మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
క్రైస్తవ సంఘములలో అనేక మంది, వారి తోటి పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు కొందరు మరణాత అని, షాలోమ్ అని, మరికొందరు ప్రైస్ ది లార్డ్ అని, ఇంకొంతమంది వందనములు అని....etc
ఇలా ఒకరికొకరు చెప్పుకోవడము చూస్తూ ఉంటున్నాము. వాస్తవానికి మన తోటి పరిశుద్ధులను కలసినప్పుడు మనము ఏమి చెప్పాలో పరిశుద్ధ గ్రంథము నుండే ఆలోచన చేద్దాము.
★ "మరణాత" ★
● గ్రీక్ 'లో' - "Μαράναά" (మరణాత).
● ఇంగ్లీష్ 'లో' - "maranatha".
● తెలుగు 'లో' - "ప్రభువు వచ్చుచున్నాడు", "ప్రభువా రమ్ము", "ప్రభువు వచ్చియున్నాడు", మరియు "మరన్ఆత".
● పరిశుద్ధ గ్రంథము అంతటిలో "మరన్ఆత" అనే పదమును 📖1కోరింథీయులకు. 16: 22📖 మాత్రమే చూడగలము.
● ప్రభువును ప్రేమింప లోకము అందలి వాటిని ప్రేమించే వారికి "1యోహాను. 2:16" పౌల్ గారు హెచ్చరిక చేయుచున్నాడు అంతే కాని ఆత్మీయ పలకరింపు మాత్రము కాదు.
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు "మరన్ఆత" అని సంబోధించాలని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.
★ "షాలోమ్" ★
● హీబ్రూ 'లో'- "שָׁלוֹם". (šā·lō·m)
● గ్రీక్ 'లో' - "Εἰρήνην". (eirēnēn)
● ఇంగ్లీష్ 'లో' - "peace".
తెలుగు 'లో' - "శాంతి, సమాధానము"
● "(నిర్గమ. 14:14; సంఖ్యా. 6:26; యెషయా. 26:12; యోహాను. 14:17; కోలాస్సి. 3:15)".
◆ శాంతి అనగా అర్ధము "ఆనందము, హాయి".
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు "షాలోమ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.
★ "ప్రైస్ ది లార్డ్" ★
● హీబ్రూ 'లో' - "השבח לאל".
● గ్రీక్ 'లో' - "Αἰνετε τὰ Κύριον".
● ఇంగ్లీష్ 'లో' - "Praise The Lord".
● తెలుగు 'లో' - " దేవుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి".
◆ "లేయా" - యెహోవాను స్తుతించుట - (ఆది. కాండము. 29:35).
◆ కీర్తనల గ్రంథ రచయిత - యెహోవాను 'లేదా' దేవుని స్తుతించుట - (కీర్తనల 7:17; 33:2; 104:35; 115:18; 116:19; 148:1,7).
◆ నెబు కద్నెజరు దేవుని స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాడు. - ( దానియేలు 4: 37).
◆ "ప్రభువును స్తుతించుడి" - ( రోమా 15:11; యెషయా 12:4).
◆ "స్తుతించుట" అనగా అర్ధము "పొగడుట, అభివర్ణించు, కీర్తించు, స్తోత్రముచేయు, కొనియాడు..."
★ ఇరుగురు కలుసుకొని ఒకరికొక్కరు "ప్రైస్ ది లార్డ్" అని అనుకొనుట వలన నిజముగా దేవుని అభివర్ణించు కార్యక్రమము జరుగదు.
■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు "ప్రైస్ ది లార్డ్" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.
★ "వందనములు" ★
● గ్రీక్ 'లో' - "ἀσπάσασθε" (అస్పసస్తే).
● ఇంగ్లీష్ 'లో' - "Salute, Greet".
● తెలుగు 'లో' - "వందనములు లేదా శుభము".
★ "వందనములు" అనగా అర్ధము " అభివాదనము, నమస్కారము, అభినందనము...".
★ యోసేపు రాజుగా ఉన్నపుడు అతని సహోదరులు వచ్చి అతనికి "వందనము" చేశారు - (ఆది. కాండము. 42:6).
★ మోషే తన మామమైన యిత్రో కి వందనము చేసేను - (నిర్గమ 18:5-7).
★ రోమా సైనికులు యేసుకి వందనము చేశారు - (మార్కు 15:18).
★ మరియ వచ్చి ఎలీసబెతుకు వందనము చేసెను. - (లూకా 1:40).
★ పౌల్ గారు ప్రిస్కిల్లకును, అకులకును, వారి యింట ఉన్న సంఘమునకును, ఎపైనెటుకును, బహుగా ప్రయాసపడిన మరియకును, పౌలు తన తోడి ఖైదీలైన అంద్రొనీకుకును మరియు యూనీయకును, అంప్లీయతునకు, ఊర్బానుకును మరియు స్టాకునకును, అపెల్లెకును మరియు అరిస్టొబూలు ఇంటివారికిని, హెరోది మరియు యోనుకును, నార్కిస్సు ఇంటి వారికిని, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును మరియు త్రుఫోసాకును, ప్రియురాలగు పెర్సిసునకును, రూపునకును, అసుంక్రితుకును, ప్లెగోనుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును,
పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని,
నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును, తెర్తియు,గాయియు,క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారని పౌలు గారు తెలియపరుచుట - (రోమా 16:1-23).
★ వందనము అనేది ఒక ఆత్మీయ పలకరింపు.
■ "ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి". - (ఫిలిప్పీయులకు 4: 21).
■ "పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు". - ( 2కోరింథీయులకు 13: 13).
● "పవిత్రమైన ముద్దుతో వందనములు" ●
★ "ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి". - ( 1పేతురు 5: 14).
★ పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి. - ( 1థెస్సలొనికయులకు 5: 26)
★ పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. - ( రోమీయులకు 16: 16)
Salute one another with an holy kiss.
★ "ముద్దుతో" అనగా "పరిశుద్ధలైన సహోదరులు యొక్క నిజమైన ప్రేమకి ఇది ఒక చిహ్నము వంటిది".
💌 యూదులు యొక్క ఆచారము వారు తోటి సహోదరులుకి వందనము చెప్పినప్పుడు పవిత్రమైన ముద్దుతో పెట్టి చెప్పేవారు - ( ఆది. కాండము. 45:15; నిర్గమ 18:7; 1 సమూయేలు 10:1; మత్తయి 26:49; లూకా 22:48; 1 కోరింది 16:20; 2 కోరింది 13:12).
✏ పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే. - (2థెస్సలొనికయులకు 3: 17).
✏ మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. - ( హెబ్రీయులకు 13: 24).
◆ నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడైయుండును గాక. - (తీతుకు 3:15).
👪 "క్రీస్తుసంఘములన్నియు"
మీకు వందనములు చెప్పుచున్నవి. (రోమీయులకు 16: 16) 👪
● The "churches of Christ" salute you.
✏ ఈ అంశమును చివరి వరకు ఓపికతో చదివిన మీకు నా వందనములు
మీ ఆత్మీయ సహోదరుడు.
💌 KM
15 comments
commentsవందనములు అన్నయ్యా
ReplySuper brother vandhanalu
Replyచాలా బాగుంది తమ్ముడు �� వందనములు. అమ్మ గారికి ఎలా ఉంది..?
Replyమీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు తమ్ముడు.
Replyమీరు రాస్తున్నా ప్రతి అంశములును నేను అనుదినము చూస్తున్నా.. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానము బట్టి దేవునికి సోత్రము.
బ్రదర్ . చిన్నా
వందనములు అమ్మ
Replyవందనములు బ్రదర్ చిన్నా గారు (*_*)
Replyదేవుని మహా కృపను బట్టి ఆమె బాగున్నారు బ్రదర్ థాంక్స్
Replyవందనములు బ్రదర్.
వందనములు బ్రదర్/సిస్టర్
ReplyWow super brother
ReplyVandhanalu Brother
ReplyBrother పై పోస్ట్ ని బట్టి ధన్యవాదములు.. నాదో చిన్న సందేహం. మరి వందనములు English లో ఏలా చెప్పాలి?
ReplyGreetings or Greet or salute Rom 16:16
ReplyVandanalu Brother..
ReplyRevelation(ప్రకటన గ్రంథము) 22:17
Replyఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను;
దేవునికి వందనములు చెపొచ్చా బ్రదర్
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com