నరుని ఆలోచనలు (Thoughts of Man)

నరుని ఆలోచనలు (Thoughts of Man)


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.


నరుడు తనలోతాను అనేక ఆలోచనలు కలిగి ఉంటాడు. కొందరు తమ అలోచనలు తమ కొరకు మాత్రమే పరిమితం చేసుకొంటే, మరికొందరు తమ ఆలోచనలను ఎదుటివారిపై ప్రభావితం చేస్తారు. అయితే తమ ఆలోచనలు వాక్యానుసారముగా, దేవుని ఇష్టానుసారంగా ఉన్నాయో, లేవో అని పరీక్షించుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి. క్రీస్తు నందు లేనివాడు మాత్రం దేవునిచిత్త ప్రకారముగా అలోచించలేడు. అయితే క్రీస్తు నందు ఉండాలనేకునేవాడు తన ఆలోచనలు ఎక్కడ పుట్టునో, అవి ఎట్టివో, ఎలా అదుపులో పెట్టుకోగలడో, తెలుసుకోవలసిన అవసరత ఉంది.

● ఆలోచన =  తలంపు, యోచన 

 నరుని ఆలోచనలు ఎక్కడ పుట్టును?


⏭ "నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము." (సామెతలు. 19:21).

⏭ "దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును" (మత్తయి. 15:19).

⏭ "లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును." (మార్కు. 7:21-22)


 నరుని ఆలోచనలు ఎట్టివి?


1). నరుని యొక్క ఆలోచనలు చెడ్డవి :

➠ "నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి" (ఆది.కాం. 6:5)

➠ ".... నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹" (ఆది.కాం. 8:21)

➠ "తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను." (యెషయా. 65:2)


2). నరుని యొక్క ఆలోచనలు రహస్యమైనవి :

● ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరొక్క వ్యక్తి కనుగొనలేడు కానీ దేవుడైన యెహోవా ఎరిగినవాడు.

➠ "తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరి గించువారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి– ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి– ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?" (యెషయా. 29:15-16)


➠ "యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు." (కీర్తనలు. 139:4-6)


3). నరుని యొక్క ఆలోచనలు దురాలోచనలు :

➠ "భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురువారినిచూచి పండ్లు కొరుకుదురు." (కీర్తనలు. 37:12)

➠ "యేసు వారి తలంపులు గ్రహించి-మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?" (మత్తయి. 9:4)

➠ "మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?౹" (యాకోబు. 2:4)

➠ "దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు." (సామెతలు. 15:26)


4). నరుని యొక్క ఆలోచనలు సొంత ఆలోచనలు :

➠ "అయితే మేము వినమని వారనుచున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగిన దానిని తెలిసికొనుము.౹ భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.౹ షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.౹" (యిర్మీయా. 6:18-20).

➠ "సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీ దహనబలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.౹ నేను ఐగుప్తు దేశములోనుండి మీపితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చితిని ఏదనగా– నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులైయుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.౹ అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.౹ మీపితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.౹ వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమపితరులకంటె మరి దుష్టులైరి. నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తర మియ్యరు గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము– వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది. తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.౹" (యిర్మీయా. 7: 21-29)

➠  "యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన. వాక్కు –నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.౹ నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను.౹ కుమ్మరి జిగటమంటితో చేయుచున్నకుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొకకుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కు — జిగటమన్ను కుమ్మరిచేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.౹ దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమునుగూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.౹ మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమునుగూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును.౹ కాబట్టి నీవు వెళ్లి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము– యెహోవా సెలవిచ్చినమాట ఏదనగా– మీమీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచనచేయుచున్నాను, మీరందరు మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి.౹ అందుకు వారు– నీ మాట నిష్ ప్రయోజనము; మేము మా ఆలోచనల చొప్పున నడుచు కొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అనియందురు. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసియున్నది.౹" (యిర్మీయా. 18:1-3)


5) నరుని యొక్క ఆలోచనలు మోసకరమైనవి :

 ➠ "నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు." (సామెతలు. 12:5)


6). నరుని యొక్క ఆలోచనలు పాపాన్ని కూర్చుకొనేవి :

➠ "యెహోవా వాక్కు ఇదే –లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు" (యెషయా. 30:1)


7). నరుని యొక్క ఆలోచనలు పనికిమాలినవి :

 ➠ "నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది." (సామెతలు. 10:20)

● భక్తిహీనులు అనగా దేవుని మాటలకు తన హృదయములో చోటియ్య నొల్లనివాడు.


8). నరుని యొక్క ఆలోచనలు వ్యర్ధమైనవి :

➠ "నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది. యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు." (కీర్తనలు. 94:11-12)

➠ "ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.౹" (అపో.కార్య. 4:26)


 నరుడు తన ఆలోచనలను అదుపులో పెట్టుకోగలడా?


➦ అవును, నరుడు కచ్చితంగా పెట్టుకోగలడు ఏలయనగా, "ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.౹ మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.౹ దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.౹ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును." (ఫిలిప్పీ 4:4-7)


కాబట్టి ప్రతి వానికి తగిన మెప్పు ప్రభువు వలన దేవుని యొద్ద కలుగుతుందని గుర్తెరిగి జాగ్రత్తగా నడుచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 

➦ "కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును." (1 కొరింథి. 4:5)

మీ ఆత్మీయులు...👪

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
October 29, 2023 at 7:51 PM delete

వందనాలు అన్నయ్య క్రీస్తు రాకడ గూర్చి ఒక్క అంశము రాయండి అన్నయ్య.
Thank you

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16