Showing posts with label క్రిస్మస్. Show all posts
Showing posts with label క్రిస్మస్. Show all posts

క్రిస్మస్ పేరుతో అపవాది మోసం 🎄 🐍





మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


(భక్తి రూపంలో జరిగే ఆత్మీయ మోసం — లేఖనాధార పరిశీలన — ఆత్మీయ హెచ్చరిక)

పరలోకమందున్న మన తండ్రియైన దేవుడు(YHWH) తన్ను ఆరాధించు విషయములో మనుష్యుల ఆలోచనలకు చోటివ్వడు. ఆయనను ఆరాధించవలసిన విధానం, మార్గం, సూత్రం, ఆజ్ఞ — అన్నీయు తన కుమారుడు మన ప్రభువైన యేసు ద్వారా యోహాను సువార్త 4:21-24 వచనాలలో స్పష్టంగా వెల్లడించాడు. కాబట్టి మన తండ్రియైన దేవుని ఆరాధన చేయు విషయములో మనిషి యొక్క భావోద్వేగం, సంప్రదాయం, ఆచారాలు లేదా ప్రజాదరణకు చోటు లేదు; దీనికి లేఖనమే ఏకైక ప్రమాణం.

ఈ సంగతి ఆ దౌర్భాగ్యుడుకి అనగా అపవాదికి బాగా తెలుసు. మన దేవునిని నేరుగా ఎదిరించలేడు. అందుకే వాడు అందుకే వాడు దేవుని పేరునే ఉపయోగించి దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆచారాలను ప్రవేశపెడతాడు. ఇదే వాడి అత్యంత ప్రమాదకరమైన మోసం.

ఉదాహరణకు : 
1. బంగారు దూడ — యెహోవాకు పండుగ (నిర్గమ. 32:1-5)
2. చెట్టు, స్టార్, అలంకరణ, శాంత తాత .. — క్రిస్టమస్ పండుగ (AD 400 - క్యాథలిక్ బోధలు).

📖 బైబిల్ చెప్పిన ప్రకారం, అపవాది “వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు” (2 కొరింథీ 11:14). అంటే —బయటకు భక్తిగా, మంచిగా, ప్రేమగా కనిపించే వాటి వెనుక లేఖన విరుద్ధమైన మార్గాలను దాచిపెడతాడు. ఈ సందర్భంలోనే “క్రిస్టమస్” అనే పండుగను పరిశీలించవలసిన అవసరం ఉంది. క్రీస్తు పేరు ఉన్నదని, యేసు పుట్టుకను గుర్తుచేస్తుందనే కారణంతో
అది దేవునికి ఆమోదయోగ్యమని అనుకోవడం అనేకమంది క్రైస్తవులలో కనిపించే అత్యంత సాధారణమైన కానీ అత్యంత ప్రమాదకరమైన అపోహ.  ఇది సాతాను తన పాత వ్యూహంతో భక్తి రూపంలో మోసం చేయుటకు ఉపయోగిస్తున్న ఒక మార్గం.

కావున శ్రోతలు దయయుంచి, ఈ సంగతులను చివరివరకు చదువుట ద్వారా వాడు క్రిస్టమస్ పేరుతో ఎంత గొప్పగా మోసం చేస్తున్నాడో అనే సంగతులను వాక్య దృష్టా ఆలోచన చేయుట వలన వాడి తంత్రములను తెలుసుకొనగలరని మా మనవి 🙏🏿

📖 "నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము." (2కోరింది. 2:11).


🐍 అపవాది మోసం 🐍

1️⃣. దేవుడు ఆజ్ఞాపించనిదాన్ని పండుగగా/ఆరాధనగా చేయుట – మూల మోసం

📖 పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు పండుగలను ఆజ్ఞాపించినప్పుడు:
📌 ఏ పండుగ ✔️
📌 ఎప్పుడు✔️
📌 ఎలా✔️
📌 ఎన్ని రోజులు✔️
📌 ఎక్కడ✔️
📌 ఎందుకు✔️
📌 ఎవరు చేయాలి? ✔️
అన్నీ స్పష్టంగా చెప్పాడు (లేవీయకాండము 23).

📖 క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు క్రిస్మస్ విషయములో:
ఆజ్ఞ లేదు ❌
విధానం లేదు❌
ఉదాహరణ లేదు❌
కాల నిర్ణయం లేదు❌
అపొస్తలుల/విశ్వాసుల ఆచరణ లేదు❌

🐍 పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడనిదాన్ని “ఆరాధన”గా/పండుగగా చేయడం = అపవాది మోసమే. (లేదా) దేవుడు ఆజ్ఞాపించనిదాన్ని “క్రీస్తు కొరకు” అని చేయించడం అపవాది ప్రధాన మోసం.

2️⃣. యేసు పుట్టుకను “ఆరాధన”గా మార్చడం
బైబిల్ లో మత్తయి & లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు పుట్టుకనేది ప్రవచనం యొక్క నెరవేర్పుగా మరియు ఒక చరిత్రాత్మక సంఘటనగా మాత్రమే చూపుతుంది.

📌 మత్తయి 2వ అధ్యా. ≈ చరిత్ర
📌 లూకా 2వ అధ్యా. ≈ సాక్ష్యం మరింత వివరణ - క్లిక్ చేయు 
కానీ మనుషులకు ప్రతి సంవత్సరం ఆరాధనగా/పండుగగా చేయమని ఆజ్ఞ లేదు. అనాడు వారు అలా చేయలేదు, చేయమని ఆజ్ఞాపించలేదు.

📖 యేసు ఏం చెప్పాడు? – “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” (లూకా 22:19) ఎప్పుడు వరకు? "ప్రభువు వచ్చు వరకు" (1 కోరింది. 11:26). 

👉 ఆయన మరణం గురించి – జన్మ కాదు.
👉 జన్మను ఆరాధనగా మార్చడం = లేఖన వికృతీకరణ.

🐍 జన్మదినాన్ని ఆరాధనగా చేయడం = అపవాది మోసమే.

3️⃣. అన్య ఆచారాలను క్రీస్తుతో కలపడం
చెట్టు దాని అలంకరణలు, నక్షత్రం, శాంత తాత, నృత్యాలు వంటి అంశాలు... బైబిల్ నుండి కాదు — అన్య సంస్కృతుల నుండే...

📖 ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ : “వారి దేవతలను ఆరాధించిన విధానముల చొప్పున యెహోవాను ఆరాధించవద్దు.” (ద్వితీయోపదేశకాండము 12:30–31) "అన్యుల మార్గమును నేర్చుకొనకుడి… అడవిలో నుండి కోసిన చెట్టును అలంకరించుదురు.” (యిర్మియా 10:2–3)
📖 క్రైస్తవులకు ఆజ్ఞ : "కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹" (ఎపేసి. 4:17). "మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి– చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹" (కొలస్సి. 2:20)

👉 చెట్టు ఆరాధన / అలంకరణ
👉 అన్య ఆచారం
👉 బైబిల్ ఆరాధన కాదు.

🐍 అన్య పద్ధతులు + క్రీస్తు పేరు = అపవాది మోసమే.

4️⃣. వెలుగు దూతగా మోసం
📖 2 కొరింథీ 11:14
“వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు.”

అంటే:
క్రీస్తు పేరు వాడకం
ప్రేమ మాటలు
చెట్టు, అలంకరణ, స్టార్, శాంత తాత విన్యాసం
వినోదం, విందులు, నృత్యాలు
సంతోష వాతావరణం
పండుగ సీజన్

👉 కానీ లోపల:
లేఖన విరుద్ధత
అజ్ఞాపించని ఆచారం
అన్య ఆచారాలు
దేవుని ఉగ్రత

🐍 ఇది అత్యంత ప్రమాదకరమైన మోసమే.

5️⃣. సత్యమైన ఆరాధన నుండి దృష్టి మళ్లించడం
📖 యోహాను 4:23-24: "అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹"

✔️ యేసు మాటల్లో… ఆరాధన కోరిన వ్యక్తి తండ్రి
✔️ యథార్థమైన ఆరాధికులు చేతనే ఆరాధన ✔️ ఆత్మతోను సత్యముతోను ఆరాధన
✔️ ఆరాధన అంటే వినోదం, నృత్యం, తినడం, త్రాగడం, అలంకరణ కాదు. 

🌲 క్రిస్మస్ ఆరాధనలో :
భావోద్వేగం ❌
చెట్టు అలంకరణ ❌
శాంత తాత విన్యాసాలు ❌
నృత్యాలు ❌
క్రీస్తు పుట్టుక జ్ఞాపకం ❌
క్రీస్తునకు ఆరాధన ❌
👉🏿 ఆత్మీయ లోతు కాదు – బాహ్య ఆర్భాటం కనిపిస్తుంది.

🐍 ఇది అపవాది లక్ష్యం :
“విశ్వాసము లేనివారి మనో నేత్రములకు గ్రుడ్డితనము చేయుచున్నాడు.” (2 కొరింథీ 4:4)

🐍 వాక్య ఆధారము కానీ ఆరాధన అపవాది మోసమే

6️⃣. భక్తి రూపంలో వ్యర్థ ఆరాధన
“వ్యర్థం” అనే పదం అర్థం — ఫలితం లేనిది, దేవునికి చేరనిది, ఆమోదం పొందనిది. అంటే మనిషి భక్తిగా చేస్తున్న కార్యం దేవుని సన్నిధికి ఎక్కకముందే తిరస్కరించబడటం.

📖 మత్తయి 15:9
“మనుష్యుల ఆజ్ఞలను బోధలుగా బోధిస్తూ వ్యర్థంగా ఆరాధించుచున్నారు.”
👉 క్రీస్తు పేరు ఉన్నా
👉 దేవుని ఆజ్ఞ లేకపోతే
👉 ఆరాధన వ్యర్థమే.

మనుష్యులు ఏర్పరచిన ఆచారాలు కాలక్రమేణా పవిత్రంగా కనిపిస్తాయి. కానీ దేవుడు వాటిని ఎప్పటికీ ఆమోదించడు. ఈ సంగతి ఎరుగని వాడినే అపవాది మోసగిస్తాడు.

🐍 మనుషులు పద్ధతులు ద్వారా వ్యర్థమైన ఆరాధన వైపు నడిపించడం అపవాది మోసమే. 

7️⃣. మనుష్యుల సంప్రదాయాలు ద్వారా
📖  (మార్కు 7:7–9) : "మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన– మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు."
📖 (కొలొస్సయులకు 2:8) : "ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.౹"

👉 సంప్రదాయం ≠ సత్యం
👉 ప్రజాదరణ ≠ దేవుని ఆమోదం
👉 సంప్రదాయం లేఖనానికి మించినప్పుడు
అది దేవునికి విరోధమే.

🐍 దేవుని ఆజ్ఞను మనుషులు సంప్రదాయాలు ద్వారా రద్దు పరచడం అపవాది మోసమే. 

8️⃣. పిల్లల మనస్సులలో అబద్ధాన్ని స్థిరపరచడం
శాంత తాత కథల ద్వారా అబద్ధాన్ని, కల్పిత కథలను సాధారణం చేయడం అపవాది పద్ధతి. క్రిస్మస్ రోజు శాంత వస్తాడు నీకు బహుమతులు ఇస్తాడు, శాంత అంటేనే బహుమతులు ఇచ్చు తండ్రియని… Etc. 

📖 యోహాను 8:44 – “సాతాను అబద్ధాలకు తండ్రి.”

🐍 చిన్న వయస్సులోనే అబద్ధాన్ని ఆమోదయోగ్యంగా చేయడం
అపవాది దీర్ఘకాలిక వ్యూహం.

9️⃣. క్రీస్తు ఆజ్ఞను మర్చిపోయేలా చేయడం
📖 ప్రభువు బల్ల ద్వారా(1 కోరింది 10:21) “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” (లూకా 22:19; 1 కోరింది 11:23-24) యేసే చెప్పెను కదా! ఎప్పుడు వరకు? "ప్రభువు వచ్చు వరకు" (1 కోరింది. 11:26).

🌲 క్రిస్మస్ బల్ల ద్వారా కేకులు, డాన్సులు, శాంత తాత విన్యాసాలు, చెట్టు, అలంకరణ, విందులు, అన్య ఆచారాలు, మత పరమైన బోధలు… Etc. ఏటేటా ఒకసారి భావోద్వేగంతో పండుగ పేరట మనుషులు కోరిక మేర.. దైవ ఆజ్ఞ కాదు

🐍 ఆజ్ఞలను పక్కన పెట్టి ఆచారాన్ని ప్రవేశ పెట్టి నడిపింపు అపవాది మోసమే.

🔟. సత్యం చెప్పేవారిపై విరోధం

📖 లేఖన ప్రకారం నడిచేవారిని: 👪
“కఠినవాదులు”
"అపవాది సంబంధులు"
“ప్రేమ లేనివారు” అని ముద్ర వేస్తారు. 

📖 గలతీయులకు 4:16 : “నేను సత్యము చెప్పినందుకు మీకు శత్రువయ్యానా?”

📖 2 తిమోతికి 4:3–4 : "మనుష్యులు ఆరోగ్యకరమైన బోధను సహించరు.”

👉 అవును… మీ దృష్టిలో మేము కఠినవాదులమే, ప్రేమలేనివారమే కావచ్చు ఎందుకంటే…  అపోస్తలుల బోధ/క్రీస్తు బోధ ఎల్లప్పుడూ ప్రజాదరణ పొందదు. జాగ్రత్త సుమీ!! మా బాష్పబిందువును ఆయనే తుడిచివేయును(ప్రకటన. 21:4).

🐍 ఆ దౌర్భాగ్యుడుకి సత్యము రుచించదు. వాడి స్వభావమే అంత. అందుకే అబద్ధముతోనే మోసం చేస్తాడు. 

1️⃣1️⃣. అపొస్తలుల బోధలో క్రిస్మస్ లేదు
📖 అపొస్తలుల కార్యములు 2:42
“Acts 2:42: "వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి." (అపొస్తలుల కార్యములు 2:42)

📝 అక్కడ :
క్రిస్మస్ లేదు ❌
జన్మదిన ఆచారం లేదు ❌
వార్షిక పండుగ లేదు ❌
అన్య ఆచారాలు (చెట్టు, స్టార్, శాంత తాత, నృత్యాలు) ❌

👉 అపొస్తలులు చేయనిదాన్ని, ఆజ్ఞాపించని దానిని, ఆదిమ విశ్వాసులు చేయనిదాన్ని…
👉 నేటి సంఘాలు చేయడం = అపవాది చొరవ/మోసమే. 

1️⃣2️⃣. దేవుని వాక్యానికి కలిపినా తీసేసినా శిక్ష
📖 ప్రకటన 22:18–19
“ఈ మాటలకు ఏదైనను కలిపినయెడల, తీసివేసిన యెడల దేవుడు శిక్షలను కలిపించును.”
📖 సామెతలు 30:6
“ఆయన మాటలకు ఏదియు కలుపకుడి.”

👉 క్రిస్మస్ = కలపబడిన ఒక అన్య ఆచారం
👉 దేవుని వాక్యానికి బయటది
👉 దేవుని ఆజ్ఞకు ఏదైనా కలిపినా తీసేసినా అది ఘోరమైన ఆత్మీయ మోసం.

🐍 దైవ ఆజ్ఞ కానిది కలపడం ఉన్నది తీసివేయడం అనేది అపవాది యొక్క చర్య. వీడు ఏదేను తోట నుండి ఇట్టి పని కలిగి ఉన్నాడు. (ఆది.కాం. 3:1-5) నీ విషయములో కూడా జాగ్రత్త. 

🔥 ముగింపు
క్రీస్తు పేరు ఉన్నదంతా దేవుని చిత్తం కాదు. లేఖనం లేనిదంతా అపవాది మోసమే అని ఇకనైనా గుర్తించండి 🙏🏿 క్రైస్తవుడు సంప్రదాయంతో కాదు, లేఖనంతో నడవాలి. దేవుడు ఆజ్ఞాపించని పండుగులైన, పద్ధతులైన, ఆరాధనైన “క్రీస్తు పేరుతో” జరపడం అపవాది మోసమే. కాబట్టి…

📝  లేఖనానికి మించి పోవద్దు (1 కొరింథీ 4:6).
📝  సత్య ఆరాధనను మాత్రమే ఎంచుకో (యోహాను 4:24).
📝 అపవాది మోసాన్ని తిరస్కరించి, క్రీస్తు ఆజ్ఞలను పాటించు (కొలొస్సయులకు 2:8).

✊ సత్యమే మన ప్రమాణం. 📖

📖 యోహాను 8:32 : “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.”
✔️ దేవుడు ఆజ్ఞాపించినదే ఆరాధన
✖️ మనుష్యులు ఏర్పరచినది కాదు
✖️ భావోద్వేగం కాదు
✖️ సంప్రదాయం కాదు

"సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక." (రోమా. 16:20) ✅

మీ ఆత్మీయులు 👪

1. మత్తయి, లూకా 2 వ అధ్యాయంక్లిక్ చేయు
2. క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు?
క్లిక్ చేయు
3.  క్రైస్తవులకు 
ఆజ్ఞాపించిన పండుగక్లిక్ చేయు

శారీరక అవసరాలు ≠ ఆరాధన


మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻 


1️⃣. పరిచయం

క్రిస్మస్/ క్రిస్మస్ పేరుతో ఆచారాలు జరిగించు భక్తులు ద్వారా మాకు తరుచుగా వినబడే ఒక ప్రశ్న లేదా వాదన ఏమనగా… 

“బైబిల్‌లో పళ్లు తోముకోమని, స్నానం చేయమని, సెల్ ఫోన్ వాడమని,... Etc. లేదు కదా — అయినా చేస్తున్నాం. అలాగే క్రిస్మస్ కూడా బైబిల్‌లో లేకపోయినా మన ఇష్టమే కదా? ఇందులో తప్పేమి ఉంది? ఏదైనా దేవునికే మహిమకరంగా చేస్తున్నాము" 

ఇలాంటి ప్రశ్నలు వినపడగానే అవును కదా, నిజమే కదా అన్నమా అపవాదికి/వాడి బోధకు నిన్ను నీవు అప్పగించుకొన్నట్టే అవుతుంది. ఈ మాటలు వినడానికి చాలా తర్కబద్ధంగా అనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఇవి రెండు భిన్నమైన విషయాలను కలిపి చెప్పే మాటలు.


👉 ఒకటి శారీరక అవసరాలు

👉 మరొకటి దేవునికి(YHWH) ఆరాధన

బైబిల్ ఈ రెండింటిని ఎప్పుడూ కలిపి చెప్పదు. మనము కూడా కలిపి అర్థం చేసుకోవద్దు.


2️⃣. శారీరక అవసరాలు — ఆరాధన కాదు

బ్రష్ చేయడం, స్నానం చేయడం, భోజనం చేయడం, నిద్రపోవడం, సెల్ ఫోన్ వాడటం… Etc. — ఇవి మన శరీరానికి అవసరమైన సాధారణ జీవన క్రియలు. వీటిని ఎక్కడా ఆరాధనగా బైబిల్ చూపించలేదు.


📖 మార్కు 7:15: "వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను."


📖 1కోరింది 6:19-20: "మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹ విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి."


అందువల్ల శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం జ్ఞానానికి సంబంధించినది, బుద్ధి పరమైనది, ఆరోగ్యానికి సంబంధించినది కానీ ఆరాధన కాదు.


👉 మనము బ్రష్ చేసినప్పుడు దేవునికి ప్రార్థించము

👉 స్నానం చేసినప్పుడు దానిని పవిత్ర క్రియగా ప్రకటించము


కాబట్టి శారీరక అవసరాలకు  ప్రత్యేక ఆజ్ఞ అవసరం లేదు.


3️⃣. ఆరాధన అంటే ఏమిటి?

— దేవుని చిత్త ప్రకారం 

— ఒక క్రమమైన పద్దతిలో 

— దేవుడు కోరిన మేర 

— దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో

— ఆయన సన్నిధిలో కార్యక్రమాలు జరిగించుటయే ఆరాధించడం. 


📖 ఫిలిప్పీ. 3:3: "ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు,..."


📖 యోహాను 4:24: "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹"


🔴 ఉదాహరణలు

▪️ పాత నిబంధన ప్రకారం : 2దినవృత్తాంతములు 29:20-30 చదువు

▪️  క్రొత్త నిబంధన ప్రకారం : యోహాను. 4:21-24 చదువు 


🔥 ఆరాధన విషయంలో జాగ్రత్త :

మన ఇష్టం పనిచేయదు ❌

మన ఆచారాలు పనిచేయదు ❌

మన ఊహలు/నిర్ణయాలు పనిచేయదు ❌

బైబిల్లో లేనిది... ఉన్నదానికి కలపడం ❌

దేవుడు ఆజ్ఞాపించనది చేయడం ❌

ఆయన మాటలతో ఏమైనా చేర్చడం ❌

ఏదైనను తీసివేయడం ❌


దేవుని ఇష్టమే మనం చెయ్యాలి ✅

ఆదిమ అపోస్తలుల ఆచారాలు చెయ్యాలి ✅

బైబిల్లో లేనిది… ఉన్నదానికి కలపకూడదు ✅

ఏదైనను తీసివేయకూడదు ✅

దేవుని వాక్యమే ప్రమాణం అవ్వాలి ✅


📖 ద్వితీయోపదేశకాండము 4:2; 12:32: "మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.౹" "నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు."


📖 సామెతలు 30:6: "ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు."


📖 ప్రకటన 22:18-19: "ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా– ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;౹ ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును."


🔴 దేవుడు ఆజ్ఞాపించనిదాన్ని ఆరాధనగా పరిగణించి ఏర్పాటు చేసుకొని చేయడం వ్యర్థమైన ఆరాధన అగును కదా!! (మత్తయి. 15:6)


4️⃣. క్రిస్మస్ — శారీరక అవసరమా? ఆరాధనా?

ఇప్పుడు క్రిస్మస్ విషయానికి వస్తే... మీరు చేయు క్రిస్మస్ ను దీనిని మీరెవ్వరు “శారీరక అవసరం” అని చెప్పరు కానీ మా క్రిస్మస్ ఆరాధననే అంటారు. కారణం... 


— క్రీస్తు పుట్టుక అని

— క్రిస్మస్ ఆరాధన అని

— క్రిస్మస్ పండుగగా

— క్రిస్మస్ చెట్టు, స్టార్, శాంత తాతతో, నృత్యాలతో… Etc. 


మీరు చేసే ఆరాధన/ మీకు ఆరాధనగా అనబడేది ఇదేగా…👆🏿 ఇంతకు ఇది ఆజ్ఞ? దేవుడు ఇలాగే ఆజ్ఞాపించారా? ఎవరికి ఆజ్ఞాపించారు? ఎక్కడ ఆజ్ఞాపించారు? బైబిల్లో ఎక్కడ ఉంది? ఇలాంటి ప్రశ్నలకు మీ యొద్ద నుండి ఎన్నటికి సమాధానం రాదని తెలుసు… ఎందుకంటే బైబిల్ ఆజ్ఞాపించని వాటిని  ఊహించుకొని చేస్తున్నారనేది సత్యము. 


📖 మత్తయి 15:9 "మనుష్యుల ఆజ్ఞలను బోధలుగా బోధించుచు, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.”


🔖 లూకా 2వ అధ్యాయం - కాపరులు ద్వారా యేసు పుట్టుక యొక్క సాక్ష్యం తెలియబడుటకే కానీ ఏటేటా చెయ్యాలనే అజ్ఞా జారీ చేయబడలేదు/వారు జారీ చెయ్యలేదు. 

🔖 మత్తయి 2వ అధ్యాయం - ఒక చారిత్రక సంఘటనే కానీ ఏటేటా చెయ్యాలనే అజ్ఞా జారీ చేయబడలేదు/వారు జారీ చెయ్యలేదు. 


📖 కొలస్సయులు 2:16: "కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.౹"

📖 గలతీయులు 4:10: "మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.౹"


✒ పాత నిబంధన కాలములో యెహోవా దేవుడు ఏదైనా ఒక పండుగ గూర్చి ఆదేశించినప్పుడు ఎవరు చెయ్యాలి? ఎప్పుడూ చెయ్యాలి? ఎన్ని రోజులు చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అనే స్పష్టత ఇచ్చినప్పుడు… నేటి క్రిస్మస్ భక్తులకు క్రిస్మస్ విషయములో ఇట్టి స్పష్టత చూడలేం? అంటే క్రిస్మస్ అపవాది బోధ అని గుర్తించండి.  మరింత సమాచారం కొరకు "పండుగలుక్లిక్ చేయు" అనే అంశము చదవండి.


👉 దేవుడు చెప్పనిది

👉 మనుషులు ఆరాధనగా మార్చారు అని గుర్తించండి.

క్రిస్మస్ ఒక అన్య ఆచారమని, ఒక అబద్దమని, క్రీస్తు పుట్టుకకు ఎటువంటి సంబంధం లేదని, బైబిల్ లో లేదని తెలిసి కూడా ఈ అబద్ధమును జరిగించడానికి, సమర్దించడానికి కేవలం "పళ్లు తోముకోమని, స్నానం చేయమని.. అంటూ అడిగే ప్రశ్న కేవలం అపవాది చర్య అని గుర్తించు. ఒకవేళ కాదంటే వీటికి నీవు చేయు క్రిస్మస్ కి ఏమైన సంబంధం ఉందా?


5️⃣. క్రిస్మస్ ఆరాధన “నా ఇష్టం”అనే వాదన

📖 సామెతలు 14:12 “మనుష్యునికి సరైనదిగా తోచు మార్గము ఉంది; కానీ దాని అంతము మరణమే.”

📖 యిర్మీయా 10:23 “మనిషి తన మార్గమును తానే స్థిరపరచుకొనుట అతనిలో లేదు.”

📖 కొలస్సయులు 2:23: "అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు."

📖 (ప్రకటన  22:11-12): "అన్యాయముచేయు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ౹ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.౹"

📖 (1తిమోతి 6:20): "ఓ తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టిమాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్ప బడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.౹"

📖 (1తిమోతి  4:16): "నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు."


6️⃣. ముగింపు

🟢 బ్రష్ చేయడం, స్నానం చేయడం –

➡️ శారీరక అవసరాలు

➡️ ఆరాధనగా చేయడం లేదు

➡️ బైబిల్ ఆజ్ఞ అవసరం లేదు


🔴 క్రిస్మస్ ఐతే –

➡️ ఆరాధనగా చేస్తున్నారు

➡️ బైబిల్ ఆజ్ఞ లేదు

➡️ యేసు బోధలో లేదు

➡️ అపోస్తలుల బోధలో లేదు

➡️ కాబట్టి ఇది దేవుని ఆరాధన కాదు


📖 యోహాను 12:48: "నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.౹"

మీ ఆత్మీయులు 👪

1. మత్తయి, లూకా  2వ అధ్యాయం?క్లిక్ చేయు

2. క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చెయ్యరు?క్లిక్ చేయు

3. క్రిస్మస్ ఆరాధన?క్లిక్ చేయు

మత్తయి, లూకా 2వ అధ్యాయం - క్రిస్మస్?



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 

1️⃣. పరిచయం :

నేటి క్రైస్తవ లోకంలో అనేక ఆచారాలు, పండుగలు, సంప్రదాయాలు “క్రిస్మస్” పేరుతో ఆచరణలోకి వచ్చాయి. క్రీస్తు శకం 1 నుండి 1వ 400 సంవత్సరాల మధ్య కాలంలో ఇట్టి ఆచరణలు మనం చూడలేము. అయితే ఆ తరువాత కాలము నుండి యేసు పుట్టుకను  ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించి, దానిని ఆరాధనగా, తప్పనిసరి పండుగగా చెయ్యాలని, పెద్ద పెద్ద స్టార్లు పెట్టాలని, చెట్టును అలంకరించి ఇంటిలో మరియు తమ సంఘాల్లో పెట్టాలనే పద్ధతులు, బోధలు మనం చూస్తున్నాం. ఇలాంటివి చేసేవారి భావోద్వేగం ఒకటి, లేఖన సత్యం మరొక్కటి.  ఈ సంగతిని వారు గుర్తించలేకపోతున్నారు.


ఇందుకుగాను మీ యెదుట రెండు ప్రశ్నలు ఉంచబోతున్నాం అవేవనగా…

1.   బైబిల్ నిజంగా అలా బోధిస్తుందా?

2. మత్తయి 2వ అధ్యాయం, లూకా 2వ అధ్యాయం నేటి క్రైస్తవులకు క్రీస్తును ఆరాధన చేయమని, ఏటేటా పుట్టుక వేడుకలు చేయాలని అటువంటి ఆజ్ఞలు ఇస్తున్నాయా?


📖  (1 కొరింథీ 4:6) — “లేఖనములలో వ్రాయబడిన వాటికంటే మించినదాన్ని నేర్చుకొనకుడి.”


2️⃣. మత్తయి 2వ అధ్యాయం — చరిత్ర కాని ఆజ్ఞ కాదు

🍂     ఇది ఒక చారిత్రక సంఘటన

🍂 యేసు పుట్టిన రోజునే జ్ఞానులు యేసును కలవలేదు. (మత్తయి. 2:1,16cf) యేసు పుట్టిన తేదీ జ్ఞానులకే తెలియదనేది స్పష్టం.

🍂యేసును పూజించమని దేవుడు(YHWH) జ్ఞానులకు ఆజ్ఞాపించలేదు.

🍂 ఎందుకు పూజించారు? జ్ఞానుల(magos G3097) పూజ = దైవ ఆజ్ఞ వలన కాదు, గుర్తింపు వలనే అనగా ఆ శిశువు యూదుల రాజు అని గుర్తించి స్వచ్ఛందం తలవంచారు. (మీకా. 5:2; మత్తయి 2:2,11).

🍂  ఇది వారి వ్యక్తిగత స్పందన.

🍂 దేవుడు (YHWH) జ్ఞానులకు ఇచ్చిన ఆజ్ఞ పూజ కాదు. హేరోదు వద్దకు తిరిగి పోవద్దని మాత్రమే. (మత్తయి. 2:12)

🍂 అక్కడ “ప్రతి సంవత్సరం ఇలా చేయండి” అనే ఆజ్ఞ లేదు. 

🍂 జ్ఞానులు తిరిగి తమ దేశాలకు వచ్చి దీన్ని ఆచారంగా బోధించలేదు, ఏటేటా చేయమనే ఆజ్ఞ కూడా లేదు, సంఘాలకు/బహిరంగంగా ఎక్కడా బోధించే ఆధారాలు లేవు.  అలాగే పండుగను స్థాపించలేదు. 

🍂 ఒక సంఘటన = శాశ్వత ఆరాధనా విధానం కాదు సుమీ!

🍂యేసు రాజు – ప్రధాన యాజకుడు – రక్షకుడు అన్న సత్యాన్ని తెలియజేయుటకై… 

🚨 నేడు మనం గుర్తించుకోవలసింది వారు (magos) చేయునది అటు అనాడు యూదులకు ప్రామాణికం కాదు ఇటు నేటి క్రైస్తవులకు కూడా ప్రామాణికం కాదు. ఎందుకు అనేది "ఆరాధన కోరిన దేవుడుక్లిక్ చేయు" అనే అంశము చదువుట ద్వారా అర్థం అవుతుంది.. 



3️⃣. లూకా 2వ అధ్యాయం — సాక్ష్యం కాని, ఆచరణ కాదు

🍃యేసు పుట్టిన రోజు రాత్రినే కాపరులు(poimēn G4166) యేసును కలిశారు. (లూకా. 2:7-20) కానీ ఆ తేదీ డిసెంబర్ 25 అని బైబిల్ చెప్పలేదు. వారు ఇతరులకు తేది, సమయం, ఏటేటా చేయాలనే ప్రకటన చెయ్యలేదు. పండుగ చేయలేదు.

🍃 కాపరులకు దేవదూత స్పష్టం చేసిన సందేశం “నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11).

🍃 “నేడు” అనగా అదే రోజు/అదే రాత్రి అని అర్థం. ఆ రోజుకే సంబంధించినది కానీ ప్రతి సంవత్సరానికి కాదు. యేసు పుట్టిన సమయం, తేదీ, నెలను దేవుడు తన గ్రంథము మందు లిఖితం చేయలేదు. దేవుడు తన గ్రంథమునందు చెప్పని దానిని తిరిగి తన గ్రంథమునకు కలిపే అధికారం నేడు మనకు ఇవ్వబడలేదు. 

🍃  దీనిని బట్టి డిసెంబర్ 25 అనేది మానవ ఆలోచనే తప్పా... దేవుని ఆలోచన కాదు.

🍃 పశువుల తొట్టిలో పరుండబెట్టిన శిశువును(7వ) దూతల చేత కాపరులకు దర్శించమని గాని, ఆరాధన చేయమని గాని అజ్ఞాపించలేదు.  

🍃 వారు "వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని"(15వ) వెళ్ళి చూశారే కానీ ఆరాధన చెయ్యలేదు. పండుగగా జరపలేదు. ఆ దినం క్రిస్మస్ అని నామకరణం చేయబడలేదు. 

🍃 వెళ్ళి చూశారు - ఆనందించారు - దేవునిని మహిమపరిచారు

🍃 లూకా 2:20 ప్రకారం "తిరిగి వెళ్ళిరి". అంతేకాని వారు పండుగ ప్రారంభించలేదు - వారు ఏటేటా జరపమని బోధించలేదు - వారు సంఘానికి ఆజ్ఞ ఇవ్వలేదు.

🍃 ఇక క్రిస్మస్ ట్రీ, స్టార్, అలంకరణ… వీటి కోసం బైబిల్లో లేదు ఐనప్పటికి చేసేవారు లేకపోలేదు కేవలం ఇవి క్యాథలిక్ మత పరమైన బోధలు నుండి పుట్టుకు వచ్చిన అన్య పద్ధతులే. 

🚨  నేడు మనం గుర్తించుకోవలసింది యేసు పుట్టారనే సంగతి అనాడు యూదులకు, ఇటు నేటి క్రైస్తవులకు వారి(poimēn) ఒక సాక్ష్యమే కానీ ఆచరణ కాదు,... "మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.౹" (యోహాను. 8:17).ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.౹ (ద్వితీయో. 19:15) సాక్షులు లేకుండా ఏమి చెయ్యరు. 

🍃 ఏటేటా తన పుట్టుక వేడుక జ్ఞాపకం చేసుకొనే ఆజ్ఞ ఇవ్వలేదు. ఎందుకు అనేది  "క్రైస్తవులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చా?క్లిక్ చేయు " అనే అంశము చదువుట ద్వారా అర్థం అవుతుంది. 



4️⃣.  బైబిల్ లో లేని ఆజ్ఞ — దేవుని ఆజ్ఞ కాదు

📖 మత్తయి 15:9

“మనుష్యుల ఆజ్ఞలను బోధలుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.”

యేసు పుట్టుకను జరపమని, యేసును ఆరాధన చేయమని... యేసు చెప్పలేదు, అపొస్తలులు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పలేదు, అనాడు క్రీస్తు సంఘాలకు పత్రిక రూపములో వ్రాయలేదు.

📖 కొలోస్సయులు 2:8

“మనుష్యుల సంప్రదాయములచేత మోసపోవద్దు.”



5️⃣. యేసు ఆజ్ఞాపించినది — పుట్టుక కాదు, మరణం

📖 లూకా 22:19

“నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని”

తన పుట్టుకను/క్రిస్మస్ ను కాదు. తన మరణాన్ని మాత్రమే జ్ఞాపకంగా చేయమన్నాడు. మరణం అంటే ఈస్టర్ అనే అన్య పండుగ కాదు సుమీ!


👉 ఆజ్ఞ ఉన్నది — దానికి విధేయత

👉 ఆజ్ఞ లేనిది — సంప్రదాయం/అన్య ఆచారం మాత్రమే. 



6️⃣. ముగింపు

ఓ చదువరి… మత్తయి 2వ అధ్యాయం — ఒక చారిత్రక సంఘటనే మరియు లూకా 2వ అధ్యాయం — ఒక యేసు పుట్టుక విషయములో ఒక సాక్ష్యమే. కానీ....


❌ ఆజ్ఞ కాదు

❌ పండుగ కాదు

❌ క్రిస్మస్ కాదు

❌ క్రీస్తునకు ఆరాధన కాదు

❌ ఏటేటా చేయవలసిన ఆచారం కాదు

❌ చెట్టు, స్టార్ట్, అలంకరణ కాదు.


✅ యేసు పుట్టుకను గౌరవించాలి

✅  కానీ ఆరాధనగా మార్చకూడదు

✅ పుట్టుక రోజును జ్ఞాపకం చేసుకోవడం కాదు.

✅ప్రభువు దినమున(ఆదివారం) యేసు యొక్క మరణమును సంఘముగా కలసి జ్ఞాపకం చేసుకోవాలి.

✅ లేఖనములో ఉన్నదే మనం చేయాలి

✅ క్రీస్తు/అపోస్తలుల బోధను జాగ్రత్తగా  గుర్తించాలి.


📖 (2 యోహాను 1:10-11)

"ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.౹ శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును."


✅ మరింత వివరణ కోసం


అంశం

మత్తయి 2వ అధ్యాయం

లూకా 2వ అధ్యాయం

బైబిల్ నిర్ణయం

యేసు పుట్టుక

అవును – జ్ఞానుల సందర్శన

అవును – కాపరులకు ప్రకటన

చారిత్రక సంఘటన

యేసును ఆరాధించమని ఆజ్ఞ ఉందా?

లేదు

లేదు

ఆజ్ఞ కాదు

యేసు పుట్టినరోజు జరపమని చెప్పిందా?

లేదు

లేదు

ఆజ్ఞ లేదు

ప్రతి సంవత్సరం చేయమని ఆదేశమా?

లేదు

లేదు

ఏటేటా లేదు

పండుగగా స్థాపించబడిందా?

లేదు

లేదు

పండుగ కాదు

జ్ఞానులు/కాపరులు ఆచారం స్థాపించారా?

లేదు

లేదు

సంఘటన మాత్రమే

సంఘానికి బోధగా ఇచ్చారా?

లేదు

లేదు

బోధ ఇవ్వలేదు

అపొస్తలులకు ఆదేశమా?

లేదు

లేదు

లేదు

క్రైస్తవులకు ఆజ్ఞగా వర్తిస్తుందా?

కాదు

కాదు

వర్తించదు

"నా జ్ఞాపకార్థముగా చేయుడి” అన్న మాట ఉందా?

లేదు

లేదు

వర్తించదు

భావోద్వేగానికి ఆధారమా?

అవును

అవును

భావోద్వేగం ≠ ఆజ్ఞ

ఆరాధన విధానం చెప్పిందా?

లేదు

లేదు

విధానం కాదు

లేఖన పరిమితిలో ఉందా?

అవును

అవును

చరిత్ర వరుకే పరిమితం

మనుషులు జోడించారా? (క్రిస్మస)

కాదు

కాదు

అవును (తరువాత కాలంలో400ad )

బైబిల్ ఆరాధనగా అంగీకరించబడిందా?

కాదు

కాదు

కాదు

క్రిస్మస్ ఆరాధన?



✅ పరిచయం: 

↣ ఆరాధన అనేది మానవ హక్కు కాదు

↣ దేవుడు నిర్ణయించిన పవిత్ర క్రమం.

↣ ఎవరు, ఎప్పుడు, ఎలా ఆరాధించాలో అనేది తానే నిర్ణయిస్తాడు. మనుషులు కాదు.

📖 మానవ సంప్రదాయాల ఆధారంగా పుట్టిన ఆరాధనే — క్రిస్మస్ ఆరాధన

 "మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు (మత్తయి 15:9)

📖  దేవుడు కోరినది యథార్థమైన  ఆరాధన —  సత్య ఆరాధన - (యోహాను. 4:23-24)

↣  దేవుని ఆజ్ఞ లేకుండా చేసే ఏ ఆరాధన అయినా—even if it looks religious—దేవుని దృష్టిలో వ్యర్థమైనది.

↣  క్రైస్తవులని పిలువబడిన వారిలో  అత్యధికంగా పాటించే పండుగలలో ఒకటి క్రిస్మస్. ప్రపంచమంతా దీనిని యేసు జన్మదినం, మరికొందరు క్రీస్తునకు ఆరాధన అంటూ గొప్పగా జరుపుతున్నారు.

↣ వారి సంఘాల్లో  క్రిస్మస్ పేరుతో  ఆరాధనలు నిర్వహిస్తు, క్రిస్మస్ కీర్తనలని, నాటకాలని, అలంకరణలు, పెద్ద పెద్ద స్టార్స్, నృత్యాలు, బహుమానాలు, క్రిస్మస్ చెట్ల అలంకరణతో, లైట్లు.. etc.—ఇవి అన్నీ తమ ఆధ్యాత్మిక కార్యక్రమాల భాగంగా చూస్తారు.


↣ ఇట్టి రీతిలో ఆరాధన చేయమని (లేదా) క్రిస్మస్ పేరుతో యేసునకు ఆరాధన చేయమని బైబిల్లో ఆజ్ఞ ఉందా?

↣  దేవుడు(YHWH) క్రిస్మస్ ఆరాధనను ఆమోదించాడా?

↣  యేసు తన్ను ఆరాధన చేయమని ఎప్పుడైనా కోరెన?

↣  ఏటేటా పుట్టినరోజు వేడుకలు చేయమని అజ్ఞాపించెన?

↣  అపొస్తలులు దీన్ని ఏటేటా ఆచరించారా?

↣  బైబిల్లో యేసు జన్మదినం జరపమన్న ఆజ్ఞ ఉందా? అసలు తేదీ ఉందా?

↣  ఆదిమ సంఘములో ఒకసారి కూడా క్రిస్మస్ ఆరాధన జరిగిందా?

↣ మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించి చేసే  ఆరాధన  దేవుడు అజ్ఞాపించని ఆరాధనే. దానిని చేసినప్పుడు, అది ఎంత అందంగా కనిపించినా, ఎంత భావోద్వేగపూరితమైన, ఎంత సంప్రదాయమైన, అది మనుషులకు ఎంత గొప్పగా కనిపించిన, ప్రపంచమంతా చేసిన దేవుని దృష్టిలో వ్యర్థమైన ఆరాధనే అగును కదా!!


📖  (ద్వితీయోపదేశకాండము 12:32)

 "నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు."

అంటే —




x

దేవుడు ఆజ్ఞాపించని ఆరాధనను చేస్తే అది దేవునికి అంగీకారముండదనేగా అర్ధం. 


క్రిస్మస్ ఆరాధన – వ్యర్థమైన ఆరాధన


A. బైబిల్ ఆజ్ఞ లేకపోవుట వల్ల వ్యర్థమైన ఆరాధన 

  1. దేవుడు ఆజ్ఞాపించని ఆరాధన వ్యర్థమైనది. — మత్తయి 15:9

  2. క్రిస్మస్ పండుగకు బైబిల్‌లో ఎక్కడా ఆజ్ఞ లేదు, 4వ శతాబ్దంలో రోమన్ కాథలిక్ చర్చిలో పండుగగా ఏర్పడింది. — 2 తిమోతి 3:16–17

  3. యేసు జన్మదినాన్ని జరుపవలెనని శిష్యులకు ఆదేశం లేదు — అపో.కా. 2:42; 2 దెస్స 2:14

  4. దేవుని వాక్యానికి మించి పోవకూడదు — 1 కొరింథీ 4:6

  5. దేవుని ఆరాధన ఆయన ఆజ్ఞ ప్రకారం మాత్రమే జరగాలి — ద్వితి 12:32

  6. మానవ సంప్రదాయం ఆధారంగా చేసే ఆరాధన దేవుడు అంగీకరించడు — మత్తయి 15:3

  7. ఆరాధనకు దేవుడు నిర్ణయించిన క్రమం ఉండాలి — 1 కొరింథీ 14:40

  8. క్రిస్మస్ మానవుల సంప్రదాయం; పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞ కాదు — యోహాను 16:13

  9. సువార్తలో ఏమి బోధించబడిందో అదే అనుసరించాలి — గలతి 1:8–9

  10. బైబిలు శిష్యుల ఆరాధనలో క్రిస్మస్ లేనందున క్రిస్మస్ దేవుని ఆరాధన కాదు — అపో.కా. 2:42


B. అన్య ఆచారాలు కలిసినందున వ్యర్థమైన ఆరాధన 

  1. అన్య పద్ధతులను అనుసరించవద్దని దేవుడు హెచ్చరించాడు — ద్వితి 12:30 చెట్టు అలంకరణ—జర్మన్ సంస్కృతి నుండి వచ్చిన ఆచారం.

  2. యిర్మియా చెట్లను కోసి అలంకరించే పద్ధతిని నిందించాడు — యిర్మియా 10:2–4

  3. క్రిస్మస్ తేది (Dec 25) సూర్యదేవుని పండుగ నుండి తీసుకుంది — రోమన్స్ చరిత్ర ఆధారముగా.. (2 కొరింథీ 6:14–17)

  4. చీకటి కార్యాలను వెలుగుతో కలపవద్దు — ఎఫెసీ 5:11

  5. దేవుని ఆరాధనలో ప్రపంచ అలంకారం ఉండకూడదు — 1 యోహాను 2:15

  6. దేవుడు ఇతర జాతుల ఆచారాలను విడిచిపెట్టమని చెప్పాడు — యెహోషువ 23:7

  7. దేవునికి పవిత్రమైన ఆరాధన కావాలి—మిశ్రమ పద్ధతులు కాదు — లేవి 10:1–2

  8. అన్య  పండుగలతో కలిసిన ఏ ఆచారం దేవుని దృష్టిలో అపవిత్రమైనది — నిర్గమకాండం 32:5–7

  9. రోమన్స్ సంస్కృతిని అనుసరించడం క్రైస్తవ ఆరాధనను కలుషితం చేస్తుంది — రోమా 12:2

  10. “ఈ లోక సంబంధమైన పద్దతులు” ద్వారా చేసిన ఆరాధన వృథా — కొలొస్సయులకు 2:8


C. అపోస్తలుల బోధలో లేనందున వ్యర్థమైన ఆరాధన 

  1. శిష్యుల బోధ, పద్ధతి, ఆజ్ఞ మనకు ప్రమాణం — అపో.కా. 2:42,2 దెస్స 2:14, 1 యోహాను. 1:1-2

  2. యేసు తన పుట్టిన రోజు జరపలేదు — సువార్తలలో ఎక్కడా లేదు అలాగే వారు ఎక్కడా క్రిస్మస్ జరపలేదు — మత్తయి నుండి ప్రకటన

  3. యేసు జన్మపై ప్రత్యేక పండుగ లేదు, ఏ సంఘానికీ ఆజ్ఞ ఇవ్వలేదు — రోమీయులకు– ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా లేదు — లూకా 2 (కథనం మాత్రమే)

  4. వారికి ప్రతి ఆదివారం ఆరాధన ఉంది, సంవత్సర పండుగలు కాదు — అపో. 20:7; 1 కోరి. 16:1-2 

  5. క్రైస్తవ పండుగగా యేసు మరణాన్ని మాత్రమే ఆజ్ఞాపించారు — 1 కొరింథీ 11:23–26 

  6. యేసు “ఇది నా జ్ఞాపకార్థమై చేయుడి” అన్నది రాత్రి భోజనం గురించి, జన్మ గురించి కాదు — లూకా 22:19; 1 కొరింథీ 11:24; 

  7. అపొస్తలులు సంప్రదాయాలను అనుసరించలేదు — కొలొస్సయులకు 2:20–23

  8. దేవునికి ఆరాధన ఆత్మతోను, సత్యముతోను ఉండాలి, బాహ్య అలంకారంలో కాదు — యోహాను 4:24

  9. కొత్త నియమంలో పండుగలు పాటించడం గూర్చి హెచ్చరిక — గలతి 4:10–11

  10. దేవుని కుమారుడు ఇచ్చిన ఆజ్ఞలకు మాత్రమే విధేయత చూపవలెను — హెబ్రీ 5:9


D. ఆరాధనలో అనుమతించని అంశాలు కలవడం వల్ల 

  1. నాటికలు, ప్రదర్శనలు, నృత్యాలు ఆరాధనలో అనుమతించబడలేదు — 1 కొరింథీ 1:21

  2. ఆరాధనలో చిత్రరూపాలను వాడకూడదు — నిర్గమ 20:4

  3. సంగీత పరికరాలు లేవు -  ఆత్మీయ గానము — ఎఫెసీ 5:19

  4. బైబిల్ ఆరాధనలో అలంకరణలు/లైట్లు లేవు — 1 తిమోతి 2:8–10

  5. ఆరాధనలో ప్రపంచ ఉత్సాహం దేవుని చిత్తం కాదు — యాకోబు 4:4

  6. సెలబ్రేషన్లు ఆరాధనను ప్రదర్శనగా మార్చుతాయి — మత్తయి 6:1

  7. గిఫ్టుల సాంప్రదాయం ఆత్మీయతను భౌతికతకు మార్చుతుంది — మత్తయి 6:19–21

  8. సాంటా క్లాజ్—అబద్ధ కథలను ఆరాధనలో కలపడం తప్పు — ఎఫెసీ 4:25

  9. సంఘ ఆరాధనలో దేవుని వాక్యమే కేంద్రముగా ఉండాలి — 2 తిమోతి 4:2

  10. మనుషులు జోడిచిన పద్ధతులు ఆరాధనను అవమానపరుస్తాయి — మార్కు 7:7–8


E. దేవుని చిత్తానికి విరుద్ధమైనందున 

  1. దేవుడు చెప్పిన/కోరిన విధంగా ఆరాధించాలి — ద్వితి 12:4; యోహాను. 4:23-24

  2. దేవుని మార్గం శుద్ధమైనది—మనిషి జోడింపు అపవిత్రం — కీర్తన 18:30

  3. ఆత్మతో ఆరాధన అనేది సత్యములోనే ఉండాలి, సంప్రదాయములో కాదు — యోహాను 4:24

  4. క్రిస్మస్‌లో భావోద్వేగం, మనుషుల మోసపూరిత ఆలోచనలు — ఎఫెసీ 4:14

  5. దేవుడు తన వాక్యానికి నిబద్ధతను కోరుతున్నాడు — యెహోషువ 1:7

  6. దేవుని సేవకు మనిషి నియమాలు అవసరం లేదు — కొలొస్సయులకు 2:22

  7. వృథా ఆరాధనను దేవుడు తిరస్కరిస్తాడు — యెషయా 1:13

  8. అబద్ధంతో ఉన్న ఆరాధన దేవునికి అసహ్యం — ఆమోసు 5:21–23

  9. క్రీస్తు కేంద్రం సువార్త—జన్మపండుగ కాదు — 1 కొరింథీ 15:1–4

  10. సత్య ఆరాధన వాక్యము పైన నిలుస్తుంది; క్రిస్మస్ మనుషులు సంప్రదాయంపై నిలుస్తుంది — యోహాను 17:17; 4:24 సత్య ఆరాధన బైబిల్ ప్రకారం ఉండాలి; బైబిల్ చెప్పని ఆరాధన దేవుని దృష్టిలో ఆమోదయోగ్యం కాదు.


క్రిస్మస్ ఆరాధన:

❌ బైబిల్ ఆజ్ఞ లేదు

❌ అపోస్తలుల బోధలో లేదు

❌ అన్య ఆచారాలు ఉన్నాయి

❌ మానవ సంప్రదాయాల మిశ్రమం

❌ వాక్యానికి అనుగుణంగా లేదు

అందువల్ల యేసు చెప్పినట్లుగా ఇది “వ్యర్థమైన ఆరాధన” (మత్తయి 15:9) అవుతుంది.

The churches of Christ greet you - Roma 16:16