఘమునకు" స్థాపకుడు ఎవరు?

●     క్రీస్తు వాగ్దానం చేసినాడు “ఆయన తన సంఘమును” కట్టుదును అని– (మత్తయి 16:18).
●     క్రీస్తు “తన సంఘము” కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించినాడు –(అపొస్తలుల కార్యములు 20:28).
●     క్రీస్తు తన "సంఘము”అను శరీరమునకు  ఆయనే(క్రీస్తు)  శిరస్సు – (కొలొస్స 1:18).
●     క్రీస్తు తన "సంఘము”అను శరీరమునకు  ఆయనే ఆధ్యాత్మికత వహిస్తున్నారు - (కొలొస్స 1:18).



★    నీకు తెలిసిన "ఆ ఒక్కసంఘము" ఎప్పుడు ప్రారంభమైనది?

●   జెరూషలేము యొక్క చివరి రోజులలో “ఆయన(క్రీస్తు) సంఘము” వాగ్దానం చేయబడిది – (యెషయా 2:2-4)
●   “ఆయన(క్రీస్తు) సంఘము” బాప్తీస్మమిచ్చు యోహాను రోజుల సమీపంలో ఉంది –(మత్తయి 3:1-2).
●   “ఆయన(క్రీస్తు) సంఘము” బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని క్రీస్తు తన శిష్యులకు ముoదుగా చెప్పాడు – (మార్కు 9:1).
●   క్రీస్తు “తన సంఘము” ప్రారంభము కొరకు శిష్యులతో పలికిన మాటలు “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు” - (అపొస్తలుల కార్యములు 1:8).

●      పైన తెలిపిన అన్ని విషయములు “పెంతెకొస్తు పండుగ” దినమున “క్రీస్తు సంఘము(Church of Christ) ”ప్రారంభమైనది. (క్రీ.శ.33) - (అపొస్తలుల కార్యములు 2:40-42; 46-47).



★    నీకు తెలిసిన "ఆ ఒక్కసంఘము" ఎలా వర్ణించబడింది?

●  ప్రభువు సంఘము -(అపొస్తలుల కార్యములు 20:28).
●  దేవుని సంఘము – (Iకొరింథీ 1:2).
●  క్రీస్తు యొక్క శరీరo -(ఎఫెసీ 4:12).
●  క్రీస్తు సంఘము – (రోమా16:16).



★    నీకు తెలిసిన దేవుడు ఆ "ఒక్క సంఘమునకు" ఏమి ఇవ్వాలి అని యత్నము చేయుచున్నారు?

●  క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “పాపముల యెక్క క్షమాపణ అవకాశం” - (ఎఫెసీ1:17).
●  క్రీస్తు సంఘము లో ఉన్న వారికి  “మోక్షము” - (2 తిమోతి 2:10).
●  క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి “ముక్తి” - (కొలస్సీ 1:14).
●  క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి “ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు” - (ఎఫెసీ 1:3).
●  క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి  “రక్షణ”  -(అపొస్తలుల కార్యములు 2:47).


మీ ఆత్మీయులు

Romans 16: 16
The churches of Christ salute you.

రోమీయులకు 16:16
క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

దేవుని చిత్తము (The will of God)

క్రైస్తవుల యెడల "దేవుని చిత్తము"


మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా వందనములు.

◆ "దేవుని చిత్తము" అనగా ఆయన పిల్లల యెడల ఉండే  "దేవుని మనసు" లేదా "దేవుని మది" అర్ధము.


» "ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు లక్షణములు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని" - ( ఎఫెసి. 1:5; గలతి. 5:22).

» "నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవారుగా ఉండాలని" - (హెబ్రీ. 1:9).

» క్రీస్తు సువార్త ద్వారా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన విషయములో" (1 కొరింథీ. 1:2). "పరిశుద్ధులగుటయే" అనగా ప్రతి క్రైస్తవుడు "జారత్వమునకు దూరముగా ఉండాలని."- ( 1 థెస్స. 4:3).

» "పరిశుద్ధత, ఘనత విషయములో తన శరీరమును ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకొనగోరువారై ఉండాలని".  - ( 1 థెస్స. 4:5).

» క్రైస్తవులు ఇతరులతో అజ్ఞానముగా మాట్లాడక "యుక్తప్రవర్తన గలవారై" (మేలు చేయువారై) ఉండాలని. - (1పేతురు. 2:15).

» క్రీస్తు తన స్వరక్తము ఇచ్చి కట్టిన ఏకైక ఒక్క క్రీస్తు సంఘముగా (CHURCH OF CHRIST) ఉండాలని (మత్తయి. 16:18; అపొ.కార్య. 2:41-42; 20:28; ఎఫెసి. 1:23; కొలస్స. 1:18; 1కొరింథీ. 12:27).

» "ప్రతి క్రైస్తవుడు "లోకము దాని ఆశయు" అనే విషయములో నశించి పోవాలి అనేది దేవుని చిత్తము కాదు". - (1యోహాను. 2:16-17; మత్తయి. 18:14).

» "మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయాలి". - (1 పేతురు. 2:9).

» "దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండే ఆత్మ సంబంధమైన కార్యములు ఇది అది చేతమని చెప్పుకొనవలెను" - (యాకోబు. 4:15).

» ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో "దేవుని చిత్తము" - (1థెస్స. 5: 18).


● నా ప్రియులారా... "ప్రభువు చిత్తమైతే" ఒక ఎకరం పొలం, బిల్డింగ్, కారులు కొందామనుకుంటున్నాను మరియు "ప్రభువు చిత్తమైతే" పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను అనకూడదు.

» అవన్నీ మన శరీర ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంది కాని దానికి "ప్రభుచిత్తమని" "దేవుని చిత్తమని" పేరు పెట్టకూడదు.


∆ "సమస్తము అంతటి మీద దేవుడు మనకి అధికారమిచ్చారు మరియు మన పాదముల క్రింద వాటిని ఉంచారు". - (కీర్తన 8:6-8).

పరిశుద్ధులు దీనిని ఎరుగక శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ దేవుడు ఇచ్చే విలువవైన జీవితములో దేవుని చిత్తమును పక్కన పెట్టి వృథాగా ఖర్చు చేస్తున్నారు.


యేసుక్రీస్తు వారి సాక్ష్యము:
"నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని". - (యోహాను 6:39)

★ ఆయన పరలోక సేనయెడలను, భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. - (దానియేలు. 4: 35).

★ ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని "పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము" చేయువాడే ప్రవేశించును. - (మత్తయి. 7:21).

మీ ఆత్మీయా సహోదరుడు,
💌 KM

వందనములు (Greet or Salute)


💌 అంశము: "వందనములు"

మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

క్రైస్తవ సంఘములలో అనేక మంది, వారి తోటి పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు కొందరు మరణాత అని, షాలోమ్ అని, మరికొందరు ప్రైస్ ది లార్డ్ అని, ఇంకొంతమంది వందనములు అని....etc

ఇలా ఒకరికొకరు చెప్పుకోవడము చూస్తూ ఉంటున్నాము. వాస్తవానికి మన తోటి పరిశుద్ధులను కలసినప్పుడు మనము ఏమి చెప్పాలో పరిశుద్ధ గ్రంథము నుండే ఆలోచన చేద్దాము.

 ★ "మరణాత" ★ 

● గ్రీక్ 'లో' - "Μαράναά" (మరణాత).
● ఇంగ్లీష్ 'లో' - "maranatha".
● తెలుగు 'లో' - "ప్రభువు వచ్చుచున్నాడు", "ప్రభువా రమ్ము", "ప్రభువు వచ్చియున్నాడు", మరియు "మరన్ఆత".

● పరిశుద్ధ గ్రంథము అంతటిలో "మరన్ఆత" అనే పదమును 📖1కోరింథీయులకు. 16: 22📖 మాత్రమే చూడగలము.
● ప్రభువును ప్రేమింప లోకము అందలి వాటిని ప్రేమించే వారికి "1యోహాను. 2:16" పౌల్ గారు హెచ్చరిక చేయుచున్నాడు అంతే కాని ఆత్మీయ పలకరింపు మాత్రము కాదు.

■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు  "మరన్ఆత" అని సంబోధించాలని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.


★ "షాలోమ్" ★ 

● హీబ్రూ 'లో'-  "שָׁלוֹם‎". (šā·lō·m)
● గ్రీక్ 'లో' - "Εἰρήνην". (eirēnēn)
● ఇంగ్లీష్ 'లో' - "peace".
తెలుగు 'లో' - "శాంతి, సమాధానము"

● "(నిర్గమ. 14:14; సంఖ్యా. 6:26; యెషయా. 26:12; యోహాను. 14:17; కోలాస్సి. 3:15)".

◆ శాంతి అనగా అర్ధము "ఆనందము, హాయి".

■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు  "షాలోమ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.


★ "ప్రైస్ ది లార్డ్" ★ 

● హీబ్రూ 'లో' - "השבח לאל".
● గ్రీక్ 'లో' - "Αἰνετε τὰ Κύριον".
● ఇంగ్లీష్ 'లో' - "Praise The Lord".
● తెలుగు 'లో' - " దేవుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి".

◆ "లేయా" - యెహోవాను స్తుతించుట - (ఆది. కాండము. 29:35).
◆ కీర్తనల గ్రంథ రచయిత - యెహోవాను 'లేదా' దేవుని స్తుతించుట - (కీర్తనల 7:17; 33:2; 104:35; 115:18; 116:19; 148:1,7).
◆ నెబు కద్నెజరు  దేవుని స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాడు. - ( దానియేలు 4: 37).
◆ "ప్రభువును స్తుతించుడి" - ( రోమా 15:11; యెషయా 12:4).

◆ "స్తుతించుట" అనగా అర్ధము "పొగడుట, అభివర్ణించు, కీర్తించు, స్తోత్రముచేయు, కొనియాడు..."

★ ఇరుగురు కలుసుకొని ఒకరికొక్కరు "ప్రైస్ ది లార్డ్" అని అనుకొనుట వలన నిజముగా  దేవుని అభివర్ణించు కార్యక్రమము జరుగదు.

■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు  "ప్రైస్ ది లార్డ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.


★ "వందనములు" ★ 

● గ్రీక్ 'లో' - "ἀσπάσασθε" (అస్పసస్తే).
● ఇంగ్లీష్ 'లో' - "Salute, Greet".
● తెలుగు 'లో' - "వందనములు లేదా శుభము".

★  "వందనములు" అనగా అర్ధము " అభివాదనము, నమస్కారము, అభినందనము...".

★ యోసేపు రాజుగా ఉన్నపుడు అతని సహోదరులు వచ్చి అతనికి "వందనము" చేశారు - (ఆది. కాండము. 42:6).
★ మోషే తన మామమైన యిత్రో కి వందనము చేసేను - (నిర్గమ 18:5-7).
★ రోమా సైనికులు యేసుకి వందనము చేశారు - (మార్కు 15:18).
★ మరియ వచ్చి ఎలీసబెతుకు వందనము చేసెను. - (లూకా 1:40).
★ పౌల్ గారు ప్రిస్కిల్లకును, అకులకును, వారి యింట ఉన్న సంఘమునకును, ఎపైనెటుకును, బహుగా ప్రయాసపడిన మరియకును, పౌలు తన తోడి ఖైదీలైన అంద్రొనీకుకును మరియు యూనీయకును, అంప్లీయతునకు, ఊర్బానుకును మరియు స్టాకునకును, అపెల్లెకును మరియు అరిస్టొబూలు ఇంటివారికిని, హెరోది మరియు యోనుకును,  నార్కిస్సు ఇంటి వారికిని, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును మరియు త్రుఫోసాకును, ప్రియురాలగు పెర్సిసునకును, రూపునకును, అసుంక్రితుకును, ప్లెగోనుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును,
పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని,
నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును, తెర్తియు,గాయియు,క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారని  పౌలు గారు తెలియపరుచుట - (రోమా 16:1-23).

వందనము అనేది ఒక ఆత్మీయ పలకరింపు.

■ "ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి". - (ఫిలిప్పీయులకు 4: 21).
■ "పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు". - ( 2కోరింథీయులకు 13: 13).


"పవిత్రమైన ముద్దుతో వందనములు"

★ "ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి". - ( 1పేతురు 5: 14).
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి. - ( 1థెస్సలొనికయులకు 5: 26)
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. - ( రోమీయులకు 16: 16)
Salute one another with an holy kiss.


★ "ముద్దుతో" అనగా "పరిశుద్ధలైన సహోదరులు యొక్క నిజమైన ప్రేమకి ఇది ఒక చిహ్నము వంటిది".

💌 యూదులు యొక్క ఆచారము వారు తోటి సహోదరులుకి వందనము చెప్పినప్పుడు పవిత్రమైన ముద్దుతో పెట్టి చెప్పేవారు - ( ఆది. కాండము. 45:15;  నిర్గమ 18:7; 1 సమూయేలు 10:1;  మత్తయి 26:49; లూకా 22:48; 1 కోరింది 16:20; 2 కోరింది 13:12).

✏ పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే. - (2థెస్సలొనికయులకు 3: 17).

✏ మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. - ( హెబ్రీయులకు 13: 24).

◆ నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడైయుండును గాక. - (తీతుకు 3:15).

👪 "క్రీస్తుసంఘములన్నియు"
మీకు వందనములు చెప్పుచున్నవి.  (రోమీయులకు 16: 16) 👪

● The "churches of Christ" salute you.

✏ ఈ అంశమును చివరి వరకు ఓపికతో చదివిన మీకు నా వందనములు

మీ ఆత్మీయ సహోదరుడు.
 💌 KM

"మూడు రాత్రులు - మూడు పగలు" (Three Days & Three Nights)

అంశము : "మూడు రాత్రులు - మూడు పగలు".


నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.


నా ప్రియులారా, ఈ అంశము గూర్చి పరిశీలన చేసే ముందుగా మొదట ముఖ్యముగా ఈ క్రింది వాటి గూర్చి బాగుగా తెలియాలి. అదేమనగా,

యూదులు కాలమాన ప్రకారముగా "మొదట రాత్రి, తరువాత పగలు" వస్తాయి.
"06:00p.m. TO 06:00a.m. మరియు "06:00a.m TO 06:00p.m"

★  "ఒక్క రోజు" - [ 06:00p.m to 06:00p.m ] - (లేవి.కాండము." 23:32.)


■ "విశ్రాంతి దినము మరుసటి దినము" - "ఆదివారము".
■ "విశ్రాంతి దినము" - "శనివారము".

● "విశ్రాంతి దినము గడిచిపోయిన..." - "ఆదివారము" - (మత్తయి 28:1).
● "విశ్రాంతిదినము గడచిపోగానే"... - ఆదివారము - (మార్కు 16: 1).

● "సిద్ధపరుచు దినమునకు మరుసటి దినము" - " శుక్రవారము" - "పులియని రొట్టెలు పండుగ" - (మత్తయి 27:62; లేవి.కాండము 23:6)
● "సిద్ధపరుచు దినము" - "గురువారము" -(లుకా 23:54; మార్కు 14:12-14).


● "పస్కా పండుగను" ఆచరిoచినది మరియు సిద్ధపరిచినది - "గురువారము" - (లుకా 22:7;13; లేవి.కాండము 23:5).


  "మూడు రాత్రులు - మూడు పగలు యొక్క వివరణ"


"గురువారము రాత్రి" :
*సాయంకాలమైనప్పుడు యేసు తన పండ్రెండుమంది శిష్యులతో కూడ  "పస్కా భోజనము" ఆచరించెను. - (మత్తయి 26:20-25;  మార్కు 14:17-21; లూకా 22:14-15).

 *ఆ రాత్రి యేసు వారు అపొస్తలులతో కలసి "ప్రభువు బల్లను" ఆచరించెను - (మత్తయి 26:26-29; మార్కు 14:22-25; లూకా 22:16-21).
*ఆ రాత్రి ఇస్కరియోతు యూదా చేతనే ప్రధానయాజకులకి యేసు వారు అప్పగింపబడ్డారు - (మత్తయి 26:31-75; మార్కు 14:32-72; లూకా 22:39-62).


"గురువారము పగలు" :
*యేసును పొంతిపిలాతునకు అప్పగించిరి - (మత్తయి 27:1-2; మార్కు 15:1-2; లుకా 23:1-2).

* పొంతిపిలాతు నుండి హేరోదు దగ్గరకు పంపుట మరియు  పిలాతునొద్దకు మరల పంపుట - (లుకా 23:6-12).

*ప్రధానయజకులును, పెద్దలును- బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించమని 'లేదా' సిలువవేయుమని జనులను ప్రేరేపించిరి - (మత్తయి 27:20-24; మార్కు 15:9-15; లూకా 23:18-25).

*యేసును సిలువవేసినప్పుడు "పగలు తొమ్మిది" గంటలాయెను. - (మార్కు 15:25).

* "మధ్యాహ్నము  మూడు గంటలు" సమయములో "యేసు బిగ్గరగా కేకవేసి మ్రాను మీద ప్రాణము విడిచెను"  - (మత్తయి 27:45-50; మార్కు 15:33-37; లూకా 23:44-46; యోహాను 19:30).


గమనిక:

ద్వితియోపదేశకాండము 21:21-23
అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.

** మ్రాను మీద వ్రేలాడదీయ బడినవారుని ఆ దినమున వానిని పాతిపెట్టాలి. గురువారము పగలు సాయంత్రము 6 కి సమాప్తి అవుతాది. యేసును 6 లోపు సమాధి చేయాలి **

*యేసును -తొలిచిన రాతి సమాధిలో ఉంచెను - (మత్తయి27:57-60; మార్కు 15:43-46; లూకా 23:50-53; యోహాను 19:38-42).


❣ నోట్ ❣
∆ గురువారము  పగలు అనగా శుక్రవారం రాత్రి రాకుండా ఆరు గంటలు లోపు సమాధి చేసారు కావున ఇది ఒక పగలుగా తీసుకోవాలి. 


"శుక్రవారము రాత్రి + పగలు" :

*"సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి.." - (లూకా 23:56).

*పస్కా సిద్ధపరుచుటకు మరుసటి రోజున కావలి వారు రాతికి ముద్రవేసి, సమాధిని భద్రముచేసిరి. - (మత్తయి 27:62-66).


❣ నోట్ ❣
∆ శుక్రవారము రాత్రి + పగలు = "ఒక దినము".


"శనివారము రాత్రి + పగలు" :

*ఈ దినము విశ్రాంతి దినము - (నిర్గమ. కాండము 31:12-16; లేవి.కాండము 23:3).

*ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి. - (లూకా 23:56).


❣ నోట్ ❣
 శనివారము రాత్రి + పగలు = "ఒక దినము".


"ఆదివారము రాత్రి" :

* "విశ్రాంతి దినము గడిచిపోయిన..." - "ఆదివారము" - (మత్తయి 28:1).
* "విశ్రాంతిదినము గడచిపోగానే"... - ఆదివారము - (మార్కు 16: 1).
* "ఆదివారమున తెల్లవారుచుండగా..." - ( లూకా 24:1).
* "ఆదివారమున పెందలకడ ..." - (యోహాను 20:1).

∆ ఆదివారము సాయంకాలమున శిష్యులు మధ్యకి యేసు వచ్చెను - (యోహాను 20:19).

∆ ఆ దినమందే అనగా ఆదివారమున ఎమ్మాయు అను గ్రామములో ఇద్దరు మనుషులు (ఒకడు క్లెయొపా) యేసుతో సంభాషణ మరియు "ఆదివారమునకి (నేటికి) మూడు దినములాయెను" - (లూకా 24:13-21).


❣ నోట్ ❣
 ఆదివారము రాత్రి

** గురువారము పగలు + ఆదివారము రాత్రి = ఒక దినము **

మనోహర్_నవీన 
మత్తయి 12: 40 
యోనా "మూడు రాత్రింబగళ్లు" తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు
"మూడు రాత్రింబగళ్లు" భూగర్బములో ఉండెను.

Download PDF File

"ఈస్టర్" (Easter)

ఈస్టర్ 

నా ప్రియ సహోదరీ సహోదరులారా మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు

💥 EASTER (ఈస్టర్) ఇంగ్లిష్ పదము అనేది ఇస్తార్ (ISHTAR) అనే గ్రీక్ పదము నుండి కలిగింది.

👉 క్రీస్తు పూర్వముననే ISHTAR అని బబులోను "దేశపు ఆకాశరాణినీ"  పూజలు చేసేవారు

👉 (యిర్మియా 7:18) నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.

👉 (యిర్మియా 44:7-19) - "కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు– ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటిబిడ్డలును యూదా మధ్యనుండకుండ నిర్మూలముచేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు? మీకు మీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్క రింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు? వారు యూదాదేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీపితరులు చేసిన చెడుతనమును యూదారాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా? నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీపితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.౹ కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీకు కీడుచేయునట్లు, అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించు కొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందినవారుగాను ఉందురు.౹ యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.౹ కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహా సమాజముగా కూడినవారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి– యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,౹ మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.౹ మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.౹ మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా"

ISHTAR నీ హిబ్రులో ASTAROTH (అస్తారోత్ దేవత) అని
 
 👉 సొలొమోను అప్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను(1రాజులు 11:5)
  
👉 అతని ఆయుధములను అప్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేతాను పట్టణపు గోడకు తగిలించిరి(1సమూయేలు 31:10)

ఫోనిషియన్ల చంద్ర దేవత, ప్రకృతిలో నిష్క్రియ సూత్రాన్ని సూచిస్తుంది, వారి ప్రధాన  దైవం సూర్య దేవుడు మరియు పురుష దేవతతో ( న్యాయా 10:6; 1 సముయే. 7:4; 12:10 ) తరచుగా సంబంధం కలిగి ఉంటారు. ఈ పేర్లు తరచుగా బహువచనంలో అష్టరోత్, & బాలిమ్. బహుశా వివిధ విగ్రహాలు లేదా దేవతల యొక్క విభిన్న మార్పులను సూచిస్తాయి. ఈ దేవతను జిడోనియన్ల అష్టోరెత్ అని పిలుస్తారు. ఆమెను అకాడియన్ల ఇష్తార్ అని మరియు గ్రీకులు & అస్టార్టే ( 1 రాజులు 11:5; 11:33; 2 రాజులు 23:13; యిర్మియా 44:17). సౌలు కాలంలో ఫిలిష్తీయుల మధ్య ఈ దేవత ఆలయం ఉంది (1 సముయే 31:10). ఇష్తార్ పేరుతో, ఆమె అస్సిరియన్ల గొప్ప దేవతలలో ఒకరు. ఫోనిషియన్లు ఆమెను అస్టార్టే అని పిలిచేవారు. రాజైన సోలోమోను మొదటగా ఈ విగ్రహ ఆరాధనను పరిచయం చేశాడు ( 1 రాజులు 11:33) యెజెబెల్ యొక్క 400 మంది యాజకులు బహుశా దాని సేవలో నియమించబడ్డారు (1 రాజులు 18:19). దీనిని "ఆకాశరాణి" అని పిలిచేవారు (యిర్మియా 44:25)

🐰 ఈ దేవత చిహ్నము EGGS BUNNY eggs Bunny


EASTER (ఈస్టర్) అనే పదము బైబిల్లో ఉందా?


నేటి క్రైస్తవ్యములో ఈస్టర్ అనే పదమునకు అనేక అర్ధాలు ఉండవచ్చు కానీ వాటి అన్నింటిని పరిశుద్ద గ్రంథము కొట్టివేస్తుంది అదేమనగా

💭 ఈస్టర్ అనే పదము బైబిల్ అంతటిలో "అపో.కార్య. 12:3-4" వచనము లోనే మాత్రమే చూడగలము. అక్కడ పస్కా పండుగ (Passover) అనే పదమునకు ఈస్టర్ (Easter) అని ఇంగ్లిష్ లో చూడగలము.

Acts 12:3-4 King James Version (KJV)

And because he saw it pleased the Jews, he proceeded further to take Peter also. (Then were the days of unleavened bread.) And when he had apprehended him, he put him in prison, and delivered him to four quaternions of soldiers to keep him; intending after Easter to bring him forth to the people.


💭 ఈస్టర్ అనే పదము క్రీ. 1604-1611 మధ్య కాలములో మొదటి సారిగా ఇంగ్లిష్ బైబిల్ (KJV లో) తప్పుగా ముద్రించబడింది.


Acts 12:3-4 New King James Version (NKJV)

And because he saw that it pleased the Jews, he proceeded further to seize Peter also. Now it was during the Days of Unleavened Bread. So when he had arrested him, he put him in prison, and delivered him to four squads of soldiers to keep him, intending to bring him before the people after Passover.


💭 మరల పదమును క్రీ, 1979-1982 మధ్య కాలములో "అపో.కార్య. 12:3-4" వచనములను 'Easter' అనే పదమునకు బదులుగా (Passover) అని NKJV లో మార్చివేయడం జరిగింది.

పస్కా పండుగ అంటే ఈస్టర్ అని అర్ధమా?


పస్కా(PASSOVER) అనే పదము హీబ్రూ పదమైన ( חַג הַפֶּסַח -  Ḥag haPesaḥ) నుండి తర్జుమా చేయబడింది. దీనిని గ్రీక్ లో "Pascha" (πάσχα) అని, ఇంగ్లీష్ లో "Passover" అని, తెలుగు లో "పస్కా పండుగ" లేదా "పులియని రొట్టెలు పండుగ" అని అంటారు

పస్కా (Passover) అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. (లుకా 22:1).

👉 పస్కా అంటే ఈస్టర్ అని అర్ధము ఇస్తే పాత నిబంధనలో PASSOVER అనే ఉన్నచోట EASTER అనే ఉండాలి కానీ అలా పరిశుద్ధ గ్రంథములో లేదు. (ద్వితి 16:1-6; నిర్గమ 12:11,21,27,43,48; లేవి. 23:5) బైబిల్ తెరిచి చూడుము

NOTE :: పైన తెలిపిన వాటిని బట్టి పస్కా అంటే ఈస్టర్ కాదని తెలుసుకొనగలరు. ఈ పస్కాపండుగ గూర్చిమరింత సమాచారం కోసం ఈ లింక్ చేసి చూడుము. Click Here


క్రైస్తవులు ఈస్టర్ చేయచ్చా?


మన ప్రభువైన యేసుక్రీస్తును తమకు సొంత రక్షకుడుగా అంగీకరించి, తమ నోటితో ప్రభువని/దేవుని కుమారుడని ఒప్పుకొని, మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము అయన నామములో బాప్తీస్మం పొంది, అయన స్థాపించిన క్రీస్తు సంఘము(Church of Christ) లో చేర్చబడి, అపోస్తలుల బోధలో తమ జీవితాలను దిద్దుబాటు చేసుకొని, నడిపించుకొనే వారు వాక్యానుసారమైన క్రైస్తవులు. పరమతండ్రి వీరికి యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ క్రొత్త నిబంధనను గౌరవించి దానిలో ఒకటి కలపడం, దానిలో నుండి తీసివేయడం వంటివి చేయక తూ.చ. తప్పక పాటించెడివారై ఉంటారు

పైన తెలిపిన వారికి కాస్త ఎక్కువ భిన్నముగానే నేటి క్రైస్తవులు/సేవకులు అనబడేవారు ఉన్నారని చెప్పుకోవాలి. ఏలయనగా.., వీళ్ళు ఆచరించే లెంట్ డేస్, భస్త్మ బుధవారం, మౌఉండి గురువారం, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, సమాధుల పండుగ, క్రిస్మస్, నూతన సంవత్సరం మరి ముఖ్యముగా ఈస్టర్ అనేవి పరిశుద్ద గ్రంథములో లేవని తెలిసినప్పటికి, ఎవరైన గట్టిగా ప్రశ్నిస్తే వాటిని గ్రంధములో చూపలేమని తెలిసినప్పటికి, వారికి ఇవి చేయమని చెప్పిన సంఘ సేవకుల పరువు పోకూడదని, ఇతరుల యెద్ద చులకన అవుతావేమోనని, సువార్త పేరుతో, సంవత్సరానికి ఒక్కసారి కూడా క్రీస్తు జ్ఞాపకం చేసుకోకూడదా అనుకుంటూనే వీటిని వారి సంఘాల్లో వేడుకగా ఆచరిస్తూ దేవుడు చెప్పని, పరిశుద్ద గ్రంథములో లేని ఎన్నో సంగతులను క్రొత్త నిబంధనకు కలిపి, చెరిపి బోధిస్తున్నారు.

💥 ఉదాహరణకు : "ఈస్టర్ అనే పండుగ మనుషులు ఆలోచనలు మేర కలిగాయి అనుటకు రుజువులు"👇👇

ఈస్టర్ 2021 - "ఏప్రిల్ 04"
ఈస్టర్ 2022 - "ఏప్రిల్ 17"
ఈస్టర్ 2023 - "ఏప్రిల్ 09"
ఈస్టర్ 2024 - "మార్చి 31"
ఈస్టర్ 2025 - "ఏప్రిల్ 20"
ఈస్టర్ 2026 - "ఏప్రిల్ 05"
ఈస్టర్ 2027 - "మార్చి 28"
ఈస్టర్ 2028 - "ఏప్రిల్ 15"
ఈస్టర్ 2029 - "ఏప్రిల్ 16"
ఈస్టర్ 2030 - "ఏప్రిల్ 01"

💬 పరమందున్న దేవుడు అజ్ఞాపించే ఏ పండుగ విషయమైన గ్రంథము లోనుండి ఆలోచిస్తే ఈ క్రింది విషయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. 👇👇
  1. పండుగ పేరు?,
  2. దాని అర్ధం?,
  3. ఎవరు చేయాలి?,
  4. ఎలా చేయాలి?,
  5. ఎందుకు చేయాలి?,
  6. ఎప్పుడు చేయాలి?, (నెలలు - తేదిలు ) 
  7. ఎన్ని రోజులు చేయాలి?,
  8. ఎలా చేయకూడదు?.
  9. పండుగ చేయకపోతే ఎటువంటి శిక్ష? మరింత సమాచారం కోసం ఈ "పండుగలు" అంశమును క్లిక్ చేసి చదువగలరు - Click Here

సహోదరులారా... పరమతండ్రి ఈ ఈస్టర్ పండుగను మనం ఆచరించాలని తన పరిశుద్ద గ్రంథములో ఒక్క సూచనా వ్రాయించలేదు. ఆయన కోరనూలేదు. క్రైస్తవులనబడేవారు చేసే ఎటువంటి అన్య పండుగలలో ఏదియు దేవునికి అంగీకారం కాదన్నట్టు, పరమదేవుడు వాటి విషయంలో నిశ్శబ్దంగా వున్నాడు. కానీ కొందరు ఐతే క్రీస్తు యొక్క పునరుత్థానము(Resurrection) అంటే పాత నిబంధనలో చెప్పబడిన అప్తారోతు (EASTER) అని ఆపాదించి దేవునికి కోపం తెప్పించే ఈ ఆచారం చేస్తున్నారు. జాగ్రత్త సుమా!

  1. ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. (సామెతలు 30:6) 
  2. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదుదానిలో నుండి దేనిని తీసివేయ కూడదు. (ద్వితియోపదేశకాండము  4:22) 
  3. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడలఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును(ప్రకటన గ్రంథము 22:18) 

💫 క్రొత్త నిబంధన లో లేని ఇటువంటి పండుగలను చేయమని ప్రోత్సహించే వారి మాటలుకు లోబడక, దేవుని గ్రంధాన్ని మాత్రమే ప్రామాణికముగా తీసుకొని, సమయం ఉండగానే సత్యమును స్వీకరించి, దేవుని ఉగ్రతను కొనితెచ్చుకొనే ఇటువంటి ఆచారాలకు నీవు నీ ఇంటివారు దూరముగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాము. వందనములు 🙏
నవీన మనోహర్
The churches of Christ greet you - Roma 16:16