మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
1️⃣. పరిచయం :
నేటి క్రైస్తవ లోకంలో అనేక ఆచారాలు, పండుగలు, సంప్రదాయాలు “క్రిస్మస్” పేరుతో ఆచరణలోకి వచ్చాయి. క్రీస్తు శకం 1 నుండి 1వ 400 సంవత్సరాల మధ్య కాలంలో ఇట్టి ఆచరణలు మనం చూడలేము. అయితే ఆ తరువాత కాలము నుండి యేసు పుట్టుకను ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించి, దానిని ఆరాధనగా, తప్పనిసరి పండుగగా చెయ్యాలని, పెద్ద పెద్ద స్టార్లు పెట్టాలని, చెట్టును అలంకరించి ఇంటిలో మరియు తమ సంఘాల్లో పెట్టాలనే పద్ధతులు, బోధలు మనం చూస్తున్నాం. ఇలాంటివి చేసేవారి భావోద్వేగం ఒకటి, లేఖన సత్యం మరొక్కటి. ఈ సంగతిని వారు గుర్తించలేకపోతున్నారు.
ఇందుకుగాను మీ యెదుట రెండు ప్రశ్నలు ఉంచబోతున్నాం అవేవనగా…
1. బైబిల్ నిజంగా అలా బోధిస్తుందా?
2. మత్తయి 2వ అధ్యాయం, లూకా 2వ అధ్యాయం నేటి క్రైస్తవులకు క్రీస్తును ఆరాధన చేయమని, ఏటేటా పుట్టుక వేడుకలు చేయాలని అటువంటి ఆజ్ఞలు ఇస్తున్నాయా?
📖 (1 కొరింథీ 4:6) — “లేఖనములలో వ్రాయబడిన వాటికంటే మించినదాన్ని నేర్చుకొనకుడి.”
2️⃣. మత్తయి 2వ అధ్యాయం — చరిత్ర కాని ఆజ్ఞ కాదు
🍂 ఇది ఒక చారిత్రక సంఘటన
🍂 యేసు పుట్టిన రోజునే జ్ఞానులు యేసును కలవలేదు. (మత్తయి. 2:1,16cf) యేసు పుట్టిన తేదీ జ్ఞానులకే తెలియదనేది స్పష్టం.
🍂యేసును పూజించమని దేవుడు(YHWH) జ్ఞానులకు ఆజ్ఞాపించలేదు.
🍂 ఎందుకు పూజించారు? జ్ఞానుల(magos G3097) పూజ = దైవ ఆజ్ఞ వలన కాదు, గుర్తింపు వలనే అనగా ఆ శిశువు యూదుల రాజు అని గుర్తించి స్వచ్ఛందం తలవంచారు. (మీకా. 5:2; మత్తయి 2:2,11).
🍂 ఇది వారి వ్యక్తిగత స్పందన.
🍂 దేవుడు (YHWH) జ్ఞానులకు ఇచ్చిన ఆజ్ఞ పూజ కాదు. హేరోదు వద్దకు తిరిగి పోవద్దని మాత్రమే. (మత్తయి. 2:12)
🍂 అక్కడ “ప్రతి సంవత్సరం ఇలా చేయండి” అనే ఆజ్ఞ లేదు.
🍂 జ్ఞానులు తిరిగి తమ దేశాలకు వచ్చి దీన్ని ఆచారంగా బోధించలేదు, ఏటేటా చేయమనే ఆజ్ఞ కూడా లేదు, సంఘాలకు/బహిరంగంగా ఎక్కడా బోధించే ఆధారాలు లేవు. అలాగే పండుగను స్థాపించలేదు.
🍂 ఒక సంఘటన = శాశ్వత ఆరాధనా విధానం కాదు సుమీ!
🍂యేసు రాజు – ప్రధాన యాజకుడు – రక్షకుడు అన్న సత్యాన్ని తెలియజేయుటకై…
🚨 నేడు మనం గుర్తించుకోవలసింది వారు (magos) చేయునది అటు అనాడు యూదులకు ప్రామాణికం కాదు ఇటు నేటి క్రైస్తవులకు కూడా ప్రామాణికం కాదు. ఎందుకు అనేది "ఆరాధన కోరిన దేవుడుక్లిక్ చేయు" అనే అంశము చదువుట ద్వారా అర్థం అవుతుంది..
3️⃣. లూకా 2వ అధ్యాయం — సాక్ష్యం కాని, ఆచరణ కాదు
🍃యేసు పుట్టిన రోజు రాత్రినే కాపరులు(poimēn G4166) యేసును కలిశారు. (లూకా. 2:7-20) కానీ ఆ తేదీ డిసెంబర్ 25 అని బైబిల్ చెప్పలేదు. వారు ఇతరులకు తేది, సమయం, ఏటేటా చేయాలనే ప్రకటన చెయ్యలేదు. పండుగ చేయలేదు.
🍃 కాపరులకు దేవదూత స్పష్టం చేసిన సందేశం “నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11).
🍃 “నేడు” అనగా అదే రోజు/అదే రాత్రి అని అర్థం. ఆ రోజుకే సంబంధించినది కానీ ప్రతి సంవత్సరానికి కాదు. యేసు పుట్టిన సమయం, తేదీ, నెలను దేవుడు తన గ్రంథము మందు లిఖితం చేయలేదు. దేవుడు తన గ్రంథమునందు చెప్పని దానిని తిరిగి తన గ్రంథమునకు కలిపే అధికారం నేడు మనకు ఇవ్వబడలేదు.
🍃 దీనిని బట్టి డిసెంబర్ 25 అనేది మానవ ఆలోచనే తప్పా... దేవుని ఆలోచన కాదు.
🍃 పశువుల తొట్టిలో పరుండబెట్టిన శిశువును(7వ) దూతల చేత కాపరులకు దర్శించమని గాని, ఆరాధన చేయమని గాని అజ్ఞాపించలేదు.
🍃 వారు "వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని"(15వ) వెళ్ళి చూశారే కానీ ఆరాధన చెయ్యలేదు. పండుగగా జరపలేదు. ఆ దినం క్రిస్మస్ అని నామకరణం చేయబడలేదు.
🍃 వెళ్ళి చూశారు - ఆనందించారు - దేవునిని మహిమపరిచారు
🍃 లూకా 2:20 ప్రకారం "తిరిగి వెళ్ళిరి". అంతేకాని వారు పండుగ ప్రారంభించలేదు - వారు ఏటేటా జరపమని బోధించలేదు - వారు సంఘానికి ఆజ్ఞ ఇవ్వలేదు.
🍃 ఇక క్రిస్మస్ ట్రీ, స్టార్, అలంకరణ… వీటి కోసం బైబిల్లో లేదు ఐనప్పటికి చేసేవారు లేకపోలేదు కేవలం ఇవి క్యాథలిక్ మత పరమైన బోధలు నుండి పుట్టుకు వచ్చిన అన్య పద్ధతులే.
🚨 నేడు మనం గుర్తించుకోవలసింది యేసు పుట్టారనే సంగతి అనాడు యూదులకు, ఇటు నేటి క్రైస్తవులకు వారి(poimēn) ఒక సాక్ష్యమే కానీ ఆచరణ కాదు,... "మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.౹" (యోహాను. 8:17).ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.౹ (ద్వితీయో. 19:15) సాక్షులు లేకుండా ఏమి చెయ్యరు.
🍃 ఏటేటా తన పుట్టుక వేడుక జ్ఞాపకం చేసుకొనే ఆజ్ఞ ఇవ్వలేదు. ఎందుకు అనేది "క్రైస్తవులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చా?క్లిక్ చేయు " అనే అంశము చదువుట ద్వారా అర్థం అవుతుంది.
4️⃣. బైబిల్ లో లేని ఆజ్ఞ — దేవుని ఆజ్ఞ కాదు
📖 మత్తయి 15:9
“మనుష్యుల ఆజ్ఞలను బోధలుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.”
యేసు పుట్టుకను జరపమని, యేసును ఆరాధన చేయమని... యేసు చెప్పలేదు, అపొస్తలులు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పలేదు, అనాడు క్రీస్తు సంఘాలకు పత్రిక రూపములో వ్రాయలేదు.
📖 కొలోస్సయులు 2:8
“మనుష్యుల సంప్రదాయములచేత మోసపోవద్దు.”
5️⃣. యేసు ఆజ్ఞాపించినది — పుట్టుక కాదు, మరణం
📖 లూకా 22:19
“నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని”
తన పుట్టుకను/క్రిస్మస్ ను కాదు. తన మరణాన్ని మాత్రమే జ్ఞాపకంగా చేయమన్నాడు. మరణం అంటే ఈస్టర్ అనే అన్య పండుగ కాదు సుమీ!
👉 ఆజ్ఞ ఉన్నది — దానికి విధేయత
👉 ఆజ్ఞ లేనిది — సంప్రదాయం/అన్య ఆచారం మాత్రమే.
6️⃣. ముగింపు
ఓ చదువరి… మత్తయి 2వ అధ్యాయం — ఒక చారిత్రక సంఘటనే మరియు లూకా 2వ అధ్యాయం — ఒక యేసు పుట్టుక విషయములో ఒక సాక్ష్యమే. కానీ....
❌ ఆజ్ఞ కాదు
❌ పండుగ కాదు
❌ క్రిస్మస్ కాదు
❌ క్రీస్తునకు ఆరాధన కాదు
❌ ఏటేటా చేయవలసిన ఆచారం కాదు
❌ చెట్టు, స్టార్ట్, అలంకరణ కాదు.
✅ యేసు పుట్టుకను గౌరవించాలి
✅ కానీ ఆరాధనగా మార్చకూడదు
✅ పుట్టుక రోజును జ్ఞాపకం చేసుకోవడం కాదు.
✅ప్రభువు దినమున(ఆదివారం) యేసు యొక్క మరణమును సంఘముగా కలసి జ్ఞాపకం చేసుకోవాలి.
✅ లేఖనములో ఉన్నదే మనం చేయాలి
✅ క్రీస్తు/అపోస్తలుల బోధను జాగ్రత్తగా గుర్తించాలి.
📖 (2 యోహాను 1:10-11)
"ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.౹ శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును."
✅ మరింత వివరణ కోసం
అంశం |
మత్తయి 2వ అధ్యాయం |
లూకా 2వ అధ్యాయం |
బైబిల్ నిర్ణయం |
|---|---|---|---|
యేసు పుట్టుక |
అవును – జ్ఞానుల సందర్శన |
అవును – కాపరులకు ప్రకటన |
చారిత్రక సంఘటన |
యేసును ఆరాధించమని ఆజ్ఞ ఉందా? |
లేదు |
లేదు |
ఆజ్ఞ కాదు |
యేసు పుట్టినరోజు జరపమని చెప్పిందా? |
లేదు |
లేదు |
ఆజ్ఞ లేదు |
ప్రతి సంవత్సరం చేయమని ఆదేశమా? |
లేదు |
లేదు |
ఏటేటా లేదు |
పండుగగా స్థాపించబడిందా? |
లేదు |
లేదు |
పండుగ కాదు |
జ్ఞానులు/కాపరులు ఆచారం స్థాపించారా? |
లేదు |
లేదు |
సంఘటన మాత్రమే |
సంఘానికి బోధగా ఇచ్చారా? |
లేదు |
లేదు |
బోధ ఇవ్వలేదు |
అపొస్తలులకు ఆదేశమా? |
లేదు |
లేదు |
లేదు |
క్రైస్తవులకు ఆజ్ఞగా వర్తిస్తుందా? |
కాదు |
కాదు |
వర్తించదు |
"నా జ్ఞాపకార్థముగా చేయుడి” అన్న మాట ఉందా? |
లేదు |
లేదు |
వర్తించదు |
భావోద్వేగానికి ఆధారమా? |
అవును |
అవును |
భావోద్వేగం ≠ ఆజ్ఞ |
ఆరాధన విధానం చెప్పిందా? |
లేదు |
లేదు |
విధానం కాదు |
లేఖన పరిమితిలో ఉందా? |
అవును |
అవును |
చరిత్ర వరుకే పరిమితం |
మనుషులు జోడించారా? (క్రిస్మస) |
కాదు |
కాదు |
అవును (తరువాత కాలంలో400ad ) |
బైబిల్ ఆరాధనగా అంగీకరించబడిందా? |
కాదు |
కాదు |
కాదు |


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com