దేవుని చిత్తము (The will of God)

క్రైస్తవుల యెడల "దేవుని చిత్తము"


మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
నా వందనములు.

◆ "దేవుని చిత్తము" అనగా ఆయన పిల్లల యెడల ఉండే  "దేవుని మనసు" లేదా "దేవుని మది" అర్ధము.


» "ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు లక్షణములు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని" - ( ఎఫెసి. 1:5; గలతి. 5:22).

» "నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవారుగా ఉండాలని" - (హెబ్రీ. 1:9).

» క్రీస్తు సువార్త ద్వారా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన విషయములో" (1 కొరింథీ. 1:2). "పరిశుద్ధులగుటయే" అనగా ప్రతి క్రైస్తవుడు "జారత్వమునకు దూరముగా ఉండాలని."- ( 1 థెస్స. 4:3).

» "పరిశుద్ధత, ఘనత విషయములో తన శరీరమును ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకొనగోరువారై ఉండాలని".  - ( 1 థెస్స. 4:5).

» క్రైస్తవులు ఇతరులతో అజ్ఞానముగా మాట్లాడక "యుక్తప్రవర్తన గలవారై" (మేలు చేయువారై) ఉండాలని. - (1పేతురు. 2:15).

» క్రీస్తు తన స్వరక్తము ఇచ్చి కట్టిన ఏకైక ఒక్క క్రీస్తు సంఘముగా (CHURCH OF CHRIST) ఉండాలని (మత్తయి. 16:18; అపొ.కార్య. 2:41-42; 20:28; ఎఫెసి. 1:23; కొలస్స. 1:18; 1కొరింథీ. 12:27).

» "ప్రతి క్రైస్తవుడు "లోకము దాని ఆశయు" అనే విషయములో నశించి పోవాలి అనేది దేవుని చిత్తము కాదు". - (1యోహాను. 2:16-17; మత్తయి. 18:14).

» "మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయాలి". - (1 పేతురు. 2:9).

» "దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండే ఆత్మ సంబంధమైన కార్యములు ఇది అది చేతమని చెప్పుకొనవలెను" - (యాకోబు. 4:15).

» ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో "దేవుని చిత్తము" - (1థెస్స. 5: 18).


● నా ప్రియులారా... "ప్రభువు చిత్తమైతే" ఒక ఎకరం పొలం, బిల్డింగ్, కారులు కొందామనుకుంటున్నాను మరియు "ప్రభువు చిత్తమైతే" పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను అనకూడదు.

» అవన్నీ మన శరీర ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంది కాని దానికి "ప్రభుచిత్తమని" "దేవుని చిత్తమని" పేరు పెట్టకూడదు.


∆ "సమస్తము అంతటి మీద దేవుడు మనకి అధికారమిచ్చారు మరియు మన పాదముల క్రింద వాటిని ఉంచారు". - (కీర్తన 8:6-8).

పరిశుద్ధులు దీనిని ఎరుగక శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ దేవుడు ఇచ్చే విలువవైన జీవితములో దేవుని చిత్తమును పక్కన పెట్టి వృథాగా ఖర్చు చేస్తున్నారు.


యేసుక్రీస్తు వారి సాక్ష్యము:
"నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని". - (యోహాను 6:39)

★ ఆయన పరలోక సేనయెడలను, భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. - (దానియేలు. 4: 35).

★ ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని "పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము" చేయువాడే ప్రవేశించును. - (మత్తయి. 7:21).

మీ ఆత్మీయా సహోదరుడు,
💌 KM

Share this

Related Posts

Previous
Next Post »

5 comments

comments
Anonymous
April 17, 2017 at 5:36 PM delete

Super Brother.

Reply
avatar
April 17, 2017 at 5:55 PM delete

వందనములు బ్రదర్/సిస్టర్ :D

Reply
avatar
August 9, 2017 at 3:57 PM delete

Thank you for sharing this wonderful word of god brother

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16