★ నీకు తేలుసిన "ఆ ఒక్కసంఘము" ఏమిటి?
● “సంఘము” అనే పదం గ్రీక్ (ఎక్క్లీసియా) బాష నుoచి కలిగిది.
» దీని అర్థము “పరిశుద్ధులుగాఉండుటకు పిలువబడినవారము”. - (I కొరింథీ 1:2).
● సంఘము క్రీస్తు యొక్క“శరీరము” - (కొలొస్స 1:18).
● సంఘము క్రీస్తు యొక్క “వధువు” – (ఎఫెసీ 5:22-27).
● సంఘము దేవుని యొక్క“కుటుంబము” – (I తిమోతికి ౩:15).
● సంఘము “సత్యమునకు స్తoభము” మరియు “ఆధారము” – (I తిమోతికి ౩:15).
★ నీకు తెలిసిన ఆ "ఒక్కసంఘమునకు" స్థాపకుడు ఎవరు?
● క్రీస్తు వాగ్దానం చేసినాడు “ఆయన తన సంఘమును” కట్టుదును అని– (మత్తయి 16:18).
● క్రీస్తు “తన సంఘము” కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించినాడు –(అపొస్తలుల కార్యములు 20:28).
● క్రీస్తు తన "సంఘము”అను శరీరమునకు ఆయనే(క్రీస్తు) శిరస్సు – (కొలొస్స 1:18).
● క్రీస్తు తన "సంఘము”అను శరీరమునకు ఆయనే ఆధ్యాత్మికత వహిస్తున్నారు - (కొలొస్స 1:18).
★ నీకు తెలిసిన "ఆ ఒక్కసంఘము" ఎప్పుడు ప్రారంభమైనది?
● జెరూషలేము యొక్క చివరి రోజులలో “ఆయన(క్రీస్తు) సంఘము” వాగ్దానం చేయబడిది – (యెషయా 2:2-4)
● “ఆయన(క్రీస్తు) సంఘము” బాప్తీస్మమిచ్చు యోహాను రోజుల సమీపంలో ఉంది –(మత్తయి 3:1-2).
● “ఆయన(క్రీస్తు) సంఘము” బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని క్రీస్తు తన శిష్యులకు ముoదుగా చెప్పాడు – (మార్కు 9:1).
● క్రీస్తు “తన సంఘము” ప్రారంభము కొరకు శిష్యులతో పలికిన మాటలు “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు” - (అపొస్తలుల కార్యములు 1:8).
● పైన తెలిపిన అన్ని విషయములు “పెంతెకొస్తు పండుగ” దినమున “క్రీస్తు సంఘము(Church of Christ) ”ప్రారంభమైనది. (క్రీ.శ.33) - (అపొస్తలుల కార్యములు 2:40-42; 46-47).
★ నీకు తెలిసిన "ఆ ఒక్కసంఘము" ఎలా వర్ణించబడింది?
● ప్రభువు సంఘము -(అపొస్తలుల కార్యములు 20:28).
● దేవుని సంఘము – (Iకొరింథీ 1:2).
● క్రీస్తు యొక్క శరీరo -(ఎఫెసీ 4:12).
● క్రీస్తు సంఘము – (రోమా16:16).
★ నీకు తెలిసిన దేవుడు ఆ "ఒక్క సంఘమునకు" ఏమి ఇవ్వాలి అని యత్నము చేయుచున్నారు?
● క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “పాపముల యెక్క క్షమాపణ అవకాశం” - (ఎఫెసీ1:17).
● క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “మోక్షము” - (2 తిమోతి 2:10).
● క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “ముక్తి” - (కొలస్సీ 1:14).
● క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు” - (ఎఫెసీ 1:3).
● క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “రక్షణ” -(అపొస్తలుల కార్యములు 2:47).
మీ ఆత్మీయులు
Romans 16: 16
The churches of Christ salute you.
రోమీయులకు 16:16
క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
1 comments:
commentsDear Manohar you are doing Excellent work, preparing good lessons keep it up....
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com