అంశము: "బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?"
నా తోటి సహోదరీ,సహోదరులారా!!
సంఘములో ఏ పనియైనా చేయుటకు ముందుకువచ్చే అనేకమంది అతి ప్రామఖ్యమైన ఆత్మసంబంధమైన ఈ విషయానికి (బాప్తీస్మము) వచ్చేసరికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..?
సంఘములో చాలా మంది యవ్వనప్రాయం దాటినవారున్నా అందులో బాప్తీస్మము తీసుకున్నవారు ఒకవంతు కూడా లేకపోవడానికి కారణం బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలో తెలియకపోవడమే;
● “బాప్తిస్మము” అనగా పాతిపెట్టుట, క్రొత్తజన్మ, ముంచుట అని అర్ధము. (రోమా 6:3; యోహాను 3:3; 1 పేతురు 3:21).
● ఇది “బాప్టిజో” అనే గ్రీక్ పదము తర్జుమా చేయబడినది.
∆ "పాతిపెట్టుట" అనగా “పూడ్చు, పాఁతివేయు, దిగవేయు” అని అర్ధము.
∆ "క్రొత్త జన్మ" అనగా “నూతనముగా పుట్టుట” అని అర్ధము.
∆ "ముంచుట" అనగా “మునుగజేయు” అని అర్ధము.
∆ "కప్పెట్టడం" అనగా “పూడ్చడం” అని అర్ధము.
"అసలు బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి..?"
1) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని రాజ్యము(సంఘము)లో ప్రవేశించగలరనేది యేసుక్రీస్తు వారు తెలియజేసిన విశేషమైన సమాచారం.
యోహాను సువార్త 3:3
అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
2) బాప్తీస్మము ద్వారానే మనం ఇంతకుముందు చేసిన పాపములు క్షమింపబడతాయనేది పేతురు గారు తెలియజేసిన విశేషమైన సమాచారం.
అపొస్తలుల కార్యములు 2:38
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి;
3) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పరిశుద్థాత్ముని పొందుకోగలరు.
అపొస్తలుల కార్యములు 2:38
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
4) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని ఉగ్రతనుండి తప్పించబడగలరు.
రోమీయులకు 5:9
కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.
5) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడగలరు.
రోమీయులకు 3:24
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
6) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పవిత్రులుగా తీర్చబడగలరు.
1 యోహాను 1:7
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
7) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పరసంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును పొందుకోగలరు.
ఎఫెసీయులకు 1:3
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
8) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తులో జీవించగలరు..
1యోహాను 4:9
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
9) బాప్తీస్మము పొందినవారు మాత్రమే దేవుని పిల్లలుగా పిలవబడతారు.
యోహాను సువార్త 1:12
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
10) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తు మరణ, సమాధి,పునరుద్థానము (సువార్త)ను గూర్చి ఇతరులకు ప్రకటించగలరు.
1 కొరింథీయులకు 11:26
మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
11) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సమయమందును అసమయమందును వాక్యమును ఇతరులకు ప్రకటించగలరు.
2 తిమోతికి 4:2
వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.
12) బాప్తీస్మము పొందినవారు మాత్రమే అపవాది నోటనుండి తప్పించబడతారు.
1పేతురు 5:8
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
13) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సంఘముగా పిలువబడతారు.
1 కొరింథీయులకు 1:2
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
14) బాప్తీస్మము పొందినవారు మాత్రమే తన కుమారుని (క్రీస్తు) సహవాసములో చేర్చబడతారు.
1 కొరింథీయులకు 1:9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
15) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తు జ్ఞానమును తెలుసుకోగలరు.
1 కొరింథీయులకు 2:7
దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.
16) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తును ధరించుకోగలరు.
గలతీయులకు 3:27
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
17) బాప్తీస్మము పొందినవారు మాత్రమే యేసుక్రీస్తును ప్రభువుగా వారి హృదయాలలో ప్రతిష్టించుకుంటారు.
1 పేతురు 3:15:
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
18) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ఈ లోకసంబంధులపైన జయము పొందినవారు.
1 యోహాను 4:4
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
19) బాప్తీస్మము పొందినవారు మాత్రమే తండ్రి ఎవరో,కుమారుడు ఎవరో తెలుకోగలరు.
యోహాను సువార్త 17:3
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
20) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ప్రభుబల్లలో పాలుపొందుతారు.
1 కొరింథీయులకు 11:23
"నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని".
21) బాప్తీస్మము పొందినవారు చేసే ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు.
యోహాను సువార్త 4:24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
22) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ఇతరులకు బాప్తీస్మము ఇవ్వగలరు.
మత్తయి సువార్త 28:19
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు
23) బాప్తీస్మము (పునర్జన్మ) పొందినవారు మాత్రమే నూతనస్వభావమును పొందుకోగలరు.
తీతుకు 3:5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన(పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
24) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సాతాను అధికారమునుండి దేవునివైపు తిరిగినవారు.
అపొస్తలుల కార్యములు 26:18
"వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి,"..
నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
25) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సాతానుయొక్క మరణభయమనే దాస్యత్వమునుండి విడిపింపబడినవారు.
హెబ్రీయులకు 2:14,15
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
26) బాప్తీస్మము పొందినవారు మాత్రమే ధనాపేక్షను విసర్జించగలరు.
మొదటి తిమోతికి 6:10
ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
27) బాప్తీస్మము పొందినవారు మాత్రమే శరీరక్రియలను విసర్జించగలరు.
గలతీయులకు 5:19-21: ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
28) బాప్తీస్మము పొందినవారు మాత్రమే క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేబబడినవారు.
కొలొస్సయులకు 2:12
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.
29) బాప్తీస్మము పొందినవారు మాత్రమే సంఘములో పెద్దలుగాను పరిచారకులుగాను ఉండుటకు అర్హులు.
1తిమోతికి 3:1-8:
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
30) బాప్తీస్మము పొందినవారు మాత్రమే పరలోక పౌరసత్వం కలవారు.
ఫిలిప్పీయులకు 3:20
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
★ బాప్తీస్మము పొందినవారు మాత్రమే రక్షించబడతారు.
మార్కు సువార్త 16:16
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
★ గమనిక ★
◆ బాప్తీస్మము గూర్చి నీ కుటుంబ సభ్యుల అనుమతి గాని, నీ స్నేహితుల అనుమతి గాని, నీ రక్త సంబంధుల అనుమతి గాని అవసరము అని భావిస్తున్నావ..?
★ మత్తయి సువార్త 19:29
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.
★ మత్తయి సువార్త 10:37
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
★ గలతీయులకు 1:15-16
తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో (మూలభాషలో-రక్తమాంసములతో) నేను సంప్రతింపలేదు.
6 comments
commentsdear brother,
Replyమీరు 3rd పాయింట్ లో బాప్తిస్మము పొందినవారు "మాత్రమే" పరిశుదత్మను పొందుతారు అని చెప్పారు కానీ (అపోస్తుల 10:44-47) లో చుస్తే పరిశుదత్మను పొందుకున్న తర్వాత కూడా బాప్తిస్మము తిస్కుకున్నట్టు వాక్యము చెప్తున్నది. కాబట్టి దీనిని మీరు సరిచెయ్యండి బ్రదర్.
superb bro
Replyవందనములు అమ్మ
Replyఎఫెసీయులకు 3: 6
Replyఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్త వలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునైయున్నారను నదియే.
★ పరిశుద్ధాత్మ పొందుటకు క్రమము = మారుమనస్సు + పాప క్షమాపణ నిమిత్తము + బాప్తిస్మము + పరిశుద్ధాత్మ వరము --- (అపో.కార్య 2:38).
★అపో.కార్యములు 2: 39
"ఈ వాగ్దానము" మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
వందనములు బ్రదర్ ప్రేమ్
Good topic Brother
ReplyGreat job my brother. Keepup the good faith.
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com