సేవించుట ≠ ఆరాధించుట (Serve ≠ Worship)

సేవించుట  ≠  ఆరాధించుట

 

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు  వందనములు 🙏🏿


💥సేవించుట అనగా సేవ చేయడం, పరిచర్య చేయడం, ఊడిగం చేయుడం, వెంబడించడం , శిష్యరికం చేయడం. 

 హీబ్రూ - עֶבֶד (eh'-bed) ≈ ebed ≈ H5650

 గ్రీక్ - διακονέω (dee-ak-on-eh'-o) ≈ diakoneō ≈ G1247

 ఇంగ్లీష్ - Serve,  Servant, 

(Worship, Ministered) 


💥ఆరాధించుట అనగా 👉 Click Here  

 హీబ్రూ - שָׁחָה (šāḥâ) ≈ shachah ≈ H7812

⇛ గ్రీక్ - προσκυνέω (pros-koo-neh'-o) ≈ proskyneō ≈ G4352

⇛ ఇంగ్లీష్ - Worship 


సేవించడం అంటే ఆరాధించడం కాదు!


🔥 మన ప్రభువైన యేసు మాటలలో చూద్దాం 👇

(యోహాను. 12:25-26) : "తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును."

(John 12:25-26): "He that loveth his life shall lose it; and he that hateth his life in this world shall keep it unto life eternal. If any man serve me, let him follow me; and where I am, there shall also my servant be: if any man serve me, him will my Father honor."


యేసు తన్ను సేవించమని కోరెను గాని ఆరాధించమని కోరలేదు.

  యేసును సేవించడం అంటే సేవ చేయడం లేదా వెంబడించడం అని అర్థం.

 యేసును సేవించడం అంటే ఆయనకు శిష్యరికం చేయడం. 

 యేసును సేవించడం అంటే ఆయన అడుగుజాడల్లో నడవడం. 

 నన్ను(యేసు) వెంబడించువాడు నన్ను సేవించువాడని అన్నారు(26వ) కాని ఆరాధించువాడు అనలేదు.

 సేవించుట(Serve) అంటే ఆరాధించుట(Worship) కాదని గుర్తించు. 


🔥 అపోస్తలుడైన పౌలు మాటలలో చూద్దాం 👇

(అపో. కార్య.  20:19): "యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో(Serving) మీకే తెలియును.౹"

(రోమా. 12:11): "ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి(Serving).౹"


🔥 పరమతండ్రి మాటలలో చూద్దాం 👇

(యిర్మీయా. 27:4-8): "మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము– మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా – అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులను కూడ అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలమువచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.౹ ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనముచేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.౹"

💭 నెబుకద్నెజరును సేవించుటకు(Serve) భూజంతువులను పరమదేవుడే అతని వశము చేసెను. ఏలయనగా...👇

ఎద్దులు - భూమి దున్నుతాయి ,

 గేదెలు - పాలు ఇస్తాయి ,

 గుర్రాలు - యుద్దంలో సేవచేస్తాయి

ఇదేది ఆరాధన కాదు. అవి సేవిస్తాయి కాని ఆరాధన చేయవు .


💥 "సాగిలపడి పూజించుట (లేదా) ఆరాధించుట" అంటే  సేవించుట కాదని విషయాన్ని రాజుయొక్క  ఆజ్ఞను లక్ష్యపెట్టక, అగ్నికి భయపడక కేవలము తమ దేవునికి మాత్రము భయపడిన  ఆ ముగ్గురు యూదులైన షద్రకు, మేషాకు, అబేద్నగో అను వారి ద్వారా నిరూపణ అయ్యింది. 👇👇👇

(దానియేలు.  3:10-14) : "రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణెను వీణెను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను.౹ సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును.౹ రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.౹ అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.౹ అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను — షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?"

బబులోను రాజైన నెబుకద్నెజరును సేవించాలని(Serve) దేవుడే స్వయంగా నరులకును, భూజంతువులకు ఆదేశించారు. (యిర్మీయా 27:5-10cf).

➽ నెబుకద్నెజరు ఐతే సాగిలపడి పూజించుడని(Worship) తన సేవకులైన వారికి ఆజ్ఞాపించినప్పుడు గా షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అను ముగ్గురు యూదులు  రాజాజ్ఞకు అవిధేయులగుటకు కారణమేమి?

➽ సేవించుట(Serve) - సాగిలపడి పూజించుట(Worship) కాదని తెలియడం లేదా? సేవించుట మరియు  ఆరాధించుట రెండు వేరు వేరు కార్యక్రమాలు. 


👀 ముఖ్య గమనిక : మత్తయి సువార్త 2:1-11 వచనములు  ప్రకారం ప్రభువైన యేసుని జ్ఞానులు ఆరాధించారని చాలామంది అపోహ పడుతున్నారు.  ఈ అపోహ తప్పు ఎందుకనగా ప్రభువైన యేసు ధర్మశాస్త్ర కాలంలో పుట్టినవాడు. ఆ కాలంలో వారికి బాగుగా తెలిసిన విషయం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించు స్థలము యెరుషలేము అని(ద్వితీయో. 12:11-14; యిర్మీయా. 26:2; యోహాను. 4:21 వాక్యం చూడుము)

ధర్మశాస్త్రంలో ఆరాధన గూర్చిన ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి.  జనులు తనను ఆరాధించే విషయంలో దేవుడు రాజీపడేవాడు కాదు.  ఆరాధన యెరుషలేములోనే జరగాలి ఎక్కడబడితే అక్కడ, ఎలా పడితే అలా చేసేది దేవుని ఆజ్ఞ ప్రకారమైన  ఆరాధన కాదు అది స్వేచ్ఛారాదనే అవుతుంది తప్ప నిబంధనానుసారమైన ఆరాధన కాదు.  కావున పశువుల దొడ్డిలో జ్ఞానులు యేసుకి ఆరాధన చేశారు అనే ఆలోచన నీకు ఇంకా ఉండి  ఉంటే అది ఎటువంటి ఆరాధనో నీ ఆలోచనకే వదిలేస్తున్నాం. 

కావున ప్రియులారా, యేసు చెప్పనివి చేసినా, చెప్పినవి చేయకపోయినా నీవు ఆయనకు శిష్యుడు కాలేవు. 

👤యేసు - నన్ను సేవించు (యోహాను. 12:26)

👤యేసు -  తండ్రిని ఆరాధించు (యోహాను. 4:21-24)

మీ ఆత్మీయులు...👪

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
Anonymous
May 10, 2024 at 5:41 PM delete

Excellent Anna 🙏🏿

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16