మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
(భక్తి రూపంలో జరిగే ఆత్మీయ మోసం — లేఖనాధార పరిశీలన — ఆత్మీయ హెచ్చరిక)
పరలోకమందున్న మన తండ్రియైన దేవుడు(YHWH) తన్ను ఆరాధించు విషయములో మనుష్యుల ఆలోచనలకు చోటివ్వడు. ఆయనను ఆరాధించవలసిన విధానం, మార్గం, సూత్రం, ఆజ్ఞ — అన్నీయు తన కుమారుడు మన ప్రభువైన యేసు ద్వారా యోహాను సువార్త 4:21-24 వచనాలలో స్పష్టంగా వెల్లడించాడు. కాబట్టి మన తండ్రియైన దేవుని ఆరాధన చేయు విషయములో మనిషి యొక్క భావోద్వేగం, సంప్రదాయం, ఆచారాలు లేదా ప్రజాదరణకు చోటు లేదు; దీనికి లేఖనమే ఏకైక ప్రమాణం.
ఈ సంగతి ఆ దౌర్భాగ్యుడుకి అనగా అపవాదికి బాగా తెలుసు. మన దేవునిని నేరుగా ఎదిరించలేడు. అందుకే వాడు అందుకే వాడు దేవుని పేరునే ఉపయోగించి దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆచారాలను ప్రవేశపెడతాడు. ఇదే వాడి అత్యంత ప్రమాదకరమైన మోసం.
ఉదాహరణకు :
1. బంగారు దూడ — యెహోవాకు పండుగ (నిర్గమ. 32:1-5)
2. చెట్టు, స్టార్, అలంకరణ, శాంత తాత .. — క్రిస్టమస్ పండుగ (AD 400 - క్యాథలిక్ బోధలు).
📖 బైబిల్ చెప్పిన ప్రకారం, అపవాది “వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు” (2 కొరింథీ 11:14). అంటే —బయటకు భక్తిగా, మంచిగా, ప్రేమగా కనిపించే వాటి వెనుక లేఖన విరుద్ధమైన మార్గాలను దాచిపెడతాడు. ఈ సందర్భంలోనే “క్రిస్టమస్” అనే పండుగను పరిశీలించవలసిన అవసరం ఉంది. క్రీస్తు పేరు ఉన్నదని, యేసు పుట్టుకను గుర్తుచేస్తుందనే కారణంతో
అది దేవునికి ఆమోదయోగ్యమని అనుకోవడం అనేకమంది క్రైస్తవులలో కనిపించే అత్యంత సాధారణమైన కానీ అత్యంత ప్రమాదకరమైన అపోహ. ఇది సాతాను తన పాత వ్యూహంతో భక్తి రూపంలో మోసం చేయుటకు ఉపయోగిస్తున్న ఒక మార్గం.
కావున శ్రోతలు దయయుంచి, ఈ సంగతులను చివరివరకు చదువుట ద్వారా వాడు క్రిస్టమస్ పేరుతో ఎంత గొప్పగా మోసం చేస్తున్నాడో అనే సంగతులను వాక్య దృష్టా ఆలోచన చేయుట వలన వాడి తంత్రములను తెలుసుకొనగలరని మా మనవి 🙏🏿
📖 "నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము." (2కోరింది. 2:11).
🐍 అపవాది మోసం 🐍
1️⃣. దేవుడు ఆజ్ఞాపించనిదాన్ని పండుగగా/ఆరాధనగా చేయుట – మూల మోసం
📖 పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు పండుగలను ఆజ్ఞాపించినప్పుడు:
📌 ఏ పండుగ ✔️
📌 ఎప్పుడు✔️
📌 ఎలా✔️
📌 ఎన్ని రోజులు✔️
📌 ఎక్కడ✔️
📌 ఎందుకు✔️
📌 ఎవరు చేయాలి? ✔️
అన్నీ స్పష్టంగా చెప్పాడు (లేవీయకాండము 23).
📖 క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు క్రిస్మస్ విషయములో:
ఆజ్ఞ లేదు ❌
విధానం లేదు❌
ఉదాహరణ లేదు❌
కాల నిర్ణయం లేదు❌
అపొస్తలుల/విశ్వాసుల ఆచరణ లేదు❌
🐍 పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడనిదాన్ని “ఆరాధన”గా/పండుగగా చేయడం = అపవాది మోసమే. (లేదా) దేవుడు ఆజ్ఞాపించనిదాన్ని “క్రీస్తు కొరకు” అని చేయించడం అపవాది ప్రధాన మోసం.
2️⃣. యేసు పుట్టుకను “ఆరాధన”గా మార్చడం
బైబిల్ లో మత్తయి & లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు పుట్టుకనేది ప్రవచనం యొక్క నెరవేర్పుగా మరియు ఒక చరిత్రాత్మక సంఘటనగా మాత్రమే చూపుతుంది.
📌 మత్తయి 2వ అధ్యా. ≈ చరిత్ర
📌 లూకా 2వ అధ్యా. ≈ సాక్ష్యం మరింత వివరణ - క్లిక్ చేయు
కానీ మనుషులకు ప్రతి సంవత్సరం ఆరాధనగా/పండుగగా చేయమని ఆజ్ఞ లేదు. అనాడు వారు అలా చేయలేదు, చేయమని ఆజ్ఞాపించలేదు.
📖 యేసు ఏం చెప్పాడు? – “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” (లూకా 22:19) ఎప్పుడు వరకు? "ప్రభువు వచ్చు వరకు" (1 కోరింది. 11:26).
👉 ఆయన మరణం గురించి – జన్మ కాదు.
👉 జన్మను ఆరాధనగా మార్చడం = లేఖన వికృతీకరణ.
🐍 జన్మదినాన్ని ఆరాధనగా చేయడం = అపవాది మోసమే.
3️⃣. అన్య ఆచారాలను క్రీస్తుతో కలపడం
చెట్టు దాని అలంకరణలు, నక్షత్రం, శాంత తాత, నృత్యాలు వంటి అంశాలు... బైబిల్ నుండి కాదు — అన్య సంస్కృతుల నుండే...
📖 ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ : “వారి దేవతలను ఆరాధించిన విధానముల చొప్పున యెహోవాను ఆరాధించవద్దు.” (ద్వితీయోపదేశకాండము 12:30–31) "అన్యుల మార్గమును నేర్చుకొనకుడి… అడవిలో నుండి కోసిన చెట్టును అలంకరించుదురు.” (యిర్మియా 10:2–3)
📖 క్రైస్తవులకు ఆజ్ఞ : "కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹" (ఎపేసి. 4:17). "మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి– చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹" (కొలస్సి. 2:20)
👉 చెట్టు ఆరాధన / అలంకరణ
👉 అన్య ఆచారం
👉 బైబిల్ ఆరాధన కాదు.
🐍 అన్య పద్ధతులు + క్రీస్తు పేరు = అపవాది మోసమే.
4️⃣. వెలుగు దూతగా మోసం
📖 2 కొరింథీ 11:14
“వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు.”
అంటే:
క్రీస్తు పేరు వాడకం
ప్రేమ మాటలు
చెట్టు, అలంకరణ, స్టార్, శాంత తాత విన్యాసం
వినోదం, విందులు, నృత్యాలు
సంతోష వాతావరణం
పండుగ సీజన్
👉 కానీ లోపల:
లేఖన విరుద్ధత
అజ్ఞాపించని ఆచారం
అన్య ఆచారాలు
దేవుని ఉగ్రత
🐍 ఇది అత్యంత ప్రమాదకరమైన మోసమే.
5️⃣. సత్యమైన ఆరాధన నుండి దృష్టి మళ్లించడం
📖 యోహాను 4:23-24: "అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹"
✔️ యేసు మాటల్లో… ఆరాధన కోరిన వ్యక్తి తండ్రి
✔️ యథార్థమైన ఆరాధికులు చేతనే ఆరాధన ✔️ ఆత్మతోను సత్యముతోను ఆరాధన
✔️ ఆరాధన అంటే వినోదం, నృత్యం, తినడం, త్రాగడం, అలంకరణ కాదు.
🌲 క్రిస్మస్ ఆరాధనలో :
భావోద్వేగం ❌
చెట్టు అలంకరణ ❌
శాంత తాత విన్యాసాలు ❌
నృత్యాలు ❌
క్రీస్తు పుట్టుక జ్ఞాపకం ❌
క్రీస్తునకు ఆరాధన ❌
👉🏿 ఆత్మీయ లోతు కాదు – బాహ్య ఆర్భాటం కనిపిస్తుంది.
🐍 ఇది అపవాది లక్ష్యం :
“విశ్వాసము లేనివారి మనో నేత్రములకు గ్రుడ్డితనము చేయుచున్నాడు.” (2 కొరింథీ 4:4)
🐍 వాక్య ఆధారము కానీ ఆరాధన అపవాది మోసమే
6️⃣. భక్తి రూపంలో వ్యర్థ ఆరాధన
“వ్యర్థం” అనే పదం అర్థం — ఫలితం లేనిది, దేవునికి చేరనిది, ఆమోదం పొందనిది. అంటే మనిషి భక్తిగా చేస్తున్న కార్యం దేవుని సన్నిధికి ఎక్కకముందే తిరస్కరించబడటం.
📖 మత్తయి 15:9
“మనుష్యుల ఆజ్ఞలను బోధలుగా బోధిస్తూ వ్యర్థంగా ఆరాధించుచున్నారు.”
👉 క్రీస్తు పేరు ఉన్నా
👉 దేవుని ఆజ్ఞ లేకపోతే
👉 ఆరాధన వ్యర్థమే.
మనుష్యులు ఏర్పరచిన ఆచారాలు కాలక్రమేణా పవిత్రంగా కనిపిస్తాయి. కానీ దేవుడు వాటిని ఎప్పటికీ ఆమోదించడు. ఈ సంగతి ఎరుగని వాడినే అపవాది మోసగిస్తాడు.
🐍 మనుషులు పద్ధతులు ద్వారా వ్యర్థమైన ఆరాధన వైపు నడిపించడం అపవాది మోసమే.
7️⃣. మనుష్యుల సంప్రదాయాలు ద్వారా
📖 (మార్కు 7:7–9) : "మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన– మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు."
📖 (కొలొస్సయులకు 2:8) : "ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.౹"
👉 సంప్రదాయం ≠ సత్యం
👉 ప్రజాదరణ ≠ దేవుని ఆమోదం
👉 సంప్రదాయం లేఖనానికి మించినప్పుడు
అది దేవునికి విరోధమే.
🐍 దేవుని ఆజ్ఞను మనుషులు సంప్రదాయాలు ద్వారా రద్దు పరచడం అపవాది మోసమే.
8️⃣. పిల్లల మనస్సులలో అబద్ధాన్ని స్థిరపరచడం
శాంత తాత కథల ద్వారా అబద్ధాన్ని, కల్పిత కథలను సాధారణం చేయడం అపవాది పద్ధతి. క్రిస్మస్ రోజు శాంత వస్తాడు నీకు బహుమతులు ఇస్తాడు, శాంత అంటేనే బహుమతులు ఇచ్చు తండ్రియని… Etc.
📖 యోహాను 8:44 – “సాతాను అబద్ధాలకు తండ్రి.”
🐍 చిన్న వయస్సులోనే అబద్ధాన్ని ఆమోదయోగ్యంగా చేయడం
అపవాది దీర్ఘకాలిక వ్యూహం.
9️⃣. క్రీస్తు ఆజ్ఞను మర్చిపోయేలా చేయడం
📖 ప్రభువు బల్ల ద్వారా(1 కోరింది 10:21) “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” (లూకా 22:19; 1 కోరింది 11:23-24) యేసే చెప్పెను కదా! ఎప్పుడు వరకు? "ప్రభువు వచ్చు వరకు" (1 కోరింది. 11:26).
🌲 క్రిస్మస్ బల్ల ద్వారా కేకులు, డాన్సులు, శాంత తాత విన్యాసాలు, చెట్టు, అలంకరణ, విందులు, అన్య ఆచారాలు, మత పరమైన బోధలు… Etc. ఏటేటా ఒకసారి భావోద్వేగంతో పండుగ పేరట మనుషులు కోరిక మేర.. దైవ ఆజ్ఞ కాదు
🐍 ఆజ్ఞలను పక్కన పెట్టి ఆచారాన్ని ప్రవేశ పెట్టి నడిపింపు అపవాది మోసమే.
🔟. సత్యం చెప్పేవారిపై విరోధం
📖 లేఖన ప్రకారం నడిచేవారిని: 👪
“కఠినవాదులు”
"అపవాది సంబంధులు"
“ప్రేమ లేనివారు” అని ముద్ర వేస్తారు.
📖 గలతీయులకు 4:16 : “నేను సత్యము చెప్పినందుకు మీకు శత్రువయ్యానా?”
📖 2 తిమోతికి 4:3–4 : "మనుష్యులు ఆరోగ్యకరమైన బోధను సహించరు.”
👉 అవును… మీ దృష్టిలో మేము కఠినవాదులమే, ప్రేమలేనివారమే కావచ్చు ఎందుకంటే… అపోస్తలుల బోధ/క్రీస్తు బోధ ఎల్లప్పుడూ ప్రజాదరణ పొందదు. జాగ్రత్త సుమీ!! మా బాష్పబిందువును ఆయనే తుడిచివేయును(ప్రకటన. 21:4).
🐍 ఆ దౌర్భాగ్యుడుకి సత్యము రుచించదు. వాడి స్వభావమే అంత. అందుకే అబద్ధముతోనే మోసం చేస్తాడు.
1️⃣1️⃣. అపొస్తలుల బోధలో క్రిస్మస్ లేదు
📖 అపొస్తలుల కార్యములు 2:42
“Acts 2:42: "వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి." (అపొస్తలుల కార్యములు 2:42)
📝 అక్కడ :
క్రిస్మస్ లేదు ❌
జన్మదిన ఆచారం లేదు ❌
వార్షిక పండుగ లేదు ❌
అన్య ఆచారాలు (చెట్టు, స్టార్, శాంత తాత, నృత్యాలు) ❌
👉 అపొస్తలులు చేయనిదాన్ని, ఆజ్ఞాపించని దానిని, ఆదిమ విశ్వాసులు చేయనిదాన్ని…
👉 నేటి సంఘాలు చేయడం = అపవాది చొరవ/మోసమే.
1️⃣2️⃣. దేవుని వాక్యానికి కలిపినా తీసేసినా శిక్ష
📖 ప్రకటన 22:18–19
“ఈ మాటలకు ఏదైనను కలిపినయెడల, తీసివేసిన యెడల దేవుడు శిక్షలను కలిపించును.”
📖 సామెతలు 30:6
“ఆయన మాటలకు ఏదియు కలుపకుడి.”
👉 క్రిస్మస్ = కలపబడిన ఒక అన్య ఆచారం
👉 దేవుని వాక్యానికి బయటది
👉 దేవుని ఆజ్ఞకు ఏదైనా కలిపినా తీసేసినా అది ఘోరమైన ఆత్మీయ మోసం.
🐍 దైవ ఆజ్ఞ కానిది కలపడం ఉన్నది తీసివేయడం అనేది అపవాది యొక్క చర్య. వీడు ఏదేను తోట నుండి ఇట్టి పని కలిగి ఉన్నాడు. (ఆది.కాం. 3:1-5) నీ విషయములో కూడా జాగ్రత్త.
🔥 ముగింపు
క్రీస్తు పేరు ఉన్నదంతా దేవుని చిత్తం కాదు. లేఖనం లేనిదంతా అపవాది మోసమే అని ఇకనైనా గుర్తించండి 🙏🏿 క్రైస్తవుడు సంప్రదాయంతో కాదు, లేఖనంతో నడవాలి. దేవుడు ఆజ్ఞాపించని పండుగులైన, పద్ధతులైన, ఆరాధనైన “క్రీస్తు పేరుతో” జరపడం అపవాది మోసమే. కాబట్టి…
📝 లేఖనానికి మించి పోవద్దు (1 కొరింథీ 4:6).
📝 సత్య ఆరాధనను మాత్రమే ఎంచుకో (యోహాను 4:24).
📝 అపవాది మోసాన్ని తిరస్కరించి, క్రీస్తు ఆజ్ఞలను పాటించు (కొలొస్సయులకు 2:8).
✊ సత్యమే మన ప్రమాణం. 📖
📖 యోహాను 8:32 : “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.”
✔️ దేవుడు ఆజ్ఞాపించినదే ఆరాధన
✖️ మనుష్యులు ఏర్పరచినది కాదు
✖️ భావోద్వేగం కాదు
✖️ సంప్రదాయం కాదు
"సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక." (రోమా. 16:20) ✅
2. క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు?క్లిక్ చేయు
3. క్రైస్తవులకు ఆజ్ఞాపించిన పండుగక్లిక్ చేయు
"సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక." (రోమా. 16:20) ✅
మీ ఆత్మీయులు 👪
1. మత్తయి, లూకా 2 వ అధ్యాయంక్లిక్ చేయు2. క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు?క్లిక్ చేయు
3. క్రైస్తవులకు ఆజ్ఞాపించిన పండుగక్లిక్ చేయు


Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com