దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)

💌 అంశము: స్త్రీ పాత్ర (Role of women).

నా తోటి సహోదరీ, సహోదరులారా!
మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు  నామములో నా వందనములు.

నా ప్రియులారా!!
ఆది యందు మన తండ్రియైన దేవుడు స్త్రీ లేనప్పుడే అనగా ఆదాము ఒంటరిగా ఉన్న దినములలో(ఆది. కాండము. 2:18) అయన తన ఆలోచనలను, ఆజ్ఞలను ఆదాముకి జారీచేశారు.

● (ఆది. కాండము. 2:17).
"నీవు"(ఆదాము) మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు.

● (ఆది. కాండము. 3: 17).
"నేను(దేవుడు) నీకు(ఆదామునకు)  ఆజ్ఞాపించిన....."

∆ ఆదాముకి మాత్రమే ఇవ్వబడిన ఈ ఆజ్ఞను కాస్తా స్త్రీ నిర్మాణము (ఆది.2:21-23) పిమ్మట...
అపవాది(ఘట సర్పము) ఇలా కలిపేశాడు. అదేమనగా, "మీరు తినకూడదా అని". (ఆది. కాండము. 3:1) మరియు "మీరు చావనే చావరు" అని (ఆది. కాండము. 3:4).

∆ అప్పుడే దేవుని ఆలోచనలకు, ఆజ్ఞకి కల్పితము జరిగింది అంటే వాస్తవానికి ఆదాము హవ్వ కి చెప్పి ఉండవచ్చు కారణము "మేము తినవచ్చు"(ఆది.కాండము. 3:2); " మీరు చావకుండునట్లు".(ఆది. కాండము.3:3).

∆ దేవుడైన యెహోవా ఈ ఆజ్ఞను "స్త్రీ"(హవ్వ) కి ఇచ్చినట్టుగా చూడలేము.

∆ "హవ్వకి దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము చెప్పాడు".  దీనిని బట్టి మన తండ్రియైన దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలలో స్త్రీ నడిపింపు మీద లేదా స్త్రీ మీద నాయకత్వ కార్యక్రమము  పురుషుడులో పెట్టాడు.

∆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను హవ్వ(స్త్రీ) మాత్రమే తిని ఉంటే ఇంత సమస్య ఉండేది కాదేమో. హవ్వ తిన్నాక కూడా ఏమి జరగలేదు.
" ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు ఆదామునకు ఇచ్చెను, అతడుకూడ తినెను" (ఆది. కాండము 3:6)

 ∆ ఆదామునకు మాత్రమే ఇవ్వబడిన ఆ ఆజ్ఞను మీరి దేవునికి లోబడక, స్త్రీకి లోబడుట చేతనే "వారిద్దరి కన్నులు తెరవబడి, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు" (ఆది. కాండము. 3:7).

★ ఫలాలను తినకూడదు అనే విషయములో స్త్రీ(హవ్వ) ఎక్కడ తనని  తిరస్కరిస్తాదేమోనని ఆలోచన చేసిన పురుషుడు(ఆదాము) తన నాయకత్వమును స్త్రీకి అప్పగించేసాడు.
★ పురుషుడు మీద నాయకత్వమును చేసే కార్యక్రమము స్త్రీకి దేవుడు ఇవ్వలేదు.
★ ఆదాము తన దోషములును దాచిపెట్టాడు - (యోబు. 31:33).
★ "ఆదాము నిబంధన మీరినాడు". - (హోషేయా. 6: 7).
★ ఆదాము, హవ్వ ఇరువురు అవిధేయ స్థితిలోనికి వెళ్లిపోయారు.

భర్త అవిధేయుడు అయినచో భార్య అతని మీద నాయకత్వము చేయకూడదు.
"ఆమె పవిత్ర ప్రవర్తన బట్టియు, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన అతనిని రాబట్టబడవచ్చును. - (1 పేతురు 3:2).
■ ఆదిలో స్త్రీ(హవ్వ) తన భర్తను(ఆదాము) నడిపించే అధికారమును తీసుకొంది.
పురుషుడును మాటలతో ఆకర్షించడానికి, మాటలతో అధికారము చేయుటకు, మాటలతో నడిపించుటకు స్త్రీని అలా ఉద్దేశించి దేవుడు రూపకల్పన చేయలేదు.

★ "స్త్రీ పురుషునికి  ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు సెలవు లేదు" - (1 తిమోతి 2:12). ఆదిలో స్త్రీ చేత ఆదాముకి ఉపదేశము, అధికారము ఏదెను తోటలో జరిగింది.
★ ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. (1 తిమోతి. 2:14).

* ఏదెను తోటలో సర్పము(అపవాది) ఆదామును మోసపరచలేకపోయాడు.

∆  ఇందుచేతనే స్త్రీ ఉపదేశము చేయుటకు, అధికారము చేయుటకు ఆమెకు సెలవు లేదు అని దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరిచారు.■ "స్త్రీ నాయకత్వములో శాపము" ■


లోకమునకు శాపమును కొని తెచ్చినది స్త్రీ నాయకత్వమే.


​*"మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు", నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా "దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును". - (మలాకీ. 2:2).

A). హవ్వ యొక్క కుటుంబమునకు శాపము కొని తెచ్చింది. - (ఆది. 3:15)
B). ఆదామునకు శాపము కొని తెచ్చింది - (ఆది. 3:19)
C). తనకు శాపము కొని తెచ్చుకుంది - (ఆది. 3:16).
D). భూమికి శాపము కొని తెచ్చింది - (ఆది. 3:17-18).


* పురుషుడు మీద స్త్రీ నాయకత్వము చేస్తే ఆ కుటుంబమునకు శాపము వస్తుంది కాని దీవెన రాదు. పురుషుడు నాయకత్వములో మాత్రమే దేవుని యొక్క దీవెన కలదు *


∆ యెహోవా దేవుడు ఏదెను తోటలో స్త్రీని ఒక విధముగా రూపకల్పన చేస్తే ఆమె పురుషుడుకు ఉపదేశము, అధికారము చేయుట వలనే ఆమె ద్వారా అందరికి శాపము వచ్చింది.■ భార్య - భర్తల మధ్య పాత్ర ■A). అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి - (1పేతురు. 3:1).

B). సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. - (ఎఫెసీ. 5: 24).

C). పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. - (ఎఫెసీ. 5: 25).

D). పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు - (ఎఫెసీ. 5:28)

E). యెక్కువ "బలహీనమైన ఘటమని" భార్యను సన్మానించి - (1 పేతురు 3:7)

F). జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. - (1 పేతురు 3:7).

G). భార్యను లేదా భర్తను దూరముగా పెట్టె కార్యక్రమమును దేవుడు అంగీకరించడు. - (1 కోరింది 7:5).

∆ ఇక్కడ కూడా భర్తకి లోబడమని వాక్యము సెలవు ఇస్తుంది. కాని అధికారము లేదా నాయకత్వము చేయమని సెలవు ఇవ్వడము లేదు.


★ ఒక వేళ భర్త అవిశ్వాసి అయినచో వాక్యము చూడు "(1 కోరింది 7:13-14)" వచనములు.
★ ఒక వేళ భర్త అవిధేయుడు అయినచో వాక్యము చూడు "(1 పేతురు. 3:2)" చూడుము.■ కుటుంబములో స్త్రీ పాత్ర ■


A). స్త్రీ ఇంట ఉండి పనిచేసికొనువారుగా ఉండాలి. (తీతుకు. 2:4).

* (జాబ్ చేయాలా, వద్దా అనేది గ్రంథము సెలవు ఇవ్వలేదు) *

B). భర్తకి లోబడాలి, నాయకత్వము చేయకూడదు. - (1 పేతురు 3:1).

C). పిల్లలును మాత్రమే దేవునిలో "నడిపించే" కార్యక్రమమును తీసుకోవాలి. - (ద్వితీయో. 6:7-9; సామెతలు. 22:6; తీతుకు. 2:4-5).

D). సత్యము కొరకు పోరాటము చేస్తున్న తన భర్తకు స్త్రీ మంచి సహకారై (ప్రిస్కిల్ల వలె) ఉండాలి. - (అపొ.కార్య 18:26; రోమా 16:4).

E). "పురుషుడు వచ్చి భార్యను హత్తుకొనిన యెడల వారిరువురు ఏక శరీరమైయుందురు కావున వారి ఆలోచనలు, పనులు, నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి" - (ఆది. 2:24; మత్తయి. 19:5; మార్కు. 10:7; ఎపేసి. 5:31).

∆ ఏదెను తోటలో ఆదాము కుటుంబము "ఒక్క ఆలోచన యందు, ఒక్క పని యందు, ఒక్క నిర్ణయము యందు" స్థిరముగా లేకపోవటం వలెనే వారు ఏదెను తోట నుండి బహిష్కరించబడ్డారు.■ "సంఘము 'లో' స్త్రీ పాత్ర" ■ 


సంఘము - దేవుని మందిరము - (1 తిమోతి. 3:15)
ఉపదేశము అనగా బోధ చేయుట.
అధికారము అనగా బాధ్యత, దొరతనము చేయుట, ఆధిపత్యము కోరుట.

★  "ఏదెను తోటలో అనగా పండ్లు తినక ముందు స్త్రీకి పురుషునికి సృష్టి మీద సమాన అధికారాలిచ్చాడు". - (ఆది కాండము 1:28) కాని ఒకరి మీద ఒకరికి అధికారం ఇవ్వలేదు.

★ ఎప్పుడైతే హవ్వ(స్త్రీ) పురుషుని(ఆదాము) మీద అధికారం చేసి దేవుని ఆజ్ఞను తృణీకరించిందో ఆనాడే దేవుడు స్త్రీ మీద అధికారం పురుషునికి ఇచ్చాడు. పురుషుని యెడల స్త్రీకి వాంఛ కలుగజేసాడు. - (ఆది. కాండము. 3:16).

A). సంఘము 'లో' స్త్రీలు ఏమి అలంకరించుకోకూడదో, ఏమి అలంకరించుకోవాలో దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరుస్తున్నారు - (1 తిమోతి. 2:9-10; 1 పేతురు. 3:3-4).

B). సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. - (1 తిమోతి. 2:11; 1 కోరింది. 14:35).

C). సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండాలి, ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు ఆమెకి సెలవు లేదు - (1 కోరింది. 14:34; 1 తిమోతి. 2:12).


★ స్త్రీకి సంఘము 'లో' ఉపదేశము, అధికారము చేయుటకు సెలవు లేదని ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది. - (1 కొరింది. 14:34).

* ఉదా: లేవి గోత్రములో ఉండే మూడు వంశస్థులు మాత్రమే దేవుని మందిరము పై అధికారము కలదు.

1) గెర్షోను - (సంఖ్యా. 3:17-18,21; 3:25-26)
2) కహాతు - (సంఖ్యా. 3:17,19; 3:29-32)
3) మెరారి - (సంఖ్యా. 3:17,20; 3:36-38)
మన తండ్రియైన దేవుడు "ఆ ముగ్గురుకి ఆయా వంశస్థుల వారికి" మూడు రకాల పనులు ఇచ్చారు.

నా సహోదరులారా!! ధర్మశాస్త్రములో ఏ స్త్రీ కూడా దేవుని పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము లోనికి వెళ్లి సేవ చేసినట్టుగా గ్రంథములో రుజువులు లేవు కారణము అవి లేవి యాజకులకు(పురుషులు) మాత్రమే అప్పగింపబడింది.

పాత నిబంధనలో భక్తిపరులైన స్త్రీలు, ప్రవక్తిలు ఉండవచ్చు కానీ వారు పురుషులు మీద నాయకత్వము వహించినట్టుగా రుజువులు లేవు. ప్రవక్తిరాండ్రుకి దేవుడు ఎలా చెపుతే అలాగునే చేసారు తప్ప పురుషులు మీద అధికారము చేయలేదు.

D) భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు స్త్రీ జాగ్రత్త వహించాలి - (తీతుకు. 2:3).

E). సంఘములో యవ్వన స్త్రీలు, తమ పిల్లలకి ఉపదేశము చేయవచ్చు - (తీతుకు. 2:4-5).

F) క్రీస్తులోనికి బాప్తిస్మము పొందు కార్యక్రమములో స్త్రీ, పురుషుడు అని బేధము లేదు - ( గలతి. 3:27-28).

F). స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడు మాత్రమే అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి.★ "స్త్రీ ఎందుకు మౌనము వహిస్తూ, సంఘములో ఉపదేశమును, అధికారము చేయకూడదు.."?.

1) మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? - (1 తిమోతి 2:13).
2) ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. - (1 తిమోతి 2:14).
3) "స్త్రీకి శిరస్సు పురుషుడు" - ఇది దేవుని క్రమము (శిరస్సు అనగా అధికారమునకు సూచన) - (1 కొరింది. 11:3)


★ మొదటి సృష్టిలో జరిగిన పరిస్థితి అనగా " స్త్రీ నాయకత్వములో శాపము కలిగింది". మరల క్రీస్తు నందు నూతన సృష్టిలో (2 కొరింది. 5:17) అలా జరుగకూడదు అనే దృష్టితో దేవుడు ఆమెకి సెలవు ఇవ్వలేదు.
■ "సువార్త 'లో' స్త్రీ పాత్ర" ■


Note:- స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడుకు మాత్రమే అనే విశేషమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి.

A) ప్రిస్కిల్ల తన భర్తయైన అకులతో పౌలుకొరకు సువార్త విషయములో ప్రాణం యివ్వడానికైనా తెగించింది - (రోమా 16:4).
ప్రిస్కిల్ల అకులయు ఒక సువార్తకునికి బోధ చేస్తున్నారు. ఇది సంఘము యొక్క పరిస్థితి కాదు. ప్రిస్కిల ఇంటి వాతావరణములో జరిగిన కార్యక్రమము. - (అపో.కార్య. 18:24-26).
B) యూనీయ - (రోమా 16:7)
C) త్రుపైనాకు, త్రుఫోసాకు, పెర్సిసు - (రోమా 16:12)
D) యూలియా - (రోమా 16:15)
E) నేరియకు సహోదరి - (రోమా 16:15)
F) ప్రభువైన యేసును సేవించడంలో తనతో ప్రయాసపడిన యువొదియ, సుంటుకే సహాయము చేయుడని పౌలు కోరాడు - (ఫిలిప్పీ 4:2, 3)
G) నుంఫాకు తన యింటిని సంఘ కూడిక స్థలంగా యిచ్చింది - (కొలొస్స 4:15).


★ అన్యులైన పురుషులుకి స్త్రీలకు ఆమె సువార్త ప్రకటన చేయచ్చు (మత్తయి 28:19). కానీ దేవుని మందిరములో బోధ చేయుటకు ఆమెకి సెలవు లేదు

ప్రభువును సేవించడంలో అతడు వారితో కలిసి పని చేశాడు అందుకు వాత్సల్యముతో పౌల్ గారు వారికి వందన వచనాలను పంపారు.

ఆనాడు స్త్రీలు యేసుతో మరియు అపొస్తలతో కలసి సమానముగా సంఘములో ఉపదేశము(బోధ) చేసినట్టుగాని, పురుషులపై వారు అధికారం చేశారనిగాని, సంఘపు ఆరాధనలో నడిపించారనిగాని, పురుషులుతో కూడా సమానముగా నాయకత్వము వహించారు అని గాని నేటి క్రైస్తవ్యం తీర్మానించకూడదు.
 - (లూకా. 6:6; లూకా. 4:21; మత్తయి. 13:53; యోహాను. 6:59; మత్తయి. 21:23 యోహాను. 7:14; యోహాను. 8:2; అపో.కార్య. 5:21; 13:15; 16:31; 1 తిమోతి 2:8).


【 గమనిక 】


◆ పురుషులుకి అసాధ్యమైనది స్త్రీలకు మాత్రమే సాధ్యమైనది దేవుడు ఇచ్చిన వరమే గర్భఫలము. - (కీర్తన 127:3)
◆ పరిశుద్ధ గ్రంథములో స్త్రీ యొక్క పరిచారము  అమోఘమైనది.
◆ కుటుంబము పాత్రలో, తోటి పరిశుద్ధలకు(సంఘము) పరిచారము చేయుటలో, పిల్లలను పెంచే విషయములో, సువార్త పాత్రలో స్త్రీలకి సాటియైన వారు ఎవరు లేరు.

★ స్త్రీ పాత్ర లేకుండా పురుషుడు నాయకుడు కాలేడు.
★ పిల్లలు భక్తిపరులుగా తీర్చిదిద్దబడాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.
★ ఆమె గృహము ఆశీర్వాదించబడాలి అంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.
★ భర్త నుండి ప్రేమను పొందుకోవాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఉంది.

【 హెచ్చరిక 】

 దేవుడు ఒకేఒక్క విషయములోనే అనగా పురుషుడు మీద అధికారము, ఉపదేశము చేయుటకు ఆమెకి నాయకత్వము ఇవ్వలేదు.

● నా ప్రియమైన సహోదరి, దయచేసి దేవుడు ప్రభువుసంఘములో  ఇవ్వని నాయకత్వమును నీవు తీసుకొని, నీవు మరియు నీ కుటుంబము శాపమునకు గురి కావద్దు.

"దేవుని క్రమములో పురుషుడు పాత్ర" Click HERE 

మీ ఆత్మీయ సహోదరుడు,
💌 మనోహర్ బాబు గుడివాడ

Share this

Related Posts

Previous
Next Post »

24 comments

comments
Anonymous
April 20, 2017 at 5:33 PM delete

Good message anna

Reply
avatar
Anonymous
April 20, 2017 at 7:19 PM delete

చాల థాంక్స్ అన్నయ వందనములు

Reply
avatar
Anonymous
April 20, 2017 at 7:37 PM delete

Annaya chala baga rasav Annaya very very neat and good explanation wonderful Annaya God bless u Annaya - naveena beulah

Reply
avatar
Anonymous
April 20, 2017 at 7:38 PM delete

స్త్రీ బోధ చేయకూడదు అని మాత్రమే తెలుసు కాని దాని వెనకాల ఇంత రహస్యము ఉంది అని ఇప్పుడే తెలుసుకున్న బ్రదర్
మీ పోస్టులు నాకు చాల ఆలోచింప చేస్తున్నాయి.. వందనములు అన్న

బ్రదర్ చిన్నా

Reply
avatar
Anonymous
April 20, 2017 at 8:25 PM delete

మీరు సూపర్ బ్రదర్ మీ తదుపరి అంశము కొరకు నేను wait చేస్తున్నా....
గుంటూరు కిషోర్

Reply
avatar
April 20, 2017 at 8:30 PM delete

వందనములు బ్రదర్ చిన్నా

Reply
avatar
April 20, 2017 at 8:31 PM delete

వందనములు బ్రదర్ కిశోరె

తప్పకుండా రాసి షేర్ చేస్తాను. (Y)

Reply
avatar
April 20, 2017 at 8:33 PM delete

వందనములు అమ్మ థాంక్ యు

Reply
avatar
Anonymous
April 20, 2017 at 9:43 PM delete

Chala baga rasavu annaya. Ni link what's app lo chusanu. Kondharu ki send chesa.. dharma sastram cheputhundhi ane dhagara naku koncham ardham kaledhu. Migatha antha naku ardham ayindhi annaya. Miku naa vandanamulu.- sis.sailaja

Reply
avatar
Anonymous
April 20, 2017 at 9:47 PM delete

Could you please send me your email I'd
Bro.Raja (kuwait)

Reply
avatar
April 21, 2017 at 12:13 AM delete

Hai Sister sailaja.

Nenu inko post lo dhani gurchi marala vivaramuga rasi istanu. Okkasari numbers 3 chapter chudu.

Vandhanalu sister :)

Reply
avatar
April 21, 2017 at 12:16 AM delete

Yeah, sure brother
* Email I'd:- cockm3@gmail.com
Greetings brother!! :)

Reply
avatar
Anonymous
April 21, 2017 at 6:36 AM delete

Thammudu, adam & Eve ki devudu sapam veyaledhu siksha vesaru.
Bhoomi ki, snake, devudu sapam vesaru. Okkasari Bible chudu. Migatha post antha Good. Vandhanalu thammudu. - joseph (KKD)

Reply
avatar
Anonymous
April 21, 2017 at 12:11 PM delete

వందనములు బ్రదర్ గారు నా పేరు అనిల్ కుమార్, రేణిగుంట. మీరు ఎంత సమయము బైబిల్ చదవడానికి, ఇలాంటి పోస్టులు రాయడానికి కేటాహిస్తున్నారు. చాల అనుభవపూర్వకముగా రాస్తున్నారు. మిమ్మలి బట్టి నేను మన దేవుడి కి కృతజ్ణత తెలియజేస్తున్నా...

Reply
avatar
April 21, 2017 at 2:35 PM delete

Nice work Manohar, Keep it up

Reply
avatar
April 21, 2017 at 8:19 PM delete

వందనములు సిస్టర్ శైలజ గారు
మీరు అడిగిన దానికి సంఖ్యా 3 1 కోరింది 14:34-35 అధ్యయము ఒక్కసారి చూడండి. దేవుని మందిరములో ఎవరు (పురుషుడు లేక స్త్రీ) సేవ చేయాలి అనేది తేస్తాదు.

Reply
avatar
April 21, 2017 at 8:21 PM delete

మలకీ 2:2 చుడండి వందనములు బ్రదర్ జోసెఫ్

Reply
avatar
April 21, 2017 at 8:22 PM delete

వందనములు బ్రదర్ అనిల్ నేను ఒక 3 to 5గంటలు రాయడానికి చదవడానికి కేటాహిస్తున్న..

Reply
avatar
David
May 2, 2017 at 8:15 PM delete

Amen Thanks anna KM

Reply
avatar
August 18, 2017 at 12:27 AM delete

పరిశుద్ధాత్మయైన దేవుని నడిపంపుతో చక్కటి ఆలోచన.
చాలా చాలా వందనములు బ్రదర్ మనోహర గారు

Reply
avatar
July 4, 2018 at 8:25 PM delete

Only this message is according to Bible.

Reply
avatar
September 2, 2018 at 8:24 AM delete

Thanks sir... వందనాలు

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16