క్రైస్తవులకు ఆజ్ఞాపించని పండుగలు ❌


(మానవ ఆజ్ఞలు – మానవ పద్ధతులు – వాటి ఫలితాలు)
(వాక్యాధారం • చరిత్ర • మూలం • ఫలితము • తీర్పు)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


బైబిల్ ప్రకారం ఆరాధన, పండుగలు, ఆజ్ఞలు అన్నివిషయాలలో అధికారం కలవాడు మన తండ్రియైన దేవుడే(YHWH). మనుషుల ఇష్టానుసారంగా తన్ను ఆరాధించుటకు, పండుగలు, పద్ధతులు, కార్యక్రమాలు, ఆచారాలను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనుషులకు ఎన్నడూ అనుమతించలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెబుతుంది:

"మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.౹" "నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు." (ద్వితీయోపదేశకాండము 4:2; 12:32) "ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు."(సామెతలు. 30:6)

పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు తానే ఆజ్ఞాపించిన పండుగలు, విధులు, కాలములు ఉన్నప్పటికీ, వారు వాటిని విడిచిపెట్టి తమ సొంత ఆలోచనలు, మానవ సంప్రదాయాలు, అన్య ఆచారాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న పండుగలను ఆచరించినప్పుడు దేవుని తీవ్ర ఉగ్రతకు, ఘోరమైన తీర్పులకు పాత్రులయ్యారని, దేవుని ఆజ్ఞను దాటివెళ్లి “యెహోవాకు పండుగ” అని మనుషులు తమకు నచ్చిన విధంగా ప్రకటించిన ప్రతి సందర్భంలో ఫలితం వారికి శిక్షగానే మారిందని గతములో "ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించని పండుగలుక్లిక్ చేయు" అనే అంశము ద్వారా తెలుసుకున్నాము.

అదే విధంగా క్రొత్త నిబంధనలో, దేవుడు స్పష్టంగా "క్రైస్తవులకు ఆజ్ఞాపించిన ఏకైక పండుగ"క్లిక్ చేయుప్రభువు బల్ల (ప్రభువు రాత్రి భోజనం) మాత్రమే అని అపోస్తలుల బోధ ద్వారా మనకు వెల్లడయింది. అయినప్పటికీ, ఈ సత్యాన్ని గుర్తించక అనేకులు గ్రంథము చెప్పని పండుగలను, దేవుడు ఆజ్ఞాపించని పద్ధతులను “ఆరాధన అంటూ”, “జ్ఞాపకం అంటూ”, “సువార్త కార్యక్రమం అంటూ” “క్రైస్తవ వేడుకలు” అనే వివిధ పండుగల పేర్లతో ఆచరించుచున్నారు. ఉదాహరణకు: క్రిస్టమస్, శుభ శుక్రవారం, ఈస్టర్… ఐతే ఇవేవీ మన తండ్రియైన దేవుని ఆజ్ఞ లేకుండానే, మానవ సంప్రదాయాలు, అన్యమత ఆచారాలు, సంఘ చరిత్ర నిర్ణయాలు ద్వారా ప్రవేశించాయి.  ఈ పండుగలను చేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడా ఆజ్ఞాపించలేదు. యేసు యొక్క శిష్యులైన అపొస్తలులు ఎక్కడా ఆచరించలేదు. అలాగే క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘానికి ఎక్కడా విధించలేదు.

ఈ అంశము యొక్క ఉద్దేశ్యం — పాత నిబంధనలో మానవ యోచనలతో ఏర్పాటైన పండుగలు ఎలా దేవుని కోపానికి కారణమయ్యాయో గుర్తించక, అదే తప్పు తిరిగి క్రొత్త నిబంధనలో క్రైస్తవులనబడినవారు అదే విధముగా తిరిగి చేయుచున్నారా అనే విషయాన్ని గ్రంథ ఆధారంగా పరిశీలించుటకను. అలాగే, ప్రభువు ఆజ్ఞాపించిన దానిని విడిచి మానవ ఆచారాలను స్వీకరించినప్పుడు కలుగు ఆత్మీయ పరిణామాలను స్పష్టంగా తెలియజేసి, పాఠకులను వాక్యాధారమైన సత్యానికి తిరిగి పిలుచుటయే ఈ అంశముని ముఖ్య లక్ష్యం.
అయితే —

👉 ఇవి ఎలా ప్రారంభమయ్యాయి?
👉 వీటి మూలం దేవుని ఆజ్ఞయా? (లేక) మానవ ఆలోచనా?
👉 బైబిల్ వీటిని అనుమతిస్తుందా? (లేక) హెచ్చరిస్తుందా?
👉 ఇవి చేయుట వలన క్రీస్తు ప్రత్యక్షతలో కలుగు ఫలితం ఏమిటి?
👉 దేవుని తీర్పు విషయములో గ్రంథము ఏమి చెబుతుంది?

ఈ అంశంలో,
భావోద్వేగాల ఆధారంగా కాదు,
సంప్రదాయాల ఆధారంగా కాదు,
మనుషులు ఊహలు/లోకపరమైన సంతోషాలు బట్టి కాదు,...
కేవలం క్రొత్త నిబంధన ఆధారముగాను, చరిత్ర ఆధారముగాను, తేదీల ఆధారముగాను... “క్రైస్తవులకు దేవుడు ఆజ్ఞాపించని పండుగలు”
అని స్పష్టంగా వెల్లడించబోతున్నాము. కావున చివరి వరకు శ్రద్ధగా చదివి ఆలోచన చేయవలసిందిగాను, మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయవలసిందిగా మా మనవి 🙏🏿

“మనుష్యుల ఆజ్ఞలకన్నా దేవుని ఆజ్ఞను గౌరవించుదామా?” 


1️⃣. క్రైస్తవులకు ఆజ్ఞాపించని పండుగలు (జాబితా)
ఈ క్రింద పేర్కొన్నవి క్రొత్త నిబంధనలో ఎక్కడా ఆజ్ఞాపించబడలేదు:
1. భస్మ బుధవారం (Ash Wednesday)
2. 40 దినాల ఉపవాసం (Lent Days)
3. మట్టల ఆదివారం (Palm Sunday)
4. శుభ శుక్రవారం (Good Friday)
5. ఈస్టర్ (Easter)
6. సమాధుల పండుగ (All Souls’ Day)
7. క్రిస్మస్ (Christmas)
8. పాత నిబంధన పండుగలను క్రైస్తవులపై విధించడం (ఛాయలు)... Etc 


2️⃣. ఒక్కొక్క పండుగ – విశ్లేషణ

A). భస్మ బుధవారం
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధనలో భస్మ బుధవారం ఆచరించండి అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.

🔵 ఏమి చేస్తున్నారు? — నుదిటిపై భస్మం (బూడిద) ఉంచి, ✝️ క్రాస్ గుర్తు వేయడం “నీవు మట్టివాడివి, మట్టిలోకే తిరిగిపోతావు” అనే మాటలు ఒకరినొకరు చెప్పడం, 40 రోజుల లెంట్ ఉపవాస కాలానికి ప్రారంభ దినంగా పాటించడం, పశ్చాత్తాపం/మారుమనస్సుకి సూచనగా చేయడం. 
➡️ ఇవన్నీ బయటి మతాచారాలు
➡️ హృదయ మార్పును నిర్ధారించేవి కావు

🟡 మూలం / చరిత్ర
అపొస్తలుల కాలంలో ఈ ఆచారం లేదు. క్రీ.శ. 34వ సం.లో క్రీస్తు సంఘము ప్రారంభమైన తరువాత అనగా  క్రీ.శ. 4వ–6వ శతాబ్దాల మధ్య కాలములో రోమన్ క్యాథలిక్ సంఘంలో ప్రారంభమైంది. పాత నిబంధనలోని బూడిదలో కూర్చోవడం (యోబు, యోనా మొదలైనవి) వాటిని క్రొత్త నిబంధన ఆచారంగా మార్చారు
➡️ ఇది దేవుని ఆజ్ఞ కాదు — సంఘ సంప్రదాయం (Church Tradition)

📅  తేదీ — ప్రతి సంవత్సరం ఈస్టర్‌కు ముందు 46వ రోజు (బుధవారం). ఏటేటా తేదీ మారుతూ ఉంటుంది
➡️ బైబిల్ ఎలాంటి తేదీ నిర్దేశించలేదు

📖 బైబిల్ ప్రకారం?
మారుమనస్సు అనేది ఒక్కసారే జరిగే ప్రక్రియ కాదు, నీలో లోపం కనపడే ప్రతి విషయములో మారుమనస్సు పొందుటకై ఆలోచన చేయాలి. క్రీస్తు లాంటి పరిపూర్ణమైన వ్యక్తిగా కాబడేవరకు… (అపో.కార్య. 2:37-40; 17:30; 1పేతురు 3:21; 2పేతురు. 3:9).
బైబిల్ లో బూడిద = పశ్చాత్తాప సూచనగా ఉంది
(యోబు 42:6, యోనా 3:6) కానీ ప్రత్యేక దినం, నుదిటిపై భస్మం పెట్టుకోవడం, వార్షిక మతాచారంగా చేయడం ఇవన్నీ క్రొత్త నిబంధనలో లేవు.
బూడిద పెట్టుకోవడం = బాహ్య ఆచారం
కాని దేవుడు కోరేది = హృదయ మార్పు/మారుమనస్సు

👤 యేసు ఏమి కోరారు? — మత్తయి 4:17; లూకా 13:3; రోమా 12:1; మత్తయి. 26:26-28; లూకా 22:19-20
❌ నుదిటిపై భస్మం కాదు
❌ ఒక ప్రత్యేక బుధవారం కాదు
✔️ నిజమైన పశ్చాత్తాపం
✔️ హృదయ మార్పు
✔️ ప్రతిదిన పవిత్ర జీవితం

⚖️ తీర్పు హెచ్చరిక  — మత్తయి 15:6-9; ప్రకటన. 22:11-13; 18-19

మరింత విశ్లేషణ కోసం భస్మ బుధవారం అనే అంశమును చదవండి.


B). 40 దినాలు ఉపవాసం
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధనలో 40 దినాలు ఉపవాసం(లెంట్ డేస్) ఆచరించండి అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.

🔵 ఏమి చేస్తున్నారు? — యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నారని... లెంట్ డేస్ అని నామకరణం చేసుకొని ఆ కాలంలో చాలా సంఘాలలో 40 రోజులు ఉపవాసం పేరుతో కొంత ఆహారం మానడం/రెండు పూటలు మానటం, మాంసాహారం, మద్యము మానడం, కొన్ని వినోదాలు విడిచిపెట్టడం, ప్రత్యేక ప్రార్థనలు, వారి ప్రత్యేక దిన ఆరాధనలు
“త్యాగం = ఆత్మీయత” అన్న భావన కల్పించడం
➡️ ఇవన్నీ బయటి నియమాలు
➡️ హృదయ పరిశుద్ధతకు హామీ ఇవ్వవు 
మన ప్రభువైన యేసుక్రీస్తు బాప్తీస్మం ముందు అనగా 30 సం. వ్యవధిలో గానీ మరియు బాప్తీస్మం అనంతరం అనగా 33 1/2 సం. కాల వ్యవధిలో ఏటేటా ఆయన 40 దినాలును (లెంట్ డేస్) పాటించినట్టుగా ఒక్క వాక్య రుజువు ఉందా? "లేదు కదా" కాబట్టి యేసు చేశారు కాబట్టి మేము చేస్తున్నమని ఎలా సమర్ధించుకోగలరు? దయచేసి ఆలోచించమని మనవి.

🟡 మూలం / చరిత్ర —
అపొస్తలుల కాలంలో లెంట్ లేదు. క్రీ.శ. 34వ సం.లో క్రీస్తు సంఘము ప్రారంభమైన తరువాత అనగా క్రీ.శ. 4వ శతాబ్దం (సుమారు 325 AD, నికేయా సభ తరువాత) రోమన్ క్యాథలిక్ సంఘంలో ఈస్టర్‌కు ముందు సిద్ధపడే కాలంగా ప్రవేశపెట్టారు. 
యేసు చేసిన 40 దినాల ఉపవాసాన్ని తమ సంఘానికి నియమంగా మార్చారు
➡️ ఇది బైబిల్ ఆజ్ఞ కాదు — సంఘ సంప్రదాయం

📅  తేదీ — భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు ఆదివారాలు మినహాయించి 40 రోజులు. ప్రతి సంవత్సరం తేదీలు మారుతాయి
➡️ బైబిల్ ఎలాంటి కాల పరిమితిని నిర్దేశించలేదు

📖 బైబిల్ ప్రకారం? — ఉపవాసం = వ్యక్తిగత, స్వచ్ఛంద ఆత్మీయ సాధన ఎప్పుడూ అనేది వ్యక్తి నిర్ణయం, పరిస్థితుల ఆధారం, హృదయ స్థితి ఆధారం (మత్తయి 6:16-18) కాబట్టి సంఘం నిర్దేశించిన 40 దినాల నియమం
బైబిల్ ప్రకారం కాదు.

👤 యేసు ఏమి కోరారు? — లూకా 9:23; మత్తయి. 4:4; రోమా 14:17
❌ సంవత్సరానికి ఒకసారి 40 రోజులు కాదు
✔️ ప్రతిదిన పవిత్ర జీవితం

⚖️ తీర్పు హెచ్చరిక  — మత్తయి 15:6-9; గలతీయులకు 4:9–10; కొలస్సయులకు 2:20–23; ప్రకటన. 22:11-13; 18-19

మరింత విశ్లేషణ కోసం *లెంట్ డేస్" అనే అంశమును చదవండి.


C). మట్టల ఆదివారం
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధనలో మట్టల ఆదివారం ఆచరించండి అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.

🔵 ఏమి చేస్తున్నారు? — యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ప్రజలు
మట్టలు (తాటి కొమ్మలు) విరిచి మార్గములో పరచిన సంఘటనను జ్ఞాపకంగా
నేడు తమ సంఘాల్లో : మట్టలు చేత ఆశీర్వదించడం, ఊరేగింపులు, ప్రత్యేక ప్రార్థనలు, వీధుల్లో కేకలు, వారి ప్రత్యేక దిన ఆరాధనలు చేస్తున్నారు.
➡️ ఇవన్నీ స్మరణార్ధక మానవ పద్ధతులు, దేవుని ఆజ్ఞలు కావు.

🟡 మూలం / చరిత్ర —
ఈ దిన ఆచారం అపొస్తలుల కాలంలో లేదు. క్రీ.శ. 34వ సం.లో క్రీస్తు సంఘము ప్రారంభమైన తరువాత అనగా 4వ శతాబ్దం తరువాత (క్రీ.శ. 300–400 మధ్య) రోమన్ క్యాథలిక్ సంఘంలో పండుగల క్యాలెండర్ రూపంలో ప్రారంభమైంది. యూదుల పస్కా సందర్భంలో జరిగిన సంఘటనను ➜ వార్షిక పండుగగా మార్చారు
➡️ ఇది బైబిల్ మూలం కాదు — సంఘ సంప్రదాయం (Church Tradition).

📅  తేదీ — ప్రతి సంవత్సరం ఈస్టర్‌కు ముందు ఆదివారం తేదీ మారుతూ ఉంటుంది
➡️ బైబిల్ లో ఏ తేదీ నిర్ణయించబడలేదు.

📖 బైబిల్ ప్రకారం? — బైబిల్ లో ఉన్నది ఘటన మాత్రమే, పండుగ కాదు. సంఘటనకు సంబంధించిన వాక్యాలు: మత్తయి 21:1–11; మార్కు 11:1–10; లూకా 19:28–40; యోహాను 12:12–16

👤 యేసు ఏమి కోరారు? — యేసు కోరింది ఒక దిన ఆచారం కాదు, నిత్య జీవిత విధేయత. యోహాను 14:15; లూకా 9:23; 1 కొరింథీయులకు 5:7–8

⚖️ తీర్పు హెచ్చరిక  — మత్తయి 15:6-9; కొలస్సయులకు 2:16–17; గలతీయులకు 4:10–11; ప్రకటన. 22:11-13; 18-19

మరింత విశ్లేషణ కోసం *మట్టల ఆదివారం" అనే అంశమును చదవండి.


D). శుభ శుక్రవారం (Good Friday)
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధనలో యేసు మరణ దినాన్ని వార్షిక పండుగగా పాటించండి లేదా ఆచరించండి అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.

🔵 ఏమి చేస్తున్నారు? — శుభ శుక్రవారం సందర్భంగా చాలా సంఘాలలో ప్రత్యేక దిన ఆరాధనలు, దీర్ఘ ఉపవాసాలు, “మౌన దినం / దుఃఖ దినం”గా పాటించడం, క్రూసిఫిక్స్(సిలువ), గోర్లు, రక్తం వంటి చిహ్నాలపై ధ్యానం, యేసు శ్రమను నాటకాలు, ప్రసంగాలు రూపంలో చూపించడం, రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఎవరికైతే దర్శనం కలిగిందో, ఎవరైతే ఎన్నుకోబడతారో వారి చేత సిలువ ఆకారం లో చేసిన తెలియకపాటి వస్తువును వారి భుజాల మీద పెట్టి నడిపించడం… 
➡️ ఇవన్నీ స్మరణార్ధక మానవ ఆచారాలు
➡️ దేవుని ఆజ్ఞలు కావు.

🟡 మూలం / చరిత్ర —
అపొస్తలుల కాలంలో Good Friday అనే దిన ఆచారం లేదు. క్రీ.శ. 34వ సం.లో క్రీస్తు సంఘము ప్రారంభమైన తరువాత అనగా క్రీ.శ. 4వ శతాబ్దం తరువాత రోమన్ క్యాథలిక్ సంఘంలో వారి ఈస్టర్ పండుగ మునుపు ఒక “పాషన్ వీక్”గా ఉండుటకు ఇది రూపొందించబడింది
యేసు మరణ సంఘటనను ➜ క్యాథలిక్ మత సంఘాలు దీనిని ప్రత్యేక దినంగా స్థిరపరిచారు
➡️ ఇది బైబిల్ ఆజ్ఞ కాదు — సంఘ సంప్రదాయం

📅  తేదీ — ప్రతి సంవత్సరం ఈస్టర్‌కు ముందు శుక్రవారం. ఏటేటా తేదీ మారుతూ ఉంటుంది
➡️ బైబిల్ ఏ తేదీని నిర్దేశించలేదు
➡️ బైబిల్ లో కూడా యేసు మరణ దినంపై పండుగ ఆజ్ఞ లేదు

📖 బైబిల్ ప్రకారం? — బైబిల్ లో యేసు సిలువ పైన మరణమనేది అనాది దేవుని సంకల్పం. ఇది ఒక చారిత్రక ఘటన మాత్రమే కానీ పండుగ కాదు అంటే యేసు మరణం = రక్షణకు మూలమైన చారిత్రక సంఘటన కానీ దానిని వార్షిక దినంగా పాటించమని కాదు. “ఈ దినాన్ని జరపండి” అన్న ఆజ్ఞ లేదు. 
➡️ ప్రభువు మరణం — ప్రభువు బల్ల కార్యక్రమం ద్వారా ప్రతి ఆదివారం మనక జ్ఞాపకం చేయాలి. ఏటా ఒక రోజు కాదు. 

👤 యేసు ఏమి కోరారు? — లూకా 9:23; రోమా 6:6; గలతీయులకు 2:20
❌ ఏడాదికి ఒకసారి శుక్రవారం దుఃఖించడం కాదు
✔️ ప్రతిదిన సిలువ జీవితం
సిలువ జీవితం గడపడం, పాపం విషయమై మరణించి, నీతిగా జీవించడం. 

⚖️ తీర్పు హెచ్చరిక  — మత్తయి 15:6-9; కొలస్సయులకు 2:16–17; గలతీయులకు 4:10–11; ప్రకటన. 22:11-13; 18-19

⚠️ దేవుడు ఆజ్ఞాపించని దిన ఆచారాలను ఆత్మీయతగా మార్చడం = ప్రమాదం

మరింత విశ్లేషణ కోసం *గుడ్ ఫ్రైడే" అనే అంశమును చదవండి.


E). ఈస్టర్(Easter)
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధనలో యేసు పునరుత్థానాన్ని వార్షిక పండుగగా పాటించండి లేదా ఆచరించండి అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.

🔵 ఏమి చేస్తున్నారు? — ఈస్టర్ సందర్భంగా చాలా సంఘాలలో: ఉదయం ప్రత్యేక ఆరాధనలు, యేసు లేచారని అంటూ కార్యక్రమాలు, ప్రభువు బల్ల తీసుకోవడం, పిల్లలకు ఈస్టర్ ఎగ్స్, రాబిట్ వంటి చిహ్నాలు, పండుగ విందులు, ఉత్సవాలు. 
➡️ ఇవన్నీ సంఘ ఏర్పాటు చేసిన పద్ధతులు
➡️ అపొస్తలుల బోధలో లేవు

🟡 మూలం / చరిత్ర — 
అపొస్తలుల కాలంలో ఈస్టర్ పండుగ లేదు. క్రీ.శ. 34వ సం.లో క్రీస్తు సంఘము ప్రారంభమైన తరువాత అనగా క్రీ.శ. 4వ శతాబ్దం (325 AD – నికేయా సభ తరువాత) రోమన్ క్యాథలిక్ సంఘంలో పునరుత్థాన సంఘటనను వార్షిక పండుగగా స్థిరపరిచారు. 
“Easter” అనే పదం యూరోపియన్ అన్య దేవత Ēostre / Ishtar తో సంబంధం కలిగినదని చరిత్రకారులు చెబుతారు. 
గుడ్లు, రాబిట్ = ఫలప్రదతకు సంబంధించిన అన్య చిహ్నాలు
➡️ ఇది బైబిల్ మూలం కాదు — క్యాథలిక్ మత చరిత్ర మూలం

📅  తేదీ — ప్రతి సంవత్సరం వసంత సమానదినం తరువాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత ఆదివారం జరుపుతారు. ఏటేటా తేదీ మారుతూ ఉంటుంది. 
➡️ బైబిల్ ఎలాంటి తేదీ నిర్ణయించలేదు
➡️ అపొస్తలులు ఏ రోజు జరపలేదు

📖 బైబిల్ ప్రకారం? — “ఈ రోజున జరపండి” అనే ఆజ్ఞ లేదు. వార్షిక పండుగ ఆచారం లేదు. ప్రతి ఆదివారం ప్రభువు దినమే. ప్రభువు యొక్క త్యాగం జ్ఞాపకం చేసుకొనే దినమే. ప్రభువు లేచిన దినం ఆదివారం(లూకా 22:19; మత్తయి 28:1)

👤 యేసు ఏమి కోరారు? —
❌ ఏడాదికి ఒకసారి “ఈస్టర్” కాదు
✔️ ప్రతిదిన పునరుత్థాన జీవితం
✔️ ప్రభువు లేచిన దినం ఆదివారం (లూకా 9:23; మత్తయి 28:1; రోమా 6:4)

⚖️ తీర్పు హెచ్చరిక  — మత్తయి 15:6-9; ప్రకటన. 22:11-13; 18-19

⚠️ దేవుడు ఆజ్ఞాపించని
పండుగలను ఆధ్యాత్మిక కర్తవ్యంగా మార్చడం
➡️ దేవునికి ప్రీతికరం కాదు.

మరింత విశ్లేషణ కోసం *ఈస్టర్" అనే అంశమును చదవండి.


F). సమాధుల పండుగ
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధనలో మృతుల కొరకు ప్రత్యేక దినాన్ని  పాటించండి లేదా ఆచరించండి అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.

🔵 ఏమి చేస్తున్నారు? — సమాధుల పండుగ సందర్భంగా చాలాచోట్ల: సమాధుల వద్దకు వెళ్లడం, పూలు, దీపాలు, కొవ్వొత్తులు పెట్టడం, మృతుల కొరకు ప్రార్థనలు చేయడం, “ఆత్మలకు శాంతి కలగాలి” అనే భావనతో ఆచారాలు, కొన్ని చోట్ల భోజనాలు, ప్రత్యేక దిన ఆరాధనలు
➡️ ఇవన్నీ మృతులతో సంబంధం కలిగిన మానవ ఆచారాలు
➡️ క్రొత్త నిబంధన సంఘ బోధకు విరుద్ధం

🟡 మూలం / చరిత్ర —
అపొస్తలుల కాలంలో ఈ పండుగ లేదు. క్రీ.శ. 34వ సం.లో క్రీస్తు సంఘము ప్రారంభమైన తరువాత అనగా క్రీ.శ. 10వ శతాబ్దం (సుమారు 998 AD) రోమన్ క్యాథలిక్ సంఘంలో మృతుల కొరకు ప్రార్థన భావనతో ప్రారంభమైంది. అన్యజన సంప్రదాయాలలో ఉన్న ఆత్మల స్మరణ - క్రైస్తవ రూపం దాల్చింది
➡️ ఇది బైబిల్ మూలం కాదు — మత చరిత్ర మూలం
 
📅  తేదీ — సాధారణంగా నవంబర్ 02. కొన్ని ప్రాంతాలలో స్థానికంగా వేరు తేదీలు కలవు. మరికొందరు ఈస్టర్ పండుగ రోజే తమ వారి సమాధుల యొద్దకు వెళ్ళటం చూడగలం. 
➡️ బైబిల్ ఎలాంటి తేదీ నిర్ణయించలేదు
➡️ అపొస్తలులు ఏ రోజు జరపలేదు

📖 బైబిల్ ప్రకారం? — మరణించినవారు జీవులతో సంబంధం పెట్టుకోరు. వారి స్థితి తీర్పు కోసం నిలిచినది. మృతులతో సంబంధముండే ఆచారాలు యెహోవాకు హేయం. (హెబ్రీయులకు 9:27; లూకా 16:26; ప్రసంగి 9:5–6; ద్వితీయోపదేశకాండము 18:10–12)
➡️ కాబట్టి మృతుల కొరకు ప్రార్థనలు, సమాధుల ఆరాధన బైబిల్ విరుద్ధం.

👤 యేసు ఏమి కోరారు? —
❌ సమాధుల వద్ద ఆచారాలు కాదు
✔️ జీవించి ఉండగానే సిద్ధపడిన జీవితం (యోహాను 11:25–26; లూకా 16:31)
మృతులను స్మరించడం కాదు. జీవించి ఉండగానే పశ్చాత్తాపం, వాక్యానికి విధేయత, ప్రభువు బల్లలో భాగస్వామ్యం, పునరుత్థాన ఆశతో జీవితం

⚖️ తీర్పు హెచ్చరిక  — యెషయా 8:19; మత్తయి 15:6-9; ప్రకటన. 22:11-13; 18-19

⚠️ మృతుల పట్ల భక్తి పేరుతో జరిగే ఆచారాలు
➡️ జీవుల ఆత్మీయ జీవితాన్ని మోసం చేస్తాయి.

మరింత విశ్లేషణ కోసం సమాధుల పండుగ అనే అంశమును చదవండి.


G). క్రిస్మస్ (Christmas)
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధనలో యేసు జన్మదినాన్ని వార్షిక పండుగగా పాటించండి లేదా ఆచరించండి అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.
📌 యేసు/రక్షకుడు యొక్క జననం సత్యం ✔️
📌 ఏటేటా జన్మదిన పండుగ ఆజ్ఞ ❌

🔵 ఏమి చేస్తున్నారు? — క్రిస్మస్ సందర్భంగా చాలాచోట్ల: డిసెంబర్ 25న ప్రత్యేక ఆరాధనలు, క్రిస్మస్ చెట్టు అలంకరణ, శాంతా క్లాజ్, బహుమతులు, లైట్లు, కేకులు, విందులు, ఉత్సవాలు, నాటకాలు, పాటలు, డీజే డాన్సులు, సెమీ, గ్రాండ్, చిల్డ్రన్ క్రిస్మస్,...etc. 
➡️ ఇవన్నీ వారి సంఘం/సమాజం ఏర్పాటు చేసిన పద్ధతులు
➡️ అపొస్తలుల బోధలో లేవు. యేసు ఆజ్ఞ కాదు. 

🟡 మూలం / చరిత్ర —
అపొస్తలుల కాలంలో క్రిస్మస్ పండుగ లేదు. క్రీ.శ. 34వ సం.లో క్రీస్తు సంఘము ప్రారంభమైన తరువాత అనగా క్రీ.శ. 4వ శతాబ్దం (సుమారు 336 AD) రోమన్ సామ్రాజ్యంలో అన్యజనుల సూర్య పండుగ (Sol Invictus / Saturnalia) కాలంతో కలిపి యేసు పుట్టినరోజును డిసెంబర్ 25కి స్థిరపరిచారు. ఇది కేవలం వారి ఊహలు బట్టే ఏర్పాటు చేశారు. క్రిస్మస్ చెట్టు, లైట్లు, శాంతా క్లాజ్ ఇవన్నియు యూరోపియన్ అన్య సంప్రదాయాల ప్రభావం
➡️ ఇది బైబిల్ మూలం కాదు — మత/సాంస్కృతిక చరిత్ర మూలం.

📅  తేదీ —  కొందరు డిసెంబర్ 25 అని, కొంతమంది జనవరి 7న, ఇంకొందరు అక్టోబర్ 18, ఇంకొక సమూహం ఏప్రిల్ లో అని పాటించేవారు ఉన్నారు. 
➡️ బైబిల్ యేసు పుట్టిన తేదీ చెప్పలేదు
➡️ అపొస్తలులు ఏ తేదీ పాటించలేదు

📖 బైబిల్ ప్రకారం? — 
❌ పండుగగా కాదు
యేసు జననం = రక్షణ యోచనలో భాగం ✔️
జన్మదిన పండుగ ఆజ్ఞ లేదు. యేసు జన్మదినాన్ని అపొస్తలులు జరపలేదు.  (మత్తయి & లూకా సువార్త 2వ అధ్యాయం) 
పుట్టినరోజు వేడుకలు అన్య ఆచారాలు (ఆది. 40:20: మత్తయి. 14:6-10)
క్రిస్మస్ చెట్టు అన్య ఆచారాలు - యిర్మీయా. 10:1- 4

👤 యేసు ఏమి కోరారు? —
❌ పుట్టినరోజు వేడుకలు కాదు
✔️ "నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి" ≈ బలియాగం, సిలువయాగం జ్ఞాపకం చేసుకోవాలి. (లూకా 22:19; మత్తయి 28:1; 1కోరింది 11:23-29)

⚖️ తీర్పు హెచ్చరిక  — మత్తయి 15:6-9; ప్రకటన. 22:11-13; 18-19

⚠️ దేవుడు ఆజ్ఞాపించని
పండుగలను ఆత్మీయ కర్తవ్యంగా చేయడం
➡️ దేవునికి ప్రీతికరం కాదు.

మరింత విశ్లేషణ కోసం క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు? అనే అంశమును చదవండి.


H). పాత నిబంధన పండుగలు
🔴 దేవుని ఆజ్ఞా? — ❌ కాదు — క్రొత్త నిబంధన సంబందులకు లేదా క్రైస్తవులకు "పాత నిబంధన పండుగలను క్రైస్తవులు తప్పనిసరిగా పాటించాలి" అని దేవుడు గాని, యేసు గాని, అపొస్తలులు గాని, పరిశుద్ధాత్మ గాని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వలేదు.
📌 పాత నిబంధన పండుగలు = ఇశ్రాయేలీయులకు మాత్రమే
📌 క్రైస్తవులు = క్రొత్త నిబంధనలో క్రీస్తుతో చేయబడిన నిబంధనలో ఉన్నవారు

🔵 ఏమి చేస్తున్నారు? — కొన్ని బోధలలో/సంఘాలలో:
పస్కా, పులియని రొట్టెల పండుగ, పేంతుకోస్తూ , గుడారాల పండుగ మొదలైనవాటిని. హెబ్రూ తేదీలు, యూదా క్యాలెండర్ పాటించడం. “ఇవి పాటించకపోతే సంపూర్ణ క్రైస్తవులు కారు” అని బోధించడం. క్రీస్తు నెరవేర్చిన వాటిని మళ్లీ ఆచారాలుగా మార్చడం

🟡 మూలం / చరిత్ర —

అపొస్తలుల కాలంలో కొంతమంది యూద క్రైస్తవులు అన్యజన క్రైస్తవులపై యూద ఆచారాలు విధించడానికి ప్రయత్నించారు

దీనికే ప్రతిస్పందనగా:

అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం (యెరూషలేము సభ)

తరువాతి కాలంలో:

“హీబ్రూ రూట్స్”, “జుడైజింగ్” వంటి ఉద్యమాలు

క్రీస్తు కృపను పక్కన పెట్టి ఆచారాలపై నొక్కి చెబుతాయి

ఇది బైబిల్ మూలం కాదు — మానవ బోధా ధోరణి.

📅  తేదీ — 
పాత నిబంధన పండుగలు - నిర్దిష్ట తేదీలతో, కాలాలతో ఉన్నాయి

కానీ క్రైస్తవులకు:

❌ ఏ తేదీ విధించబడలేదు రోమా 14:5

📖 బైబిల్ ప్రకారం? — 

పాత నిబంధన పండుగలు = ఛాయలు (Shadows) హెబ్రీయులకు 10:1
క్రీస్తు = నిజ స్వరూపం (Substance / Body) కొలస్సయులకు 2:16–17

క్రైస్తవులపై విధించడం బైబిల్ ప్రకారం కాదు  గలతీయులకు 3:24–25

➡️ ఛాయలను తిరిగి విధించడం = క్రీస్తు కార్యాన్ని తక్కువ చేయడం


👤 యేసు ఏమి కోరారు?
❌ ఛాయలను తిరిగి పట్టుకోవడం కాదు
✔️ ఆయనలో నెరవేరిన నిజాన్ని జీవించడం (మత్తయి 5:17; యోహాను 19:30)
➡️ యేసు కోరింది:
పస్కా గొర్రెను కాదు — పస్కా క్రీస్తును (1 కొరింథీ 5:7–8)
ఆచార దినాలను కాదు — పరిశుద్ధ జీవితం
ఛాయలను కాదు — నిజ స్వరూపమైన క్రీస్తును

👉 ఛాయల వెనుక నడవడం కాదు, నెరవేర్చిన క్రీస్తులో నిలిచిపోవడమే దేవుని చిత్తం.


⚖️ తీర్పు హెచ్చరిక  — గలతీయులకు 5:4;4:9-11; కొలస్సయులకు 2:20–23


⚠️ క్రీస్తు నెరవేర్చిన వాటిని మళ్లీ విధిగా పెట్టడం = కృప నుండి జారిపోవడం.

మరింత విశ్లేషణ కోసం "ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన పండుగలు"  అనే అంశమును చదవండి.

ఓ చదువరి…. దేవుడు ఆజ్ఞాపించని పండుగలు— క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మట్టల ఆదివారం, భస్మ బుధవారం, లెంట్ దినాలు, సమాధుల పండుగ
మరియు పాత నిబంధన పండుగలను క్రైస్తవులపై విధించడం— ఇవన్నీ మనుష్యుల ఆలోచనల నుండి పుట్టిన ఆచారాలేవాటికి క్రొత్త నిబంధన ఆజ్ఞ లేదుక్రొత్త నిబంధనలో క్రైస్తవులకు దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించినది. ఒకే ఆత్మీయ పండుగ — ప్రభువు బల్ల - ప్రతి ఆదివారం. 

కాబట్టి,
భయంతో కాదు,
వాదనతో కాదు,
సంప్రదాయాల బానిసత్వంతో కాదు —

👉 వాక్యము చెప్పినట్టే ఆరాధించుదాం
👉 క్రీస్తే కేంద్రంగా జీవిద్దాం
👉 మనుష్యుల ఆజ్ఞలకన్నా దేవుని ఆజ్ఞను ఎంచుకుందాం

మీ ఆత్మీయులు 👪

WhatsApp Channel - 2k Join Now
Telegram Group - 600 Join Now
Instagram Page - 500 Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16