"మూడు రాత్రులు - మూడు పగలు" (Three Days & Three Nights)

అంశము : "మూడు రాత్రులు - మూడు పగలు".


నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.


నా ప్రియులారా, ఈ అంశము గూర్చి పరిశీలన చేసే ముందుగా మొదట ముఖ్యముగా ఈ క్రింది వాటి గూర్చి బాగుగా తెలియాలి. అదేమనగా,

యూదులు కాలమాన ప్రకారముగా "మొదట రాత్రి, తరువాత పగలు" వస్తాయి.
"06:00p.m. TO 06:00a.m. మరియు "06:00a.m TO 06:00p.m"

★  "ఒక్క రోజు" - [ 06:00p.m to 06:00p.m ] - (లేవి.కాండము." 23:32.)


■ "విశ్రాంతి దినము మరుసటి దినము" - "ఆదివారము".
■ "విశ్రాంతి దినము" - "శనివారము".

● "విశ్రాంతి దినము గడిచిపోయిన..." - "ఆదివారము" - (మత్తయి 28:1).
● "విశ్రాంతిదినము గడచిపోగానే"... - ఆదివారము - (మార్కు 16: 1).

● "సిద్ధపరుచు దినమునకు మరుసటి దినము" - " శుక్రవారము" - "పులియని రొట్టెలు పండుగ" - (మత్తయి 27:62; లేవి.కాండము 23:6)
● "సిద్ధపరుచు దినము" - "గురువారము" -(లుకా 23:54; మార్కు 14:12-14).


● "పస్కా పండుగను" ఆచరిoచినది మరియు సిద్ధపరిచినది - "గురువారము" - (లుకా 22:7;13; లేవి.కాండము 23:5).


  "మూడు రాత్రులు - మూడు పగలు యొక్క వివరణ"


"గురువారము రాత్రి" :
*సాయంకాలమైనప్పుడు యేసు తన పండ్రెండుమంది శిష్యులతో కూడ  "పస్కా భోజనము" ఆచరించెను. - (మత్తయి 26:20-25;  మార్కు 14:17-21; లూకా 22:14-15).

 *ఆ రాత్రి యేసు వారు అపొస్తలులతో కలసి "ప్రభువు బల్లను" ఆచరించెను - (మత్తయి 26:26-29; మార్కు 14:22-25; లూకా 22:16-21).
*ఆ రాత్రి ఇస్కరియోతు యూదా చేతనే ప్రధానయాజకులకి యేసు వారు అప్పగింపబడ్డారు - (మత్తయి 26:31-75; మార్కు 14:32-72; లూకా 22:39-62).


"గురువారము పగలు" :
*యేసును పొంతిపిలాతునకు అప్పగించిరి - (మత్తయి 27:1-2; మార్కు 15:1-2; లుకా 23:1-2).

* పొంతిపిలాతు నుండి హేరోదు దగ్గరకు పంపుట మరియు  పిలాతునొద్దకు మరల పంపుట - (లుకా 23:6-12).

*ప్రధానయజకులును, పెద్దలును- బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించమని 'లేదా' సిలువవేయుమని జనులను ప్రేరేపించిరి - (మత్తయి 27:20-24; మార్కు 15:9-15; లూకా 23:18-25).

*యేసును సిలువవేసినప్పుడు "పగలు తొమ్మిది" గంటలాయెను. - (మార్కు 15:25).

* "మధ్యాహ్నము  మూడు గంటలు" సమయములో "యేసు బిగ్గరగా కేకవేసి మ్రాను మీద ప్రాణము విడిచెను"  - (మత్తయి 27:45-50; మార్కు 15:33-37; లూకా 23:44-46; యోహాను 19:30).


గమనిక:

ద్వితియోపదేశకాండము 21:21-23
అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.

** మ్రాను మీద వ్రేలాడదీయ బడినవారుని ఆ దినమున వానిని పాతిపెట్టాలి. గురువారము పగలు సాయంత్రము 6 కి సమాప్తి అవుతాది. యేసును 6 లోపు సమాధి చేయాలి **

*యేసును -తొలిచిన రాతి సమాధిలో ఉంచెను - (మత్తయి27:57-60; మార్కు 15:43-46; లూకా 23:50-53; యోహాను 19:38-42).


❣ నోట్ ❣
∆ గురువారము  పగలు అనగా శుక్రవారం రాత్రి రాకుండా ఆరు గంటలు లోపు సమాధి చేసారు కావున ఇది ఒక పగలుగా తీసుకోవాలి. 


"శుక్రవారము రాత్రి + పగలు" :

*"సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి.." - (లూకా 23:56).

*పస్కా సిద్ధపరుచుటకు మరుసటి రోజున కావలి వారు రాతికి ముద్రవేసి, సమాధిని భద్రముచేసిరి. - (మత్తయి 27:62-66).


❣ నోట్ ❣
∆ శుక్రవారము రాత్రి + పగలు = "ఒక దినము".


"శనివారము రాత్రి + పగలు" :

*ఈ దినము విశ్రాంతి దినము - (నిర్గమ. కాండము 31:12-16; లేవి.కాండము 23:3).

*ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి. - (లూకా 23:56).


❣ నోట్ ❣
 శనివారము రాత్రి + పగలు = "ఒక దినము".


"ఆదివారము రాత్రి" :

* "విశ్రాంతి దినము గడిచిపోయిన..." - "ఆదివారము" - (మత్తయి 28:1).
* "విశ్రాంతిదినము గడచిపోగానే"... - ఆదివారము - (మార్కు 16: 1).
* "ఆదివారమున తెల్లవారుచుండగా..." - ( లూకా 24:1).
* "ఆదివారమున పెందలకడ ..." - (యోహాను 20:1).

∆ ఆదివారము సాయంకాలమున శిష్యులు మధ్యకి యేసు వచ్చెను - (యోహాను 20:19).

∆ ఆ దినమందే అనగా ఆదివారమున ఎమ్మాయు అను గ్రామములో ఇద్దరు మనుషులు (ఒకడు క్లెయొపా) యేసుతో సంభాషణ మరియు "ఆదివారమునకి (నేటికి) మూడు దినములాయెను" - (లూకా 24:13-21).


❣ నోట్ ❣
 ఆదివారము రాత్రి

** గురువారము పగలు + ఆదివారము రాత్రి = ఒక దినము **

మనోహర్_నవీన 
మత్తయి 12: 40 
యోనా "మూడు రాత్రింబగళ్లు" తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు
"మూడు రాత్రింబగళ్లు" భూగర్బములో ఉండెను.

Download PDF File

Share this

Related Posts

Previous
Next Post »

23 comments

comments
April 13, 2017 at 8:23 PM delete

బ్రదర్ విశ్రాంతి దినం శనివారమా ?

Reply
avatar
April 14, 2017 at 1:20 AM delete

అవును, బ్రదర్. కిషోర్ బాబు గారు.

* "విశ్రాంతి దినము గడిచిపోయిన..." - "ఆదివారము" - (మత్తయి 28:1).
* "విశ్రాంతిదినము గడచిపోగానే"... - ఆదివారము - (మార్కు 16: 1).

Reply
avatar
April 15, 2017 at 2:14 PM delete

Sunday night kuda laekaestae.mari sunday mrning aela laegustadu.9705553462 peter

Reply
avatar
April 15, 2017 at 5:50 PM delete

సోదరా, యేసు క్రీస్తు శుక్రవారం చనిపోయి సమాధి చేయబడినాడని నేను అనుకుంటున్నాను. కాదా ?
ఆయన గురువారం సాయంత్రం సమాధి చేయ బడ్డాడా ?

Reply
avatar
April 15, 2017 at 6:36 PM delete

పైన పోస్ట్ అంతటిని జగర్తగా చూడండి బ్రదర్ గారు

Reply
avatar
April 15, 2017 at 6:38 PM delete

యూదులు కాలమానం ప్రకారముగా మొదట రాత్రి తరువాత పగలు వస్తది. అప్పుడు ఒక దినము.

యేసు మూడు పగలు, మూడు రాత్రులు అయినా తరువాతే లేచారు. (మూడు దినములు) ఒక్కసారి మరల పోస్టును జగర్తగా చూడండి. ఏమైనా సందేహము ఉంటె అడగండి. వందనములు సిస్టర్

Reply
avatar
Anonymous
April 18, 2017 at 3:56 PM delete

బ్రదర్ మూడు రాత్రులు, మూడు పగలు ఎలా అని చాల మందిని అడిగాను కానీ మీకు లా ఇలా వివరణ నాకు ఎవరు ఇవ్వలేదు.

మీరు ఇక్కడ ఉంటారు. మీ నెంబర్ లేదా ఫేసుబుక్ నైనా కాస్త ఇవ్వగలరా బ్రదర్.

Anil Hyderabad

Reply
avatar
April 22, 2017 at 8:51 AM delete

హాయ్ బ్రదర్ అనిల్ అందరుకి అందుబాటులోనే పెడతాను.

Reply
avatar
September 12, 2017 at 1:22 PM delete

యూదుల కాలమాణం ప్రకారం ఒక్కగంటగానీ లేదా కొంత సమయం ఉన్నంత మాత్రమున ఒక్క దినముగా లెక్కించ బడుతుంది అనేది నిరధారమైన వాక్య ప్రకటన, దినము అనగా ఒక సంపూర్ణ రాత్రి మరియు సంపూర్ణ పగలు మాత్రమే అని పరిశుధ్ధ బైబిల్ నిర్వచనం.ఆది.కాం.1:3 And there was evening,and there was morning-the first day.

Reply
avatar
September 12, 2017 at 4:20 PM delete

అవునా.. సరే మీరు చెప్పండి ఎలా మూడు పగలు మరియు మూడు రాత్రులు అనగా 72 గంటలు అనేవి వాక్య ఆధారముగానే చెప్పండి.

మీరు చెప్పే విధానములో ఒక్క ఒక్క గంటలో ఒక్క నిమిషం తప్పిపోయిన నేను ఉరుకోను. మీరు చెప్పలేని యెడల మౌనముగా పైన సత్యము ఏంటో స్వీకరించగలరు.

వందనములు సోదరా!!

Reply
avatar
September 15, 2017 at 3:29 PM delete

మూడు దినములు అంటేనే 72గంటలు బైబిల్ చెప్పేదీ ఆదే కానీ మీరు చెప్పినట్లు పగటి సమయంలో గాని రాత్రి సమయంలో గాని కొద్ది సమయం కలిసినా ఒక దినముగా లెక్కించబడదు.అలా లెక్కించబడుతుంది అని ఉంటే వాక్యాధారముతో చెప్పండి.లేనియెడల మౌనముగా ఉండవయును.

Reply
avatar
September 15, 2017 at 3:35 PM delete

ఎవరు ఏది చెప్ఫాలి అనుకొన్నా బైబిల్ వాక్యానుకూలంగా లేకపోతే వాక్యం (దేవుడు)ఊరుకోడు.అది గ్రహించాలి.

Reply
avatar
September 16, 2017 at 12:01 AM delete

పైన వ్రాసిన వాటిని అంగీకరిస్తే అంగీకరిచండి లేని యెడల మౌనముగా ఉండండి. కారణమూ మీరు తప్పు పట్టే టప్పుడు తప్పు సరి చేసే కార్యక్రమము కూడా కలిగి ఉండాలి. అది ఉంటేనే అంశము వ్రాసి చూపించి అప్పుడు మాట్లాడండి లేనిచో సత్యము ముందు చాల మౌనముగా ఉండాలి మరి.. వందనములు

Reply
avatar
September 16, 2017 at 12:27 AM delete

First evidence:
Brother once read these words of Queen Esther to Mordecai

"Go, gather together all the Jews that are present in Shushan, and fast ye for me, and neither eat nor drink three days, night or day: I also and my maidens will fast likewise.” Esther 4:16.

Do not overlook the fact that they were to fast three days and three nights.

Yet almost the next verse tells us, "Now it came to pass on the third day, that Esther put on her royal apparel, and stood in the inner court.” Esther 5:1. Here is a perfect example of how three days and three nights terminate on the third day!

Second evidence :

When Jesus walked with the two disciples on the road to Emmaus on Sunday afternoon, after the resurrection, Cleopas said, "To day is the third day since these things were done.” Luke 24:21.

Reply
avatar
September 16, 2017 at 12:37 AM delete

ఇంకా అనేకమైన ఆధారములు కలవు అపో 10:1-30 వచనములు

కొర్నేలి దర్శనము కలిగిన దినము నుండి పేతురు కలిసే దినమునము లెక్క వేస్తె మూడు దినములు వస్తాయి కానీ కొర్నలి అపో 10:30 లో నాలుగు దినములు అని అంటారు.

Now we get the picture in mind - it had been exactly three days, to the very hour. Yet Cornelius said, "Four days ago.” How could he say it was four days when it was only three days? Because he used inclusive reckoning, which meant that parts of four days were involved.


In the same way the Bible described the time of Christ's death as three days and three nights even though it was only a part of those three days.

Reply
avatar
September 16, 2017 at 12:42 AM delete

Finally, the Jews who heard the Lord use the phrase “three days and three nights” in Matt. 12:40 did not seem to necessarily understand a full 72 hours. Compare their comment in Matt. 27:62-64.

Reply
avatar
September 16, 2017 at 10:40 PM delete

Always God's word is true, but our understanding is different to God view,due to lack of knowledge. I am praying every one may get wisdom about true.

Reply
avatar
April 16, 2018 at 7:45 AM delete

Bro 72 gattalu graduate ne 3 ratrullu 3 pagallu avutaee kany enkkada leduga బ్రో cheppandi plsss

Reply
avatar
April 21, 2019 at 11:00 PM delete

బ్రదర్.. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శుక్రవారం మరణించ లేదంటారు...గురు వారం అంటారు... అలా అయితే మీరు గురు వారం అని వాక్యధారం చుపించగలరా...

Reply
avatar
April 21, 2019 at 11:01 PM delete

ప్రసాద్ అమలాపురం

Reply
avatar
May 24, 2019 at 8:32 PM delete

Good message bro
చేలా బాగా వివరణ ఇచ్చారు
9291801082
హైదరాబాద్

Reply
avatar
April 13, 2020 at 12:17 AM delete

యోహాను 19: 31
ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.

దీని గురించి కాస్త వివరిస్తార బ్రదర్.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16